ప్రథమాంకము

వరవిక్రయము

చ. సాలున కిరువదికోట్ల రూప్యములు - సంపాదించెడు వారికె గాకమేలి చేతిపనులు మాపుకొని - మేటి బానిసలమైన వెనుక,చరకా॥పాటవమగు సామ్రాజ్యముఁ గూర్చున్‌ - పరిమితి లేని ధనంబునుజేర్చున్‌ కాటక రాకాసిని బరిమార్చున్‌ సాటిలేని యొక జాతి నొనర్చెన్‌. చర.

గీ.కన్య నొక్కరి కొసఁగి స-ద్గతులు గాంతుమనుచు సంతోషపడు కాల - మంతరించి,

కట్నములు పోయఁ జాలక - కన్య నేలకంటిమా యని వ్యథపడు - కాల మొదవె!

గీ. కార్యమగుదాఁక నయ్యయో! - కాకపోయెననుచుఁ దపియించు రేపవ - లాత్మలోన;కార్యమగునంత బిడ్డ నెక్కరిణి విడిచియుండనోపుదు నని దిగు-లొందు మదిని.

మ. చెడెధర్మంబు నశించెనీతి! హరియించెం బూర్వమర్యాద! లంగడిఁ గూరాకు విధాన, వేలమునఁ జొక్కా టోపీ పాగాల కైవడి సంతం బశువట్లు పెండ్లికొడుకున్‌ వ్యాపార మార్గంబునంబడయంగావలె ద్రవ్యముం గురిసి దైవంబైననేఁ డిమ్మహిన్‌.

మ. పనిలేదంట కులంబుతోఁ, బడుచు రూపజ్ఞాన సంపత్తితోఁబని లేదంట ప్రతిష్ఠతోఁ బరువుతో బంధుప్రమేయంబుతోఁగనకంబున్‌, మృదులాంబరంబులును శుల్కంభ న్సమర్పించి, లాంఛనముల్‌ దండిగ ముట్టఁజెప్పుటె యవశ్యంబంట సంబంధికిన్‌!(అని యనుకొనుచు ముందునకు నడుచును.)

సీ. కంటిలోఁ బడు మశకంబు చందంబుననరములపై లేచు కురుపు పోల్కి

తద్దయుఁ గదిలిన దంతంబు చాట్పునమారువాడీ యప్పు మాదిరిగనుపలుసందులం జిక్కు పడిన పీచు విధానబెట్ట చెప్పులలోని బెడ్డ పగిదికుత్తుకం బడు నాకు కుట్టు పుల్లం బలెపుట్టంబులఁ జొచ్చిన పూతిక గతి

ప్రతినిమేషము బిడ్డల పరిణయంపుఁజింత వేధించునపు డన్య చింత యేడ!యీడువచ్చిన కన్నియ లింటఁ గలుగుతండ్రి దురవస్థ తెలియును దైవమునకే!

సీ. నీటైన యింగ్లీషు మోటారు సైకిలుకొనిపెట్టవలెనను కూళ యొకఁడురిష్టువాచియు, గోల్డురింగును, బూట్సునుసూట్లుఁ గావలెనను శుంఠ యొకఁడుబియ్యేబియల్ వఱకయ్యెడి కర్చు భరింపవలె నను దరిద్రుఁ డొకఁడుభార్యతోడను జెన్నపట్టణంబున నుంచిచదివింపవలె నను చవట యొకఁడు

సీమచదువు చాల సింపిలు నన్నటకంపవలయు ననెడి యజ్ఞుఁ డొకఁడుఇట్లు కొసరుక్రింద నిష్టార్థములు వరుల్‌దెలుపుచున్న వారు తెల్లముగను!

సీ. పంచాద్రి క్రాపింగు ప్రక్క పాపిడి జూలులేనివాఁడు ధరిత్రి లేనిఁవాడుకాఫీహోటళ్ళును, ఖాతాలు, బిల్లులులేనివాఁడు ధరిత్రి లేనిఁవాడుసిగరెట్లు, బీడీలు, చెక్కిటి ఖిల్లీలులేనివాఁడు ధరిత్రి లేనిఁవాడుచలువ యద్దములు, సైకిలుకట్టు పెడగోచిలేనివాఁడు ధరిత్రి - లేనిఁవాడుతనదు తలమించినట్టి వృధావ్యయంబులేనివాఁడు ధరిత్రిలో లేనిఁవాడుఇట్టులున్నారు విద్యార్థు లిప్పు డక్కడక్క డొకరిద్ద రెవ్వరో - దక్క సుదతి!

సీ. చదువులు మాని స్వేచ్ఛగ దేశభటకు లైనట్టివారికి లేరె యాడుఁవారురాచఠీవుల నెట్టి రాట్నముల్‌ చేఁపట్టినట్టివారికి లేరె యాడుఁవారు

వృత్తులు రోసి, సంపత్తు లర్పణచేసినట్టివారికి లేరె యాడుఁవారుభోగముల్‌ వీడి, కారాగారముల మాడినట్టివారికి లేరె యాడుఁవారు

కొంద ఱీ రీతి పందలై? గోడుమాలిమగదనము చంపుకొని, తమ మగువల కెదురాడ నేరక వారలేమనిన శిరములూఁచుచుం గుక్కలైపడి యుంద్రుగాని!

గీ. అప్పొసంగినవాఁడును, అల్లుఁ, డద్దెయింటియజమానుఁడును, జీతమిచ్చువాఁడు!కులవినోదయు, పన్నులు కూర్చువాఁడుబుస్తె కట్టని మగలె పో పూరుషులకు!

సీ.ముడుపులు పూర్తిగా ముట్టుదాఁకను బుస్తెముట్టక చేతులు ముడిచికొనునుతరువాతఁబాన్పెక్కిఁదాఁచఁ బెట్టినయట్లుజిలుగు కోరికలకు సిద్ధపడునుఆవల గర్భాధాన మనినంతనే బిఱ్ఱబిగిసి లంచం బటఁబెట్టుమనునుఅవిగాక పండుగు లరుదెంచినపు డెల్లతండ్రి తద్దినము చందాన దిగును

ఇన్నియుం బుచ్చుకొని, యెన్నఁడేని పిల్లనంపుమని ప్రార్థన మొనర్ప నదరిపడును;ఆఁడపడుచుల, నల్లుర నాటకత్తియల నెవండేని తనియింపఁ గలఁడె వసుధ!

గీ. అప్పిడినవాని, నధికారి నతిశయించియల్లురొందించు బాధల నెల్లఁ గాంచి,అడలి, నిజముగా హరిహరు లంతవారుకూతులం గంటయె మానుచున్నవారు.

గీ. తండ్రులకుఁ గట్నబాధయుఁ - దల్లులకు వియోగ బాధయుఁ దమకు నింకొకరి యింటిదాస్యబాధ దమకు దరిద్రంపు టాఁడుపుట్టువే పుట్టరాదని బుద్ధి నెంతు.

ఉ. కట్టగృహంబు లమ్ముకొని కట్నమునీయక పెండ్లికాని యీకట్టడి వక్రకాలమునఁ గానల మధ్యము నందు బుట్టగాఁబుట్టఁగఁ జెల్లుఁగాని యొక భూపతి కేమియు నాడుబిడ్డగాఁబుట్టగరాదు! పుట్టునెడఁ బుట్టినయప్పుడె గిట్టఁగాఁదగున్‌.

గీ. వెండినాణెంబె పెనిమిటి వేశ్య; కటులెకట్నములె భార్య లిప్పటి కర్కశులకు!వేశ్య వెలయా లనంబడె వెల గ్రహించి,కట్నములచేత వెలమగల్‌ కారె వీరు?

చ. తనువు లశాశ్వితంబులు గదా? క్షణభంగుర జీవితార్థమైధన మిడి, భర్తలం బడసి దాస్య మొనర్చుటకంటె; బెండ్లియేయనువుగ మానిపించుకొని, హాయిగ రాట్నముత్రిప్పుకొంచు యోగినులగతి న్మెలంగిన సుఖింపమె? తీఱదె తండ్రి దీక్షయున్‌?

గీ. నాదు ప్రతినంబు వినుము ప్రాణములనైనవిడిచెదంగాని, యడిగిన విత్తమిచ్చివరుని గొనితెచ్చినట్టి వివాహమునకుసమ్మతింప నా రాట్నము సాక్షిగాను.

గీ. బ్రాహ్మణులయింటఁ దొలుఁదొ ల్తఁ - బ్రభవమొందికోమటింటను ముద్దులు గొనుచుఁ బెరిగి,కమ్మవారింట పెళ్ళునఁ గాఁపురంబుసేయుచున్నది కట్నంపుఁజేడె నేఁడు.

గీ. వయసుతోడనే బనిలేదు వావితోడనంతకన్నను బనికల్గ -దరయ నొల్లరింటి పేరును: గోత్ర, మింకేదియుఁ గూడ;ఆస్తియొక్కటియే యిపు డన్నిటికిని.

Comments

Loading comments…