అంకితము
చెన్నపురీ విలాసము
శ్రీరస్తు.
వేణుగోపాలస్సహాయ.
శ్రీమదభంగుర శ్రీతరంగిత మంగళ త్రిలింగదేశ
వసుధాంగనా శృంగార లలంతికాయమాన వల్లూరునగర
రాజధానీ వరభద్రసింహాసనాధీశ్వరులును
శ్రీమద్రాజా బహదరు జమీదారు ప్రభృతి విజయ-రు
సముట్టంకర ఢక్కావటుని-----
విశృంఖళ వివశ వివిధ దిగదీశ్వరులును
శ్రీమద్వేంకట నారసింహరాజేంద్ర ధర్మపరిగ్రహ
రాజ్యలక్ష్మ్యంబికాగర్భ-లధి రాకానిశాధీశ్వరులును
పట్నాలగోత్ర పవిత్ర నిర్మల బొమ్మదేవరవరవంశ
వారిజవాసరేశ్వరులును నగు
శ్రీమన్నాగమహీశ్వర మహేశ్వరుల --- వలన
నిజసభాలంకార హీరమణులగు మతుకుమల్లి నృసింహ
విద్వన్మణులచే ప్రణీతంబగు
చెన్నపురీవిలాసంబను ప్రబంధంబు
మహోల్లాసంబునం గృతియందుకొని లోకప్రఖ్యాతంబుగా
సకలజన మానసోల్లాసంబగునట్లు దుందుభినామసంవత్సర
శ్రావణమాసమున ముద్రింపబడిన దీనిని వారిపుత్రులును
పరోపకారవారీణులు నగు బ్రహ్మశ్రీ మతుకుమల్లి
రఘోత్తమశాస్త్రిగారిచే
ఏలూరు
మంజువాణీముద్రాక్షరశాలయం దచ్చువేయింపబడి
ప్రచురింపబడియెను.
1920.
Comments
Loading comments…