అవతారిక
సూర్యశతకము
ఉ. శ్రీపతి శాంకరీపతి శచీపతి వాక్పతి నాకలోక సేనాపతి సుస్వరాపతి వనాటపతి ప్రతికూలకార్య వార్తాపతి గూఢపాత్పతి పతంగపతి ప్రముఖాభిలైకరక్షాపతుల న్మదిం గని త్విషాంపతిఁ బ్రస్తుతి సేయఁబూనితిన్. [1]
చ. కలుగు తెలుంగుకబ్బములు కట్టడిమందలు మంద లిన్ని వందలను గణింప శక్య మగునా? యిక నందుల కేమి యందులోలలితపదార్థ విస్ఫురణలం దనియించు పరోపకార మాన్యులు పదివేల కొక్కఁడుగ నుండును పాత్రులు వారు ప్రస్తుతిన్. [2]
శా. ఔరా ! నోరు రసంబు లూరు పద మాహా ! కోటికిన్ తీరు మజ్ఞారే! రచ్చలఁ జేరుఁ జేరనుచు నిచ్చ ల్పామరు ల్మెచ్చఁగాఁదా రింతేనియు సిగ్గులేక గణికాతండంబులం బోలె పల్దారుల్ ద్రొక్కి పదార్థముల్ గొను కపుల్ పాత్రుల్ గదా నిందకున్. [3]
చ. విలసిత సాహితీ విమలవృక్షముకొమ్మ మయూరనామ సంకులసరఘాళి శుద్ధపదగుంభ సుమాసవ మేఱ్చుు చేర్చినన్కలయఁగఁ గట్టు సూర్యశతకం బను కండెను దాసు రాముఁడన్తెలుఁగునఁ గొట్టి కమ్మనగు తేనియఁ దీసితి దీనిఁ గ్రోలుఁడి! [4]
చ. మును భువి నెంద ఱెందఱు కవుల్ విపులార్థము లెన్ని యెన్ని కల్వనములు నాఁట నాఁట నిరపాయమతిన్ రచియించి మించి రయ్యనుపమ పాండితీచతురులం దొకసాటికిఁ బేటి కంచుఁ గాకనియెద నే నిహార్ధమ పరార్థము భాస్వదనుగ్రహార్థమున్. [5]
Comments
Loading comments…