అశ్వ వర్ణనము
సూర్యశతకము
ఉ. మేరువుమీఁద నున్ననగు మేల్మిశిలల్ నలఁగంగనీక సామీరజవంబుసం దుముకఁబెట్టిన గుర్తులు వేఱె లేమిచేచారుతరార్క కాంతమణిజం బగు వహ్నియ దారి తెల్పఁగామీరిన సూర్యుగుఱ్ఱములు మేలుగ ముజ్జగ మేలు గావుతన్.
తా. మేరు పర్వతము పైనున్న శిలలు నలగకుండ, మహావాయు వేగముతో దుముకుటచే గుర్తులు వేఱె లేకపోగా, సూర్యకాంత శిలలు కరిగి, అందలి ఆగ్నిచే దారి స్పష్టమగుచుండగా పర్యటించు సూర్యాశ్వములు మీకు శోభన మిడుగాక.[44]
ఉ. దగ్గఱ బగ్గునం గిరణతాపము వీపులవేఁప డప్పిమైఁదగ్గక యొక్క నాఁట దివిదారి వడారము దాఁటి వేసటన్
సగ్గుచు గంగ నీర్మెడలు సాచి శిరంబులు వాంచి త్రావుచోజగ్గెకు సప్తసప్తి ఘనసప్తులు మీకు హిత౦బు నేయుతన్.
తా ఒక్కొక్కప్పుడు దగ్గఱగా సూర్యకిరణముల వేడమిచేత వీపులు చుఱుక్కుమనుచుండగా, దప్పిచే నాకాశమార్గము నధిగమించుచు ఆకాశగంగ కనబడగానే మెడలువంచి గంగనీరు త్రాగెడి రవి గుఱ్ఱములు మీకు మేలుచేయుగాక.[45]
చ. పటికపు మానికాల చలపం దమనీడలు వేణె వాజులంచటు నిటు బోవుఁ బ్రొద్దుతిరుఁ గాటినఁ గెంపులఁ జూచి సంజ యంచటమట మెల్లనం జను నొయారపు పచ్చలపట్ల గానరాకిటుల ననూరు మేరుశిఖ నేఁచు నినాశ్వము లేలు మిమ్ములన్.
తా. స్ఫటిక భూములయందు తమ ప్రతిబింబములు చూచుచు నిల్చి అచ్చటచ్చట ప్రొద్దు తిరిగిన ట్లెఱ్ఱని సంజకాంతులను చూచి మెల్లగా నడుచుచు, పచ్చగా నన్న మరకత శిలలమధ్య లీనమగుచు, సూర్య రథసారథియైన యనూరునికి నితిశ్రమ కలిగించు నశ్వ వములు మీకు శ్రేయస్సుల నొసగుత.[46]
చ. ఆహిరిపు నన్న లాగిన నొయారముగం జలియించి పాఱుచున్గుహజననీ సమీపమున గొప్పరథంబు గతిం జవంబుతోడ హరితకాంతితో మఱుఁగు దబ్బలతో నపకార్క నందినీమహిమ వహించు నర్యముని వార్వపుబంతి శుభంబు మీకిడున్.
తా.సూర్యసారథి కళ్లెముులను లాగుచుండగా, ఆకాశగంగ సమీపమున కొంచెము వేగముగా బోవుచు, ముఖములనుండి వెలువడు నురువులు పచ్చని కాంతితో నిండగా, యమునానదివలె నొప్పు సూర్యాశ్వపంక్తి మీకు శుభముల నొసగుగాత [47]
ఉ. దారికి నావ లీవల సుధాంధులు స్వర్గిరి వంగుచు న్నమస్కారము నేయఁ గిన్నరుల కన్యలు సిగ్గున మోము లగ్గుహాద్వారములం దిడంగ నరుణాఖ్యుఁ డదల్చినఁ గాని యించుకంతోర మెడం దినేద్ధయము లూఁదెడి హేషలు దోలు మీకొలల్.
తా. మేరుపర్వతోపాంతముల దేవతలు గిరియందు వంగి నమస్కారమలు చేయగా, కిన్నరీకన్యలు సిగ్గుతో గుహాద్వారములనిల్చి చూచుచుండగా, సారథి కళ్లెములు లాగుచుండినను, మెల్లమెల్లగా నడచు రవి హయములు మీకౌలల నడందుత.(48)
ఉ. తమ రుచిచేతఁ బచ్చనగు తట్లమొగుళ్లను ఱెక్కలొప్పఁ గళ్ళెములను లాగ నెత్తురులు లేచిన నోళ్ళను ముక్కు లొప్ప వ్యోమముననుఁ దుఱ్ఱు మంచు వడిఁ బాఱు సుమేరుశిఖాగచారి కీరము లన నొప్పు సూర్యునిగుఱాలు వరాల సరాలు మీకిడున్.
Comments
Loading comments…