దశమాంకము
వరవిక్రయము
సీ. కొసరి కట్నములందు కొంటయే గౌరవమని తలపోసెడి యజ్ఞులార!వచ్చి ముద్దుగఁ బిల్ల నిచ్చెద మనఁ గట్నములకు బేరములాడు మూర్ఖులార!అబ్బాయి పెండ్లితో నప్పు పప్పులు తీర్చినిలువ సేయఁగ జూచు నీచులార!ముడుపులు గొనితెచ్చి ముంగల నిడుదాఁకపల్లకి యెత్తని పశువులార!
ఏమి యన్యాయమిది! పూర్వ మెన్నఁడేనివరుల నిటు విక్రయించిన వారు గలరె?పూజ్యతరమైన మన పుణ్యభూమియందుఁగటకటా! నరమాంస విక్రయము తగునె!
సీ. కట్నాలకై పుస్తకములు జేఁగొని, పాఠశాలల కేగెడు చవటలార!పిలిచి కాళ్ళు కడిగి పిల్లనిచ్చినవారికొంప లమ్మించెడి కుమతులార!అల్క పాన్పుల నెక్కి యవి యివి కావలెనని శివమాడెడి యధములార!ఎంత పెట్టినఁ దిని యెప్పటికప్పుడు
నిష్ఠరోక్తులు పల్కు - నీచులార!
కట్నమునుపేర నొక చిల్లి గవ్వ గొనినభార్య కమ్ముడువోయిన బంటు లగుచుజన్మ దాస్యంబు సలుపుడు సలుపకున్ననత్తవారింటఁ గుక్కలై యవతరింత్రు.
సీ. మగబిడ్డ పుట్టిన మఱునాఁడె మొదలు శుల్కమువలె లెక్కించు రాకాసులార!మర్యాద కై చూడ మరల గట్నాలకైరేపవల్ వేధించు ఱేచులార!అయిదు ప్రొద్దుల రాణులై, చీటికిని మాటికలిగి కూర్చుండు గయ్యాళులార!లాంఛనంబుల పేర లక్ష చెప్పుచు నిల్లుగుల్లసేయు దరిద్రగొట్టులార!
ఆఁడుపుట్టువు పుట్టరే? ఆఁడువారినిట్టు లవమానపఱచుట కించుకేనిసిగ్గుపడకుండఁ దగునె ఛీ? ఛీ ధనంబెపావనంబుగఁ జూచుట పరువె మురువె.
సీ. వెల పుచ్చుకొని వచ్చు వెడఁగులచేఁ బుస్తెకట్టించు కొనియెడు కన్నెలార!కట్నాల మగలతోఁ గలసి పల్లకిలోనఁగూరుచుండెడు పెండ్లి కూతులార!కోరిన వెల యిచ్చి కొని తెచ్చుకొన్న దాసానుసులకు దాస్యము సేయు సుదతులార!మీ వివాహములకై మీవారు ఋణములపాలౌట గని యోర్చు పడఁతులార!
ఎంచిచూడఁగ స్త్రీజాతి కింతకన్న
గౌరవము లేమి యిల మఱి కలదె? చాలుఁజాలు నిఁకనైన బౌరుష జ్ఞానములనుగలిగి మెలఁగుడు సత్కీర్తిఁ గనుఁడు.
సీ. తగిన బేరము వచ్చుదాఁక నబ్బాయినిపాఠశాలకు తన్ని పంపినానుపోటీలపై వెల పొసఁగించి నాలుగుసంచుల వఱకు కక్కించినానుమాటిమాటికిని బోట్లాటకు సిద్ధమైలాంఛనాలని వేయి లాఁగినానుఅద్దెల కీవచ్చునని యున్న సొమ్మెల్లపెట్టి పెంకుటి యిల్లు కట్టినాను
ఇల్లు కాలిపోయె నింటిది చనిపోయెపిల్లవాఁడు వెఱ్రి పీనుఁగాయెగోడ లొకనిఁ దగులుకొని లేచియే పోయెనాకు ముష్టిచెంబె లోకమాయె (నిష్క్రమించును.)
సీ. వొడ్డికి వొడ్డీలు వొంతున పెంచేసిమంచి మాన్నాలు గడించినానుపది పుట్ల బూఁవితో పండంటి బిడ్డ నోయెదవ కుక్కల కొడుక్కిచ్చినానుఅలక పానుపుకాడ అసలైన శంగలిబీ డాడి కడుపునఁ పెట్టినానుఅన్ని తిన్న యెదవ అమ్మాయి నొదిలేసియింకోర్తి పక్కలో యివిడినాఁడు
నాకు కూడు లేదు నా బిడ్డ కిప్పుడుకూడు, గుడ్డ, కొంపకూడ లేవుఅయినవెల్ల సేర్చి అల్లుడోళ్ళకు పెట్టుకమ్మ సచ్చినోళ్ళ కర్మఁమింతె. (నిష్క్రమించును.)
సీ. పెసలలో, సోళ్లలో బెడ్డలు కలిపివేసిపెజల నెత్తులు గొట్టి పెంచినానుమేనల్లు డింట్లోను మిడుకుతుంటే పిల్లనింకొక సిన్నోడి కిచ్చినానుగళ్లున పదివేలు పళ్ళెవులోఁ పోసిసకల మరేదలూ జరిపినానుగుంటూరు మేళవూ గూడూరి సుందరిపీకపాటా పిలిపించినాను
అయిదు రోజులు జుట్టిప్పు కాడినానుతెలక రెండు దివాలాలు తీసినానుయెల్లి యిరసాలుమెంటు కోర్టెక్కినానువచ్చి పెసరట్ల జంగిడి పట్టినాను. (నిష్క్రమించును.)
సీ. కట్టక ముట్టక కడుపునకేనియుఁగుడువక యొక కొంత కూర్చినాను!వడ్డికి వడ్డీలు వంతునఁ బొడిగించి
పెనకువపైఁగొంత పెంచినాను!పద్దులు పత్రముల్ దిద్ది, దీపము లార్పివంచించి కొంత గడించినాను!కాయమ్మీ కసరమ్మి కడుగమ్మి, వోట్లమ్మిచిల్లరగాఁ గొంత చేర్చినాను!
అతిథి చుట్టము గురువును యాచకుండు!దేవుఁడను మాట లేక వర్తించినాను!కడకుఁగట్నంబునకు గడ్డి కఱచినాను!కలడె నావంటి ఖలుఁడు లోకంబునందు?
సీ. ఆడుబిడ్డల వివాహములకై తండ్రులుపడుబాధ లెల్లను బాయుఁ గాక!లింగ :- కట్నాల కోసము గడ్డికఱచువారికెల్ల నా పాట్లె ఘట్టిల్లుఁగాకబస :- పణములు గొనువారు భార్యల కేప్రొద్దునూడిగంబులు సేయుచుంద్రుగాకకమ :- వెలమగల్ మెడలఁబుస్తెలు కట్టు దౌర్భాగ్యదశ కన్నియల కింకఁ దప్పుఁగాక!భ్రమ :- కట్నముల నందుకొంటయే గౌరవమనువెడఁగుదన మాడువారిని వీడుఁగాక!అందరు :- ఉర్వి నన్నిటఁ గాళింది కుద్ధియైనవెలదులే యెప్పుడును బ్రభవింత్రుగాక!
Comentarios
Cargando comentarios…