SRI RANGA MAHATTVAMU
A Telugu classic by Bhairava Kavi (15th century A. D.) This volume includes Kavigajankushamu by the same author. Edited by Sri Srirangacharya Lecturer, Sri Venkateswara Oriental College, Palem, Mahabubnagar Dist.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,
హైదరాబాద్-500 004.
ప్రచురణ. 296
ప్రథమ ముద్రణ-1979, ప్రతులు. 1,000
వెల రూ. 14.00
ప్రతులకు:
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,
కళాభవన్, సైఫాబాద్,
హైదరాబాద్-500 004
ముద్రణ:
పద్మావతీ ఆర్ట్ ప్రింటర్స్,
హైదర్‌గూడ, హైదరాబాద్-500 001
Paper Used for the Printing of the book was made available (Partly) by the Government of India at concessional rate
తొలిపలుకు
భాషా పరిణామాన్ని, సాహితీవికాసాన్ని, సాంఘికేతిహాసాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకోవడానికి ప్రాచీనార్వాచీన సారస్వతాన్ని అధ్యయనపరులందరికీ అనువైన పద్ధతిలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రాచీనాంధ్ర కావ్యాలను ముద్రించి సరసమైన ధరలకు లభించే అవకాశాన్ని కల్పిస్తున్నది.
ప్రబోధ చంద్రోదయం, వరహపురాణం, శుకసప్తతి వంటి కావ్యాలను ఇంతవరకు అకాడమీ ప్రచురించింది. ఇప్పుడు భైరవకవి రచించిన శ్రీరంగమహత్త్వమును అందిస్తున్నది. భైరవకవి కృతమయిన కవిగజాంకుశమనే ఛందోగ్రంథాన్ని కూడా దీనితో జతపరచి ముద్రించింది. చాలాకాలం క్రింద మానవల్లి రామకృష్ణకవిగారు శ్రీరంగమహత్త్వమును వెలుగులోనికి తెచ్చిరి. ఇప్పుడీ కావ్యప్రతులు దొరకక పోవడంచేత అకాడమీ ప్రచురణకు పూనుకున్నది.
ఈ కావ్యానికి సంపాదకత్వం వహించి చక్కని పీఠిక నమర్చిన శ్రీ శ్రీరంగాచార్యులుగారికి అకాడమీ ధన్యవాదాలను సమర్పిస్తున్నది.
ఇరివెంటి కృష్ణమూర్తి
హైదరాబాద్కార్యదర్శి.
శ్రీరంగమహత్త్వము
విషయానుక్రమణిక
శ్రీరంగము
పురాణములు-మాహాత్మ్యములు
రాచకొండ సంస్థానము కవి పండితులు
గౌరన-భై రవుల కాల నిర్ణయము
గౌరన రచనల వైశిష్యము
భైరవుని రచనలు
శ్రీరంగమహత్త్వము మరల ముద్రింపబడినదా?
శ్రీరంగమహత్త్వము-కధాసంగ్రహము (తీర్ధదర్శిని జాబితా-22)
సమాలోచన (గద్యపద్యసూచిక -02)
పదప్రయోగములు (సూ.ని.శ్రీరంగ...పదాలు జాబితా- )
పదప్రయోగ విశేషములు
ఛందో విశేషములు (ప్రాసలు- అలంకారాలు జాబితా -)
బంధకవిత్వము
అనుకరణలు
సవరణలు
భైరవకవి బహుముఖప్రజ్ఞ
మరికొన్ని శ్రీరంగమహత్వములు
శ్రీరంగమహత్త్వము
Comments
Loading comments…