చతుర్ధాంకము
వరవిక్రయము
ఉ. కన్నులు చాల పెద్దయవి; కన్బొమలుం గడు దీర్చిదిద్దినట్లున్నవి; సోగయై తనరు చున్నది నాసికయున్, లలాట మత్యున్నతమై యొసంగుఁ; గురులొత్తనియే యనవచ్చు; జాలునీవన్నెయు నన్నిటం దగినవాఁడె లభించెను నేఁటి కక్కకున్.
సీ. మానాభిమానముల్ మాపుకోవలయునువిసుగును గోపంబు విడువవలెనుసమయంబు గనిపెట్ట సంధింపవలయునుత్రిప్పినట్లెల్లను దిరుగవలెనునీవె దేవుఁడవని సేవింపవలెనుఇచ్చకంబుల మురియింపవలెనుబ్రోకరు రుసుమును బొడిగింపవలెనుదరి గుమాస్తాగానిఁ దనుపవలెను
నాల్గు రెట్లేని యాస్తి కన్పఱుపవలెనువడ్డి యెంతన్నఁ దలయొగ్గవలెను షరతులేమి కోరిన శిరసా వహింపవలెనుపుట్టునెడ నప్పటికిఁగాని పుట్ట దప్పు.
సీ. కూలి నాలియు లేక కుడువ తోవయు లేకమలమల పస్తులు మాడువారుఇల్లు వాకిలి లేక యిల్లాలు లేక, యేచెట్టు నీడనొ నివసించువారుపయిని పాతయు లేక, పండఁ జాపయు లేకవడవడఁ జలిలోన -వడకువారుకాళ్ళుఁ గన్నులు లేక, కదల మెదల లేకదేవుఁడా! యనుచు వా-పోవువారు
కలరు మనదేశమునఁ గోట్లకొలఁది నేఁడువారి నెల్లర నెపుడుఁ గన్నాఱఁ గనుచుబందలంబోలె మనమికఁ బ్రతుకు టెట్టులనుచుఁ జింతింపవచ్చునే యజ్ఞురాల!
సీ. ఱాతిలోఁ గప్పను రక్షింపఁ గలతండ్రిబొరియలోఁ జీమను బ్రోచు తండ్రిగంగలోఁజేఁపను గాపాడఁ గలతండ్రిమంటిలో నెఱ్ఱను మనుచు తండ్రిపుట్టలోఁజెదలను బోషింపఁగల తండ్రికలుగులో నెలుకను గాంచుతండ్రినాభిలోఁ ద్రిముల కన్నము పెట్టఁగల తండ్రిపేడలోఁ బురుగును బెంచుతండ్రి
భూజములకెల్ల నీరము పోయు తండ్రిశిశువుతో స్తన్యముం దయసేయు తండ్రిదయయె స్వస్వరూపంబుగాఁ దనరు తండ్రిమనలఁ బోషింపఁడే వెర్రిమాటగాక!
ఆ. మీకుఁ గులము లేద మాకు రూపము లేద?యింత దైన్యమునకు -హేతువేమి?కట్నమిచ్చి వరుని గడియించుకొనుకంటెఁజిన్నతనము వేఱె మున్న దమ్మ?
ఉ. కొంచెముపాటి వారలును గొంపను గోడులు నమ్మియేనియున్‌సంచులు చంకఁబెట్టుకొని సంతకుఁ బోయినట్లుఁ పోయి శోధించి బిగించి తండ్రులు విధించిన విత్తము ముందె చేతిలోనుంచియ కాదె తెచ్చుకొను చుండిరి కూఁతుల కిప్డు భర్తలన్.
గీ. అడుగువారికిఁ బాప భయంబు లేకయిచ్చువారికి సిగ్గును నెగ్గులేకనడచుచున్నట్టి వరశుల్క నాటకముననకట! మనమును బాత్రలమగుట తగునె?
ఆ. అప్పుకన్నఁ నలగ యావళీ దక్షిణకన్నఁ బన్నుఁ కన్నఁ గన్నతండ్రితద్దినంబుకన్నఁ తప్పనిసరియయియన్నదిపుడ కట్న మన్నియెడల.
చ. తిరముగ నింటిముందుఁ బెను దేవళముండఁగ మ్రొక్కుబళ్లతోదిరుపతి కేగినట్లు కులదీపకు లెందఱొ లేమిచే వివాహ రహితులై కనంబడెడు నప్పుడు బారిని రోసి కట్నమేపరువుగ నెంచువారికయి పర్వులిడం బనియేమి వచ్చెనే?
ఆ. పిండిబొమ్మయైనఁ బిల్లఁ నిచ్చెదమనఁగానె చేయిచాచుఁ గట్నమునకు;ఇట్టి తరిని కట్న మీయకుండఁగఁ బుస్తెకట్టువరుఁడు జగతిఁ గానఁబడునె?
గీ. కట్నమే కోరి వచ్చిన ఖరముతోడఁతగుదునని కాఁపురము సేయు దానికంటెఁబెండ్లియే మానుకొని మగబిడ్డవలెనేతల్లిదండ్రులకడ నుంట తప్పిదంబె?
సీ. పెరవారి పిల్లకు వరు డేరుపడె నవమనపిల్ల కెవ్వడోఁ మగఁడటంచుపరుల పిల్లల పెండ్లి పరికించు నపుడెల్లమనపిల్ల కెప్పుడో మనువటంచుఎదుటి యింటికి నల్లుఁ డేతెంచినపుడెల్లమన యిల్లుఁ డెపుడింట మసలు ననుచుపొరుగింటి పిల్ల కాఁపురము విన్నప్పుడెల్లమనపిల్ల కెట్టిదబ్బునో యటంచు
నాఁడుబిడ్డ జనించుటే యాదిగానుబుస్తె మెడబడువరకు మాపులను బవలుఁగుడుచుచున్నను గూర్చున్నఁ గునుకుచున్నఁదల్లి పడుబాధ తెలుపఁగఁ దరమె బిడ్డ?
గీ. త్రాగువా రుంటచేతనే తాళ్ళగీత!గొనెడువా రుంటచేతనే గోవుల వధపోవువా రుంటచేతనే - భోగవృత్తిఅట్లె ప్రోత్సాహమే హేతు వన్నిటికిని.
ఆ. కూతురనుచు బరుల చేతిలోబెట్టకకొడుగటంచు నన్ను గొంపలోనెయుంచుకొనుడు, మీరు పెంచలేకున్న గష్టించి మిమ్ము నేనే - పెంచుదాన.
ఆ. ఆఁడుబిడ్డ యెపుడు నన్యుల సొత్తౌటదాని వారికడకు దానిఁ జేర్చుభారమెల్లఁ దండ్రిపైనుండుఁ గావునఁదండ్రి ఱాతిగుండెఁ దాల్పవలయు!
గీ. కట్న మర్పించి వరునిచే గంఠమునకుబుస్తె కట్టించుకొని తృప్తిఁ బొందు కంటెఁదనకుఁ దానుగ ముప్పేట త్రాటితోడఁగంఠమునకు కురియిడుకొంటె గౌరవంబు!
చ. సొరిదిగ హెచ్చుచున్న వరశుల్క విపద్దశ మాన్పఁబూని, బిట్టఱచితి వేదికాస్థలుల, నాడితి బెక్కు సభాంతరంబులం,బఱబఱ వ్యాసముల్ బరికి పత్రికలం బ్రచురింపఁ బంపితిన్,హరహర! నీదుపాటి తెగువైనను లేక భ్రమించితిం దుదన్!
ఆ. లోటులేని యెడనె లోపంబు కల్పనచేసి దానఁ దుష్టిఃఁజెందు జగమ!
ఇక రవంత లోపమే నిక్కముగఁ గానవచ్చెనేని బ్రతుక నిచ్చు నమ్మ.
చ. కరమును నీతిబాహ్యములు కట్నపుఁ బెండిళు లంచు సుద్దులన్గురిసెను నిన్నదాఁక, దన కూతుఁ వివాహముపట్ల నేడు కిక్కురు మనకుండఁ గాళ్ళకడకున్నడిపించెను గట్న మంచు నల్గురు ననుగురించి లేవిడులు గొట్టెడు యోగముపట్టె నేమనన్.
Comentarios
Cargando comentarios…