ఉపోద్ఘాతము

శుకసప్తతి

ఉ. కారుమెరుంగు రాచిలుక, కస్తురివీణ, పదారువన్నెలంగారము, రస్తుకుప్పె, తెలిగంబుర, వెన్నెలలోని తేట, యొయ్యారపుఁడెంకి, యందముల కన్నిటికిం దగుపట్టుగొమ్మ, సింగారపు దొంతి, యైనకులకాంత నయో యెడబాయనేర్తునే.(1 వ కథ)

సీ. పా. మంజులద్రుమలతాకుంజపుంజస్థలీఘుటఘుటార్భటిలుఠత్కిటికులము(2వ కథ)

క. కుముదబిలంబను నొకపురమమరు సురవ్యజనితధ్వజానీకమదభ్రమదప్రమదప్రమదాసుమదామకటాక్షజనితసూనశరంబై.(15 వ కథ)

సీ. వలుదలై మెరయు పార్వణపుముద్దలవంటివలిగుబ్బ లెన్నడు వచ్చికొందు... ... .... ......గీ. అనుచుఁ గోరుచు నవ్వుచు నాడికొనుచుసారె గేరుచు చూచినవారు వీనిపుట్టు కిష్కింధలోను గాఁబోలు ననగనాసుశర్మయు నాత్మగేహమున కరిగె.(14 వ కథ)

సీ. అవునషే నను వివాహము గమ్ము విద్వాంసురాల వయ్యెదవు శీతాంశువదన...(4 వ కథ)

క. కనుచాటుతిండి నడిపినపనులం గండలును బెరిగి బకుతండ్రి, హిడింబుని కొడుకన, గణనాథుఁడుఘనబలమున బిరుదు జెట్టికైవడి మెలగున్.....(10 వ కథ)

గీ. దాని నుతియింప దరమానె, తాటకావధూటితల్లియొ, పూతనతోడబుట్టొ...(17 వ కథ)

క. తగిలించుకొన్న పిమ్మటనిగిలించుటె కాని కార్య మేమున్నది...(11 వ కథ)

ఉ. అక్కట పొట్టచించిన నొకక్షరమైనను రాదు పెక్కులుండక్కులుగాని యమ్మనినడమ్మన నేరడు....(14 వ కథ)

సీ. "పోలిరెడ్డికి మగపోడిమి లేదుగా, గాది కేలాగున కడుపు నిక్కె?"“వదరకే మగవారు వచ్చెద రదె చక్క, జెక్కుకో పయ్యెద చెఱగుకొంగు"

“ఓసి లేవే మల్లి! వేసాలు సేయకు, మగవార లెరుగనిమర్మ మెద్ది"“నీ కేటి సిబ్బతినెరరాగవై మించి, యడగదొక్కినదాన వత్త గారి”“పెద్ది! విన లేదె! మనసుబ్బు పెరటి గోడదాటగా మామ గనె నట", "యేటి సుద్ది,యెసగి మగ డొల్లకున్న న దేమి సేయు,”ననుచు కసివోవ బలుమాట లాడికొనుచు.

గీ. చట్టితోఁ జట్టి పగులంగఁ గొట్టి తనదుపదరులకు నింటిబలుకుక్క లదరికూయనడరు భయమున గ్రుక్కుమిక్కనక వెనుకవెనుక కొదిగెడు తనప్రాణవిభుని జేరి.

"పొరుగింటి పద్మినీసతి, గిరుకుచు మట్టియలు గిలుకుగిలు కని నడువన్మెరమెరలు పుట్టవే కాఁ, పుర మేటికి మగఁడు పొట్టపోయకయున్నన్."

సీ. మన యమ్మ కడుసుఖమ్మున నున్నదే, యయ్య, పెద్దవాఁడయ్యెగాఁ, బేర్మి నతనిబోషింతురే మీరు పొరచూపు లేక నా, యరిది చెల్లెలి వచ్చి యత్తవారుతోడ్కొనిపోయిరే, దూరంబు గాన యే, వార్తయు వినము మావదినె నేకటని వింటి నే బిడ్డ గనియెనొ మగవాని, గనియెనో యది మేలుగాక యాడుదాననై పుట్టి మీము జూడ గాన కిట్టులేను బడుపాటు చాలదా, యెన్నడైనదలతురా నన్ను మీరు డెందంబునందునేల తలతురు, మరచిపోయితిరి నన్ను.

చ. చెలియలి పెండ్లి చేసితిరి, చిల్లరపబ్బము లెన్ని యైన శోభిలె నను నెన్నడైన బిలిపించితిరే పిలిపింపకున్న నేమలరెడుకూర్మినాఁడుపడు చాసపడుంగద యంచు పచ్చపోగులుగలచీర యంప నొనగూడకపోయెనె యేమి చెప్పుదున్.

గీ. ఇపుడు మీపుణ్యమున నాకు నేమికొదవయుండె నేను ధరింపగా, నొకరి కీయగలదులే యందులకు నంటగాదు మీదయాదాక్షిణ్య మిటువంటి దంటి నింతె.(15వ కథ)

సీ. మెలిపెట్టి చుట్టిన తెలిఫరంగిముడానుపై, లపేటాడబ్బుపనులు జెలఁగుబంగరువ్రాఁతలపట్టుహిజారు, కం, బరుచీనినిమతాని పాడు నొసలుతనుకాంతి గనుపింప దలిరు నంగీజోడు, వలిపెంపు శాలువ వల్లెవాటుబడుదలలోన డాబాకత్తివదలుపా, పోనులు గోరంట బొలుచుగోళ్లునడుమసీలున్నతోలు డాల్బెడగుసూపనభయముగ వెంట నరుదెంచు నభరువాఁడు

నమరు ముస్సైజుతేజుతో నరుగుదెంచెదారుణాకారు డైన యుద్దారుఁ డొకఁడు.

సీ. ఒడిలోన పంచాంగ ముంచుకొన్నది గాన కెటుపోయె ననుచు నూరెల్ల వెదకుపని లేనిపని వీథి జనుచుఁ గ్రమ్మరు నాత్మగృహ మంచు నెంచి యిల్లిల్లు దూరుఅపుడు భుక్తి యొనర్చి యపునషేసంకటితింటినా యని యింటితెరవ నడుగుకంతుమాయల నుమ్మెత్తకాయ దిన్న, పొలుపు సారెకు దెల్పు నప్పుడమివేల్పు.

సీ. అదలించి పిదుకనియావు లుండగ వేగ, దోహనధేనువు దూడవిడుచుబానలోపల పచ్చిపాలుండ మించి చే, మిరియిడ్డపా ల్పొయిమీఁద బెట్టుపేరి పక్వంబైన పెరుగుండ గవ్వంబు, పులిచల్లలో నుంచి చిలుకబోవు.

సీ. కావ్య నైపుణీ శబ్దగౌరవప్రాగల్బ్య, మర్థావనాసక్తి యతిశయోక్తినాటకాలంతార నయమార్గ సాంగత్య, సాహిత్య సౌహిత్య సరసముద్రసకల ప్రబంధవాసన సువాక్ప్రౌఢిమా,న్విత చతుర్విధ సత్కవిత్వధాటిలక్ష్యలక్షణగుణశ్లాఘ్యతాపటిమంబు, నైఘంటికవదానునయనిరూఢి.గనిన నీకు నసాధ్యంబె గణుతి సేయధాత్రి శుకసప్తతి యొనర్పఁ దాడిగోళ్లఘనకులకలాప కదురేంద్రు కదురభూపచెలగి వాక్ప్రౌఢిచే గృతిసేయు మవని.

Comments

Loading comments…