పీఠిక

అశ్వలక్షణసారము

క. శ్రీకరకటాక్ష విజయ, శ్రీకాంతా, కృష్ణరాయ సిద్ధకృపాణాస్వీకృతఫలసత్వర పర, భీకరభటయూథ కంపపృథ్వీనాథా.

శా. వేణుక్రౌంచమృదంగదుందుభిలసద్వేవేద్రనాగోల్లసద్వీణావారిద మంజునాదములకున్ వియ్యంబులై యొప్పునిక్వాణంబుల్ గలవాజి యిచ్చు పతికిం గల్యాణముల్ కంపనాక్షోణీపాలక సుప్రతాప శుభముల్ స్తోత్రైకపాత్రంబులున్.

ఉ. సారపు నీలమేఘములఛాయలు ఛాయలఁబోవనాడి యంభోరుహకోమలద్యుతికి బొమ్మల బెట్టి ప్రసన్నమై యంకూరరుచిప్రభావములఁ బోర జయించి మనోహరాకృతిన్వారణ నొప్పుమీఱునది వాజుల కెల్ల గుమారమన్మథా.

చ. అరయఁగ సర్వలక్షణ సమంచిత మైన తురంగరత్న మేనరునిగృహంబునం దొకదినంబున నుం దగురీతి నుండు నాపరమపవిత్రగేహమునఁ బాయక నిల్చు రమావధూటి శ్రీధరునియురఃస్థలింబలె ముదం బెసలారఁ బ్రసన్నచిత్త యై.

Comments

Loading comments…