కల్యాణకాండము

ద్విపదభాగవతము

విదర్భరాజు తనకుమార్తె రుక్మిణిని శిశుపాలుని కిచ్చుటకుఁ దీర్మానించుట

ఆరూఢయౌవన నాయింతి జనకుఁడేరాజు తనయున కిత్తు నేననుచుజింతించి చైద్యుండు శిశుపాలుఁ డర్హుఁ,డింతికి నని నిశ్చయించి పెండ్లికినిసకలదిక్పాలుర సకలభూపతులసకలమహీశ్వరసమితి రప్పించిధీయుక్తిమై నాఱుదినములలోననాయతంబగు లగ్న మరుదెంచుటయునునంత రుక్మిణి యంతయు నెఱిఁగి

రుక్మిణీదేవి తనపురోహితుని శ్రీకృష్ణునివద్దకు పంపుట

చింతించి "నేనింక శిశుపాలు నెట్లువరియింతు? త్రైలోక్యవరుఁడు నావిభుఁడు

హరి నాకుఁ బ్రాణేశుఁడై యున్నవాఁడునేనేమి సేయుదు నిటమీఁద నింక!నానోములన్నియు నన్నుఁ ద్రెక్కొనియెనెవ్వరు గలరింక నాబారి గడప?ఎవ్వఁడోపుడు నాకు నీవార్తఁ జెప్ప.”అని పల్కి, చింతించి యవ్వరారోహతన పురోహితపుత్రు ధర్మచరిత్రుఁబిలిపించి యెంతయుఁ బ్రీతి నెమోముకలఁగఁగఁ బలికె గద్గదకంఠి యగుచు;10అనఘాత్మ! మనవారు లవనీతి సేసినను చైద్యపతికి నున్నతిఁ బెండ్లి సేయఁదలఁచుచున్నారు నాతలఁపు జీవనముజలజాక్షుఁ డనుచు నిశ్చలవృత్తి నుందునీమాటనన్నియు నెఱిఁగింపరాదునామీఁదఁ గృపఁగల్గి నన్ను మన్నించియరసి తోపుట్టినయట్లుగాఁ జూతుమెరవు సేయకఁ జిత్త మెఱిఁగి వర్తింతువటుగాన నాకైన యక్కరఁ దీర్పనిట నీవె కాక యింకెవ్వరు బంధులాయసంబునఁ జని యాద్వారవతికిబోయి కృష్ణునిఁ గాంచి పొసగంగఁ జెప్పిమరుఁ డెత్తుకోల నామానంబు గొనునుపరువెత్తి రాకున్నఁ బరిణయలగ్నమెడ లేదు! తానింక నే తేరకున్న

విడుతుఁ బ్రాణంబులు వేరొండు లేదు!”అనిన నావిప్రుఁడు నతివచోధనుఁడు

పురోహితుఁడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి రుక్మిణి ప్రేమను రూపును వర్ణించుట

జనియె సత్వరమున శౌరిసన్నిధికిఅరుదార ద్వారపాలావళిచేతహరి విని యెదుఱేఁగి యా విప్రవరునిఁ20దోడ్కొనిపోయి సంతుష్టుఁ గావించివేడ్క ప్రియంబును వెలయ నిట్లనియె.“ఎవ్వరు బుత్తెంచి రెందుండి వచ్చితెవ్వరు నీనామ మెఱిఁగింపు” మనిన“అనఘాత్మ! భీష్మకుండను విదర్భేశుతనయ రుక్మిణియను ధవళాయతాక్షితనుమధ్య యుత్ఫుల్ల తామరసాక్షిగరుడకిన్నెరయక్షగంధర్వసతులుదొరయలే రాయింతితో నీడుఁ బోల్ప;దేవర సౌభాగ్యదివ్యవర్తనలువావిరి జనులెల్ల వర్ణింపుచుండవిని పుష్పధన్వుని విషమబాణములుయనువొందఁ దనువున నటనాటుటయునుజిత్తంబులో నీదు చెలువైనమూర్తిచిత్తరువొత్తిన చెలువంబుఁదోఁపఁజింతించు వెఱఁగందు చేష్టలు మఱచు

నంతకంతకు నిన్ను నభినుతి సేయువిరహాగ్నిశిఖఁ గ్రాఁగు వెలువెలనగుచుమరులెత్తినట్లు పల్మరు చిన్నఁబోవు30నీభంగినున్న యీయిభరాజగమనఁబ్రాభవంబునఁ జైద్యపతి పెండ్లియాడనెల్లుండి చనుదెంచుటెఱిఁగి యాయింతియెల్లవిధంబుల నిది నీకుఁ జెప్పఁబుత్తేర వచ్చితిఁ బుండరీకాక్ష!చిత్తంబులో నొండు చింతింప నేల?ఆభామ నిజభార్యయై యుండునట్టిసౌభాగ్య మెవరికి సమకూరు? నీవునారుక్మి ణిభ్భంగి నాసలుఁ సేయుకారుణ్యమూర్తివి కమలాక్ష! నిన్నుగదసి నీదరహాసకౌముదిఁ గ్రోలముదితనేత్రచకోరములు చేరఁగోరునలవడి నీ ప్రయాణాంబువులోనకలకంఠిచాతకి కడువేడ్క సేయునీ వెటులైనను నేచినవేడ్కనా వెలందుక నేలుటది నీకు నొప్పు;నిను నమ్మియుండిన నెలతుక నొకఁడుకొనిపోవఁగాఁ జూడఁగూడునే నీకు?పురవరాంగణములఁ బొరి దుర్గఁగొలువనరుదేర నాకన్య నాసురలీల40వరియించి చైత్యభూవరుసైన్యములను

సరగున సమయించి జలజాక్షిఁ గొనినఁగీర్తియు లాభంబు గెలుపు పౌరుషమునార్తరక్షణమును నగు నీకు కృష్ణ!ఈ కార్యమెడయైన నిందిరారమణ!ఆకామినీమణి యసువులు విడుచునిన్నిమాటలుఁ జెప్ప నెడలేదు వేగనున్నతి పరిణయంబొనరించు టొప్పు.”అనియని చతురోక్తు లల్లనఁ బలుకననియె విప్రునితోడ నంబుజోదరుఁడు

శ్రీకృష్ణుడు రుక్మిణినిఁ గాపాడి వరించుట కొప్పుకొనుట

“వనజాక్షి రూపులావణ్యసంపడలువిని చిత్తమునఁ జూడ వేడుక పుట్టివచ్చెదమనువేళ వరపుణ్య నీవువిచ్చేసితివి లెస్స విధమయ్యెఁ దలఁపనాకన్యకకు నాకు నలరుబంధుఁడవుగాక యెందును వేరు గలదయ్య మనకు?ఇదె వచ్చి శిశుపాలు నే గెల్చి సేనఁజదిపి యందఱు మెచ్చఁ జపలాక్షిఁ దెత్తు”అనుచు మజ్జనభోజనాదికృత్యములుతనరార సలిపి యాతనిఁ బూజసేసి50

శ్రీకృష్ణుఁడు కుండినపురికిఁ బయనమగుట

సైన్యసుగ్రీవాదిచటులాశ్వపాంచజన్యచక్రస్ఫూర్తి చదలెల్లఁ గప్ప

గరుడకేతన కాంతి కరమొప్పుచున్నయరదంబు సన్నాహమై మ్రోల నిలుపదారకుఁడును విప్రతనయుఁడుఁ దానునారూఢశుభవేళ నరదంబు నెక్కిగగనంబునను దివాకరబింబమోయనఁగఁ జనియె విదర్భ నలినాక్షురథము;పోవుటయును సీరి జింతించి“యావిష్ణుఁ డొంటిమై నరిగెఁ బెండ్లికినిబలియురు మాగధప్రముఖభూపతులుకలహంబు పుట్టునే గదిసెద” ననుచుబలువొప్పఁ జదురంగబల సైన్యపతులుఁగొలువంగ హలివచ్చె కుండినపురికి.

పౌండ్రకదంతవక్త్రాదులు కుండినపురి కేతెంచుట

అంతట శిశుపాలుఁ డతివైభవమునదంతితురఁగసద్భటపదావళియువలనొప్ప పటహాదివాద్యముల్ మొరయబలియుఁడై చనుదెంచెఁ బరిణయంబునకుహరితో విరోధాత్ములగు సాల్వమగధధరణిఁ బౌండ్రకవరదంతవక్త్రులును60గొమరార శిశుపాలుఁ గూడి యేతేరనప్పుడు భీష్మకుం డధికవైభవములొప్పారఁ బురమున నుత్సవం బొదవకలుపదంబులు మేలుకట్లు తోరణములలవడ నేతెంచి యధికవైభవము

కలయఁ గుంకుమనీటఁ గలయాపులలికిమెలుపార కస్తూరి మేడలఁ బూసిమొనసిన కప్పురమున మ్రుగ్గు వెట్టితనరారఁ గదలికాస్థంభంబు లెత్తి,పురము సింగారించి పురుహూతులీలఁదరుణులు గొలిచిరా తరుణులుఁ దానువందిసన్నుతగీతవాద్యముల్ మొరయఁజెంది పేరంటాండ్రు సేసలుఁ జల్లగురుసంపదల నెదుర్కొని తోడితెచ్చిధరణీశవరుల నండఱి మనోహరములగుచోట విడియించి యఖిలసౌఖ్యములుఁదగుభక్తి నొనరించి దక్షులఁ బిలిచిఘడియారమిడఁగ మంగళతూర్యనినదమెడపక మ్రోయంగ నెఱిఁగి రుక్మిణియు70

రుక్మిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకకై పరితపించుట

కలఁగి మ్రాన్పడి నిల్చు, కళవళంబందుఁబెలుకుఱులోఁ దాఱు పెదవులుఁ దడపుఁబలుకకూరకనుండుఁ బలుమాటలాడునిలువనేరక వ్రాలు నిట్టూర్పువుచ్చునంతయు హరిఁ జేర్చు నంతరంగమునసంతాప మొదవంగఁ జర్చించి చూచు;“నక్కట! యెక్కడి కరిగెనో! విప్రుఁడెక్కడఁబోయనో! ఏలకోతడసె!

హరికి యిక్కడివార్త లందెనో! నడుమదిరిగెనో! శౌరిఁ దోతెచ్చుచున్నాఁడొ!ఈకార్య మెఱిఁగింప నిందిరావిభుఁడుకైకొనకుండునో! కడువేడ్కతోడవచ్చునో! ఎవ్వరే వలదందురొక్కొ!మచ్చికతో నన్ను మన్నించునొక్కొ!నెడమకన్నును జన్ను నేడమభుజంబువడి నదరెడి హరివచ్చు నిశ్చయము.”అని యిచ్చ నూహింప నంబుజోదరుఁడుచనుదెంచి సీరితో సైన్యంబుతోడనాపురోద్యానంబు నందొప్ప విడిసిభూపాలతనయ కింపుగఁ దనరాకఁ80జెప్పి పుంచినఁ జెన్నార విప్రుఁడప్పొలంతుకఁ గాంచి హరి వచ్చె ననుడుహరుషాశ్రువులు గ్రమ్మ నందంద మేనుగరుపార నవ్విప్రుఁ గని యిట్టులనియె,“పురుషార్థపరుఁడవు పుణ్యచిత్తుఁడవుపరమాప్తుఁడవు నాకుఁ బ్రాణంబు నీవ!ప్రాణవల్లభుఁడైనఁ బద్మాక్షుఁ దెచ్చిప్రాణంబుఁ గాచితి పలుకులిం కేల!”అని పల్కి యతనికి నందంద మ్రొక్కికనకాంబరము లిచ్చి ఘనతతో ననిచె.

రుక్మిణి గౌరియాలయమునకు వెడలుట

గౌరికి మ్రొక్కింపఁ గరము సంప్రీతి

నారాజబింబాస్య నటతోడి తేరఁగలికి రాయంచల గతుల గీడ్వఱచుఁజెలువలు నలుగడఁ జెన్నారి కొలువపటహకాహళశంఖఫణవాదు లొలయపటుతరంబగు వీరభటకోటి కొలువదేవతనగరి కేతెమ్మన్న, శౌరికావార్త యెఱిఁగింప నవ్విప్రుఁ బంచె,ఆమెలఁత కాల్నడ నరుదెంచె నప్పుడేమని వర్ణింతు! ఇభపురాధీశ!90అడుగడుగిడుచోట నవనియంతయునుగడునొప్పు పద్మరాగశ్రీ వహించు;ఉచ్చిఁతపండ్లతో నుల్లసంబాడునచ్చపలాక్ష్మికి నంగుష్ఠచయము;వదనఖద్యుతు లనుపచరించు నెలవుఁగదియ మౌక్తికములుఁ గట్టి నట్లుండు;తనరు గచ్ఛపనిధిద్వయ మింతిపాదవనజాతములమీఁద వ్రాలెనో యనఁగ;గమనజాడ్యము శుభాకరమును నగుచుఁగమనీయలీల మీఁగాళ్ళొప్పు సతికి;పగడంపుఁదీగెలపంక్తులో యనఁగమగువకు నొప్పారు మడిమెల తీరు;తరిసేయు మదనుపుత్తళికలుఁ దమకునెరతనంబంచును నెరసులు వలుకుగనకకాహళకాంతిఁ గడచి చూపరకుఁగనుపట్టు కాంతజంఘలు దన్యమగుచు;

కదళికాయుగళంబు కటిభార మొప్పనదనపుఁగరికరయమళంబు పసిఁడితొలచి నిలిపిన భంగిఁ దొలుకాడు రుచులఁగలకంఠి కొప్పారుఁ గరభోరుయుగము;100వెడవిల్తుఁ గల్యాణవేదిక తోడఁదడఁబడు కొంత నితంబభారంబుఁగరిశిరస్పధియై కనకపుపెట్టె;వరసైకతంబనా వలనొప్పు కటియు;కటిసూత్రఘంటికాఘనరత్నకాంతిపటిమతో నొప్పారు పసిఁడిదువ్వలువ;కామునికై పుత్రకామేష్టి వెల్వహోమగుండముభంగి నొప్పారు నాభి;చలదలపల్లవసంకాశమగుచుపలుచనై కనుపట్టు భామిని కడుపు;అలమిన ముష్టిలో నడఁగి చూపరకుకలదు లేదను వాదుఁ గలిగించు నడుము;ఆపూర్ణకుచవిహారాద్రులకిడినసోపానములభంగిఁ జూపట్టు వళులు;హరినీలనాళంబులం దుద్భవించుగురుహేమసరసిజకోరకద్వయముకరణి నూఁగారుపై ఘనకుచద్వయముకరమొప్పుఁ జూడ నా కామినీమణికి;పసిఁడి మించుల మించు పణఁతి కక్షములు;బిసవల్లి కలయోజ బెరయు చేఁదోయి;110కెందమ్మిరేకుల గెలిచి కెంపొదవు

నందమై లేమకు నరచేతు లమరు;విద్రుమలతలతో నీడు దోఁగాడువిద్రుమద్యుతి చేతివేళ్లు పెంపొదవు;కలువరేకుల మించుఁ గరనఖద్యుతులు;పొలుచు శంఖముభంగిఁ బొలఁతికంఠంబుజలజంబుఁ దెలివియుఁ జంద్రకాంతియునుజలజాస్య నెమ్మోము సరిసేయరాదు;చెలువారు పగడంపుజిగురకొ! బింబఫలమకొ! యననొప్పు బామ కెమ్మోవి;వెలఁది వెన్నెలనీట వెలసిన కుంజకళికెలో యననొప్పు కాంతపల్వరుస;దరహాసచంద్రిక ధళధళ వెలుఁగుకరిదంతరుచి మించు గండపాలికలు;పొలుపైన పసిఁడితిలపుష్పమో యనఁగనలినాక్షి కొప్పొరు నాసాపుటంబు;చారు శ్రీవర్ణంబు సరినచ్చులొత్తిచేరినయట్లొప్పుఁ జెవులు రుక్మిణికి;కందర్పుఁ డింపుగాఁ గదల నిర్గమముముందట విల్లునమ్ములు నిడెననఁగఁ120దరలాక్షి నెమ్మోము తామరమీఁదగరవంకబొమలతోఁ గనుదోయి వొలుచు;శశి యింతినెమ్మోము సవతుగాలేకయసలార సగమైన యట్లొప్పు నొసలు;వదనాంబుజాతంబు వాసనగ్రోలఁగదియు తేంటులభంగిఁ గాన్పించు గురులు;

తొయ్యలిమోము చందురువెంటఁ దగులునయ్యహిభంగిఁ జెన్నగు నీలవేణి;భావజన్ముని నెత్త పలకచందముననావామలోచనకసలారె వెన్ను;కటకనూపురహారకంకణరత్నపటలరోచుల దిశాభాగంబుఁ గప్పుగరిరాజుగమనంబుగతి రాజతనయయరు డెంచే గౌరినిజాలయంబునకుఈభంగి సౌభాగ్య మెసఁగ నేతెంచి

రుక్మిణి కృష్ణుని బతినిగాఁ జేయుమని గౌరిని బ్రార్థించుట

యాభామినీమణి యంబిక కెఱఁగిఘనసారమృగమదగంధమాల్యములుకనకపుష్పంబుల ఘనధూపదీపనైవేద్యతాంబూలనవ్యోపచారభావార్చనల సేసి ప్రణుతించి మ్రొక్కి,130“అంబిక! గౌరి! లోకాంబ! కల్యాణి!అంబుజాసనవంద్య! ఆత్మసంచారి!శంకరుమేనిలో సాబాలుఁగొన్నశంకరి! పావకశశిభానునయన!ఈ లగ్న మెడరుగానీక శ్రీవిభునివాలాయమున నాకు వరునిఁ గావింపు”మని ప్రదక్షిణపూర్వమై భక్తి విప్రవనితలకును బెక్కువాయనా లిచ్చికంకణఝణఝణత్కారంబు లెసఁగ

నంకించి వెసఁబాడియాడి కీర్తించికన్నుల మెఱుఁగు లక్కజముగా నిగుడఁగ్రన్ననఁ జండికాగారంబు వెడలి

చండికాగారము వదలి వచ్చుచు కృష్ణునిఁ గానక రుక్మిణి కలఁగుట

జలజాక్షురామికిఁ జంచలంబందుఁదలపోయు, మార్గంబుఁ దప్పక చూచు“నావల శుభలగ్న మాసన్నమాయెనావిష్ణుఁ డేలకో యరుదేరతడసె!ఆవిప్రవరునితో నాడినమాటనేవిధంబున తప్పఁడేలకో! ఇంకనింతట హరి రాక యెడసేసెనేనికంతుని పూనిక కడతేరకున్నె!"140అని విచారింపుచో నాసీరితోనఁజనుదెంచి విమలభీషణవృత్తిఁ దోఁపగరుడకేతనకాంతి గగనంబు గప్పనరదంబుపైఁ గృష్ణుఁ డడ్డంబు వచ్చికనియెఁ గోమలి నీలకచఁ గంబుకంఠిఁదనుమధ్య నుత్ఫుల్ల తామరసాక్షినారూఢయవ్వన నమృతాంశుముఖినిహారకంకణనూపురాలంకృతాంగినాదిమలక్ష్మిఁ గన్యాశిరోమణినివైదర్భిఁ గని యదువరుఁ డుత్సహించె.

శ్రీకృష్ణుఁడు రుక్మిణిని దనరథముపై నెక్కించుకొని చనుట

ఆకన్యయును బ్రేమ నంబుజోదరునిరాకాశశాంకవిరాజితవదనుమకరకుండలకర్ణమాణిక్యరుచిరవికచగండస్థలు విభవేంద్రవంద్యుఁనారూఢయవ్వను నతులసౌభాగ్యునారాయణుని హరి న్నళినాక్షిఁ గాంచిసిగ్గును భయమును జిడిముడిపాటునగ్గలింపఁగ నిల్చె నంబుజనయన;ఆలోనఁ గృష్ణుఁడు నవ్వాలుగంటినాలింగనము సేసి యర్మిలి నెత్తి150కొనిపోయి రథముపైఁ గూర్చుండఁ బెట్టియనునయోక్తులఁ చేర్చి యంగంబు నిమిరిదారకుఁ జూచి "రథము వేగ పఱవుద్వారకాపురిక" ని దైత్యారి కదలె.

పౌండ్రకాదులు శ్రీకృష్ణునిఁ దాఁకుట

ఆసమయంబున హరి భీష్మతనయనాసురంబునఁ గొంచు నరుగుటనెల్లవిని చైద్యమాగధవిభు లాగ్రహమునఁజనిరంతఁ బౌండ్రకసాల్వవైదర్భు“లెక్కడికృష్ణుడు? ఎక్కడి రాముఁడుక్కడంచెద”మని యరువడిఁగదలి

చటులఘోటకకరిస్యందనవీరభటపాదహతుల భూభాగంబు వగులఁబేర్చినయలుకలఁ బృథులరావములనార్చుచు దాటిరా యాదవోత్తములఁగవిసియుఁ గార్చిచ్చుగతిఁ బెచ్చు పెఱిగియవిరళంబుగ వెంటనంటఁ దాఁకుటయునాయడ బలభద్రుఁ డనుజన్ముఁ జూచి“యీయింతయును నీవు యిందుండ నేల?కొని వేగ మరుగు మీకూటపమూఁకనణఁచి యేనునుఁగూడ నరుదెంతు" ననుచుఁ160

బలరాముఁడు యుద్ధము చేయుట

గమలాక్షు ననిచి యక్కామపాలుండుసమరసన్నుద్ధుఁడై చతురత నిలిచియాదవనికరంబు యత్యుగ్రసింహనాదంబుతోఁ దూర్యనాదంబు లొలియఁదలకొని యొండొంటిఁ దార్కొని మంటలొలుక కైదువల సముద్ధతిఁ జూపియరదంబు నరదంబు నశ్వ మశ్వంబుకరిఁ గరి కాల్వురుఁ గాల్వురుఁ దొడరియీరసంబున ముట్టి యిరువాఁగు గిట్టిపోరాడ సురుల కద్భుతముగా నిగుడివిలుకాండ్లు గవిసి దోర్వీర్యయంబు మెఱసిపలునారసములు నిర్భరముగా నేయనలువురు నేవుర నలినుచ్చిపారఁ

దలలొక్క పెట్టు భూతలముల రాల్చిరథములఁ జెక్కి సారథుల నుక్కడఁచిరథరథ్యనివహంబు రణభూమిఁ గూల్చికరులఁ జెండాడి పుష్కరములఁ దునిమిహరుల విదారించి యాశ్వికోత్తములఁ170బ్రాణంబు లెడలించి బాణాసనములఁదూణీరములఁ ద్రుంచి దొరల గీటణఁచి,వారు వీరన కెల్లవారికాయములఁదోరంపురుధిరంబుఁ దోఁగించిరంత;దొంకెనపోటులు దూరఁగానాటిబింకంబు లెడలక బెరయు వీరులునుగోరీ పెక్కండ్రను గుదులుగాఁ గ్రుచ్చిపేరు వాడునట్టి బిరుదులువారు;తల త్రెవ్విపడియు ముందఱఁ దమ్ముఁబొడుచుబలియులనొప్పించి పడియెడువారు;శిరములు వగిలినఁజిందెలఁగట్టిసరకు సేయకఁ బోరుసల్పు లావరులు;దొఱసిన వేటాడితునుకలుగాఁగయఱిముఱిఁ దెగవ్రేసి యార్చురాహుతులు;సామజంబులనడుము సరిగ్రుచ్చిపారఁదోమరంబుల వ్రేసి త్రుళ్లు మావుతులు;లవణిసారించి పల్లమును గుఱ్ఱమునురవుతును జిదియ భోరన మ్రోచువారు;ఱోలుచు నెత్తురుఱొంపిలో మునిఁగికాలార్పనేరని కరితురంగములు;180

దారగండులు వడి ధరణిపై వ్రాలుతేరులు వెసనోళ్లుఁ దెఱచు పీనుగలుఁజదిసిన కండలు జదుపంబులైనమెదడు మిడమిడమని మిడుకు బొమ్మలునునవ్వెడి మోములు నలినంగకములువిఱిగినవిండ్లును విటతాటమైనవుఱియలతో నొప్పు బోమిడికంబులును;కరవాలకంకణకలితమై పడినకరములుఁ తుమురైన కాండకుంతములు;పఱియలై కూలిన పలకలు నాజిఁదఱచుగాఁ దెగిపడ్డ ధవళచామరలు;నాడాడకుఁజింపులై దూర మెడలిచూడనక్కజమైన జోడుపక్కెరలు;నెత్తురు నెఱచియు నెరి బొట్టకోలఁగుత్తుకబంటిగాఁ గ్రోలు భూతములుఁ;గొడపంపుఁగంకాళి ఘోరనాదములవెడయాట లాడెడు వేతాళములును;వలనొప్పు భూతేశువక్షంబు వోలెలలితకపాలమాలాయుక్తమగుచు190సమధికదానఢ్య సరసంబెవోలెకమనీయమార్గణఘనఘోష మగుచుఁగలగొన వైశాఖకాలంబె వోలెనలినొప్పు బాణాసనధ్వస్తమగుచువిహితమహారణ్యవిభవంబె వోలెబహుఖగనాగసంప్రస్థితంబగుచు

సరభసనైదాఘసమయంబె వోలెసురుచిరవాహినీశోణితం బగుచుమహనీయవారాసిమధ్యంబె వోలెసహజబాడబఘోషసౌరభ్య మగుచునలమి బీభత్సభయానకరౌద్రకలితమై యొప్పారి కలనొప్పెఁజూడ;దట్టించెనంత యాదవసేనఁ దఱచునెట్టన నాచైద్యనృపుసేన విరిగె.మగధసేనలుఁ గూలె మడసె వైదర్భజగతీశుసైన్యంబు సాల్వుఁడు విఱిగె

శిశుపాలుఁడు క్రోధముతో హరిపైఁ గవయుట

అంత నాశిశుపాలుఁ డందఱఁ జూచియెంతయు దర్పించి యెలుఁగెత్తిపలికె.“కడుఁ గ్రొవ్వి గొల్లలుఁగానక నన్నుదొడరి నే నున్నచోఁ దొయ్యలి నెత్తి200కొనిపోయి రిద్దఱు కూల్చెద నొండెచనియాజి వారిచేఁ జచ్చెద నొండెయిట్టిజీవమునొంది యింటికిఁబోవనెట్లోర్తు? నాశౌర్య మెన్నటికింక?"అనిపల్కి పేర్చి తానటు సేనఁ దాఁకివనసమూహము నేర్చు వహ్నిచందమునదర మిడి పటురథదంతియశ్వములఁబొరిమార్పఁ దద్బలంబులు పెల్లగిల్లె.బలము వీఁగుటఁ జూచి బలభద్రుఁడంత

హలముసలోగ్రబాహార్గళుఁడగుచుయరదంబు డిగివచ్చి యాసాల్వతేయునరదంబు నుగ్గుగా నడిచిన నతఁడుగదపుచ్చుకొనిఁ సీరిఁ గదియ నాలోననదలించి మాగధుఁ డడ్డంబు దాఁకిశరపరంపర లేయ, జడిసి మాగధునిహరులను సారథి నవలీలఁ గూల్చె,తేరిపై నురికి యుద్వృత్తిఁ గంఠమునసీరంబుఁ దగిలించి చెచ్చెరఁ దిగిచిరోఁకట నడపఁగ రుధిరంబుఁ గ్రక్కివీఁకరి మాగధవిభుఁడు మూర్ఛిల్లె;210నక్కజంబుగ వాని నరదంబు మీఁదనెక్కించుకొని సాల్వుఁ డేఁగె నాలోననతనితోడనె యఖిలసైన్యములునాతురఁబడి గుండెలవియంగ బఱచె.

రుక్మి కృష్ణుని తూలనాడుచుఁ గవియుట

అంతకుమును విదర్భాధీశతనయుఁడంతకసముఁడు క్రోధాత్ముఁడై రుక్మితనసేనతోడ ముందఱ నేఁగి కృష్ణుగనుఁగొని భీషణోగ్రస్ఫూర్తిఁ బలికె.“ఓరి! గోపాధమ! ఓడక నన్నుజీరికిఁగొనక నా చెలియలిఁ బట్టికొనిపోయెదికఁ నెందుఁ గొనిపోయె దీవు?నిను నాశరంబుల నీరుఁ గావింతు;"

నని గుణధ్వని సేసి యాఱుబాణములుఁదనువుఁ గీలింప దానవాంతకుఁడునల్లన నవ్వుచు నతనికేతనమువిల్లునుద్రుంచిన వేరొక్క ధనువుఁగొని బాణవర్షంబుఁ గురియఁగ శౌరికనిసి తేజుల సూతుఁ గీటణఁగించిదనువుఁ ద్రుంచుటయు, నాతఁడు వమ్మువోకఘనమైన ఖేటకఖడ్గంబుఁ గొనుచు220హరితేరిపైకి రయంబునఁ గదిసికరవాలమున వేయఁ గమలాక్షుఁ డతనిపలుకయు వాలును బాణాష్టకమునఁదృణమాత్రమునఁ ద్రుంచి ధృతిమూర్చ వుచ్చి

శ్రీకృష్ణుఁడు రుక్మిని ధ్వజస్తంభమునకుఁ గట్టి తల గొరుగుట

తనపాగఁగొని ధ్వజస్తంభంబుతోడమెలివట్టి మెడగట్టి మిడమిడఁ జూడనలుకమైఁ బేర్చి పెద్దమ్మున శిరముఁబలుపున జుట్టును బాఱఁగ గొఱిగియునిచిన భేదంబు నుమ్మలికంబుఁబెనుపాటు గదుర నిర్విణ్ణుఁడై యున్నయన్నను గనుగొని యడలు దీపింపఁగన్నుల నీరొల్క గద్గద యగుచుమొగము వెల్వలబార ముదమున సిగ్గువగయుఁ దోఁపఁగ నిల్చి వైదర్భి పలికె.

రుక్మిణి తనయన్నను విడిచిపుచ్చుమని శ్రీకృష్ణునిఁ బ్రార్థించుట

“అక్కటా! ఈతఁడు నీయంతరం బెఱుఁగకిక్కడ నీచేత నిటుగట్టు వడియెవెరగొప్ప నన్నుఁ దా విడిపింతు ననుచునరుదెంచినాఁడు నాయగ్రజుఁ డితఁడుకలనిలోఁ బడువారిఁ గావక యిట్లుపొలువసేతలు సేయఁ బోలునే యకట!230నన్ను మన్నించి క్రన్నఁనఁ బ్రాణమెత్తుమిన్ని దప్పులుఁ గాచి యతనిఁ బోవిడువు;”మని పల్కు నంతలో నడరి సీరియునుజనుదెంచె వైదర్భి సైన్యంబు బఱచి,హరిఁగూడుకొని సీరి యరడంబు మీఁదఁదురపిల్లు రుక్మి నుదురుఁ జూచి పలికె.

బలరాముఁడు రుక్మిని విడిపించుట

“తగువాఁడు వియ్యము ధరణీశసుతుఁడుతగదిటుసేయ నితని వేగ విడువు”మనిపల్కి బోధించి యతని విడిపించిమనసు క్లేశము మాన్పి మరి రుక్మి ననిపియారామఁ దోడ్కొని యనుజుండు దానుద్వారవతికి నేఁగెఁ దాలకేతనుడుపౌరు లెదుర్కొని పట్టణం బెల్లఁగోరిసింగారింప గురుమూహూర్తమునరాముఁడు హరియుఁ బురప్రవేశంబుఁ

గామించి సేసిరి కడుసంతసమున.గురులచేతను ననుజ్ఞఁ గొని శుభలగ్నమరయించి పెండ్లికి నఖిలవస్తువులుసమకూర్చి బాంధవ సమితి రప్పించి

శ్రీరుక్మిణీదేవి వివాహము

విమలమణిస్తంభవివిధశిల్పముల240నెరవుగాఁ బెండ్లికి వేది దీర్పించిపరవుగా ముత్యాలపందిలిఁ బెట్టిఘంటామృదంగమంగళతూర్యరవములింటింట మ్రోయఁగ నెల్ల వీథులనుగనకతోరణములు గలువడంబులునుగనకకుంభంబులుఁ గర మొప్ప నెత్తికస్తూరిచందనగంధసారాదివస్తువిస్తరధూపవాసనలొలయనందలంబులును నందంద పంపించినందాదిగోపబాంధవుల రప్పించిదేవతాతిథిగృహదేవతార్చనలుగావించి రేవతీకాంతయుఁ దానుతరమిడి యయ్యశోదయును రోహిణియుహరిపరిణయంబున కాత్మల నలరశతకోటికందర్పసన్నిభమూర్తియతులితశృంగార మంగీకరించె.కంతుబాణంబునఁ గడిగినభంగికాంతమైనార్చి సింగారించి తెచ్చి

తనరారు గృహదేవతలయొద్ద నిలిపియనుపమంబగులగ్న మాసన్నమైన250సాందీపనియమితసద్విజోత్తములుఁజెంది పుణ్యాహంబు సేయించి రంత.ఆనకదుందుభి హలపాణియుగ్రసేన నందాదులుఁ జెలులుఁ జుట్టములువలనొప్ప విప్రభూవర వైశ్యశూద్రులెలమి మహోత్సవం బేపారుచుండఁగొమరారు నప్పసిఁడికుడుక నక్షతలునమరఁగఁ దలబ్రాలు నఖిలవస్తువులుబసిఁడిపళ్ళెరముల బహుభంగిఁ బూనిరసికత మీరి పేరంటాండ్రు పాడనాలోన రుక్మిణి నంబుజోదరునిబ్రాలపొంగులమీఁదఁ బరగంగ నుంచితెరపట్టి సౌభాగ్యదివ్యవస్తువులుఁగరముల నునిచి మంగళరావ మెలయనాయెడ ఘడియార మరసి దైవజ్ఞులాయతమాయత మని ప్రీతిఁ బలుకశుభలగ్న మరుదేర సుముహూర్త మనుచునభినుతు లొనరించె నమరసంఘంబు;తెరయెత్త ముఖచంద్రదీప్తులు వొలయయిరువురు నొండొరులీక్షించి రంత;260హరిచూడ్కి సతిచెక్కుటద్దంబులందుఁగరమొప్పు పత్రరేఖలభంగి నమరె;వనితచూపులు హరివక్షంబుమీఁదఁ

బెనుపార నీలాలపేరులట్లుండె;సురభూరుహముమీఁద సురవల్లి నిగుడి,విరులు రాల్చినభంగి వెలఁదొప్ప నెక్కిపరువడిచేఁ దలఁబ్రా లొప్పబోసె;కరమర్థి హరి కరగ్రహణంబు సేయఁగలితమౌ వందిమాగధరావములునుజాలువారు సద్విజాశీర్వాదములునుమంగళపాఠకమహితవాక్యములునింగి ముట్టగను ఘూర్ణిల్లె నంబుధులు.అంత హోమాదికృత్యములెల్లఁ దీర్చిసంతోషచిత్తుఁడై శౌరి పెంపొందె.అనుపమభక్ష్యభోజ్యాన్నపానములఁదనిపి యందఱికిని దగకట్ట నిచ్చినందయశోదల నయవాక్యవస్తుసందోహములఁ బ్రీతి సలిపి వీడ్కొలిపె;శోభనదినములు సొంపార దీర్చియాభామినియుఁ దాను నంబుజోదరుఁడు270కేళిహర్మ్యములందుఁ గృతకాద్రులందుశైలసానువులందు సరసులయందువైదర్భితో రతివల్లభకేళినాదట సుఖలీలలందె మురారి.

ప్రద్యుమ్నుని జననము

అటనొక్క యేడాది కబల రుక్మిణికిఁబటుతరంబైన గర్భశ్రీవహింప

మగువకు ఘృతకశీమంతోత్సవంబునెగడింపఁ దొమ్మిదినెలలు నిండుటయు;హరఫాలనయనాగ్ని నడఁగిన మరుఁడుహరికిని రుక్మిణియందు ప్రద్యుమ్నుఁడనుపేర హరి యవతారభేదమునజనియించెనో యన! జన్మించె తనయుఁడాపుత్రుఁ గనుగొని యతిగారవముగనేపార సంతోష మెసంగి వర్తిల్ల;

పురిటింటిలోనుండి ప్రద్యుమ్నుని శంబరుఁ డపహరించుట

“మువ్వంటుదినమయ్యొ! ముద్దులపట్టినెవ్వఁడో కొనిపోయె నింటిలోనుండ!”అని మహారోదన మటు సేయ శౌరివిని సంభ్రమించి యవ్విధమెల్ల మున్నెయెఱిఁగినవాఁడయ్యు నెఱుఁగనియట్లు.వెఱఁ గంది నలుగడ వెదకంగఁ బనిచె.280వదలకఁ దన పూర్వవైరంబుఁ దలఁచియదయుఁడై శంబకుండను దైత్యవరుఁడుకొనిపోయి జలధి నక్కొమరుని వైచిచనియె, నాశిశువు మత్స్యము మ్రింగె నంత.

సముద్రములో వేయఁబడిన బాలకుని మత్స్యమొకటి మ్రింగుట

ఆనావికులు వల నమ్మీను దిగిచికానుక యిచ్చినఁ గని శంబరుండు

యడబాల కొప్పింపుమని పంచె, వాఁడుతడయక యమ్మీను దళనంబు సేయఁగడుపులోనున్న చక్కని కుమారకునిఁగడు వేడ్క నా దైత్యకాంత కొప్పించె;

మాయావతి ప్రద్యుమ్నకుమారుని మక్కువతోఁ బెంచుట

నంత మాయావతి యాపుత్రుఁ గాంచిసంతసంబునఁ దేలి సౌమనస్యముననాపుత్రు శుభరేఖ లంతరంగముననాపోకఁ గనుఁగొను నందంద పొక్కునక్కున నిడు మద్దులాడుఁ చన్నిచ్చుజిక్క కౌఁగిటఁ జేర్చు చేష్టలు మఱచునీరీతిఁ బెంచగా నెలమి కందర్పుడారూఢయవ్వనుఁడై చూడ నొప్పె;ఆలోలమదనుని యాకారసరసినాలోలనయన మాయావతి మునిగి290

మాయావతి ఆరూఢయౌవనుఁడగు ప్రద్యుమ్నుని గాంచి మోహించుట

రతి కాససేసి గౌరవము వోనాడిచతురత గతులను సరసభావముననాపడఁతి యొకనాఁ డతిరహస్యమునపై పడి పట్టిన భావజుం డలిగి“కటకటా! ఈపని గర్హణంబనకనిటు సేయఁదగునమ్మ! ఇందీవరాక్షి!తల్లివి నీవు నీతనయుఁడ నేను

చెల్లునే పాపంబు సేయంగ నీకు?ఎక్కడ వినఁజూడ మిట్టి దుర్నీతినెక్కడగలిగె! నీ వెవ్వతవ”నుండు;హరికి రుక్మిణికిని యవతరించుటయునెఱిఁగి శంబరుఁడు తానిందుఁ దెచ్చుటయుజేరిన చందంబుఁ జెప్పె, వెండియునునారామ భావజు నల్లన పలికె.“రతి నేను నా పుష్పరతుఁడవు నీవుప్రతిలేని యాదిదంపతులము గానవీండొక గతిగాదు వీని నిర్జించిదండిమై మనము వోదము ద్వారవతికి.ఇతఁడు మాయావిధం బెఱుఁగు నీతనికిబ్రతిలేని విద్య లభ్యాసంబు సేయు;”300మనుచు మాయావతి యమ్మహావిద్యమనసిజునకు నిచ్చె మంత్రయుక్తముగప్రద్యుమ్నుఁ డంత నాపడఁతిచేఁ బెక్కువిద్యలు నేర్చి యా వెలఁదియుఁ దానుధ్రుతిఁబూని వర్తింపఁ దెలిసి శంబరుఁడు

శంబరప్రద్యుమ్నుల యుద్ధము

నతి వేగమునను మహాగ్రహం బొదవమదనునిఁ దెగటార్ప మది విచారించిగదఁగొని లయకాలకాలుఁడో యనఁగఁబఱతెంచి వైచిన భావజుం డలిగియుఱక యాతనివక్ష మురుముష్టిఁ బొడిచె;

వాఁడు మహాశక్తి వైచిన మరుఁడుపొడిగాగ నది ద్రుంచెఁ బుడకచండమున.అప్పుడయ్యసుర మహాబలం బొదవనుప్పరం బెగసి పై నురగమై పడినగరుడుఁడై యాపాము ఖండించె మరుఁడు ;తిరుగక దనుజుఁడు ధీరుఁడై పేర్చివనదమైఁ పాషాణవరుషంబుఁ గురియననిలుఁడై విరియించె, నద్రియై పడినకులిశమై దునుమాడె, కొంకక వాఁడుకలుషించి కేల ఖడ్గము నెత్తుకొనుచు310బలువిడిఁ గవిసిన భావసంభవుఁడుతలఁ ద్రెవ్వనేసె నుద్ధతకోపుఁ డగుచు,దేవసంఘము లార్చె దివిఁ బుష్పవర్షమావిష్ణుతనయుపై నందంద కురిసె.

ప్రద్యుమ్నుఁడు సతితోఁగూడ ద్వారవతికి వచ్చుట

అసుర నీగతిఁ దెగటార్చి, వానింటివసురత్నభూషణావళులెల్లఁ గొనుచునంతరిక్షంబున నాద్వారవతికిగాంతాసమేతుఁడై కంతుఁ డేతెంచె.అంతట బురజనులందఱుఁ జూడనతంత శౌరి గృహంబున నిలువవైదర్భి దగ్గఱవచ్చి యీక్షించియాదవాన్వయజాతు నాజానుబాహునీలనీలాంగు నున్నిద్రాంబుజాక్షు

బాలభానుప్రభాప్రతిమానవస్తుహారకుండలకిరీటాకల్పకలితునారాయణాత్మజు నారీసమేతుఁగనుఁగొని కృష్ణుగానోపు ననుచుననుమానమును బొంది యా కాంత పలికె.“సుందరాంగుండేరి సుతుఁడకో! ఈ తండెందుండి వచ్చెనో! ఎవ్వడో! ఇతని320నేయమ కనియనో! ఈ కుమారకునియేయింతినోచెనో! ఇతని కౌఁగిటికి!”అనిపల్కి తనకన్న యర్భకుఁ దలఁచిస్తనములుఁ జేప బాష్పములుబ్బి నేలఁజింద "నేఁ గాంచిన శిశువు ప్రాణంబులిందాక నుండిన నింతె కాకున్నె!”హరియెడ నాతని యంగంబు సొబగుమెరమెరఁదోఁప నర్మిలిపేర్మిమానదన వసుదేవుఁడు హరియును బలుఁడుజనుదేర దేవకీసతులును దానుమారుని యాకార మహిమ వీక్షింప;నారదుండేతెంచి నలినాక్షుఁ గాంచియెసఁగ బాలుని పురిటింటిలోనుండియసుర యెత్తుకఁబోయినది యాదిగాఁగచెప్పి నీపుత్రుఁడు చిత్తజుండీతఁడిప్పొలంతుక కోడలిది రతిదేవియని చెప్పి నారదుండరుగ నందఱునుమనముల సంతోషమగ్నులైరంత.

కడువేడ్క రుక్మిణి కదియంగ వచ్చికొడుకుఁ గోడలి నెత్తుకొని కౌఁగిలించి330వసుదేవదేవకీవనజాక్షహలులకెసలార మ్రొక్కించి యింపులఁ బొదలె.పురిఁటిలోఁ జెయిదప్పి పోయిన కొడుకుమరలి యిన్నేండ్లకు మగువయుఁ దానునేతెంచె హరిభాగ్య మెట్టిదో! అనఁగఁజాతుర్య సుఖలీల సలిపె మురారి.

సత్రాజిత్తుని వృత్తాంతము

అంత సత్రాజిత్తుఁడను రాజవృషభుఁడెంతయు భయమంది యిందిరావిభునికాస్యమంతకముతో నమృతాంశుమండలాస్యక నిచ్చెదమని చెప్పుటయునువెఱఁగొంది యారాజు వెన్నునికేలవెఱచి యమ్మణితోన వెలఁది నెట్లిచ్చెనాకథఁ జెప్పవేయని వేఁడ శుకుండుప్రాకటంబుగఁ గురుప్రవరుతో ననియె.అనఘ! సత్రాజిత్తుఁడను ధరాధీశుఁడినుగూర్చి తపమాచరింప సౌతనికిమెచ్చి వరంబిచ్చె మిహిరుండు వేఁడనిచ్చె స్యమంతాఖ్య నెసఁగు రత్నంబునామణి వక్షంబునందొప్పఁ దాల్చితామరసాప్తుఁ డితండకో! యనఁగ340ధరణి యేలుచునుండి ద్వారకాపురికి

నరుదెంచి యొకనాఁడు హరిఁజూచు వేడ్కసరసిజసఖుఁ డేల చనుదెంచె! ననుచుఁబురము వారెల్ల నద్భుతమంది చూడశౌరిగేహమునకుఁ జనుదేర, కృష్ణుఁడారాజు మన్నించి యర్థిఁ బూజించియొక కొన్నినెల లుండి యొక్కనాఁ డతని

శ్రీకృష్ణుఁడు సత్రాజిత్తుని స్యమంతకమణిని యాచించుట

నకుటిలచిత్తుఁడై యబ్జాక్షుఁ డనియె;“ఈ రత్న మిమ్ము నీ కేవస్తువైనఁగోర నీ కిచ్చెదఁ గొనుమన్న" నృపతి“కనకంపుమాడలుఁ గడఁగి యిచ్చలునునెనిమిది బారువులిచ్చు నీరత్నమెవ్వరిచే నున్న నీతిబాధలును,జివ్వయు దురితముల్ చెందవు నరులనినదత్తమీరత్న మీనోప” ననుచుధనలోభమున బల్కెఁ దగువాఁడు దన్నునడిగిన వస్తువు లడఁచి యీనేరకడలిన దుఃఖార్తులగుటెందు నరుదె!

సత్రాజిత్తు ప్రసేనునకు మణినిచ్చుటయు, వాఁడు వేటకుఁ బోవుటయు

వనజాక్షునకు నీక వంచించి రత్నమనుజునికిచ్చిన నాప్రసేనుండు350

నామణి ధరియించి యశ్వంబు నెక్కికామించి యడవి కొక్కఁడు వేఁట వెడలిమృగముల నొంప నమ్మేదినీవరునిమృగరాజు చంపి యామిషశంక నతనిమెడనున్న రత్న మర్మిలిఁ గొంచు కొండపడలోని కరుగంగ భల్లూకవిభుఁడుయా కేసరినిఁ ద్రుంచి యామణిఁ గొంచుఁబ్రాకటంబుగ మహాభవనంబు సొచ్చె.అంత సత్రాజిత్తుఁ డనుజుఁడు రామికెంతయుఁ జింతించి యిచ్చలో వగచె.

సత్రాజిత్తు శ్రీకృష్ణుడు మణి నపహరించెనని సందేహించుట

“కటకటా! అడవి కొక్కరుఁడునుఁ బోయెఁగుటిలత నెవ్వరు కూల్చిరోగాక!తనకు నమ్మణి యీని తప్పున శౌరిమనప్రసేనుఁ బట్టి మడియింపఁబోలు!అతఁడేల లోబడు నన్యులచేత?ఇతరులీసాహసం బేల కావింత్రు?అడిగిన యీ నేరకనుజన్ముఁ గోలుపడితినక్కట!" అని పలవింపుచుండవిని పౌరులెల్లను విష్ణుని దలఁచియనుమానపడుచుండ నామాట లెఱిఁగి360యపరిమితజ్ఞాని యగు శౌరి యట్టియపకీర్తి నెబ్భంగి నడఁగింతు ననుచు

నడవికిఁ దను బౌరులందఱుఁ గొలువఁ

శ్రీకృష్ణు డపవాదమును సహింపక మణిని వెతుకుటకై యడవికిఁ బోవుట

గడువేగ నరిగి సింగముచేతఁ బడినహయముఁ బ్రసేనుని యచ్చోట గాంచిరయమున సింహనిర్గమనమార్గమునఁజని ఋక్షవిభుచేతఁ జచ్చినసింహమునుగాంచి పురజనంబుల కెల్లఁ జూపియాగుహవాకిట నందంఱ నునిచివేగమే కృష్ణుఁడా వివరంబు సొచ్చి

శ్రీకృష్ణజాంబవంతుల సమావేశము

చనె; జాంబవంతుని సదనంబు నందుఁదనరారు సఖి నునుతల్పంబు మీఁదఁదనయ నందిడి దాది దానికి రత్నమనునయంబునఁ జూపి యాడింప, కృష్ణుఁడరుదేరఁ బొడగాంచి యదరి యేడ్చుటయుఁబరుషత భల్లూకపతి యేఁగుదెంచి

శ్రీకృష్ణజాంబవంతుల యుద్ధము

యట్టహాసము సేసి హరిఁగిట్టి ముష్టిఘట్టనంబులఁ బాదఘాతల నొంపఁగడఁగి మాధవుఁడు నిర్ఘాతంబు వోనిపిడికిటఁ బొడిచిన బెదరక జాంబ370

వంతుఁడు మురవైరివక్షంబుఁ బొడువనంతకాకారుఁడై హరి వానిఁ దాఁకె.ఇరువురు నీరీతి నిరువదిదినములురువడి పోరాడి యొగి కైటభారిభల్లూకపతిగుండెఁ బగులంగఁ బొడువనొల్లనొల్లన వోయి యురుమూర్ఛఁ దెలిసియేయుగంబులయందు నీరీతిఁ దొడరిపాయకిర్వదినాళ్లు బవరంబు సేయనెవ్వీరునకుఁ జెల్లు నతఁడెంత సేసెనెవ్వరొకో! అని యిచ్చలోఁ దలఁచియంబుజోదరు నట నాత్మలోఁ దెలిసిజాంబవంతుఁడు భక్తి సాష్టాంగ మెఱఁగిచేతులు మొగిడించి శిరసునఁ దాల్చి.యాతతప్రీతి నిట్లని సన్నుతించె.“దేవ! జగన్నాథ! దేవేంద్రవంద్య!గోవింద! కృష్ణ! ముకుంద! సర్వేశ!నీవాదిమూర్తివి నిగమార్థవిదులుభావించి కనియెడి పరమాత్మవీవ!పొరిపొరి బ్రహ్మవై పుట్టింతు జగము!హరిమూర్తివై నీవె యనిశంబు బ్రోతు!380హరుఁడవై యడగింతు వఖిలభూతములఁబరమాత్మ! నీలీలఁ బ్రణుతింప వశమె?దశరథాత్మజుఁడవై ధరణిఁ బాలించిదశకంఠు గెలిచి సీతాదేవిఁ దెచ్చుశ్రీరాముఁడవు నిన్నుఁ జింతింప మఱచి

వైరంబు గొని పోరి వంచితు నైతినాతప్పు సైరించి నన్ను మన్నించునీ తత్వ మెఱుఁగంగ నేర్తునే” యనిన“నాతోడ నిరువదినాళ్లు పోరాడభూతేశునకు నైనఁ బోలునే యందుఁబెద్దవు నీవు నాపిడికిళ్లు దాఁకి

శ్రీకృష్ణుఁడు జాంబవతీకన్యను బరిగ్రహించుట

తద్దయు నొచ్చె నీ తను"వంచుఁ బలు కసరసిజోదరుఁడు ఋక్షపున కిట్లనియె.“ధరణిపై నీస్యమంతక నిమిత్తమునఁబరపైన యపకీర్తి పాటిల్లె మాకు;నేపార నీరత్న మిచ్చి సంప్రీతివేపంపు” మనుటయు విని భల్లుఱేఁడునామణి నర్పించి యాత్మసంజాతవామలోచన జాంబవతినిచ్చి హరికిఁబ్రణమిల్లి “ఈకన్యఁ బత్నిగా నేలుప్రణవాత్మ!" అనిపల్క, పద్మాక్షుఁ డతనిమన్నించి కన్యకామణితోడ మణిగ్రన్ననఁ గైకొని కదలి యేతెంచె.390

బిలద్వారమందుండిన పౌరులు పురమును జేరి శ్రీకృష్ణుఁడు మడిసెనని చెప్పుట

చెన్నార వెన్నుని సేవించి వచ్చి

మున్ను బిలద్వారమున నున్న పౌరులాకంజలోచనుఁ డాపెడ నడఁగిరాకున్న బెగడి పురంబున కరిగియావార్త నెఱిఁగింప నఖిలబాంధవులుదేవకియును వసుదేవుఁడుఁ గలఁగిదేవతాగణముల ద్విజలోకతృప్తిఁగావించిరంత; నామలలోచనుఁడుద్వారకాపురి సొచ్చి తగ నుగ్రసేనునారూఢగతిఁ గాంచి యందఱుఁ జూడఁబ్రీతి సత్రాజిత్తుఁ బిలిచి ప్రసేనుఁడాతల వని మృతుఁడైన చందంబుమరి జాంబవంతుఁడు మణి హరించుటయుసరయ నాతఁడు కయ్యమాడిన తెఱఁగునచ్చుగా నెఱిఁగించి యతని కారత్నమిచ్చి మనోవ్వధ నెడలె మురారి.400ఉత్తములగు వారికొక నింద వొడమనుత్తలపడి తీర్ప కోర్తురే నిలువ!అంత సత్రాజిత్తుఁ డమ్మణి దానవాంతకుచేఁ గొని యంతరంగమునసిగ్గును దుఃఖంబుఁ జిడిముడిపాటునగ్గలంబొదవ నిట్లని విచారించె.“అక్కటా! శ్రీనాథు నఖిలలోకేశునెక్కటి నిందించి నృపకోటిలోనఁబాపంబు సేసితిఁ బద్మాక్షుచిత్తమేపాటి నొచ్చెనో యేమిగాఁగలదొ?

హరిమానసము రోషమడఁగెడు నట్టివెర వేదియో యని విన్నపాటు నొంది

సత్రాజిత్తు సత్యభామను శ్రీకృష్ణునకు భార్యగా నర్పించుట

తనకూఁతు సత్య నుత్తమగుణాభరణఁదనరార గైసేసి తనవారుఁ దానుమణితోడఁ గామినీమణి నొప్ప నిచ్చియణిమాదిగుణపూర్ణుఁడగు హరి కనియె.“పరమేశ! నాకూర్మిపట్టి యీకన్యఁబరిణయంబై రవిప్రభ నొప్పుమణియుధరియింపు” మన్న మాధవుఁడా నరేంద్రుఁగరుణించి నెమ్మోముఁ గనుఁగొని పలికె.410“అరులు మిత్రులు నాకు నరయంగ లేరుపరమాప్తుఁడవు మాకుఁ బావనచరిత!ఈనాతి నిమ్ము నాకిమ్మహారత్నమేనొల్ల నే నీకు నిచ్చితి” ననుచునాతని కర్పించి యాసత్యభామఁబ్రీతిని బెండ్లాడె పీతాంబరుండు,సత్యభామయుఁ దాను సంప్రీతితోడనత్యుదాత్తసుఖంబు లందె మురారి.

శ్రీకృష్ణబలభద్రులు కరిపురంబునకు వెడలుట

ఆలోనఁ బాండవులట లక్కయింటఁగాలి చచ్చుట విని కాలక నుంట

దెలిసినవాఁడయ్యుఁ దెలియని యట్లుబలభద్రుఁడును దాను బయనమై కదలికరిపురంబున కేఁగి గాంగేయ విదురకురుపుంగవులఁ గనుగొని పాండుసుతులఁదలఁచి దుఃఖించి బాంధవులును దానుకలిసి వర్తింప; నక్కడ నొంటియైన

శతధన్వుఁడు సత్రాజిత్తుని వధించి మణిని హరించుట

యక్రూరకృతవర్మ లా కృష్ణుతోడవక్రుడౌ శతధన్వు వడిఁ జూచి పలికి“రడరుచు సత్రాజతను వాఁడు నీకుఁగడఁగుచు యీనున్న కన్యయు హరికి420నిచ్చె నాతని రత్న మే వెంట నై నపుచ్చుకొమ్మ" నుటయుఁ బొరి నొక్క రాత్రితనయింట నున్న సత్రాజిత్తు నిద్రదనిసి యుండగ మెడఁ దఱిగి వధించె.తరుణులందఱు నేడ్వఁ దనరి యామణినిహరియించె శతధన్వుఁ డఱ యింతలేకసత్యభామయుఁ దండ్రి చావున కడలియత్యంతశోకాన నతని కాయంబుఁదైలపక్వముఁ జేసి తగుచోట నునిచియా లేమ కరిపురి కరుదెంచె నంత.

శ్రీకృష్ణుఁడు శతధన్వునిఁ జంవుట

ఆమాట విని కృష్ణుఁ డబల నూరార్చి

రాముఁడుఁ దానును రథమెక్కి కదలితరలాక్షిఁ దోడ్కొని ద్వారకాపురికినరుదేర శతధన్వుఁ డాస్యమంతకమునక్రూరునకు నిచ్చి యతిజవాశ్వంబువిక్రమంబున నెక్క, హలియును దానుపటురయంబున వానిపజ్జఁ దాఁకుటయుఁజటులత వాని యశ్వము జవం బెడలిభరమోర్వకను బడి ప్రాణముల్ విడిచె.తురగంబు కూలినఁ దోరంపు భీతి430నాతఁడు కాల్నడ నరుగుటఁ జూచియాతతరయమున నరదంబు (ద్రోలిఘనచక్రధారచేఁ గంఠంబు నఱికితనువెల్ల నరసి రత్నముఁ గాన లేక“శతధన్వు నూరకే చంపితి నకట!ఇతడు మహామణి నెందుంచినాఁడొ?అరసికొందము గాక" యని రథం బెక్కియరుదేర హలపాణి హరి కిట్టులనియె.

బలరాముఁడు మిథిలానగరమునకు వెళ్లుట;అచ్చట దుర్యోధనుఁ డతనివద్ద గదాయుద్ధ మభ్యసించుట

“ఈ మిథిలాధీశుఁ డితఁడు నాసఖుఁడుకామించి యారాజుఁ గాంచి వచ్చెదనునీవు పొమ్మని” పల్కి నీలాంబరుండుఁవేవేగ మిథిలకు విచ్చేయ నతఁడుయెదుఱేఁగి సీరికి నెంతయు వేడ్కఁ

జదురొప్ప దేవోపచారసత్క్రియలునతిభక్తిఁ బూజింప నతనిగేహమునఁజతురత నొకకొన్ని సంవత్సరములుకలసి వర్తింప నక్కడ సుయోధనుఁడుహలితోడఁ బటుగదాభ్యాసంబు సేసె.

అక్రూరుని వృత్తాంతము

వనజాతుఁడును ద్వారవతికి నేతెంచితనరారు మణి శతధన్వుని వద్దఁ440గానక యుండుటఁ గాంతకుఁ జెప్పిపూని సత్రాజిత్తు భూమివర్యునకుఁబరలౌకికంబులు భక్తిఁ జేయించె.అరయ నారత్నంబు యక్రూరుఁ డెత్తికొనిపోయి వనభూమి కుశలియై యుండె.అనఘమానసుఁ డైన యక్రూరుఁ డరుగనాపట్టణంబున నఖిలమంత్రులకుదూపిల్లె భయకష్టదుష్టరోగములు.అని చెప్పుటయు విని యక్రూరుఁ డెట్లుఘనపుణ్యుఁడయ్యె నక్కథఁ జెప్పుమనుఁడు;మున్నశ్వపాలుఁడు మొగి ననావృష్టిఖన్నుఁడై కాశి కేఁగినఁ గాశిరాజుహరువరంబునఁ గనె యమృతాంశువదనఁదరలాక్షికాందిని తన కూర్మిపుత్రి;ఈకన్నెచే నన్ని(యీతి)బాధలునుశోకరోగాదులు సోఁకక యడఁగు;

ఆకన్యఁ బ్రీతిమై యశ్వపాలునకుఁజేకొని వడిఁ బెండ్లి సేసి పంపుటయునానాతి వరియించి యఖిలదుఃఖములుమాని సుఖించ నమ్మనుజవల్లభుఁడు.450ఆయింతి సుతుఁడైన యక్రూరుఁ డలిగిపోయినకతమునఁ బుట్టె నీపాప

అక్రూరుని శ్రీకృష్ణుఁడు పిలిపించి బుద్ధులు చెప్పి మఱల వానికే మణిని ప్రసాదించుట

మనిచూచి శౌరియు నక్రూరుఁ బ్రేమఁబనివడి దూతలఁ బంచి రప్పించియతనితో నొక్కనాఁ డతిరహస్యమునశతదళనేత్రుఁడు చతురుఁడై పలికె.“అడరి సత్రాజిత్తు నడఁచి మాణిక్యమురవడిఁ గొంపోవ నొగి వెంటఁ దగిలిశతధన్వు నూరకె చంపితి గానియతులితంబగు రత్న మతనిచేఁ గానమక్కటా! శ్రీధనం బది పాడిగాదుయిక్కువ జ్ఞాతుల కిది యహితంబునీయింట నతని మానిక ముండె గానయీయధ్వరములు నీకిటు సేయఁగల్గెనిది నాకుఁ బ్రియమన్న" నిందిరావిభునిపదపంకజములకుఁ బ్రణమిల్లి యతఁడు“గోవింద! కృష్ణ! ముకుంద! మురారి!పావనగుణపూర్ణ! పద్మాయతాక్ష!

సర్వాత్మలందును జరియించు నిన్నుసర్వేశ! ఎఱుఁగంగఁ జనునయ్య నాకు”460అని పల్కి హరిచేతి కక్రూరుఁ డెలమితనరార నాస్యమంతక మిచ్చి మ్రొక్కెశౌరి సంతసమంది జ్ఞాతులు చూడఁగోరి యారత్న మక్రూరున కిచ్చె!ఈ కథవిన్న మీ కీప్సితార్థములుప్రాకటంబుగ నిచ్చు భవబాధ లుడుగునపకీర్తు లడగించు నఘములుఁ జెఱచుఁగపటంబు లెడలు మంగళములు నిచ్చు"నని చెప్పి మరియును నంబుజోదరుఁడు

శ్రీకృష్ణుఁడు ఇంద్రప్రస్థపురమునకు వెడలుట

తనరంగ నింద్రప్రస్థంబున కరిగె.అఖలలోకారాధ్యుఁడగు విశ్వగురుఁడుసుఖతరంబుగఁ బాండుసుతుల నీక్షించిసుదతి గొంతికి ధర్మసుతునకు మ్రొక్కి,కదియంగ భీమునిఁ గౌఁగిటఁ జేర్చినవ్వుచుఁ దనమ్రోల నమ్రులై యున్నకవ్వడికవల నొక్కట నెత్తి ప్రేమనందఱి సేమంబు లడుగంగ వారలందఱుఁ బూజింప నానందమందిగొంతియుఁ గృష్ణు నక్కునఁ జేర్చి దుఃఖమంతకంతకుఁ బేర్చి యార్తిమై నేడ్వఁ470గరపల్లవంబునఁ గన్నీరుఁ దుడిచినరుదండఁ దన మేనయత్త నూరార్చి

ధర్మనందను గేలు తనకేలఁ బట్టియర్మిలి నిగుడ నిట్లనియె నాశౌరి,

శ్రీకృష్ణుఁడు పాండవుల క్షేమవార్తల నరయుట

“అక్కటా! దుర్మదులగు శత్రుజనులుపెక్కు పాటుల మిమ్ముఁ బెట్టంగ వినుచునొప్పగించిన యట్టులుంటిమి గానియప్పటప్పటికి మిమ్మరయంగ లేకదైవంబుకతన నింతటి బాధలుడిగెనేవిధంబునఁ బుణ్యులీలోకములును;”అనవుఁడు ధర్మరాజా కృష్ణుఁ జూచివినయ బాంధవములు వెలయనిట్లనియె.“అనఘాత్మ! నీ మర్మమరయక యున్నమననేర్తుమే మేము మర్త్యులలోన?తల్లియుఁ దండ్రియుఁ దైవంబు గురుఁడునెల్ల బాంధవులును నిల నీవె మాకు!ఈ కొద్ది వాక్కేల నిహపరంబులకుమాకెవ్వరున్నారు? మధుకైటభారి!”అనుచు మజ్జన భోజనాది సత్కారవినయోపచారాది విధులఁ బూజింప480హరియుఁ బాండవులును నన్యోన్య మైత్రినురుతరంబుగ నుండ నొకయేఁడు చనియె.

శ్రీకృష్ణుఁడును బార్ధుఁడును వేఁటకై వెడలుట

అత్తరి నొకనాఁడు హరియుఁ బార్ధుఁడును

జిత్తాబ్జముల వేడ్క చిగురులు వొడమవాయు వేగములైన వాజులఁ బూనియాయుధ పరిపూర్ణమగు రథంబెక్కియగణిత సారమేయావళితోడమృగయలాయుధ రశ్మి మెఱసి తో నడువఁగాకోల భీకర కాకోదరంబుఁగాక ఝిల్లికము భీకర రావకులమునపరిమితాభీల హర్యక్ష కులముకుపిత కోలాంగూల కోలాహలంబుకరితుండ ఖండిత ఘన పిప్పలంబువర తపః పరికీర్ణ పల్లవ స్థలముప్రకటిత కుంజర వ్రాత కంటకమువికృత భల్లవ్యాఘ్ర వృక సమూహంబునగు మహారణ్యంబు నందంద చొచ్చిమృగయానురక్తులై మెలఁగి యాలోనవలలొగ్గి తెరలొత్తి వర భటోత్తములుబలిసి కొమ్ములనుండి పదిలమైనూఁద490పరఁగఁ గిటివ్యాఘ్ర భల్లసారంగకరి సింహ శరభ ఖడ్గకలులాయములుగండభేరుండాది ఘనమృగాదులునుదండిమైఁ బరవర్వెఁ ,దగిలి యేయుచునుగుక్కల విడుచుచుఁ గోరి పెన్వలలునెక్కొనఁ జుట్టియు నిబిడాస్త్రసమితిఁబొలియించియును మృగంబులఁ గీటణించియలసి కృష్ణార్జునులర్కకన్యకకుఁ

జనుదెంచి శీతలజలమాని తీరమునఁ దరుచ్ఛాయ నిమ్ముల విశ్రమింప

కాళిందీపరిణయము

రక్తాబ్జపదతలరాజీవ వదనమౌక్తిక మణిదంత ఘనమాననయనపులిననితంబ కంబుపమానకంఠయావర్తనాభ రథాంగ వక్షోజశైవాలరోమసంచయ బిసపాణియననొప్పు కాళిందియను వరారోహచనుదెంచి కృష్ణుని సన్నిధి నిలువ;వనిత సౌభాగ్య లావణ్య చాతుర్యమనిమిషనేత్రుఁడై హరి చూచెనంత,500నరుఁడింతిఁ గనుఁగొని “నలినాక్షి! ఏఁటికరుదెంచితీ వెవ్వె”రని పల్కుటయును,మురిపెంపు సిగ్గును మోమున బెరయఁదరలాక్షరోచులు దనర నిట్లనియె.“కాలాత్ముఁడగు సూర్య కన్యక నేనుకాళింది యనుదానఁగమలాక్షుఁగూర్చితపమాచరింతు నీ తటమున, వేఁటనెపముననేతెంచు నీరజోదరునికామించి వచ్చిన కార్యమం”చనిన;ఆమెను మన్నించి హరి తోడుకొనుచుకరిపురి కేతెంచి కాళింది కన్యఁబరిణియంబై యొప్పెఁ బద్మలోచనుఁడు.

అర్జును రథసూతుఁడై తోడువచ్చినిర్జరాధిపునాజ్ఞ నెదరి ఖాండవముహుతవాహనునికి నాహుతిగా నొనర్చియతనిచే గాండీవమనుపేరి ధనువుఁదఱుగని యమ్ములుఁ దరుచర ధ్వజమువఱలెడు రథమును వాజులుఁదెచ్చినరునకు నిచ్చె; నానరు చేత మయుఁడుదరికొను ఖాండవ దహనంబుఁ బాసి510బ్రదికి సభామంటపంబును గట్టిగదయు శంఖమునిచ్చి కడుభక్తి నరిగె.హరియును రథమెక్కి యతివయుఁ దానుదరమిడి చనుదెంచె ద్వారకాపురికి;సాత్యకి నరుతోడ శస్త్రాస్త్ర విద్యనత్యుదాత్తత చేర్చి హరిఁ గొల్చివచ్చె;హరియుఁ గాళిందియు నసమాస్త్రుకేళిసరస సౌఖ్యక్రీడ సలిపి రింపొంద.

మిత్రవిందాపరిణయము

వారక నాలో నవంతిభూపతులువీరులు విందానువిందులు ప్రేమఁదమ ముద్దు చెలియలి ధవళాయతాక్షివిమలేందువదన సంవ్రీడనిదాననారూఢలీల స్వయంవరోత్సవముగారవంబునఁ జేయగాఁ గృష్ణుఁడెఱిఁగిచని భూపతులనెల్ల జడిసిపోఁద్రోలి

వనితఁదోడ్కొని వచ్చె ద్వారకాపురికి.

సత్యాపరిణయము

అగ్నిజిత్తుండను నా రాజుతనయనగ్నిజిత్తాఖ్య నాయబ్జలోచనుఁడుకడు వేడ్కతోఁ బెండ్లిగానిచ్చఁగోరికడఁకఁ గోసలపతికడకేఁగె నతఁడు.520కొనకొని హరి నెదుర్కొని తోడుకొనుచుఁజని యిష్టపూజల సంప్రీతుఁజేసి“కారుణ్య గుణపూర్ణ! కల్యాణశీలవారిజోదర! లోకవంద్య! శ్రీకృష్ణ!నా యింటి కరుదెంచి నన్ను మన్నించితే, యుగంబులయందు నేఁ గృతార్థుండనేమి విచ్చేసితి రెరిగింపు”మనినఁదామరసాక్షుఁడాతనికిట్లు జెప్పె.“నీ కూఁతు సత్య నున్నిద్రాంబుజాక్షిమాకు ని”మ్మనిన నమ్మనుజేంద్రుఁ డనియె.“హరి! నీవు మా యింటి యల్లుండవౌటపరమ కౌతుకము మా బంధులకెల్లనీ పట్టణంబున నేడు శాశ్వతమునేపారు నురు వృషభేంద్రంబు లిట్లుశాతశృంగోత్తుంగ చటుల సత్వమునభూతలాధీశులఁ బొలియించుచుండువాని నేడింటిని వసుధపైఁ గూల్చువానికిఁగాని యీ వనిత నీననుచు

నొక వెఱ్ఱితనమున నున్నాఁడ గాకయకలంక! నీ కంటె నధికులు గలరె? 530ఈకొని యుంకువ యిద్ది యొండొల్లనీకసాధ్యంబేది? నీరజోదరుఁడ!అని లోన నాఁబోతు లన్నింటి నడఁచిపెనుపార నీకన్యఁబెండ్లిఁగ”మ్మనిన;హరి యేడురూపుల నాఁబోతుఁ గమిసిపరువడి లేఁద్రాటఁ బట్టి బంధించిధరఁ గూల్చి పేర్చిన దైత్యారిఁ జూచిపురజనులద్భుతంబును బొంది చూడనా పౌర కామినులంబుజోదరునిచూపు చెంగలువల సొరిదిఁ బూజింపనీ కృష్ణుఁడిట దానె యేతెంచి పొందునీ కన్య సౌభాగ్య మెట్టిదో యనఁగ!శుభలగ్న మరుదేర సుందరీతిలకనభినవంబుగఁ బెండ్లియయ్యె మురారి.అతిసంభ్రమంబున నా కోసలేంద్రుఁడతిశయంబుగఁ గన్యకరణంబుగాఁగఁబదివేలు గోవులఁ బదివేలు కరులవిదితంబుగా మూఁడువేల యింతులనుజటులవాహముల వింశతిసహస్రములపటుశతాంగంబులు పదివేలనిచ్చి540యనిచి పుత్తేరంగ నంబుజోదరుఁడువనితఁ దోడ్కొని ద్వారవతి కేఁగుదెంచిసత్యయుఁ దానును సౌభాగ్యలీల

నత్యుదాత్తత సుఖంబందె మురారి

శ్రీకృష్ణుఁడు భద్రను లక్షణను వివాహమాడుట

పూని కేకయరాజపుత్రిని భద్రమేనత్తకూఁతు నర్మిలిఁ బెండ్లియయ్యె.మరి స్వయంవరమున మద్రేశతనయనరమి లక్షణఁ బెండ్లియయ్యె మురారి.వఱలు రుక్మిణి జాంబవతి సత్యభామమెఱయు కాళిందియు మిత్రవిందయునుసత్యయు భద్రలక్షణయును ననఁగనత్యుదాత్తత భామలయ్యెనమండ్రుపట్టపుదేవులై భాసిల్లుచుండనెట్టన నరకుని నిర్జించి శౌరివెలఁతుల పదియాఱువేలను దెచ్చియెలమి పెండ్లయ్యె నంచిట్లు సెప్పుటయు;నరకుఁ డెవ్వఁడు? వాని నలినాక్షుఁ డేలఁబరిమార్చె? నెక్కడి పడఁతులు వారు?ఈ కథ నెఱిఁగింపుమని వేఁడుటయునుజేకొని శుకయోగి చెప్పంగఁ దొడఁగె.550

నరకాసురుని వృత్తాంతము

ధరణీసుతుఁడు నుద్ధత బాహబలుఁడునరకాహ్వయుండు దానవకులేశ్వరుఁడువరశక్తి మహిమ దుర్వారసత్వమునధరణిపైఁ గల రాజతతి నెల్ల నోర్చి

తన శాసనంబులఁ దగనిల్పి యంతఁదనివోక యతిబలోదగ్రుఁడై నడచియమరాధిపతిఁ గెల్చి యగ్ని నోడించిశమనుని గెల్చి రాక్షసుఁ బార ద్రోలివరుణ గర్వము మాన్పి వాయువుఁ బఱపిపొరి కుబేరుని ద్రోలి భూతేశుఁ గిట్టివనధీశుపాశంబు వజ్రివజ్రంబుధనదుని పెన్నిధుల్ తనసొమ్ముగాఁగనదితి కుండలములు హరియించి యెందునెదురెవ్వరునులేక యేపు దీపించిప్రాగ్జోతిషంబుగాఁ బరఁగు(దుర్గాన)దిగ్జేయశక్తి వర్తింపుచో నంత;

దేవేంద్రాదులచేఁ బ్రార్ధింపఁబడి శ్రీకృష్ణుఁడు నరకునిపై దండెత్తుట

దేవేంద్రుఁడును సర్వదిక్పాలకులునుగోవిందుతో నర్ధిఁ గూడి చెప్పుటయువిని సత్యభామతో విహగంబు నెక్కిచనుదెంచి ప్రాగ్జోతిషము మీఁద శౌరి560గిరి దుర్గమంబు నగ్నిపరీతమగుచుమురయంత్ర బహుపాశములఁ జుట్టివచ్చిపరులకభేద్యమైఁ బరగు నప్పురికినరుదెంచి పాంచజన్యధ్వాన మెసఁగనార్చిన నతిభీషణార్చులు నిగుడపేర్చి మిన్నందిన భేదింపరాక

హరి శార్ఙ మెక్కిడి యయ్యగ్నిఁ జల్లార్చికులిశబాణంబునఁ గోటలుఁ గూల్చిబలువిడి మురయంత్ర పాశంబులడచిదానవసేనలు దఱిమి పై నడవనానాస్త్రములఁ ద్రుంచె నలినాక్షుఁడంత;

మురాసురసంహారము

అంతయుఁ గని మురుఁడతి రౌద్రమెసఁగనంతకాకారుఁడై యైదు మోములనుఘనరోష విస్ఫులింగములుప్పతిల్లసునిశిత కీలోగ్రశూలంబుఁ గ్రాలఁగలుషించి జగములొక్కట మ్రింగఁజూచుప్రళయ కాలమునాటి ఫాలాక్షుఁడనఁగదట్టించి హుంకార ధ్వని దిక్కులగలనట్టహాసము సేసి హరిమీఁదఁ గవిసె.570జ్వాలా కరాళ జిహ్వమగు శూలానవ్యాళాహిదమనుని వైచె తాఁగదసికడుఁబేర్చి నిసితమార్గణములు మూఁడుతొడిగి శూలంబుఁ దుత్తునియలు చేసె.నురుశరాష్టకమున నురమాడ నేయఁదిరుగక దైత్యుఁడు తీవ్రకోపమునహరిపై మహాశక్తి నదరింప శౌరిశరములు మూఁట జర్ఝరితంబు సేయగదఁగొని లయకాలకాలుఁడు వోలెచదియఁ బక్షీంద్రు పక్షము వ్రేయుటయును

హరి నందకంబెత్తి యమ్మురాసురునికరమును గదయును ఖండించివైచె.యాదవోత్తముఁడు చక్రాభీలధారనైదు శిరంబుల నవలీలఁ దునుమబలభేదిచేఁ గూలు పర్వతం బనఁగనలవరి మురదైత్యుఁ డవనిపైఁ గూలె.

మురాసురుని పుత్రులు తామ్రాదుల యుద్ధము

ఆమురాసుర పుత్రులైన తామ్రాదులాముకుందుని మీఁద నందంద కవిసికరవాలముసలముద్గరభిండివాలపరశుతోమరగదాపాశశక్తులను580బలములుఁ దారును బాణజాలములబలువిడి గురియించి పక్షీంద్రుమేనుహరిమేను నొ(ప్పింప హరియుఁ గోపించి)కరములఁ ద్రెవ్వి యంగంబులఁ దునిమిబరులు వ్రక్కలు వాపి పథములు మురిసిశిరములు.................పగిలియెమ్ములు చిద్రుపలై యెఱచులు చదిపియమ్ములు పొడిపొడియై జోళ్లు విఱిచికరుల...............................................రవరలై ధాత్రి దొరగెనందంద మేనులు నన్నిచందములఁజిందువందై హతశేషులు వఱవ

నరకాసురుని యుద్ధము

..............చ్చి నరకుండుగ్ర స్ఫూర్తిదనరమకుట కుండల దీప్తి మలయుచు నిగుడనగణిత కటక హారాది....................రుకేతన కాంతి దళదళ వెలుఁగచరమాద్రిపైఁ బొల్చు సప్తాశ్వుఁడనఁగయరదంబు ..........................................రాధీశు మాడ్కిహరిఁదాకి పెల్లేసె నమరులు దలఁక     590శౌరియాతని యంపజడి మాన్పి రెండునా.............................................................డిసోలి గొబ్బున లేచియార్చి మహాశూలమంకించి వైవనెదువంశవల్లభుఁడాఱు బాణముల..........................లుగమ్ములు జొనిపెగరుడుని రెక్కలు కసరంద నేయనురగారి పటునఖోద్ధూతఘట్టనలఁ(గదియుచు) నదియును ఖండించె; శౌరిత్రిదశులు భీతిల్ల దిక్కులల్లాడప్రళయభానుప్రభాపావక శిఖల.........................................,(దను)జాధివుని మేనుదారించి శిరముఘనతీవ్రధారను ఖండించుటయునుమండిత మణిదీప్తి మకు................,............................................,

(క్రూ)రాత్ముఁడగు నరకుఁడు గూలుటయునుబోరన మందార పుష్పవర్షములుదివిజులు..............................,.........................వినువీధిఁ బొలిచె.600

భూదేవి తనకుమారుఁడు నరకుని చావునకై దుఃఖించుట

తనయుఁడు గూలిన ధారుణి దుఃఖవనరాశిలో మున్గి వనమాలి మ్రోలకటక తాటంక కంకణ చారుహారపటురత్న భూషణ ప్రభలు శోభిల్లవరుణాత పత్రంబు వాసవ జననియురుతర కుండల యుగళంబుఁ దెచ్చిహరికి సమర్పించి.............................,పరమానురక్తిమైఁ బ్రార్ధింపఁ దొడగె

భూదేవి శ్రీకృష్ణుని బ్రార్ధించుట

“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిహ్న!భానువత్సంకాశ! భక్తలోకేశ!కంబుచక్రగదాశి ఘనశార్ఙహస్త!అంబుజనాభ! పీతాంబరాభరణ!విశ్వవిశ్వంభర! విశ్వైకజనక!శాశ్వత! సర్వజ్ఞ! సర్వలోకేశ!నీలామనోనాథ! నిఖిలాండనాథ!

ఉరురజోరూపుమైఁ బుట్టింతు జగముఁబరమ! సత్వస్థితిఁ బాలింతు వీవతామసరూపుమై దండింతు వీవనీమేన జనియించు నిఖిలభూతములు610నవని యప్పులునభమగ్ని వాయువులురవిసుధాకరులాత్మ రాజీవభవులుఁసకలేంద్రియంబులు సకలశక్తులునుసకలంబు నీరూపు చర్చించి చూడ!పూతాత్మ! శ్రీకృష్ణ! పురుహూతవంద్య!నీ తత్వమెఱుఁగంగ నేనెంతదాన?నరకుండు నీ దయ నాకుద్భవించువరపుత్రుఁడీతఁడు వరశక్తి పేర్మిదేవతాద్రోహియై తెగియె నీచేతదైవీక మెవరికిఁ దప్పింపరాదు!కావున నితనికి గలిగె నీలోకమేవిధంబున ధన్యుఁడిది లెస్సయయ్యె!దురితారి! వానిపుత్రుఁడు భగదత్తుఁగరుణించి నీవ యిక్కడ ప్రతిష్టింపు”,మని మ్రొక్కి ధరణి జయాంకమై బఱఁగువనమాల మురవైరి వక్షంబునందుపూజించి వీడ్కొని భూదేవి చనియె.

పదియాఱువేల గోపికలను శ్రీకృష్ణుఁడు పెండ్లియాడుట

రాజీవనేత్రుఁడు రమణీయమూర్తి

నరకునింటికి నేఁగి నరసిద్ధసాధ్యసుర యక్ష గంధర్వ సుదతులఁ దెచ్చి 620యతఁడొకపరి పెండ్లియాడెడు వేడ్కజతనంబు సేసిన జలజాతముఖులవెలఁదులఁ బదియాఱు వేలనూఱ్వురనుజలజోదరుఁడు జూచి సంతసంబందె.ఆకన్యకలచూపు లబ్జాక్షుమేనదాఁకొని చెంగల్వదండలై యొప్పె;జలజాక్షురూప మా జలజాతముఖులుతలలెత్తి యందంద తమకించి చూడదినకరోదయబింబ దీప్తమౌ కంజవనము చందంబున వదనంబులొప్పె;పొలఁతుల నందలంబులఁ బెట్టి శౌరిపొలుపార ద్వారకాపురికిఁ బుత్తెంచె.వరుణుని ఛత్రంబు వరుణునికిచ్చె;సురదంతి హయమును సురపతికిచ్చె;ధనపతి నిధుల నాతనికిచ్చి వుచ్చె;వనజోదరుఁడు భక్తవత్సలుఁడంతనగణితప్రీతిమై నభయంబులిచ్చిభగదత్తు నప్పురి పట్టంబుగట్టి

శ్రీకృష్ణుని యమరావతీప్రవేశము

ప్రమదంబుతో సత్యభామయుఁ దానునమరావతికి వచ్చె నమరారివైరి.630హరిఁజూచు వేడుక నా పట్టణంపు

తరుణు లొండొరులకుఁదమకంబు లొదవవలకారిచూపు నీవాళ్ళుగాఁ జేసియాలోకగురుఁజూచి రందంద వచ్చి;పొలఁతుల చూపు లప్పుర వీధులందుఁగలువ తోరణములు గట్టినట్లొప్పె;భామల కన్నులపండువై సత్యభామయుఁ దానును బక్షీంద్రు నెక్కియేతేరనింద్రుఁడు యెదురేఁగి శౌరిఁదోతెంచి పూజలఁ దృప్తి గావించె;హరి కుండలంబులయ్యదితికి నిచ్చిపరమానురక్తి సంభావించి మ్రొక్కె;నా దేవమాతయు నంబుజోదరునినాదట దీవించి యక్కునఁ బేర్చిశచియు నింద్రుఁడు పరిచర్యలు సేయనచలితసౌఖ్యాత్ముఁడై యుండెనంత.

పారిజాతాపహరణము

సత్యభామయుఁ బారిజాతంబుఁ జూచినత్యుదాత్తతఁ బ్రీతి హరి వేఁడుటయను;వేగంబె శౌరి యావృక్షంబుఁ బెఱికినాగారిపై నిడి నాతియుఁ దాను640ద్వారకాపురికేఁగ వాసవుఁ డెఱిగియైరావతారూఁఢుడై దేవకోటికొలువంగ వలచేతఁ గులిశంబుఁ దాల్చిబలువిడి నార్చుచుఁ బద్మాక్షుఁ దాఁకె.

ఇంద్రుఁడు శ్రీకృష్ణునితో యుద్ధముఁ జేయుట

అనలకృతాంత దైత్యాధీశవరుణయనిలకుబేర భూతాధీశవరులుతమ వాహనముల నుద్ధతి నెక్కి పేర్చికమలాక్షుఁ దాఁకిరి కరముగ్రవృత్తి;నార్పుల బొబ్బల నట్టహాసములదర్పించి కవిసి నాదనుజారి మీదవ్రేసియుఁ బొడిచియు వివిధ బాణములనేసియు నొప్పింప నిందిరావిభుఁడుపారిజాతముతోడఁ బక్షీంద్రు తోడవారిజాననుతోడ వరశక్తి దిరిగిపటుశార్ఙ నిర్ముక్త బాణజాలములచటులతఁ జూపి నిర్జరసేనఁ బఱపియమరాధిపతి నొంచి యనలుఁజల్లార్చిసమవర్తి గెలిచి రాక్షసుని నిర్జించివరుణ బీరము మాన్పి వాయువుఁ బఱవనరవాహు గెలిచి పినాకి సృక్కించి650బృందారకశ్రేణిఁ బెఱికి యందందయందఱి గెలిచి తా(రేఁ)గె ద్వారకకు.పారిజాతము సత్యభామ గేహముననారూఢగతి నిల్పి యతి సౌఖ్యమైనశుభముహూర్తమున భూసురులు దీవింపనభినుతులొనరింప నంబుజోదరుఁడుపదియాఱువేలరు పంకజాననలవదలని వేడ్క వివాహమై వేర్చి

యందఱకును నిండ్లునారామములునుజెందిన దాసదాసీజనంబులనుగంధమాల్యాంబర ఘనభూషణములుబంధురమైన సంపదలును నొసఁగి

శ్రీకృష్ణుని లీలావిహారములు

హరి పెక్కు రూపంబులై సౌఖ్యలీలపరిణమింపగఁ జేసి పడఁతుల నెల్లనేయింటఁ జూచిన నిందిరాధీశుఁడాయింటి రమణిని ననఁగి వర్తింపపడఁతులు గృష్ణుతోఁ బాయని వేడ్కనడరి నర్తింపుదు రహమును రేయి.హరి యోగవిద్యా మహత్వ కౌశలముసరసిజాసనుఁడైనఁ జర్పింపఁగలడె!660

రుక్మిణీదేవి సౌధవర్ణనము

ఈభంగి నొకనాఁడు యిందిరావిభుఁడుసౌభాగ్య రుక్మిణీ సదనంబులోనఁజూపట్టు వైడూర్య సోపానములునునేపార నీలాల నెనయు నరుంగుఁబసిఁడి కంభంబుల పట్టపుసాలలసమాన బహుదీప్తి నడుకు వుత్తళులుమరకత రుచిఁబోల్చు మదురులనొప్పుసిరిమాఱు గచ్చు సేసిన కుడ్యములునుగరమొప్పు నవచంద్రకాంతజలములు

కరిదంతముల నవకంబైన తలుపుపగడంపు గడపలు పసిఁడి బోదెలునునిగిడిన వజ్రాల నెగడిన గడియమేలైన కెంబట్టు మేల్కట్టు మెఱయునాల వట్టంబును నడపసంబెళయుఁగస్తూరి గంధ మంగళ ధూపములునుశస్తమై తగు మల్లసాలలు నొప్పె.

శ్రీకృష్ణునికి రుక్మిణి రాజోపచారములు గావించుట

సంసారసౌఖ్యరసాయనంబైనహంసతూలికపాన్పునందున్నయట్టిశౌరికి రాజోపచారకృత్యములువారకఁ గావించి వైదర్భి వేడ్క670కర్పూరమిశ్రితక్రముక భాగములనేర్పార వాసించి నిండారు వేడ్కకంకణస్వనములు గలయంగఁ గులికియంకించి చేచాఁచి యఱచేతికిచ్చిధవళ తాంబూలపత్రముఁ గొనగోరసవరించి చూర్ణమిశ్రము సేసి మడిచిచిటపట మేళంబు సేసి యొప్పుచునుజిటిక వెట్టినమాత్రఁ జేతికందించు;స్తనకుంభములను మాధవు పాదతలముఁదనకారనొత్తు మెత్తని కేల లీలఁగరకంకణంబులు ఘల్లుఘల్లనఁగఁ

గరమూలరుచులు దగద్ధగ మెఱయగుఱకుచములురాయఁ గురులు ఫాలముననొరయ హారావలులుయ్యాలలూఁగపయ్యెద వడిజారఁ బాలిండ్లు తళుకులెయ్యడఁదామెయై యిరువంకఁ బొడమకన్నులమెఱుఁగు లక్కజముగాఁ బొలయచిన్ని చెక్కులచెంతఁ జెమటలు వొడమదంతమరీచులందఱమిల్లు నవ్వువింతయై మోమున వెన్నెలఁగాయ680లీలఁ దాటంకపాళికి వెల్లఁకదియతాలవృంతంబు మెత్తని కేల బూనియల్లల్లఁజూచుచు హరిచూపుగముల

శ్రీకృష్ణుఁడు రుక్మిణి చిత్తమును శోధించుట

కెల్ల నింపొదవించు నింతి నెమ్మనముఁగనుఁగొను వేడుకఁ గలుషించినట్లువనజాతనేత్రుఁ డవ్వనిత కిట్లనియె.“రాజన్యుని విదర్భరాజు కూఁతురవు!భూజనులెల్లర పొగడొందునట్టిలావణ్యభాగ్యవిలాసచాతుర్యవీ వసుంధర నీకు నీడు లేదెందు!పరగు మాగధచైద్యపౌండ్రాది నృపులువర రూప భాగ్య లావణ్య సంపన్నులారూఢ సామ్రాజ్యులతులవిక్రములువారలు నినుఁగోరి వచ్చిన చోట

నందఱ నొల్లక యతిహీనకులునిమందలోఁ బెఱిగిన మలినాంగు భీరునాచారదూరుని ననృతవర్తనునియే చూపుఁ జూచి నన్నేల కామించితాదిగర్భేశ్వరి వక్కటా! పుట్టుబీదను! నను నీవు పెండ్లిగాఁదగునె?690మీయన్న రుక్మిమామీఁది క్రౌర్యంబుఁబాయఁడు; మీతండ్రి పగవాఁడు నాకు;నీవును నామీఁద నెయ్యంబు లేవుకావున నీయింటి కడకు నీ వరిగివలనొప్పఁగన్నిచ్చ వచ్చినవారిఁగలసి భోగించుము కమలాస్య!” అనిననామాఁట తనకునమ్మై తాఁకుటయునుభామినీమణి డిల్లపడి మూర్ఛ మునిఁగె!నుడివడి చేనున్న సురటల్ల జాఱఁదొడిగిన సొమ్ములు తొడుసూడి పడఁగఁదన్ను దానెఱుఁగక ధర వ్రాలియున్న

మూర్ఛపోయిన రుక్మిణిని శ్రీకృష్ణుఁ డోదార్చుట

యన్నాతిఁ గనుగొని యంబుజోదరుఁడుసరభసంబున లేచి సతినల్లనెత్తికరముఁ గౌఁగిటఁ జేర్చి కన్నీరుఁదుడిచిచెక్కిలి నొక్కెత్తి చికురముల్ దుఱిమియక్కటికముతోడ నక్కాంత కనియె.“నవ్వులాటకు నన్న నామాట కింత

నివ్వెరపడి వ్రాల నీకేల యింతి?ఎలనాగ! నీచిత్త మెఱిఁగెడి కొఱకుపలికితిగాని నా ప్రాణంబు నీవ!700పరమసాధ్వివి నీవు భయభక్తులందునెరసులేకున్ని నే (నెఱి భాగ్యశాలి)ఇమ్ముల ననుఁబాయ కే ప్రొద్దునుండునమ్మహాలక్ష్మి నీవంభోజనయన!”అని పల్కి శయ్యపై నల్లనఁజేర్చి.యనునయంబున దేర్చి యబలకుఁ దార్చిసరసరతిక్రీడ సంతుష్టుఁ జేసిపరమపావనమూర్తి పంకజోదరుఁడుకందర్పకోటి సంకాశలావణ్యుఁడిందిరావిభుఁడు లోకైకశరణ్యుఁడారసి యందఱి కన్నిరూపములసౌరతిక్రీడల సతతంబుఁ దేల్చె.

ప్రద్యుమ్నాదికుమారజననవృత్తాంతము

హరికి రుక్మిణికిని నగ్రనందనుఁడుపరమానురక్తుఁడై ప్రద్యుమ్నుఁడట్టివీరుఁడు మొదలుగా వినుసమేష్టుఁడునుజారువేష్టుండును జారుదేహుండుజారుతృప్తుండును జారుచంద్రుండుజారుహస్తుండును జారువీర్యుండుజారుధీమణి విచారుండు(ను) బదురు;710

జాంబవతీకాంత చతురతఁగాంచెసాంబాది దశకంబు సత్పుత్రవరుల;భానుమంతాదులఁ బదురు కుమాళ్లమానుగా సత్యభామకుఁబుట్టిరెలమి;భానుచంద్రాదులు పదురు కుమాళ్లుశ్రీనిత్యయగు నాగ్నజితి కుద్భవిలిరి;మిత్రవిందకు ప్రభామిత్రులు సుతులుగత్రవంతాదులు గలిగిరి పదురు;కాళింది కామిని కనియెఁ బెంపొందబోలశ్రుతాదులఁ బుత్రులఁ బదుర;భద్రకుఁ బుట్టిరి భద్రాదిసుతులుభద్రమూర్తులు మహాభాగులు పదురు;సత్యభాషిణి గాంచె సంతతిఁ బదురసాత్యకి మొదలైన సత్పుత్రవరుల;వెలఁదులు పదియాఱువేలునూఱ్యురునుతలతలఁ బదియేసి తనయులఁగనిరి.వినుతింపఁ బదియాఱు వేలును నూటయెనమండ్రుభార్యల కేపారుపుత్రులాయెడ లక్షయునఱువదియొక్కవేయును నెనమండ్రు విష్ణునందనులు.720కన్యలునందఱు గల్యాణమతులుధన్యమై కృష్ణు సంతానంబు నిగుడవారలసుత పౌత్రవర్గంపు సంఖ్యవారిజాసనుఁడైన వర్ణింపనేరడట రుక్మపుత్రిక యగు రుక్మవతికిఁ

బటుతరంబగు వేడ్క ప్రద్యుమ్ను వలనననిరుద్ధుఁడుదయించెనని చెప్పుటయునుమునినాధ! ఈరుక్మి మురవైరితోడవైరంబు మానఁడు వరపుత్రి నెట్లుశౌరి పుత్రునకిచ్చి సాజన్యుడయ్యె?నీవెఱుఁగనిదేమి? నిఖిలజగములలేవెఱిఁగింపు లాలితపుణ్య యనుఁడు;శుకుఁడు పరీక్షిత్తుఁజూచి యీయర్థమకలంకగతి వినుమని చెప్పదొడఁగె.ఆ కృష్ణుతో వైరమయ్యును రుక్మితూకొని చెలియలితోడి నెయ్యమున

అనిరుద్ధుని వివాహము కలహము

మేనల్లుఁడనుచు నర్మిలి కూఁతు నిచ్చెగాని నెమ్మనములు గలయవెన్నండు;ఆరామనం దను కనిరుద్ధునకునునారూఢిఁ దన పౌత్రియగు లోలనేత్రి730లోచనయను కన్య రుక్మి యిచ్చుటయు;ఆచెలి పెండ్లికినై విదర్భకునుయానకదుందుభి హలి కృష్ణమదనసైనేయ కృతవర్మ సాంబాదులైనబంధులతో వచ్చి బహు వైభవమునబంధురప్రీతి శోభనమొప్పఁజేసె.కుడిచి కూర్చుండి పెక్కులు వినోదములుగడు వేడ్క జూచుచోఁ గాళిందివిభుఁడు

నారుక్మియును గూడ హలపాణితోడఁగోరిజూజము సమకొలిపి యాడించిభాగంబు దానయై పణముగా నొడ్డివేగంబె మాడలు వేయేసి గెలిచికైలాటములు జేసి కల్లలు వెనచితాలాంకుఁ గెలిచిరందఱుఁ దచ్చ సేసి.ఓడియు బలభద్రుఁడుడుగక లక్షమాడలు పణమొడ్డి మరిగెల్చుటయును;ఆ విదర్భుఁడు గెల్చె ననుచు నొండొరులుచేవేసి నవ్వుచు సీరి నీక్షింపఁదాలాంకుఁడదరి యుత్తాలరొషమునఁగాళిందిపతి మోముఁగనుఁగొని పలికె740“పాపాత్ములార! ఈ పలక నా గెలుపొ?ఏపార వైదర్భుఁడిటు గెల్చినాఁడొ?ఉన్న రూపెఱుఁగింపుడొక పక్షమేల?”అన్న ప్రలంభారి కనియె నారుక్మి.“గోపాలకులు మీరు! గొల్ల జూదములునేపార నొండురు లెగ్గులాడుటయుఁగాక! ఈ రాచ యోగ్యంబైన యాటమీకేల? వడిలేచి మిన్నక పొమ్ము!మాడలోడితిమని మాటిమాటికినిగాడఁ నాడిన నీకుఁ గలదయ్య గెలుపు?కడపి యాడుటగాదు కాక యేమేనినడుగరాదే మమ్ము నక్కఱ యేని?”

బలరాముఁడు రుక్మిని జూదపు పలకనెత్తి కొట్టి చంపుట

అనిపల్కి ప్రహసించి యార్చువైదర్భుఁగని సీరి మిడుగులు కన్నులఁదొఱుఁగఁబటురోషముననెత్తి పలక వేత్రిప్పినిటలంబు వ్రేయఁ బెన్నెత్తురు దొఱఁగివెడవెడ మిడి గ్రుడ్లు వెడలి రోఁజుచునుపడి తన్నుకొని రుక్మి ప్రాణంబు విడిచె!కాళింగుఁ జంపి యక్కడి ధూర్తసమితిఁద్రోలిన నందఱుఁ దుప్పలఁ దూలి750పులిగన్న పసులను బోలి వైదర్భుబలము భీతిల్ల సంభ్రమమేచఁ బఱచె;హరివచ్చిదేమిదేమని చూచుచుండనరదంబు వెసనెక్కి హలధరుఁడంతలోచనతోననిరుద్ధు నెక్కించివేచని యావురి వెలవెలనున్ననా రుక్మి మడియుట (నం)తయు నెఱిఁగిశౌరి సీరినిగూడి చనియె ద్వారకకు;అరసి దుఃఖాక్రాంతయైన రుక్మిణినిగరమర్థిఁ గుందార్చెఁ గమలలోచనుఁడు.

బాణాసురవృత్తాంతము

ఆలోన బలిదానవాధీశసుతుఁడువ్యాళేంద్రసదృశుఁడు వేచేతివాఁడునారూఢజయశాలి యరిశైలవజ్రి

భూరిప్రతాపుఁడద్భుత బలోన్నతుఁడుబాణాసురుఁడు తపోబలముల పేర్మిస్థాణుని మెప్పించితనపురంబునకుఁదననివాసమున కాతని రక్ష సేసియనుపమజయకీర్తులంది పెంపొందె.

బాణాసురుఁడు శ్రీ శంకరునికిఁ దనయుద్ధకాంక్షఁ దెలిపి ప్రార్థించుట

అతఁడు(ను) గర్వాంధుఁడై యొక్కనాఁడుభూతేశు పాదాబ్జములమీఁద వ్రాలి760వినతుఁడై చేతులు వేయును మొగిచియనుకంపఁ దోఁప నిట్లని విన్నవించె.“దేవ! మహాదేవ! దేవతారాధ్య!భావజసంహార! భక్తమందార!నీవు ప్రసాదింప నిఖిల రాజ్యములునీవేయి చేతులు నివినాకుఁ గలిగె!అవనిలో నాకంటె నధికుఁడు లేమినివి వృధాకథలయ్యె నిభచర్మవసన!తురగఖురోద్ధూతధూళి పెల్లగయుదురములోఁ దురగంబుఁ ద్రోలంగలేదు;మండిత దోర్దండ మండలాగ్రమునఁజెండాడి పగతులఁ జిక్కింపలేదు;చటుల కార్ముకముక్త శర పరంపరలఁబటు మాంసముర్వికి బలిసేయలేదు;దంతికోదండ! గదాతాటనముల

దంతికుంభముల విదారింపలేదు;వీరరక్తంబుల వేతాళసమితినారూఢగతి నోలలాడింపలేదు;యొఱపైన నృపలోకమురు శరీరములమెఱసి ఢాకినులకు మేపఁగలేదు;770నీయాన! రణకేళి నెఱపంగ లేదు!వేయిచేతులుమోవ విసమయ్యె నాకుకలన మీరెడుశక్తి కలిగియు లేనిఫలమయ్యె ముచ్చట బాపవే తండ్రి!”అని గబ్బుమైనాడ నసురమాటలకుఁగినిసి యల్లన నవ్వి గిరిజేశుఁడనియె.“నీవేమి సేయుదు నీపాలిదైవమీవిధిఁ బ్రేరింప నిట్లంటిగాక!దురములోపల నిన్నుఁదొడరి నీవేయికరముల వ్రేఁగు నొక్కట మాన్పనోవుఅలఘువిక్రమశౌరి యేతేరగలడు;తలఁచిన నీకోర్కి తలకూడగలదు.తప్పక నీకేతుదండంబు విఱిగియెప్పుడు ధరఁగూలు నెఱుఁగు మద్దినముననుమోచునట్టి రణంబుగాగలదు.మనములో నెఱిఁగి యేమరక వర్తింపు”మని వీడుకొలిపిన హరునకు మ్రొక్కిచని సంగరోద్యోగ చతురుఁడై యుండె.

బాణాసురపుత్రి ఉషాకన్య స్వప్నములో ననిరుద్ధునిఁ గూడుట

ఆ బాణనందన యతిరూప హరిణశాబాక్షి కలకంఠి సమదేభగమన780కమలకోమలనేత్రి కరివైరి మధ్యభ్రమరసన్నిభ వేణి పంకేరుహాస్యకంబుకంధర మౌక్తికాకుందదంతబింబఫలాధరి బిసలతాపాణియననొప్పి కందర్పునసిపుత్రివోలెతనరు యుషాకన్య దానొక్కనాఁడుపొలుపారు మేడపై పువ్వుపానుపుననలవడి నిద్రితయై యున్నచోట;కలలోన నొక్క చక్కని రాచకొడుకుజలజాతనేత్రుఁడు సౌభాగ్యమూర్తితను డాయవచ్చి మెత్తని కేలుఁగేలననువొప్పఁ గీలించి యంగంబు నిమిరియల్లనఁ గౌఁగిట నందందచేర్చియుల్లాసరసవార్ధి నోలలాడింపనంతట మేల్కాంచి యబల చిత్తమునసంతోషమును సిగ్గు జళుకును బొడమ;

ఉషాకన్య విరహము

కలలోని సేఁత నిక్కముగాఁగ దలఁచికళవలపడు మేను గరుపార నిలుచు;

దిక్కులు పరికింపుఁ దెలిసియారూపమెక్కడ బొడగాన కెంతయు వగచి;790కొలఁదినై ప్రహ్లాదకులపయోరాసి“కలఁపగాఁబుట్టిన కట్టడినైతి;ఏమని యెఱిఁగింతు నీముటలొరులకేమిగాఁగలదకో; ఇటమీఁద” ననుచుఁగలఁగుఁ జేట్పాటున కడు చిన్నబోవు;పలుకనేరక డిల్లపడు; మారుమాటఁబొరిపొరి నాలించుఁ బువ్వుపాన్పుననుబొరలు గ్రమ్మఱ నిద్రవోచూచు లేచు;ఎలుఁగెత్తి యిందురావే యని పిలుచు;తలుపులోనున్న యాతని రమ్యమూర్తిఁదలపోయుఁ దలయూఁచుఁ దన్నుఁదా మఱచు;వలరాజు చెలిమికి వంతలోఁగుందుఁజెక్కునఁ జెయిఁజేర్చి చింతించునంతనెక్కొన్నఁదగ వేఁడి నిట్లూర్పు వుచ్చు;నొగలు; హాయనుచుఁ గన్నుల నీరునించు;మొగమెత్తకంగుటంబున నేల వ్రాయు;పులకించు; చమరించుఁ బొరిమూర్ఛఁబోవు;అలుగు; నాతని యొప్పు నంతంత పొగడు;పొరి కాముఁడాడించు బొమ్మచందమునఁబరవశయై పంచ బాణాగ్నిశిఖల800కగ్గమై యందంద యాఱడిపొందు;దిగ్ధనలేచి భీతిల్లి శయ్యవ్రాలు;గోరికెలాతనిఁ గోరి రేకెత్తఁ

గూరుకుఁ గానక కొందలమందు.ఈ భంగి మదనాగ్ని నెరియుచునున్ననాభామచెలియ కుంభాండునిపుత్రిచిత్రరేఖనుపేరఁ జెన్నారు లేమమైత్రి వాటించి యమ్మగువకిట్లనియె.

చిత్రరేఖ ఉషాకన్యను నూరార్చుట

“ఇదియేమి నీచంద మెలదీగబోఁడి?మదిలోన నీకింత మరుఁగనేమిటికి?ఏల చింతించెదవేల మూర్ఛిల్లియేలనారటఁ బొందెదిభరాజగమన?పురుషుఁడు నీతోడ భోగించినట్టిమురిపంబుదోఁచె నీమోముదామెరనుబొరిఁ బోతుటీఁగకుఁ బొలియంగరానివర హార్మ్యమునకు నెవ్వఁడు వచ్చెనబల?పడుచుకూఁతుర! ఇట్టిపని యెట్లువుట్టె?ఎడసేసి నాకేల యెఱిఁగింపవైతి?ఎవ్వనిఁగనుఁగొంటి వెవ్వనిబొందితెవ్వఁడు సేసె నేఁడీసాహసంబు?810వనిత! నీమదిలోని వగపెల్లఁదీర్తునను వింత సేయక నాకెఱిఁగింపు”మనిన నెచ్చెలిఁజూచి హరుషంబు సిగ్గుననుకంపయును దోప నయ్యింతిపలికె.

ఉషాకన్య చిత్రరేఖతోఁ దనస్వప్నవృత్తాంతముఁ జెప్పుట

“ఈ మేడపై నుండి యేనిద్రవోవయేమి చెప్పుదు నీకు నిగురాకుబోఁడి!నీలవర్ణమువాఁడు నిడు గేలువాఁడువాలారు చూపుల వలనొప్పువాఁడురతినాయకునకు నౌరసపుత్రుఁడొక్కొ!ఇతఁడు నా సౌభాగ్య మేపారుఁవాఁడుకలలోననేతెంచి కౌఁగిటఁజేర్చిచెలఁగి చిత్తజుకేళిఁ జిక్కించె నన్ను!ఇతనితోఁ గలసి పేరడిగి మాటాడుతతిపాపి నాసిగ్గు దాఁపురంబయ్యెనంత మేల్కంటిని యతఁడంతఁ బోకనంతరంగములోన నడఁగి యున్నాఁడు;కూడిపాయుట సమకొనెగాని వానిఁగూడియుండెడు వేడ్క కొనసాగదయ్యె;నతనిఁదోతేకున్న నంగజాస్త్రములధృతిదూలి ప్రాణంబు తెగిపోవఁగలదు820యేమిసేయుదు” నని యిలవాలి యున్నయా మెలంతనుగని యానాతి పలికె.

చిత్రరేఖ చిత్రపటము వ్రాసి ఉషాకన్యకకుఁ జూపుట

“కటకటా! కలలోనగన్న రాకొమరునెటుపట్టి తేవచ్చునే ముద్దరాల!

ఏతరుణులయందు నిటువంటి తలఁపుయే తెఱంగునఁ జూచి యెఱుఁగము వినము,నీకేల ముచ్చట? నీకేల బెగడ?నీకేల వెనుఁబడ నీరజవదన?మూఁడు లోకంబుల ముదితయేఁదొల్లిపాడిగా నెఱుఁగని పురుషులు లేరు;నా కౌసలంబున నరవరోత్తములనీకుఁ జూపెదఁ జూడు నిఖిలలోకాన!వచ్చి పొందిన భూపవరుని నీమ్రోలఁదెచ్చి పెట్టెద నింత ధృతిఁ జిక్కఁబట్టు”మనిపల్కి నవ్వుచు నాచిత్రరేఖపనుపడ నొక చిత్రపటము సంధించిసకలలోకంబుల జననాథసుతులనకలంకమతి వ్రాసి యబలతో ననియె.“నీతలఁపుననున్ననృపకులోత్తంసుఁడేతెఱంగో వ్రాసితిటుజూడు” మనుచు;830పాతాళవాసులఁ బన్నగాధిపులఁజాతుర్యగుణుల రాక్షసకుమారకులనలకూబరాది యున్నత యక్షవరులనలజయంతాదుల నసురాధిపులనుగరుడఖేచరసిద్ధగంధర్వవరులవరుసతో వేర్వేర వనితకుఁ జూపి;ఆలోనఁ గురుపాండవాదులఁ జూపి;యాదవవీరుల నందఱఁజూపి;

ఆదినారాయణుఁడగు కృష్ణుఁ జూపి;అనుమానపడి చూడ నంత ప్రద్యుమ్నుఁగనియీతఁడాతఁడే కాఁబోలుననుచుమనములో శంకించి మరియనిరుద్ధుఁదనుకాంతి రూపంబుఁ దప్పకఁ జూచితలఁపులోపలి కూర్మి కట్టుముట్టాడఁబులకించి తిలకించి పూఁబోడి పలికె.“కలలోనఁ గన్న చక్కని వాఁడె వీఁడు!కలయల్ల నాకు నిక్కవమయ్యె నేఁడు!నీ కౌసలంబును నీ దయాగుణమునీ కూర్మి పెంపును నీవచోరతియు840నాకంజసూతికి నలవియే పొగడ?నాకెవ్వరికదిక్కు నలినాయతాక్షి!“అని పల్కి యంతంత యతిశయంబైనమనసిజానలము పైమలసి మట్టాడఁదన్ను దానెఱుఁగక ధర వ్రాలియున్నయన్నాతి బోధించి యల్లననెత్తికన్నీరు దుడిచి యంగంబెల్ల నిమిరిచెన్నార నెయ్యంబుఁజిలుక నిట్లనియె.

చిత్రరేఖ తన మాయచే ననిరుద్ధుని యపహరించుట

“పైదలి! నీదైన భాగ్యంబు కతనయాదవోత్తముఁడైన హరిపౌత్రుడబ్బె!ఆ సుందరాకారు నర్మిలిఁ దెచ్చినీ సమ్ముఖమువేసి నెమ్మివాటింతు.

వెఱవాయు”మనిపల్కి వెలఁది బోధించితెఱవ మాయాగతి దివమున కెగసిరాజీవనేత్రి సురక్షితంబగుచురాజితంబైన ద్వారకకేఁగి యందుయువిదలతోఁగూడి యుద్యానభూమిఁదవిలి రతిక్రీడఁ దనిసి నిద్రించుయనిరుద్ధుఁగాంచి మాయలుఁగొల్పి యెత్తుకొని వియద్గతి వచ్చి కోర్కులు బొదల850బాణతనూజ తల్పము క్రేవఁబంచ

అనిరుద్ధుఁడు ఉషాకన్యతోఁ గ్రీడించుట

బాణునందను నుంచి పడుతుక చనియె.అనిరుద్ధుఁడంత మాయానిద్రఁ దెలసికనువిచ్చి పరికించి కనకతల్పమునఁదనకు బాపకలతఁ దలయాపు సేసికనుమోడ్చి ముఖచంద్రకాంతులు వొలయజక్కవ కవఁగప్పు జలజమో యనఁగనొక్క కేలునను నురోజంబులదిమికలయఁ గంకణమణిగణమరీచికలమలయుచు దిన ద్యుతి మాయంగఁ జేయుఁదనబోఁటి మాటలఁ దాపంబుఁ దీరిమనమూరడిలి యాదమఱచి నిద్రించునయ్యుషాసతిఁగాంచి యంతరంగముననెయ్యంపురసముబ్బి నీటులు వొడమనందంద కనుఁగొని యంగజాస్త్రములఁ

గంది నెమ్మదిఁదమకంబగ్గలింపఁగదసి కేలును గేలుఁ గదియించుటయును;అదరి మేల్కని లేచి యంగంబు వణఁకఁగుచభారమెడలంగఁ గౌనసియాడఁగుచకుంభములఁ జేల కొంగున నదిమి860లక్ష్మీసుతుని రాజ్యలక్ష్మియో యనఁగపక్ష్మలలోచన ప్రభలుప్పతిలగశయ్యపై డిగి నిల్చి జలజాతనేత్రునయ్యాదవోత్తము నర్ధినీక్షించె.ఇరువుర చూపులే యేపారఁ దనకుశరములుగాఁ బంచశరుఁడేయఁ జొచ్చె!ఆలోన ననిరుద్ధుఁ డాలోలనయనఁగేలుఁగేలునఁ బట్టి గిలిగింత వుచ్చిచెక్కులు బుడుకుచు సిగ్గుఁ బోగొట్టిగ్రక్కున నందంద కౌఁగిఁటఁ జేర్చిమాటల మఱిగించి మక్కువఁ బెంచికూటంబుఁజవిజూపి కోర్కులు నింపియిది రాత్రి యిదిపగలని సంధ్య ప్రొద్దులిది వింత తావని యెఱుఁగంగ రాకయకుటిల క్రీడల నఖిలభోగములనొకనాల్గు నెలలుండ నొక్కనాఁడెఱిఁగి

అంతఃపురవాసులు బాణాసురునకు ననిరుద్ధుని గుఱించి తెలియపర్చుట

యంతఃపురజనాళి యరిగి బాణునకు

నంతయు నెఱిఁగింప నతఁడు గోపించిచనుదెంచుచో లీల సౌధంబుమీఁదఁదనకూఁతుతోడ నాదట జూదమాడు870వనజాతనేత్రుని వనమాలిపౌత్రుననిరుద్ధు విక్రమయనిరుఁద్రు గాంచి;తన కెలంకుల నున్న దనుజులఁ జూచి“చని యాదురాత్మునిఁ జంపి రం”డనినవారలు చనుదెంచి వనజాతనేత్రునీరసంబునఁ బట్టనెంతయు నలిగిపరిఘంబుఁ ద్రిప్పి యప్పగతుల నెల్లధరణిఁ గూల్చుటయు నుద్ధత బాణుఁడలిగి

అనిరుద్ధుని నాగపాశములచే బాణాసురుఁడు బంధించుట

యనిరుద్ధు నాగపాశావళిఁ గట్టిపెనుపరి చెఱసాలఁ బెట్టంగఁ బనిచె.అనిరుద్ధుఁ డనిరుద్ధుఁడై యున్న భంగిఁగని యుషాకన్యక కడుఁ జిన్నబోయియతి దుఖఃపరవశయై రేయుఁబగలునతనితోడిదె లోకమై యుండెనంత.

నారదునిచే ననిరుద్ధుని యునికిఁ దెలిసి శ్రీకృష్ణుఁడు సైన్యముతో శోణితపురిని చుట్టుముట్టుట

అక్కడ ననిరుద్ధు నాతోఁటలోననెక్కడ పోకయు నెఱుఁగంగలేకబలభద్రమురహరిప్రద్యుమ్నముఖ్య

లలమి దిక్కులనెల్ల నందంద వెదకికానక యెంతయుఁ గళవళంబందిమానసంబుల దుఃఖమగ్నులై యుండ;880కోరి కైలాటంబుఁ గూడుగా మెలఁగునూరివంద్యుఁడు బ్రహ్మసుతుఁడు నారదుఁడుహరి సన్నధికి వచ్చి యనిరుద్ధువార్తఁగరతలామలకంబుగాఁ జెప్ప శౌరిఁవిని వృష్టిభోజాంధవీరులతోడఘనయోధరథవాజికరులతోడుతనుబలభద్రసాత్యకిప్రద్యుమ్నసాంబజలసత్యకృతవర్మసారణులాదిద్వాదశాక్షోహిణీ దళసంఖ్యతోడయాదవరత్నంబు హరి దండువెడలె.దళములు నడువంగ ధారుణి వడఁకె!జలధులు కలఁగెనాశాచక్రమగలె!హరియును నిట్లు నిత్యప్రయాణములనరుదెంచి రజతాద్రి యత్తీరభూమిస్థాణునిచే రక్షితంబై వెలుంగుశోణితపురము ముచ్చుటు విడియించియుపవనంబులు రాల్చియూళ్ళను గాల్చిచపలత బహుజలాశయములఁ జెఱచిపెరయీఁగ నందంద పేర్చిన పగిదిపురికోటలగ్గలద్భుతముగాఁ బట్టి890

వీరును వారును వెసఁబోరఁజూచిపౌరులందఱు భయభ్రాంతులై నిలువ

దొమ్మియుద్ధము

పనిగొని రుద్రుఁడు “బాణుని వీఁడుగొనగొని నేఁగాచికొని యుండ నిట్లుపగతురచే బాధపడుటేట్లుజూతునిగిడి సైన్యంబుల నీరుగావింతు”ననిపల్కి పటహమహారాన మొలయవినుతలీలలు మహావృషభంబు నెక్కిశూలపినాకాదిసునిసితాయుధములోలోన భయదనలోర్చులుం బర్వజ్వాలకరాళవిశాలరావములఫాలనేత్రుఁడు మహాప్రమథులుఁ గొలువబహుభూతభేతాళపైశాచకోట్లునహితభీకరలీల నలమిఁతో నడువగినిసి ముందఱఁగార్తికేయుఁడేతేరఁజనుదెంచి యాదవ సైన్యంబుఁ దాకె.సాత్యకి బాణుతో సమరంబు సేసె;నత్యునగ్రత వీరులందఱు దొరసివారువీరన కెల్లవారునుఁ బేర్చిపోరాడిరమరులద్భుతమంది చూడ900నప్పుడు బ్రహ్మాదులంతరిక్షమునఁదప్పక నిల్చి యుద్ధముఁ జూచుచుండపరశుతో మరగ దాపట్టిసముసల

పరిఘముద్గరశరప్రాశఖడ్గములఘనరోషములతోడ గదిలిశాత్రవులఁదునిమియు నలిచియు దూరనేయుచునుబటురౌద్రయోధనిర్భరలీల మెఱయఁజటులత నిరువాగు సరియకాఁబోరసడలెను హయములు సామజంబులునుపడియె తేరులు వీరభటకోటి గడసె.కాలువలైన రక్తప్రవాహములఁగీలాలములఁ గన్నుగిలుపుచు నవ్వుతలలు తామరలు; నుద్ధతమాంసమడును;తలమెదళ్ళు పులినతట ప్రదేశములు;పెనుపారఁ బ్రేవులు బిససమూహములు;తనరారు కేశసంతతిశైవలంబు;రాలినమణికోటి రక్తోత్పలంబు;నీలాబ్జసరములు నెలకొన్న తేంట్లు;ఘనరథాంగంబులు కమఠసంఘములు;ఒనరు వింజామరలొగి మరాళములు;910తలకొన్న భూతభేతాళవర్గంబుజలపక్షి నివహమై జలకేళిఁదేలికొలను చందంబునఁ గొమరగ్గలించికలను జూడగ భయంకరమయ్యెనపుడు!ప్రమదబలంబులు పటుశక్తి మెఱసికమలనాభుని సేనఁగారింపఁదొడఁగె

విద్యుత్ప్రభాభాస వివిధబాణములు

ప్రద్యుమ్న గుహుల ద్వంద్వయుద్ధము

ప్రద్యుమ్నుఁడాగుహుపై నాటసేసె;ఆతఁడు కోపించి హరితనూభవునికేతుదండము విల్లు గృత్తము సేయవేఱొక్క విలుగొని విష్ణునందనుఁడునూఱుబాణంబులు నొప్పింప గుహుఁడుఘనశక్తివైవ నిర్ఘాతశతంబుచనుదెంచుగతి వచ్చు చటులతఁజూచియరదంబు దిగినిల్వనాతని శక్తిహరుల సూతుని తేరు నడగించి చనియె;రతిపతి యొండొక్క రథమెక్కి గుహునిశితిశరంబున నేయశిరమును నురముఁబగిలి నెత్తురు గ్రమ్మఁబబలగాత్రంబుచిగురొత్తు కింశుకచెల్వు వహించె;920సేనాని పఱచుండఁజేరి యాప్రమథసేన బ్రద్యుమ్నుఁడు చెండాడఁదొడఁగె;

హలిపుష్పదత్తుల ద్వంద్వయుద్ధము

హలి పుష్పదత్తుని నాఱుబాణములచెలఁగియేయఁగ వాఁడు చేయార్చి యార్చియిరువది బాణంబులేసి నొప్పింపపరుషతకోర్చి యాబలభద్రుఁ డలిగి

మేటితూపులు నూఱు మేన గ్రుచ్చుటయునాతఁడు గదఁగొని యవనికి దాఁటిసూతాశ్వరథమును జూర్ణంబు సేసితలవేయ నడువను ధాత్రిపైవ్రాలెకులిశంబుఁ దాఁకిన కొండ చందమున;

బాణపుత్రుఁడు సాంబునిపైఁ గదియుట

బాణపుత్రుఁడు సాంబుపై నార్చియేడుబాణంబులేసిన బద్మాక్షసూనుఁడాతనిమీఁదఁ బదాఱుబాణంబులాతతంబుగ నేయ నతఁడు కోపించి;హరుల నాల్గిటిఁజంపి యాఱుబాణములనరదంబు సూతుని యవలీలఁగూల్చె.విలుదుంచుటయుఁ బెంపు విడువక వ్రాలుఁబలుకయుఁ గొని మీఁదఁబారుతెంచుటయుఁ930గని బాణసూనుఁడు కంపించి తేరివెనకకు జాఱి యుద్వేగుఁడై పఱచె;బాణుఁడు సాత్యకిపై నార్చి వేయిబాణంబు లడరింపఁ బటుశక్తి నతఁడుకినిసి తచ్చరములఁ గృంతముఁజేసిఘనశరంబుల మోము గాడంగనేయసూనిన ఖిన్నమై యొకసాయకమునసైనేయు సృక్కించి శౌరిపై నడచె;

శ్రీకృష్ణబాణాసురుల ద్వంద్వయుద్ధము

చండాంశుదశకర చటులంబులగుచుమండితదోర్ధండమహిమ దీపింపశ్రీరమ్యతర మేరుశిఖరమో యనఁగచారుకిరీటనిశ్చలకాంతి నిగుడలలితాంబుధరతటిల్లతికలో యనఁగబలిసి యుగ్రాయుధప్రభలుప్పతిలఁగఁదాఁకునఁబూర్ణ సుధాంశుచే నైనప్రాకట ముక్తాతపత్రంబు వెలుఁగఁబ్రథమాద్రిఁ దోతెంచు భానుఁడో యనఁగరథమెక్కి గర్వదుర్వార వేగమునహరిమీఁద జనుదేర నతని కేతనముమురిసి కూలుటయును ముదమంది(మదిని)940“కలిగెఁ గదా! నాకుఁ గదనరంగమునఁగలుషంబుతోఁ జేతిగమి తీఁటమాన్ప”నని మురారాతిపై నంబకాష్టకముఁజొనుపుటయును శౌరిచూచి కోపించిపటుశార్ఙనిర్ముక్తబాణజాలములవిటతాటముగ దైత్యవిభునేయ నతఁడు;యేనూఱు చేతుల నేనూఱు విండ్లుబూని నానాస్త్రముల్ పొరినేర్చి నారిఁదొడిగి పల్లేసినఁ దొలఁగక వానినడుమనే తునుమాడె నలినలోచనుఁడుతొడిబడ విండ్లన్ని దునిమి రథములఁబొడిసేసి సారథి బొడవడగించి

యరదంబుఁ దునుమాడి యార్చియాశౌరిశరముల మేను జర్ఘరితము చేసె;కడుఁదుర్లు గుట్టినకరణి మేనెరియనొడలు పెన్నెత్తురులొలుక నయ్యసురమరలిచూడక పార మదనారి యంత

పినాకి కృష్ణునితోఁ బోరాడుట

హరిఁ దాఁకె బహుపిశాచావళితోడయాదవవీరులు నసురవీరులునునాదటఁ బోరాడ నతిభీషణముగఁ950గమలాక్షుసేనలగ్గలికమై తరుమఁబ్రమథసేనలు భూతబలమును దిరిగిజడలు వీడఁగ మేను జళుకంద కాళ్లువడవడ వణఁకంగ వాతెరలెండఁబెదవులు దడవుచు భీతిఁ బెల్లుఱికియదవద పఱచె నాహరుఁడున్న కడకు;పఱతెంచు సేనల భర్గుఁడు జూచివెఱవకుండని నిల్పి వృషభంబునెక్కె;గరుడ వాహన యక్షగణములకంతసరభసంబున మహాసంగ్రామమయ్యె;దిక్కులొక్కట మ్రోసె దిగిభంగులొరలె;చుక్క లెల్లడరాలె సురకోటి వెఱచె;బ్రహ్మాదిసంయమిప్రతతి భీతిల్లె;బ్రహ్మాండభాండంబు పగిలినట్లయ్యె!హరుఁడు పినాకమునందేనుశరము

లురుముష్టి సంధించి యురమాడనేయహరిశార్ఙ నిర్ముక్తమగు శరాష్టకముహరుమీఁద వెననేసి యార్చిన గినిసిపాశుపతాస్త్రంబుఁ బశుపతి వ్రేయనాశౌరి యేసె నారాయణాస్త్రంబు.960ఇరువుర శరములు నెలమి నొండొండఁబరుషమై రవికోటి పడినచందమునడాయచుఁ బేర్చి మంటలు మింటనంటమ్రోయుచు రెండస్త్రములు శాంతమయ్యె.బ్రహ్మాస్త్రమడరింపఁబంకజోదరుఁడు.బ్రహ్మాస్త్రమున శాంతపఱచె నాహరుఁడు.ఆరూఢగతి హరుఁడనలాస్త్రమేయవారుణాస్త్రంబున వారించె శౌరి.జలద బాణమునఁ బాషాణవర్షంబుగలగొని యడరింపగాఁ గృష్ణుఁ డలిగియురగ బాణంబేయ నురక మురారిగరుడాస్త్రమున దాని ఖండించివైచె.వారణోజ్వలబాణవహనసత్వముననారుద్రుఁడడరింప నద్రులఁ బగిదిదారుణంబుగ మత్తదంతులు గవియనారసింహాస్త్ర మున్నతిఁ బ్రయోగించిఘోరకంఠీరవ కోటులచేతఁగోరి యాకరికోటిఁ గూల్చెనాశౌరి.అంతట హరుఁడు కాలాంతకమూర్తియెంతయు హరిఁజూచి యెసఁగు రోషమున970

దాపజ్వరంబు నుద్ధతిఁ గూర్చి యేయనేపార నదిసేన నెరియింపఁ జొచ్చె.ఉష్ణజ్వరమువచ్చు నురువడిఁజూచివైష్ణవాస్త్రముఁదొడ్గి వారిజోదరుఁడు

శీతజ్వరపీడితయై తాపజ్వరము శ్రీకృష్ణుని శరణు వేఁడుట

శీతజ్వరంబుఁ జెచ్చెర నేయుటయునుభూతకోటులు భయభ్రాంతిఁ గంపింపతాపజ్వరంబు మేన్దప్పి కదియ్యవాపోవుచును వచ్చి వారిజోదరునిబదములపై వ్రాలి ప్రణుతింపదొడగె.“యదువంశవల్లభ! అఖిలలోకేశ!కారుణ్యమూర్తివి కంజాతనేత్ర!వారిజోదర! భక్తవత్సల! కృష్ణ!నెట్టున నీశక్తి నిఖిలజంతువులఁబుట్టింతు రక్షింతు పొలియింతు వీవ!ప్రకృతియుఁ బురుషుఁడు పరమశాంతియునువికృతులనానీవ విశ్వలోకేశ!”అని సన్నుతించెడు నమ్మహాజ్వరముఁగనుఁగొని పలికె నాకమలనాభుండు.“నీవేల వెఱచెదు? నీవున్న యెడలసేవ నపథ్యంబు సేసిన వారిఁ980గారింపుమర్థి నీకథ విన్నయట్టివారిఁబొందక నీవు వర్తింపుచుండు.”శీతజ్వరంబంత శివు మేను సోఁకి

యాతతజాడ్యంబు నావలింతయునుఘనమైన యాతన గంపంబుఁ గదిసికనుమోడ్చి నిద్రించుగతి నుండెనంత;అంబిక శ్రీకృష్ణునిఁ బ్రార్థించుటఅంబర కేశాంగమర్థంబుఁ గొన్నయంబరాంబర జగదంబ యేతెంచికరకరిఁ బోరు శంకరశార్ఙధరులనిరువురకడఁజొచ్చి యేపార నిలిచిహరిమోముఁజూచి యిట్లని నుతియించె.“వరద! జగన్నాథ! వసుదేవపుత్ర!దేవదేవారాధ్య! దివ్యస్వరూప!గోవింద! మధువైరి! గోపాలవంద్య!నీవు మేల్కని చూడ నిఖిలంబుఁ బుట్టునీవు నిద్రించిన నిఖిలంబు నడఁగు!మాయచే నఖిలంబు మాయగావించుమాయస్వరూప! చిన్మయ! హృషీకేశ!మూఁడుమూర్తులు నీవ మొగివానిమీఁద990పోఁడిగాఁ బెరిగెడి పొడవవు నీవబాణుఁడు దనకు సద్భక్తుఁడుగానస్థాణుడాతనికినై సమరంబు సేసె;భక్తవత్సలుఁడగు పరమాత్మ నీకుభక్తుఁడుగాని నీపగవాఁడు గాఁడు.ఇతనికి నీకును నేమి భేదంబు?హితమతిఁ దలపోయ నేకరూపంబు!

నీనామమేప్రొద్దు నిష్ఠతో జపముపూని యనుష్టింతుఁ బుండరీకాక్ష!నను జూచియైనను నాగకంకణునిననుకంప వీక్షింపు”మని సన్నుతింపనాతతజయశాలియైన కృష్ణుండుశీతజ్వరము మాన్చెఁ జెచ్చెర నంత.

బాణుని రెండవ యుద్ధము

అంతయుఁ గని బాణుడట రథంబెక్కియంతకాకారుఁడై హరిమీఁదఁ గవిసియురుతరకనకపుంఖోజ్వలంబైనశరపరంపరలు భీషణముగా జొనుపహరి వాని బాణంబులవలీలఁ దునిమియిరుబాణమొక్కట నిరమేయుటయును;క్రమ్మర మూర్చిల్లి క్రన్నన దెలిసియమ్మురారాతిఁ బెక్కమ్ముల నొంచి1000భల్లమొక్కట వామభాగంబు నొంపవిల్లూడిపడుటయు విష్ణుఁడు కనలిధారుణి వడఁక పాతాళంబు బెదరవారాసి కలఁగ దిగ్వలయంబు పగులఁదారలు డుల్ల నుత్తానచక్రంబుదారుణశక్తిచే దనుజుని వైచె!అరమంట లందంద యెగసి మిన్నందనురుముచందంబున నురుఘోష మెసఁగగుఱి మానికొమ్మలు కుప్పలై పడఁగ

నఱికినక్రియ భీషణస్ఫూర్తి మెఱయఁగటక కేయూరకంకణహేతిరుచులఁబటుతరంబుగ బాణుబాహులు నఱుకఁగని నీలకంఠుఁడు కమలాక్షు కడకుఁజనుదెంచి భక్తవాత్సల్యతఁ బలికె“విశ్వజగన్నాథ! విశ్వరూపాఖ్య!విశ్వవిశ్వంభర! విశ్వసంహార!వేదాంగవాహన! వేదాంతవేద్య!వేదగోచర! సర్వవేదాంతకృష్ణ!అవని భారముమాన్ప ససురాళిఁ దునుమనవతరించినవాఁడ వంభోజనయన!1010నీవాదిమూర్తివి నిఖిలమూర్తులునునీవెకాకొండక నెఱిఁజూపగలడె?బాహాసురుఁడు నాకు భక్తుఁడు వీనిబాహులన్నియుఁదుంప బంతంబుగాదు.ననుగృపఁజూచి మన్నన నాల్గుచేతులునుపవే” యనుటయు నుగ్రాక్షుఁజూచిగరుడుని డిగి వచ్చి కరకంఠుకేలుఁగరములఁ గీలించి కమలాక్షుఁడనియె.“నీ భక్తుఁడననేల? నిగిడియే ప్రొద్దుమాభక్తుఁ డీతడు మాప్రాఁతవాఁడుమాన్యుఁడు ప్రహ్లాదు మనుమని కొడుకుధన్యాత్ముఁడగు బలితనయుఁడు గాననీతని కరుణించి యిచ్చితినాల్గుచేతులు; నినుపూజ సేసెడికొఱకు

నీ భక్తులగు వారు నెఱి మాకు ప్రియులుమా భక్తులగువారు మరి నీకు ప్రియులుగాక నెందును వేరు గలదయ్య మనకు?శ్రీకంఠ!” అని పల్కి శివుని వీడ్కొలిపిచెలువార నాలుగు చేతులుఁదక్కబలితనూభవు వేయి బాహువుల్ త్రుంచి1020యేచి నెత్తురుగమ్మనేపారమేనుపూచిన మోదుగుఁ బొలుపారు నతఁడుహరిపదాంబుజముల కందంద మ్రొక్కిపరమసదానందభరితుఁడై పలికె.“ఆదినారాయణ! అఖిలసన్మునులువేదాంత విదులును వెదకంగలేనిభవదీయ శ్రీపాదపద్మయుగ్మంబుఁదవిలి కొలువగంటి ధన్యుండనైతి!అన్ని చేతులునేల యీశానుపూజకున్న చేతులెచాలు నురగేంద్రశయన!”అని పల్క విని బాణు హరి డాయఁబిలిచితనువెల్ల నిమిరి ఖేదంబెల్ల మాన్పియమరత్వమును బ్రమదాధిపత్యమునుగమలాక్షుఁడిచ్చిన బహుసంతసిల్లె.

ఉషాకల్యాణము

బలిపుత్రుఁడును నాత్మభవనంబునకునుబలకృష్ణ సాత్యకి బ్రద్యుమ్నముఖులఁగొనిపోయి పూజించి కొమరారు వేడ్క

ననుపమ మణి భూషణాదులర్పించియయ్యుషాంగనతోడ ననిరుద్ధుఁదెచ్చియయ్యాదవాఢ్యుల కర్ధి మ్రొక్కించి1030సకలవస్తువులను సమకూర్చి తెచ్చిప్రకట మంగళమైన బల్ముహూర్తమునననిరుద్ధయుషలకల్యాణవైభవముఁబెనుపారఁ జేయించి పెండ్లింటిలోననందఱ భక్ష్యభోజ్యాది వస్తువులనందంద తనిపి యాయసురాధిపుండువేయురథంబులు వేయుయేనుఁగులువేయువాజులఁ బదివేలు ధేనువులబహురత్నభూషణప్రముఖాంబరములబహుళ దాసీజన ప్రముఖసంపదలనల్లునికింపార నరణంబు లిచ్చియుల్లముల్ చిగురొత్తి యొప్పారువేళననిపివుత్తేర నాయాదవోత్తముఁడు;అనుకంపబాణుఁ గృతార్థునిఁ జేసిమన్నించి వీడ్కొల్పి మహితసంపదలనన్నయుఁ దానును నరిగె ద్వారకకు.అనిరుద్ధుఁడునుష నిత్యానందలీలమనసిజక్రీడ నెమ్మది నోలలాడిరీపుణ్యకథవిన్న నిష్టసౌఖ్యములుఁబ్రాపించు భవరోగబాధలు మాను1040ధనధాన్యబహుపుత్రదారాభివృద్ధిఁదనరారకృష్ణుఁడు దనలోకమిచ్చు

నని చెప్పుటయు విని యభిమన్యసుతుఁడువినుతుఁడై శుకయోగివిభునకిట్లనియె.“ఘనపుణ్యుఁడగు హరి కల్యాణకథలువిని కృతార్థుఁడనైతి విష్ణుఁడు మరియుధారుణి పాలించి ధర్మవర్తనులనేరీతి విహరించె? నెఱిఁగింపు”డనినమధువైరికథలవాఙ్మనసగోచరములధిప! ఏర్పడ వినుమని చెప్పదొఁడగె.అని యిట్లు నిత్యధర్మారంభుపేరజనలోకనవపారిజాతంబుపేరఁజతురకళాపూర్ణచంద్రునిపేరనతులవైభవనిర్జరాధీశుపేరశోభితనవరూపసూనాస్త్రుపేరనౌభళమంత్రికందామాత్యుపేరఁగోరి భరద్వాజ గోత్రసంజాతుడారూఢమతి నయ్యలార్యనందనుఁడుశృంగారరసకళాశ్రితవచోధనుఁడుసింగనామాత్యుఁడు చెలువగ్గలింప1050సలలితరసభావశబ్దగుంభనలవలనొప్ప శ్రీభాగవతపురాణమునమహనీయమగు దశమస్కంధసరణివిహితలీలలనొప్పు విష్ణుచారిత్రమారూఢభక్తి కల్యాణకాండంబునారవితారార్కమై యుండఁజెప్పె.1053

కల్యాణకాండము సమాప్తము.

Comments

Loading comments…