ఉపోద్ఘాతము
ద్విపదభాగవతము
<మంగళమహాశ్రీ :—“ఆ కరయుగానల మృగాంక శకవత్సరములై పరఁగు శార్వరిని బుణ్యప్రాకటిత మార్గశిర పంచమిని బొల్చు నడుపాలసుతవాసరము నందున్శ్రీకరముగా మడికి సింగన తెనుఁగున రచించెఁ దగఁ బద్మ పురాణంబాకమల మిత్ర శిశిరాంశువుగఁ గందసచివాగ్రణికిన్ మంగళ మహాశ్రీ.”
సీ॥“అతండు తిక్కనసోమయాజుల పుత్రుఁడైకొమరారు గుంటూరి కొమ్మ విభునిపుత్రి చిట్టాంబిక బుధలోక కల్పకవల్లి వివాహమై వైభవమునభూసారమగు కోటభూమిఁ గృష్ణానదిదక్షిణ తటమున ధన్యలీలనలరు రావెల యను నగ్రహారము తనకేక భోగంబుగా నేలుచుండియందుఁ గోవెల గట్టి గోవిందు నెన్నగోపీనాథుఁ బ్రతిష్టయుఁ గోరి చేసియఖిల విభవములందును నతిశయిల్లెమనుజమందారుఁ డల్లాడ మంత్రివిభుఁడు.
క॥“అయ్యువతీరమణులకునునయ్యల మంత్రీంద్రుఁ డుదితుఁడై ధారుణిలోనెయ్వెడ నర్థార్థులు మాయయ్య యని పొగడఁగ నెగడె సౌదార్యమునన్.సీ॥ఆత్రేయ గోత్రపవిత్ర పేరయమంత్రిపుత్రి సింగాంబికఁ బుణ్యసాధ్వివెలయ వివాహమై వేఁగి దేశంబులోనేపారు రాజమహేంద్ర పురికినధిపతి తొయ్యేటి యనపోత భూపాలుమంత్రియై రాజ్యసంపదఁ బొదలియొప్పారు గౌతమి యుత్తర తటమునమహనీయమగు పెద్దమడికి యందుస్థిరత రారామతతులు సుక్షేత్రములునుబెక్కులార్చించి సితకీర్తి బెంపు మిగిలియఖిలజగదన్నదాతనా నవనిఁ బరఁగెమధుర గుణధుర్యఁ డయ్యల మంత్రివరుఁడుచ॥ఒనరఁగఁ దద్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరంబున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని న్మహీజననుతు నబ్బయాంకు బుధసన్నుతి పాత్రుని నారయాహ్యయున్గని నరసింహ నామములు గారవ మారఁగఁ బెట్టిరందఱున్.క॥వారలలో నగ్రజుఁడనువారిజదళనయనచరణవారిజసేవా
సారమతి నతులవాక్యశ్రీరచనాచతురమతిని సింగమహ్వయున్.
ద్విపద.“అని ఇట్లు నయనిర్జరామాత్యుపేరధన ధాన్య మణిమయ దానాఢ్యు పేరభూభరణక్షమ భుజసారుపేరనౌభళ మంత్రి కందామాత్యు పేరఁగోరి భరద్వాజ గోత్ర సంజాతుఁడారూఢ మతి నయ్యలార్య నందనుఁడుశృంగార రసకళా శ్రితివచోధనుఁడుసింగయామాత్యుఁడు చెలువగ్గలింపసలలితరసభావ శబ్దగుంభనలమహానీయమగు దశమస్కంధ సరణివిహితలీలలనొప్పు విష్ణుచరిత్ర
ప్రాకటంబగు మధురాకాండమనిననాకల్ప మాకల్పమగు భంగిఁజెప్పె.”
సీ॥ స్వామి భక్తుఁడు కార్యచతురుఁడు బహుకళావేది నీతిజ్ఞుఁడు విప్రహితుఁడుసరస సల్లాపుఁడు సప్తాంగరక్షణక్షముఁడు భావజ్ఞుఁడు సర్వసులభుఁడరి మంత్రభేదన పరుఁడు ధర్మాత్ముఁడుసుందరాకారుఁడు సుజనవినతుఁడురుదయాపరుఁడు నిత్యోత్సవాసక్తుండుసద్గుణాధారుండు సౌమ్యమూర్తిసతత గురుదేవతా పరిచారరతుఁడుగుణసముద్రుండు కాశ్యప గోత్రజనితుఁడనఁగ నుతికెక్కి పెంపున నతిశయిల్లుమదన సదృశుండు కందన మంత్రివరుఁడు.సీ॥ ఈ ధర్మచారిత్రు నేధాత్రిపతి యేలునాధాత్రిపతి యేలు నఖిల జగమునీకామినీకాము నేకామినులు చూతురాకామినులు చూడ రన్యపురుషునీయర్కనుతతుల్యు నేయర్థి గొనియాడునాయర్థి యెరువేఁడ నాస సేయఁ
డీమంత్రి కులచంద్రు నేమంత్రి వురణించునామంత్రి విముఖాత్ముఁడఖిలమునకుననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గముల నుతింప నొప్పు ముజ్జగములఁదారహారహీరధవళాంశుసమకీర్తికలితుఁ డౌబళ కందవిభుఁడు.
కందన మంత్రికిఁ దాతకుఁ దాతయైన గన్నయ మంత్రి కాకతీయ గణపతిదేవుని కాలములో నుండినట్లు పద్మపురాణములోని యీక్రింది పద్యము చెప్పుచున్నది.
చ॥ “పరువడిఁ గాకతీయ గణపతి నాయకు నొద్ద మాన్యుఁడైధరణిఁ బ్రశస్తుఁడై నెగడి దానములెల్లను జేసి భక్తి పెంపిరవుగ గుళ్ళు గట్టి గణపేశ్వర దేవుని గోపికాధిపున్దిరమగుచున్న లక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ బ్రభుత్వమేర్పడన్”.
“శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనిలయం సీతామనోనాయకంవల్మీకోద్భవ వాక్పయోధిశశినం స్మేరాననం చిన్మయంనిత్యం నీరదనీలకాయ మమలం నిర్వాణ సంధాయినంశాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రంభజే. ”
గీ॥ వ్యాస వాల్మీక శుక కాళిదాస బాణహర్ష ణాదుల నాఢ్యుల నాత్మనిలిపిసకలభాషా రసజ్ఞుల సముల నన్నపార్య తిక్కన కవీంద్రుల నభినుతింతు.(వాసిష్ఠరామాయణము)
క॥ ఆపరమేశ్వర మకుటవ్యాపిత గంగాప్రవాహ కవితా సల్లాపుఁడగు మడికి సింగనఁజేపట్టక కీర్తిగలదె శ్రీమంతునకున్.(పద్మపురాణము)
ద్వి॥. “ఉచ్చిత పండ్లతో నుల్లసంబాడునచ్చపలాక్షికి నంగుష్ఠచయము;పదనఖద్యుతుల నుపచరించు నెలవుఁగదియ మౌక్తికములుఁ గట్టి నట్లుండు;
తనరు గచ్ఛప నిధిద్వయ మింతి పాదవనజాతముల మీఁద వ్రాలెనో యనఁగ;గమనజాడ్యము శుభాకరమును నగుచుఁగమనీయలీల మీఁగాళ్లొప్పు సతికి;పగడంపుఁ దీగల పంక్తులో యనఁగమగువకు నొప్పారు మడిమల తీరు;…………………………………. ”(ద్వి॥భా॥పుట72)
ద్వి॥ “అనఘాత్మ! భీష్మకుండను విదర్ఛేశుతనయ రుక్మిణి యను ధవళతాక్షితనుమధ్య యుత్పుల్ల తామరసాక్షిగరుడ కిన్నర యక్ష గంధర్వ సతులుదొరయలేరా యింతితో నీడుఁబోల్ప;దేవర సౌభాగ్య దివ్యవర్తనలువావిరి జను లెల్ల వర్ణింపుచుండవిని పుష్పధన్వుని విషమబాణములుయనవొందఁ దనువున నట నాటుటయునుజిత్తంబులో నీదు చెలువైన మూర్తిచిత్తరు వొత్తిన చెలువంబుఁ దోఁపఁజింతించు వెఱఁగందు చేష్టలు మఱచు
నంతకంతకు నిన్ను నభిమతి సేయువిరహాగ్ని శిఖిఁ గ్రాఁగు వెలవెల నగుచుమరులెత్తినట్లు పల్మరు చిన్నఁబోవునీభంగి నున్న యీ యిభరాజ గమనఁబ్రాభవంబునఁ జైద్యపతి పెండ్లియాడనెల్లుండి చనుదెంచు టెఱిఁగి యాయింతియెల్ల విధంబుల నిది నీకుఁ జెప్పిపుత్తేర వచ్చితిఁ బుండరీకాక్ష!చిత్తంబులో నొండు చింతింప నేలఆభామ నిజభార్యయై యుండునట్టిసౌభాగ్య మెవరికి సమకూరు? నీవునారుక్మిణిబ్బంగి నాసలు సేయుకారుణ్యమూర్తివి కమలాక్ష! నిన్నుఁగదసి నీదరహాస కౌముదిఁ గ్రోలముదిత నేత్ర చకోరములు చేరఁగోరునలవడి నీప్రయాణాంబువులోపఁగలకంఠి చాతకి కడువేడ్క సేయునీవెటులైనను నేచిన వేడ్కనావెలందుక నేలుటది నీకు నొప్పు;నిను నమ్మియుండిన నెలఁతుక నొకఁడుకొనిపోవగాఁ జూడఁగూడునే నీకు?”
సీ॥ “పల్లవవైభవస్పదములగు పదములుకనకరంభాతిరస్కారు లూరులరుణప్రభా మనోహరములు గరములుకంబు సౌందర్యమంగళము గళముమహితభావాభావ మధ్యంబు మధ్యంబుచక్షురుత్సవదాయి చన్నుదోయిపరిహసితార్ధేందు పటలంబు నిటలంబుజితమత్త మధుకర శ్రేణి వేణిభావజాశుగముల ప్రావులు చూపులుగుసుమకరుని వింటి కొమలు బొమలుచిత్తతోషణములు చెలువ భాషణములుజలజనయనముఖము చంద్రసఖము”.
“ఈతఁడే, ఎలనాగ! ఇసుమంత నాఁడుపూతన (పాల్ ద్రావి) పొరిఁగన్నవాఁడు,“సకియరొ! ఈతండే, శకటమై వచ్చుప్రకట దానవుఁ ద్రుళ్ళిపడఁ దన్నినాఁడు.ముద్దియ! ఈతఁడే మొగి ఱోలుఁ ద్రోచి(మద్దియలు)డిపిన మహనీయ యశుఁడుఅక్కరో! ఈతఁడే యఘదైత్యుఁజీరికొక్కెర రక్కసుఁ గూల్చిన వాఁడుగోవర్ధనముఁ గేల గొడుగుగాఁబట్టి(గోవులదే)ర్చిన గోవిందుఁ డితఁడె.కొమ్మ! ఈతఁడే పిల్లగ్రోవూది వ్రేతఁగొమ్మల గడు వెఱ్ఱిఁ గొలిపిన వాఁడు.”
“కరిమదరక్త పంకములచే మేనదొరగెడు ఘర్మ బిందువులును నరయహరిమేను చిత్రవనాంబుద మనఁగనరుదారఁ జూపట్టె నందంద చూడ;గజదంతములుఁ దాను కామపాలుండుభుజశిఖరంబులఁ బొలువందఁ దాల్చిదారుణతర దండధర్మయుగ్మమనఁగగౌరత మల్లరంగము సొచ్చి నిలువఁగోరి మల్లులకెల్ల కులిశమై, ప్రజకుధారుణి నాథుఁడై, తల్లిదండ్రులకుఁబసి బాలుఁడై యొప్పు, పంకజాక్షులకునసమాస్త్రుఁడై, వల్లవాళికి నెల్లఁబరమాప్తుఁడై, యతిప్రతతికి నెల్లఁబరతత్త్వమూర్తియై, బంధు సంతతికిదైవమై, రౌహిణీతనయుఁడు దానునావిష్ణుం డరుదెంచె నందఱుఁజూడ.”
“నల్లని మే నున్నతమైన యురముదెల్లదమ్బుల మించు తెలి గన్నుగవయనెరిజడ చొళ్లెము నిటల రేఖయునుజిరునవ్వు మోమును జేత వేణువునుపాయక జగిమించు పసిఁడి చేలయునుదలఁబురిపెనవు కదంబ మంజరియుధళధళ వెలిఁగెడు దంతధీధితియుఁగలరూపు మోమున గట్టినట్లుండు.”
శ్లో॥. భూమిభార వారణాయ యోయదుష్వభూ ద్విభుర్విస్మయం శిశోశ్చ యస్య చేష్టితాని తేనిరేశర్మవః స పూరుషో రథాంగమాయుధం దధత్కర్మయోగదేశికః కరోతు పార్థసారథిః.
సరస్వతీమహల్ లైబ్రరీ|తంజావూరు. 7-12-50|| వాసిష్ఠ. ఆ. మహాదేవశాస్త్రి.
Comments
Loading comments…