ద్వితీయాంకురము

అశ్వలక్షణసారము

రమణీసేవాస్పదపారీణ వివేకపరమపావనమూర్తీసారాచారవదాన్యక్ష్మాహరు విద్యావిహార కంపకుమారా.

లక్ష్మీదేవిని సేవించునటువంటి వివేకములుగలవాడు పావనమైనవాడా... కృతిపతియైన కంపకుమారుని కన్వయము.

తురగస్తుతి పద్యారసధరవిశ్రుతగతుల రీతి దగజెప్పెద నాదరభరితహృదయపద్మముకరమరుదుగ జినికి దొడవుగా జేయు మొగిన్.

వరలక్షణనామంబులుపరిపాటిగ జెప్పుచోట పలికిన రీతుల్పరిశించి కరుణసేయుడుసరసగుణోదారు లయిన సత్కవులెల్లన్.

శుభలక్షణముల నామములను అవియుండు స్థానములను బాగుగా పరిశీలించి ఒప్పులు పరిగ్రహించి తప్పులు మన్నింపుడు. ఈపద్యము గ్రంథారంభములోనిదై యుండివచ్చును.

ప్రకటంబుగ నావృత్తముమంగళము సత్సావలీఢ మూర్మము సాదుర్ధకమును శుక్తిశతపదియనగసుళ్లీ క్రియ నెనిమిది యేతద్రూపంబుల్.

ఆవృత్తము, ముకుళము, వత్సము, అవలీఢము, మూర్మము, పాదుకార్ధము శుక్తి, శతపదియను ఎనిమిదివిధంబులుగ నుండును.

ఆవర్తన మరాపగావర్తమున కెనపాదుక పాదంబు పాయగొమ్మముకులంబు మల్లికా ముకులంబు సైదోడుశతపాది జర్రికి సరిగడంబుచిప్పకు శుక్తి నెచ్చిలి పాదుకార్ధంబుతునిసిన భాగంబు తోడుదోడుదూడ నాకువునకు దొనయ వల్మీకంబుమూకకు మంచునమూహ మరయనిట్టిసుళ్ళ ప్రమాణంబు లేర్పరింతుపూర్వశాస్త్రక్రమంబున బొల్పు మిగులఅహితహృద్బల్లరాయసౌహత్తిమల్లమహిత విభవేంద్ర కంపకుమారచెంద్ర.

అవర్తమనుసుడి - గంగలోనిసుడి, ముకుళము - మల్లెమొగ్గ, శతపాది - జెర్రి, శుక్తి - ముత్యపుచిప్ప, పాదుకార్ధ - విరిగినపాదంబు, వల్మీకము - పుట్ట, మూక - మంచు సమూహవలెయుండును.

................తత్ప్రమాణంబులు సుళ్ళయొక్క ప్రమాణంబుల చెప్పుచున్నాడు.

అంగుళత్రయమున నవలీఢకము నిల్చురెండంగుళంబుల నుండు శక్తిచతురంగుళంబుల శతపాది పరినాటిపాటించు నంతన పాదుకయునుముకుళంబు సుడియును మోబునంగుళ చతుర్భాగంబునందు త్రిభాగముగనుపాదుకార్ధము హీనపాదాంగుళంబునమూకమష్టాంగుళమున దనర్చునిట్లు చెప్పిన వాటిని నెల్ల సుళ్లునిలిచెనేనియు దమతమ ఫలము నిచ్చునట్లు కాకుండ నం దల్ప మధికమైనచండభుజబల మీసరి గండకంప.

ఇట్లు వివరించిన యెనిమిది దెరంగుల సుళ్ళులోపల శుభాశుభవర్తంబులు పరికించునెడ నావర్తంబులు ముకుసంబులు శుక్తులు శుభంబులు ప్రధానంబులై యుండు. తదావర్తంబులు వాహంబులకు కొన్ని శుభంబులు కొన్ని యశుభంబులు నన రెండు దెరంగులై యుండు నని ధృవావర్తంబులు పదియును పదినెలం బాయకుండు నాగంతుకంబులయిన శుభాశుభవర్తంబులు నూటపదమూటిలోన ముప్పదియేడు శుభంబులను దెబ్బదియారు యశుభంబులునుననబరగుచుండు తత్పలంబులు తన్నివాసంబులు ధృవంబుల కధిదేవతలకు గ్రమంబున వివరించెదను.

పైన వివరింపబడిన యెనిమిది విధంబులైన సుళ్ళలోనును శుభాశుభములను గనుగొనునప్పుడు ఆవర్తము. ముకుళము శుక్తి శుభ

బాయకములై యందును. ఆవర్తములలో శుభాశుభములు కలిగి రెండు తెరంగులైన యావర్తంబులయ్యెను.

ఉరమున శిరమున రంధ్రోపరంధ్రముల రెండు ప్రస్థానములోనుత్తరమున నొకటొకటిగనరవాజుల పయిని దశ పదిధృవులయ్యెన్.

గుర్రమునకు 10 ధృవులుండవలసినస్థానముఁలు. చూడు - ప్రథమాశ్వాసముస 11 న పద్యము, మరల నిచ్చట నేల చెప్పబడియెనో తెలియదు.గుర్రముయొక్క తొలంకులఁకును, శిరముమీదను నుదుటను... వక్షమునందును.

పరగంవాజి తొలుంకులం శిరముఫై ఫాలప్రదేశంబునన్వరుసన్ వక్షముపై జనించిన సుడుల్ వర్ణ్యంబులో సుళ్లకున్నరనారాయణ యక్షరాక్షసధృవుల్ నక్షత్రనాథార్కులున్నరతాప్తుండును మందగంధవాహుడున్ నా సత్యలుం దేవతల్.

మొండిమస్తకహీనమై యుండు వాజిజకలకు జెడ్డయది కడు ముట్టదగదుమున్ను తానున్న నెలవున నున్న హరులనన్ని గొనికాని నిలువనీ దెన్నిగతుల.

చిన్నతల గలిగియుండి సుళ్ళు లేక మొండిదైనట్టి హయమును ముట్టుటకైనను తగదు. అది శాలలోనున్న యితరగుర్రములకు గూడ హాని చేయును.

నెలవుల ముప్పదియును గలతురగంబును బ్రతుకు పెద్దకాలముశుభ మై

నిలువదు తడవేశుభములువెలయక యని కొన్ని ధృవులు వెలితైయున్నన్.

ముప్పదిసుళ్ళకు తక్కువయైయున్న గుర్రము ఎక్కువకాలము బ్తుకనోపదు.

నెలవులు విడిచిసదమలోపల నొక్కటి విడువబడిన పరిపాటి మెయిన్నిలువక తక్కినధృవములుగలతురగము బ్రతుకు వాడు గట్టగనగునే.

ధృవు లుండవలసిన స్థలములలో నున్న యెడల నాగుర్రమును బ్రతుకదలచువాడు కట్టదగదు.

హీనావర్తంబులు ఫలహీనముగా జేయుకొలది నెక్కువయైనంమానని నెవ్వగ నొసగునుగానం ధృవుకొలఁది నిలుపగావలె హరికిన్.

ఆవర్తంబులను సుళ్ళులేని తురగము ఫలమీయజాలదు. ఎక్కువయైన నావర్తంబులు గల తురగముగూడ తీరనివ్యధ నొసగును. గాన కొలదిగా ధృవులు గలిగి హరిని నిలుపవలయును.

నడుము దెగి రెండదెగవైపొడమినధృవుగలుగువాజి బోదోలకనేజడుడు తెగి నెక్కు నాతనిఒడలుసదల పొత్తకూడి యుండడు తడవై.

సుడినడమున తెగి రెండు చేయబడిన తురగమురు సాహసించి యెక్కువాడు చిరకాలము జీవించడు.

నెలవుల నిలుపక దావలివలకలిదెసకు తొలగియున్న వలపలిసుడి దా

పలిదెసకు జనిన హరి భూస్థలి నిజభూవిభుని రాజ్యవిత్తచలనలు సేయున్.

కుడివైపున నుండవలసిన సుడి యెడమవైపునను ఎడమవైపున నుండవలసిన సుడి కుడివైపునను యున్న తురంగము యజమానుని ధనహీనుని జేయును.

సెలవుల నుదట బాహులతోకలనొస కంఠతలల కేశాంతములన్గూబలపై సరసతగల సుళ్ళు శుభము నిచ్చు కంపనృపాలా.

శుభావర్తలక్షణంబుల దెల్పుచున్నారు.సెలవులందును నుదుటలందును బాహువులందును, నొసటలందును కంఠగలమందును కేశాంతమందును చెవుగూబల యందును సుల్లుగల తురగము శుభముల నొసగును.

శలవుల కేశాంతముల రెండు రెండట్లకొలకుల పదల వీనుల మొదళ్ళమూడు నాలుగు రెండు మూడులై నెలవులనాల్గింటసుళ్లున్న గల్గునొసలఅదిమూడు నాల్గునై పదమూడుచోట్లనుపండ్రెండు సుళ్ళలో భాగములనుకరయుగంబున రెండు గడలనివాడవస్తువముల మూడు వరుస నిట్లునెలవు లిరువదిన్ని బెటవార నిలిచినసుళ్లు ముప్పదియేడు శుభతరములు

తత్ఫలంబులెల్ల తర్వాత వివరింతుకంపరాజ భూనిలింపరాజ.

సెలవుల యందును కేశాంతములయందును వీరుల యొక్క మొదల్ళును.

చక్కగ సెలవుల రెంటన్జక్కనిరోమజములున్న సైంధవరత్నంబెక్కన రౌతుకులంబుననక్కాలమునిచ్చుచుండు నిష్టార్థంబుల్.

సెలవులయండు రెండురోమజములు (సుళ్లు) గలిగినటువంటి తురంగమును ఎక్కినరౌతునకు సర్వకాల సర్వావస్తలయందును యిష్టార్థముల నిచ్చుచుండును.

శుక్తులు కేశాంతములనువ్యక్తములై రెండుగల్గు వాహము నెక్కన్యుక్తిగలవాడు విజయాసక్తుండౌ పుత్రపౌత్రసంపద గలుగున్.

కేశాంతములందు సుళ్లు కలిగిన గుర్రము నెక్కినవాడు విజయుడై పుత్రపౌత్రసంపదలతో తులతూగుచుండెను.

హయము రంద్రోపరంధ్రపర్యంతభూమిగానవచ్చిన సుళ్లు మేఖలములంచుఅట్టి మేఖలి కెక్కిన యధిపు డెపుడుమణివిభూషణ సౌభాగ్య మహిమ దనరు.

నిలుతురు తురంగవేదులునెలయగ జెవిగూబలందు వృషభావర్తాంబులు గల్గుతురగరత్నమువిలసన్మణికుండలాదివిభవము లిచ్చున్.

చెవి గూబలయుదున్న సుడికి వృషభావర్తం బనంబడును. వృషభావర్తంబుగల తురంగమును హయలక్షణశాస్త్రసంపన్నులు అధికవిభవంబుల నిచ్చునని త్వరితముగ నిలుతురు. (కొందురు).

నలుమూలలనుండు నాల్గురోమజములబాతురంతికమను ! సౌంజ్ఞ దనరిముమ్మూలలందుండు మూడురోమజములుత్రేతాగ్ని నాగ విఖ్యాతి దనరిమొగిదంతియై యుండు మూడురోమజములునిశ్రేణికాఖ్యమై నివ్వటిల్లుసంగడియై రోమజములు రెండుండునుయమళమనామధేయంబు మించిహయముఫాలంబుమీద నీ యాకృతులనుదావకంబుల నాల్గింట దనరి మించిసుళ్ళు పండ్రెండు ఫలమును సొరిది వినుమురాజదేవేంద్ర యోభళ రాజకంప.

నాలుగుమూలలను నాలుగు సుళ్ళుండినయెడల నద్దానిని బాతురంతికమందురు. త్రికోణాకారముగ మూడుమూలల సుళ్లుండిన త్రేతాగ్నియందురు. దొంతిని విధంబున మూడుసుళ్లుండిన నిశ్రేణిత యనంబరగును. రెండుసుళ్లు సమీపంబున నుండ యమక మందురు. ఈసుళ్ళన్నియు నొసట నుండవలయును వీనిఫలముల జెప్పుచున్నాను.

నెన్నొసలజాతురంతికమున్న తురంగంబునుతమహోత్సవకరమైసన్నుతధరణీరాజ్యసమున్నతసౌఖ్యంబు లిచ్చు నోభళకంపా!

నెన్నోసలుమీద చాతురంతికమను సుడియున్న తురగమును మహోత్సవకరమైన ధరణీరాజ్యసుఖంబుల నిచ్చునని విలుతురు.

నిశ్రేణితఫాలంబునవిశ్రుతమగు ఘోటకంబు విశ్వములోనన్అశ్రీనిలసత్పరిరంభోగశ్రేయవిభవ మిచ్చు గంపమహీశా.

నిశ్రేణికయను నామధేయముగలసుళ్ళు ఫాలభాగముపై నేయశ్వమున కుండునో అది విభవైశ్వర్యముల నొసగును.

పదిలం బారగ సుళ్ళునాలుగు నురోభాగంబునం దిక్కులంగదియంగాదగు రోచమానము సుముఖ్యస్థానమం దుండెనానది శ్రీవక్షకి నామధేయమగు నాయశ్వంబు చేకూర్చు సమ్మదలక్ష్మీశయభోగభాగ్యవిలసన్మాన్యప్రతాపోన్నతుల్.

నాలుగురోమజాతముల నాలుగుమూలల పేరురంబు పైదాలిచియున్న తేజి ప్రమదంబున నెక్కెడి మానవేశ్వరుండాలయలోన శత్రునిచయంబు నణంచి తదీయ లక్ష్మీలలనావిశేషసుడి కేరిగనున్ మహికంపభూవరా.

సోలిమరముమీద శుక్తులుమూడుండుసైంధవంబు సర్వసౌఖ్యదంబుదాని నెక్కి శత్రుసేనల జెండాడివిభుడు మగుడి దివ్యవిభవు డగును.

ఉరముమీదను మూడుసుళ్ళుగల తురగము సర్వసౌఖ్యములను ఇచ్చును. అట్టిగుర్రము నెక్కినవాడు శత్రు సేనల చెండాడి అధికవిభవము కలవాడగును.

అంగద నామముగల్గుతురంగము బాహువులు సుళ్లు ప్రఖ్యాతముగా

రంగ నవరత్నవిభవాసంగత మొగి నిల్ప సర్వసంపద లొసగున్.

అంగదనామము గలిగినటువంటి తురంగములకు బాహువులందు సుళ్లున్న యెడల నానావిధరత్నభూషణములగు సర్వసంపద లొసగును.

దేవమణి దేవమణియునుమానవుని గళంబు జేరి మహినుండుట నద్దేవమణి గల్గుతురగముదేవేంద్ర శ్రీయొసంగు కృతిగరిం నృపా!

ప్ర్రాసాదతోరణవరత్రింశ...........సరసిజవేదికాస్వస్తికములుత్రేతాగ్నియమళనిశ్రేణికా శ్రీవృక్షచాతురంతికగదాచక్రములునుకలశాంగలశుక్తి ఖర్జూరఖండేందువజ్రయూపాంకుశకల్పకములుఅశ్వత్థవర్ణ సూర్యాష్టపదాంబుజపాంచజన్యంబుల పగిది నుండుధృవు లురముపై నుండె నొసలిపై నొండె గల్గుతురగరత్నంబు నెక్కిన నరవరేణ్యుడరుల నిర్జించి తద్రాజ్య మనుభవించురాజకులదీప యౌభళ రాజకంప.

కటికంఠనాసికాపుటగండకరమూలజానుమాన్యాహనుస్కంధములనుఅలీఢసృక్సిండపాలాశ్రుతాండవకుక్షివాలస్థూలక్రోడములను

భ్రూమధ్య కర్ణాగ్రములరెండు రెండుగాక్రోడఘోణాసనప్రోధములనుకాకసగణనాభి కకుచుత్తరోష్టపుహృతనాభిగండంబు లొకటియొకటికుష్ట్రికముల గళల గూర్భల జంఘులనాల్గుకాళ్ళసుళ్ళు................సుళ్ళుమొగిసి సాన మెగువ మూగి డెబ్బదియారుగాని హయమునకు మేనకంప.

చిత్తము సుడియడరాచునువిత్తుల సుడి పుత్రహరము వీపున సుడి దాహృత్తమునకు సరి హరికినికుత్తుక సుడియున్న హయమ్ము గొనరాచార్యుల్.

బీజములపై సుడియున్న తురగమును ఎక్కినరౌతునకు పుత్రనాశనమగును. కుత్తుకమీద సుడియున్నను ఆతురగము కొనుటకు తురంగశాస్త్రజ్ఞులు సమ్మతించరు.

కటమున శంఖదేశముల కన్నులకొల్కుల ప్రోధగండహృత్నుటముల కక్షమూలముల పుచ్చగుదంబుల్ క్రిందటన్ కకుత్తటముల కొక నాసనపదంబుల జంఘల జానుసంధులన్బటవగుసుళ్లు వింశతియు పైనను యారుమహోగ్రదోషముల్.

గ్రంథపాతమువలన యీ పద్యము నశించినది. అక్షరములు స్ఫుటముగ కాన్పించుట లేదు. అచ్చుపుస్తకముందున్న పద్యమున తప్పులు మెండుగ గానంబడియెను. అందుచే విడువబడెను.

కాకసమందు రోమజము గల్గినవాజియు రౌతు నాజిలోనూకి కళేబరంబు మరి నూల్కొనియుండగ జేరి యుగ్రపుం

గాకులు గ్రద్దలుం గరచి కండలు గుండెలు బీకిబీకి పేరాకలితోడ మ్రింగుభయదారనము ల్దిశలెల్ల నిండగన్.

హరికకుదంబుపై సుడి మనోదురితంబుగ సర్వసౌఖ్యసంహర మొనర్చు నట్టిసుడి యశ్వము గట్టిన నింట చుట్టినన్సురలకు విప్రముఖ్యులకు జూడక ముట్టగ యివ్వనొప్పు లేకరి రిపుడేలు రాజ్యమున కప్పుడె పారగ కోటలప్పగున్.

గుర్రమునకు మూపుర ముండవలసిన స్థలమున సుడియున్నయెడల నయ్యది మహాదురితములు గలిగించును. కావున అట్టి సుడి గల తురగ మిటచుట్టినయెడట కంటిదానిని చూడక విప్రుల కీయవలయును. లేదా శత్రురాజ్యమునకు దోలవలెను.

కక్షావర్త తురంగమునక్షీణబలంబుగల్గు నధిపతికైనన్నాక్షేణమ్ముల వానలనక్షయముగ దట్టవు నాభళాదిపకంపా.

కక్షావర్తమను సుడిగల తురంగము అధిపతికి నష్టము కలిగించును.

ఎదనొప్ప నంపవానలగదియుచు గురియించుననుచు ఘను లెవ్వరుంగదిసి కనువిచ్చిచూడరుహృదయావర్తంబు వాజి నెక్కందగునే.

హృదయావర్తమును సుడిగల తురగము నెక్కినచో శరపరంపరల జిక్కి, ఓటమి జెందుదుమని జను లెవ్వ రద్దానిని జూడరు.

జానువునందు సుళ్ళుగల సైంధవమున్ బాది నెక్కువాడు శోకావలదగ్ధగదేహుఁనడగు కాంక్షణచే యది శాల నుండినన్

మానకచో వైరినృపమార్గణరోగవిషాణ్నిలదాధీనుని జేసి రాజ్యసుఖహీనుని జేయుట తధ్య మేరికిన్.

మోకాళ్లను సుళ్ళుగల తురగము నెక్కినవాడు శోకదవానలమందు జిక్కి యుండును. అట్టిగుర్రము ఎవనిశాలలో నుండునో యాతడు చొంగల చేతను శత్రురాజులచేతను రోగాదులచేతను పీడించబడి రాజ్యసుఖదూరు డగును.

వెన్నున సుడిగలతురగముకన్నంతనె విడక యెక్క నడగుట యెల్లన్మున్నుగొని బహ్మరాక్షనుదున్న మహీజంబు నెక్క నుబ్బుట తలపన్.

వెన్నుపై సుడిగల తురగమును చూచినంతనే విడిచి పెట్టక ఎక్కుటచూడగా బహ్మరాక్షసుడు నివసించియున్న మహీజమును ఎక్కుటవంటిది.

హరికకుదప్రదేశముల నశ్వము రొమ్మున వాజి వెన్నునన్తురగము జానుదేశముల దోచినసుళ్లు మహోగ్రదోషవిస్ఫురణను దాని..........జూచి జలంబుల గ్రుంకు నట్టి భూసురులకు దానమిచ్చి పరిశుద్ధుడు గావలె కంపభూవరా.

బటువై యావర్తంబులుకటముల రెండెడల గల్గు గంధర్వము లుత్కటదోషకారి యది దాకటకటమున పతిని జమునికడ కనుపుజుమీ.

గండభాగములందు రెండుప్రదేశముల సుళ్ళుగల తురగములు ఎక్కువయైన దోషములు కలిగించవనియు శీఘ్రకాలంబున రౌతును యామ్యదిశానాథునిపురమున కంపును.

శంఖావర్తతురంగముసంఖ్యాతబలంబుగల్గు జనపతిసేనన్పుంఖానపుంఖశరములప్రేంఖితుగా జేసి యతని పెంపణగించున్.

శంఖావర్తనమను సుడిగల తురగమునెక్కిన రౌతుయొక్క చతురంగసేనలను చంపి అతనియొక్క పెంపు సంపద నశింపజేయును.

శోకావర్తతురంగముభీకరహాయకరిపదాతిబృందమునైనన్జీకాకు సేయుగానంగైకొన రత్తేజి రాయగండరగాలీ.

శోకావర్తననును సుడిగల తురగము గలిగియున్న సేన పరరాజులచే చీకాకునొందింపబడునని రాజులు అట్టిహయంబులు కొనరు.

పండితులు ఘోటకంబులుగండములనైనసుళ్ళు కర్తలకు మహాగండము లని హయవేదులుపండితసమ్మదము జూపి పల్కిరి మొదలన్.

గుర్రములకు గండభాగములందు సుళ్ళుండినయెడల యజమానునకు గండమగునని హయవేదులు జెప్పిరి.

దండముసుడి గల తురగముభండనమున నమ్ముతోడ బలుదెస ననుపున్చండమరీచీవలసన్మండలమధ్యప్రదేశమార్గము దూరన్.

క్రోడావర్తతురంగమువేడుక నెక్కంగగోరు వెఱ్ఱికి నోరున్

మూడుట నెక్కమయని మున్నాడిరి హయశాస్త్రవేదు ళౌబలకంపా.

క్రోడావర్తతురంగమును ఎక్కదలచువానికి నోరు మూయబడుట సంభవించును. అపజయము కలుగును. అన్ని హయవేదులైనవారలు దెలిపియుండిరి.

గ్రంథపాతము బాణనామకక్రిముల కాహారమైనది స్పష్టముగా గానిపించుట లేదు.

నాసాపుటమున ధృవులునుభాసిల్లెడు వాహ మెచట బంధురరోగవ్యాసంగునిగా చేయుటమోసంబది దానినెక్కు మూఢుడు గలడే.

ముక్కురంధ్రములసమీపమున సుళ్లుగల తురగమును ఎక్కజనదు. ఆతురంగము నెక్కుటవలన రౌతునకు రోగప్రాప్తియగును. ఎంతమూఢుడైనను దానినెక్కబోడు.

వ్యాధులచే గడుబాధించుచు నేత్రకూలు భవరోగములన్శోధకులు వినుడు మీరె విరోధము గావించు హయము భ్రూమిద్విముడున్.

నేత్రకూటములందు రోమములు గలిగిన తురంగము యజమానుని మనోరోగములచే పీడింపబడునట్లు చేయునని యెఱుఁగవలయును.

ఘోటంబుల సుళ్ళుండినఘోటంబుల పతుల మీరి కులము నణంచున్పాటించుచుండి నడచునుపాటించిరి శాస్త్రవిధులు బర్చరబాహా.

సులభగ్రాహ్యము.

ముకుదూలంబున నడుమునప్రకటితముగ రోమజంబుపాలిట్లిన ఘోటకము విభుమృత్యుదూతనిసకలతురంగజ్ఞులెల్ల చదివిరి మొదలన్.

ముక్కుదూలము యొక్క మధ్యను సుడియున్న తురంగము మృత్యుదేవతయొక్క దూతయని దలచి హయలక్షణవేత్తలు బలుకుదురు.

ఘనమగు దారిద్ర్యంబునమునగగ నెదగోరునట్టి మూఢుడు గొనుచోహనుజములు కొనుచునాహముననుపమమగు నారాయ మీనలాంఛితకంపా.

దవడలయందు రోమములుగల తురగమును దరిద్రముగోరుకొనువాడు దక్క నితరుడెవ్వడును కొనడు. మిక్కిలి దారిద్ర్య మొనగూర్చును.

కరగంబు మీదిపెదవిన్నిరతముగా రోమజంబు నిజమగుతల్లిన్సురరాజు జూడననుపునుచిరకాలంబుండనీదుసిద్ధం బధిపా.

తురగముయొక్క మీదిపెదవిపై సుడియున్న యెడల రౌతుయొక్కతల్లిని స్వర్గమున కంపును.

పొలియంచు వాజిప్రోధస్థలికిందటి మూడురోమజంబులలోపలిసుడి పతిజనకునివలపలిపతియన్న గనుమధ్యభాగము పతియున్.

గుర్రముయొక్క ముక్కుక్రిందను మూడు సుళ్లుండిన యెడల దాపలిసుడి రౌతుయొక్క జనకుని వెలుపలిసుడి రౌతు యొక్క సోదరుని మధ్యసుడి రౌతును సంహరించును.

పెదవులసుళ్ళు హయం బేవిధమున నిజభర్తసౌఖ్యవిభవము లెల్లన్నిధుబింబము నలరాహువువిధమున నది మ్రింగు దనకు వ్రగ్గైనయెడన్.

రెండు పెదవులందును సుళ్ళుండరాదు. ఉన్న యెడల రౌతుయొక్క సిరిసంపదలను చంద్రుని రాహువు కబలించురీతిని గబళించును.

కందము సుడిగలతురగమునిందింతురు తురగశాస్త్రనిపుణులు దానిన్డెందమును భీతి గల్గినముందర మనువారు వాజి మొన నెక్కుదురే.

మూపున సుడిగలతురగమును హయలక్షణవిదులైనవారలు గొననిచ్చగింపరు.

భావకులు వినుదుతురగముగ్రీవావర్తంబు మిగుల గీడై భువిలోనేవిధమున నారోహకుజీవంబున తిరుగనీదు సిద్ధంబు హరీ.

గీవావర్తమను సుడిగలతురగము రౌతునకు హానిసేయుచు పెక్కుదినము లాతని భూమిలో నిలువనీయదు.

మన్యావర్త తురంగమువిన్యాసము భర్తవంశవిభుప్రాణముపైఅన్యాయము తలచుట గుణధన్యాత్ములు దాని నెక్కదగగొన రెందున్.

మన్యావర్తమను సుడిగలకురంగము యజమానుని ప్రాణముల దీయదలచునని తలచి ప్రాజ్ఞులైనవార లద్దాని నధిష్టింపనొల్లరు.

మునుచెంపల రోమజములుగనుపట్టు హయంబు నెక్కగడుగుట యనిలోతనభటు డానుతథ్యమునెనుబోతును ప్రియముతోడ నెక్కుట కృష్ణా.

ముందరిచెంపలపై సుళ్ళుగలతురగమును యెక్కుట యుద్ధభూమికి భటసైన్యపరినృతుఁడై ఎనుబోతుల నెక్కి పోవుట వంటిది. అశుభకరము.

తక్కగ శత్రుక్షోభముమిక్కిలిగా జేముచుండు మేదినినిూదన్నిక్కంబై వాహనములప్రక్కల రెండేసిసుళ్ళు బర్బరబాహా.

గుర్రముయొక్క రెండుప్రక్కలయందును రెండేసి సుళ్ళుండినహయము తన యజమానునియొక్క శత్రువులు మిక్కిలిగా దుఃఖించునట్లు చేయును.

పెట్టెడసుడిగలతురగమునెట్టణరణవీధిలోన నిశితాస్త్రములన్పట్టించు రౌతు నప్పుడెజుట్టించును సర్జరీకుచంబుల కెలవిన్.

పట్టెడ పెట్టుచోట సుడిగలతురగము యజమానుని రణరంగమందు పట్టించి శత్రువుల కప్పగించును.

తక్కెడిరోమంబులపైజిక్కు నెడబాయనీక చెలువంబొందం

నొక్కించు కర్తసంతతిపుక్కిటసుడిగల్గువాజి పోకంబగునే.

సులభసాధ్యము.

గుదనాభింకటిశిలలనుదరంబుల సుళ్లుచేత నొపరినవాజిన్మదమణగ గడమకర్తలనుదురాయయ వేదనలకు నొప్పునజేయున్.

సులభసాధ్యము.

పెందొడల సుళ్లవాహముసందేహము లేక భువిని సమరావనిలోజిందంబూడిన విధమునబృందారక నుతులమీద పెలుచంద్రోచున్.

పైదొడలయందు సుడిగల తురంగము యజమానుని రణరంగమున చంపును.

బీజంబుల సుళ్లుండినజాజుల గొననొల్లరెట్టివారును భువి నత్తేజులు పుత్రశోకబ్రాజష్ణులజేయుగాన పరిహారంబుల్.

బీజములపై సుళ్లుగలిగిన తురంగములను యెవ్వరును గొనసాహసించరు. ఆగుర్రములు యజమానులకు పుత్రశోకము తప్పక కలిగించును. గావున వర్జనీయములు.

క్లేశయుబొందగ జేసెవినాశముగా వించుననుచు | నాగరికునిద్దేశంబు గలదు గావునగోశావర్తంబువాజి గొనరా దెందున్.

గోశావర్తమను సుడిగల తురంగము పలువిధములైన క్లేశముల నొందించి యజమానులకు నాశనము గావించునని పెద్దల పల్కులు కలదు గావున యట్టితురంగములను కొనరాదు.

నందనులు దాను పరమానందంబున నుండదలచు నరనాథుడు దాముందును వెనుకలనందిరువుల సుళ్లున్నహయల నవనిం గొనునే.

సులభసాధ్యము.

తక్కక మోకాళ్ళను నిరుపక్కల నుళ్ళున్ననాజిదెక్క విజయము గలదై యనుపునివిక్రమబడి ఘ్రోన్నమెల్ల నిరుపమకీర్తీ.

పద్యమునందు లక్ష్యము తప్పుగా నున్నది. అర్ధము స్పురించలేదు.

వాసముల సుళ్లు హరులందోషంబులు పుట్టుననుచు తొల్లిటి పెద్దల్వ్రాసిరి గావున దానినిదోసం బెంచగ నెక్కరాదు రతిరాజనిభా.

ముక్కుమీదను సుళ్లుగల హయమువలన దోషము లధికముగా జన్మించుననుచు పెద్దలు వచించియుండిరి కావున దాని నెక్కవలదు.

చెనటి గళావర్తపుహరిగొని వెరుపక యింట గట్టుకొని యుండెడి యాతనియింట మృత్యుదేవతయనయము కాపురము నిలుచు నది సంశయమే.

గళావర్తముగల తురంగరత్నమును భీతిలేక యెవడు తనయింట నుంచుకొనునో యాతనియింట మృత్యుదేవత నిలుచుననుట కేమాత్రమును సందియము లేదు.

కర్నహీను జేయగాదేని రవుతునుకర్ణరోగబాధకలితు జేయుచెవుల సుళ్ళు వాజి జిట్టని యెవ్వారునెక్కనేల వగల సొక్కనేల.

చెవులయందు సుడిగల తురంగము త న్నధిరోహించువానిని కర్నరోగముచే పీడించబడువానిగా నొనర్చును లేకున్న చెవులు లేనివానిగా జేయును. (చెముడు వచ్చును.)

కుష్టికముల జంఘల గళ కూర్చ జంఘ......సుళ్ళు గల్గు వాజి జొనిపియెక్కబోవువాడు జమునిపొడ గానబోవువా డనిరి శాస్త్రవిదులైనఘనులు.

గ్రంథపాతమున నర్ధము స్ఫురింపదు.

తనపతియు దాను నిక్కముననిలోపల నణగునని నహర్తి హయంబును దూషించిరి త్రికతలమన సుడిగలవాజి చందమున కంపనృపా.

నహవర్తియను సుడిగల తురంగము తన పతితోగూడ యుద్ధభూములందు గూలుదురని పెద్దలు వచించిరి. త్రికతలమున సుడి యున్నవాజిగూడ నట్టియవస్థనే పొందును. త్రికతలము - పృష్టభాగము.

మేలుదెస గీడి సుళ్లునుమేలు ధృవుల్ గీడుచోటు మేల్కొనియున్నన్

మేలుం గీడును జాయాసాళువ బిరుదాంక కంప జగతీనాథా.

పల దెసగెడు నలపై దాపలిదెస గోడిగలమేన న్రభవించుననుళ్ళెలమిన్ గీ డొనరింపవుకలియుగకర్ణావతంస గంపకుమారా.

అరయ ప్రదేశమధ్యమున యందు దొలంగక నిల్చియున్న రోమరుహఫలంబు నల్పమగు మధ్యమమైన ఫలంబు చూపు నాయిరుగడలం జనించు సుడి హీనఫలంబు డగ్రనోమజంబరుదుగ తత్ఫలంపుక్రమమాలిక రోమజు యెన్ని జూడగన్.

లక్షణములను లక్షణవర్తనములుచూచుచోటను మేలైన సుళ్లు మిగులసదృశ్యమైన యశ్వంబుగా జనును గొనగకాకయున్నను దప్పగు గంపభూప.

హరసిదళక్షేత్రంబులపరిపాటి యెరింగి హరులు సయిదోచిన రోమరుహఫలములు దాకెటిపరిహరణము జెప్పవలయు భావజ్ఞుండే.

లుధితమదలోభి పారగపరితగుణాంకిత మహాత్మ పబంధాననకఠినపుహృదయభూరుహకుఠారకఠారిరాయ గుణరత్ననిధీ.

ఉత్సవనాకాధీశ్వరవత్సలశరణాగతామృతస్తుతపరిచా

కాత్సంక్షోభితసుఖసందీత్సిమతీచాళ్లువాకధీ ప్రజ్ఞనిధీ.

సుఖవిబుధసుధామా సోమనిక్షిప్తహేమాప్రకటసుభగరత్నా ప్రాప్తరాజికయత్నాపకటసాధుమాజా సస్సురదౌరికాదౌప్రకృతితినికృతికారీ పారిజాతానుకారీ.

గద్యభైరవాచార్య పుత్ర మనుమంచి భట్టుప్రణీతమైనహయలక్షణవిలాసంబునందలి అవర్తలక్షణంబన్న ద్వితీయాంకురము.

Comments

Loading comments…