పంచమాంకము
వరవిక్రయము
ఉ. తెల్లముగా మనోగతము తెల్పినఁ నేడ్చిన, మొత్తుకొన్న, నాతల్లికిఁ దోఁచదాయె విది తప్పిదపుం బని యంచుం దండ్రియుంజల్లగ గ్రిందిమెట్టునకు జారి ననుం గమనింపఁ డాయె! నన్‌జెల్లని డబ్బు క్రింద నిటు చేసితి వేమిటి కయ్య దైవమా!
ఉ. లేదు స్వతంత్ర మొక్క లవలేశము కూడ, నొకింతయేనియున్‌లేదు యధార్థ గౌరవము లేదొక యింతయు మెప్పు, పెండ్లియేకాదు గృహంబు లమ్ముకొని కట్నము లర్పణ సేయకున్న నీమాదిరి నాఁడుపుట్టు నవ మానపుఁబుట్టువు క్రింద నేర్పడెన్.
గీ. పయిక మాశించి దిగిన యబ్బాయి చేతబొందు కట్టించుకొని తృప్తిఁ బొందఁ దగున?తల్లిదండ్రుల నెదిరించి తగవు పెంచిమొండికెత్తినయట్లు కూర్చుండఁ దగున?
గీ. పుట్టినపుడె లిఖియించు గిట్టు మనుచుసకల జీవుల నొసట జలజభవుఁడు,ఇట్టిచో నంతరాత్మ స హింపని పనికొడఁ బడుటకంటె జచ్చుటే యుత్తమంబు.
ఆ. కొడుకు పుట్టి చదువు కొఱకుఁ దాతలనాఁటిమడులు మాన్యములును దుడిచివేయఁగూఁతు రవతరించి కొంపలుం గోడు లమ్మించుచుండె బెండ్లి లంచములకు.
Comentarios
Cargando comentarios…