షష్ఠాంకము
వరవిక్రయము
గీ. ఆస్తి కలిగి తీఱుపలేని యప్పె యప్పు,నూరు గొని వేయికై వ్రాయు నోటె నోటు,పసిడి తాకట్టుపై నిచ్చు బదులె బదులు,రోజు వడ్డీలు వచ్చిన రోజె రోజు.
సీ. ప్రాయఁ ముడిగి యేండ్లు -పైఁబడ్డ తరి భ్రాంతిఁజెంది రెండవ పెండ్లి చేసికొనుటఆస్తి దాయాదుల కగు నను చింతచేఁబెరవారి బిడ్డను బెంచుకొనుటక్రొత్తలోఁ జూపు మక్కువ లెల్ల మది నమ్మిఅత్తవారింటను హత్తుకొనుటఅప్పుల వారిని దప్పించుకొన సొత్తులితరుల పేర వ్రాయించి యిడుట
పుడమి, నీనాలుగుం జాల బుద్ధిమాలినట్టి పనులని పల్కుదు రార్యులెల్లరందు మూడవ పెండిలి యాడినట్టిబడుగు నగు నన్నుఁ గూఱిచి పలుకనేల?
చ. పరువుఁ బ్రతిష్టయుం గనక, పాపభయంబను మాటలేక యిక్కరణి ధనంబె జీవితముగా దలపోసెడు వానితోడఁజుట్టరికముచేసి, నిత్య మకటా! యని చింతిలుకంటె, గౌరవాదరపరు లౌ గృహస్థుల పదంబులపైఁ బడవైచుటే తగున్!
ఉ. ఆ నునుచెక్కు, లా పెదవు, లా మొగ మామురిపెంపు భ్రూయుగం,బానొస, లా శిరోరుహము, లా మృదువాక్యము, లామృదుస్వరంబా నయనంబుఁ, లా నడక, యా వినయం బకటా! సుషుప్తియం
దేనియు సాధ్యమే మఱువ నీ దురదృష్టపు జీవితంబునన్!
సీ. ఎన్నడుఁ నామాట కెదురు చెప్పఁగలేదు!తండ్రి గీచిన గీటు దాటలేదు!బడియన్న నెన్నఁడు బ్రాలుమాలఁగ లేదు!రాట్నంబు నెడలఁ బరాకు లేదు!అది నాకుఁ గావలె నని యెన్నఁడన లేదు!కుడుచునప్పుడుఁ గూడ గొడవ లేదు!ఆటలయందైన -నలుక యెన్నఁడు లేదు!పొరుగింటి కేనియుఁ బోకలేదు!
కలికమున కేనియును నోటఁ గల్లలేదు!మచ్చునకు నేనియుం బొల్లుమాట లేదు!అట్టి బిడ్డను బ్రతికియున్నంత వరకుమరువ శక్యమె! వెఱ్ఱి బ్రాహ్మణుఁడ నాకు!
తే. ఎంత చెప్పిన విన విది యేమి వెఱ్రియెవరి పనియైన తరువాత నెవ్వరుంద్రు?నాటకములోని వేషగాండ్రకును మనకునించుకేనియు భేదమెందేని గలదె!
గీ. కట్టె మథియింప యింపఁ గలుగు నిప్పు;భూమి త్రవ్వంగఁ ద్రవ్వంగఁ పుట్టు నీరు;పెరుగుఁ తరువంగఁ దరువంగఁ పేర్చు వెన్న;కన్పడదె దారి యోజింపఁ గార్యములకు?
ఆ. ఏండ్ల కన్నఁ జాల హెచ్చగు బుద్ధి నీకిచ్చి మమ్ముఁ దేల్చె నీశ్వరుండు!అక్క యట్లు చేసినందుల కీపైనమాకు కనుల యెదుట మనఁగదమ్మ!
ఉ. అక్కరొ! నీ మతంబునకు నడ్డముగాఁ జనుచున్న నా యెడన్‌మక్కున వీడబోకు! మభిమానము లేనికతాన గాదు నేనిక్కరణిం భ్రమించుట మఱేమన దేవుఁడు మధ్యవర్తిగానిక్కము దెల్పుచుంటి నిటు నీ కసి తీర్ప మదిం దలంచితిన్.
Comments
Loading comments…