సప్తమాంకము
వరవిక్రయము
గీ. స్వారిచేయని గుఱ్ఱంబు, చదువనట్టిపుస్తకంబును, సేవింపఁబోని మందు,నారగింపని వంటక, మనుభవింపనట్టి ధనమును వ్యర్థంబు లనుట వినరె?
గీ. గ్రామదేవత కొకనాఁడె కానుకలునుగొలుపులు న్వేటపోతులును గుంభములును;బింకముగ నైదు దినములు పెండ్లి కొడుకుతల్లి కొలు పక్క కొలుపును దాసి కొలుపు?
చ. కనికరమా కనంబడదు, కన్పడ బోవదు ప్రేమ, పొట్ట చీల్చినఁ గనుపట్ట దె య్యెడను సిగ్గను నట్టిది, పాపభీతి మచ్చునకును గానిపింప దిఁక సూనృతమన్నది లేనే లేదు, లోభిని భువి నే పదార్థములు పెట్టి విధాత సృజింపఁ గల్గెనో!
గీ. ప్రాయకంబుగ రాజు దు-ర్మతినె పెంచు;
మగువ తుంటరినే తన మది వరించుఅంబుదంబులు కొండలయందె కురియు,లచ్చి పెనులోభి యింటికే వచ్చి తనియు.
గీ. బేదదాని కొడుకు పెనులోభియై కూర్చునతని కొడుకు త్యాగియై చరింతు,త్యాగి కొడుకు మరల దారిద్ర్యయుతుఁ డగు;సిరులు చక్రమట్లు - తిరుగు నిట్లు!
సీ. తెల్ల వాఱఁగనె బిందెలతోడ నీళ్ళునుపలుదోము పుల్లలఁ బంపవలయుకావిళ్లతో వెన్క కాఫీయు, దోసె, లిడ్డెనలు, నుప్మాయు నడిపింపవలయుతరువాత భోజనార్థము రండు రండనిపిలిచినవారినే పిలువవలయుకుడుచునప్పుడు పంక్తి నడుమ నాడుచుం బెండ్లివారి వాంఛలు కనిపెట్టవలయునొకఁడు రాకున్న వానికై యోర్పుతోడమంచినీరైన ముట్టక మాడవలయు
నిన్నిటికి సైచి, వేలు వ్యయించి, గౌరవించినను నిష్ఠురములె ప్రాప్తించు దుదకు!
సీ. పిలిచిన బలుకక బిగఁదన్నుకొని లోనముసుఁగుఁ పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకఁడుఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండనిచుట్ట ముట్టించెడు శుంఠ యొకఁడుఒగిఁ దనకై వేచి యుంద్రో లేదో చూతమని జాగుసల్పెడి యల్పుఁడొకఁడుముందువచ్చినఁ బర్వు ముక్కలౌ ననుకొనికడను రాఁజూచు ముష్కరుఁ డొకండు
కుడిచి యింటను హాయిగా గూరుచుండివత్తురానని చెప్పని వాజెయొకఁడువచ్చి కోపించిపోవు నిర్భాగ్యు డొకఁడుఆఱు వేల్వారి నిందుల - తీరు లివ్వి.
గీ. ఆఁడుబిడ్డ పెండ్లి అతి లోభితోఁడఁ జుట్టఱిక మెముకలెల్ల గొరుకు లౌక్యజాతి కింట విందు సర్వేశ్వరా? పగవారికి న్విధింప వలదు, వలదు.
Comentarios
Cargando comentarios…