ఇరువదియొకటవవకధ

శుకసప్తతి

క. అని తెలుప విక్రమార్కుండనుపమ విస్మయతఁ బుష్పహాసుని మన్నించి నితాంతవిభవసౌఖ్యంబుననుండె న్వింటె వైశ్యభుజగద్వేణీ. 87

క. అని యిట్లు చిలుక పలుకన్విని మిక్కిలి వెఱఁగుచెంది వెసనంతటిలోఁదనచేతి గరలు కనఁబడఁజనియెఁ బ్రభావతి రహస్యసదనంబునకున్. 88

తే. కోమటిమెఱుంగుసిబ్బెపుగుబ్బలాఁడియంతిపురమున కరిగి సాయంసమయముగాంచి కైచేసికొని మహీకాంతసంగమాభిలాషంబుతోఁ జేర నరుగుదేర. 89

క. కనుగొని గుణసాగరుఁ డోవనితా చనియెదవె ధరణివల్లభుకడకుంజను మిఁక నొకథ వినుమనియనుచుం బలుకం దొడంగె నతివేడుకతోన్. 90

ఉ. అంగవసుంధరాభరణమై యొక పట్టన మంద మొందు మాతంగతురంగసద్భటకదంబశతాంగతతు ల్చెలంగఁగామాంగళికాభిధాన మసమానముగా వహించి యప్పురంబంగదనామధేయవసుధాధిపుఁదేలు నవేలసంపదన్. 91

ఉ. ఆనరపాలమౌళి కపరాంగము కైవడి నొక్క మంత్రి మేథానిధినాముఁడై తగు నతండు నిజాంగన జాయమానశో

భానుతశాంత శాంత యను బాలికఁగాంచి దివంబు కేఁగ సంతానముఁగోరి లోలయను తన్వి వరించి రమించె నంతటన్. 92

ఉ.ఆలలితాంగి కంటికిఁ బ్రియంబగు సొమ్ము ధరించి సేవకశ్రీ లమరించి జిహ్వకు రుచించు పదార్థము లాహరించి యేవేళఁ బ్రసూనతల్పముల వేడుకమైఁ బవళింపఁ గల్గుటంజాల మదించి జారజనసంగతికై తివురు న్మనంబునన్. 93

శే. ఇవ్విధంబున నప్పూర్ణిమేందువదనయన్యసంభోగసుఖలేశ మబ్బెనేనియాకసంబైన భేదించి యవలఁబోవునంతకుఁ దెగించియున్న యయ్యవసరమున. 94

క. వారింట దేవపూజాకారీత్వముఁ బూని వేదఖనియై వినుతాచారణుఁడై సద్గుణనిధిచారణుఁ డననొక్కబ్రహ్మచారి చెలంగున్. 95

క. ఈరీతినుండువానింజారణు లోపఱిచి యొకనిశావేళఁ దమఃపూరితమగు నొకయింటంజేరిచికొని యిష్టకామ్యసిద్ధిం గనియెన్. 96

క. కని యది మొదలుగఁ దద్రతిననుపమసౌఖ్యాబ్ధి నోలలాడుచు మరునిందనబంటుగాఁగఁ దలఁపుచుఘనతరగర్వమునఁ గన్నుఁ గానక మెలఁగెన్. 97

క. అంతఁ దనసవతిసుత యగుశాంతం బోషింప మఱచి చారణనిఘ్న

స్వాంతత్వముఁ జెందిన తత్కాంతామణి నడక లెల్లఁగాంచిన యదియై. 98

తే. శాంత శాంతల యయ్యును జతుర యగుటదీనికి భయంబు చూపినఁ గాని తనకుఁబోషణము లేదనుచు డెందమునఁ దలంచియోర్చికొనియుండి యంతట నొక్కనాఁడు. 99

చ. జనకునిఁ జేరి యాతనికి సంతసమయ్యెడు మాటలాడి సొంపెనయఁగ నీవుగాక మఱి యింకొకతండ్రి గలండు నాకుఁ బొమ్మని పలుకన్ వినిశ్చలతరాద్భుతుఁడై మదిఁజెందు సందియంబునఁ దలపోసి యాసచివపుంగవుఁ డెంతయు నాదరంబునన్. 100

తే. ఇంక నొకతండ్రి గలఁడంటి విందువదనయతనిఁ జూపెదవే యన్న నవ్వధూటిమంచిదని రేయి చూపెద నంచుఁ బలికియవలి కరిగిన నమ్మాట లాలకించి. 101

క. ఆలోలాంగన తగదుశ్శీలం బిది యెఱిఁగి పతికిఁ జెప్పఁగఁ బూనంబోలు నని తలఁచి మిక్కిలిజాలింబడి శాంతఁ బిలిచి సప్రియరీతిన్. 102

తే. అనునయించిన నబ్బాల యైన నేమినన్నుఁ బోషించెదేని యెంతయును దప్పదాల్తు నని పల్కె నింక నత్తరుణి జనకభావసంశయమెట్లు పాపంగవలయు? 103

క. అని పలికి యూరకుండినఁగనుఁగొని యూరుజసరోజగంధి విచారంబొనరించి తెలియఁజాలకవినిపింపుమటన్నఁ గీరవిభుఁ డిట్లనియెన్. 104

వ. అంత నిశాసమయం బగుటయు నమ్మేధానిధి విభావధీరితతమఃపుంజం బగు కేళిమందిరంబున లోలాసమేతుండై యుండి యబ్బాలికం బిలిచి ద్వితీయజనకుం జూపుమనిన శాంత యత్యంతమౌగ్ధ్యంబు దాల్చి తదీయఛాయం జూపిన నతండు నవ్వి లోలం జూచి యేతద్బాలికాలాపంబులకు నీయందు సందియంబుఁ జెందితి నని తద్వృత్తాంతం బంతయుఁ దెలిపి పతివ్రతాశిరోమణి వగు నీకిట్టిగుణంబులు పుట్టునే యని పలుకరించెంగావున నయ్యమాత్యకుమారికకుం గల నైపుణంబు గలిగినం గాక ధరణీభుజంగపుంగవునిసంగతికిం జనఁగూడునే యనునంతలోన నరుణోదయంబైనం ప్రభావతీలలితాంగి శుద్ధాంతంబున కరికి క్రమంబున దినావసానం బగుటయు. 105

శా. పన్నీటంజలకంబులాడి తొగబాబాపాదుశాకాయపుంజిన్నె ల్వ్రాసినచీరె గట్టి యపరంజిం జిమ్ము నెమ్మేనిపైమిన్న ల్గ్రమ్మెడు సొమ్ము దాల్చి మహిభృన్మీనాంకజన్యక్రియాసన్నద్ధత్వముఁ జెంద యందము రహించంజేర నేతెంచినన్. 106

క. అమ్మ ప్రభావతి రాజగృహమ్మున కరిగెదవె మంచి దరుగుదువు వినోదమ్మగుకథ వినియెదె యనికమ్మనిచక్కెరలు గెరలఁగా నిట్లనియెన్. 107

Comments

Loading comments…