ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము
ఇదిశ్రీ "అముద్రితగ్రంథచింతామణి" యందుఁ బ్రకటింపఁబడుటకైగ్రంథకర్తవలనఁ బంపబడిశ్రీమత్సరస్వతీనిలయ ముద్రాక్షరశాలయందు ముద్రితమైయముద్రితగ్రంథచింతామణి పత్రికాధిపతియగుపూండ్ల రామకృష్ణయ్యగారిచేఁబ్రకటింపఁబడియె.
శ్రీమత్సరస్వతీనిలయ ముద్రాక్షరశాల,నెల్లూరు.1896.వెల, రు.0-4--0
శ్రీశతరుద్రీయసిద్ధాంతితంబగు విశ్వరూపము గల్గి వెలయుచున్నవిశ్వేశ్వరునిమూర్తి వీక్షింప దీక్షించి తల్లిదండ్రులఁ గూడి తత్పురంబునకుఁ బ్రమాదీచనామకవత్సరంబున నరుగుచు మార్గమధ్యంబునందుబంధగర్భకవిత్వబంధురంబుగ నే రచించిన యనవద్యసీసపద్యశతకంబునందలి ఛత్రబంధంబున నిమిడిన నూఱుబంధముల వినుఁడుపద్మకోశాంకుశ పరశుఖట్వాంగత్రిశూలకాసారక పాలఖేటమల్లాయుధవిశేష మణిశాణపట్టికా మద్గరోలూఖల ముసలతర్కుతాఘాయోగదండతులాతులాయన సందంశకర్తరీ శలభ కలభశరచాపహలకుంత చామరవీజన డమరకురంగ ఘంటానిషంగకమఠనాగస్వర కాహళవల్మీక దండకమండలు దరమయూరడోలికామాలికాందోళికా శిబికాగళంతికా గణికా కళాచికా విపంచికాకుంచికా పాదుకాకనకాలుకోర్మికాహార కేయూరమకుటవీటికాపేటికా వృషవైజంతికా నాసికాముకుర దీనారకుతుపకాలచక్రతరీకులాలచక్రాదర్శ శఫర గదా తాళ శకట ఖడ్గసింహాసనోపాంగ చిత్రవితాన బిల్వదళోపధాన గవాక్షకేళిజలశృంగవాశికా షట్పంచకోణాహి సవ్యౌత్తరగ్రహచక్రపన్నగాభరణవరాభయప్రదముద్రాపటీరకుటీరాల్పశారిఫలకయాత్రికద్విశరశరాసనైకాదశరుద్రమండలవిమానాద్రిధూపదీపనీరాజనాష్టపదమంత్రపుష్పప్రదక్షిణనమస్కారబంధము లనంగ శతబంధముల గల వింకను బుద్ధిమంతులు సూక్ష్మబుద్ధిచేతగల్పించినకొలంది గడువిచిత్రములైన బహుబంధములుగను పట్టునిందునివిగా ప్రాచీనకవు లేర్పఱచిన మార్గమున నవీనమార్గమున నిపుడుపద్మబంధము నాగబంధము చక్రబంధము గ్రహచక్రబంధము మృదంగబంధము సర్వతోభద్రబంధము సౌధబంధము కంకణబంధ లింగబంధ నిశ్రేణికాబంధ గోమూత్రికాబంధంబులు తులసీబంధ పుష్ప
మాలికాబంధముల్ మఱియును లఘుసుదర్శనబంధ గురుసుదర్శ మహాసుదర్శనబంధత్రితయము ముప్పదిరెండుదళముల పద్మబంధం బనంగనెగడు బంధములు గొన్ని “ప్రబంధసంబంధనిబంధనగ్రంథ”మందుఁదెలిపినలక్షణంబులకు లక్ష్యములుగా గురుకటాక్షమున నేఁ గూర్చినాఁడనిది పూర్వభాగ మిట్లింక నుత్తరభాగమున బంధలక్షణముల నొనర్తులక్ష్యలక్షణములు లలితబంధముల క్రింద లిఖించి కనువారి కెలమిఁ గొలుపువిద్యాభమాను లవ్విధమున ముద్రింపఁబూనినచోఁ బంపఁబూనియుంటిలాక్షణికులార దోషంబులకు సహించి గుణముల గ్రహించి మన్నింపఁ గోరుచుంసంతతాన్యోన్యసామరస్యము నొసంగి మనల దయచేతఁ బురజేత మనుచుఁగాత.
శ్రీరస్తుశ్రీ కాశీవిశ్వనాథాయ జగద్గురు గణపతయేనమః
మండపాక పార్వతీశ్వరకవీశ్వర కృతమగుప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము
శ్రీరసికు లెన్న బంధోద్ధార మొనర్పఁదగు నేర్పుఁ దనకుంబలె నాకారూఢిం గలిగించినకారుణ్యమయాకృతిన్ జగత్పతి నెంతున్.
శ్రీమత్పినాకినీసింధుతీరమున భాసిల్లు నెల్లూరిలో నుల్లసిల్లుపూండ్లవంశంబునఁ బొడమి యీపుడములోఁ గవిపక్షపాతియ న్ఖ్యాతి వడయఁగడఁగి యముద్రితగ్రంథచింతామణియను పత్రికను బ్రకటన మొనర్చుశ్రీరామకృష్ణాఖ్యచేఁ దనర్చు నుదారకవి గోరి వ్రాసినకారణమున
మహితబొబ్బిలిపురి నుండు మండపాకపార్వతీశ్వరకవి కతిపయకవిత్వబంధముల కొకలక్షణగ్రంథ మిపుడుక్రొత్తగా నేర్చిన ట్లొనగూర్చె నిట్లు
సుకవులు బంధలక్ష్యములె చూపిరి గాని తదర్హలక్షణంబొకరును జూపరైరని తదుద్ధరణార్థము పూండ్ల రామకృష్ణకవి దృఢప్రతిజ్ఞుఁడు రసజ్ఞుఁడు గావునఁ బూనియుండెఁ గౌతుకమునఁ బార్వతీశ్వరుఁడు దోడ్పడఁ దత్ఫలసిద్ధి కబ్రమే.
కవులు నిరంకుశప్రతిభ గల్గినవా రగుటన్ స్వతంత్రులైవివిధవిచిత్రబంధములు వృత్తనిబంధము లేక క్రొత్తక్రొత్తవి దమచిత్తవృత్తియె నిదానముగా మును గూర్చి రైన సూక్ష్మవిధి నొనర్తు లక్షణము మత్కృతలక్ష్యపురస్సరంబు గాన్.
అమలమతుల్ వినుం డొకరహస్యముఁ దెల్పెద సంప్రదాయసిద్ధములగు కొన్నిబంధములుదప్పఁ దదన్యము లెప్పుడైనఁ గర్తృమహిమ నించుమించులగు నిట్టినిమిత్త మెఱింగి నాదుపొత్తముఁ గను నప్పు డిప్పు డిది తప్పని తప్పని దెప్పఁబోకుఁడీ.
నాల్గుతెఱంగులైన కవనంబున బంధకవిత్వ మన్నిటందెల్గునఁ గూర్చు టెన్నిటను దీరనికష్టము తద్విశిష్టరేఖ ల్గడముట్టునట్టు లొకకట్టడ పుట్టకయున్న నున్నబిట్ట ల్గనుపట్టు నెట్టని కడంగి తొడంగితి దీనిఁ జేయఁగాన్.
చిన్నతనంబునందె పితృసేవ యొనర్చుచు వారణాసిఁ గొల్వన్నడతెంచుచుం బ్రకృతిబంధవిముక్తికిఁ జిత్రబంధముల్మున్న విముక్తనాయకుఁడు మోదిలఁగూర్చితి నాటిబంధముల్గొన్ని యుదాహరింతు నిఁట లోపము లున్నను సైఁపుఁ డున్నతుల్.
లక్షణము లేనివానికిలక్షణము లభించెనని తలంచి యపేక్షన్లాక్షణికులు వీక్షింతు రసూక్షణకు లుపేక్ష గలిఁగి చూడకయున్నన్.
నలినబాంధవ కుముదబాంధవులఁ గూడితార లెందాఁకఁ దనరు నందాఁక మత్ప్రబంధసంబంధబంధనిబంధనంబుచిత్రకవనానుబంధమై చెలఁగుఁగాత.
బ్రేమ నస్మద్భవాతపపీడ లడఁపదర్శనం బిమ్ము సీసపద్యగనిరోష్ఠ్యబంధశతగర్భితచ్ఛత్రబంధముఁ గొనికాశికావిశ్వనాథదుర్గాసనాథ.
రాకరాకత్రిరాకారా రాజతాగగతాజరారాగాసారరసాగారా రాకారాత్రికరాకరా
ప్రథమచతుర్థపాదముల వ్రాలనులోమవిలోమగామితాగ్రథితము లున్నరెండును సగంబునకే భ్రమకంబు లిట్లవిశ్లథవిధి నుండ దండమున ఛత్రమునం గ్రమతన్ లిఖింపఁగాఁబృథివిని ఛత్రబంధమగు వృత్తము చిత్తమురీతిదే యగున్.
తొలియడు గిందునం దరయఁ దుల్యము పద్భ్రమకత్వము న్నయంఘ్రులకు సగంబునంద యొడఁగూడును దీనికి బఙ్క్తు లాఱు పైయలుఁగున ఖడ్గబంధమున కంఘ్రులు మూడును నాల్గుబంతులౌసలుపుదు రిట్టికీ లెఱిఁగి చామరబంధము చామరాదులన్.
పిడికా దిందుది నాల్గునాల్గుదళముల్ పీఠాకృతిన్ నిల్పి యొక్కడుగం దల్గునఁ దచ్ఛిరోక్షరమె యాద్యంబంత్య మౌనట్లు పైయడుగుల్ మూడును నాల్గుబంతులుగ వ్రాయన్ ఖడ్గబంధం బిదేపుడమిన్ నేర్పరి గూర్పఁ జిత్రగతులం బొందున్ సుగంధ్యాదులన్.
నలసంజ్ఞల్ దళసంఖ్య నొప్ప దళవర్ణశ్రేణితోఁ గర్ణికాతలవర్ణంబు లగించు చొప్పొకటి లేదా స్రగ్ధరాద్యంతదిగ్దళవరాళిప్రవేశనిర్గమనసాధారణ్య మొందన్ విదిగ్దళవర్ణంబులఁ గూడి యష్టదళసంజ్ఞం బద్మబంధం బగున్.
అపసవ్యగ్రహచక్రమందు గ్రహనామైకైకముఖ్యాక్షరంబుపయోగార్హముగాఁ గనంబడినటుల్ యోజించి పద్యాంఘ్రిగర్భపరీతంబుగఁ జేసియో వసుదళాబ్జంబట్లు సంధించియోయుపలబ్ధిన్ గ్రహచక్రబంధము బుధుఁ డూహించి కూర్పందగున్.
సరిగా నల్ నవకోష్ఠముల్ నెఱపి లో సందంశరీతింబరస్పరరేఖల్ గదియించి పార్శ్వము లథోభాగంబుకోణంబులుంబరివేష్ఠిపఁగఁ జుట్టి పుచ్ఛముఖముల్ ప్రాగ్రేఖలం దీర్చి స్రగ్ధరయో చంపకమాలయో యొగినిడంగా నాగబంధం బగున్.
సంధి నొకక్షరంబు నలుచక్కులఱేకుల నాల్గువర్ణముల్సంధిలునట్లు స్రగ్ధరయొ చంపకమాలికయో మిధోగ్రసంబంధము గల్గు తత్కుసుమమండలి లోనిడఁ బుష్పమాలికాబంధ మగుం బ్రతిప్రసవవర్ణము లేడగుం గూడఁబల్కినన్
పయిపైఁగాఁ బదిచుట్లు నాఱుదళముల్ ప్రాగ్రేఖలం దీర్చి స్వాహ్వయపత్యాహ్వయముఖ్యచిహ్నములు గన్పట్టంగఁ బాదత్రయాశ్రయరేఖాంత్యపదాశ్రయాదివృతిగా శార్దూలవిక్రీడితాహ్వయవృత్తంబు యథాక్రమంబుగ లిఖింపం జక్రబంధం బగున్
క్రమరీతిం జతురంగచక్రమున నర్థశ్రేణుల దర్థపద్భ్రమకంబై ప్రథమాంఘ్రివర్ణము లథఃపాదాదులం దుల్యసంఖ్యముగాఁ గల్గినదై సగంబు తలక్రిందై సర్వతోభద్రబంధమగుం బొందిక దీని కెన్మిదవచందం బెన్నచందంబులన్
ఒకటియు మూడు మూ డొకటి యోలిగ మీదను గ్రిందం గూర్చి త్రిత్రికములు సంధియుగ్మమునఁ దీర్చి చతుశ్శివధామభూమికాత్రికము పొనర్చి గర్భమునఁ గ్రేవలగందముఁ గ్రిందుగా నమర్చి కవుల సౌధబంధమునఁ జేర్చి రచింతురు సీసపద్యమున్
కుటిలంబై పొడవై మిధోభిముఖమౌ గోమూత్రరేఖాకృతిస్ఫుటరేఖాద్వయి రెండుగీట్లనడుమం బొందించియో లేక తత్పటురేఖాంతరగేహపఙ్క్తియుగళిన్ వ్రాల్నింపి యొండొంటఁ బల్కుట కర్హంబుగనో ఘటింతురు కవుల్ గోమూత్రికాబంధమున్
క్రమవక్రంబులుగాఁ గ్రమేళకముజోకన్ దండఖట్వాదిరూపములున్ సంధులయందుఁ జిత్రకలశద్వంద్వంబు పూబంతిమధ్యమునందుం దలక్రిందుగాఁ జదువ నర్హంబైనపద్యంబు హృద్యముగా నందునుఁ జేర్చి కూర్చుఁ జతురుం డాందోళికాబంధమున్
బంధజ్ఞానము లేనివారు శిబికాబంధంబె యాందోళికాబంధం బందురు గాని నామమును రూపం బేకరూపంబులోసంధింపంబడు శ్లోక మేకమయినన్ సంధానసంస్థానసంబంధం బేకము గాదు గావునఁ బృథగ్బంధంబు లౌటబ్రమో
అరచదరంగపుంగదుల నంఘ్రులు నాల్గును ద్విత్రిషణ్నగాక్షరములొ మధ్య షట్కమొ యొకండుగ నుండఁగఁ గూర్చి వ్రాయఁగామురజసమాఖ్యబంధ మగు మూలకు మూలకు రేఖ లుంచి పైతెరువున వ్రాసిచూచిన నదే యగు రెంటను గామగామియై
కవి యొకదానిలో నొకటిగా వలయాకృతిగా ద్విరేఖలంగవియునటుల్ ఘటించి కడఁకం గడియంబున నాద్యమంత్యమోయవు నొకపద్య ముంచ నది యక్షరసంఖ్య నితస్తతోగతిందివియ ననేకరూపు లగు దీనిన కంకణబంధ మం డ్రిలన్
నాళమునందె యాదిచరణంబు లిఖించి తదంతిమాక్షరంబోలిగ నాద్యమంత్యమగునోజ ద్వితీయతృతీయపాదముల్కీలరి కుట్మలంబున లిఖింపఁగ నంతిమ మాదిపాదమందే లయ మొందుఁ గ్రిందుగ నిదే యలకుట్మలబంధమై చనున్
శశిహయసాయకానలనిశాకరవహ్నిశరాశ్వకోష్ఠముల్విశదముగా నమర్చి యొకవృత్తముందుఁ బొనర్చి కుక్షిలోఁగుశలకవుల్ నిజేష్ట మొనఁగూర్చి యొనర్చిన లింగబంధమౌఁబశుపతి కింపుఁగాఁ దులసిబంధ మిదే యగు శౌరి కింపుగాన్
ప్రాంశువులైన సత్కవులు భాసురరేఖలు రెండు రెండు సందంశములీల వ్రాసి వదనంబులు రెండును రెంట మూసి గర్భాంశగతాక్షరంబె మొదలై తుదయై తగునట్లు గూర్పఁగాభ్రంశము లేకదే డమరుబంధ మగున్ ద్విముఖానుబంధమై
అలరులు నాల్గు నాల్గు వలయంబున గర్భమునన్ లిఖించి యయ్యలరుల నాద్యమంత్య మగునంఘ్రులు రెండును ముష్టిబంధనస్థలముల నున్న యంఘ్రులును దద్గతవర్ణము లాదులంతిమంబులు నగున ట్లమర్చి సలుపుం గని యీగతి ఖేటబంధమున్
తుదమొద లల్గునం బ్రథమతుర్యపదంబుల కాదిఁజేసి పైపదములు జాళువామొసలినా పిడికట్టున జట్టుగా సగంబదియిది సొచ్చి వచ్చి పిడికల్గునకుం గల సంధి వర్ణమందొదుగునటుల్ ఘటింతు రిటు లుర్విఁ గవుల్ తరవారిబంధమున్
ఏమై మమ్మొనవాలుగా నలరు నట్లే రేఖలం దీర్చి యందామూలాగ్రముగాఁగ నాళమున నాద్యంబుం దదంత్యాక్షరంబామూలాగ్రము లొంద శాఖలను మధ్యాంఘ్రుల్ చతుర్థాంఘ్రిక్రిందై ముఖ్యాంఘ్రినిఁ జేర్చి కూర్చినఁ ద్రిశూలాకారబంధం బగున్
చేపట్టందగు కాండమం దొకటి తచ్ఛీర్షంబునన్ నల్మొనల్చూపట్టందగు ఖడ్గమందు భయమున్ సొంపొంద సంధ్యాదిగావేపట్టందగు తుర్య మాద్యపదసంవేద్యంబుఁ గావింత్రు మేధాపాథోనిధు లీవిధిం బరశుబంధంబుం బ్రబంధంబులన్
ప్రథమతృతీయవర్ణములు పార్శ్వములందు ద్వితీయ మగ్రమందధిగతమౌగతిన్ నిలిపి యమ్మునఁ బూర్వపదమ్ముఁ గూర్చి తత్ప్రథమపదంబునం జరమపాదముఁ గ్రిందుగఁ జేర్చి యల్గునన్బుధుం డిరుచోట్లనున్నపదముల్ వెరపన్ శరబంధమై తగున్
చిలుకున నాదిపాద మిడి సింగిణిశింజిని చిల్కుతోడ సంధిలిన దళంబు లాదిని దుదిం దగుచందమునన్ ద్విపాదముల్నిలిపి చతుర్థ మాదిపదలీనముగా నొనరించి యీగతింజలిపినఁ జాపబంధ మగు సంగతి మార్చిన మార్చగాఁ దగున్
గోపీచందనరేఖలట్లు శరయుక్తూణాకృతిన్ వ్రాసి తద్రోపాగ్రంబులు తన్ముఖస్థలము తద్రూపద్విపార్శ్వంబు లయ్యైపాదంబుల నొందఁ దుర్యచరణ బాద్యాంఘ్రిలోఁ గ్రిందుగాఁదోఁపన్ దీపితరీతి నిట్లు సలుపం దూణీరబంధం బగున్
భ్రమపడఁబోకుఁడీ డమరుబంధ ములూఖలబంధ మొక్కచందమునఁ దనర్చునంచు నభిధానము వర్ణవిధానముం బ్రధానముగఁ బ్రధానిధానములు నవ్యకవీశ్వరకావ్యసంవిధానము విధిసన్నిధానసృజనప్రణిధానము చింత లెంతయున్
ముసలమునందు మధ్యపదముల్ కొసబంతులు రెండు కుంతమందు సరిగ నాల్గు ప్రాథమికతుర్యపదంబు లితస్తతోగతింబొసఁగును రెంటిదంటులను బుద్ధికొలందిఁ జమత్కరించి యీపస నెసఁగించినన్ ముసలబంధ మగుం దగుఁ గుంతబంధమున్
కాండాదిప్రసవంబునందును దదగ్రంబందుఁ బూర్వాంఘ్రియుంగాండాగ్రాక్షర మాద్యమంత్యముగ ఖడ్గంబందు వక్రాసియందండన్ రెండును దుర్యమాదిపదమందగ్రాదియై క్రిందుగాఁగాండంబందును బొందు నంకుశపదాంకంబైన బంధంబునన్
స్తంభాకారమునందుఁ బ్రాక్చరణముం దత్రత్యవర్ణంబు లారంభంబంతము నౌనటుల్ ధ్వజపటాగ్రం బట్ల యౌనట్లు తచ్ఛుంభత్పార్శ్వములందు మధ్యపదముల్ శ్లోకాంత మాద్యాంఘ్రిగాగంభీరాశయు లి ట్లొనర్తురు పతాకాబంధ మందంబుగాన్
హలకాండంబు యుగంబు సంధిలినచో నారబ్ధమై దాని నేవలగొంచున్ హలమధ్యమందుఁ బ్రథమంబౌ నంఘ్రి మధ్యాంఘ్రు లాహలసంధ్యక్షర మాద్యమంత్యముగ నర్ధావృత్తినం దేకనుందలక్రిందై ప్రథమాంఘ్రి నొందు హలబంధంబందుఁ దుర్యాంఘ్రియున్
స్వర్పతిదేశికార్యులగు సత్కవివర్యులు కార్యధుర్యులైనేర్పుఁ దలిర్ప వేర్పఱచి నీరజకోశనికాశరేఖలన్దర్పణరూప మేర్పఱచి దర్పకదర్పహృదర్పణంబు దృక్తర్పణముం బొనర్ప నది దర్పణబంధ మగున్ వసున్ధరన్
కృతికర్తల్ కుతుకం బెలర్పఁ దొలుతన్ రేఖాకృతిం దీర్చి మధ్యతలహ్రస్వము పర్యధఃక్రమ విశాలాగ్రంబునౌ దానిలోనతిచిత్రంబుగఁ బంచపత్రముల నాద్యంతాంఘ్రులం గూర్చి కంకతికాబంధ మొనర్తురు న్నవిరుప్రక్కల్ ద్రొక్కి సంధిం జొరన్
ఇంచుక నిమ్న మంచుల నొకించుక నమ్రమునైన మౌళిచేమించిన యోగదండమున మీదుగఁ గ్రిందుగఁ బల్క నర్హతంగాంచుఁ గవాంఘ్రు లున్నవి సగమ్మునఁ గ్రమ్మరివచ్చు నీగతింబంచిన యోగదండమను బంధ మగున్ రచనాచమత్కృతిన్
గుంపులదండె నొక్కయడుగుం గొనక్రిందుగఁ గట్టినట్టి పట్టంపుఁబుటంబుఁ జుట్టుచుఁ గడంగడ ముట్టుచు సంధి నొందు నట్లింపుగ మధ్యపాదములు నేర్పడఁ దుర్యము నాదిఁ జేర్చి నిద్దంపురుచిన్ రచింతు రిటు దండికవుల్ యతిదండబంధమున్
క్రమముగఁ బూర్వఖండమునఁ బ్రాథమికాంఘ్రియు దానియగ్రవర్ణమె మొదటం దుదం బొదల మాళమునన్ సగ మేగివచ్చు పొంకమున ద్వితీయ ముత్తరపుఖండమునందుఁ దృతీయమాదిసాత్మ్యమునఁ దురీయ మొపఁగఁ గమండలుబంధ మగుం గుమండలిన్
మేరుగతాక్షరం బనెడుమేరను మీఱక మీఱు పేరు సంబేరుపదాఱువర్ణములచే జపమాలికపేరిబంధమైహారితఁ గాంచు షోడశదళాంబుజబంధమొ ఛత్రబంధమోయై రుచియించువృత్త మిటులై రచియించుట కర్హతం గనున్
పొడవగు కంఠనాళమునం బూర్వపదం బుదరంబునందు రెండడుగులు నాల్గుబంతులుగ నంతిమమాదిమమందు మీఁదుఁగాఁదడఁబడకుండఁ జొప్పడువిధంబునఁ గూర్చి యొనర్చి గనంబడును గళంతికాఖ్యమగుబంధము గ్రంథముల బ్రసిద్ధమై
సుకవుల్ మెచ్చఁగ షడ్దళాక్షరవృతిన్ శోభిల్లుచున్నట్టి నాయతరత్నాయితవర్ణమాయితముగా నాద్యంతపద్యుక్తిఁ బాయక సార్థభ్రమణత్వ మొంది తగుమధ్యాంఘ్రిద్వయం బంగుళీయకబంధంబు ననందమొందు జనబృందానందసంధాయియై
తాడఘ సుత్తె పెన్కదురు తర్కువు సమ్మెట ముద్గరం బగున్బాడిత వాశి తైలఘటవాచకమౌఁ గుతుపంబు మంచపుంగోడు శివాస్త్రభేద మగుఁ గ్రోవి యగున్ జలశృంగ మాఖ్యలంగూడినరూపు లేర్పఱచి కూర్పఁదగున్ శరబంధవైఖరిన్
దశదళవేష్టనంబున నథస్స్థలలంబిదళాంతరంబునంగ్రశిమము లేనిమధ్యదళగర్భము న్కొని యాదిమాంతిమాంఘ్రీశరణ మౌచు హారమణికీలితశిష్టపదంబు వైనచోవిశదపుహారబంధ మగు విశ్వవిచిత్రమనోహరాకృతిన్
“మొగము గనుల్ సెవుల్ మెడయు మూఁపును వీఁపుఁ బిఱుందు లొందుఁ బొందుగఁ బ్రథమాంత్యముల్” “పదచతుష్టయ మొందును శిష్టముల్ నిజా
ర్థగతుల” నిత్తెఱంగునఁ గురంగతురంగమతంగజాదిబంధగణము కించిదంచితభిదాగణమై గణుతింపఁగాఁబడున్
తీరచతుష్టయంబున ద్వితీయతృతీయతురీయతీరముల్సేరిన మధ్యపాదములచేఁ దొలుతీరము సోపనంబులుంజేరిన శిష్టపాదము లదే రహిశృంఖల మేరమీఱి కాసారసమాఖ్యబంధ మగు సారకవుల్ మనసార మెచ్చఁగాన్
ఛత్రాకారకదారుమస్తకతలస్థంబైన వర్ణంబుతోఁదత్తత్యాంగుళిసంగతార్ణములు ప్రాదక్షిణ్యముం జెంది పాదత్రాణద్వయి నొంది హృద్యమగు పద్యం బేర్పడం గూర్పఁగాధాత్రింజిత్రతరుంగాఁ దనరుఁ గాదా పాదుకాబంధమై
కీలాద్యగ్రసమాప్తి గాఁగఁ బ్రథమాంఘ్రి న్నిల్ప దుర్యాంఘ్రియందే లీనంబగు నాద్యమంత్యమును సంధిస్థాక్షరంబౌ నటుల్మూలం బంటఁగ జంటగా నడిపదంబుల్ సేరు నీసొరునందౌలున్ బంధము లౌచుఁ గర్తరియు సందంశంబుఁ గించిద్భిదన్
నారసపుంగొనం బెనఁగొనంగ నమర్చినచక్రమందు నానారసవేత్త లౌననఁ దనర్చి దశాక్షరి యిష్టపూర్తిఁ జెన్నార సమగ్రవృత్త మగునట్లుగ నేర్పునఁ గూర్పదీన దీనారసమాఖ్యబంధ మగు నారసనారసనాగ్రవర్తియై
రసనాఖ్యాకశలాక నాదిపద మూర్థ్వవ్యాప్తమౌఁ దుర్యమిందె సమాప్తం బగుఁ గ్రిందుగా నితరముల్ తిర్యక్ఛలాకాద్వయింబ్రసరించుం గవు లి ట్లొనర్తురు తులాబంధంబు తజ్జిహ్వ స్తంభసృతిం బూన నగుం దులాయనమహాబంధంబు గ్రంథంబులన్
నయనముఖాక్షివక్త్రములు నాసయు భ్రూయుగమధ్యఫాలముల్రయముగ బ్రహ్మరంధ్రమును బ్రాక్పద మొందు నదే విలోమగామి యగుచు నంత్యపాద మయి మించు శిరోక్షర మాదిగాఁ బరాంఘ్రియుగము చుట్టు వార్కొని ముగింపుదు రిట్లు కపాలబంధమున్
ముఖఫలకంబునం బ్రథమముం బయిదండపు రెండుదండలన్శిఖరముఁ జుట్టివచ్చుగతి శిష్టపదంబులు రెండు నుండఁగాలిఖితముఖాంఘ్రిను న్నడుగులీనమగుం దలక్రిందుగాఁగ నిట్లఖిలహితంబుగా నిడుదు రార్యమణుల్ మణిశాణబంధమున్
ఉపరితలాశ్రయంబగు నయోఘనమందుఁ బ్రదక్షిణాప్తి నాద్యపదము తచ్ఛిరోక్షరమె యాద్యము నంత్యము నౌనటుల్ ద్వితీయపదతృతీయపాదములు నాదిపదంబున మీఁదుగాఁగఁ దుర్యపదము పట్టికాఖ్య నలరారెడు బంధమునందుఁ బొందగున్
వృంతమునన్ ముఖాంఘ్రి లిఖియించి తదగ్రిమవర్ణ మాదిమంబంతిమ మౌనటుల్ దళచయంబున మధ్యపదాక్షరంబులన్బంతిగ వ్రాయఁగాఁ జరమపాదము ప్రాక్పద మొందు నీగతింబంతము మీఱఁగా వ్యజనబంధము భవ్యజనుల్ ఘటింపుఁడీ
పిడి నూర్థ్వాదిగ నాదిపాదలిపులం బెంపొందఁగా వ్రాసి పైడుగుల్ రెండును రెండుప్రక్కలను ఘంటాకారముఁ జుట్ట నేర్పడరంగా లిఖియింపఁగాఁ జరమపాదార్ణంబు లూర్థ్వంబుగానడుచుం బ్రాథమికాంఘ్రిరూపమున ఘంటాబంధమం దంటుచున్
అతిచిత్రంబుగఁ బూర్వఖండమునఁ బూర్వాంఘ్రిం బొసంగించి సంధితలస్థాక్షర మాద్యమంత్యముగ నేంతేనింతగా మధ్యపద్ద్వితయం బుత్తరఖండమం దిడఁగఁ దుర్యం బాద్యమై తోఁచు నీగతి నాగస్వరబంధమం దమలరం గావింప నర్హం బగున్
అల నాగస్వరబంధమందుఁబలె నాద్యాంఘ్రిం బ్రతిష్టించి యవ్వలిఖండంబున రెండుపాదములు సాఁబాలేగిరా వ్రాయఁగాఁదొలియంజం జరమాంఘ్రి గుప్తమగు నీతోయంబుగాఁ జేయఁ గాహళబంధంబు ప్రబంధకర్తృబిరుదంబౌ యంద మొందుందగన్
ఘనశంఖాకృతిగాఁ బ్రదక్షిణపురేఖల్ దీర్చి పూర్వార్ధమందు నెఱిం బూర్వపదంబుఁ బైకి నెఱపం దుర్యాంఘ్రియుం గూడ నందె నిగూఢం బగుఁ గ్రిందుగా నుపరిసంధిస్థాక్షరం బూఁతగాఁజను నర్ధభ్రమకంబు లౌచుఁ బెరయంజల్ శంఖబంధంబునన్
ఆనన లోచనాస్య నయనా వటు పృష్ఠ తదగ్రపృష్ఠ సంస్థానములందుఁ బ్రాక్పదము తచ్చరమార్ణము రాకపోకలన్మానక నాల్గుపాదముల మధ్యపదంబులు రెండుఁ దుర్య మాపై ననులోమతన్ శలభబంధమునం దొలికాలునై తగున్
ఆదిపదాంత్యపాదముల యక్షరముల్ మఱి మధ్యమాంఘ్రియందాదిమతుర్యముల్ చరమ మైక్యము నొందునటుల్ ముఖాక్షికంఠాదిగఁ జుట్టివచ్చుగతి నచ్చపువృత్తము కచ్ఛపాకృతింబాదుకొనంజుమీ కమఠబంధ మగుం గ్రమగుంభనంబునన్
పాదచతుష్కపుచ్ఛముఖభాసురకచ్ఛపరేఖలందు వక్త్రాది గనిష్టవృత్తము మహత్తరయత్నమునన్ లిఖింపఁగాఁబ్రోదిగ మస్తకాంఘ్ర్యవటుపుచ్ఛగవర్ణము లేడుమూఁడు సంవాదములౌ నిదే కమఠబంధ మగున్ జనరంజనంబుగాన్
ఏకాద్యంకము లక్షరాంకములుగా నెక్కించియో యిష్టవర్ణాకీర్ణంబుల గాఁగఁ గూరిచియొ సీసాద్యర్ధపాదాళులందేకీభావము నొందఁజేసి యధిరోహిణ్యాకృతిం బండితానీకం బెన్నఁగఁ జెప్ప నొప్పు నదియే నిశ్రేణికాబంధమై
రహిమై నుయ్యెలతొట్టెపట్టెకొన లారంభంబు నంతంబుఁగాముహురాశ్చర్యకరప్లుతిం బ్రథమ మొప్పుం దత్పదాద్యంతవర్ణహితాద్యంతములై గుణంబులగుఁ దన్మధ్యాంఘ్రు లాద్యాంఘ్రియైవిహరించుం జరమాంఘ్రి గూర్తు రిటు లుర్విన్ డోలికాబంధమున్
మృదుభేకప్లుతిఁ బర్వఁ బూర్వపదమున్ మెట్లున్నచో వ్రాసి తత్పదమూర్ధాక్షర మాద్యమంత్యముగ సాఁబాలేగియో సాగియోమొదలంటం బొదిగొంచు రా నడిపదంబుల్ వ్రాయఁ బూర్వాంఘ్రియంద దువాళించుఁ దురీయపాద మిది వీణాబంధలక్ష్మం బగున్
సేబా సంచుఁ గవుల్ నుతించుకరణిం జిత్రప్లుతిన్ దండెపైతాఁ బూర్వాంఘ్రి లిఖింపఁగాఁ జరమపాదం బందులో డిందు నాలాబుద్వంద్వమునందు మధ్యపదము ల్సంధిల్లెడున్ రుద్రవీణాబంధంబున రెండుపాంత్యలిపులు న్మధ్యాంఘ్రులన్ నిల్పఁగాన్
కుమ్మరసారెచందమున గుండ్రనిరేఖలు నడ్డుగీఁట్లు నబ్రమ్ముగ గీఁసి చిత్రగతిఁ బ్రాక్పద మంతరమందు మధ్యపాదమ్ములు చుట్టునుం దగువిధమ్మున వ్రాయఁ గులాలచక్రబంధమ్మగుఁ దుర్యమాదిమపదమ్మున నేకత నొందుఁ గ్రిందుగాన్
నాలుగుపత్రసంధులను నాలుగుపాళ్ళుగ నాదిపాదమున్నాలుగుపెద్దరేకులను నాలుగుపాళ్ళుగ మధ్యపాదముల్గ్రాలఁగ నంత్య మాద్యమయి కన్పడు నిన్ను మధ్యవర్ణముందౌలు నిదేకదా లఘుసుదర్శనబంధ మటండ్రు పండితుల్
ఆమూలాగ్రముగా సిరాగ్రధితమౌ నాద్యాంఘ్రి మూర్ధాదిగాధీమంతుల్ గొనియాడ మధ్యపదముల్ తిర్యక్సిరాసంధులన్ద్వైముఖ్యమ్మునఁ గ్రుమ్మరుం జరమపాదం బాదిపాదంబునందామగ్నం బగుఁ గూర్తు రిట్లు కృతికర్తల్ వీటికాబంధమున్
ముక్కోణంబుగ నాగవల్లిదళముల్ పూగాదియోగంబునన్నెక్కోఁజేసి లవంగసంగతముగా నిర్మించి ప్రాక్తుర్యముల్చక్కంబెట్టి తదాదిగా నడిమియంజల్ చుట్టు రానిల్పఁగాముక్కంటిం గొలువంగ నూడిగ మగుం బో వీటికాబంధమై
గ్రాంథికు లూర్థ్వఖండమునఁ బ్రాక్చరమాంఘ్రులు సంఘటింపఁ దత్సంధిని బుట్టి చుట్టి యిరుచక్కుల నెక్కొని మధ్యమాంఘ్రులాగ్రంథిలమైన తమ్మపడిగమ్మునఁ గ్రమ్మ నగుం గళాచికాబంధము దేవతాగురుసపర్యకు పర్యుచితోపచారమై
ఎదుటన్ నాల్గును వెన్క నాల్గిరువులం దేకైకమౌ లింగముల్పొదలింపం బదునొక్కలింగమ యగుం బో మధ్యలింగంబుతోఁబదముల్ నాల్గును మధ్యమాదిగ లిఖింపం జిత్రవిన్యస్తమైయది యేకాదశరుద్రమండలసమాఖ్యంబైన బంధం బగున్
ఘనఘంటానిమిషాదిసూచకశలాకామధ్యరేఖాత్రికంబునఁ బూర్వాంఘ్రి శలాకికాగ్రలిపులం బోనాడ కిర్వంకలంబని యర్ధభ్రమకంబుగా నడిమిహజ్జల్ పర్వఁ బూర్వాంఘ్రియందనిమగ్నంబగుఁ గాలచక్రమను బంధం బందుఁ దుర్యాంఘ్రియున్
ఇరుకంబంబుల నావనావఱలు గీ ట్లేర్పాటుగా గీఁసి ప్రాక్చరణంబం దొకపఙ్క్తిగా నెఱపఁగా స్తంభద్వయీమూలగాక్షరమూలంబుగ వానిపైకి నడియజ్జల్ ప్రాఁకి యేవచ్చుఁ బ్రాక్చరమాంఘ్రుల్ మిళితంబులౌ నిదియ నౌకాబంధలక్ష్మం బగున్
క్షితిఁ బురి విచ్చిన ట్లొకశిఖిన్ లిఖియించి ముఖాక్షరాదిగానతులితచంద్రకప్రతతియందుఁ బదత్రితయాశ్రయాక్షరప్రతతిని బోలె నాలుగవపాదముఁ బాదములంట వ్రాసి పండితులు మయూరబంధ మని దీనికిఁ బే రిడిరారడంబునన్
కుటిలాలంబశలాక నొక్కడుగు తత్కోటిద్వయీవర్ణసంఘటితాద్యంతము లౌచు దృఙ్ముకురయుగ్మం బేర్పడం జుట్టి వచ్చుట కర్హంబుగ మధ్యపాదములు మించుం దుర్యమాద్యాంఘ్రియైనటియించుంగద నాసికాముకురబంధం బంచు నందంబుగాన్
దక్షిణవామనేత్రసమదర్పణబింబయుగంబుఁ జుట్టి ప్రత్యక్షముగాఁ గనంబడువిధంబునఁ బ్రాక్చరమాంఘ్రులుం దదగ్రాక్షరముల్ మొదల్ తుదగ నంతరపాదయుగంబు తల్లగత్పక్షశలాకలం దిడిసి పర్వ సులోచనబంధమై చనున్
గదచందంబున రేఖ లేర్పఱచి తద్గర్భంబునం దొమ్మిదేగదు లుండం బొదలించి మధ్యకలితాగారంబె యారంభమైపదముల్ నాల్గును మూల మంటు కరణిన్ వ్రాయంగఁ జిత్రప్లవాస్పదమై శత్రుభయప్రదం బగు గదాబంధం బదే యౌఁగదా
నిడుపుగ రెండుదండెలుగ నిల్పినరేకల కడ్డురేకు లాఱిడి నడిపట్ల నైదునయిదిండ్లుగ నుండలు రెం డమర్చి రెండడుగులనుండలందు నడియంజలరేకులయందు సంధిచొప్పడ నడపించుచున్ శకటబంధముగాఁ బ్రకటింత్రు సత్కవుల్
అల చదరపుంగదుల నంఘ్రలు నాల్గును శృంఖలాకలన్నలుదెసలం దిడంగ నడినాల్గులిపుల్ తుదలున్ మొదళ్ళుఁగాఁదలరం దొడంగి క్రమ్మఱఁ బదమ్ములు నాల్గుఁ గడంగి తుండతుండలుగ నడంగఁ దానది బెడంగగు సూక్ష్మగవాక్షబంధమై
చదురున నెన్మిదెన్ముదులచక్రపుటిండ్లకు నాల్గుచక్కులంబదములు నాల్గుజాలరులభాతి లిఖించి తదంతరాళపుంగదులఁ దదాదికోణములఁ గ్రమ్మఱఁ బ్రాక్చరమాంఘ్రు లాదులంట దుముకఁగూర్చి సత్కవివితానము చిత్రవితానబంధమున్
కల్పింపంబడినట్టి నెత్తపలకన్ గర్భాదిగా నిండ్లలోనిల్పంగాఁ దగు నర్ధపాదములుగా నిండైనపద్యంబు నిట్లల్పాయాసమనల్పకల్పనమునై యష్టాపదప్రాప్తిచేనల్పాష్టాపదబంధ మేర్చుఁ జతురుం డష్టాపదప్రాప్తికిన్
సరిగా నల్చదరంపుఁజక్రము విదిక్చక్రంబు తన్మధ్యమందురుచక్రంబున మూలమూలలకు రెండుద్ధారముల్ గీఱి తచ్చరణద్వాదశకంబునం జరణముల్ సంధిల్ల హత్తింప నుత్తరదేశగ్రహచక్రబంధమగుఁ బద్యంబండె వేద్యం బగున్
జాగ్రదిరాసమగ్రులయి చాలుగ నాలుగు నాల్గు నిల్వుగానగ్రియులెన్న మధ్యములయందు నొకొక్కఁడు నైనరేఖలన్విగ్రహ మేర్పరించి పదవిన్యసనం బొనరింతురేని సవ్యగ్రహచక్రబంధ మగు ద్వాదశరాశినివేద్యపద్యమై
పుంగవరీతి గీఁత లిడి మోరమొదల్కొని తోఁకదాఁక సొంపుంగ వనంపుఁబెంపుఁ బెనుపుంగవదాఁటులనీటు లబ్బురంపుంగవణింపులాదిగల భూరిచమత్కృతు లున్నతిన్ సుధీపుంగపు లెన్న నిట్లు సలుపుం గవి సుందరనంధిబంధమున్
క్రమతన్ నాయకరత్నవర్ణముమొదల్గాఁ జుట్టు నున్నట్టి శస్తమణిస్థానములందుఁ బ్రాక్చరమపాదంబుల్ ప్రవేష్టింప మధ్యమవర్ణాదిగ మధ్యపార్శ్వముల మధ్యాంఘ్రుల్ ప్రతిష్టింపఁ జక్రిమహేశాదిసురార్హణార్హ మగుచుం గేయూరబంధం బగున్
అంగజభంగలింగమున నాదిమ ముంచి తదాదిగా భుజంగాంగమునందుఁ బ్రాక్పద మనంతరపాదము లుత్తమాంగపఙ్క్తిం గవి యిచ్చవచ్చినగతిన్ శకలంబులుగా లిఖించి యిబ్భంగి భుజంగమాభరణబంధ మొనర్చుఁ దనర్చు నేర్పునన్
మధ్యదళంబునందుఁ బ్రథమంబగు నంఘ్రియుఁ బ్రక్కఱేకులన్మధ్యపదద్వయంబునుఁ జమత్కృతిమించ లిఖించి వృంతమెదధ్యుషితంబుగా నిడిన నంతిమమాదిమందుఁ జేర్చినన్బాధ్యముగాదు బిల్వదబంధము సంధిచతుష్పథంబుగాన్
అలయకు కోనులైదయిన నాఱయినం గలయంత్రరేఖలన్వలయమునం దమర్చి ముఖివర్ణముఁ గర్ణికయందుఁ జేర్చి తద్దళముల నొక్కటొక్కటిగఁ దక్కటివ్రాలిడ నొక్కవృత్తమైభళిభళి కోణసంజ్ఞ నది బంధ మగున్ నడివ్రాయిసంధిగాన్
ద్వాదశపత్రముల్ గలుగువర్తులరేఖ లిఖించి వృత్తపుంబాదచతుష్కభిత్తములు వ్రాయఁగఁ గర్ణికనున్న వర్ణమేకాదు తతాదివర్ణము నొకండయి కన్పడుచుండు దేనిలోఁదాదృశబంధమే గురుసుదర్శనబంధ మగు న్వసుంధరన్
పద్యద్వాదశఖండమండలమునం బ్రత్యాదివర్ణద్వయంబాద్యంతాక్షరయుగ్మకం బభిమతాయత్తంబులై వృత్తరేఖోద్యద్ద్వాదశఖండమండలమునం దొప్పారఁ జొప్పింప నిష్పాద్యంబై పొదలున్ సుదర్శనమహాబంధంబు గ్రంథంబులన్
కరిమధ్యాక్షర మాద్యమంత్యముఁగ శ్లోకంబంగుళీపంచకస్ఫురితంబౌగతి ఖండఖండములుగాఁ బూర్వాంఘ్రులన్ వ్రాయఁగాఁజరమంబాద్యమున్ విలోమగతిచే సంధిల్లుఁ బ్రత్యేకమున్వరదానాభయదానముద్రలను బంధద్వయ మి ట్లేర్పడున్
క్రమతన్ బంతులు దొంతులై తనర నేకద్విత్రిషడ్గేహముల్కమనీయాకృతిఁ జేర్చి చిత్రగతి నగ్రంబాదిగా మూడుపాదములం జేర్పఁగ నాద్యవేద్యమగునంత్యం బిట్లు గూర్పం గిరీటమహాబంధ మగుం గవీష్టము బలిష్టం బన్యథా సృష్టికిన్
ముఖకీలాజగ మూలకీలములలో ముఖ్యాంత్యపాదంబులున్శిఖరాభ్యంతరతోరణాకృతిగఁ దృచ్ఛంగోర్థ్వతుండాకృతిన్లిఖియింపందగు మధ్యపాదయుగ మీలీలం బ్రకల్పించినన్సుఖవేద్యంబయి తాళబంధమన మించున్ దర్దురాకారమై
బంధురనాళమందుఁ దొలిపాదము వ్రాసి తదగ్రవర్ణమేసంధిగ మధ్యపాదములు చక్రమునం దిడ నంత్యమాద్యమైసంధిలుఁ బ్రాతిలోమ్యగతిసంగతి నీగిత మించుఁ గుంచికాబంధము గ్రాంథికుల్ దమప్రబంధములం బచరింత్రు వింతగాన్
పత్రంబుల్ పదియాఱులోపలఁ బయిం బత్రంబు లామాత్రమేపాత్రం బౌనటు వ్రాసి సీసము లిఖింపం గేసరాగ్రంబులంబత్రాగ్రంబులనున్న వర్ణములచేఁ బద్యాంతరంబౌ నిదేద్వాత్రింశద్దళపద్మబంధము బ్రబంధశ్రీకి సద్మం బగున్
జలధికరేందుహస్తయుగసద్మము లేర్పడునట్లు నేర్పునంజెలువగు రేఖలం గలిపి సింగపుగద్దియ దిద్దితీర్చినట్లరిచి బల్విచిత్రగతి నంఘ్రులు నాల్గును బూని దానిలోపల నిమిడింపఁగా నదియ భాసిలుఁ గేసరిపీఠబంధమై
దుర్ధ్వాంక్షక్రమరారటత్కుకవిసందోహస్మయాగాంబుదద్వార్ధ్వానప్రపత్స్వరూక్తిసుకవివ్యక్తీకృతాకారమైయూర్ధ్వాథఃపఠనీయరీతిఁ జరణవ్యూహంబు నెక్కొల్ప నంతర్ధ్వంతక్షపణక్షమం బగుచు నుద్యద్దీపబంధం బగున్
శిరముల్ నాల్గు క్రమోన్నతంబులగు వాసిన్ వ్రాసి యైదేసి మందిరముల్ గల్గునటుల్ ఘటించి ప్రతిపఙ్క్తిం బద్యపాదంబులక్షరవిన్యాసచమత్క్రియాస్పదముగా సంధింపఁగా వచ్చు నవ్వరుసల్ పెంచినఁ బెంచవచ్చు నదియే వల్మీకబంధం బగున్
కుసుమశరార్చిచేఁ బెనచికొన్న సమున్నతపన్నగంబులట్లసదృశరేఖల న్నెరపి యందలిసంధులనున్న వర్ణముల్కొసదనుక న్సమంబులుగఁ గూర్చి విచిత్రగతిన్ లిఖింపఁగారసికజనాద్భుతం బగుచుఁ గ్రాలు నదే లఘునాగబంధమై
కాశికిఁ బోయి గంగఁ గొని కావడియం దిడివచ్చువానిరూపాశయ మొప్ప వ్రాసి యట నంఘ్రులనంఘ్రులు రెండు కంధరాదేశగవర్ణమాదిని మదిం దగురీతిగ మధ్యమాంఘ్రులుంగౌశల మొప్పఁ గావడిని గల్పఁగ యాత్రికబంధమై తగున్
చతురత రెండురోపముల చాపము రూపము వ్రాసి తచ్ఛరద్వితయమునందుఁ బ్రాక్చరమవృత్తపదద్వితయంబు సంధిసంగతలిపు లాదులుందుదలుగా గుణచాపములం దదన్యముల్జతగ లిఖింపఁగా ద్విశరచాపసమాహ్వయబంధమై తగున్
నలుపక్షంబులు పుచ్ఛముం గలుగు మీనవ్యక్తిఁ గల్పించి తజ్జలవిక్షేపణపక్షగాక్షరచతుష్కం బాదిమాంత్యాక్షరంబులుగాఁ బాదచతుష్టయం బిటునటుం బొంకంబుగాఁ బోయిరాఁగలబింకంబున నందు వ్రాయ నది సాక్షాన్మత్స్యబంధం బగున్
నిటలంబాది కటీతటంబు తుదగా నేర్పొప్ప నాద్యాంఘ్రియుంబటువక్షోజఘనాక్షరంబు లట సంవాదిత్వ మొందన్ నటన్నటికాపాణిపదంబులందు నుపనంత్యంబాద్యమై మీఁది కుద్భటవృత్తిన్ నటియించునేని గణికాబంధంబు సంధిల్లెడున్
ఆదిమమాదినాళమున నంతిమమంతిమనాళమందుఁ బైపాదయుగంబు భస్త్రికిరుప్రక్కలయం దిడి క్రిందినిండిఁ దామీఁదికిఁ బల్కినన్ సమత మెప్పు వహింపగ నొప్పువృత్త మాహ్లాదముఁ బొంగఁజేయుచుఁ జెలంగు నురంగదుపాంగబంధమై
ఘనకూష్మాండసమంబుగా జమిలిరేఖల్ దీర్చి యెందుండి బల్కిన నేకాకృతిగాఁ గనఁబడెడు పోల్కెంబద్దియం బెద్దియైననుద్రేఖలయందు వ్రాయ నది యానందంబు నొందించుదాని నభిజ్ఞుం డుపధానబంధమని సంధించుం బ్రబంధంబునన్
మూతికి మూఁతకున్ సరిగ ముఖ్యపదంబు లిఖించి దానితర్వాతిపదంబులం జివరవర్ణము లాద్యములంతిమంబులౌభాతిని ప్రక్కలన్ నిలుపఁ బ్రాక్చరమైక్యము గల్గి పేటికాఖ్యాతిని బొందు బంధమయి గ్రంథములందది గ్రంథిలంబగున్
భృంగారంబున కూర్థ్వరంగము బహిశ్శృంగం బథోరంగమున్శృంగారించి రనంగ మూఁడడుగులం జిత్రప్లుతిన్ వ్రాయఁగాబంగారంబునఁ జిత్రభంగి నలరుం బైయంఘ్రి పూర్వాంఘ్రియైపొంగారుం గన కాలుకాహ్వయమునం బొల్పొందు బంధంబునన్
క్రమముగఁ బీఠనాళములఁ బ్రాథమికాంఘ్రి తదుర్థ్వపార్శ్వపాత్రములను మధ్యమాంఘ్రులు శిరశ్చషకంబున నంతిమాంఘ్రి గూరిమి దళుకొంద వ్రాసి తలక్రిందుగఁ బల్కినఁ బల్కవచ్చు సుచ్చమహిమఁ దెచ్చుఁ గర్త కది సారపటీరకుటీరబంధమై
మస్తకపాత్రమందుఁ బ్రథమంబగు నంఘ్రి లిఖించి తద్గళన్యస్తశుభాక్షరంబ మొదలై తుదయొ తగునట్లు పర్యధో
వ్యస్తశరాకలన్ నడిమిపాదము లుంచఁగ నంత్యమాద్యమైనిస్తులధూపబంధమయి నివ్వటిలుం గృతులం జమత్కృతిన్
రాజితవిగ్రహాంజలిని బ్రాథమికాంఘ్రియుఁ దద్భుజద్వయిందేజరిలన్ ద్వితీయము తృతీయము బింబమునం దురీయమున్భ్రాజితరీతి వ్రాయు నది పాదమునుండియుఁ బల్కఁజాలి నీరాజనబంధ మౌను ద్విజరాజకిరీటసమర్హణార్హమై
ప్రహ్వత గల్గి వృంతమునఁ బ్రాక్చరణంబు లిఖించి మధ్యముల్బహ్వభిరామపుష్పదళపఙ్క్తులలోపల వ్రాయఁ దుర్యమున్జిహ్వకుఁ బల్క రుచ్యమయి చేరును బ్రాక్చరణంబు మంత్రపుష్పాహ్వయబంధమం దది శివార్చనయం దుపచారమై తగున్
అంజలిబంధమందుఁ బ్రథమాంఘ్రి భుజంబులమధ్యమాంఘ్రులున్రంజితనంత్యవిగ్రహమునం జరమాంఘ్రియు వ్రాసిపల్కఁగానంజలనుండి పైపయికి నంజలిదాఁకఁ దదేకవృత్తమైమంజలుమౌఁ బ్రదక్షిణనమస్కృతిబంధము ధీపురస్కృతిన్
శిఖరగతత్రిశూలమునఁ జేర్పఁదగుం బ్రథమాంఘ్రి తద్ఘటీలిఖితశుభార్ణ మాదియగులీలను బ్రక్కల మధ్యమాంఘ్రులున్సుఖగతి వ్రాయఁ దొంటిక్రియసోపానముల్ ముఖభిత్తిహత్తి తన్నఖిలము మెచ్చ నంతిమమె యాదిమ మౌను విమానబంధమై
భాసురశృంగభాగములఁ బ్రాథమికాంఘ్రి లిఖించి ప్రక్కలన్వ్రాసిన మధ్యపాదములవ్రాలు మొదల్ తుదగాఁ దురీయ ముల్లాసము మీఱవ్రాయఁగఁ జెలంగు విలోమతనైనఁ బల్కఁ గైలాసమహాద్రిబంధము విలాసకలాసరసానుబంధమై
శ్రీకవిత్వమండన మండపాక పార్వతీశవిరచితషడశీతికృతులలోఁ “బ్రబంధమంబంధబంధనిబంధనంబు”నాఁగఁ దగుగ్రంథమునఁ బూర్వభాగ మయ్యె
Comments
Loading comments…