ఇరువదిరెండవకథ
శుకసప్తతి
మ. అవనీమండలమండనం బయిన యార్యావర్తదేశంబునందు విరాటుం డనురాజు ప్రోవఁ జెలువందుం భద్రకాఖ్యంబురప్రవరం బొక్కటి యందు విప్రకులపారావారహాలాహలంబవు నీతం డన దేవలాంకుఁ డొకఁ డర్థాపేక్షమై వర్తిలున్. 108
సీ. అపరకర్మాగతంబైన వస్త్రమెగానిక్రయలబ్ధవసనంబు కానివావిపూటపూట పరాన్నభోజనంబేకానిప్రియభామనిజభుక్తి పెట్టుమందుదానలబ్ధంబైన తాంబూలమేగానిచేనున్నవీడెంబు చెడ్డయొట్టువితరణులైన భూవిభులవాకిలెకానియింక నిజాలయం బెదురుచుక్కగీ. గాఁగ నూహించు నప్పాపకర్ముఁ డెంతయర్థకాంక్షయొకాని ధనాఢ్యుఁడయ్యుజన్మఫలమైన యట్టిసంసారసౌఖ్యమనుభవింపంగజాలఁ డో యంబుజాక్షి. 109
మ. పితృకార్యంబున నొక్కనింట కడుతృప్తిం జెంది తత్పూజనాగతపుష్పాదులు ద్రోచి యార్ద్రరసనాంగశ్రాంతి దైన్యస్థితుల్జతగూడంగ నతండు గేహముల “బిక్షాందేహి" యంచున్ దరిద్రత గల్పించుచు తెచ్చి బైక్షము తుదిన్ గయ్యంబు సేయున్ పురిన్. 110
క. తొడిబడ నొకయింటితిథిన్తడవుగ నాపోశనంబు ధరియించి కడున్గడుపెద్ద దక్షిణిండనియొడబడినంగాని భుక్తి కొగ్గఁడు పడతీ! 111
సీ. గార్హస్థవరులు దక్షణయుంచు దుడ్డు కాసులు నిచ్చువానిపై సొరిది వైచునడిగి తెచ్చిన పోఁకలాకులు మాపటివేడుకకాండ్రకు వెల కొసంగుదీనమును ముష్టియెత్తిన ధాన్యములు దెచ్చిమారుబేరంబు కోమటుల కమ్మునలయక గూర్చి భైక్షాన్నంబు పరదేశవివిధమానవులకు విక్రయించుగీ. నొదవినంతయు టాకుసేయుట యకార్యమనఁగవచ్చునె లోకుల కైననేమియతఁడు దీలమీఁద వచ్చినయపుడు నైనరూక మార్పడు కమలవిరోధినయన! 112
సీ. మనసుకోరికదీర తనుపు నీతనిగాఁగఁదలచును యదె పిండదానమన్నఘననిదానముగన్న గతి నుచ్చి చంకలుదాటించు కార్పాస్థదానమన్ననరచేతి ముడువగా నది యెంచి యెందైనదవ్వేఁగు మహిషప్రదానమన్నచెలరేఁగి కుప్పిగంతులు వైచి చంగునదాఁటు నాలింగన దానమన్న
గీ. కాలపురుషాదిదానసంగ్రహణములకునెలమి వచ్చినవారితో కలహమాడియదను దప్పిన మరి పాళ్ళకైన బెనగునాశ బాల్పడి నవ్విప్రపాశవరుఁడు. 113
చ. సమయము వేచి యాద్విజుఁడు సంక్రమణగ్రహణాదిపుణ్యకాలము లరుదేర దర్భలు తిలల్ ధరియించినవాని మజ్జనప్రమదజనంబు లొల్లమని పల్కినమంత్రము లుగ్గడించి వీసముకడగాగ గైకొను నసహ్యతరొక్కము లెన్నఁడెన్నడున్. 114
గీ. వ్రతములందున చిననాటి వడుగటంచుదేవతోత్సవమని తండ్రితిథి యటంచువాతబేగులు మాన్ని యెవ్వారిగన్ననేటు నాతఁడు ధనకాంక్ష వీటిబోవ. 115
సీ. అన్నంబు వెట్టింపు నాఁకలిగంటినోయయ్యవార లటంచు నార్భటించుపరిహరించినఁబోక బహుసాహసస్ఫూర్తిఁబలిమిమీఱఁగఁ దల్పుఁబడగఁద్రోయుకూడకుండిన మదుర్ గోడ చెంగునదాఁటిబంతిలో కూర్చుని రంతుచేయుమెడఁబట్టి ద్రోచిన బడి చెయ్యి విఱిగెనోకూయంచు మొఱవెట్టు గోపునెఱపుగీ. నెట్టులయినను భుజియింప కెడసిబోవఁడాతఁడు పరాన్నభక్షణాయత్తుఁ డగుచుబ్రాహ్మణోత్తమజనసమారాధనంబుశిష్టనుతముగ గృహపతుల్ సేయునపుడు. 116
సీ. సంతలోఁ బ్రత్తి బిచ్చము లెత్తి నూఱాఱువగల జన్నిదములు వడికి వడికినికటకాననభూములకు నేఁగి మఱ్ఱియాకులు దెచ్చి విస్తరుల్ గూర్చిగూర్చిశాకపుబీజము ల్చల్లి బావులనీరుచేఁది పోయుచుఁ బైరు చేసిచేసివేకువ నంగళ్ల విక్రయవేళలజాఱిన మిరియంబు లేఱియేఱితే. యన్నియును విక్రయించి భార్యాకుమారముఖ్యు లాఁకట మ్రొఁగ్గిన మొగముఁజూడఁడాసపడి యేమి గోరిన నాగ్రహించుజందెములు దెంచుకొని తద్ద్విజన్మఖలుఁడు. 117
తే. ఇట్లు గడియించి ధనమెల్ల నింట నునిచియతఁడు పరలోక మెనయఁ దదాత్మజుండుగర్గుఁ డనువాఁడు కౌమారకలితుఁ డగుచుఁదరుణగాణిక్యవిహరణాదరణుఁ డగుచు. 118
సీ. కన్నెఱకంపుబింకముఁబోని నేయాలువెలఁబెట్టి బలుకు సుద్దులకు లొంగిరతులకు జాణబేరము లంచు చెలులచేఁబరికించు వన్నెచిన్నలకు మఱఁగివలచితిరోరి! యీవుల కేమియెడఁబాయవలదనుతక్కుమ్రొక్కులకుఁ జిక్కిసాకటి బిండుగల్ జాతరల్ మొదలుగాఁదలపెట్టి గొణుగువింతలకుఁ దగిలి
గీ.పోటు గడియించి రోసంబుఁ బొడమఁ జేసికలుపుగోలు వహించి పోకలకు నలరిగర్గు డడ్డంబు లేక బోగంపుఁజెలులకైవశముచేసె దనయింటఁగలధనంబు. 119
సీ. జోగి జంగంబు లెచ్చుగఁ బల్కులకు వాఁడుచెలరేఁగి లంజమందులకుఁ జల్లితముకు వేసినవెన్కఁ దాఁ జరించినఁ బట్టియునుపకుండఁ దలార్ల కొసఁగి యొసఁగికొండెము ల్జెప్పక యుండ విరాటభూవరుని వాకిటి చనవరుల కిచ్చి'దర్పకాకార! దాతలరాయ!' యని వెంటఁబడు బట్టువారికిఁ బాఱవైచితే. తగులుగా నిచ్చు పీటమర్ద విటచేటకులకును విదూషకులకు మేకోలు నడపితండ్రి గడియించినట్టి విత్తంబుపోవగుల్లగాఁడయ్యె నవ్విప్రవల్లభుండు. 120
తే. ఇవ్విధంబున లేమి వహించి గర్గుఁడప్పురము రోసి పరభూమి కరుగుచోటఁబ్రబలమగు నొక్కయగ్రహారమున నిలిచియతిపిపాసాబుభుక్షాతురాత్ముఁ డగుచు. 121
చ. సకలపురాణము ల్నిగమచర్చ లెఱింగిన వైదికాఖ్యుఁ డౌనొకగృహమేధి పిల్వఁగఁ దదజ్జ్వలమందిరసీమఁ జేరి యించుక తలవంచుచుం బెళుకుఁజూపులతో వెసఁబాద్యమిచ్చుతన్ముకురకపోలఁ గన్గొని కనుఁగవకుం బ్రమదంబు వొందఁగన్. 122
సీ. జాఱు పెన్నెరిగొప్పు జాతమన్యవశిలల్నించు చేపట్టుగావించు నేర్పుగిలుకుమెట్టెలు మ్రోయ కేకినీయానంబుదెలుపుచు శాకంబు దెచ్చు నొరపుపైటకొంగర వీడ బాహుమూలద్యుతుల్మించగాఁ గదిసి వడ్డించుఠీవికమ్మజోడసియాడ కలితకోకిలరుచుల్రాజిల్ల బెగడ మారడుగునేర్పుతే. పతికిఁ జాటుగ నిల్చి తప్పక మెఱుంగుసొలపుఁజూపుల బెళికిపోఁ జూచుదారిఁదియ్యవిలుకానిఁ దెచ్చి ప్రతిష్ఠ సేయఁగర్గుఁ డిష్టాన్నభుక్తి సోత్కంఠుఁడయ్యె. 123
వ. అయ్యవసరంబున. 124
సీ. మానసాజాతిశ్రమంబు దీటిత్తిసోగాంక్షించి నాపైని గాలి విసరెనటవీచరత్కేకి హర్షావహిత్థంబమర్చికోచాటంత మబ్బుదోఁచెపథికయూథములు ప్రాప్యగ్రామములు జేరనబ్ర మంబరమెల్ల నల్లిగొనియెకాంక్ష కన్గొను సైరికవితానములచూపుమిఱుమిట్లుగొన తీగె మెఱుపు మెఱసెగీ. తరుణు లధిపుల మై వ్రాల నురుము లురిమెచెలఁగి చాతకి నో రొగ్గ చినుకురాలె
నవని నేకార్ణవం బైనయట్లు జలమువెల్లువలుగాఁగ నొకమహావృష్టిఁ గురిసె. 124
తే. అపుడు వైదికుఁ డాగర్గు నాదరించివానతఱియయ్యె రవి గ్రుంకవచ్చె నింకనెందుల జనలేవు శయనింపు మిందె యనుచుఁదాను నాతఁడు సమయకృత్యములు దీర్చె. 125
తే. పవ్వళించిరంతఁ బనిదీర్చి దీపంబుమలఁపి యద్దగోడ మఱుఁగుగాఁగవైదికునిసుధాంశువదనయు శయనించెపచ్చవింటిరాయఁ డెచ్చరింప. 126
మ. గొనబుం బ్రాయము రూపసంపదయుఁ బేర్కొఁగల్గుట ల్మాటికిందనువీక్షించుట గర్గభూసురునిమీఁదం గోరుకు ల్మల్లడుల్గొనఁగా నేఁడొకనాఁటిమాత్రమున కీలోలత్వ మేలంచుఁ జెందినధైర్యంబునఁ గొంతసేపునకు నిద్రించె న్వరాకాంక్షియై. 127
ఉ. గర్గుఁడు దానిమేనియధికవ్యతిరూపములు న్విలాసనైరర్గళము ల్విలోకనపరంపరలుం దలపోసి చిత్తభూమార్గణభూమి నొంప నసమంబగు తామస మంకురింపఁగానిర్గతభీతి వైదికుఁడు నిద్రవహించుటఁ జూచి గ్రక్కునన్. 128
క. చని దానివీఁపుపైఁ గరమునుప న్మేల్కాంచి యాతలోదరి నాథుండని యొగ్గ నతఁడు తద్రతిదనిసి వెస న్శయనభూమిదండకు నరిగెన్. 129
క. అంతట నిశిసమయమునకునంతము గలుగుటయు గర్గుఁ డరుగం గని యక్కాంత నిజాధిపుఁ గనుఁగొనిసంతసమున సిగ్గు సాధ్వసం బొనగూడన్. 130
చ. పదరీతిరేమి రాత్రి నగుబాటని యెంచకవచ్చి యంతసేయుదురె గృహంబులో నితరుఁ డున్కి యెఱుంగరె సిగ్గు దాకదోమది మగవారలైనను సమస్త మెఱింగినయట్టివారికేదుది నొకవేళ నేమియును దోఁచదువో గద యెంచి చూచినన్. 131
క. అనిన విని నేను నిశి మేల్కననే లేదనుచు దానికాంతుం డిదిగర్గునికృత్యమె కావలెననిఘనమైన జుగుప్స వొడమఁగాఁ గుత్సించెన్. 132
తే. అప్పు డన్నాతి యేరీతి నాత్మమానభంగమాచ్ఛాదితంబు చేయఁగవలయుననఁ బ్రభావతి నన్నేమి యడిగె దవలికథ యెఱింగింపుమనిన శుకంబుఁ బలికె. 133
మ. అపు డమ్మానిని యథ్వనీనకృతధౌర్త్యప్రక్రియల్గాఁ దలంచిపతిస్వాంత మెఱింగి మోసము జనించెం జూచితే యింకమన్నిపుణత్వంబునఁ గాని యీవిభునిసందేహంబు పోదంచు డెందపుఁదమ్మిం దలపోసి యద్భుతరసానందంబుఁ గల్పించుచున్. 134
ఉ. కంటిరె యెంతవింత కలగన్నపు డెల్లను మీరు వచ్చి నన్నంటినయట్టులుండు నదియౌఁగద రాతిరి మిమ్ముఁ బాసి నే
నొంటిగఁ బవ్వళించుటకు నోపక చింత వహింప నంతలోగంటికి నిద్రవచ్చె గలగంటి భవద్రతి గల్గినట్లుగాన్. 135
తే. వామహస్తము నురముపై వైచి నిదురఁజెందుతఱిఁ గానికల గందు రందు రెందునవ్విధంబునఁ బవళించి యైనకలయగంటి భవదీయకారుణ్యగరిమవలన. 136
క. అని పలుకు దానిమాటలువిని నిశ్చయ మని తలంచె విభుఁ డోపద్మానన యంత నేర్పుగలిగినజనవచ్చు నటంచుఁ గీరచంద్రుండు పలికెన్. 137
గీ. ఆప్రభావతి బాగాయె నంచుఁ బలికిప్రాగ్దిశాపాండిమము గాంచి పడకయింటికరిగి పగలెల్ల ద్రోచి దినాంతవేళయధిపసంగమగుతుకమాస్యమునఁ దొలుక. 138
సీ. కలికి చేర్చుక్కయౌ గాదుగా కచభృంగభంగపాళికకోరపంక్తిగానికస్తూరితిలకమౌ గాదుగా ముఖపద్మసక్తశైవాలలేశంబుగానిరంగులరవికె నారాదుగా కులశైలగ్రసితనాగేంద్రత్వక్చయముగానిగతివన్నెచీరెయౌ గాదుగా తనువిద్యుతాభాదివారివాహంబుగానిగీ. కనకమేఖలయౌ గాదుగా నితంబనవ్యకటిదేశకృతతోరణంబు గాని
యనుచు వర్ణింపఁ గైచేసికొని యొయారమమరవచ్చెఁ బ్రభావతీహంసయాన. 139
మ. అపు డాచక్కెరదిండిపక్కిదొర యక్కా! నేఁటి కిమ్మేనిచొక్కపుశృంగారము వక్ష్యమాణకథజోన్ వింతయయ్యెన్ సుమీకృప దళ్కొత్తఁగఁ జిత్తగింపుమని యంగీకారముం గాంచి నేరుపు మీరం దెలుపందొడంగె పలుమారుం దేనియల్ చిందగన్. 140
క. సుజనాకరమగు నొకపురము జగజ్జేగీయమాన మొదవగ ముదితాగజరథమురుదురురయహయభుజవిజయసనాథసుభటభూయిష్ఠంబై. 141
క. ఆరాజథానియేలు గభీరుం డనునృపతి యతనిప్రియమంత్రి జరత్కారుఁ డన వెలయు నతనికుమారుఁడు గుణశాలి యనఁగ మాన్యతఁ గాంచెన్. 142
గీ. అతఁ దొకనాఁడు హరిశర్మ యనఁగబరఁగునొక్క తైర్థికుం డేతేర నొదవుభక్తినతని కిష్టాన్నసంతుష్టి యాచరించియర్హసంభాషణంబుల నలరఁజేసి. 143
క. అన్నియుఁ దొరగిన యట్టి ప్రసన్నాత్మా కలియుగంబు చటులాఘతదుశ్చిన్ను లగుజనుల కేక్రియనెన్నగ సద్గతులుగలుగు నెఱిగింపఁగదే? 144
Comments
Loading comments…