అష్టమాంకము

వరవిక్రయము

గీ. రోగి చావనీ బ్రతుకనీ రొక్క మెటులొలాగ జూచును వైద్యుఁడు లాఘవముగవ్యాజ్య మోడనీ గెల్వనీ వాటమెఱిఁగిపిండుకొనఁజూచు ప్లీడరు ఫీజు ముందె!

గీ. రాట్నపుం జక్ర మిటు లహోరాత్రములునుగాలచక్రంబు కైవడిఁ గదిలెనేనివిష్ణుచక్రంబువలె క్షామ విదళనంబుచేసి, భూచక్రమెల్లను జెతనిడదె!

గీ. పరులకుం దాస్య మొనరించి పరువు మాలిబ్రతుక జూచుటకంటెను బస్తు మేలు,సరస మెఱుఁగనివారితో జగడమాడికోర్టు కెక్కుటకంటెను గొఱత మేలు?

ఉ. గట్టిగ నిన్నె నమ్ముకొని కష్టము లోర్చినవారి నేరి చేపట్టి భరించు కేవల కృపామయమూర్తి వటంచు నెట్టనంబట్టితి నీదు పాదములు, బాలను, బేలను, దీనురాల నన్నెట్టులు తేల్చెదో! తరుణ మియ్యది యే సుమి డాయ వచ్చెడున్‌.

Comments

Loading comments…