ద్వితీయాంకము

వరవిక్రయము

చ. పిడుకలు వంటకట్టెలును, బీటలు, చేటలు, లెక్కచూచి, యేర్పడ, పొయిబొగ్గులం గొలిచి, పాదుల కాయల నెంచి, దూడ పాల్విడిచిన దాఁక నిల్వఁబడి; వాకిటి కొబ్బరిచెట్ల కాయలన్‌గడనమొనర్చి; యిప్పటికిఁ గాలిడఁ గల్గితి నింటి లోపలన్‌.

సీ. కులలోప, గుణలోపములు మాపుకొనుటకుధనము ప్రధాన సాధనము నేడువరకట్నములకు సభాకట్నములకునుధనము ప్రధాన సాధనము నేఁడుమున్సిపల్‌, లోకలు బోర్డన్ యెన్నికలకుధనము ప్రధాన సాధనము నేఁడుమడులు మాన్యములుఁ గొంపలు వచ్చిపడుటకుధనము ప్రధాన సాధనము నేఁడు

అట్టి ధనమును దన పాడు పొట్టకొఱకో,బట్ట కొఱకో, లంక పొగాకు చుట్టకొఱకో,

వెనుక ముందులు చూడక వెచ్చపెట్టునిజముగవారు మతిలేని వారు కారె!

సీ. తలలు మాఱిచియొ, మూటలు విప్పియె, కొల్లగొట్టియో సిరి కూడఁబెట్టవలయుఆస్తులనెల్ల భార్యల పేర వ్రాయించిమాయ దివాలాలు -తీయవలయువడ్డికి వడ్డి, యా వడ్డికిఁ బైవడ్డిపెంచి గిజా యనిపించవలయురాత్రులు మేల్కొని రామకీర్తనలనుపాడుచుఁ గొంపఁ గాపాడవలయు

అప్పుగొన్నవారి యాస్తులెల్లను వచ్చిపడెడుదనుక నిద్ర విడువవలయు,దొంగ లెక్కలుంచి దొరల కంటను దుమ్ముగొట్టి పన్ను మాన్పుకొనగవలయు.

సీ. పరువుఁ, బ్రతిష్ఠయుఁ బాటింపఁగారాదుపొట్టకేమియుఁ గర్చు పెట్టరాదుబంధువు లేతేరఁ బల్కరింపరాఁదువేఱు విస్తరి యింట వేయరాదుకష్టజీవులఁజూచి -కటకటపడరాదుత్రిప్పక తన యప్పు తీర్పరాదుదార కేనియు పెట్టె తాళ మీయగరాదువేయి కల్లలకేని వెఱవరాదు

ఇన్ని విధముల గాపాడకున్న ధనముదక్కనేరదు; ధనముచేఁ దక్క నింటఁబెత్తనము లేదు! బయటను బేరు లేదు!పలుకుబడి లేదు! బ్రతికిన ఫలము లేదు.

ఆ. కలుపు పెరుఁగునట్లు; -కంచెలుం బాదులుపెరుగునట్లు నాచు పెరుఁగునట్లు;వడ్డి పెరిఁగెనేని వహ్వా! యదృష్టముపండె ననఁగ నిండ్లు నిండిపోవె!

ఆ. నిజముకన్న గల్లఁ నిశ్చయంబుగఁ దీపిబిడ్డకన్న ముండ బిడ్డ తీపికరము, వేతనంబు -కన్న లంచము తీపివసుధ, మొదలుకన్న వడ్డి తీపి!

గీ. తిండి యొకప్రక్క వెలితిగాఁ దినవలయు,చెప్పకయె యింటిపనులెల్లఁ జేయవలయు,ఊరకే కొట్టినను పడియుండవలయు,ఇట్టి కన్యను వెతకి గ్రహింపవలయు.

గీ. స్వామి కృపచేత నిది కొనసాగెనేనిలాటరీలోనఁ బలె మంచి లాటువచ్చు;ఇంటిపనులెల్ల నేర్చిన గుంట కానవెంటనే వంటవానిని గెంటవచ్చు.

Comentarios

Cargando comentarios…