5. వామనావతారకథ
దశావతారచరిత్రము
సత్యాత్మజవాసవినాసత్యవిలాసదాన నవ్యనిధిశ్రేణీసావత్న్యాన్వితీయమునాసరయూకృష్ణ పద్మనాభునికృష్ణా !
అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టు లను వ్యాసశిష్యమౌనిరాజ యిఁక వామనావతారక్రమంబుఁ, దెలియఁజెప్పెద వినుమని దెలుపఁదొడఁగె.
శ్రీరత్నాకరకన్యకారమణుఁ డారీతిం జగన్మోహనాకారోదారవధూవిలాసముల రత్నశ్రేణిఁ గన్బ్రామి సొంపారంగా నమృతం బొసంగ బలియుండై దేవసైన్యంబుతోస్వారాజన్యుల గెల్చి యేలుకొనియె న్సౌవర్గసామ్రాజ్యమున్.
బలదైత్యారాతి వజ్రప్రతిహతతనుఁడై భండనక్షోణిలోనంగులశైలంబోయనం భంగురుఁడయినబలిం గొంచు బాణాదితత్పుత్రులు శుక్రాచార్యుఁ జేర్పం దులగనని దయం దోడుతో జీవితంబుకలిగించె న్మంత్రశక్తి న్గలవె గురునిచేఁ గాని కార్యంబు లెందున్.
బ్రదికినబలిదైత్యేంద్రుం, డెదఁ దనయపజయముఁ దలఁచి యెంతయు వెతచేఁగొదుకుచు నిట్లని పలికెం, ద్రిదశాహితగురుని న్యాయనిష్ఠురఫణితిన్.
నీ కే శిష్యుఁడనయ్యుఁ దుచ్ఛదివిజానీకంబుచేఁ బన్నముంగైకొంటింగద చాలదే యిదియయే కార్పణ్య మొందింపఁగానా కీజీవిత మిచ్చినాఁడ వవులే నన్నందఱు న్నవ్వఁగాఁబాకారాతికి నింటిబంటుగ నొనర్పం జూచితే భార్గవా.
అని నమ్రాననుఁడైన దైత్యపతి పల్కాలించి నీ కేల జాలిని జెందంగ వితా జయాపజయ ము ల్లేవా గణింపం జగం
బున నీ వొక్కఁడవే పరాజితుఁడవా పూర్వంబు శక్రాదు లెందును మీ కోడరె మీకె కాదు కలుగు న్లోకాన గెల్పోటముల్.
అదియుంగాక రమామనోహరుఁడు సాహాయ్యంబు గావింపఁగాఁగదనక్షోణిని గెల్చెఁ గాని సముదగ్రంబైన నీతేజముంద్రిదశాధీశుఁడు సైఁపఁగాఁగలఁడె యెంతేభక్తితో మున్ను నీపదముల్ గొల్చుట ముజ్జగం బెఱుఁగదే ప్రహ్లాదవంశాగ్రణీ.
విను మీతాతను గన్నతండ్రి హరితో ద్వేషించి నాశంబు గాంచెను మీతాత సమస్తపూజ్యత వహించె న్వైష్ణవీభక్తిచేవనధీశానసుతాధినాథపదసేవం గల్గు నిష్టంబుద్ఘనవైరంబున నొందు నంత మిది నిక్కం బంచు నూహింపుమా.
కావున వాసుదేవపదకంజయుగంబు సమాశ్రయించి సద్భావముతో విచారములఁ బాసి యొనర్పుము విశ్వజిన్మఖంబే విజయంబుగల్గ ఘటియించెద నీకు జగత్త్రయంబునన్నావుడుఁ దన్మహాధ్వర మొనర్చె బలీంద్రుఁడు శాస్త్రపద్ధతిన్.
బలి యారీతి గురూక్తమార్గమున శ్రీభామామనోనాథపజ్జలజధ్యానపరాయణుం డయి యొనర్చె న్విశ్వజిద్యాగమున్జ్వలనాభ్యంతరసీమ వెల్వడియె హేషాభీషణాశ్వంబు ప్రోజ్జ్వలసింహధ్వజ మైనయొక్కరథ మక్షయ్యప్రభావోన్నతిన్.
ఆహవంబునఁ బ్రత్యక్ష మగుచు బలిని, నాహవంబున గెల్చెద నఖిలసురులననుచుఁ దపనీయమయమైన యబ్జసరము, ననుచు వేడుకతో నిచ్చి చనియె నలువ.
దర మిది నీచేఁ జూచిన, దర మొందు బురందరాదిదేవతబలముల్దరమా పొగడఁగ నని యా, దరమున గురుఁ డొసఁగె నొక్కదరముం బలికిన్.
కూశ్మాండుండును గూర్పకర్ణుఁ డనఁగాఁ గోటిప్రధానాగ్రణు,ల్గూశ్మాండోదరు లర్కసన్నిభముఖుల్ గ్రూరక్రుధైకోన్ముఖుల్కాశ్మీరారుణకాంతివేశ్మనయను ల్గాలాంతకాకారు లుగ్రాశ్మోరఃస్థలు లేఁగుదెంచిరి యసంఖ్యంబైన సైన్యంబుతోన్.
అంత.
మధ్యాహ్నమార్తాండమండలంబులఁ బోలు పదివేలకెంపురాబండికండ్లుఅష్టదిఙ్ముఖములం దష్టాంగములు మించు గోపుగాంచినవజ్రకూబరములుగౌరమాయూరచాకోరగారుత్మతచ్ఛవిఁ దనర్చిన లక్షసైంధవములుగంగాపయఃపాలి గజరాజు గాలిచే వారించుకంఠీరవధ్వజంబు
దివ్యశస్త్రాస్త్రజాలముల్ దీప్తరత్న, ఘంటికాకోటిఘణఘణల్ గల్గి యందమగుచు శతయోజనోన్నతం బైనయట్టి, స్యందనం బెక్కి దైత్యసంక్రందనుండు.
విబుధశైలేంద్రంబు విశ్వరూపము చూపె నననొప్పు కాంచనస్యందనములుఘనసంఘములు విశృఙ్ఖలవృత్తి నడయాడు చెల్వు గాంచిన గంధసింధురములుసంవర్తసమ్మిళతసప్తార్ణవీతరంగములఁ బోలిన తురంగములగములుకల్పాంతదీర్ఘనిర్ఘాతము ల్పురుషులై వెలసెనో యనమీఱు వీరభటులు
కోటి దశకోటి శతకోటి కోటికోటి, సంఖ్యలను వెంటరాఁ జటులవిక్రమక్రమంబున బలిదేవమర్దనుండు, దైవగంగాతటంబున దండు విడిసి.
ఘనచక్రిచక్రఘర్ఘరరావములకన్న సమదవారణబృంహితములకన్నరంగదుత్తుంగతరంగఘోషలకన్న రణసముద్భటభటార్భటులకన్నఁదతభేరికాధణంధణనాదములకన్న నమితాన్యతూర్యఘోషములకన్నవందిమాగధులకైవారంబురొదకన్నఁ బ్రబలంపుసబళంపురవళికన్నఁ
జటులమై మించె గీర్వాణసార్వభౌమ, ధైర్యకైతవచక్రాంగభావనోపదేశదేశికఘనరవాదేశదైత్య, నాథజయశంఖభుంభుంనినాద మపుడు.
అది విని నంత నిండుకొలువైన సుపర్వవిభుండు గొల్వులోఁద్రిదశులఁ జూచి యెవ్వడొకొ దిట్టతనంబున బోరు సేయఁగాఁగదిసెను శంఖరావ మిది గ్రక్కున లెం డనునంతలో ఘనస్యదమునఁ జేర వచ్చి యొకచారుఁడు మ్రొక్కి వినీతి నిట్లనున్.
అవధరింపుము విబుధలోకాధినాథ, యిదిగొ బలిదైత్యవిభుఁడు మిన్నేటిచెంతదండు దిగినాఁడు భండనోద్దండుఁ డగుచుఁ, బ్రతిదళంబుగ సేనలఁ బంపు వేగ.
అని తెల్పుచున్నవేళం, దను నిలుమని యడ్డగించు దౌవారికులంగనుగొనక ద్రొబ్బుకొంచుం, దనుజుం డొకరుండు వచ్చి దర్ప మెలర్పన్.
ముక్కున గవ్వగుట్టి నిను ముందుగ నీడిచి తెమ్మటంచు మారక్కసిఱేఁడు పంపె వినరా దివిజర్షభ యింక నట్టిటున్దిక్కులు సూచిన న్విడువ దేవర వైనను నీకు వెన్కనేమ్రొక్కెద గాని రమ్మనుచు ముందలఁ బట్టఁగడంగ నుధ్ధతిన్.
హాహాహా యని వేగ లేచి శమనుం డఱ్ఱాఁగితన్ ద్రోయఁగానోహోహో బలశాలివే యనుచు దైత్యుం డుగ్రుడై చేరి తద్భాహాభ్యంతరసీమఁ దన్నిన మదస్తంబేరమంబో యనన్వాహారాతిహయుండు తూలె జవసత్త్వస్ఫూర్తి వమ్మై చనన్.
అప్పు డిదౌరయంచుఁ ద్రిదశాధిపుఁ డెంతయు నాగ్రహంబుతోగుప్పున గద్దె డిగ్గి శతకోటి నిశాటుని వ్రేయఁ బూనుఁడుంగొప్పు విడంగ గబ్బిచనుగుబ్బలు గుల్కఁ బదంబు మెట్టియల్చప్పుడు మీఱఁ జేరి శచి చయ్యన నాథునికేలు వట్టినన్.
విడువిడు పట్టరాకు మలివేణి యటంచును జాతికెంపురాకడియపుకేలు ఘల్లురనఁగా విదిలించి సురేంద్రుఁ డల్కతోజడియక పూవుఁబోఁడి బలశాసన దూతను జంప నీతియేవెడలఁగ ద్రోయుఁడన్న సురవీరుఁడు నట్ల యొనర్చి నివ్వెరన్.
గురునిముఖంబు సూచి శతకోటిని నిన్నను మొన్ననోకదాగురుభుజశక్తియుక్తి బలిఁ గూలిచి వచ్చితి నేఁడు వచ్చె నేవెరవున హెచ్చెనీబలము విక్రమ మన్నను శుక్రసేవచేదొరకెను వానితేజ మిఁక దుస్సహ మింద్ర దోలంగు మీ వనన్.
రంభోరురంభాదిగంభీరపుంభావసంభోగసంభూతసంభ్రమములుశృంగారభృంగాళి రంగాదితుంగాబ్జగంగాతరంగావగాహనములుపారావతారావధీరారి వారావతైరావతారోహగౌరవములుబాలానిలాలోలజాలావళీలాస్యలీలావనాలోలఖేలనంబు
లెటుల విడఁజాలెనొక్కొ దైత్యేంద్రుదాడి, కోడి దివి వీడి శచి గూడి యుర్వి సేరెనడుగు చూపరి జడదారియొడయనింటి, కోడి కోడిగములవేల్పుప్రోడ యపుడు.
పరఁగఁగలకొద్ది సురలకుఁ బంచియొసఁగఁ, జాలువృత్రారి యగురాజు మూలఁబడినబలితమయ్యె విరోచనప్రభవతేజ, మమర గాఢతరస్ఫూర్తి నపనయించి.
ఈలా గింద్రునిఁ బాఱఁద్రోలి బలి తా నేకాతపత్రంబుఁగాఁద్రైలోక్యం బటులేలుచుం గృతమరుత్తాపప్రతాపంబుతోభూలోకాధ్వరభాగముల్ గొనుచు సంభోజాక్షసంప్రీతిగాఁజాలంజన్నము లాచరించె గుణియై శాస్త్రోక్తమార్గంబునన్.
తళుకు న్ముత్తెపుఁగొల్వుకూటమున నిద్దాసింగపుంగద్దెపైఁగొలువైయుండె సురానురాదులు కెలంకుల్జేరి సేవింపఁగాబలిదైత్యుం డొకనాఁడు వైభవ మెలర్పం జామరగ్రాహిణీకలనిక్వాణకరాగ్రకంకణఝణత్కారంబు తోరంబుగన్.
అప్పు డొకచారుఁ డేతెంచి యసురనాథ, నీకు జయపెట్టుచున్నారు నిఖిలజనులుఁగొదవ వల దెందు హిమగిరికూటమునను, గంటి నొక్కవిశేషంబుఁ గన్నులార.
అతిఘోరగహనమధ్యమున వర్తించుచో మేఘంబులోని క్రొమ్మెఱుఁగుకరణిఁజలికాలమున జలాశయమున నుండుచోఁ గొలనిలో రాయంచకొదమపగిదిఁగడగి పంచాగ్నులనడుచక్కి నిలుచుచో లలితమౌ పసిఁడిసలాకజోకఁబుడమిఁ బాదాంగుష్ఠమున నెలకొన్నచోఁ బాఁదులో లేఁదీఁగె బాగుమీఱఁ
జిలుకవలెఁ గోయిలవిధాన ఫలము పర్ణ, ములు మెసంగుచుఁ గొన్నాళ్లు జలము మొదలుగ్రోల కిప్పుడు రత్నపాంచాలిలీలఁ, దపము సలిపెడు సురమాత దైత్యనేత.
అని విన్నవించినప్పుడె, విని చిన్నంబోయె దైత్యవీరుఁడు మది యోజన చేసి యొకయుపాయము, గని దైత్యులఁ బంప వారు గానిమ్మనుచున్.
పరఁగ నిరువదియైదేండ్లప్రాయ మలరు, విప్పుగన్నులుఁ దైజసవిగ్రహములుఁగలుగు వేల్పులరూపము ల్గాంచి తత్త, దుచితవస్త్రాభరణశస్త్రనిచయ మూని.
అంత.
జడనిధి నీవహీనగుణసంగ మెఱుంగవు హేమచేలికింబడుచు నొసంగి దుర్విషము భర్గున కిచ్చితివంచు నవ్వి దాపడుచు నొసంగె భర్గునకు భాసురకీర్తి హిమంబు పేరిటంజడిగొననొప్పు నత్తుహినశైలముమీఁదికిఁ బోయి యచ్చటన్.
చరణాంగుష్ఠము నేల నూఁది భుజము ల్సారించి భూరేణుదూసరితానీలజటాభరంబు గుదుల న్సంధించి మోమెత్తి యంబరము న్సూచుచు శ్వాసవాయువుల నిర్బంధించి యత్యంతదుస్తరమైనట్టి తపంబు సేయు నదితిం దర్శించి వే మ్రొక్కుచున్.
తల్లీ యేల తపంబు చేసెదు నవోద్యానస్థలీమల్లికావల్లీజైత్రము నీదుగాత్రము వనావాసైకపాత్రంబుగానిల్లీల న్నొగిలింప నాయమగునే యేపాటిదీనం ఫలంబిల్లీపాటిని జేరు మోసమగుసుమ్మీ దానవు ల్సూచినన్.
తనువు గృశింపఁజేయునది ధర్మము గాదని పెద్దలాడఁగావినివినియుండి యేటికి వివేకము లేక తపంబు సేయఁబూ
నిననిను నేమనంగలము నేరము లెంచఁగరాదు గాని యోజనని యభీష్ట మొందుటకు సాధ్వులకుం బతిభక్తి సాలదే.
ప్రాణవిభుఁ బాసి యతిథిసపర్య ద్రోసి, బంధువుల రోసి పుత్రులఁ బలుచఁజేసియట్టిజిగిదీసి యిట్టికారడవి డాసి, గాసిఁ జెందఁగ నిందేమి గలిగె వాసి.
అమ్మరొ నిన్నుఁ బాసి క్షణమైనను రిక్తగృహంబునందు మేమెమ్మెయి నుండువార మట నెందఱు గల్గిన నీవు లేనిగేహమ్మది యేల పోద మిపు డాలయసీమకు రమ్ము మావిచార మ్ముడిగింపు మింపుగను రక్ష యొనర్పుము దీర్పు మాపదల్.
రోగి దరిద్రుఁడు పరదే, శాగతుఁడుం దల్లిఁ జూచి యానందించున్భోగము భాగ్యము రాజ్య, శ్రీగలవారలకు వేఱె చెప్పఁగవలెనే.
అని యెన్నివిధంబులఁ దెల్పిన నించుక వినకయున్న బెదరించుచు నద్దనుజులు భీషణరోషం, బున నిజదంష్ట్రికల నగ్గిఁ బుట్టించుటయున్.
అమితంబై యది వేణువహ్నిగతి దైత్యశ్రేణితోఁ గూడ దగ్ధము చేసె న్శతయోజనోన్నతమహాకాంతార మంతన్ రమారమణప్రేరితచక్రరక్ష నదితిం బ్రాపింపదయ్యె న్విచిత్రమె నిష్కారణవైరికార్తి హరిభక్తక్షేమము న్భూవరా.
హరిభక్తాగ్రణి యున్నచోట హరిభాషాధీశరుద్రాదు లుందురు దుష్టగ్రహరోగవహ్నిభయము ల్దూరంబులౌ లక్ష్మి సుస్థిరయై నిల్చు విపద్దశ ల్దొలఁగుఁ దద్దేశంబు కాశీగయాద్యురుపుణ్యస్థలకోటి కెక్కుఁ డనఁగా నొప్పు న్జగద్గేయమై.
కానం దననెమ్మదికొల, కానందము మీఱ విష్ణుహంసము సువివేకానందమ్మున వలిమల, కానం దపమూను నదితి గనియె శుభంబుల్.
అదితి యీరీతి దివ్యసహస్రవర్ష, ములు నిరాహారయై ఘోరముగఁ దపంబుసేయ రక్షోసురేంద్రదైతేయదాన, వాళి భీతిలె సురపాళి యలరె నంత.
కలిమిచిల్కలకొల్కి గబ్బిగుబ్బలగట్టితన మెఱింగిన యురఃస్థలము మెఱయఁగలికిజక్కవపిట్టకవఁ గూర్ప విప్పంగదరమైన కనుదోయి దయ దలిర్పనసురలచౌవంచ యుసుఱులు మెసవంగఁ దూకొను నైదుకైదువులు పొదలనొఱపైన కటితటి నొఱకువచ్చుపదాఱువన్నెదుప్పటి వింతవన్నె మీఱఁ
గమలగర్భేశముఖు లిరుగడల నడువ, జయజయధ్వానముల యోగిజనము పొగడగరుడవాహన మెక్కి శృంగార మమర, నమరమాతకు శౌరి ప్రత్యక్ష మయ్యె.
పశ్యలలాటజూటతటపాటలసూచితరాగచంద్రసద్వశ్యకృతోపగూహనపదశ్రితవన్నఖతారుఁ డభ్రసా
దృశ్యశరీరుఁ డచ్యుతుఁడు దృశ్యుఁడుగా ముదమంది కశ్యపాదృశ్యవలగ్న యిట్లని నుతించె నిజోచితవాక్యవైఖరిన్.
ళచ్ఛిత్థణాహేయ లలి అ హత్థపయో అ పొమ్మలోఅణళో అపూ అణిజ్జఖఅవర ఆణేఅ గఅరాఅరఖ్ఖ అఖ అరఖిందు సిఖి అరఅణి ఆస?ఈసరజణల మహేసరభ అణిజ్ఞ దిక్కమజాహ? తెళ్లొక్కణాహపుణ్నమి అంకలావణ్నస్స మందరఖి ఇధరధారఅ కిసణవణ్న
భక్తకామి అఫలదాణపారి ఆఆ, యాయయూయ జణేఝ్ఝేఅ యాయరూఅవాసుదేవ సఆణంద వణఅణేహ, కిత్తణిజ్జణవ హ్నీర ఆ?దేఅ.
అనుచు నప్రాకృతచరిత్రయైన యదితి, ప్రాకృతోదితవైదగ్ధిఁ బ్రస్తుతింపఁబ్రాకృతగుణవ్యతీతుండు భక్తసులభుఁ, డైన ప్రహ్లాదవరదుఁ డాహ్లాదమునను.
మొలకనవ్వులఁ జికిలివెన్నెలలు గాయఁ, గాయ మెంతయుఁ బడలెనుగా యటంచునతిపవిత్రకరంబున నదితిమేను, నిమిఱి నీవాంఛితం బేమి నెలఁత యనిన.
స్వామివి జగముల కంత, ర్యామివి జనములకు జపిత కర్థ మొసంగేసామివి భక్తుల కంతిక, గామివి నీ వెఱుఁగనట్టి కార్యము గలదే.
ఐన న్వినుపించెద విను, శ్రీనాయక మత్తదైత్యసేనలచే నాసూనులు వసూనులై హరి, సూనుప్రభృతులును దలకఁ జూడంగలనే.
దితిసుతుల సంహరింపక, యతులితమైనట్టి వారియైశ్వర్యము నాసుతుల కొసంగుము చాలును, దితిజులు నాసుతులు గారె దీనశరణ్యా.
అనిన నెంతయు మెచ్చి మాయమ వౌదు, వదితి యని కౌఁగిలించి దైత్యారి యనియెసవతిబిడ్డలయందు మత్సరము లేని, యపుడె నీసాటి గలరె యీయఖిలమునను.
తనసుతులం బరాత్మజులఁ దద్దయుఁ బ్రేమఁ దగన్సమంబుగాఁగనుఁగొను పుణ్యమూర్తులకుఁ గల్గదు నందనశోక మింక నీతనయుఁడనై జనించి బలిదర్పము మాన్చి తదీయలక్ష్మి నీతనయుల కిత్తు నీతినయధర్మవివేకము గాఁగ నావుడున్.
ప్రతిరోమకూపభాసుర, శతపత్రభవాండకోటిసాహస్రుఁడ వీవతిలోకచరిత్రుఁడ వే, గతి గర్భమునన్ భరింతుఁ గమలదళాక్షా.
అనిన న్నీ వనుమాట నిక్క మదితీ యైనన్ రహస్యంబు నీకు నెఱింగించెద నాదుభక్తులు విరక్తు ల్యోగసక్తు ల్సుధీజనరక్తు ల్పితృభక్తియుక్తులు పరేర్ష్యాముక్తు లాచారవర్ధనయుక్తు ల్సతులు న్భరింతురు ననుం దథ్యంబు సాధ్వీమణీ.
నీవు సమస్తభూతహితనిర్మలచిత్తవు పుణ్యశీలవుంగావున నన్నుఁ బుత్రునిగఁ గాంచెద వంచును గంఠమాలికన్శ్రీ వెలయంగ నిచ్చి దయచే నభయంబు నొసంగి దేవతాసేవితుఁడై వికుంఠపురిఁ జేరె సరోరుహనాభుఁ డంతటన్.
అదితి యింటఁ బయోవ్రత మాచరించి, భర్తృసంగతి సౌఖ్యసంపదలఁ బొదలనెలమసలె వెల్లజిగి గల్లముల నెదిర్చె, నెలమసలె నెలల్ దొమ్మిది నిండెనంత.
కంజనేత్రుఁడు శుక్లపక్షంబునందు, శ్రవణమున ద్వాదశీదివసమున విజయయనుముహూర్తంబునందు మధ్యాహ్నవేళ, నదితికి జనించె వామనుం డగుచు నపుడు.
కురిసెఁ బువ్వులవానలు మెఱసె దిశలు, విరిసెఁ గావిరి దుందుభు ల్మొరసె దివినిదొరసె గంధర్వగాన మచ్చరలయాట, నెరసె జగముల వేడుక ల్బెరసె నంత.
మణికోటీరము నక్రకుండలములు న్మాణిక్యకేయూరకంకణకాంచీకటిసూత్ర హేమవసనగ్రైవేయమంజీరముల్ఫణిభోగాభచతుర్భుజంబులు దగ న్భాసిల్లులోకైకరక్షణుని న్వామనుఁ జూచి కశ్యపతపస్యాశాలి హృష్టాత్తుఁడై.
పటుభక్తి మ్రొక్కి యంజలి, ఘటియించి నుతించె వికచకైరవవేళానటధూర్జటి చరణకటా, త్కటకఫణీంద్రానుకారి గంభీరోక్తిన్.
రవికోటిప్రతికోటితేజము శరద్రాకేందుబింబాస్యమున్ాధవళాంభోరుహలోచనంబులు సుధాదధ్యన్నహస్తాబ్జమున్నవలావణ్యవి శషముం గల నినుం దర్శింతు ధన్యుండనైశివము ల్గంటి దయాచితాంఘ్రియుగళీసేవామనా వామనా.
అని పొగడ నీకు మేలగు, జనకా మీయందు రెండుజన్మంబుల నేఁదనయుఁడ నైతిని మీదం, దనయుఁడనై మీకు వాంఛితం బొనఁగూర్తున్.
అనుచుఁ దనరూపుమాటి యవ్వనజనాభుఁ, డర్భకునిలీలఁ గావుకా వనుచుఁ బోర
నెన్ని నేర్చితి ననుఁగన్న చిన్నితండ్రి, యనుచు ముద్దాడుచును దల్లి యక్కుఁజేర్చె.
అలరున్నూనెఁ దలంటు గందము నలుం గందంబు పన్నీటిచేఁజలకంబున్నును జల్వపొత్తులును రక్షారక్ష యుయ్యాల పాటలు చన్ ద్రావుడు లెంతసంతసము పుట్టంజేసె సృష్టిస్థితిప్రళయాపాదికి దైత్యభేది కదితీభాగ్యంబు దానెట్టిదో.
ముజ్జగము లుజ్జగింపని, బొజ్జ గదల పాదపద్మముల జిగిజాళ్వాగజ్జెలు మొరయఁగ పజ్జల, హజ్జలిడుం గుజ్జు తల్లి యానందింపన్.
విద్దెము విద్దె మటంచు, న్ముద్దియ లిరుగేల నూన ముద్దులకొడుకున్విద్దెములు సేయుఁ దళుకుం, గద్దఱిచెక్కులను మద్దికాయలు గదలన్.
ఉపనయనము గలవేలుపుఁ, దపసులు విధిముఖులు రాఁగఁ దనయునకుం దానుపనయనము సేయఁగఁ గ, శ్యపముని సమకట్టె సకలసంభ్రమ మలరన్.
అలరుందావులు ధూపవాసనలు దూర్యారావము ల్పెండ్లిపాటలు మాణిక్యపుఁదోరణంబులును గాటంబైన యాపెండ్లిపందిలిలో మౌనులు సుట్టుకొన్న మణివేదిన్ హేమపీఠంబుపైనలరారెం బితృమధ్యభాగమున మాయావామనుం డయ్యెడన్.
తపనుఁడు సావిత్రి నుపదేశ మొనరింప బ్రహ్మసూత్రము బృహస్పతి ఘటించజనకుఁడు పచ్చనున్ననిముంజి మొలఁగట్ట నవని యొసంగఁ గృష్ణాజినంబుశంబరధారి దండంబు కేల నమర్పఁ ప్రేమతోఁ దల్లి కౌపీన మొసఁగపాథోదపద మాతపత్రంబు సవరింప నలినగర్భుఁడు కమండలువు గూర్ప
సప్తఋషులు పవిత్రముల్ శారదాంబ, యక్షమాలిక యీయఁ జెల్వయ్యె మిగులఁబ్రణతరక్షావిచారి సద్భక్తహృదయ, పద్మసంచారి వామన బ్రహ్మచారి.
అక్షీణం బగునట్టికల్మిగల మాయావామనుం డంతటన్యక్షేశార్పిత పాత్ర గైకొని కులాఖ్య ల్సెప్పుచున్ మ్రొక్కి తా'భిక్షాందేహి' యటంచు వేఁడ గిరిజాబింబోష్ఠి వెట్టె న్మణీభిక్షం బంచలవీక్షణాంచలములం బెంపారు లేనవ్వునన్.
అంతఁ గ్రమమున శారద యదితి సప్త, ఋషిపురంధ్రులు శచియు దిగీశసతులువెట్టు బంగారుభిక్షంబు బియ్య మద్రి, పగిది మించె బృహస్పతిభట్టుచెంత.
తాలిమి మీఱఁగ నెప్పటి, మాలిమితో దేవగురుఁడు మంత్రము దెలుపన్వేలిమి సేసె మృగాంకుని, మేలిమిగను రక్షయిడె సుమేధుఁడు నుదుటన్.
రతిపతియహితునిసతి భా, రతి జతయై కంకణము లొరయ ముత్తెపుటారతియెత్తిరి వామనునకు, రతిబోఁటుల పాట తేట ఱాలు గరంగన్.
పరమేశాన పయోజసంభవులు దిక్పాలుర్ క్రమం బొప్పఁగాఁబరమాహ్లాదము మీఱ నొండొరులు పైపై నిచ్చుపట్టాంశుకాభరణశ్రేణులు కేలఁ గైకొని సభాభాగంబున న్నిల్చి సుస్వరుఁడై దేవగురుండు వీఁడు చదివె న్సర్వాగమస్ఫూర్తులన్.
ఇవ్విధంబునఁ గశ్యపబ్రహ్మ సకలబ్రహ్మర్షిసమేతుండై తనూజాతు నుపనీతుంగావించి దిగంతరాగతశిష్టజనవ్రాతంబుల నభీష్టమృష్టాన్నంబుల దక్షిణతాంబూలంబుల సంతుష్టులం జేయుచు మహోత్సవదినచతుష్టయంబు గడపెనంత.
బలి జగదేకదాత యని పల్మఱు భూమిసుధాశనోత్తముల్పలుక ముదంబుతో విని సుపర్వమనోరథసాధనోద్యమంబలర మృషావటుండు బలి యాచన సేయుటకై నివేశమున్వెలువడె నింక నెవ్వరొరు వేఁడనివారలు వేళ వచ్చినన్.
కురిసెఁ బువ్వులవానలు మెఱసె దిశలు, విరిసెఁ గావిరి దుందుభు లొరసె దివినిదొరసె గంధర్వగాన మచ్చరలయాట, మెఱసె జగములు వేడుకఁ బొరసె నపుడు.
ఒకవింతహరువైన యూర్ధ్వపుండ్రంబుపైఁ బెట్టిన మేధావిబొట్టు దనరనీలంపుఱానిగన్నిగలీను సిగగంటు నవరత్నఖచితకుండలము లమరనవమైన కృష్ణాజినముతున్క మెలిగొన్న ధవళయజ్ఞోపవీతంబు మెఱయముప్పేటఁ బెనఁగొన్నముంజి పచ్చనిగోఁచి వెలిపట్టుపంచయు మొలఁ దనర్ప
మణిపవిత్రము దండకమండలువులు, గొడుగు పావాలు పాత్రిక బెడఁగుమీఱఁబసుపుఁబూసిన టెంకాయఁబాణిఁ బూని, వామనుఁడు వచ్చె బలి యజ్ఞవాటమునకు.
కపటవటు దివ్యతేజఃప్రకాశనంబుఁ, గాంచి యప్పుడు విజ్ఞానఘనులు మునులులేచి కరములు ముకుళింవఁ జూచి శుక్రుఁ, డసురవల్లభుతోడ నేకాంతమునను.
అదిగోఁ జూచితె బ్రహ్మచారివలె దైత్యారాతి యేతెంచె నత్త్రిదశాధ్యక్షున కెల్లసంపదలు నెంతే ప్రేమతో నీయఁగానదితీగర్భమునం జనించె నితఁడే మర్థింప నీ వీయఁగామదిలో సెంచకు మీయనెంచినను సామ్రాజ్యంబు లేదింకిటన్.
ఆత్మబుద్ధి సుఖం బిచ్చు నంతకన్న, గురువు సెప్పిన సద్బుద్ధి పరులబుద్ధి
కొదవదెచ్చును స్త్రీబుద్ధి కులముఁ జెఱచుఁ, గాన నాబుద్ధి విని సిరు ల్గనుము నీవు.
అనిన ధర్మవిరోధ మిట్లనుట గా దాచార్య వేదార్థవిజ్జను లేదేవునకుం బ్రియంబుగ నొనర్పంజూతు రశ్రాంతమున్ఘనయాగంబుల నట్టిదేవుఁ డిట సాక్షాత్కారమై నిల్చి వేఁడిన బ్రాణంబులు నిత్తుఁ బ్రాణములకంటెన్ హెచ్చు త్రైలోక్యమున్.
అఘటనఘటనాసామ, ర్థ్యఘనుం డీశ్వరుఁ డతండు దలఁచిన కార్యంబు ఘటింపకున్నె యీలో, నఘహర మగు గీర్తిఁ గాంచు టర్హము సుమ్మీ.
శిబి దధీచి విరోచను ల్చిత్రముగను, యాచకుల కిచ్చి రట యంగ మట్టికీర్తియెఱుఁగ లేనట్టి నాదాన మేమి యనుచుఁ, గుండుచుండుదు నది దొరకొనదె నేఁడు.
అని పలుకుచున్న సమయంబున.
వివిధదేశాయాతవిద్వన్మిధఃకృతాలఘుశాస్త్రవాదకోలాహలంబునవనతత్తత్క్రియాశంక్యుపద్రష్టుసాధూత్తరార్పణదక్షహోతృకంబుమహిషీవచస్సత్యమహిమజ్వలత్ప్రవర్ణ్యక్షీరశిఖిశిఖాక్రాంతనభముధూమగంధిలవసాహోమవేళాసర్వజనకౢప్తకరతాళసంకులంబు
ఖదిరబిల్వాదియూపయుక్తంబు రుక్మ, పక్షపక్షీంద్రచయనవిభ్రాజితంబునగుచు మించు బలీంద్రుని యశ్వమేధ, యాగశాలకు వచ్చె మాయావటుండు.
దదాతు లక్ష్మీం తనలోకనాథో, వశంగతేంద్రస్య జగద్ధితస్యసంప్రాప్తభూర్య స్సుతలాభతాంచ, భవా న్వదాన్యోహి బలే సురాణాం.
అని యుభయార్థంబుల దీ, వనతోఁ డెంకాయ యొసఁగ వామనుచేఁ గైకొని బలి వటుని వరాసన, మున నిడి తగ నర్ఘ్యముఖ్యపూజ లొనర్చెన్.
ఒనరించి ధన్య మయ్యెం, జననము పుణ్యుండ నైతి సవఫల మొదవెన్నిను సేవించితి గావున, ననఘా నీవాంఛఁ దెల్పు మది చేకూర్తున్.
అనిన దంభడింభకుం డిట్లనియె.
చక్రపాణి జయించి సకలలోకము లేలె ఘనశక్తిని హిరణ్యకశిపుఁడాదిగణనీయసకలసద్గుణరత్నరాశియై యలరారెఁ బ్రహ్లాదుఁ డంచు వెనుకద్విజవేషములఁ దన్ను వేఁడువేలుపులకుఁ దను వొసంగెను విరోచనుఁడు మొన్నగరుడవాహప్రీతిగా శతక్రతువులు చేసినాఁడవు సర్వజేత వగుచు
ననుచు వామనుఁ డెంచి యో దనుజనాథ, తపము సేయుటకై పదత్రయధరిత్రినడుగవచ్చితి యోగ్యుఁడ నంతమాత్ర, మిచ్చి యంపింపుమనిన బలీంద్రుఁ డనియె.
అనఘా కల్పమహీరుహోత్తమము డాయంబోయి కారాకువేఁడినజాడ న్నను నేమి వేఁడితివి కంటే నాదు సామ్రాజ్యమున్ధనము ల్ధాన్యములుం దుకూలములు రత్నంబుల్ యథేష్టంబుగానొనగూర్తు న్గొను నన్ను వేఁడుజనుఁ డన్యు న్వేఁడఁగాఁ జెల్లునే.
అనినఁ జతురవచనరచనాపటుం డగు కుహనావటుం డిట్లనియె.
అడిగినవారిఁ జూచిన భయంపడి వెల్వెలఁబాఱుమోముతోజడియక యాదరించుచుఁ బ్రసన్నుఁడవై యభిలాష మేమి యంచడుగుచు ముందుగా నడిగినందుల కెచ్చుగ నిత్తునంటి వీయెడ నినుఁబోలుదాత గలఁడే త్రిజగంబుల నెంచి చూడఁగన్.
అమరారీశ్వర బ్రహ్మచారులకు రాజ్యం బేల కాంక్షించుమాత్రము భూమిం దయసేయు మేఁ దప మొనర్పంబోయెద న్స్వల్పదానముచే నేమిఫలం బటంచనకు నానాదానము ల్పాదమాత్రమహీదానముఁ బోలదందురు సుమీ తర్కంబు లింకేటికిన్.
అవనీదానమహత్త్వముం దెలియలే రంభోజగర్భాదులున్వివరింతు న్విను సత్కుటుంబినికిఁ బృథ్వీదానముం జేసినన్భవపాశంబులఁ బాసి మోక్షపదవి న్బ్రాపించు హత్యాదిపాపవిముక్తుం డయి యెట్టి మూర్ఖుఁడును జిత్ప్రావీణ్య మేపాఱఁగన్.
విప్రవరునకుఁ దూమెఁడు విత్తనముల, నేల యొసఁగిన ఫలము వర్ణింతు వినుములోకపావని యగు గంగలోనఁ ద్రిదిన, మజ్జనము సేయు ఫల మగు మనుజులకును.
చెలఁగుచు నిద్దుము విత్తన, ములనేల కుటుంబి కొసఁగు పుణ్యాత్మునకున్గలుగు న్శతహయమేధం, బులు గంగాతటిని జేయుపూర్ణఫలంబుల్.
పుట్టెఁడు విత్తనంబులకు భూమివిశిష్టున కీయఁజాలు నాపట్టపుదాతకుం గలుగుఁ బంకజనాభు పదాంబుజంబునంబుట్టిన యేటిచెంతఁ బరిపూర్ణముగా హయమేధ మాది యైనట్టి మఖంబులు న్శతసహస్రములు న్ఘటియించు పుణ్యముల్.
కల దొకయితిహాసం బిం, దులకు న్వినుపింతు వినుము దురితము దొలఁగున్గలుగును భూదానఫలం, బలఘుతరం బగుచుఁ ద్రిభువనైకవదాన్యా.
మును బ్రహ్మకల్పంబునను భద్రమతియను విప్రోత్తముఁ డొకండు వేదశాస్త్రనిపుణుఁడు గలఁ డాతనికి భార్య లాఱ్వురు నందను లిన్నూటనలువదిగురుగల రతఁ డత్యంతకష్టదారిద్రుఁడై కుడువఁ గూడును గట్టఁ గోక లేకవగ నొంది వేసరి వసుమతిదానంబు గావింప కీలేమి పోవ దనుచుఁ
గోరి కౌశాంబిలోన సుఘోషువలనఁ, బంచహస్తావనిఁ బ్రతిగ్రహించి విష్ణుభక్తున కొసంగి సకలసంపదలఁ బొదలి, వెనుక మోక్షంబు గనె వింటివే బలీంద్రా.
కాన భూదాన మొనరించుకంటె నధిక, మైన దానంబులేదు నే నడిగినట్టిపుడమి మూఁడడుగు లొసంగి భువనమహిత, యశముఁ బుణ్యంబుఁ గైకొనుమన్న నలరి.
హేమక్ష్మాధరసుస్థిరుండు బలిదైత్యేంద్రుండు వింధ్యావళీవామారత్నము రత్నకుంభజలము ల్వంపన్మృషావామనశ్రీమత్పాదయుగాభిషేచన మొనర్చె న్బ్రహ్మరుద్రాదు లోహో మేముం గనలేనికీర్తిఁ గనె దైత్యుం డంచుఁ గీర్తింపఁగన్.
క్రవ్యాదవిభుఁడు వామన, దివ్యశ్రీపాదపద్మతీర్థంబు శిరస్సేవ్యము గావించి బుధ, స్తవ్యమతిని ధారవోయు సమయమునందున్.
వామనుఁడు దర్భగిండిలో వారిధార, కడ్డమైయున్న శుక్రుని యక్షిఁ బొడువమిట్టిపడి కన్ను వోయిన లొట్టవోయె, ననుచు నవ్వుచుఁ జేసాచి యడుగుటయును.
క్షమ మూఁడడుగులు బలి యు, త్తమభక్తి "సదక్షిణం సతాంబూలం తుభ్యమహం సంప్రదదేదం, నమమ” యనుచు ధారవోసె నలినాక్షునకున్.
పెరిఁగె న్వామనుఁ డంత దంతిపొడవై పృథ్వీధరం బంతయైశరదంభోరుహమిత్రశీతకరనక్షత్రగ్రహస్వర్మహాస్ఫురితుండై జనలోక మవ్వలిజగంబు న్సత్యము న్మించుచున్హరి దంతంబులు నిండి మెండుకొనె నత్యాశ్చర్య మేపారఁగన్.
పద్మరాగప్రభాభాసమానకిరీట మరవిందజాండకర్పరము నొరయశతయోజనాయతశతపత్రపత్రజైత్రము లైన విపులనేత్రములు మెఱయఁబరిపూర్ణచంద్రబింబసహస్రవిస్త్మృతం బగుమోము మందహాసంబు దొరయదశదిగంతవ్యాప్తతతబాహువులు శంఖచక్రాదివివిధశస్త్రములు నెరయ
కవదొనలు నక్రకుండలకౌస్తుభములు, వైజయంతియు లక్ష్మీ శ్రీవత్స కాంచనాంబరము లొప్ప బ్రహ్మాండ మనెడు భరణిఁ, కస్తురియుఁబో లెఁదగెఁ ద్రివిక్రమవిభుండు.
హరి యీరీతిఁ ద్రివిక్రమాకృతిని బ్రహ్మాండంబునన్ నిండి యావరణాంగంబుల సర్వలోకములు మించన్ బ్రహ్మరుద్రాదినిర్జరు లగ్గింపఁగ నందముఖ్యసుభటవ్రాతంబు సేవింప దుర్భరతేజంబున రాజిలన్ బలి కృతార్థంమన్యుఁ డయ్యెన్ మదిన్.
అపుడు.
వినుఁ డోహో జనులార విష్ణుఁ డొకఁడే విశ్వాధికుం డాద్యుఁడుంగనుఁగొన్నారె కదా మహామహిమ మింకన్ భక్తితోఁ గొల్వుఁడీయనుచుం జాటుచు జాంబవంతుఁడు సముద్యద్భేరి మ్రోయించుచున్వినరా నిర్వదియొక్కమా ర్వలగొనెన్ విష్ణున్ విరాడ్విగ్రహున్.
అరవిందాయతనేత్రుఁ డంతట నతుల్యంబైన త్రైవిక్రమస్ఫురణన్ మించఁ బదాంబుజం బొకటిచే క్షోణీస్థలిం గొల్చి యం
బరమార్గంబున నొక్కయంఘ్రి నిడఁ దత్పాదాంబుజాంగుష్ఠశేఖరదివ్యన్నఖరంబు సోఁకి పగిలెన్ కంజాతజాండం బొగిన్.
ఈక్రమంబునఁ ద్రివిక్రమప్రసారితవామచరణాంగుష్ఠనిష్ఠురనఖరశిఖావిఘటితబ్రహ్మాండకరండోపరిపరిజనితరంధ్రనీరంద్రనిరర్గళదనర్గళమధురశిశిరపాండురలఘుతరగురతరప్రభావాభరణబహిరావరణవారిపూర్ణంబు యోగిమనఃకమలసంతతసంచరణంబును లక్ష్మీకుచశాతకుంభపూర్ణకుంభసంభావితనవపల్లవాచరణంబును నగు హరిచరణంబునం దొరంగి తరంగితంబై రథాంగధరపదప్రక్షాళనంబుననభంగురతరప్రభావంబును లోకైకపావనంబును బ్రహ్మహత్యాదిపాపాపనోదకంబు నగుచు నప్పావనోదకంబు కంబుధరచరణాంబుజమరందంబుచందంబున నంబుధరవర్ణపదనఖసాంద్రతరచంద్రికలయందంబున దనుజారిపదంబుదిగజాఱి గగనకాయమానసూనమాలికలపోలికల ముక్తికలకంఠకంఠికాకంఠమాలికలలీల నాలోలవాతూలజాలంబుల బహుధారారూపంబు లై సత్యతపోజనమహస్వర్లోకవాసి బ్రహ్మబ్రహ్మర్షిసనకాదియోగీంద్రవైభ్రాజికధ్రువసప్తర్షిశ్రేష్ఠనందితానందితస్తుతస్నాతాంతర్గృహీతకమండలుపరిపూరితంబైగాయమానగంధర్వగజరాజగామినీగానద్రవన్మహేంద్రనగరచంద్రశాలికాకాంతచంద్రకాంతనిరంతరస్రవజ్జలధారానుగతంబును బరిసరహరిహయపురవరమరకతమణిమయభవనసురుచిరరుచిరచితశైవాలవల్లికావేల్లితంబునువలనిశాటపాటనపటుపుటభేదననాటకశాలికానటనటదప్సరఃకుటిలాలకాపదపుటకరటత్కటకమురజవాదిత్రనాదాచ్ఛాదకవలభిపతనవేళాఘళఘళారావసంకులంబును నందనవనపాదపవిటపసంసక్తనిజసలిలకణద్విగుణితకుసుమజాలకంబును విస్మయాకులప్రేక్షమాణగీర్వాణముగ్ధజలజేక్షణావీక్షణస్నిగ్ధసోసూచ్యమానవలమానమీనవితానంబును నిర్మలభర్మనిర్మితనర్మహర్మ్యప్రాంగణమాణిక్యవితర్ధికాశయాననాయకప్రార్థ్యమానపురుషాయితకేళికాననుకూలలజ్జాకులసభ్రూంగవిలాసవిలోకనోత్తిష్ఠమానమానవతీవేణికాహఠాకర్షణవిశ్లథతతఇతఃపతితసహాగతమౌక్తికసూచకతత్తత్పురుహూతకలధౌతశృంగారసౌధశృంగాహతోత్పతితజలబిందుసందోహకందలితమందారకుసుమకోరకాలంకృతనికటతటకందుకకేళికానందబృందారకసుందరీచికురభారంబును సురచకోరలోచనారతిశ్రమహరణనిపుణతరమందానిలసందానితశైత్యంబును జారణస్తూయమానంబును గిన్నరజేగీయమానంబునునిజావలోకనమాత్రసంత్యక్తబలీకృతహృత్తాపసలీలాహృత్తాపసవిబుధప్రార్థ్యమానంబును నమరావతీపురవరపరిఖాయమానంబును జలకేళికాలోలదివిజకులపాలికాపాళికాకుచపాళికాశ్మీరపాళికామనీయకతదీయసౌర
భ్యఘుమఘుమాయమానంబును శంఖబుద్బుదవజ్రమాక్తికకుముదఫేనఖణ్డకరకాయితతారకావారకంబును నిజనైర్మల్యనిమృష్టనిష్కళంకమృగాంకమణ్డలగళత్సుధారసధారాసధారాసంవర్ధమానంబును ఖంజోపరిభాగీరథీపతనవిస్మితానూరుసారథిస్తవనీయంబును బ్రణయకలహదూరస్థితనిజనీరధారాసిక్తమృదులాంగసంసక్తదుకూలచేలాంతరపరిదృశ్యమానకుచలికుచనితంబబింబరంభోరువిజృంభమాణావలోకనోత్సుకనాయకదత్తనూతనవసనయాచమానవైమానికమానినీజనజనితసీత్కారమానితంబును సవర్షవర్షప్రకర్షనిదర్శకవలాహకపదమోముచ్యమానంబును నసమయసమయన్నిజజలబిందుతుందిలచాతకవ్రాతంబు నగుచుం దెఱగంటిదొరకు వెఱచి తనతనయు వరుణునియింట దాఁచి వెలవెల నగుచు మంచుమలనే మంచుగట్టులకుఁ బట్టంబు గట్టెనని నలుజడ్డిగంబుల బిడ్డ నొడ్డారించి బొడ్డుతామర దొడ్డవేల్పు పుడమిదాల్పులకు నేలికవు గమ్మనికమ్మనికుందనంపుజిగిని దనతేజంబు మెఱయించు జేజేలవిడిపట్టున కభిషేకంబు చేసినతెఱంగునఁ బసిఁడకొండతుదను బదివేలయోజనంబులపఱపున నున్నయన్నలువపట్టణంబునఁ బోరునం దొట్టిపట్టు సాలక నలువ నలుమోములందువెడలునలుతొలిపల్కులనలువున నలువాకిళ్ల నలుదెఱంగులై వస్వోకసారాదిదిక్పాలకపురంబు లొరసికొని వెలువడి తనవడి బెండువడి బెడబెడమని దొరలిపడు పెదపెదగుండ్లచప్పుడుల కులుకుచప్పు డెడనెడఁ బర్వులిడుజంటనలుహజ్జలమెకంబుల నెఱుఁగక తోడంబఱచు తెఱనోరి మెకంబులఁ గాన వెనుదవులుగౌరులతోడ నరుగు మువ్వన్నెమెకంబుల నంటిపాఱు నొంటికాండ్రసందునం బడుదున్నలపిఱుందం జను నెలుఁగులబలగంబునకుఁ జంగుచంగునం దాఁటు కన్నెలేళ్ళ కందంద నడ్డంబగుచుఁ గోనలలోనఁ జిగురువిలుకానికేళిం దేలుచునదరిపాటునం జూచి యదరిపడి లేచి తమతమక్రొత్తముత్తియపుఁజెఱుఁగులచెంగావులఁగటీతటంబుల నొకకొంగు పచ్చినునుగోటితాఁకులం జిలుపచిలుప నెత్తురులు గ్రమ్ము గుత్తంపుకలిగుబ్బచన్నుల నొకకొంగు సవరించి యఱజాఱు క్రొవ్వెదలు పువ్వులవాన గురియఁ గౌను జడియ బెళుకుచూపుల బెగడుకోడెబేడిసలబిత్తఱంపుటూర్పుల మృగనాభిపరిమళంబులు గుప్పళించుచు బలితంబులై మెలఁగు గిలుకుమట్టియలరొదలతోఁ గడలకుం జని మును తాముకడలనిడిన తొడవులం దా లోఁగొనిన నర్పితంబులు సేయు నెయ్యంపుకర్పూరగంధులనేర్పులకు నగుచుఁ దచ్చనలాడు బృందారకకుమారులమందహాసరుచికందళంబులతో సందడించుచుఁ బ్రస్రవణఝర్ఝరనిర్ఝరంబులం బ్రవృద్ధం బగుచుగిరీశాలింగనసంగతకుంకుమపంకంబునఁ బొంకంబగు నకలంకఛాతురాగంబులజాజువారుచుం గమలకల్హారకైరవకువలయకోకనదాదికుసుమసౌరభలోభచంచలచంచరీకచక్రాంగచక్రవాకఝంకారక్రేంకారచంకనత్సరోవరంబులఁ
గళిందకన్యకాసరస్వత్యాదినదుల నెచ్చెలులంబోలెఁ గల్పుకొనుచు వాహంబుతెఱంగునం దుముకుచు వజ్రశైత్యంబునం గొండలుం దెగఁబాఱుచు మతంగజంబు భంగిఁ గర్పూరకదళికాకాంతారంబుల భంగించుచు భూవల్లభుఠేవంబ్రతికూలతరుల నిర్మూలించుచుఁ బతితతరుశాఖల నున్న తమ్ముం జుట్టుకొనుప్రవాహగతసర్పంబులకుత్తుకలు రెండుచేతులం గట్టిగాఁ బట్టికొని బిట్టుల్కిచూడంజాలక మార్మొగంబులు పెట్టు శాఖామృగంబులం గని కిలాకిల నగుచుమార్గగండోపలంబులపై వసియించు చెంచుమించుఁబోఁడుల వెనుకమర్లుగావచ్చి యదరిపాటున భుజంబులువట్టి త్రోయు తెఱంగున వెఱపించు చెంచునాయకుల నదలించుచుఁగడువడి నడరు బెడబెడలకు జడిసి కడలకు నిగుడ నక్కొండగుండులం బడఁదివియుచు దను గనుంగొనిన వినిన నంటిన సీకరములు సోఁకినపైతెమ్మెరలు దొరసినమాత్రంబున భూతప్రేతపిశాచశాకినీఢాకినీకూశ్మాణ్డాదిగ్రహంబులు దమతమవిగ్రహంబులు మాని మానితవైమానికరూపంబులుపూని ధగద్ధగితమణిగణస్థగితకిరీటకటకకేయూరహారాదిసురుచిరాకల్పంబులు కల్పప్రసవదామంబులు కనకాంబరంబులు దివ్యచందనానులేపనంబులురతిమనోహరమనోహరాకారంబులు గలిగి దివ్యతరతేజంబులు నిగుడఁదెగబారెఁడు కీల్జడలుం దొగఱేనినగుమొగంబులు బెగడు బేడిసలంబోలువాలుగన్నులు నిగనిగని జిగిమోవిమానికంబులు మగఱాలనేలుపలువరుస బిగిగుబ్బచన్నులు మృగరాజమధ్యంబులుఁ జిగురుటడుగులుఁ గలిగిచిలుకతేజివజీరుని చిలుకుటమ్ములు ముద్దుఁజిల్కు తెఱగంటిచిల్కలకొలుకులువేనవేలు గొల్వ భాసమానరవికరావమానకరణదురభిమానమణిమయవిమానారూఢులై యచ్చరమచ్చెకంటు లిరుకెలంకుల నకలంకరత్నకంకణక్రేంకారమ్ము లొలయ వింజామరములు వైవ రంజిల్లుచు నంజలిబంధంబులతో నుతులు సేయుచుఁ గొంతదవ్వు వెంబడి నిగిడి దివంబున కరుగ నట్టిక్రమంబుననే నిజసలిలాకృష్టధరాతలపురాజననాంతరపుష్టశరీరనరకనివిష్టదుష్టజనంబులు యమాదుల కాశ్చర్యకరు లగుచుం బుణ్యలోకంబుల కేఁగ సకలపుణ్యనదీనదంబుల దురితావహకీర్తి మూర్తీభవించి తన్నుఁ జేరుతెఱంగున రంగగుచుఁ జక్రాంగంబులువ్రాల నినుం గనుంగొను జనులయందు వసియింపకుండం జేసితి వింక మాకు గతియెయ్యది యని తత్తజ్జనులపాపంబులు రూపంబులు గైకొని తాపంబున మొరలు వెట్టునట్టి తెఱంగున రోలంబజాలంబులు ఝంకారంబులు సేయ నభంగతరతరంగత్వరంగమృదంగరంగధ్వానంబులకుం జెలంగుచు బెళుకుబిత్తఱికోడెబేడిసలు మత్స్యపుటంబులు వైవం బ్రవాహవేగంబునం బెండువడి తోడనడరు పెద్దపెద్దకొండల గండూపలంబుల మెండున నిండుకొనియుండు మకరనక్రగ్రాహకర్కటకాదిజలజంతుసంతానంబులు వెలయం దీరంబుల నిల్చి పుణ్యపురంధ్రీజ
నంబు లెత్తుముత్తెపుటారతులతెఱంగునం జెంగల్వలవలగొను సుడులుంబెడంగుసూప సంపన్ను లగుజనులు భక్తిపూర్వకంబుగా నొసంగుపట్టాంశుక్రమణిభూషణంబులన లోపల వెలికి నడరుమౌక్తికంబుల నిగ్గుల బుగ్గలగ్గలముగ దత్తత్పౌరజనసమర్పితరథదీపంబులకు వెలుంగు లొసంగు ప్రవాహాగతభుజంగపుంగవఫణారమణీయమణిగణప్రభలు పొసంగఁ గమలాంతరకాంతకమలాకాంతాభిషేకంబునకుం బలె జలవేదండషండంబులు దుండంబు లెత్త సరసప్రదేశంబులు నాశుకవితరీతి నతిత్వరితగతి యగుచుంబ్రతిహతస్థలంబుల నభిమానిజనయాచనచందంబున మందంబగుచుఁ గఠినచిత్తులకుం దొలంగి చనుసజ్జనునితెఱంగున గగనంబునకుం దొట్టుగట్టుల కెడగల్గుచుఁ దూర్పున సీతాభిదానంబున నభిరామలీల మెఱయ మేరుకమలకేసరకేసరాచలగంధమాధనవసుంధరాధరభద్రాశ్వవర్షమార్గంబునఁ బశ్చిమంబునఁజక్షువనుపేర లోలమానమీనకటాక్షంబుల సుపర్వాశ్చర్యకరమాల్యవన్మాల్యవద్భూదరకేతుమాలవర్షంబులసరణిని నుత్తరంబున భద్రాఖ్యనుస్మరణశీలభద్రప్రద యగుచు నభ్రంకషశృంగశృంగవత్పర్వతోత్తరకురుదేశపదంబునదక్షిణంబున నలకనందనామధేయంబున వదనారవిందనందన్మిళిందాలకయైగగనసరఃకనకకమలాయమానహేమకూటహేమకూటకుధరభారతవర్షపదవింబ్రవహించి దిక్కూలముద్రుజసముద్రవాతూలలోలకల్లోలకోలాహలం బవార్యతూర్యఘోషంబులై మొరయ నౌర్వాగ్నిసాక్షియై వెలుఁగం బ్రతిరవణద్విజకలకలంబు మంత్రకులంబులై మించఁ గలకంఠికాగానంబులు పెండ్లిపాటలనీటుసూప విష్ణుధారాదత్తయగు గంగానదియుఁ దరంగిణీరమణుండును వేలయనుతెర కిరుగడల నిలిచి బుద్బుదపులకాంకురములు గువలయనయనవికాసంబు గుముదప్రభామందహాసంబునుం జెలువొంద నొండొరులునుం దరంగహస్తంబుల శీకరమౌక్తికంబులం దలఁబ్రాలు వోయుచు నన్యోన్యమానవీక్షణంబులుం దారసిలఁ గలసి జలనికరవీచికాన్వితమౌక్తికవిద్రుమాదిమణిమణ్డితశైవాలవల్లికాకాచమణిరమణీయమంగళసూత్రాలంకృతకంబుకంధరయగుచుఁ బవమానవిప్రకులంబు భృంగాశీర్నినాదంబులతో వేలావనకుసుమకేసరాక్షతంబులు వధూవరులపైఁ జల్లఁ గరకమలభ్రమరమాలికాకౌతుకబంధుండును ఫేనదుకూలచేలుండును బహుళతరరత్నోర్మికాభరణుండునుతటవనతరుచ్యవమానరుచ్యకుసుమవిసరశేఖరుండును నగురత్నాకరవరునకునర్ధాంగలక్ష్మియై యుబ్బించుచు సుఖకేళీవిలాసంబునం జెలంగె నంత.
పద్మలోచనుఁ డెప్పటిబ్రహ్మచారి, వేషమున నున్నఁ గనుఁగొని విప్రజిత్తి
ముఖ్యదైత్యులు దనుజేంద్రు మోసపఱిచి, సిరులు హరియించె హరి యంచుఁ గెరలి యపుడు.
వలదంచుం బలి దెల్పిన న్వినక గర్వస్ఫూర్తి గర్జించుచుంబ్రళయాభ్రప్రభల సరింబొదువ జాగ్రత్ఖడ్గవిద్యుజ్జ్వలజ్వలనజ్వాలిక లాక్రమించె దశదిక్చక్రంబు లొక్కుమ్మడిన్దళమయ్యె న్శరవృష్టితోఁ దొరిగె శస్త్రవ్రాతనిర్ఘాతముల్.
ఆలోనందసునందముఖ్యహరిసైన్యవ్రాతవాతూలముల్తూలించెం దనుజాభ్రజాలములఁ దోడ్తో మాధవానుజ్ఞ నావేళ న్వారుణపాశబంధితునిఁ గావించె న్వదాన్యు న్బలిన్వ్యాళాహారి సమస్తదేవతలు హాహాకారముల్ చేయఁగన్.
కట్టినఁ గట్టుఁగాక హరి కట్టడ చేసినకేలు మున్నుగాఁగట్టక వెన్క నేమిటికిఁ గట్టె విహంగవరేణ్యుఁ డిట్టు లింకెట్టు నమస్కరింతు హరి కే నని కన్నుల మ్రొక్కుఁ గాని యాకట్టున కింతయైనను వికారము సెందఁడు దైత్యుఁ డత్తఱిన్.
ఆయౌదార్యము ధైర్యం, బాయాస్తికబుద్ధిఁ జూచి యౌరా యనుచున్వేయువిధంబుల సన్నుతి, సేయుచుఁ గనుఁగొనిరి దనుజశేఖరు దివిజుల్.
అంతఁ జిఱునవ్వుతోడ మాయావటుండు, దైత్యపతిఁ జేరి యోయి వదాన్యచంద్రయవనిపాదత్రయము నిత్తునంటి వేది, కడమపాదంబునకుఁ జోటు గలదె చెపుమ.
ఇచ్చెదనని యీకున్న, న్వచ్చుం బాపంబు గౌరవం బగు నీ నీయిచ్చ యన న్విని మరుదసు, హృచ్చక్రేశ్వరుఁడు పల్కె నెంతయుభక్తిన్.
లేదన నేటికి నిచ్చెద, నాదుశిరంబునను నిల్పు నళినేక్షణ నీపాదాబ్జము నేనుం బ్రహ్లాదునివలె సుకృతి నగుదు ననుసమయమునన్.
శ్రీదనర న్విశాలకటిసీమ ధరించిన హేమచేలమున్మేదురమేఘమేచకసమిధ్ధచకచ్చకితాంగముం బతంగోదయరంగదంబుజదళోపమలోచనము ల్చెలంగఁ బ్రహ్లాదుఁడు వచ్చె మాఱట విహంగతురంగుని రం గెసంగఁగన్.
వచ్చి తనుఁజూచి బంధంబువలన వినుతి, సేయలేమికి దనలోన సిగ్గుపడుచుఁగన్నుఁగవ నశ్రువులు గ్రమ్మనున్న బలిని, గాంచి హరిఁ జూచి పల్కె నిట్లనుచు నపుడు.
సురపద మేటికి నొసఁగుము, చరణాంబుజభక్తి దైత్యసామ్రాజ్యంబున్హరియించి మేలు చేసితి, కరుణింపుము బంధముక్తుఁగా బలిని హరీ.
అని పల్కుసమయంబున.
వల్లభుఁ డిట్లు కట్టువడువార్త చెవింబడ గుండె జల్లనందల్లడమంది యద్దనుజపత్నియుఁ బల్లవపాణి చెక్కులన్వెల్లువగట్ట నశ్రువులు వెల్వెలఁబోవ మొగంబు నమ్మ నేఁజెల్ల నిదేమియంచు హరిఁ జేరి నమస్కృతి చేసి యిట్లనున్.
నీకుఁ బ్రియముగ దానంబు నెఱపువారు, మోక్ష మందఁగఁ బురుషార్థముల నొసంగునీదుకే ల్కిందు తనకేలు మీఁదు గాఁగ, దాన మొసఁగిన బలికి బంధంబు దగునె.
విడిపింపుము నిను రాజ్యం, బడుగము నీవలయువారి కర్పింపుము మేమడవుల నుండెద మిఁక నీ, యడుగులు మదిఁ దలఁచికొనుచు నార్తశరణ్యా.
అని దైన్యంబున విష్ణుపాదనతయై ప్రార్థించు వింధ్యావళీవనితారత్నముఁ జూచి యేచినదయ న్వాణీమనోనాథుఁ డోవనజా బలిబంధనంబు తగవే వారింపు మన్న న్జగజ్జనకుం డిట్లనియెన్ సుధామధురవాచావీచివాచాలతన్.
ఎవ్వని ననుగ్రహింప నే నిచ్చ నెంతు, వానిసంపద హరియింతు వనజగర్భయటులుగావున బలిభక్తి కాత్మ మెచ్చి, యిటులు గైకొంటి సంపదలెల్ల నేను.
అని పలికి బలి కిట్లనియె.
వినుము విరోచననందన, ఘనుఁడవు నీ వన్నిట జగంబుల నీతోనెనయైన దాత గలఁడే, తనరారితి త్రిభువనైకదాత యనంగన్.
భావిమనువేళ దేవేంద్రపట్టమునను, నిన్ను నిల్పెద నందాఁక నీవు సుతలమందు వసియింపుమనుచుఁ బ్రహ్లాదుఁ గూర్చి, దనుజసేనలతో నంపె దైత్యవిభుని.
కడమయఙ్ఞంబు సమదృష్టి గలిగి నిర్వ, హింపు శుక్ర యటన్న నుపేంద్రుఁ జూచియేకదృష్టిని నే నిర్వహింతు సామి, కరుణచే నంచు పల్కె నాసురగురుండు.
వనజాతాక్షుఁడు మాటమాత్రముననే వైరోచనశ్రీలఁ గైకొని యీరీతి జగజ్జనుల్ పొగడఁగా క్షోణీధరారాతి కిచ్చిన బ్రహ్మాదు లుపేంద్రుగా హరి శుభశ్రీసాంద్రు దేవేంద్రు నింద్రునిగాఁ బట్టము గట్టి రెల్లరకు సంతోషంబు వాటిల్లఁగన్.
అదితియుఁ గశ్యపుఁ డెటువలె, ముద మందిరొ యటులు చెలఁగె ముజ్జగములు నభ్యుదయం బ్రింద్రోపేంద్రులు, పొదలింపఁగఁ గ్లేశలేశమును లేదయ్యెన్.
ఘనగదాదండంబు గైకొని యిందిరాకాంతుఁడు వాకిలి గాఁచియుండఁదనకులోఁగాని యుద్ధతుల యుద్ధతిమాన్చు పనిపట్ల చక్రంబు పంపు సేయ
నేకార్యమునకైన లోకపాలాదికు లనిశంబు దనుబుద్ధియడిగి కొనఁగలలితరూపవిలాసలావణ్యవతులైన కన్యకామణు లూడిగములు సల్ప
స్వర్గలోకంబుకంటెను శతసహస్ర, గుణము లెక్కుడుగాఁ గల్లి ప్రణుతి కెక్కుసుతలమున నేఁడు నున్నవాఁ డతులకీర్తి, చక్రిమతవర్తి బలిదైత్యచక్రవర్తి.
ఇలలోఁ జీఁకటి గల్గఁ దెల్పుదు రదే యిందేల లేదంచు ముగ్ధలు వేఁడం జెలులార మీముఖరుచిం గన్పట్టఁగాలేక కొప్పులలో డాఁగెనటన్నఁ గుంతలసుమంబుల్ దీసి వీక్షారుచిన్నలు పై తోఁపనివే యనం బతి నగున్ దైత్యేంద్రవాసంబునన్.
జలకేలీసమయంబులం గలఁగిపోఁ జక్రంబులం దోలెనోలలనా నీనగుమోము చందురునిలీలం గాచితే యన్న వింతలు వింటింగద చంద్రుఁ డెవ్వఁడొకొ నాథా తెల్పుమంచన్నఁ గెంపులయందంబునఁ దన్ముఖాంబుజముఁ జూపుమ్ వల్లభుం డచ్చటన్.
అతిపాత్రంబగు పద్మనేత్రునకు నత్యౌదార్యలీలాప్తిచేక్షితిదానం బొసఁగ న్బొసంగుబలికిం జేకూరెఁగా కద్దిరాసుతలావాసము గల్గునే యొరులకున్ క్షుద్రప్రదానంబునన్స్తుతవైకుంఠముఁ బాసి యచ్చట వసించుం జక్రి భోగార్థియై.
అఖలసద్వారపాలకుఁ డైనలోక, వల్లభుఁడు ద్వారపాలకవంశజులకుద్వారపాలకుఁ డౌట తద్భక్తిఋణము, దీఱ దేమిచ్చిన నటంచుఁ దెలిసి కాదె.
తమపితామహు లితనికి ద్వారపాలు, రైరి యది పుణ్యమున కింతె యనుచుఁ గొల్వధరణిపాదత్రయ మొసంగి తాను జేసె, వెన్నుఁడున్ బలిమాటకు వన్నెగలుగ.
శ్రీవామనావతారక, థావిభవము విన్నజనుఁడు ధనధాన్యయశశ్రీ వెలయఁగ భువి వర్ధిలి, యావెనుక న్మోక్షలక్ష్మి కధ్యక్షుఁ డగున్.
అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డైజనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెల్పు మని యడుగుటయున్.
జలజాక్షీమణికంకణక్వణనచంచచ్చంచలాచామరచ్చలచక్రాంగగరుద్విచాలనచలాంచచ్చంచరీకచ్చటాకలనాసూచకకుంతలద్యుతితరంగస్మేరవక్త్రాంబుజోజ్జ్వలపత్రాయతనేత్రకోణవిహరత్సౌభాగ్యలక్ష్మీయుతా.
తారకదారక దారక, తారకవిధి దారకాంతి తతయశ కవిబృందారకమందారక బృం, దారకవరవైభవా త్యుదారకళాధ్యా.
మగదలకులవర్యా మందరాహార్యధైర్యాజగదభినుతచర్యా శాశ్వతౌదార్య ర్యానిగమపదవిహారా నీతికార్యానుసారాప్రగుణసుగుణహారా రంగమాంబాకుమారా.
ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాఫ్తదీప్తతరాష్టభాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగనామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతంబైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు పంచమాశ్వాసము.
Comments
Loading comments…