మధురకాండము
ద్విపదభాగవతము
అక్రూరుఁడు శ్రీకృష్ణుని స్తుతియించుట
.......................లబ్ధిచయములన్నగంబులు, గుహ్యమ ప్రజాపతియునగు, విశ్వరూపాత్మ! అధ్యాత్మరహిత!నిగమార్థగోచర! నినుఁ గొల్తుఁ గృష్ణ!విద్యా(ధరస్తుత్య!) విశ్వలోకేశ!ప్రద్యుమ్న! యనిరుద్ధ! బల! వాసుదేవ!సంకర్షణాభీమ! సర్వసర్వాత్మ!పంకజోదర! శుభప్రద! హృషీకేశ!జలధిలోపల నున్న జలచరములును(చెలఁగ) నవని సర్వజీవులు నినుఁడుసరసిజాసన రుద్రషణ్ముఖభోగివరులును, నీలీల వర్ణింపలేరు.ఏనొక్క మనుజుండ హీనమానుసుఁడ
………………… మూర్తిఁ బొగడగ గలనె?”అని యిట్లు కొనియాడు నక్రూరుఁ జూచి,తనరార శౌరి యంతర్ధానమయ్యె.ఆతత సుస్నాతుఁడైన యక్రూరునీతరి మురహరి యీక్షించి పలికె………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………
శ్రీహరి అక్రూరుని కంసునికడకుఁ బంపుట
“కావున నీవు నక్కంసుతోఁ జెప్పు,వేవేగ మేము నీ వెంటనే వత్తు” 10మనవుండు నక్రూరుఁ డరదంబు నెక్కి.…………………………… నచ్చటి వార్తఁ జెప్పె.తన యింటి కేఁగినంతట రామకృష్ణులనుపమం బగు వేడ్క ననుఁగులుఁ దారు.
శ్రీకృష్ణుఁడును, బలరాముఁడును మధురాపురి కేతెంచుట
తొడిపూసి కట్టి సంతోషంబుతోడ,………………………… దెంచి కని రంతమ్రోల;
పసిడిగోపురములుఁ బసిడికోటలునుబసిడి మాడవులను బసిడిమేడలునుహేమకుంభంబుల నెంతయు నొప్పిహేమమయముగ సొంపెసలారి యుండఁగని వాని మహిమకుఁ గడు సోద్యమందితనరార తత్పురద్వారంబు సొచ్చిరమణీయ(శోభ వుర)మున నేతెంచుఁగమలాయతాక్షులఁ గని చాలవేడ్కఁబౌరకామిను లెల్ల భావకోల్లాసపారవశ్యంబునఁ బరతెంచి పేర్చి
పురస్త్రీలు శ్రీకృష్ణ బలరాములఁ జూచి వర్ణించుట
సౌధాగ్రముల యందు సదనంబు (లందు)వీధుల యందును వెఱవొప్ప నిలిచిసొరిది వారందఱుఁ జూపులు పఱపి;20“ ఈతఁడే, యెలనాగ ఇసుమంతనాఁడుపూతన (పాల్ ద్రావి) పొరిఁగొన్న వాఁడు,సకియరో! ఈతఁడే శకటమై వచ్చుప్రకట దానవుఁ ద్రుళ్ళిపడఁ దన్నినాఁడు.ముద్ధియ! ఈతఁడే మొగిఱోలుఁ ద్రోచిమద్దియ లుడిపిన మహనీయ యశుఁడు.అక్కరో! ఈతఁడే యఘదైత్యుఁ జీరికొక్కెర రక్కసుఁ గూల్చినవాఁడు.గోవర్ధనముఁ గేల గొడుగుగాఁ బట్టి.
(గోవులఁ దే)ర్చిన గోవిందుఁ డితఁడె.కొమ్మ! ఈతఁడె పిల్లఁ గ్రోవూది వ్రేతఁగొమ్మలఁ గడువెఱ్ఱిఁ గొలిపినవాఁడు.కాళీయు పడగ లుగ్రతఁ దొక్కి వానికాళి .......................... న పుణ్యుఁ డితఁడె.....................................................................................................................................................................................................(పదవిని దండ్రిచేఁ బలమినిఁ గొన్న)యెదిరిని కంసుని యేపుమాయించియీతఁడే రాజైన నిల యెల్లఁ బ్రతుకు;.................................................నెలఁత యీతఁడు రోహిణీదేవికొడుకుబలుఁ డను రక్కసుఁ బరిమార్చి నతఁడు;30.................................................మలసి యిద్దఱి విక్రమంబులఁ జూడనా రామ కృష్ణులు నా పట్టణంబు,భూరి సౌఖ్యమ్ముల నుబ్బుచుం బోయి
శ్రీకృష్ణుఁడు రజకుని రూపుమాపుట
రాచ చీరలఁ దెచ్చు రజకుని శౌరిచూచి యల్లన నవ్వుచుం జేరి పలికె.“మడివాల! మాకైన మణుఁగుఁ బుట్టములు
కడువేగఁ దెమ్మన్న” కనలి (వాఁడనియె).“అద్దిరా! లెస్సవో యగునగు మీకుదిద్దంగ వచ్చునే తివిరి మీ గుణమునిను విచారించవు, నినుఁ జూచు కొనవుచనునె యీ రాచ(వసనము) లడుగగనడవులలో మందలాఁగి రానేల?పొరలు పెట్టెడు పుట్టుభోగులు మీరుపరిఘమ్ములును గోరుపడము గొంగళ్ళు(కరకంచు)కోకలు కట్టుడు మీరు(ఈ రాచ)కోకలు యిమ్మన్న నెట్లు,నోరాడె? నొంచితి, నొవ్వకుం” డనిన,శౌరికోపించి యాచాకలిఁ బట్టి.......................................40పిడికిటఁ బొడిచినఁ బెల్లుగా నేలఁబడి తన్నుకొని వాఁడు ప్రాణముల్ విడిచె;వడివాఁడుఁ గూలిన వానితోవచ్చుమడివాళ్ళు బెగ్గలి మడుఁగు(లు వీడి)కనుఁగొని పారినఁ గన్నిచ్చ వచ్చుతనుపారు చీరలు ధరయించి శౌరిబలరామునకును గోపాలసంతతికివలయు వస్త్రములిచ్చి వారును దాను
శ్రీకృష్ణుఁడు తన్నుపచరించిన పట్టుశాలి ననుగ్రహించుట
జ(నుచున్నచోఁ) బట్టుశాలి యొక్కరుఁడుతన నేర్పుమెఱసి వస్త్రమునేసి వేడ్క
మనుజేంద్రునకు నిచ్చి మన్నన వడయఁగొనిపోవుచు మ్రోల గోవిందుఁగాంచి(యసుపమ) భక్తితో నడుగుల కెఱఁగితనచేతి చీర ముందటబెట్టి నిలిచి;యవధరింపుము కృష్ణ! అంభోజనయన!తవిలి పుణ్యుఁడనైతి ధన్యుఁడనైతి(నాపద్మ)జాదుల కందగరానినీపాదము (లభించె) నిఖలలోకేశ!మునిలోకనుతపాద! మురవైరికృష్ణ!(కొనుము యీ పుట్టంబు గోవింద! యనినఁ)50గని శౌరి కరుణ (సకల కామ్యములును)తనలోకమును నిచ్చి ధన్యునిఁ జేసె
శ్రీకృష్ణుఁడు సుదాముఁడను పుష్పలావికుని యనుగ్రహించుట
అరుగు దేర సుదాముఁడను పుష్పలావుఁడరిగి యెదుర్కొనె నత్యంతభక్తిబలరామ కృష్ణుల పాదాబ్జములఁజెలువారఁ బూజించి చెంగల్వదండలిరువురకునునిచ్చి యింపుసొంపారవిరు(లమాలి)కలిచ్చి వెసవేయుగతులఁగీర్తింపఁగని హృషీకేశుండు శౌరియార్తరక్షణశీలి యతనిమన్నించివరము వేడుమటన్న వాఁడు “మీపాదసరసిజంబులుఁ గొల్చు సద్భక్తి నాకు
దయసేయుమనుడు నాతనిఁదన్పు సేసినయమైన తత్ప్రసూనములర్థిఁ దాల్చిమనమున హర్షించి మరలిపోవంగఁ
శ్రీకృష్ణుఁడు కుబ్జను మంచిరూపమునిచ్చి యనుగ్రహించుట
గనియెఁ గృష్ణుఁడు రహిగంధపుచిప్పవలచేతఁబూని త్రివక్రయై నడచుజలరుహాక్షుఁడు కుబ్జ చపలాక్షి (నొరసి)(కని) చల్లననగుచు కలకంఠి యెందుఁ(జనియెదు) గంధబాజన మెవ్వరికిని60గొనిపో(వుచున్నావు కొమరొప్ప నీవి?)(అనవుఁడు) హరిఁజూచి యాకుబ్జ పలికె.“వనపాక్ష యేను...........త్రివక్రయనుదాన రాజు నన్నర్థి మన్నించుగండంబు వాసించి కలపంబుఁగూర్చియందంబుగా మేన నలఁదఁగానేర్తునిది, దేవరకు యోగ్య మీగంధ, మలఁదిపవివేలుభూములు పాలింపు” మనుచుమ్రొక్కి గంధపుచిప్ప ముందఱ నిడిననక్కజంబుగ శౌరి హలియునుఁ దానుచందనంబలది యాచపలాక్షి మేనిచందంబుఁజూచి యాచతురుడు దానికాలు కాలున మెట్టి కందువకీలఁగీలించినంత మైకిటుకును మాని
మెలఁతుక క్రొవ్వాఁడి మెఱుఁగకోయనఁగఁగలికి కన్నులసోయగము నివ్వెటిల్లమురిపంబు చిరునవ్వు మోమున మెఱయ,హరిఁ జేరి సరసోక్తి నల్లనే పలికె.“నా కాలుఁ ద్రొక్కితి నన్ను మన్నించినాకోర్కిఁదీర్చుట నెయ్యంబు నీకునాయింటి కేతెమ్ము నలినాక్ష!” అనుఁడు,ఆయింతిఁ గనుగొని “యటఁబోయి మఱలి,చనుదెంచెదముగాన చనియెద” మనుచువనిత వీడ్కొలిపి, యావసుదేవసుతుఁడుచని వణిక్పథమున సకల(బేహార్లు)అనుపమదివ్యగంధాంబరాభరణములు కానుకలు చేసి మ్రొక్కి దీవింప;చెలువల మనములఁ జిత్తజానలము
శ్రీకృష్ణుడు కంసుని మహాధనువును విరచుట
మురిగొని చూడఁగ మొగశాల కడకునరుదెంచుచో మందరాంతంబునందుఁబొలుచు మహాభోగిభోగమో యనఁగఁజలననమొందనియట్టి చాపమో యనఁగఁబ్రకటారిజలరాసిపటుశేతు వనఁగఁగకుటివారణకరకాండమో యనగఁనారూఢగంధపుష్పార్చితం బగుచుమేరూశైలాగృతి మెఱయు కార్ముకముఁగని, దాని చాపకర్కశలు వారింప
దనుజారి యమ్మహాధను వెక్కఁద్రోచివడిగుణధ్వని సేసి వారక తివిసిపిడికిలి వదలిన ఫెళఫెళధ్వనులు80దిక్కులు వ్రయ్యంగ దిగిభంబు లగలఁచుక్కలు డుల్లంగ సురలోక మదరధారుణి వణక పాతాళంబు వగులవారాసి పిండలివండుగాఁ గలఁగపిడుగులు పదివేలు పెట్టి యొక్కెడనుపడియనోయన విల్లు బ్రల్లన విఱిగెఅట మహాధ్వని విని యాపౌరులెల్లఁబటుగతిఁ దొలఁగ భూపతి బెట్టుకలఁగి
కంసుఁడు శ్రీకృష్ణునిచేఁ దనధనుర్భంగమును విని విచారించుట
తన కలంకులనుస్న దానవాధిపులఁగనుఁగొని పలికె నుత్కటకోప మెసఁగ.డోపించి “వసుదేవుఁగొడుకులు నేఁడునా పట్టణముఁ జొచ్చి నావిల్లు విఱిచిచలము చేకొని ధనుశ్శాల నున్నారు.బలసి మీరందఱు బలశక్తివారలనిద్దఱ వధియింపు డొండెకారాగృహాన నుక్కరఁబెట్టుడొండె”.
శ్రీకృష్ణుఁడు కంసునిపంపున నేతెంచిన రక్కసుల రూపడరించుట
అని పుచ్చుటయు దైత్యు లసమసాహసులు,
చనుదెంచి వారితో సమరంబు సేయనారామకృష్ణులు నవ్వీరవరులఁదోరంబుగల వింటితునుకల నడచిమెఱసి కంసునియింటిభృత్యుని బలునిఁబరిమార్చి యందఱిఁ బఱపి యాలోనగమ్మన నాయుధాగారంబు వెడలియిమ్ములఁ బురలక్ష్మి నెలమిఁ జూచుచునునొప్పార నందాదులున్న యయ్యెడకుఁదప్పకఁ జనిరంతఁ దపసుండుఁ గ్రుంకె.
కంసుఁడు దుర్నిమిత్తములను జూచి బెగడుట
తనరార కాలోచితమ్ములుఁ దీర్చియనుపమసుఖలీల నారాత్రియందునంతనంతయు విని యాభోజనృపతిచింతించి బెగ్గలి చేష్టలు సడలిదారుణంబైన వేదనఁ బొంది కందికూరుకుఁ గానకఁ గొందలంబందియద్దంపునీడలో నాతతంబుననునిద్దంబుగాఁ దననీడఁ జూడఁగనుతలలు రెండై యుంట...........గలవెత నగ్నులు గానంగ బడుటఖరలులాయోష్ట్రాదికములును గనుటయరుదార తలనూనెలంటుకొంచుంటబిసములుఁదినుచుంట ప్రీతిదాసనపుకుసుమధామంబులఁ గొనధరించుటయు100
ధూళిలో రొంపిలోఁ ద్రొక్కినయవుడుకాలుమోవక పాదఖండమై యుంటఁచెపులు మూసినయెడ సింధుఘోషంబుఁబ్రవిమలంబుగ వినఁబడకుండుటయునునివియాదిగాఁ బెక్కు లీక్షించి తనకుయవసానకాల మౌనని యాత్మ నెఱిఁగిపురపురఁ బొక్కుచుఁ బొగిలి లోగందిమరణభయంబున మదిఁదప్పెనంత;నెట్టకేలకు వేఁగ నినుఁడు పూర్వాద్రిదట్టుఁడై పొడతెంచెఁ దమ్ములింపలర.
కంసుఁడు కొలువుకూటమందు శ్రీకృష్ణబలరాముల రాకను ఎదుఱుచూచుట
అంతఁ గంసుఁడు పూర్వాహ్నికక్రియలుసంతసంబునఁ దీర్చి సకలభూపతులుఁగొలిచియుండఁగఁ బెద్దకొలువుండి వేడ్కబలరామకృష్ణుల బవరంబుఁ జూడఁదలఁచి పెంపెసలారు తమకంబులందువలయువారును వసియించెనంత;మఱియును బహువిధమంచియలందువరులు సద్విజరాజవైశ్యశూద్రులనుప్రవిమలంబుగనుండి, రంగమధ్యమునవివిధపుష్పసుగంధవిధులు వాసించి110పరగ నవ్వేళ గోపాలురుఁ దానునరుదెంచి నందుండు నాభోజపతికిఁ
బొడఁజూపి తమతెచ్చు భూరివస్తువులుకడఁకతో నిచ్చినఁ గరము మన్నించితనచేరువనె యొక్క తమకంబుమీఁదనునిచి వారును దాను నొగిఁజూచుచుండె.కరియూధ మే చుగతి మల్లవర్గమరుదెంచ వందిబృందారవం బెసఁగఁ
కొలువునకు ముష్టిక చాణూరు లేతెంచుట
జను దెంచి ముష్టిక చాణూరముఖులలెనయ రంగస్థలంబెల్లఁ దారగుచుభుజమప్పళింపుచుఁ బొరి విజృంభించిగజభజింపుచునుండగా నంతలోన;
శ్రీకృష్ణునిపై మాపటీడు మదగజమును బురికొల్పుట
వికసితపుష్కరవిభవంబుఁ జెందియకుటిలదీర్ఘశృంగారూఢి నొప్పిమానుగా వంశాఢ్యమహిమఁ జెన్నొందిదాన నిర్జరలీలఁ దనుపారఁ బేర్చిపొడవు తక్కువగాని భూధరేంద్రంబువడువునఁ జెలువారు వరశక్తిచేతనష్టదిగ్గజముల నాపంగనోపునష్టమదాపూర్ణమై పేర్చుకరణి120కువలయవేలంబు కోరియాశాలనవిరళంబుగ నిల్చి యతికౌతుకమున
నెదరుచూచుచునుండె నెంతయు వేడ్క.యదుకులోత్తంసులు హలియును హరియురమణీయజలజాకరమునఁ గ్రీడింపగమనోగ్రగతివచ్చు గజయుగ్మ మఁనగఁగరియూధములమీఁద కలుషించివచ్చుహరిశోరద్వయమనఁ బెంపు మిగిలిపౌరులుఁ దముఁ జూచి బహుభంగిఁ బొగడనారూఢరంగము నటు డాసి శౌరియరుదారఁ దెరుపున కడ్డంబు వేర్చుకరిఁ జూచి మావంతుఁ గనియు నిట్లనియె.“ఈకరిఁ దొలగించి యిటఁద్రోవఁ జూపుమాకంసుకడకు మాకరుగఁగావలయుఁబోవనీకుండినఁ బొరిపుత్తు" ననిన;మావంతుఁడంత నర్మరుషంబుతోడఁగరిపతి హరిమీఁదఁ గదియింప నదియుఁదిరిగి మహోదండతీవ్రతుండంబుఁబ్రసరింపుచును గృష్ణుఁ బటుశక్తి నొడియనసమసత్వుఁడు కృష్ణుఁ డటఁ దప్పఁగ్రుంకి130
శ్రీకృష్ణుఁడు మదగజమును సంహరించుట
చరణమధ్యములకుఁ జని బాహు లెత్తియరుముష్టి బొడిచిన యురమూరదాఁకిహుంకారరవమున నోడించి మొరగనంకుశంబున సూది హస్తిపుం డార్వఁ,బురికొని కరటి యపుండరీకాక్షుఁ
గరకాండ మెత్తి యొక్కట మేనుఁజుట్టితివిచినఁ దనమేను దివియక శౌరియవిరలభోగిభోగావృతం బగుచుదిరిగెడి మందరాద్రియుఁబోలెఁ దిరిగికరమొప్ప శక్తిఁ బుష్కర మొప్పఁబట్టివెనకకుఁ ద్రోచిన వివశమై యొరగిఘనరౌద్రమున లేచి కఠినదంతములహరిమేను బొడవంగ నతఁడు మైఁదప్పె,కరముగ్రమగు ముష్టిఘాతలఁ జరుపమావంతుఁ డలిగి తోమరములు మూటనావిశ్వవిభు వైవ నతఁడు కోపించికడఁగి హస్తిపకుని కడకాలుఁబట్టిపుడమిపైఁ బడ నీడ్చి పొరిఁద్రొక్కి చంపె.మావంతుఁ డీల్గిన మత్తేభ మడరిగోవిందుపై నాఁకఁ గొనకఁ బెల్లురకఁ140బదతాడనంబులఁ బరుషఘాతములఁబ్రిదులంబులును బోని పిడికిళ్ళఁ బొడువముక్కున వాతను మొగికర్ణములనునక్కజంబుగ నెత్తు రందంద నొలుకపవిఁదాకి కూలిన పర్వతం బనఁగఁబవనుచేఁబడు మహావృక్షమో యనఁగగజము నిశ్చేష్టమై గజభము లుడిగిగజగజ వడకి యక్కజముగాఁ ద్రెళ్లె,కడువడి మెడఁ ద్రొక్కి (గజదంతములను)బెదిదంపు లావునఁ బెఱికె మురారిదాననకుంభనిర్దళనంబు సేసి
మేను వ్రేయఁగ వేఁగి మిడమిడ మిడికిగైరికనిర్ఘరకలితాద్రి వోలెభూరిరక్తంబులఁ బొలిచె నగ్గజము.
శ్రీకృష్ణుఁడు కొల్వుకూటమును బ్రవేశించుట
కరిమదరక్తపంపకములచే మేనఁదొరగెడు ఘర్మబిందువులును నరయహరిమేను చిత్రవనాంబుద మనఁగ,నరుదారఁ జూపట్టె నందందఁ జూడ;గజగంతములుఁ దాను కామపాలుండుభుజశిఖరంబులఁ బొలుపొందఁ దాల్చి150దారుణతరదండధరయుగ్మ మనఁగగౌరత మల్లరంగము సొచ్చి నిలువగోరిమల్లులకెల్ల కులిశమై, ప్రజకుధారుణినాథుఁడై, తల్లిదండ్రులకుబసిబాలుఁడై యొప్పు, పంకజాక్షులకునసమాస్త్రుఁడై, వల్లవావళికెల్లఁబరమాప్తుఁడై, యతిప్రతతికి నెల్లఁబరతత్వమూర్తియై, బంధుసంతతికిదైవమై, రోహిణీతనయుఁడుఁ దానునావిష్ణుఁ డరుదెంచె నండఱుఁ జూడ.అతులితగంధపుష్పామోదితులునుసతతసౌఖ్వాఢ్యులఁ జారుభూషణులశ్రితకీర్తియుతుల, నాశ్రితకల్పతరులఁబ్రతిభటవనదావపావకసముల
ఘనదీర్ఘబాహుల, కఠినవిక్రములవనజాతనేత్రుల, వసుదేవసుతుల,నారామకృష్ణుల, నతులవిక్రముల,నారూఢనవయౌవనాంగులఁ జూచి160భోరున జనులెల్లఁ బొగడఁగఁ గంసుడారవ మాలించి యటఁ జూచునంత;కువలయపీలంబుఁ గూల్చి తన్నర్థికువలయంబంతయుఁ గొనియాడవచ్చుహరికామపాలుర నందందఁగాంచితిరుగుడువడి గుండె దిగులొంది తాల్మి
కంసుఁడు చాణూరముష్టికులను శ్రీకృష్ణునిపైఁ బోరబంపుట
డింది చాణూరముష్టికుల రప్పించిదందడిఁ బెదవులు దడపుచుఁ బలికె,"మనమంటపము సొచ్చి మనవిల్లు విడిచిమనపట్టపేనుఁగ మడియించి వీరుమనమీఁద వచ్చిరి మహితవిక్రములు.తనరార మల్లయుద్ధము నేర్పు మెఱసిపోర మీరిరువురుఁ బొలియించి వేగనారాజ్యమును నన్ను నాబంధుజనులరక్షించి నాదుసామ్రాజ్య మెంతయునునక్షయంబుగ నేలుమ”ని పల్కుటయును ;తివిరి యుక్కున దాత తీర్చినయట్లప్రవిమలంబగు మహాప్రతిమలో యనఁగ
నవయలంబులుగల యద్రులో యనఁగపవివ్రేయ నాపెడు బలుదిట్ట లనఁగముష్టికచాణూరముఖ్యులు నృపతియిష్టంబుఁ గని రంగమెల్లఁ దారగుచుఁ170గినుకమై బలరామకృష్ణులఁ జేరఁజని మహాధ్వని మల్ల చఱచి యిట్లనిరి.
ముష్టికచాణూరులు బలరామకృష్ణుల నధిక్షేపించుట
“వసుదేవసుతులార! వసుధలో మిమ్ములసమానసత్వాఢ్యు లం డ్రెల్లవారుపెక్కండ్రదనుజుల పీచంబు లణఁచియక్కజంబుగ మెఱసినయట్టిసాహసులు;భోజభూవిభుఁడు మీపోరు నీక్షించిరాజిల్ల మమ్మిట రప్పించినాఁడు;మందలోపల గొల్లమగనాండ్లఁ దిరిగిసందింపుచును నాడ సానురాగములఁబిల్లగ్రోలూఁదుచుఁ బెరయుటగాడుమల్లయుద్ధములకు మమ్ము డగ్గరుట;యేను చాణూరుండ యితఁడు ముష్టికుఁడుపూని నీపును నేను బోరుద మెలమిముష్టికుతోడ రాముఁడు మల్లయుద్ధమిష్టలీలల నొప్పు డిది సాటి" యనుఁడు,అల్లన నవ్వుచు నంబుజోదరుఁడు
శ్రీకృష్ణుఁడు హేళనగాఁ జణూరనకు బదులు చెప్పుట
"పల్లవులము పిన్నపాపలు మేముతగిన జెట్లును మీరు ధరణీశునొద్దజగతిపైఁ బోరుల సడిసన్నవారు180మీతోడ రణవీథి మెఱసి సేయంగనాతరంబులవార మగుదుమే మేము?చెనసి భూపతి వేడ్కఁ జెడకుండ కొంతపెనఁగెద”మని పల్కి ప్రీతి మై పెంచి
శ్రీకృష్ణుఁడు చాణూరునితో మల్లయుద్ధముఁ జేయుట
వడిమల్ల చఱచి భూవలయంబు పగులబెడిదంబుగా నార్చి పిడికిళ్లు చాఁచివానిమై కదియు ముష్టాముష్టి గవియఁజూణూరుఁడును మల్ల చఱచి యిట్లొరసియిరువురు భుజ మప్పళించు చప్పుళ్లుశరనిధి కలఁగె నాశాచక్ర మగిలెనంతకుఁ దెసఁజేరి యవనిపరాగ,మింతింతఁగొన మేన నిరవారఁజల్లికొనిపదఘాతల కూర్మంబు వగులఁదనరు మహాభద్రదంతుల రీతిఁజేతికి నొడిసినఁ జేయీక తివిసిఘాతసేయంగ దగ్గఱి మేను దొలఁగిపొడిచిన నది వెలిపుచ్చి మైవంచియొడిసి తొడలఁ దట్టి యార్చి పెల్లురికి
లాగంబుఁ గొచను మేలనఁదలఁగ్రుంకిబాగుఁదప్పకఁ దలప్రహతుల నొంచి190నడుముఁ బీడింప విణ్ణనుదున మలఁగివిడిపించుకొని ముష్టి విసరమై పొడిచిపట్టుచు విడుచుచుఁ బరుషఘాతములదట్టించి కూర్పరోద్ధతుల నొప్పించికరవశంబుఁగొన కాభీరువోకదర కాండములు లోనుగానీక తొలఁగిశిసకంబొనరింప శిరమూన్చి పెట్టుగాసిల్లి కేలడొక్కరమున నొత్తిరంకెలువైచు గోరాజుల భంగిఝంకించి బింకంబు సరిగాఁగఁబెనఁగిముంగలు బలసింగములభంగిఁబొంగినింగిమోవంగ నార్చి నిడుగుడి పై కుఱికిమెడయు గాళ్లును బట్టి మీఁదికి నెత్తిపుడమి మోవంగవ్రేయ భోరున నెగసియడపకరాఁగేల నిరియ బిగించివడి నుగ్రమగు ముష్టి వక్షంబుఁ బొడువఁదడబడ ముష్టిఘాతల మోములవసిదొడిదొడి పన్నెత్తురులు వఱ్ఱుగాఁగహరియు చాణూరుఁడు నటమల్లయుద్ధపరుషతఁ దుల్యులై బవరంబు సేయ;200
బలరాముఁడు ముష్టికునిలో మల్లయుద్ధముఁ జేయుట
సీరితోఁ దొడరి ముష్టికుఁ డుగ్రవృత్తిబోరెఁ జూపరకు సభ్యులు చూచి పొగడ;
హరిరాములకు జయంబయ్యెడుననుచుసురలు దీవించిరి, శోకించి పౌరు
శ్రీకృష్ణబలరాములఁ గాంచి పౌరులు శోకించుట
“లక్కటా! ఈకంసుఁ డతిపాపకర్ముఁడెక్కడి యీబాలు రెక్కడి వీరలెక్కడననిఁ జూడ కెట్లు గావించెనక్కటా! వారించరైరి యెవ్వరును.ఈసుకుమారుల నిటు సేయఁ దనకుదోసంబుఁ దిట్టును దూరును గాదె?పరుషత రిపులతో బవరంబు నేయహరిమేను ఘర్మకణాంచితం బగుచువివశితాంభోజంబువిధ మొందెఁ జూడుడీవాసుదేవుల కీబారిగడపుదైవమాయని" మ్రొక్కి తరుణులు వగువ;దేవకియును వసుదేవుఁడుఁ బ్రీతిగోవిందబలులఁ గనుఁగొని వంతనొంది
శ్రీకృష్ణుఁడు చాణూరుని జంపుట
రప్పుడు దనుజారి యామహాజట్టిదప్పకఁ జూచి యుద్ధత శక్తి మెఱసి210పిడికిటఁ బొడిచినఁ బెంపేది వాఁడుపడియొడ్డ నిల్చి యపంకజోదరునివక్షంబు శిరమున వడిదాఁకుటయును;
ఈక్షించి హరి వాని వెనుకకుఁ ద్రోచికుడిరెట్ట వట్టి పెలుకుఱఁ ద్రిప్పి నేలఁబడవైచి తన్ని గొబ్బున మీఁదికుఱికిమెడఁద్రొక్కి యినుము సమ్మెట మోదినట్లుతడబడ ముష్టిఘాతల మేను నొంప;వెగడొంది (ప)ట్టెమ్ము విఱిగి గుండియలుపగిలి చాణూరుండు ప్రాణముల్ విడిచె.
బలరాముఁడు ముష్టికుని జంపుట
అప్పుడు ముష్టికుం డమరు లీక్షింపఁజెప్పబెట్టులుగాఁగ సిరితోడఁ దొడరిపులులచందమున నుబ్బుచుఁ బొంగిపొంగిబలులులాయంబులపగిది దాఁటుచునుపాయుచు డాయుచు బాహార్హళములవ్రేయుచు నొగిఁ బెక్కువిధములఁ బోర;ద్రిష్టించి చూపర దిగులొంద నిలిచిముష్టికుం డదరి రాముని బెట్టుఁ బొడువఫాలంబు పగిలి తప్పక నెత్తురొలుకనేలపైఁ బడి లేచి నీలాంబరుండు220పిడుగు వ్రేసిన భంగిఁ బిడికిటఁ బొడువఁబడితన్నుకొని జెట్టి ప్రాణముల్ విడిచె;గతుఁడైన ముష్టికుఁ గని వానితమ్ముఁడతిబలాఢ్యుఁడు కూటుఁడనువాఁడు సీరిఁబోకుఁబోకని దాఁకి పొరిముష్టిఁ బొడువయాకూటుఁ దెకటార్చి యార్చె మిన్నద్రువఁగోసలప్రభృతు లొక్కొట యేడుగురను
వాసుదేవుఁడు వారి వధియించె నంతఁగనుఁగొని మల్లవర్గమువారు వారుటయునుయనిమిషావలిఁ జూచి యచ్చెరువందె.
కంసుఁడు ముష్టికచాణూరులు మడియుటఁ జూచి తనసేనాపతులతోఁ బలుకుట
భోజభూపతి వారు పొలియుటఁ జూచిరాజసం బెడలి బోరన నశ్రులొలుకవడివాద్యముల మ్రోఁత వారించి తనదుపడవాళ్ళఁ బిలిచి నిర్భయవృత్తిఁ బలికె.“ఈపాపకర్ముల నిరువుర నీళ్లద్రాపించి, వసుదేవుఁ దునుమాడి, నందగోపునియిల్లు ముట్టుకొని చెఱఁబెట్టిగోపాలకులఁ బట్టికొని, యుగ్రసేనుదండించు”డని భోజధరణీశుఁ డాడుదండిమాటల కల్గి దానవాంతకుఁడు230
శ్రీకృష్ణుఁడు కోపించి కంసునిపై లంఘించి యీడ్చి చంపుట
గిరిశృంగమునకు లంఘించు సింహంబుకరణి దన్గదనుకలిమీఁది కెగయ,కని భోజపతి కేల ఖడ్గ మంకించికొని యాజ కెదుఱంగఁ గొరనవ్వు వెలయనురగంబు పక్షీంద్రుఁ డొడియు చందమునకరవాలుఁగేలు నుగ్రతశక్తిఁ బట్టికొసవెంట్రుకలు వట్టి గొరగొర నీడ్చివసుమతిఁ బడఁద్రోచి వడి మీదికుఱికి
పిడికిళ్ళ నొప్పింపఁ భిరికి ప్రాణములుయొడలికిఁబెడఁబాయ నొప్పార కంసుఘనకళేబరము రంగము వాయనీడ్చియనుపమధ్వనిఁ బేర్చి యార్చి మురారియతనితమ్ములు సునాభక్రోధనాథులతిసత్వు లెనమండ్ర మలపాణి చంపె;నప్పుడు పౌరులయార్పులు నింగినుప్పొంగి బహుపాశకోక్తులఁ జెలంగె.
కంసుని మరణముఁ గని దేవతలు హర్షించుట
భవకమలాసనప్రముఖదేవతలుప్రవిమలంబుగఁ బ్రణుతించి రెలమిదివిబీఁటకొని మ్రోసె దేవధుందుభులుదివిజకామినులు నర్తించి రింపార;240పొరిఁబొరి మందారపుష్పవర్షములుసురకోటి దేవకీసుతుమీఁదఁ గురిసిరంతట, కంసుండు హతుడౌట యెఱిఁగియంతఃపురాంగన లడలు దీపింపనడుగులు తడబడ నాత్మలు కలఁగసుడివడి లోగుంది సృక్కి బల్వడిని,నురముల శిరముల నొరి మ్రోదుకొనుచుపరిపరివిధముల పలవించి మిగులనార్తనాదంబుల నందంద బొగిలి
కంసునిస్త్రీలు తమపతి మరణమునకు విలపించుట
భర్తపై వ్రాలుచు బహుభంగి నొగిలిహా! యని యేడ్చుచు హా నాథ! యనుచు
పోయితే! మము బాసి భోజవంశాఢ్య!కటకటా! శోకానఁ గ్రాలంగ మమ్మునిటఁ జూడ వించుక యేలఁ గైకొనవు?ఇనుఁడు నీమీఁదట యెండరానోడు;ననిలుండు నీమీఁద నటవీవ వెఱచు;ననలుండు తీవ్రార్చు లడరింపనోడు;ననిమిషాదులు మీకు నడకుదు రెపుడు;నీయాజ్ఞ నీలావు నీరాజసంబునీయొప్పు నీనేర్పు నీమంచితనము250వ్రేయవారలచేత వేల్మిడినడఁగిమాయమైపోయితే మనుజదేవేంద్ర!"అని బహుభంగుల నార్తులై పొగులవనితల నూరార్చి వాసుదేవుండు
శ్రీకృష్ణుఁడు కారాగృహమునుండి దేవకీవసుదేవులను విడిపించుట
కారాగృహంబునఁ గడునొచ్చియున్నవీరుని వసుదేవు, వెలఁది దేవకిని,గని వారికాలి సంకిలియలూడ్పించివినయంబుతో మ్రొక్క వెఱఁగంది వారుగోవిందహలులఁ గల్గొని తమపాలిదైవంబులని, యాత్మఁదలఁచిరి గానితనయభావంబుగాఁ దలఁచకయున్నతనమాయ హరి మోహతమముఁ గారించచన్నులఁ బాలును సమ్మదాశ్రువులుకన్నులఁ దొరల నక్కాంతాలలామ
సుతులఁ గౌఁగిటఁ జేర్చి శోకంబుఁ దక్కియతులితంబగు ప్రేమ నందఁదఁ జూడవసుదేవుఁడును బుత్రవరుల నీక్షించియసమానమగుప్రేమ నక్కునఁ జేర్చి“పుణ్యాత్మ! మీయట్టి పుత్రులఁ గాంచిపుణ్యకీర్తులఁ గంటి పుణ్యుఁడ నైతి;260నింతగాలము మిమ్ము నీక్షింపలేకసంతాపమందుచు శత్రులచేతబడని బాధలఁ బడి పసువుచుండితిమి;కడపట! నినుఁ జూడగంటిమి నేడు;జన్మజన్మాంతరసంచితౌఘములుచిన్మయ! నినుఁ దలఁచిన మాత్రమేఁగు.మహనీయ! నీవు కుమారుఁడ వైతివిహపరంబుల మాకు నేమిటఁ గొఱత?”అనియున్న గురుల నత్యాదరలీలఁగనుఁగొని శౌరి యుత్కటబాష్పుఁ డగుచు
శ్రీకృష్ణుఁడు తల్లిదండ్రులఁ జూచి చింతించుట
“మానిమిత్తముల దుర్మనుజులచేతఁబూని బహుక్లేశములు మీకుఁ గలిగె;జనియించినపుడే యిచ్చటనున్న వెఱచియనఘ! నందునియింటి కనిచిన, వారుబాల్యంబు మొదలుగా భక్తిఁ బోషింపఁగౌల్యవర్తనల మెలఁగి కాంచితిఁ గానియప్పటప్పటికి మమ్మరసి మీ రర్ధిఁజెప్పిన పనిసేయ సిద్ధించదయ్యె;
తనయుఁడు జయించి తల్లిదండ్రులకుననుపమంబగుభక్తి నరయకుండినను270దనయుండె? ఆతఁడు తల్లియవ్వనముఁగొనకొని తెగఁజూచు గొడ్డలిగాక!"
శ్రీకృష్ణుఁడు ఉగ్రసేనుని రాజ్యభారమును వహింపఁజెప్పుట
అనిభక్తి సూరార్చి యయ్యుగ్రసేనుఁగనుఁగొని కౌఁగిట గదియించి, శౌరి“నీరాజ్యమంతయు నిర్దయవృత్తిగ్రూరుఁడై తానె కైకొని యంతఁబోకయాకలఁ బెట్టి మిమ్మలఁచినయతఁడుకాకున్న పనియట్లగాక పోరాదుహీనమానసులైన యీదురాత్ములకుఁగానఁజింతింపకఁ గంసాదిసుతులకగ్నిసంస్కారాదు లర్థిఁ జేయింపుప్రాజ్ఞుల విప్రులఁ బనిచి వేవేగరాజ్యభారముఁ దాల్చి రమణ మా కెల్లపూజ్యుఁడవై లీల భూమి పాలింపు”,మనుటయు హరిఁ జూచి యయ్యుగ్రసేనుఁ“డనఘ! న న్నిమ్మాటలాడంగఁదగునె?హీనుఁడ నతివృద్ధ నీరాజ్యభరముపూన నాకర్హంబె? పుండరీకాక్ష!వసుదేవుఁబట్టంబు వలనొప్పఁగట్టియసమానగతిని రాజ్యము నీవె తీర్పు;280కన్నులు చల్లఁగాఁ గలకాలమెల్ల
నిన్నుఁ జూచుచుఁ బ్రీతి నెగెడద కృష్ణ!"అనుచుఁ బల్కిన శౌరి యారాజుఁ జూచివినయంబు నీతియు వెలయ నిట్లనియె.“యాదవులకు రాజ్యమర్హకృత్యములుగాదు యయాతివాక్యముఁద్రోయరాదు;కావున సామ్రాజ్య కమనీయలక్ష్మినీవె పాలించి మన్నించు, బాంధవులరప్పించి వారికి రాజ్యంబు లిచ్చితప్పక మమ్మెల్ల దయ నేలుకొనుము.నిఖిలభూపతులును నింపు సేయంగసుఖలీలనుండు; కంసుని వంతమాను”.మనిపల్కి యాతని నవనీభరంబుఁగొనకొనుమని నీయకొలిపి మురారి
శ్రీకృష్ణుఁడు నందుని కడకు వచ్చుట
బలుఁడుఁ దానును నందుపాలి కేతెంచికలిసి యాతనిఁ జిక్కకౌఁగిటఁ జేల్చభోజాధిపతియింటఁ బొలుచు వస్తువులురాజ్యయోగ్యములైన రవణంబు లిచ్చియతని మన్నించి నెయ్యము తియ్యదనమునతిగారవంబున నమర నిట్లనియె.290“నీవు నీసతియును నెమ్మిఁబోషించిప్రోవఁగఁ బ్రతికిన ప్రోఢల మేముతల్లియుఁ దండ్రియు ధనము లియ్యమునునెల్లబంధువులును నిట మాకు నీవ;మందలోపలికి నెమ్మది నేఁగి మీర
లందఱిసేమంబు లడిగితిమనుఁడు;యేనాఱుదినముల యీలోనె నచటికే నేగుదెంచెద నీవంతమాను”.మని వారి నూరార్చి యనుప నందుండుఁజనియె గోపాలకసమితియుఁ దాను.అంతట నిశ్శంక నారాత్రి సౌఖ్యసంతోషలీలలు సలిపి రింపొంద.మరునాఁడు శౌరి కుమారులఁ జూచి
శ్రీకృష్ణుఁడు తనగురువగు గర్గ్యునివద్ద విద్యల నభ్యసించుట
తెరగొప్ప సద్గురుద్విజుల రప్పించికాలోపనయనసంస్కారాదివిధులుగాలోచితక్రియగతులుఁ జెప్పింపయదుకులాగతగురుఁడగు గర్గ్యువలనఁజదువొప్ప వేదశాస్త్రము లభ్యసించియెఱుక సాధింపుడంచను విప్రునింటయఱవదినాల్గువిద్యలు నభ్యసించి300
శ్రీకృష్ణుఁడు గర్గ్యుని గురుదక్షిణ గోరుమనుట
గురువులఁ బూజించి కొలిచి మన్నించి“గురులార! యేనీకు గురుడక్షిణార్థమిరవార మదినున్న యీప్పితార్థములఁదరమిడికొనివత్తు దయ వేఁడు” మనిననతఁడు భార్యయుఁ దాను నటవిచారించిహితబలాఢ్యునిఁ గృష్ణు నెఱిఁగి యిట్లనియె.
ప్రభాసతీర్థమందు మునిఁగి చనిపోయిన కుమారుని తెచ్చిపెట్టుమని శ్రీకృష్ణుని గర్గ్యుఁడు కోరుట
“తనర ప్రభాసతీర్థములోనఁ దొల్లిమునిగిపోయినపుత్రు మొగిఁ దెచ్చియిమ్ముడిది దుష్కరపుకార్య మిటు సేయుఁ” డనినయగుఁగాక యని ప్రీతి హాలియును దానునగణితాయుధపూర్ణమగురథం బెక్కి
శ్రీకృష్ణుని సముద్రుఁడు పూజించి వచ్చినపనిఁ దెలియఁజెప్పుమనుట
చను దేర; నెదురేఁగి జలరాశి మ్రొక్కియనుపమదివ్యరత్నాళిఁ బూజించి“తామరసాక్ష! మాధవ! లోకవంద్య!ఏమి విచ్చేసితి రెఱిఁగింపు” మనుఁడు;“తొడరి మాగురువుపుత్రుని మ్రింగినాఁడవుడుకకఁ దెచ్చి మా కొప్పించు” మనిన;“నా కేమి పని యిది? నాలోన నుండిభీకరాకారుండు పృథుకంపురూపుఁ310డగురాక్షసుఁడు మ్రింగె” నని చెప్ప శౌరియగణితశక్తిని యంబోధి నుఱికివేదచోరునిఁ దొల్లి విదళించుభంగినాదుష్టదనుజుని యడగించి వానికడుపులోనున్న శంఖము పుచ్చుకొనుచుతడయక వెడలి రథంబెక్కి కదలి
శ్రీకృష్ణుఁడు యమలోకమునకు వెళ్ళి గురుపుత్రుని యసువులను దెచ్చుట
కాలుని పురము దగ్గర వచ్చి శౌరికాలమేఘధ్వనిగతి శంఖరవముసేసిన, యముఁడు గాసిల్లి యేతెంచియాశౌరి బొడగాంచి యర్థి పూజించి“యేమి వేంచేసితి రిందిరాధీశ!నామీద కృపఁ జేసి నా కెఱింగింపు”మనవుఁడు “గురుపుత్రు నక్కటా! ఏలకొనివచ్చినాఁడవు? కోరి నాకొసఁగు”మనవుఁడు సమవర్తియు విప్రతనయుఁగొనివచ్చి వెస లోకగురునకు నిచ్చెఏపార జమునింటి కేఁగిన సుతునికోపించి లావునఁ గొనివచ్చి శౌరిగురులముందటిఁ బెట్ట గోవిందుఁ జూచిహరుషనిర్భరచిత్తుఁడై పలికె నతఁడు320“భూరిసత్వాఢ్యులు పుణ్యమానసులుకారణపురుషులు గారె? ఎవ్వరికిజమునిల్లుఁజొచ్చినఁజత్తువుఁ దెచ్చునమితసత్వాఢ్యు లీయవనిలో గలరె?నాకోర్కిఁ దీర్చితి నాపుత్రు నిచ్చియాకల్పసుఖలీల యవుగాక మీకు”.అనియర్థి దీవించి యవ్విప్రవరుఁడుతనర వీడ్కొల్ప నిద్దఱు రథం బెక్కియమరపట్టణతుల్యమైపోల్చు మధురకమరలోకార్చితు లరుదెంచి రెలమి.
తల్లి దండ్రులకును దగునుగ్రసేనువల్లభునకు మొక్కి వారిజోదరుఁడుమతిసురాచార్యుఁడై మాన్యుఁడై పొల్పునతని నుద్ధవుఁడనుయాదవుఁ జూచి
శ్రీకృష్ణుఁడు ఉద్ధవుని మందకుఁ బుచ్చుట
తనరార మన్నించి తగఁ గౌఁగిలించికొని బుజ్జగించి మ్రొక్కుచు సీరి వలికె."ఏపార వ్రేపల్లె కేఁగి యానందగోపయశోదలఁ గొమరారఁ గాంచిమక్కువ వారిసేమములెల్ల నడిగిమ్రొక్కితినను, నేము మొగి తమ్ముఁ జూడ330వచ్చెదమను, వేగ వసుదేవు దొంటియిచ్చటిచుట్టాలు యేమును గలసియున్నారమను, మమ్ము నుగ్రసేనుండుమన్నించునని చెప్పు, మఁదలోఁ గల్గుగొపాలకుల నెల్లఁగోరి వేర్వేరనేపార నక్కుననిడినంటి ననుము;ననుఁ బాసి మదనబాణములలో దారిఘనమైన విరహాగ్నిఁ గ్రాఁగుచునున్నవల్లవసతుల నెవ్వగలెల్లఁ దీర్పనెట్లుటిలోన నే నేతెంతుననుముపొమ్మన్న” నయ్యదుపుంగవుఁ డెలమిక్రమ్మర రథ మెక్కి కదలి మాపటికిఁగర మొప్ప రవికన్యగాతీరభూమిబొరి గిన్నరేశునిపురి గ్రేణి సేసి
సకలసంపదలకు సదనమై పొలుచునకలంకగతి మందకరిగె నుద్ధవుఁడుతనరాక నెరిగింపఁ దగ నందుఁ డెదురు
నందుఁడు ఉద్ధవుని పూజించి శ్రీకృష్ణునివృత్తాంత మడుగుట
చనుదెంచి యతనికి సాష్టాంగ మెఱఁగికొనిపోయి పెక్కుభంగులఁ బూజసేసియనుపమప్రీతిమై నప్పుణ్యధనుని340యలవడ మజ్జనయాహారవిధుల.వలయకఁ దీర్పించి యతని కిట్లనియె."దేవకియును వసుదేవుఁడు సుఖులె?కోవిదగ్రామణి కొడుకులుఁ దానుసురచిరప్రీతిమై సుఖమున్నవాఁడె?హరి మమ్ముఁ దలఁచునే యప్పటప్పటికి?సురలోకవైరిఁ గంసుని నేలఁగూల్చిధరణిరాజ్యము వానితండ్రికి నొసఁగియన్నయుఁ దమ్ముఁడు నతులితప్రేమనున్నారె సౌఖ్యులె, యుద్ధవాచార్యబలురక్కసులబారిఁ బడి చావనీకచెలఁగు మహాదావశిఖి గ్రాఁగనీకయహివిషానలవహ్ని నడగంగనీకమహనీయమగువాన మడియంగనీకయప్పటప్పటికి మమ్మరసి గండములుదప్పించి రక్షించె దానవారాతి.
కడపటఁ దనుఁ జూడఁ గానక యేముఁబొడవడఁ బొక్కకఁబోలు రాఁడాయె;నతని విక్రమలీల లాత్మలయందుసతతంబు దలఁచి నిశ్చలవృత్తు లగుచు350వ్రేపల్లె విహరించు వెలఁదులు పతులునాపూర్ణధన్యులు యగుదు రేప్రొద్దుమాయింటఁబెరిగిన మందెమేలముననాయన్నదమ్ముల నాత్మజు లనుచుఁదలఁతుము దేవతాతనువులు గాకయిలనిట్టి విక్రమం బెవరికి గలదు?”
ఉద్ధవుఁడు శ్రీకృష్ణుని గుఱించి యశోదానందులకుఁ జెప్పుట
అనిపల్కి నందుండు నయ్యశోదయునుమనమున హర్షించి మ్రాన్పడి మేనుగరుపార హర్షాశ్రుకణములు దొరుగఁబొరిఁబొరిఁ జిత్రరూపులుభంగి నున్నయాదంపతులఁ జూచి యనియె నుద్ధవుఁడు."వేదాంతవిదుఁడైన విష్ణునియందుఁబూని మీచిత్తాబ్దములుఁ బెట్టినారుకాన యెందును బుణ్యకర్మలు మీరు.కృష్ణ! జనార్దన! కేశవ! శౌరి!విష్ణు! నారాయణ! వేదాంతవేద్య!అని తలంచినవారి కఘములు వొలియుఁబెనుపార వారలఁ బెంచి పోషింపమీభాగ్వమహిమకు మితి వేరె కలదె?
శోభనాఢ్యుల మిమ్ముఁ జూడంగఁగలిగె;360హరికిని మీమీఁది యర్మిలి ఘనముసొరిది మిమ్మందఱిఁ జూడంగ వచ్చుజననంబు మరణంబు శత్రులు హితులుతనువు లింద్రియములు తల్లిదండ్రులునునతని కెవ్వరు లేరు యతఁడె యందఱికిఁబతి, జగత్పతి, రామపతి, సర్వసముఁడు,నిర్గుణుండయ్యును నిఖిలంబుఁ ద్రావస్వర్గాదులకు వచ్చు సర్వాత్ముఁ డతఁడు;అతఁడు సర్వాత్ములయందె కాపుండునతనివ్వతిరిక్తమది లేదు దలఁప”.అనియిట్లు బోధించి నవ్విభావరియుఁజనియె నంతట గోపసతు లొప్ప పెరుగు
ఉద్ధవుఁడు వ్రెతలఁ గన్గొనుట
ద్రచ్చుచు ఘుమఘుమధ్వనులతోఁ గృష్ణుసచ్చరిత్రముఁ బాడు సామగానములుఘోషింప నంత నర్కుఁడు దోఁప వినయభాషణుఁడగు నెదుప్రవరుఁడు వెడలియరదంబు వెసనెక్కి యమునకు నరిగితరమిడి కాలోచితంబులు దీర్చిచనుదెంచి వల్లవసతుల నీక్షించియనునయోక్తుల వారినందఱఁ బిలిచి370తప్పక కృష్ణుఁడు తమతోడ మున్నుచెప్పినమాటలు నేర్పుగాఁ జెప్ప
విని గోవరమణులు వెఱఁగంది యతనిఁగనుఁగొని పలికి రుద్ధతబాష్పు లగుచు,
విరహార్తలగు గోపభామినులు ఉద్ధవునిఁ జూచి పలుకుట
“హరి నిన్నుఁ బుత్తేర నరుదెంచి యంతవరయశోదకును నవ్వార్తలుఁ జెప్పియూరకె పోవేల? ఒగి మమ్ముఁ జూచిచేరి స్వామిహితంబుఁ జెప్పెదుగాక!ఇట నింక నెనరువా రెవ్వరు గలరు?కటకటా! మమ్మేల కమలాక్షుఁ డడుగు?అడిగెడివాఁడైన నరుదేఁడె యిట్లువిడుచునే మమ్ము నీవిరహాగ్నినడుమ?"అని పల్కి కృష్ణుని యంగంబుసొబగుఁకనుబారులీలలు, తనువు చిత్తమునఁగ్రొత్తైన విరహాగ్ని గురుసులు వారనత్తలోదరులు సిగ్గరి యాడిపాడియొకయింతి కుసుమగుచ్ఛోద్ధూతమధువుఁబ్రకటితంబుగఁ గ్రోలి పాడుచునున్నమధుపంబుఁ జూపి నెమ్మది మాటువెట్టిమధురగర్వోక్తి నున్మాదియై పలికె.380
గోపికల విరహము
“చంచరీకమ! నీవు చంచలాత్ముఁడవువంచకుండవు పుష్పవతులఁ గీలింతునిలిచినకాలున నిలువ వేప్రొద్దు
మలినాంగుఁడవు దానమహిమ కాసింతువెచ్చోటి కైనను నేఁగుదుగానిమచ్చిక కల్గునా? మరియొల్ల; నీవుపక్షపాతివి నీవు బహుచుంబకుఁడవువీక్షింప నివి నైజవిద్యలు నీకు!ఏలయ్య! మధుకర! ఈపుష్పరసముఁగ్రోలెడు వేడుకఁ గులకాంతమీఁదనెయ్యంబు వదలెడు నినుఁ బాసియంతదయ్యదే నొవ్వదే దర్పకుఁజేత?”అని పెక్కుభంగుల నన్యాపదేశమునఁ బల్కుచున్న యప్పొలఁతులఁ జూచియల్లన నుద్ధవుం డాకృష్ణుమాటలెల్లను బల్కుట యెఱిఁగి యిట్లనియె.
ఉద్ధవుఁడు గోపికల నూరార్చుట
“దానతపోధ్యానధర్మవర్తనలకైనను గలుగ దీహరిభక్తిపెంపుతనయులఁ బతులను దల్లిదండ్రులనుయనుగులఁ జుట్టాల నందఱి విడిచి390హరియందు మర్ములు నైతిరిగాననిరవార మీభాగ్య మేమని చెప్ప!హరి వేడ్క మీతోడ ననుమన్నపలుకువెరవేది చెప్పద వినుఁడు యిండఱునుసర్వేంద్రియంబులు సమతఁ బోషించునిర్వికల్పజ్ఞాననిధియైన నన్ను
విరహాగ్నినెపమున వెలుపల మఱచిపరమయోగధ్యానపరులచందమునపరమానురక్తి హృత్పద్మంబులందుచిరలీల నిలిచి భజింపుటఁ జేసిమీతలంపులయందు మెలఁగుదుఁగానిమీతో వియోగమేమియు లేదు మాకునిచ్చట పనిఁజూడ నెఱిఁగి మీకడకువచ్చెదననియె నవ్వసుదేవతనయుఁ"డని చెప్ప, నుద్ధవాచార్యునిఁ జూచిమనసిజోన్మాదులై మగువలిట్లనిరి.
గోపికలు శ్రీకృష్ణుని రూపును జేష్టలును వర్ణించుట
“నల్లని మే నున్నతమైన యురముఁదెల్లదమ్ముల మించు తెలిగన్నుగవయునెరిజడ చొళ్లెము నిటలరేఖయునుజిరునవ్వు మోమును జేత వేణువును400నాయతబాహులు నధరంపుకెంపుపాయక జిగిమించు పసిఁడిచేలయునుదలఁబురిపెనపు కదంబమంజరియుధళధళ వెలుఁగెడు దంతదీధితియుఁగలరూపు మోమున గట్టినట్లుండతలఁచకుండిన నుండు తలఁచిన నుండుకలలందు మాతోడఁ గవయుచు నుండునెన్నడు వచ్చునో యిందిరావిభుఁడు
కన్ను లాకలి తీర్పగలుగునో?" అనుచుఁదరుణులు ప్రేమ నుద్ధవుఁ జూచి “మమ్మునెరవుగాఁ జూడ నిందు రమ్మనుచునిక్కడఁ గృష్ణుఁడు, ఇందఱుఁ జూడగొక్కెరరక్కసుఁ గూల్చిన చోటు;గిరికొని యున్నది కేళిమైఁజూడహరిచేత గతజన్ముఁ డఘదైత్యు డొక్క;యావులఁ గృపను మమ్ముందఱిఁ గాచిగోవిందుఁ డెత్తిన గోవర్ధనాద్రి;సఖులుఁ దానును శౌరి చల్దులు గుడిచిసుఖలీల నుండిరి సురవొన్న నీడ;410నీసైకతస్థలి నిందిరావిభుఁడురాసకేళిఁ జరించు రమణులుఁ దాను;జల్లని యీరూపచాయ మురారిపిల్లగ్రో లూదు గోపిక లాత్మ మెచ్చ;నాపొన్న క్రిందఁబో హరి వేడ్క లెల్లగోపిక లలుక గ్రక్కున మెక్కి తీర్చె;బలభద్రుఁడును దాను బసుల మేవుచునుయలమి చిమ్మనబంతు లిచ్చట నాడు;పొలుచు నీగురివింద పొదరిండ్లలోనజలజలోచనఁ గ్రీడ సలిపి మాధవుఁడుఅమ్మానినీడ నాకిఱిఁ గౌఁగిలించితమ్మఁ బ్రసాదించె తామరసాక్షుఁ”డని పెక్కుభంగుల హరివిచారములు
ఉద్ధవుఁడు గోపికల మాటలను విని వారి పుణ్యమునకై మెచ్చుకొనుట
తనరారఁ జెప్ప నుద్ధవుఁడు చిత్తమున;“వీరు దన్యాత్ములు వీరు పావనులువీరికి శౌరికి వేరు లేదెందువీరలఁ గనుఁగొంట విష్ణునిఁగంటవీరికై హరివచ్చి వ్రేపల్లెఁ బెరిగెనిన్ని చందంబుల నీమందవారిమన్నించి కృష్ణుడు మమళ వాపించి420నామీఁదఁ గృపఁగల్గి నన్ను మన్నించియీమహాకార్యార్థ మిటు వచ్చె శౌరియిది జన్మఫలసార మిది దోషమారమిదిగదా సౌభాగ్య మిదిగదా యోగ్య"మని సంతసిల్లుచు, నతివలుఁ దానుజనుదెంచి ప్రేమ మజ్జనభోజనములుసలిపి, గోపికలు నిచ్చలు మానసములఁగలిసి చెప్పక విష్ణుకథ లెల్ల వినుచు;నందయశోద లున్నతిఁ గారవింపమందవారెల్ల సమ్మతి విందులిడఁగనొకకొన్ని నెలలుండి యుద్ధవుఁడంత;
ఉద్ధవుఁడు మధురానగరికి మరలుట
యకలంకగతి వార లనుపంగఁ గదలిమధురకుఁ జనుదెంచి మాధవు గాంచి
మధురోక్తి నచ్చటి మాటలు చెప్ప;నందంద నడుగుచు నప్పటప్పటికిమందలోఁగలుగు సేమములెల్ల వినుచుననుపమయోగవిద్యాలీల శౌరితనుఁబొందఁగోరిన తరుణి నెంతయును
శ్రీకృష్ణుడు కుబ్జయభీష్టమును నెరవేర్చుట
గరిగామియగు గంధగౌరకి యింటికరుదేర నది శౌరియడుగుల కెఱఁగి480మజ్జనభోజన మహితసౌఖ్యములనజ్జగన్నాథున కతిభక్తిఁ దనుపఁబువ్వులసజ్జపై పుండరీకాక్షుఁడవ్వేళఁ గృప నంగజాహవకేళిదాని యభీష్టంబు దయనిచ్చి శౌరి
శ్రీకృష్ణుఁడు అక్రూరుని మందిరమునకుఁ జనుట
మానుగా నక్రూరుమందిరంబునకుఁజనుదేర నెదురుగాఁ జనియు నొండొరుకువినతుఁడై చనుదెంచి వేతెఱంగులనుగంధమాల్యాంబరఘనభూషణముల
అక్రూరుఁడు శ్రీకృష్ణుని స్తుతియించుట
బంధురార్చనలిచ్చి ప్రణుతుఁడై నిలిచి“మాన్యుఁడ నైతిని మత్కులం బెల్ల
ధన్యమై వెలుఁగొందె తామరసాక్ష!కులముద్దరించితి కులశైలధైర్య!నీవ భూతంబుల నెరయఁబుట్టించిప్రోవనడపఁగనోపు పురుషుండ వీవసకలంబుఁ గనుఁగొను సాక్షివి నీవవసుదేవునకును దేవకి కుద్భవించివసుధభారము మాన్చి వైరుల నడఁచి440యక్షయ! నీచేత నసురసైన్యంబులక్షోహిణిశతం బణఁగిపోగలదు;దేహబంధంబులుఁ దెలియంగ లేకమోహాంధుఁడైన నామోహపాశములుదెగఁగోసి నాకోర్కి తెఱవానతిమ్ముసగుణనిర్గుణరూప! సత్యసల్లాప!"అని వేడుకొనియెడు నక్రూరుఁ జూచి
శ్రీకృష్ణుఁడు అక్రూరుని పాండవుల సేమము నరయుటకై హస్తినాపురికిఁ బుతైంచుట
“అనఘ! పితృపివ్యుండ వాత్మబంధుఁడవుసరసవాక్ప్రౌఢిని సౌమ్యచిత్తుఁడవుపరమాప్తుఁడవు మాకు బంధులలోననీయట్టి చెలికాఁడు నీయట్టి సుకృతినీయట్టి సుజ్ఞాననిధి యెందుగలఁడు?మాతండ్రి యట్లట్ల మమ్ము శిక్షించి
యీతెఱంగని చెప్పు దేకార్యమైన;”ననిపల్కి కమలాక్షుఁ డక్రూరుఁ జూచి,తనరార బాంధవత్వముఁదోఁపఁ బలికె.“ఆనకదుందుభియనుజ! ధర్మాత్మ!మేనత్త మాకు నర్మిలి తల్లికంటెపెనిమిటి గడచన్న బిడ్డలుఁ దానుమనపట్టు లేక యున్మలికతోఁ గొంతి450క్రూరాత్ముఁడగు బావ కుదురునేయున్నయారాజపుత్రులు యసమపాహసులుతమ్మునిపాలుఁ దత్తనయుల కిచ్చినెమ్మదినుండగ నేరఁ డానృపతివారికి వీరికి వసుధకైఁ బోరనీరసంబున మీఁద నెట్లు గాఁగలదొ?కరివురి కేఁగి యక్కడ పాండుసుతులనరసి యిచ్చటి సేమమంతయుఁ జెప్పిగర్వితుఁడగు కంసుఁ గడపి తజ్జనకునుర్వి యేలింపుచున్నారమనుముధృతరాష్ట్రుచందంబుఁ దెలిసిమతులెల్లఁ దెలిసి క్రమ్మర వేగరమ్ముపొ మ్మందఱకుఁ గట్నములు భూషణములునిమ్మంచు” చెప్పించి యిచ్చి యాలోననుద్ధవుండును దాను నొగియింటి కరిగిబద్ధానురాగుఁడై పద్మాక్షుఁ డుండె.
అక్రూరుఁడు హస్తినాపురిఁ బ్రవేసించుట
అరుదార నక్రూరుఁడట రేపఁగదలియరదంబు వెసనెక్కి హస్తినావురికినరిగి యాధృతరాష్ట్రు నలమొగసాలనరదంబు డిగిపోవ నటయింద్రులీల460కొలువిచ్చి యున్న యాకురురాజుఁ గాంచియలసతఁజని యల్ల నడుగుల కెఱఁగగద్దియపై నుండి కౌఁగిటఁ జేర్చె;గద్దియఁ దనగద్దెఁ గదియఁబెట్టించియర్హపూజలఁ డన్ప నక్రూరుడంతహరియిచ్చు కట్నంబు లారాజు కిచ్చిసేమంబు లడిగి తత్సేమంబుఁ జెప్పిప్రేమ కాలోచితప్రియములుఁ బలుకవిడియంగఁ బంపించి విదురుని యింట
అక్రూరుఁడు విదురునియింట విడియుట
విడియు మట్లని చెప్పి వీడుకొల్పుటయు;నతని మందిరమున కరుగంగ విదురుఁడతులితగంధపుష్పార్చన లిచ్చిపొలుపార మజ్జనభోజనవిధులుసలిపి యిద్దఱు మృదుశయ్యల నుండిహరి జనించిన మొదలె, వచ్చి మధురదొరసి యేలుచునుండఁ దుదియైనలీలలక్రూరుచే విని హర్షాశ్రులొలుకఁజక్రాయుధునిఁ దల్చి సాష్టాంగ మెఱఁగి
పులుకలు మైఁగ్రమ్మఁ బుండరీకాక్ష!జలశాయ! గోవింద! శౌరి! శ్రీకృష్ణ!470అని భక్తిఁ గీర్తించి యతనిఁ దోడ్కొనుచుఁజనుదెంచి పాండుని సతి యింటికడకు
అక్రూరుఁడు కుంతీదేవిని గాంచి కుశలప్రశ్నఁ గావించుట
నరుదేరఁ గొంతియు నక్రూరుఁ జూచికరచకితాస్యయై కన్నీరు దొరుగనెలుఁగెత్తి యేడ్చుచు నెడయైన వగలఁబలుమారు పలవింపఁ పడతి నూరార్చిధర్మనందనవృకోదరపార్థకవలనర్మిలి కౌఁగిట నందందఁ జేర్చియందఱ మణిభూషణాళిఁ బూజించికాందినీసూనుఁ డాకమలాక్షి కనియె."అమ్మ మీమేనల్లుఁ డమరేంద్రవంద్యుఁడమ్ముకుందుఁడు మిమ్ము నరయఁ బుత్తెంచె.పాండుమహీపతి పరలోక మరుగనిండిన వగలతో నీవుఁ బుత్రులనుయిచ్చటి కరుదెంచి రెఱిఁగి రమ్మనినవచ్చితి, నచ్చట వసుదేవుఁడొంటిమనవారలెల్ల నెమ్మది నున్నవారుఘనపాపకర్ముని గంసునిఁ ద్రుంచిధరణిరాజ్యము వాని తండ్రికి నిచ్చిహరి యెల్లశత్రుల నణఁచుచున్నాఁడు;480తగిన మీకిట్టిదుర్దశ వొందు టెఱిఁగి
వగచుచునుండు నావసుదేవసుతుఁడు;తనపుత్రులట్ల తాఁదలఁచి నీసుతులయనుఁగొప్ప బ్రోచునా యాంబికేయుండు?దుర్యోధనాదిపుత్రులు వీరితోడఁగ్రౌర్యంబు లెడబాసి కలసియుండుదురె?పండితసామంతబంధులు మిమ్ముఁబాండుఁ గొల్చినయట్ల భజియింతురమ్మ?”
అక్రూరునితోఁ గుంతి తనకష్టములను జెప్పుట
అని పల్కుటయుఁ గొంతి యక్రూరుఁ జూచియనుకంపతోడ నిట్లని యల్లఁ బలికె“ఆరాజు సముఁడౌను యతని నందనులుక్రూరులు ప్రజ వీరిఁ గొలువంగనీరు.అదిగాక బిడ్డల నందఱిఁద్రోచిమదిఁబూని బంధించి మడుగులోపలనుగరళంబు పెట్టించి ఘనసర్పవితతిపరువడి గరపింపఁ బ్రాణగండములుదలఁచిన వీరును తప్పుగాఁ గొనరువలదని సుతులను వారింపఁ డతఁడుదైవంబుకతన నింతలు బారులడఁగెగోవిందుతోడ మాకుశలంబుఁ జెప్పు490పుట్టిన యిల్లునుఁ బొరిఁజొచ్చినిల్లునిట్టిదె మాభాగ్య మేమంచు వగవదేవకి కడుపున దేవేంద్రవంద్యుడావిష్ణుఁ డుదయించునని పెద్ద లాడఁ
బలుకులు విందు రాభాగ్యంబు కతనఁదలఁచిన తలఁపులుఁ దలకూర్చె దైవమ”ని చెప్పుటయు విని యక్రూరుఁ డంతవినయంబుచేఁగొని విదురుడుఁ దాను
అక్రూరుఁడు కుంభజాదులయిండ్లకుఁ జనుట
దుర్యోధనాదిపుత్రుల గుంభజాదియార్యుల కర్ణాదులగు యోధవరులనాపగా దాయాదులగు బంధుజనులనేపారఁగని వారియిండ్లకు నరిగికుతుకంబుతో నందు కొన్నాళ్లు నిలిచిదృతరాష్ట్రు కడ కేఁగి తెంపును దగవుహితవును ధర్మంబు నేర్పడఁ బలికె
అక్రూరుఁడు ధృతరాష్ట్రునికి హితోక్తుల నుడువుట
“ధరణీశ! నీవును ధర్మచిత్తుఁడవుభరతవంశాఢ్య! నీ ప్రతియవ్వ రెందు!పాండుభూపతి నీకుఁ బరమభక్తుండుదండివీరుఁడు నిన్ను ధరణి యేలించె500నాతనిపుత్రుల కతిబలాఢ్యులకుబైతృకంబగు రాజ్యభారంబుఁ బంచియిచ్చిన నీకుఁ బెంపెక్కు లోకములఁబొచ్చంబుఁగల్గఁ బోవుదు వధోగతికి
నీపుత్రమిత్రులు నీశరీరంబునీపురి యీరాజ్య మింతయు మిథ్యమేలుగీడును గడ మి మ్మొందుఁ గానికాలంబుచేతఁ గ్రాఁగనివారు లేరుహరి పాండుపుత్రుల కాత్మబాంధవుఁడుహరి సంతసించుట యది లెస్స మనకుచిత్త మేభంగియో చెప్పితి"నంతనుత్తరం బీఁజూచి యొయ్యనఁ బలికె“నీ వాడినన్నియు నిజమంటి, తెఱఁగుఁగావింతు నట దైవగతి యెట్టిదగునొ?అమృతతుల్యములు నీవాడు వాక్యములుకమలనాభునకు నీక్రమ మెఱిఁగింపు.”మని పల్కి, హరి కుపాయన మిచ్చి యతనిఁదనరారఁ బూజించి దయ వీడుకొల్పనరిగి పాండవులతో నంతయుఁ జెప్పియరయ సౌఖ్యము నొంది యక్రూరుఁ డంత,510
కంసుని భార్యలు మగధేసునివద్ద మొఱయిడుట
అస్తియు.............నను కంసుభార్యలస్తికుండలను మగధాధీశు సుతలుహరిచేతఁ దమభర్త యడఁగిన దుఃఖపరవశలై తండ్రిపాలి కేతెంచియడుగులపైఁ బడి యడలూనఁ జెప్పఁ
గడురోషభీషణాగ్రహవృత్తిఁ బలికె“ఏమేమిరా! కృష్ణుఁడే యింత సేసె!భూమి నయాదవంబుగ సేయవలయు"
మగధేశుఁడు యాదవులపై దండెత్తుట
నని పల్కి, యందంద ననిభేరి వేయఘనభాంకృతుల నబ్ధిగలఁగ సైనికులనీక్షించి మొనలేర్చి యిరువదినాల్గుయక్షోహిణులఁ గూడి యటవచ్చి మధురవెడలె మైముచ్చుట విడిసిన ప్రజనువొడకుండ శ్రీకృష్ణుఁ డుగ్రసేనాదులగువారుఁ దానుఁ గార్యాలోచనంబుఁదగఁ జేయ వేగ నందఱుఁ జూచుచుండ
యాదవమాగధుల యుద్ధము
దివ్యరథంబులు దివ్యాయుధములునవ్యోహగతి వచ్చి హరిమ్రోల నిలిచెనప్పుడు కమలాక్షుఁ డన్న నీక్షించి“తప్పక చూడు యాదవకోటి నెల్లమడియఁగాలంబన మనమీఁద నాజినడచి వచ్చిరి వీరి నడఁపక నుండనొండుపాయంబున నుడుగునే వీడు?దండిమీరిన యాయుధంబులుఁ బూను”మనవుఁడు ముసలము శూలమునుఁ బుచ్చు
కొని దివ్యరథముపైఁ గొమరారె సీరి,హరి శంఖచక్రగదాదిశార్ఞములధరియించి కరమొప్పఁ దనరథం బెక్కిమేరుశిఖరముల మెఱుఁగులతోడసారమై బహువిధచ్ఛాయలఁ గలిగిధారాధరము బంగిఁ దనరారెఁ జూడ;నాలోన వృష్టిభోజాంధకాధిపులునేలఁబట్టవియించి నిష్టురోక్తులనుగరిఘటాబృంహితఘననేమిరావతురగఘోషితరావతూర్యముల్ మ్రోయఁబురికొని వెడలి యార్పులు నింగి ముట్టఁబరవసంబునఁ దాఁకెఁ బరగ సైన్యములు;నేలయీనిన భంగి నిగిడి “యే మేముచాలుదుమనివచ్చు" సైనికోత్తముల530యురుపాదహతులను నోర్వక దివికినరిగెనో యన ధూళి యర్కునిఁ గప్పె;నప్పుడు గోవిందుఁ డఖలసైనికులునుప్పొంగ నిజశంఖ మొత్తె, నొత్తుటయుఁబెడరి దిగ్గజములు, భీతిల్లె దిశలు,కదలె కులాద్రులు, కలఁగె వారిధులువంగె మేరువు, ధరావలయంబు దిరిగె,క్రుంగెఁ గచ్ఛపరాజు, ఘూర్ణిల్లె నభము,కెరలి సేనలు పెల్లగిలి పారఁజూచెశరపరంపరలు భీషణముగా నిగిడి
కరములు దునిసి యంగంబులు నాటిశిరములు వెసఁ ద్రుంచి శిడములు నఱికిబరులు వ్రక్కలు వాపి పదములు విఱిచికత్తళంబులు చించి కంఠంబు లెడపినెత్తురు వెడలించి నెనళ్లు గలఁచికండలుఁ దెగఁజెండి గాత్రంబు లడఁచిగుండెలుఁ గూల్చి ప్రేగులు వెల్వరించిబొమ్మిడకల్ రాల్చి బొడగలుఁ గూల్చియెమ్ములు నలిసేసి యెఱచులు చదిపిపొరి వీరి వారిని బోలింపరాకబెరసె పీనుగులై పృథివియంతయును;హలికుండు నఱికిన యడవిచందమునఁగలసి కాల్వురు చాపకట్టుగాఁ బడిరిముందఱ బయలైన మొనసి రావుతులుయందఱు నొక్కసాహసకేళి సలిపితురగంబు రవుతును దునుకలై పడఁగఁదరవలికత్తి నుద్ధతి మొత్తువారులవుణి వ్రేశిన మేను లవుణియై తిరిగితివిరి ఖడ్గంబులఁ దెగవ్రేయువారుయంతళంబుల మేను లందంద పొడువనెత్తురు వఱ్ఱలై నెఱిఁ గూలువారుమునిగాళ్లు తెగి వాహములు మ్రొగ్గ సరకుగొనక మార్తురమ్మని కొనునాశ్వికులునుయమ్ములు తగనాట యావల వెడలిబొమ్మలక్రియఁ గూలి పొలయు గుఱ్ఱములు
తుండంబు కొమ్మును దునియ రోఁజుచునుగొండలవలె వ్రాలు కుంజరంబులునునొగలూడి యిరుసులు నులిసి చక్రములుపగిలి రథంబులు ప్రాణంబు లెడలిరథికులు మడిసి సారథు లుర్విఁ గూలిరథములు వికలమై రణభూమి నిండె.కీలాలనదులలోఁ గీలాలకేళినోలలాడుచునుండు నోలిభూతములుఁగంకగృధ్రాదుల కలకలంబులునుబింకఁబుతో నాడు భేతాళములునుగొడుగులచిప్పలు గుబురులై పడినపడగలు తుమురైన బహుశస్త్రములునునాడెడు నట్టలు హతవీరవరులనాడకుఁ గొనిపోవు నమరకామినిలునీభంగి రణభూమి యెసఁగి చూడ్కలకుబీభత్సరవములు బెరసి యాలోనసరభసంబున జరాసంధుఁడు తరుమభరమంది యాదవబల మోహటించివిరిసిన సేనఁ గవిసి యార్చుచును
శ్రీకృష్ణబలరాముల యుద్ధవర్ణన
తరమి యుద్ధతలీల దాలాంకు డంతనరదంబు వరపించి యట్టహాసమునశరలాఘవమున భీషణవృత్తిఁ గురియ
మ్రగ్గె నేనుఁగలు మడిసె గాల్బలముమ్రొగ్గె రథము లశ్వములుఁ గీటడఁగె.560అక్షీణబలశాలియగు సీరిచేతనక్షోహిణులు పడి యవనిపైఁ గూలె.గరుడకేతనకాంతి గగనంబుఁ గప్పయరదంబు రప్పింప హరి యాజి కెఱఁగిపటుశౌర్యనిర్ముక్తబాణజాలములవిటతాటమై కూలె వీరసంఘంబుహరివజ్రహతిఁ గూలె నటవారణములుతరిమి కృష్ణుని చక్రధారలచేతఁబరివరలై మ్రొగ్గె బహుశతాంగములుదనుజారి నందకదారుణహతులతునకలై ధరవ్రాలె తురగసంఘములునడవుల నేర్చు దావాగ్ని చందమునఁగడువడి శౌరి సంగరకేళి సల్పనతనితోఁ బద్నాలుగక్షోహిణిలునుహతమయ్యె వెస బ్రహారార్ధమాత్రమున
తనసైన్యముయెక్క పాటును జూచి జరాసంధుఁడు విజృంభించుట
నంతట మగధాధీశుఁ డాత్మసైన్యంబునంతకుకడ కేఁగు టంతయుఁ జూచిఘనరోషలయకాలకాలునిభంగితనర ధనుర్గుణోద్ధతి సింహనాద670
నేమి నిర్ఘోషంబు నెరపంగ రథముకామపాలుని తేరుఁ గదియించి పలికె.“పిన్నవాఁడవు మున్ను భీమసంగ్రామమెన్నఁడైనను జూచి యెఱుఁగుదే(నీవు)?పటుశత్రువన దావపావకుండనఁగనిట జరాసంధుని నెఱుఁగవే తొల్లి?తలఁ గోసివేసెదఁ దరలక నిలువుకలఁచి నాయల్లునిఁ గ్రక్కింతుననుచు;”యమ్ములు వఱగించ యందంద సీరియెమ్ములుఁ గీలింప నెంతయు నలిగియేమిటి కీరజ్జలిటు ప్రేలెదనుచునామహాబలశాలి యరదంబు డిగ్గివానకుఁ దలవంచి వచ్చు గోరాజుపూనికె వానియమ్ములు లెక్కఁగొనకముసలంబుఁ గొని హయంబులఁ జావ మోదియెసఁగి సూతుని తల నిల డొల్లవ్రేసిగదిసి జరాసంధు కాయంబు మోముఁజదియంగ నడిచి నిశ్చలితుగాఁ జేసిపెడగేలుఁ గట్టి యాభీమవిక్రముఁడుపెళపెళ నార్చినఁ బేర్చి సైన్యములు580పటహళంఖారావపటుసింహనాదచటులఘోషముల దిక్సంధులు పగిలె.
కట్టువడిన జరాసంధుని శ్రీకృష్ణుడు దయచే విదలి పుచ్చుట
కడువేగ హరి వచ్చి కరుణమై నతని
విడిపించి యనిపిన వెలవెల నగుచునసిహేతి హతశేషులగు వారుఁ దానుమసలకఁ జనియె నమ్మగధభూవిభుఁడుజయముఁ జేకొని రామజలజాక్షులంతజయజయధ్వనులును సౌమగానములువందిమాగధభాగవతసంఘనినదమందంద మ్రోయఁగ నమరేంద్రు లీలపురము సొత్తెంచి యిమ్ముల రాజ్యభోగవరసౌఖ్యలీలల వ్రాలుచు నుండెనాలో జరాసంధుఁ డఖిలబాంధవులనాలోచనము సేసి యప్పుడెంతయునునలువొంద నిరువదినాలుగక్షోహిణులుఁ గూర్చి మధుర మున్నుగ వచ్చి ముట్టివదలకఁ దొంటికైవడి నొచ్చి పోయిపదునెనిమిదిమార్లు బవరంబు సేసిహరితో జరాసంధుఁ (డాహవకేళి)బరిభవం బందుట పరికించి చూచి590
నారదుని ప్రోత్సాహముచే కాలయవనుఁడు సైన్యముతో జరాసంధునకు సహాయుఁడై వచ్చుట
యారూఢుఁడగు కాలయవనునితోడనారదుఁ డెఱిఁగింప నలివాఁడు కదలిఘోరసత్యుల మూఁడుకోట్లను నేర్చిశౌరిపై దండెత్తి చనుదెంచె నంత;
జరాసంధకాలయవనుల దాడినిఁ జూచి శ్రీకృష్ణుఁడు క్రొత్తపట్టణమును నిర్మించుట
హరి రాముఁడును దాను నటు విచారించి“పరఁగ యాదవుల కాపద వచ్చెఁ జూడుడిదె వచ్చె బలవంతుఁ డీకాలయవనుఁడదె జరాసంధుఁడు నటవంక వచ్చెనేది కార్యము? మన కీప్రోలనుండరాదు; నాశమునొందుఁ బ్రజయిందు నున్నననిపల్కి; గోవిందుఁ డబ్ధిఁ బ్రార్థించిచనుదెంచి దేవతాశైలంబుపొంతఁగర మొప్ప వ్విశ్వకర్మ రావించిపురము నిర్మింపఁ బంపుటయు నతండుబహువప్రగోపురభర్మహర్మ్యములబహురత్నకనకవిభ్రమచిత్రితములతతి చెలంగగను ద్వాదశయోజనములఁజతురశ్రమంబుగా సౌభాగ్యలీలవలను మీరఁగ ద్వారవతి యనుపేరఁగలిగింప నప్పురిఁ గని సంతసిల్లి600తనరారఁ బారిజాతము సుధర్మమునుయనిమిషేంద్రుఁడు శౌరి వీథిఁ బుత్తెంచెధనదునిఁ దలఁచిన దన మహాద్రవ్యమెనిమిది కోశంబు లిచ్చి పుత్తెంచె.అధికయోగారూఢుఁడగు ముకుందుండుమధురలోపలఁ దన్ను మఱచి నిద్రించు
జనుల నెత్తుక రాత్రి చని ద్వారవతినిదనరు మందిరములఁ దగుభంగి నునిచిమరలి సీరయుఁ దాను మధుర కేతెంచి
కృష్ణుఁ డొంటరిగా కాలయవనునికడకుఁ జనుట
హరి నిరాయుధలీల నట కాలయవనుకడకు నిర్భయత నొక్కరుఁడు నేతేరఁగడుసోద్యమంది యక్కమలాక్షు నెఱిఁగియడరి దిగ్గన లేచి యటఁ గాలయవనుఁడడనయ్యె నదె పట్టుడని వెంటఁదగులహరి వానిఁ గడపట నందంద పరువవెరవేది వాఁడును వెనుకొని పలికె“వీరధర్మము మాని వెలివారు నగఁగనీరీతిఁ బారుట యిది బంటుతనమె?పగవాఁడు నీవెంటఁ బడ సిగ్గుమాలితెగిపారఁ బ్రాణంబు తీపటె కృష్ణ?610పోవకు పోయినఁ బొరిగొందు” ననిన
శ్రీకృష్ణుఁడు వెంటఁ దఱుముచున్న కాలయవనుఁడు చూచుచుండగా నొకకొండగుహను బ్రవేసించుట
నావిష్ణుఁ డదరి మహాద్రిగహ్వరముఁజొచ్చిన వాఁడును జొచ్చి తోడ్తోననచ్చోట సుఖసుప్తుఁడగు పుణ్యుఁ గాంచిహరి యదృశ్యుండైన యట నిద్రనొందునరుఁ గాంచి యతఁడు నున్నతప్రీతిఁ బలికె
శ్రీకృష్ణుఁడను భ్రాంతిచే కాలయవనుఁడు ముచికుందుని లేపుట
"ఓరి! గోపాలక! ఓర్వక వెఱచిదూరించి వెడఁగుసందులుఁ జొచ్చి యచటనిద్రపోయినఁ బోదునె? నిన్ను దీర్ఘనిద్రఁ బుచ్చెదనంచు నిగుడి తాఁకుటయుఁబెద్దకాలము నిద్రఁ బేర్చిన పుణ్యుఁడద్దురాత్ముఁడు చావ నట మేలుకాంచియీక్షింపఁ గాలాగ్నియెరఁ గాలయవనుఁడాక్షణంబున భస్మమై పోయె ననుఁడు
ముచికుందుని వృత్తాంతము
ఎవ్వఁడా పురుషుఁ డందేల నొక్కరుఁడునవ్విధి నిద్రితుఁడై యుండఁగోరె!అతని చూపులఁ గాలయవనుఁడు కాలగతమేమి? ఆయనకథఁ జెప్పవలయు”ననుఁడు నాశుకయోగి యారాజచంద్రుఁగనుఁగొని విస్మయకలితుఁడై పలికె.620కురువిభుఁ డిక్ష్వాకుకులవార్ధిచంద్రుఁబరహితచంద్రుఁడు ప్రథనసాహసుఁడుమాంధాతసుతుఁడు నిర్మలమతి సత్యసంధాస్యుఁ డఖిలరాజన్యశేఖరుఁడుముచికుందుడనువాఁడు మును దేవతార్థమచలితస్థితిఁ బోరి యసురుల నోర్చె.అతనిని మెచ్చి యింద్రాదిదేవతలు
యతులితంబగు వరమడ్గవే యనిననారాజు పెక్కండ్రు యసురులతోడఁబోరాడి తనియకవో నిద్రఁ బోవ“వరమిండు నన్ను నెవ్వఁడు మేలుకొలుపుఁబొరివాఁడు భస్మమైపోయెడు” ననుచుదివిజుల వీడ్కొని ధృతి నొక్కశైలవివరంబు సొచ్చి యవ్విధి నిద్రవొందహరిమాయఁ బడెఁ గాలయవనుఁ డీరీతి.
ముచికుందుఁడు శ్రీకృష్ణునిఁ గాంచుట
ధరణీశవర్యుఁ డంతట లేచి వచ్చిజలజాక్షు దేహతేజస్ఫూర్తి బిలమువెలుగొంది చీకటి విఱియుటఁ జూచె.ఆయతాంబునేత్రు నతిదీర్ఘబాహుతోయదనీలాంగు తుహినాంశువదను630గనకపీతాంబరుఁ గౌస్తుభోద్భాసివనమాలితోరస్కు వారిజనాభుమకరకుండలదివ్యమకుటకేయూరువికసితాలంకారు విష్ణునిఁ గాంచివెఱఁగంది యందంద వెఱచి గోవిందునెఱుఁగక ముచికుందుఁ డిట్లని పలికె.“హరివహ్నిశశిభానులం దొక్కదివ్యపురుషుఁడవో! కాక భువి నిట్టితేజమెవ్వరికున్న దిం దేల విచ్చేసితెవ్వరు నీనామ మెఱిఁగింపు” మనిన,
శ్రీకృష్ణుఁడు ముచికుందునకుఁ దన వృత్తాంతము నెఱుఁగఁ జెప్పుట
“వసుదేవతనయుఁడ, వాసుదేవుఁడనుససమసాహసుఁ గంసు నవలీలఁ జంపిమసలక రాక్షసమథనంబు సేసిమధురాపురంబు నెమ్మది నేలుచుండనధికసత్వుఁడు కాలయవనుఁ డేతెంచినలిమీరి మాపట్టణము నిరోధింపనెలయించి యాతని నిటు తోడి తేరనీకోపశిఖిచేత నీరయ్యె నాతఁడేకతం బీగుహ నేల యున్నాఁడ?640వాదిరాజులకంటె నధికుండ వైతిమేదినీశ్వర! నిన్ను మెచ్చితి వరముపోఁడిగా నిచ్చెదఁ బొరి నేదియైనవేఁడుము నీ" వన్న వినతుఁడై పలికె.“దివ్య తేజోమయ! దేవేంద్రవంద్య!అవ్యయాత్మజ! కృష్ణ! అంభోజనయన!భక్తపరాధీన! భక్తలోకేశ!భక్తప్రజత్రాణ! పరమకల్యాణ!రాజ్యంబు సేసి యా రాజులలోనపూజ్యుఁడవైమని పుత్రులఁ గంటిధనదాన్యవస్తుసంతతియందు నాకుమనమురోయుట సేసి మదికోర్కెలుడిగెనేకర్మములు మాని యీగుహాంతముననేకచిత్తుండనై యిట నిద్రవోవ
నామీఁదఁ గృపఁగల్గి నన్ను మన్నింపనీవిందు విచ్చేసి తేఁ గృతార్ధుఁడను;బ్రహ్మయోగీంద్రులు భావింపలేనిబ్రహ్మమై తోఁచు నీపదపంకజములుఁగనుఁగొంటి నీదు లోకముఁ బ్రసాదింపువనజాక్ష! ఏనొండు వర మొల్ల" ననుఁడు650
శ్రీకృష్ణుఁడు ముచికుందునకు వరము ప్రసాదించుట
“రాజువై యుండియు రాజధర్మములుయోజఁ దప్పక యుండియును మృగహింసమాని చిత్తమునఁ జిన్మయుడఁగు నన్నుఁబూని నిల్పితిగానఁ బొలిసెఁ బాపములుభావిజన్మమున విప్రత్వంబుఁ దాల్చిసేవకోత్తమ! నన్నుఁ జెందెద”వనుచుముచికుందు బోధింప మొగి నమ్మహీశుఁడచలితంబగుభక్తి నందంద మ్రొక్కిహరికిఁ బ్రదక్షిణమై వచ్చి నృపతిగురుతరంబగు శైలకుహరంబు నెడలియతిసూక్ష్మతరదేహులగు మనుష్యులనునతిసూక్ష్మతరువుల నందంద చూచికలియుగంబున వెళ్లగా నోపు ననుచుఁదలఁచుచు గంధమాదనముల కరిగెబదరికావనభూమిఁ బద్మాక్షు నాత్మవడలక ఘనతపోవరనిష్ఠ నుండె.హరి కాలయవనుని యడఁచి యమ్మధుర
కరిగి తత్సేనల నవనిపైఁ గూల్చివాని ఘోటకమణి వారణావళులమానైన హాటకమణి కదంబములద్వారావతికిఁబుచ్చి తానుసీరియునునారూఢజయకాములై యుండిరంత.
మరల జరాసంధుఁడు శ్రీకృష్ణునిపై దండెత్తుట
నట జరాసంధుఁడు నత్యుగ్రలీలభటకోటిరథకరిప్రకరంబుఁ గూర్చియీక్షింప నదిగాక యిరువదినాల్గుయక్షోహిణులు దాను నట దండువచ్చిమధురపై విడిసిన మదిఁజింత వొడమిమధువైరి హలియు నమ్మగధీశుకడకునల్లనఁ గాల్నడ నరుదేర వీరలెల్లను జూచి వీరెవ్వరో యనఁగఁజుని జరాసంధుఁ డచ్చటఁ గోపుఁ డగుచువెనువెంట నడువంగ వెఱచిన భంగిఁబరువంగ మగధాధిపతి సేనతోడనరిమురిఁ దరుమంగ నతిదూర మరిగి
హర్షాచలముపై నెక్కిన బలరామకృష్ణులను జూచి జరాసంధుఁడు కొండకు నిప్పంటించుట
హరియు రాముఁడుఁ డాను హర్షాచలంబుఁదరమిడి నెక్క నుద్ధత జరాసంధుడాకొండ దిరిగిరా ననలంబు వెట్టి
చేకొని కాల్పఁగా సీయు హరియువారుఁ గానక యుండ నడిదిగ నుఱికిద్వారకాపురికి నిద్దఱు నేఁగిరంత.670
బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలంచి జరాసంధుఁడు మఱలిపోవుట
నాలో జరాసంధుఁడా గోపవరులఁగాలి చచ్చినవారిగా నిశ్చయించియగణితంబగు సేనలన్నియుఁ గొలువమగధదేశమునకు మగుడ నేతెంచె.అక్కడ గోవిందుఁ డఖలబాంధవులుఁదక్కక తనుఁగొల్వ ద్వారకాపురినినానకదుందుభి యనుమతి నుగ్రసేనుఁడు తనపంపు సేయ సామ్రాజ్యకలనంబునకుఁ దానె కర్తయై పేర్చిబలభద్రుఁగూడి నిర్భయవృత్తి నుండె.మధురలోపల శత్రుమథనంబు సేసిమధువైరి విహరించు మహానీయకధలఁదాత్పర్యమున విన్న ధన్యచిత్తులకుసత్పుత్రలాభంబు శత్రుజయంబుఁగమనీయధర్మార్థకామమోక్షములుసమకూరి హరిభక్తి సౌఖ్యంబు నొందునని చెప్పుటయు వీని ననఘునిచేతవిని కృతార్ధుఁడనైతి వివిధసంపదలహరి యెట్లు విహరించె నట మీఁది కథలఁ
బరిపాటితోడ నేర్పడఁ జెప్పుమనిన680నమ్మహీశ్వరునకు నభిమన్యుసుతుకునమ్మహాయోగి యిట్లని చెప్పఁదొడఁగె.అనియిట్లు నయనిర్జరామాత్యు పేరధనధాన్యమణిమయదానాఢ్యు పేరభూభరణక్షమభుజసారు పేరఔభళమంత్రి కందామాత్యు పేరఁగోరి భారద్వాజగోత్రసంజాతుఁడారూఢమతి నయ్యలార్యందనుఁడుశృంగారరసకళాశ్రితవచోధనుఁడుసింగయామాత్యుఁడు చెలువగ్గలింపసలలితరసభావశబ్దగుంభనలవలసొప్ప శ్రీభాగవతపురాణమునమహనీయమగు దశమస్కంధసరణివిహితలీలల నొప్పు విష్ణుచరిత్రఁబ్రాకటంబగు మధురాకాండ మనిననాకల్పమాకల్పమగు భంగిఁ జెప్పె.688
మధురకాండము సమాప్తము.
Comments
Loading comments…