తృతీయాంకము

వరవిక్రయము

చ. ధనమె ప్రధాన భూతముగ దంతము లూడినవానికేనియుం దనయలఁగట్టిపెట్టు తలిదండ్రులు హెచ్చగుచున్న ఇట్టి దుర్దినములలోన,నింతిగ, ధ రిత్రియిం జనియించుకంటె నిర్జన వనవాటిలో, నజగరంబుగ నేని జయింపఁగా దగున్‌!

సీ. నగపేరు చెప్పిన నవ్వులఁ బుచ్చునుకోకలు కొనుమన్న గొల్లుమనునుపొత్తంబు దెమ్మన విత్తంబు లేదనుఁగాగిత మడిగినఁ గాక పడునువిడియ మొనర్చిన విసవిసలాడునుకాని పూవును గొన్న కస్సుమనునువ్రత మొనర్చెద నన వలవల యేడ్చునుముష్టి పెట్టిన నెత్తి మొత్తుకొనును

పండుగకు పబ్బమునకై బిండి వంటమాట యెత్తిన బగ్గున మండిపడును

కటకటా! యిట్టి మగనితోఁ గాపురంబుసలుప శక్యమె యెంతటి సాధ్వికైన?

సీ. జడవైచుకొన సాని పడుచువఁటే యమఁజీరగట్టిన షోకు మీరె ననునువంటవానిం బిల్వ వెంట నేతెంచునుపోలితో మాటాడఁ బొంచి వినునుచదివిన వ్రాసిన జగడమాడును, దొడ్డిలోని కేగిన నను మానపడునుగడపదాఁటిన, వెన్కఁగొడుకు నంపించునుబాడిన సతి కిది కూడదనును

ఇంటికెవరైన వచ్చిన వెంటబడును,తగునె యీ చేష్ట లన పెంకి దాన వనునుకటకటా! యిట్టిమగనితోఁ గాపురంబుసలుప శక్యమె యెంతటి సాధ్వికైన?

సీ. పుడకలుం బిడుకలు బోషాణమున దాఁచియెట్ట కేలకు లెక్క పెట్టియిచ్చుఉప్పును బప్పుఁదా నుండెడు గదినుంచితులముల చొప్పునఁ చూచిఁ యిచ్చుపెరటికూరల నెల్లఁ బెరవారి కమ్మించియేర్చి చచ్చుం బుచ్చు నింటికిచ్చువండినదెల్లఁ దా వడ్డించుకొని మెక్కిమిగతవారల కంట్లు - మిగులనిచ్చు

తిరుగుచుండగనే యింటి దీప మార్చుఁబలుకుచుండఁగనే గొంతు పగుల నార్చుఁగటగటా? యిట్టి మగనితోఁ గాఁపురంబుసలుప శక్యమె యెంతటి సాధ్వికైన!

గీ. విద్యయు, వయస్సు, పరువును విడిచిపెట్టిభాగ్య మొక్కటియే చూచి బడుగు పిసినిగొట్టు పీన్గునకుం దన కూఁతు నిచ్చుతల్లి కుత్తుక తరిగినఁ దప్పు గలదె!

సీ. ప్రాయకంబుగ బెట్టు పాఁతువాఁ డొక్కడువరుసఁ బండ్లను మెక్కు -వాఁడొకండు

కష్టపడి గృహంబు గట్టువాఁడొక్కఁడువసతిగ నివసించు వాఁడొకండుఆస్తికై వ్యాజ్యంబు లాడువాఁడొక్కఁడువచ్చిన నది మ్రింగువాఁడొకండుకోరి ముండను బెట్టు కొనెడివాఁడొకండువలపుకాఁడై పొందు వాఁడొకండు

అట్లె, ధనము కూర్చు నిట్టివాఁ డొక్కండువడిగఁదగులబెట్టు -వాఁడొకండుఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టినలీలగాదు దీని కేల గోల?

గీ. సంపద మహత్వ మెరుగని చవట బ్రహ్మచావు లేకుండగా నేని సలుప డయ్యెచచ్చునప్పుడు వెను వెంట సకలధనముతీసికొనిపోవు విధమేని తెలుపడయ్యె. (తెరపడును.)

గీ. పేకల నోకులం బాడు వీఁక నడి బజారులో గుడ్డలం బాడు సరణి; పెండ్లికొడుకు నిటు మధ్య నిడి, కసి గొన్న యట్లువేలముం బాడు టెన్నఁడు యెరుంగ !

Comments

Loading comments…