తృతీయాంకురము

అశ్వలక్షణసారము

కరకటాక్షవిజయశ్రీకాంతా కృష్ణరాయ సిద్ధకృపాణాస్వేకృత సత్వరపరభీకరభటయూధకంప పృథ్వీనాథా.

కృతిపతికి సంబోధనము.

వివరించి దశాక్షేత్రముల విభాగము లొనర చెప్పెదను నేరుపునన్చెవి జేర్చి వినుము మనమునతవరింపగ నిది సుమి ప్రభాపథములు రెండున్.

దశయన నెద్దియో క్షేత్రమున నెద్దియో బాగుగా బోధపడునల్లుగా చెప్పెదను, శ్రద్ధాళుఁడవై యాలింపుమని మనుమంచిభట్టు కృతిపతి నుద్దేశించి చెప్పుచున్నాడు.

అశ్వంబునకు పరమాయుఃప్రమాణంబువదలు ముప్పదిరెండు వత్సరములుపరమాయు వందులో పదియవభాగంబుతనరారు నొకదశ యనఁగఁ బరగు

మూడేళ్ళు రెణ్ణళ్ళు మున్నాల్గు దివసంబులొకదశ గలదియై యొనరుచుండునత్తెరంగున దశ లైదైదు చెలువొందుపన్ని యాక్షేత్రముల్ పదిలమైనక్షేతమహిమంబుతోడ నాక్షేత్రములనుభావలక్షణంబులభాగ మెరిగిజెప్పగాదగు తత్ఫల మొప్పగాదరాజదేవేంద్ర యౌభళ రాజకంప.

హయములకు ముప్పదిరెండుసంవత్సరములు పరమాయువు. ఈ సంవత్సరముల యాయుఃప్రమాణమును 10 భాగములుగా చేసిన యొక్కొక భాగమునకు దశయని పేరు. దశాపరిణామము మూడుసంవత్సరముల రెండుమాసముల 12 దివములు.

అట్టిదశాక్షేతభాగం బెట్టిదనిన ప్రపానాధిఫాలాంతంబు క్షేత్రంబై జెల్లు నిగళస్తుత్యదాద్యుత్తమాంగంబులు రెండవక్షేత్రం బనంబడు, వన్యగళస్కంధంబులు మూడవక్షేత్రం బనంబడు కడు దందకాకజతర్వక్షోభాగంబులు చతుర్థక్షేత్రం బై నెగడు బాహుక్రోడంబులు పంచమక్షేత్రం బనంబరగు ఊరుబాహుకస్యక్సిండరాహిణసూలలు నవమక్షేత్రం బై వర్తిల్లు హృదయము పక్షపార్శ్యములు షష్ఠక్షేత్రం బనంబరకు ఊరు ఖరాంతంబుగా జంఘచతుష్టయంబులు దశమక్షేత్రం బనంబరగు అట్టి క్షేత్రంబులు కడపలయట్లుగాగ గోడిగలమేన నిరీక్షింపునెడ దశమక్షేత్రంబు నాదిగానాదిక్షేత్రంబ దశమంబుగా నవసరోహక్రమంబున నెన్నదగును.క్రమమున దశాక్షేత్రంబుల తెరం గెఱింగించెద.

అరుణాంభోరుహపత్రస్ఫురణ దురంగంబు జిహ్వ పొల్పుగ జిహ్వాంతరమున దాలు స్థానముసురుచిరముగ జహ్వ కాద సూనము తెలియన్.

పరుపడి వ్యంజనదంతమునిరుణుగు మరియు నాలు గెసగగ దంష్ట్రాంకురములు నాలుహనుజులునిరువదియును నాల్గు హరికి గంపనృపా.

..............................

కనుగొని ప్రోధలోచనయుగంబుల మధ్యను భూమి ఘ్రోణముంయెనుభయపార్శ్వదేశముల వర్తిలు గత్తియుగంబు దానిపైయనువగు క్షీరికాయుగళ మారసిచూడ దురంగజాతికిన్దనరిన నాసికాహనుపదంబుల సంధుల గండపాలికన్.

పలువరుసకు గప్పి పనిసలకడ నోష్టముల రెండు నవిగూడి సందులు సుక్స్రువమునగు (రెండు) తేజుల కధరోష్టములక్రింద చుచికం బధిపా.

గండఘోతాంతరము సువ్వె మండలంబుఅశ్వపాదంబు లరయగ నశ్వములకుకన్నులప్పారు దానిపై కార్తి మీరిమహితవిభవేంద్ర కంప మారచంద్ర.

హరునకు నక్షిపక్ష్మావృతం బాశుక్లమండలం బాశుక్లమండలంబుమధ్యంబునకు కృష్ణమండలం బాకృష్ణమండలంబులకును మధ్యదృష్టి

మండలం బావృష్టిమధ్యంబు నిర్ధంబు......................................అకనీ నికముల యాతభాగంబులభాగంబులను గండ మతిశయిల్లునేత్రయుగళిమీది నేత్రకూటంబులుపొసగు దానిమీది భ్రూయుగంబుభ్రూస్తవాంతములను పొలుపొందు ఫాలంబుదానిపై స్థువంబు ధరణినాథ

స్తుపపదంబుమీద సురుచిరమగుచుండుశిరము దానివడల జెవులు జెవులవెనుగపదయుగంటు విలసిల్లు శిరములుఖటము లబ్జనయన ఘనముగాను.

రూపైకటనయనాంతసమీపంబున శంఖయగము మీకాశినిలుగానేపాదు శంఖకటములసైపరిఘోటంబు లమరు బర్బరబాహా.

ఘోటగండస్థలములను గదిసి నెలయుబాహ్యభాగంబు హనువులై పరగుచుండుకంఠహనువులసంధిని గళము వెలయు.

గళవక్షంబులనడుమనుపొలుపగు కంఠంబు కంఠమూలమునకు వాజులువారు బాహులు మధ్యనువలవదు క్రోడంబుక్రింద బాహువు లమరున్.

బాహులవెలుపల పరుగు జాంగలములుజాంగ లలము క్రింద జాను లుండు

కిదాములు వెలుపల క్రిందబొత్రికములుమసలు జానువుల మందరములజానులకిందట జంఘల జంఘలవెలుపటిదెసలందు వెలయు గములుజంఘలక్రిందుమార్చంబులకును మీదుపడినాస్త మొనరు తత్పరిసరమునుబనరు గూర్చంబు తన్మధ్యమున గిరాంబుపొలుచు గీర్చంబుకిందట చుష్టికంబుదానికిందట ఖరసంధి దానిక్రిందశిరము తరువాత నఖశిఖ నరవరేణ్య.

ఖరతలమున నిమ్మదె శక్షరమై మందూకి వేయు సక్షీకరమెఖరులు వెలుపల పార్శ్వముకర మొప్పగ కంపభూప కాంతామదనా.

కరమూలంబుల పృష్టపార్శ్వముల గక్షస్తానముల్ పొల్చు దత్కరమధ్యంబున గ్రోడపీఠ మమరున్ తత్క్రోడవీరోదరాంతరమధ్యంబున హృత్తంబు వెలయుం తన్నాభిమధ్యంబునన్గర మొప్ప జధరంబు ప్రక్కలను జక్కాన్నాభిమధ్యంబునన్.

ఉదరం బిరుపక్కియలన్బదపడు గోష్టములు మధ్యభాగస్థనుపైఉదరత నాభీమధ్యంసదమై రోమాని వెలయు సాళువకంపా.

కరమూలంబుల వెనుకంగర మరుదుగ పార్శ్వయుగము గ్రమమున కుక్షి

స్ఫురణమగు క్షేత్రమూలముతిరమగుచుం గాన కుధరంబు తేజుల కమరున్.

తిన్నని కుక్షిమూలమున తేజులరంధ్రయుగంబుక్రిందటన్బన్ననిరీతి నుండు నుపరంధ్రములందు తురంగజాతికిన్పన్నుగ కంఠపార్శ్యముల పైకొని వన్నెలు నిల్పుచుండగాసన్నుతి జాళుకీతిలక సాళువకంప నృసాలమన్మథా!

హరిరత్నంబయి సముత్తమాంగభుజమధ్యస్థానసంప్రాప్తమైకర మొప్పారును గ్రీవగ్రీవమునకు పై కంఠంబు కంఠంబుపైసరిగేశాళి శిరంబు సంధి వెనుకన్ జెన్నొంద కేశాంతముల్సరసోదార కుమారకంపనృపతీ చాళుక్యచూడామణీ!

కేశాంతస్థలముల యఖాస్యంబగు వనాపదంబు లావహయుగళీదేశము గదీయ గప్పనిదేశముపై గాకసంబు తెలియును హరికిన్.

పరువడి గాకసముకు పైబరగున్ కకుదంబు తన్నిబంధము వైలోసరి నొప్పు హంసఫలకలుఅరుదుగ హంసముల వెలికి ననుపుగ నుండున్.

హరి కకుదప్రదేశమున నంతరమానము మానసస్థలిన్పరిసరవర్తి పృష్టతలబంధుర పృష్టతలంబుచెంతనుంబరిగు తికస్తలం బత్రిక పార్శ్వమునం జఘనంబు బొల్పుగానరసుతకీర్తిదౌభ సుగుణాధిప కంపకుమారమన్మథా.

పదపడి పుచ్ఛచ్ఛన్నముగుదదేశము నుండు నడుము గుదమధ్యమునన్

గదిసిన శేఫశి వాజికిపదపడియు న్నుభయపార్శ్వబాసట యుండున్.

పాసలంబుకు క్రింద భాసిల్లు రోహిణిసంధుల గుదము పార్శ్వములయందుసృక్సిందయుగళంబు చెలువొందు నూరువుల్వానితో నడ్డము వానిమ్రోలతగమోహమున గండపార్శ్వంబు లూరువుల్వక్కకుక్తులు నిల్చు వానిమీదనెదరి వక్రకుక్తుల నిజమధ్య హరికినిరెండుపాతంబులై యుండుకొలదిస్థూల మొప్పారు వక్త్రమౌ శుక్తులకునువానికి్రిందటను దిరద్వయము వెలయునాది వినినట్లు ముందరిపాదములకురాజనుదారనౌభళ రాజకంప.

కరమూలకకుడములకునుఖరకుప్పిక జానుదేశకూర్పంబులకున్పరిమితిమారంగుళములుపరికింపగ గంపభూప బంధునిధానా.

కాలవని గళస్తములపొడవును యంగళము మొగి దంష్ట్రములన్చెలువుగ జూడగ నొప్పునుతలపంగా నృపసమూహ ధరణీనాథా.

విసవిసనైన తాలుదళవీథియు నాలుగయు న్హయంచు కున్బొసగిన యంగుళంబులని ముప్పదిరెండు గడంగ

లసనగు... వర్తిపదము పాటినట్టివైమసలు గరారి సాళువసమంచిత గంప నృపాలధీమణీ.

పరువడి ప్రప్పపానపద్రముకరుణాంబుదు కక్షలంబు కటశంఖములన్తురగములకు పరిమాణములరదు న్రెండంగుళంబు లాహవభీమా.

పటువగులోచనంబులును పద్మదళంబులు సృక్సునాసికాపుటములు నశ్వపాతములు ప్రోధగుదంబు కకూదరంబునన్చ్చటనగు సంఖ్య యనంబడు నశ్వజాతికిన్భటభుజవక్త్రనక్తు నమితంబులు జూడ బదారునై చనున్.

పదహస్తయుగనాభి పాయూపయోష్ఠంబుచతురంగుళంబులు సప్తులకునువ్యంబనదంతముల్ నారంగుళోన్నతులట్టహాసవ్యంబు లశ్వములకుద్వాదశాంగుళంబులు దనరారుహృదయంబుకుక్షదేశం బిట్లు ఘోటములకుపోలంగ నిరువదియారంగుళంబులుజత్రుదేశం బొప్పు సైంధవముకుతనరరంధ్రోపరంధ్రము లెనిమిదంగుళములు పంచాంగుళంబులు నిలుచు నూరునేబదంగుళము లగుచు సొబగు మీరుఘనతరాధిపదాళుక్య కంపభూప.

అణుప్రమాణంబున యంగుళత్రయమునువనర నట్లే కాడె హృదయవీథి

అమరంగ తద్దేశమంగళంబులు రెండునోష్టలోచనములు యొనరునట్లుఆననంబగు ముప్పదంగుళములు యుండు....

పద్యము పూర్తిగా లభింపలేదు.

కడగి ఖురాగ్ర మాదిగను కాకసదేశముదాక గొల్వగాపొడవు శతాంగుళంబునయి పొల్బుగ నుత్తరుమైన సప్తికిన్నడుమున జూప మధ్యమగు వాజికి దొంబదియంగుళంబు లైయదయగ నీచయశ్వమున కంగుళసంఖ్య యెనంబదై చనున్.

హరులప్రపానపాళి మొదలై తగువర్తిక గాక చూడ నూరిరువదియంగళంబు లగు నెక్కడ మధ్యము నంతకంటె ని........................................................................ నిట్లరువదియంగుళంబు లగు నయ్యది శ్రేష్టము కంపభూవరా.

పొడవునకు తగిన నిడుపునునిడుపునకున్ దగినవలము నేడది గూడంగడునొప్పు లక్షణంబులుయడరినయది యశ్వరత్న మది గంపనృపా

వదనంబునకును వర్తికసదృశమై యుండవలయు జఘనంబున కొప్పిదమై వరపుర కెనయౌపొదలగవలె హరికి గంపభూపాలమణీ.

ఇంక వయోజ్ఞానం బెట్టిదనిన.

ప్రమాణలక్షణ మెఱిఁగించిన పిమ్మట వయఃపరిణామములు జెప్పెదను.

జన్మమాసంబున శనియుగమువడముపొడమి రెండవనెల పూర్ణమగునుమధ్యమదంతయుగ్మంబు మూడవ నెలపొడమి నాల్గవనెల పూర్ణమగునుపారిపక్షపుజోడు పరగ నేనవనెలపొడమి నారవనెల పూర్ణమగునుతెలుపు వేడవనెల పొలుపారు క్రిందటమొదలనుగా నెనిమిదవనెలయునవదశమాసములును దా పెదనిక్రిందమీదిమద్యములు దెలుపు మీరినయిలుబదునొకండును పండ్రెంట గోడిగలకుబారిపక్షము లట్ల గుమారచంద్ర.

క్రమమున నొక్కయేడున తురంగము శాలసమూహి కెల్ల దంతములు సమస్తముల్ ధవళతామహిమం దనరారుచుండగానమరు గషాయవర్ణమున రెండవయేట... నత్యమలయశోవిభూషిత సమస్తదిగంతరకంపభూవరా.

తురంగశాబకమునకు యొకయేడు నిండునంతకు దంతంబులన్నియును దోచుటయెగాక యవి తెల్లనైయుండు రెండువత్సరముల కయ్యవి కషాపురంగు గలిగియుండును.

మూడవేటను వద్దశనములు చతుర్ధహాయనంబున మధ్యదంతాంకురములుపంచమాబ్దంబునను బారి పక్షయుగముసొరిదిబడి వచ్చుపిల్లల కరనె యధిప.

మూడవయేటను దశనంబులును, నాలవవత్సరమధ్యంబున మధ్యదంతములును అయిదవయేట పారిపక్షములును దోచు.

పదపడియదశయందునరదనంబులు నాలుగేండ్లు ప్రథమం బదిగాగదియును వ్యంజనము తొమ్మిదియును మూడేసియేళ్ళు నిది యొక్కొకటై.

పండ్లు తోచినవత్సరము గానక మరివాలుగువత్సరము గడచినపిమ్మట వ్యంజనములు ప్రారంభమగును. ఒక్కొక వ్యంజనము మూడేండ్ల చొప్పున తొమ్మిది నడచును.

అది యెట్లనిన కృష్ణవ్యఃంజనంబును మక్షికావ్యంజనంబును శంఖవ్యంజనంబు నులూఖలవ్యంజనంబును చలనవ్యంజనంబును పతనవ్యంజనంబును... ననం దొమ్మిది దెరంగులై యుండు, తరంగమ వయోజ్ఞానకారణంబులై యొప్ప తద్వ్యంజనంబులు వేరవేర వివరించి చెప్పెద.

1 కృష్ణవ్యంజనము 2 మక్షికావ్యంజనము 3 శంఖవ్యంజనము 4 ఉలూఖలవ్యంజనము 5 చలనవ్యంజనము 6 పతనవ్యంజనము అని తొమ్మిదివ్యంజనము లుండును. ఒక్కొకటి మూడేండ్లు నడచును.నవవ్యంజనంబులును జెప్పి యొక్కవ్యంజనరూపంబును వేరువేర నిరూపింతునని జెప్పుచున్నాడు.

తనభాయంకృష్ణవ్యంజన యారవయేట బుట్టు పెద్దశనయుగంబున నేడవమధ్యంబునమొనయు హరిపోరిపక్షముల నెనిమిదియున్.

అశ్వరత్నంబు మునుపళ్ళు హయము నడిమిపళ్ళతురంగముకడ పతిపళ్ళకడనుక్రమముతో నవమాదివర్షములమూటహరిణి విలసిల్లు రాయచోహత్తిమల్ల.

సద్వంశాదిమమద్యదంతములు కా చచ్ఛాయవక్షంబులున్చందంబొంద వయఃపదీర సదృశద్ఛాయాసమోపేతమైపొందుం ద్వాదశవత్సరంబు మొదలై! పోలంగ శుక్లాభిదంజెందుం మూడు సమంబులై వరుసతో నైకాకుమారగ్రణీ.

ఆదిమధ్యావసానదంతాంకురములుకదళికాద్రూపమై తగ కాచ మెరయపంచదశ మొదలును షోడశాబ్జములనుదశనలాంఛనములు గంప ధరణినాథ.

మక్షికాభిధాన మరయ మక్షికాసమానకాంత్యక్షయంబు శంఖసదృశ మగుచు మెరయు శంవైలక్షణమున నలూఖలంబు పరగుబళ్లువృత్తవైలక్షణములు చలనపతనలక్షణంబులట్లగున్.

పుష్పంబై మహిసత్వసంపదగడున్ బొల్పారి తేజోగుణోత్కృష్టం బై కడుదూరభారవహమై దీపించు కృష్ణచ్ఛదాదష్టాభంబుల రూపసంపద కడున్ బొల్పారుచుండున్ మహాస్పష్టంబైన తురంగమంబు హరిణాంతస్వారంబు కంపాధిపా.

పొదపొద మూడేళ్ళును నిడుపొదను నాలవయేట... నెమ్మెకటన్గడు వయిదవేట దృఢమగుగడుకొని వారిబలములను గంపకుమారా.

వర్ణలక్షణంబుల జెప్పుచున్నాడు.

వివిధవర్ణముల లక్షణముల దెలుపుచున్నాడు.

ఈ పద్యము నశించినది. రెండుమూడుమాతృకలలో లేదు. ఉన్నదానిలో తప్పులు మిక్కుటముగా నుండుటచేతను అక్షరము లధికముగా లోపించుటచేతను విడువబడినది.

అచ్చపుదెలుపును నలుపునుబచ్చయు గడువొప్పుననుచు బాధింపంగానచ్చుపడ నాల్గుదెగలైయిచ్చలుమనసుధ వర్ణ మెసగును హరికిన్.

చిత్రవర్ణమను వర్ణము.

ఈపద్యము నశించినది.

బహ్మమున యక్షశమనవైశ్రవణశక్రసత్వమువలన శుద్ధసత్వములగుసత్వులకు బరికింపగా సౌఖ్యదములురాజవాహిడములు నాభళి రాజకంప.

కామక్రోధంబులచేపామరుల దగులమడక నూడరిదగ నుద్దామసుఖంబు లనుచు నభిరామంబులు నిజము సత్వరాజోత్తంసా.

శుద్ధసత్వముల నిరూపించుచున్నాడు.

మదమోహద్వేషాదులమదిలో నూహింపనీక మహనీయగుణోస్పదమై రుచిమైయుండెడియది దామునిసత్వమైన హరికంపనృపా.

సంతతమన్మథకేతాచింతాకృతచిత్తవృత్తిచే వెలయుచు న

త్యంతప్రసాదలక్ష్మీకాంతకు తన కెపుడు సత్వగంధర్వ మిలన్.

నిరుపమతేజోవిభవాదరమున గడఁగొప్పు మీరు గంధర్వము దాపరికింప నింద్రసత్వముధరణీరమణీయబాహు ధరణివరాహా.

మథితరాగమోహమాయాప్రసంగమైకొరలు యామ్యసత్వఘోటకంబునాటపాటలచేత వద్వరముల మెచ్చుయక్షసత్వమైన యశ్వ మధిప.

ఈయారును సుద్ధసత్వములు. ఇక మధ్యమంబుల జెప్పెద.

పైన చెప్పిన యూరును సుద్ధసత్వములు. ముందు మధ్యముల చెప్పును.

అసురపైశాచిప్రేతరాక్షసభుజంగపక్షిసత్వములనదగు భావములనుప్రబలనిస్వనములవారు రాజసమునమధ్యమంబులు ననగ సన్నుతికి నెక్కె.

సతతకోపంబును శౌర్యగుణంబులువదలు సత్వంబు దైతేయనాజినశుచిత్వభీతియు నాహారశక్తియుచెన్నొందు పైశాచసత్వహయముబహ్వాశయును దస్వభారభావితయునుసత్వహీనయు జిత్వ సత్వసత్తినిద్రాశువును చూడ నెరిదిండిపోతునుక్షణసత్వనామంబు సైంధవంబు

సంతతాశనమైథునచాపలంబు... శాకుంతసత్యతరంగమంబుచాపలంబును దోషంబుసాధ్వసవముగలఫణిసత్వవాహంబు కంపనృపతి.

అలసట భీతి జాడ్యమును నాకటిపెల్లును మీదిలావునున్నలవడుచున్న వాహములు వాసనసత్వము లెల్లవేళలన్జలములమీద వేడ్కగల సైంధవరత్నము తుత్స్యసత్వవైయలజడి నిద్ర మానని హయంబులు బువ్వెలి శుద్ధసత్వముల్.

ఛాయాలక్షణ మెట్టిదనిన.

ఛాయాలక్షణముల తెరం గెఱింగించుచున్నాడు.

అసనంబునడుమ నంబుజభాంధవుగదిసి మేఘరాజి గప్పినట్లుసప్తిమేననున్న సకలలక్షణములుఛాయ గప్పు ననిరి సాళువారిక.

పార్థిని యన బరగు...............వారణమనగ మది నాయుననగ.....................వైదు చెరంగులవేరువేరువిధుల విస్తరింతు.

పాదభాగములు నశించినవి. అర్ధము ద్యోతకమగుట లేదు.

వివిధంబైన విశేషవర్ణములచే విఖ్యాకమై కోమలత్వవిభాతిం దనరారుకన్నులకు నుత్సాహంబు సంధింప రూపవిశేషంబు వహించి నిశ్చలగతి భూవ్యక్తమై యొప్పుపార్థినకచ్ఛాయహయంబులు మేలు జయశ్రీ దానాంశకంపాధిపా.

తోయజమిత్ర నూత్నరుచితో దులతూగు పద్మరాగరత్నాయితగాంతితో గలయ నాడియలంతుకడినోప్పు గాం

గేయపుకన్నె నవ్వి కడుగెంపు వహించి వెలుంగు చూడనాగేయవిశిష్టమై హరికి గీర్తివధూవర గంపభూవరా.

సారపునీలమేఘములు చాయలచాయల బోవనాడి యంభోరుహకోమలద్యుతికి బొమ్మలు పెట్టి ప్రసనన్నమైనకూరూరుచిరప్రభావముల బోరజయించి మనోహరాకృతింవారణ యొప్ప మీరునది వాజులకెల్ల కుమారమన్మథా.

ఈయెడ చపలత్వముననుబాయక వర్షిల్లు పరుషభావమునైజంబైయండు ఘోటకమునకురాయడి గడునింద్య మగుచు దగ కీర్తినిధీ.

నాభళి యల్పంబై గగనాచ్ఛాయ సనాథయైన చంచత్కలనావైభవము చొప్పుగలయదియబ్భంగి తురంగములకు నాయం బరయన్.

రేపును పడమటిజాముననేపున నుదరమున దృప్తి మెయినను వేళంరూపుగ మెయిగరచిన హరియాపోవగ జాయజూడ నగు కంపనృపా.

చక్కగాకనున్న సౌష్టంబుగలరీతివక్రమైనమొగ్గ వడలకున్ననాలవిషయమైన వదలక సంకీర్ణగతుల కీను హరికి గంపభూప.

శుద్ధగతికి

శరభమురీతి పెద్దపులి చాడ్పున గోవృషభంబుజాతి గేశరివలె రాజహంస వరుసంగతి నుష్ట్రమురీతి మత్తకుం

జరమున భాతి వానరము జూడ మయూరములాగునన్ మనోహరగతి నొప్పుతేజి విజయప్రదమౌ భళ కంపభూవరా.

గంధలక్షణము

శరభమువలెను పెద్దపులివలెను ఆవు యెద్దు సింహమువలెను రాజహంసవలెను ఒంటెవలెను ఏనుగవలెనురు కోతివలెను నెమలివలెను మనోహరరూపము కలదైయుండు గుర్రము విజయప్రదము.

ఆననభాగమందు నయనాబ్జయుగంబున నాసికంబునన్వీనుల మేనిపై జెమట నీళ్బును మూత్రపురీషజాతియన్రేనియనాఖ్య దుగ్ధకమదేభమదాంబితపుష్పగంధముల్పూనినదానిసౌఖ్య మగు భూస్థలి నౌభళ కంపభూవరా.

ముఖంబునను నేత్రములయందును ముక్కునను వీనులందునను శరీరమునందునను పుట్టిన చెమటనీళ్ళును.

మత్స్యమథకకూర్మి మానుగశలభోరుఖరవరాహశునకగంధమైనహరులు చుట్టలు... యసయంగ నౌభళిప్రభునితనయ కంపరాజతిలక.

మూడవపాదంబున గొంతభాగమున సమునర్ధస్ఫురింపజేయు క్రియాపదము పోవుటచే యర్ధము దోచదు

వేణుక్రౌంచ మృదంగదుంధిభిలసద్వేవేంద్రనాగోల్లసద్వీణావారిదమంజునాదములకుం బ్రియ్యంబులై యొప్పనిక్వాణంబుల్ గలవాజి యిచ్చు పతికిన్ కళ్యాణముల్ క్పరనాక్షోణీపాలక సుప్రతాపశుభముల్ స్తోత్త్రైకపాత్రంబులన్.

వేణువు క్రౌంచము మృదంగము దుందుభి స్వర్గలోకసంబంధితమైన వీణ మేఘము మున్నగువానియొక్క సుశబ్దముల ననుకర్ణించురవముగల తురంగము యజమానునకు సకలకల్యాణముల నొసంగును.

..................................................................................జూడ నూరపంది జాతిని నుష్ట్రంబుకరణి రవము సేయ కాంతి చెరుచు.

పుండ్రలక్షణము

నశించినది. ఊరపందివలెను ఉష్ట్రము (ఒంటె) వలెను ధ్వనిచేయుగుర్రము యజమానిని ప్రతిభ జెరుచును.

ఉడుగక కర్తకుం మిగుల నొప్ప విడెంబు తురంగమంబు బొల్లెడ తెగియున్న ప్రోవుకడ కెక్కకయుండిన మోణ కడ్డమైవిడువకయున్న కొర్రెవలె ప్రక్కన యన్నిక జంపుభావనాపొడమిన భావశృంఖలల వోలినచిత్రపురూపు దాల్చినన్.

చెలువంబై యలశంఖుచక్రకలశశ్రీవక్షఖండేందుఖడ్గలతాష్టాపదవేదికాంకుశపతాకావజ్రకూర్నీగదాకలితాదర్పణతారనీరజశుభాకారంబులై యొప్పువాజి లతాస్థలినున్న బొల్లు పతికిన్ చేకూర్చు నిష్టార్థముల్.

స్వస్తరుణీవిలసనసత్కస్తూరీవల్లికా వికాసగ్రధితప్రస్తారనూత్నస్తబకగ్రస్త్రాహితవీరయోధ ఘంటానాథా.

త్యంకారపూర్ణనిష్టురహుంకారవిదారితోధి దోర్వీర్యధనుష్టంకారనిజశత్రుకులాలంకృతపదపీఠ యోభళప్రభేతనయా.

Comments

Loading comments…