రవి వర్ణనము

సూర్యశతకము

చ. శ్రితవిధులై బుధుల్ క్రుతుల సిద్దులు గీతిని సౌరగాతలున్జతురతఁ జాటు గర్భముగఁ జారణులు న్యతబుద్ధియాతుధానతతి ముహుర్ముహుర్నతిఘనాహులు సార్ఘ్యము సాధ్యులున్ మహావ్రతనియతిన్ ముముక్షువులు పక్షతఁ గొల్చు నవాద్రి మీకగున్.

తా. సిద్ధులు సిద్ధాంతవాక్యముల చేతను, విబుధులు వేదవాక్యముల చేతను, చారణులు చాటువుల చేతను, గంధర్వులు గీతముల చేతను, బ్రాహ్మణులు ప్రాతఃకాలమున అర్ఘ్యములతోడను, రాక్షసులు మనోనిగ్రహముతోడను నెవని స్తుతింతురో అట్టి సూర్యుడు మీ యఘముల నడగార్చు గాక.[81]

ఉ. చెంగట నంగుగా వెలుఁగు చిచ్చులకొల్మినిఁ గాచి కాచి వెట్టం గతిమ త్తురంగ ఖురటంకముల న్వడిఁ గోసి కోసి నిస్సంగ రథాంగసంభ్రమ లసన్నికషాప్తిని గీసి గీసి ముబ్భంగుల మేరువుం దిరిగి వన్నియగట్టు నినుండు మీ కగున్.

తా. బంగారము పరీక్షించుటకు మూడు విధములు గలవు. 1.పుటము పెట్టుట 2) కొంచెము ఖండించి పరీక్షించుట 3) ఆకురాతి యొరపిడి.ఎవని కిరణముల తీవ్రతచే. బంగారు పర్వతము (మేరు పర్వతము - సూర్యుడు దానిచుట్టు పర్యటించును.) పుటము పెట్టినట్లయినదై, రథాశ్వముల గొరిజల తాకుడుచే, పైకి పెట్లుచున్న ముక్కలు గలదై రథచక్రముల యొరపిడి - యను మూడు పరీక్షలకు లోనగుచున్నదో అట్టి రవి మీకు నభ్యుదయములు ప్రసాదించు గాత.[82]

ఉ. బంగరుతమ్మి గంగఁ బ్రతిభం గనువాడదు నందనంబునన్దుంగు సుమాళిలక్ష్మి కడు దోడదు నెండదు మేరుశృంగముల్

రంగు లెసంగుగాని చెదరంగఁ గరంగవు సత్కృపాప్తి నిబ్బంగిని మార్దవంబు గలభాగ్య మహమ్ము వినుండు మీకగున్.

తా. చాల వేడి గలవియయ్యు సూర్యకిరణము లాకాశగంగ నీటిని నింకజేయవు సరికదా, అందలి కమలములను వికసింప జేయును, అట్లే చెక్కు చెదరకుండ నందనోద్యాసమును ప్రకాశింప జేయును - మేరుగిరి బంగారు శృంగములు నెవ్వని తెల్లనైన కాంతిచేత తెల్లబడవో అట్టి సూర్యుడు మీ కాయుర్భాగ్యము ప్రసాదించుగాక.[83]

ఉ. చీకటి నొక్కదానిన గ్రసింపదు కల్మష కిల్బిషంబులన్నూకునుఁ దమ్మిమాత్రమ వినోది నొనర్పదు భక్తబోధనశ్రీకము కేవల మ్మహిమ చేయదు శ్రేయముగూర్చు మద్యమంబేకము పూనియుం బనులనేకము నేయు నినుండు మీ కగున్.

తా. ఎవ్వడు కేవలము చీకటిని నశింప జేయుటయే గాక పాపములను పోగొట్టుచున్నాడో, ఎవడు కిరణముల తాకుడు వలన, తామరులను కాంతిమంతము చేయుటయే గాక తనయడుగు దామరల మ్రొక్కు వారిని తేజోవంతులుగా జేయుచున్నాడో, ఎవడు, పగటికి కర్తయగుటయే గాక, మోక్షమునకు కర్త యగుచున్నాడో, ఆ భానుడు, మీకు, నిరంతర శుభములు చేకూర్చుగాక.[84]

చ. పరవశవృత్తి చెయ్వుడిగి ప్రక్కలఁ బండి నివాళ నూర్చి యేదరిఁ గనఁ జీఁకటై నెగులు దాల్చినయట్లు జగంబుఁ జేయుచున్మఱియొక లోక మభ్యుదయమాన్యము సేయఁగఁబోవునట్టి భాస్కరుఁడు శుభక్రియాకలన సంతసము న్మిముఁ బ్రోచుఁ గావుతన్.

చ. నిలుకడలేదు లోకగతి నిల్చునుఁ దత్పరిపాలనంబునన్వెలుఁగున లోకదృష్టి మిఱుమిట్లగు లోపలిదృష్టి మే లగున్బలితపు లోకతాపమగు మౌనుల నిర్వృతి కారణం బగున్లలి నిటుఁ బ్రాగ్దిశాధికవిలాసుఁడు భానుఁడు మీకు మేలిడున్.

తా. ప్రపంచమున కంతకు కాంతిని ప్రసాదించుటకు నాతడు తిరుగుచునే యుండును - కాని స్థిరముగా నుండును. జనులు చూచుటకు దుర్నిరీష్యుడుగా నుండును కాని, భద్రములను గలిగించును. అతడు మనుజులను తపింప జేయును, అయినను ముక్తి నిచ్చును. అట్టి సూర్యుడు మీకు సంపద లొసంగు [86]

ఉ. కాలము దప్పవాఱయిన కాఱులు పండు సువృష్టిఁ జేలు దేవాళి మఘంబులం దనియు నప్పవమానుఁడు వీఁచుఁ జుక్కలున్దూలవు, మోచు నద్రు లిలఁ గోయధిమేరను మీఱ దాశలున్మేలగు నిట్లు ముజ్జగము నిల్పు దివాకరుఁ డేలు మిమ్ములన్.

తా. ఋతువులు తప్పక క్రమముగా వర్తిల్లును - వానలు సకాలమున వర్షించును - దిక్కులు చెక్కు చెదరక నిలచును - కులపర్వతములు కదలక యుండును - ఇట్లు ముల్లోకములను స్థిరముగా నిలిపిన తీవ్రాంకుడు మీకు తేజస్సు నొసగు గాత.[87]

ఉ. చక్కనిచుక్కఁ బ్రక్క నిడి శంభుఁడు గ్రుమ్మంబు వెండి కొండపైనక్కడలి న్మురారి యహియందు సుఖంబుగ నిద్రబోవు దానక్కమలాసనుండు దినమంతయుఁ జీత్తనిరోధ మూనుఁ బెంపెక్క నితండు ముజ్జగమునేలఁగ నీ రవి మిమ్ముఁ బ్రోచుతన్.

ఉ. బింబము ఋక్కులై, లసదభీశులు సామములై యణుస్థితిన్బింబము నొందువాఁడు మహనీయయజుశ్రుతియై త్రయీమయాడంబరమూర్తి యంచు నెదుటంబడి వైదికులెల్ల మ్రొక్క స్వర్గం బపవర్గ మిచ్చు గ్రహరా జొసగున్ సిరి మీకు నిత్యమున్.

తా. సూర్యబింబము ఋగ్వేదము - కాంతి సామవేదము, సూర్యమండలాంతస్థుడైన పురుషుడు యజుర్వేదము. ఇట్లు త్రయీమూర్తియై స్వర్గాపవర్గములను ప్రాణికోటిని కటాక్షించు సూర్యుడు మిమ్ములను రక్షించుగాత.[89]

శా. అయ్యల్ లోకహితప్రచారులు సురేంద్రాదుల్ సుతుల్ దైత్యులున్వ్రయ్యల్ నేసిన జోదు లయ్యదితి కెవ్వారున్న మౌనివ్రజంబయ్యాదిత్యపదంబు వీని కగుఁగా కంచు న్నుతుల్ సేయు నక్షయ్యప్రాభపుఁ డైన సూర్యుఁడు సమస్తశ్రీలు మీకిచ్చుతన్.

తా. అదితి సంతానమగు దేవతలందఱు నెవని సేవించి సూర్యుడాదిత్యుడను శబ్దమను సార్థకము చేయుదురో సమస్త మునిగణము నెవని సంతతము స్తుతించుచుండునో, అట్టి సూర్యుడు మీకు శుభ ప్రారంభముల్గూర్చుగాక.[90]

చ. వెలుఁగున మంటిమేలిమియు వృష్టిజలాకృతి సంస్కృతి న్మహానిల తనువుష్టిమన్ జగతి నిప్పుమెయిన్ మదిఁ గోర్కెలిచ్చి యుజ్జ్వలలితమూర్తి యున్కి మినుచాయయు దర్శనుఁ జంద్రురూపు నిట్లలరి స్వమూర్తితో నెనిమిదౌ శివలీలల ప్రొద్దు మీ కగున్.

చ. లలిత నవ ప్రఫుల్ల కమలాకరభూషణ పాదళోభియైదల మగు భక్తి మింట వినతాసుతుఁ డర్మిలి దారితోడుగానెలమిని యేడుగుజ్జముల యెక్కుడు లోకముమీఁది దేవతల్‌గొలువ మురారి పాటి నెసగుం గమలాప్తండు మిమ్ము బ్రోచుతన్‌.

తా. విష్ణుమూర్తి గరుత్మంతు నెక్కి స్పప్తలోకములు పర్యటించునట్లుగాగరుత్మంతుని సోదరుడైన అనూరుడు రథసారథిగా ఏడు గుజ్జములతో నేడు లోకములను, రెండవ విష్ణవువోలె సంచరించు సూర్యుడు మీకు శుభము లధికముగా నిచ్చుగాత. [92]

చ. కమలము లుద్భవం బొసఁగు కారణమై యచలోదయ్యప్రధాన మయిన ముజ్జగంబుపయినం గల ధామము దుర్గమంబుగానమరఁ (బ్రసన్నకాంతి జతురాస్యత రెండవబ్రహ్మయో యనంవిమలతరాత్మభూతి గల వే వెలుఁ గిచ్చును మీకు సిద్దులున్.

తా. ఎవడు (బహ్మవలె, భూర్చువస్వర్గలోకములకు పైగా తేజముతో నిండియండునో, ఎవడు (బహ్మవలె (పతిదినము సృష్టి యొనర్చునో, (బహ్ నాలుగు మట్లు తన కాంతులను నలుదిశలను (పసరింపజేయునో, అట్టి రెండవ బ్రహ్మ యైన కమల మిత్రుడగు సూర్యుడు మీ కానందామీదుగాక మీ కానంద మిడుగాత.[93]

చ.మలలిలయుం దిశల్ జలధిపాళి బయల్ కనులన్ మెలంచి వేల్చుల నిలయంబునం దులనము ల్తలసూపని వేవెలుంగు నిమ్ముల విలయంబునందె నలుమూళ్ల్ళయొడళ్లఁ జెలంగి పాపబువ్వలు గల వేలుపన్న రథసాలునిఁ జేయు నినుండు మీ కగున్.

చ. కొలను నదంబు వాగు లలుగుల్ గల చెఱ్వులు తీర్థభావముగ్‌దొలఁగు పయోధినీటఁ బడ(ద్రోచు నమంగళ మార్చలేదు వేల్ప్బుల నది స్నాతులం బరమపుణ్యులఁ జేయదుగాదె యన్యలోకుల నితఁ డేలఁ టోవ సురకుంజరుఁ డిట్టి యినుండు మీకగున్.

తా. ఎవ డుదయింపనియెడల సకల నదీనదములు, వాగులు, మడుగులు, కోనేళ్లు, వీనియందలి నీళ్ళు పుణ్యఫల ప్రదములుగాక వ్యగ్థమగునో, ఆకాళగంగలో నీళ్ళనైతము, తమలో మునిగిన వాని పాపమును బోగొట్టలేవో అట్టి నూర్యభగవానుడు మీకు శుభముల నొసగుగాత. [95]

చ. భువన మథోగతిం బుఱద మున్గినయట్లు తమంబు మూగుచోనవగతి లేక జ్ఞానము వియత్సుమమై గుఱుతేది కూర్కు నర్గ విధికిఁ బూర్వమట్లు (ప్రతి రాతిరి తన్నెడఁ బాయు లోకమున్దవిలి యొనర్చునట్టి శని తండ్రి సుఖంబులు మీకు నిచ్చుతన్.

తా. ఎవని యుదయము లేకపోయిన- సమ స్తలోకములు, పాతాళము వఱకు వ్యాపించిన చీకటియందు మునిగిపోవునో, ఎవడు నిద్రావస్థయందున్న సకల జగములను మేల్కొల్పజేసి, సృష్టి సమానోదయుడగునో, అనగా సృష్టితోనే యదయించునో ఆ నూర్యుడు మిమ్ము రక్షించుగాత రగ [96]

ఉ. ఇక్కడి పశ్చిమా(ద్రి నిజమెంచిన నక్కడి తూర్చుకొండ యౌనిక్కడ పండువెన్నెల పయింబడ నక్కడ నెండ మెండగున్.

జిక్కఁడు దేశకాలముల చేతికి వానిన లోఁగొనున్ సదాయిక్కతనం ద్రిలోకహితుఁ డౌ నుతుఁ డా తపనుండు మీకగున్.

తా. ఒక ద్వీపమున నెండ కాయుచుండగా, మఱియొక ద్వీపమున వెన్నెల కాయుచుండును. దేశ కాలములు సంధ్యాద్యవస్థా విశేషములు, ఎవనికి వశమైనవో, ఎవుడు తన పాలనా సామర్థ్యముచేత లోకమునకంతకు హితము గావించునో అట్టి సూర్యుడు మీ కహరహము శోభనల నొసగును.[97]

ఉ. వ్యగ్రము లగ్యసుగ్రహభహారిగురుల్' సముదగ్రలీలఁ బ్రత్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవు గౌరతాభాగ్రతిఁ బ్రాగ్గిరి న్నిలచి ప్రాచీ సరాగసురాగగా, దినంబగ్రమునందుఁ జేసెడి గ్రహాగ్రణి మీ కగు నగ్రగస్థితిన్.

తా. ప్రాతశ్శైలమున నుదయించి, వడివడిగా లోకముల నెల్ల పర్యటించుచు, చంద్రాది గ్రహములను వెలవెల బాఱజేయుచు, మేరుగిరి శిలలకు పసుపువన్నె నాపాదించుచు జగచ్ఛ్రేయము గలిగించి, ఎవ డేకైకముగా వెలుగొందుచున్నాడో, అట్టి గ్రహరాజగు సూర్యుడు ఘోరమగు మీ పాపములను రూపుమాపుత.[98]

ఉ. వేదగురుండు పద్మజుఁడు విష్ణుఁ డజేయుఁడు శూలి శంభుఁడున్శ్రీదుఁడు యక్షుఁ డయ్యముఁడు మృత్యువు పావకుఁ డగ్నిమంచు డిద్ధాదిపదంబు లట్లని సుధాంధులకుం బడెనంచు నామ మర్యాదలు సార్థకంబుగఁ దనంత వహించిన ప్రొద్దు మీకగున్.

చ. చుట్టము పక్కముం గురువు చూపును గావును జ్ఞాతి జ్యోతియుస్పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియుఁ దండ్రియున్ సదాపెట్టనికోటయై సకల పృథ్వికి నన్నము నీళ్లు నిచ్చుచున్దిట్టపు వెల్గులం దనరు దేవుఁడు మీకిడు వాంఛితంబులన్.

తా. దైవమో, గురుడో, తండ్రియో, స్నేహితుడో, చుట్టమో, కనువెలుగో, రక్షక్షడో యని పరిపరి విధములుగా నేవని సర్వజనులు భావింతురో, అట్టి సర్వాకాలోపకారి యగు సూర్యుడు మిమ్మును నిరంతరము బ్రోచుగాక.[100]

చ. నలుబదిమూఁట, నాఱిఁ ట, గనం బది రెంటనుఁ బద్నకొంట బెంవలరఁగ నెన్మిదింట, నిరు పంక్తుల తేజము వాజులున్ హయమ్ముల నదలించువాని రథమున్ ఘనబింబము సూర్యదేవునిన్దెలియగ నమ్మయూరుఁడు నుతించిన శ్లోకళతమ్ము మీరగున్.

చ. పొలుపుగఁజేసె లోకహితబుద్ధి మయూరుఁడు సూఱుల్లోకముల్చెలువగు భ క్తితోఁ బఠన చేసిన పుణ్యుఁడు ముక్తపాపుఁడైబలధిషణాయువుల్ చదువు భాగ్యము సత్కవితార్థ పుత్రభాక్కలన నరోగతామహిమఁగాంచును సూర్యుననుగ్రహంబునన్.

Comments

Loading comments…