పీఠిక

సూర్యశతకము

"జంభారతీభకుంభోద్భవ దధతం సాంద్రసిందూరరేణుంరక్తస్సిక్తా ఇవమైరుదయ గిరితటే ధాతుధారాద్రవస్యఆయాంత్యాతుల్య కాలం కమలవనరుచే వారుణావిభూత్యైర్భూయాసుర్భానయంతో భువన మభినవాభానవో భానవీయాః

వసురాయడు:శ్రీజంభారికరీంద్ర కు౦భయుగళీ సిందూర శుంభద్రజోరాజవ్యాప్తినొ, ప్రాగహార్యతట నిర్యద్ధాతు ధారాద్రవస్రాజస్రార్ద్రతనో, సరోద్గమ సరోజాభాప్తినో పొల్చు తత్భ్రాజన్నవ్యజగద్విభాసి ఘృణు వైశ్యర్యంబు మీ కిచ్చుతన్.

తూర్పుదిక్కున కధిపతియగు ఇంద్రునియైరావతము కుంభముల నుంచిన సిందూర రేణువులవలెను, ఉదయగిరి నుండి స్రవించుచున్న జేగురు ధారల వలెను, కమలవనము నుండి ప్రకాశమానమగు శోణకాంతివలెను నొప్పు నెఱునైన సూర్యకిరణములు మీకు శ్రేయస్సుల నిచ్చుగాక - అని తాత్పర్యము.

పై వసురాయనిపద్యమంతయు సంస్కృతభాషామయము- మూలమువలె మనకు తెలుగులో నున్నను నర్థము కాదు-అర్థము కాకపోవుట సరికదా, మూలముకన్న కొన్ని యధికముగా, నర్థస్ఫోరకముగాని పదములు యతిప్రాస నిర్బంధమువలన ప్రయుక్తము లైనవి.

వ్యాసమూర్తి శాస్త్రి గారు:చ. తొలుదెస హ త్తికుంభములఁ దోరపుఁ జెందిరపుం న్రజంబునన్ఐలె నుదయాద్రి సానువుల భాసిలు జేగురు టేటివెల్లువన్బలె నపు చొప్పు నంబుజనిభంబలె నెఱ్ఱని డాలు మీఱు వేవెలుఁగు వెలుంగు మీకు శుభవృద్ధి నిరామయసిద్ధిఁ జేయుతన్.

శా.జేజేరాయని కుంభి కుంభగతమౌ సిందూరముల్ తాల్చియోయోజం జేగురుకాంతు లయ్యుదయ శై లోపాంతమం దంటియోరాజీపప్రభ లేకకాలమున ప్రారంభించియో యెఱ్ఱనైతేజుల్ గ్రమ్ము నవార్కఖాను లిడు నెంతే మీకు నైశ్వర్యముల్.

దత్తానందాః ప్రజానాం సముచిత సమయాకృష్ణసృష్టైః పయోభిఃపూర్వాహ్నే విప్రకీర్ణా దిశిదిశి విరమ త్యహ్ని సంహారభాజఃదీప్తాంశోద్దీర్ఘ దుఃఖ ప్రభవభయభయోదన్య దుత్తార నావోగావోవః పావనానాం పరమ పరిమితం ప్రీతి ముత్పాదయంతు.

మ.సమయాకృష్ణ విసృష్ట పుష్కల వయస్సంప్రీతాత్మ ప్రజమ్మమితాఘ ప్రభవర్భవాబ్ధి కలమున న్ప్రా౦చత్సవిత్రోధిరాజము ప్రాహప్రతిదిక్ప్ర కీర్ణము పునస్సాయం నివృత్తమ్ము గోసమజ మర్కజ మిచ్చు మీ కమిత హర్షశ్రీ ప్రకర్షమ్ములన్.

ఉ.కాలమునుం బయస్సులను గాంచి యొసంగి ప్రజాసుఖం బిడున్జాలఁ జరిఁచు ప్రొద్దుట, నికన్ విరమించును, దీర్ఘ దుఃఖజంబాలభవాబ్ధి కోడలు సుమీ రవి గోవులు భవ్యపావనత్వాలము లవ్వి మీకుఁ పరమాధిక తుష్టిని పుష్టి నిచ్చుతన్. 9ప.

మూర్ఖ ద్ర్యెధాతురాగః తరుషు కిసలయో విద్రుమౌఘ స్సముద్రేదిజ్మాతంగో త్తమాంగే ష్వభినవ నిహితస్సాంద్ర సిందూర రేణుసీమ్నివ్యోమ్నశ్చ హేమ్నస్సుర శిఖరి భువో జాయతే యః ప్రకాశఃశోణిమ్నాసౌ ఖరాంశో రుషసి దిశతు కశ్శర్మ శోభైక దేశః. 41 శ్లో.

మ. జలధి న్విద్రుమముల్, ద్రుమాళిఁ జివురుల్ శైలంబునం జేవురుల్బలభిత్కుంభిశిరంబులం దభినవ ప్రత్యగ్ర సిందూర ధూ

ళులు వింటన్వరు వింటిపైఁడి తళుకుల్ శోణద్యుతిన్ భాను డీప్తిలవంబుల్ వఱువాత నేవలి భవత్ప్రీత్యావహం బయ్యెడిన్.

ఇందు వృత్తము పెద్దది యగుటచే, యతి ప్రాసావసర పదప్రయోగము చేయబడినది-మూలమున “హేమ్నస్సుర శిఖరి" అనగా మేరుపర్వతము. శాస్త్రిగారి తెలుగులో "హరువింటి పైఁడి తళుకులు" అని కలదు- ఇట హరువిల్లు అనగా మేరువని యర్థము చేసికోవలెను - త్రిపురాసుర సంహారమున మేరువు శివుని విల్లు పదము ప్రయుక్తమైనపుడు ప్రసిద్ధార్థము వెంటనే స్ఫురింపవలెను-ఇందట్టులేదు. పాఠకుకు పద్యభావము సుగమము గాదు - శ్రీరామ కవిగారు దీనిలోని భావములను చంపకమాలలో నెంత చక్కగా నిమిడ్చినారో చూడుడు.

చ. మలలకు మీఁది జేగురులు, మ్రాఁకులయందుఁ జీవుళ్ళు వార్థిచాయలఁ బగడంబులున్ దేసల హత్తుల నెత్తులఁ జెందిరంపుఁ బూఁతలు దివి మేరు శైలభువిఁ దప్త సువర్ణములైన సూర్య రశ్ముులుదయ కాలశోణములు సొంపులు నింపుల మీకు నింపుతన్.

ఇంకొక యుదాహరణ.

చ."జ్యోత్స్నాంశాకర్ష పాండుద్యుతితిమిరమషీ శేషకల్మాష మీషజ్జృంభోద్భూతేన పింగం సరసిజరజసా సంధ్యయా శోణళోచి:ప్రాతః ప్రారంభకాలే సకలజగ మివ చ్చిత్ర మున్మీలయంతీకాంతిస్తీక్ష్ణోత్విషోక్షాం ముదమపనయతాత్తూలి కేవాతులాం ప.26శ్లో.

తఱిపి వెన్నెలలోని తెలుపు, మిగిలిన చీకటియందు నలుపు తమ్మి మొగ్గల పుప్పొడి పచ్చవర్ణము - పొడుపు సంజయందలి ఎఱ్ఱు రంగు కలిపి చిత్రము వ్రాయు తూలికవలె నున్న - లేతయెండ మీకు సిరు లిచ్చును. దీనికి శ్రీరామకవిగారు -

చ. తెల తెలఁ బాఱు వెన్నెలద్యుతిన్ రవచీకటి నల్లనల్లఁగాఁబలుచని తమ్మి పుప్పొడిని పచ్చదనంబునఁ బ్రొద్దుపోడ్పునంగలననుఁ గెంపుదాయల జగంబులఁ జిత్తరు వ్రాసినట్టి మేల్కల మగు భానుదీపి యతుల ప్రమదం బిడు మీఁదు చూడ్కికిన్.

వ్యగ్రైరగ్యగ్రహోడు గ్రసన గురుభరైర్నో సమగ్రై రుదగ్రైప్రత్యగై రీషదు గ్రై రుదయగిరిగతో గోగణై ర్గౌరయన్గామ్ఉద్గాఢార్చి ర్విలీనామర నగర నగగ్రావ గర్భామివాహ్నామగ్రేయోగ్రే విధత్తే గ్లపయతు గహనం సగ్రహ గ్రామణీర్వః. 98శ్లో

వ్యగ్రము లగ్ర్య సుగ్రహ భహరి గురుల్ సముదగ్రలీలఁ బ్రత్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవుగౌరతాభాగ్రతిఁ బ్రాగ్గిరి న్నిలిచి పాఱ్చి సరాగసురాగగాదినంబగ్రమునందు జేసెడి గ్రహాగ్రణి మీకగు నగ్రగస్థితిస్.

నోజన్వాన్ జన్మభూమిః నతదురభువో బాంధవాః కౌస్తుభార్యాఃపాణా పద్మనయాస్యా నచనరకరిపూరస్థలీ వాసవేశ్మఃతేజోరూపాపరైన త్రిమ భువనతలే ష్వాదధానాం వ్యవస్థాసా శ్రీ శ్రేయాంసి దిశాదశిశిరమహసో మండలా గ్రోద్గతా వః

ఉ. పుట్టదు సంద్రమం దచట బుట్టిన కౌస్తుభ ముఖ్యవస్తువుల్చుట్టలుగావు పద్మమును జూడము చేతుల విష్ణు వక్షమున్ముట్టదు లాతీదే వెలుఁగు ముజ్జగమందు వ్యవస్థ లేర్పడన్బుట్టెను మండలాగ్రమునఁ బూషున కా సిరి మీకు మేలిడున్. 43ప

ధున్వంతో నీరాదాళీః నిజరుచిరచిరాః పార్శ్వయో పక్షతుల్యాసాలూత్తా నైః ఖలీనై ఖచితరుబా శ్చ్యోతతా లోహితేనఉడ్డీయేవ వ్రజంతో వియతి జనవళా దర్కవాహా క్రియాసఃక్షేమం హేమాద్రిహృద్య ద్రుమశిఖరశిరశ్రేణి శాఖాశుకావః. 49శ్లో.

చ. తమరుచిచేత పచ్చనగు తట్ల మొగుళ్ళను ఱెక్క లొప్పఁ గళ్ళెములను లాగ నెత్తురులు లేచిన నోళ్ళకు ముక్కు లోప్ప వ్యోమమునను దుఱ్ఱు మంచు వడిఁ బాఱు సుమేరుశిఖాగచారి కీరము లన నొప్పు సూర్యుని గుఱాలు వరాలు సరాలు మీ కిడున్. 49ప.

పౌర స్త్యస్తోయదర్తో పవన ఇవ పతన్ పావక స్యే మధూమోవిశ్వస్యేవాదిసర్గః ప్రణవ ఇవ పరం పావనో వేదరా శే|సంధ్యా నృత్యోత్సవేచ్ఛోరివ మదనరిపుర్నంది నాందీనినాదఃసౌరస్యాగ్రేసుఖం తో వితరతు వినతానందన స్యందనస్య.55శ్లో.

వానకుఁ దూర్పుగాలివలెఁ బావకకీలకు ధూమమట్లు లోకానకు నాదిసృష్టి గతిగా శ్రుతిరాశికి నోంకృతి స్థితిన్భానుని గ్రుంకునందు నటనం బిడు శూలికి నంది నాందిలానై నళినాప్తుతేర్నడపు నవ్వినతాత్మజుఁ డేలు మిమ్ములన్. 55 శ్లో.

నఁతుంనా కాలయానా మనిక ముపయతాం పద్ధతి పంక్తిరేపక్షోదో నక్షత్రరాశే రకృశరయమిళ చ్చక్రపిష్టస్య ధూళిఃహేషాహ్రాదో హరీణాం సురశిఖరిదరీః పూరయ న్నేమినాదోయస్యావాత్తీవ్రభానో స దివి భువి యథా వ్యక్తచిహ్నేరథోవః. 69శ్లో .

ఉ. మ్రోక్కగవచ్చు దేవగణముఖ్యుల చాలది త్రోవ గాఁగ నాచుక్కలు చక్రఘట్టనను జూర్ణముగా నది దుమ్ముగాఁగ బల్నెక్కొను వాజి హేష దివి నిండిన నేమి రవఁబు గాఁగ మిన్న క్కు తలంబు బోలఁగ నొనర్చిన యర్కురథంబు మీ కగున్. 69ప.

చక్షుర్ధక్ష ద్విషోయం న తు దహతి పరం పూరయత్యేవ కామంనాస్తం జుష్టం మరుద్భిర్యదిహని యామినా యానపాత్రం భవాబ్దేయ ద్వీతశ్రాంతి శశ్వత్ భ్రమతి జగతాం భ్రాంతిమత్ భ్రాంతిహన్తిబ్రధ్నస్యావ్యా ద్విరుద్ధక్రియ మపి విహితాధాయి తన్మండలంవః. 80శ్లో.

చ. పురహరునేత్ర మయ్యు నెఱపు న్నిరవద్యతఁ రామపూర్తి సంసరణ సముద్రనావ యయి జౌకదు గాలికి నెల్ల వేళలందిరిగియు నభ్రమంబు జగతిం భ్రమనాళి విరుద్ధకార్యమైసరసము సూర్యమండలము శాశ్వతసౌఖ్యము మీకు నిచ్చుతన్. 80 ప.

దేవః కిం బాంధవస్యాత్ ప్రియ సుహృదథవాచార్య ఆహోస్వీదర్యోరక్షా చక్షుర్నిదీపో గురుయుత జనకం జీవితం బీజమోజఃఏవం నిర్ణీయతే యః కి మపి న జగతాం సర్వదా సర్వదోసౌసర్వాకారోపకారీ దిశతు దశశతాభీశు రభ్యర్హితం వః. 100 శ్లో.

ఉ. చుట్టము పక్కముం గురువు చూపును గాపును జ్ఞాతి జ్యోతియున్పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియుఁ దండ్రియున్ సదాపెట్టని కోటయై సకల పృథ్వికి నన్నము నీళ్ళు నిచ్చుచున్దిట్టవు వెల్లులం దనరు దేవుడు మీ కిడు వాంఛితంబులన్.100 ప.

Comments

Loading comments…