ఏఁబదిమూఁడవకథ
శుకసప్తతి
చలపట్టి దురితావళులె వ్రాయుచిత్రగుప్తులలెక్క హంసపాదులు ఘటించిమున్నుగా నమరించి యున్నదండనదాడియాతనసాధనం బవల ద్రోచిదండనోత్సుకవృత్తి దరిజేసియున్నట్టిపాశకోశము పటాపంచఁజేసిగీ. నన్ను రక్షింప వచ్చి తెంతటిమహామహుండవొగాని యిది యేల నుర్విమీఁదమిమ్మువంటి మహాత్ములు మెలఁగుటెల్లకూర్మి దీనుల రక్షించుకొఱకుగాదె? 164
క. అని చిలుక బలుకుచుండగనినుఁడు పూర్వాద్రిమీఁద నెక్కుట గనుచున్జనియె ప్రభావతి నిద్రాఘనపరవశనిమీలితాక్షికైరవి యగుచున్. 165
గీ. చారుకేళీనిశాంతంబుఁ జేరి నాఁటిరేయి రాజిల్కరౌతు గారించి రాజువలపుతో వచ్చు నాప్రభావతినిఁ జూచి“తేమనోభీష్టమస్త”ని తేనెలొలుకబలికె తక్కటికథ విన జిలుక యపుడు. 166
వ. అని యిట్లు గుణశాలి సన్నుతించి నీవెంట వత్తు ననిన. 167
చ. అనిన నతండు మేకొన కరాబ్జగృహీతతదీయపాణియైజనభయకారిఘోరవనశైవలిని పురవక్కణంబులె
ల్లను గనుసించికొంచు నచలత్వరమించఁగఁబోయిపోయి నూతనతరహర్షగద్గదవిధంబున నాతనిఁ జూచి యిట్లనెన్. 163
క. చెంగట గంటివె దక్షిణగంగాద్వారము గిరీంద్రకన్యాసదయాపాంగత్రిలోకము కాముకశృంగారమధ్యమై బుధివింధ్యంబున్.(?) 169
మ. తనరన్ గంటిరె వృద్ధశైల మిదిగాదా! కంతువిద్విణ్ణికేతనమౌ దక్షిణకాశి ముష్ణపురభూదారేశవాత్సల్యసంజనితానందత నిచ్చటన్ శివుఁడు లాస్యప్రౌఢి గన్పించు నీతని సేవించకయున్న తన్నగరియాత్రాసిద్ధి లే దేరికిన్. 170
క. మీరు చతుశ్శృంగములప్రకారమున గయాప్రయాగకాశీగంగాద్వారము లచ్చట నొక్కొకవారణమున వచ్చి నిల్చె వరవినయవిధీ. 171
మ. అని విన్పించి యతండు దాను వెస వృద్ధాప్రస్థలిం జేరి తెల్ప నశక్యంబగుసంతసంబు వొడయన్ పాతాళగంగానదిన్దనువుల్ ద్రోచి తదగ్రగర్భగృహవాస్తవ్యున్ సురస్తవ్యుశర్వుని సేవించి నుతించి వెల్వడి మనోరమ్యోక్తులై పోవుచున్. 172
క. ధీనిధి హరిశర్మ మహాజ్ఞానున్ గుణశాలిఁ జూచి సరసం గంటేయానందభవన మనియెడికానన మిది బరగు ఝల్లికావన మనఁగన్. 173
మ. సకలర్తుస్ఫుటమానసత్ఫలసమాజం బివ్వనం బక్కరశ్మికిజోటీయమి మధ్యపక్కణజనశ్రేణుల్ తటాకోత్కరా
బ్జకులంబుల్ ముకుళించుటన్ విరియుటన్ జేయున్ ప్రక్రియానికరాదాయపరాయణంబులను వింటే! వరాణ్నందనా! 174
సీ. వనరాశి యని డాగవచ్చినమైనాకధరముకైవడి గజోత్కరము దసరనతులసాలసమూహమగు టనంతర చరతురగాళియై మృగస్తోమ మలరపుండరీకాననంబుగదా యని వసించునంచలరీతి సింహములుఁ బొసఁగసత్పథత్వం బిచ్చి చలియించుకరిమ్రబ్బుతుటుములగతి కిటిసటలు వెలయగీ. కదసి చెలఁగె లతాడోలికావిహారిసౌరి బాలాంఘ్రినఖకాంతిచంద్రికాలికసితకాసారగంభీరగంధకలితపవననవనేయ మానందభవనచయము. 175
క. ఆనందభవనవని కెనయానందనవనము నెన్న నర్హం బగునే?కానం దలపఁగరాదనికానందగు సకలఫలనికాయాస్పదమై. 176
క. ఈవల కృష్ణయు నావలకావేరియుఁ గొలువఁ బలువగలఁ జెలఁగెడు నాశైవలి నీవల్లభుక్రియనీవనతల్లజము గంటివే! విలసిల్లెన్. 177
క. అదె కంటివె శ్రీముష్ణమునదెపో యక్కాంతి గోపురాగ్రనిరీక్షావిదళితదూరాగతకోవిదజనసంసారఘోరవిధతృష్ణంబున్. 178
సీ. ఈవనంబుల వెట్టి యింద్రపట్టణసీమహవణించు నందనం బయ్యె నేమొ?యీమేడలప్రమాణ మింతని పద్మజుండమరింప సురశైల మయ్యె నేమొ?యీయంగజులవస్తు లేమైన గిలుబాడయక్షేశునకు నిధు లయ్యె నేమొ?యీసరస్థితిఁ జూచి యెవ్వరో యీరీతినడరింప మానసం బయ్యె నేమొ?గీ. యీపురముతోడ జోడుగా నెన్నిమారులైన గావింప వైకుంఠ మయ్యె నేమొనంతపయిలేక నిది సేర నబ్బుటెల్లమన మొనర్చినభాగ్యంబు మంత్రితనయ! 179
క. ఏతన్మాత్రమె విభవసమాతత మిది దక్షిణప్రయాగ యనఁగ విఖ్యాతం బీశ్రీముష్ణంబీతరి సేవింపఁగలిగె నీశ్వరుకరుణన్. 180
మ. కనుఁగొంటిన్ ఘనమార్గలంబితచణాగ్రస్వర్ణకుంభంబుతోవనము న్నర్కవిమాన మచ్చటఁ జుమీ వారాహదేహంబుఁ జెం
జ్జనులన్ బ్రోచుచునున్నవాఁడు కరుణాచాతుర్యధుర్యంబుగన్. 181
చ. కనఁబడురంగుబంగరుతగళ్ళధగధ్ధగితప్రభానిగుంభనమున మించె బావనసమాజము జూచితె యచ్చటన్ వరాహుని భజియింప సత్త్వదివిజోత్కరమున్ వసియింపఁ దన్నికేతనమగు మేరుభూధర ముతానతదర్థము నిల్చెనోయనన్. 182
ఉ. అన్నియు నారయన్ బహుపురాగతతైర్థికసంకులంబులైయున్నది వీథు లేమిగతమో? యిది మాఘముగాదె? రేపుగాఁబున్నమ నేఁడు సుమ్ము మనపోత్రిశరీరునకున్ రథోత్సవంబెన్నగ నిప్డు పుష్కరణి కేఁగుట యుక్తము గాదె యిత్తరిన్. 183
క. అని పలికి యతని దోడ్కొనిచని యాతాయాతవివిధజనసమ్మర్దంబునకున్ లోఁగుచు మదిఁ బర్విన నివ్వెర నిత్యపుష్కరిణియున్ గనియెన్. 184
సీ. దూరాగతాత్మబంధువులు డాశిన వంశజేతలవావులు సెప్పువారునడయాడుచును భయం బడర నొండొరుకరంబులు గట్టిగాఁబట్టి నిలుచువారుచేపట్టు వదలుటఁ జెదరినతమవారిఁబేర్కొని బెట్టుగాఁ బిలుచువారునితరజనాహ్వాననుతికి తన్నామకులగుటనే నేమేమని యనెడువారు
గీ. స్నానతటగతజనపటాంచలవిగళితనీరసంకేశనికటవనీతలమునఁగడగి మునివేళ్ళ బట్టూఁది నడచువారుగలిగి తన రారు నిత్యపుష్కరిణి గంటె! 185
సీ. పూర్వభాగమున నద్భుతలీల జాహ్నవీగోదావరీనదుల్ గొండ్లి సలుపనగ్నికోణంబున యమునాసరస్వతీఝురీణులు నిండుగాపురముఁ జేయదక్షిణంబున సముత్కంఠతో నర్మదాసింధుస్రవంతులు సిరులు గాంచనిరుతిదిక్కున నిందితతామ్రపర్ణీకవేరనదులు వేర్వేరఁ బొసగగీ. పశ్చిమంబున తుంగయు భద్రయును సమీరునెడ కృష్ణవేణి కుబేరదిశమలాపహయు, భీమరథియు, హరాశ, రసయునెలమి భవనాశనియు నిల్వనిది సెలంగు. 186
చ. తటమహిజాతనూతనలతాగళితసవాశితోడి యుత్కటమకరందబృందములు దాల్చిన యర్ధవికస్వరాంబురుట్పటలము పద్మతోయములు బర్వగఁ బుణ్యసరఃకదంబమే కడాపట నరుదెంచి యిందు మునుగన్ వలకొన్నవిధంబు దెల్పెడున్. 187
సీ. ముసుకులతో వచ్చి మునిగెడు శుద్ధాంతకాంతలకస్తూరికమ్మవలపుబలుబరాబరులు బోల్పడవచ్చి గ్రుంకు భామినుల చొక్కపుఁదట్టుపునుగుతావి
గములుగా వచ్చి తానములాడు కర్ణాటసతులపాటీరంపుసౌరభంబుహితులతోడుగవచ్చి యీఁదెడి ద్రావెడపంక్తి మంజలికాపుపరిమళంబుగీ. తగులుకొని మించుకరులగంధములచేతతైర్థికావళి బడలికల్ తలగఁజేసితనశ్రమాపహనామంబు ధన్యతమముగా మిటారించె నిత్యపుష్కరిణి వింటె! 188
గీ. కమలమకరందరసమధ్యకన్యకాపుకారము వసించి నిత్యపుష్కరిణిజలమునడుమ నందంబునొందె కుందనపుతగుడులంటి దాపిన నవరత్నమంటపంబు. 189
సీ. ఎవ్వరి నని దాల్తు నే నటంచు విహంగవిభుఁడు చింతించి నావెనక కొదుగుదొర యెవ్వఁడని బరాబరి సేయుదు నటంచుసైన్యనాథుండు నిశ్చలతనొందునధిపుఁ డౌ సతండు రమ్మనిన జేరెదు నంచుబలవైరి దవ్వుదవ్వులనె వచ్చునాయకనిర్దారణాశక్తి జాలమినెత్తమ్మిచూలి నోరెత్త వెఱచుగీ. నెఱయు నీనిత్యపుష్కరిణీజలమ్ముమునిగి గ్రక్కున లేచినజనులశంఖచక్రపీతాంబరాదిలక్షణవిరాజమానవిష్ణుసామాప్యు లైనకతన. 190
క. ఈనిత్యపుష్కరిణికిఁ గృశానుదెసంగంటె దిగ్గజప్రవరాశాధీనత్వశరణచణశాఖానీకనిబద్ధమైన యశ్వద్ధంబున్. 191
క. ఈరావిఁ జూడు సాక్షాన్నారాయణమూర్తిసేవ నామాత్రశ్రీపారంపరప్రియదంబు విచారింపఁగ దీనిఁ బొగడ శక్యమె మనకున్. 192
క. అని దెల్పిన తదనంతరమున నయ్యిరువురును నిత్యపుష్కరిణిన్ గ్రుంకినవారై కోవెలకున్జని గరుడస్తంభనికటజగతి న్నేఁగన్. 193
క. సాష్టాంగనతులు సేసి ప్రహృష్టులజయవిజయుల న్నిరీక్షించి నిజాభీష్టము లొనగూడగఁ జనియష్టపురాగర్భగృహధరాంతరగతులై. 194
సీ. సపవిత్రనందతిత్ప్రపారితోహ్యంభోజుమహితపాదాబ్దు నమద్బిడౌజుదండెకఖండనోద్యద్బూరినిశ్వాసుకమనీయరుచిరసత్కనకవాసుశారదచంద్రికాచారుకాంతిశరీరునిగమాంతకేళీవనవిహారువిమలకటీతటీవిన్యస్తమృదుహస్తునతభక్తలోకావనప్రశస్తు
గీ. రుచిరవక్షోభిలక్ష్యసరోజగేహుధరణిసంభరణాసముద్ధరణదేహునవ్వరాహుని సేవించి యధికభక్తినతులవాచానిరూఢి సన్నుతు లొనర్చి. 195
శా. సుస్మేరంబగు నీముఖాంబురుహ మిట్లుం జూడగల్గెన్ మనోభస్మారంబులుఁ జెందనీయక పురాపర్యాప్తపాపౌఘముల్భస్మంబై చనఁజేసి భూరికరుణాపారీణతారూఢిమైయస్మద్ఘోరభవంబు బాపు మిక సర్వాంగీణపాండుద్యుతుల్. 196
క. అని వినుతించి రథోత్సవమును గన్గొని తద్వ్రతం బమోఘాదృతి చేసినవారై దమదేశముజనుచో నిరువురు దినాంతసమయమునందున్. 197
గీ. అనుచు కీరంబుఁ దెల్పఁగా నంతలోనప్రాగ్ధరాధరశృంగంబుపై సరోజబంధుబింబంబు జూచి ప్రభావతీరమణియు కేళీనిశాంతంబుఁ దనరఁజేరె. 198
ఉ. చేరి ప్రభావతీసుదతి చెల్వుగ నాటిదినాంతవేళ సింగారముమీఱ చారుకనకద్యుతు లంగమునందుగల్గ యొయ్యారముతోడ రాజసము నారయఁబోయెడు నాప్రభావతీసారసగంధిఁ జూచి రసచాతురిమీర శుకం బ దిట్లనెన్. 199
గీ. భళిరె! శేబాసు! యోవైశ్యపంకజాక్షి!యింత వేగిర మొంద నీ వేగుదెంచుటే నెఱుంగుదు తక్కటియైనకథయువినవలెనటంచు వచ్చితి వింతె వినుము.200
వ. ఇవ్విధంబున నవ్విప్రవరులు మఱలి నిజపురంబున కరుగు దేరునంత సంధ్యాసమయంబున. 201
క. ఒకపల్లెఁ జేరఁ జని యంతిక నటి తత్కాలవిధులు దీరిచి యెకశూద్రకు నడువన్ శయనించిరిశకకృతపురగమనమార్గజనితశ్రములై. 202
గీ. అప్పు డాయింట గేస్తురాలంగవిజితరంభరంభచతురిక యనుపేర ప్రబలుమగఁడుతాను పొరుగూరి కరుగ నితరు బిలిచికొని మనోజాతసంక్రీడఁ బెనఁగుచుండ. 203
ఉ. అత్తరి వచ్చె తత్పతిధరామరు లిద్దఱు దీనికౌశలోదాత్తతఁజూత మంచు సభయంబుగ నుండిరి లెస్స వింటివాబిత్తరి యప్పు డాహిమగబింబముఖీమణి బొంకు టెట్లు నీయుత్తమచాతురీగుణసమున్నతి నెంచెద దెల్పుమా యనన్. 204
గీ. అన ప్రభావతి శుకకులాధ్యక్ష! యింతగనగఁగల్గిన నేర్పరిగాను యేనుజాలు నులుకుట్టుమాటలజోలి యేలనవలికథ దెల్పు మనిన నిట్లనియె చిలుక. 205
క. చతురిక పతి వచ్చుట గనివెత గల్పించుకొని క్రూరవృశ్చికదష్టాస్థితి మాన్పెడుమంత్రజ్ఞునిగతి మంత్రింపుచు వసింపగా జేసి వెసన్. 206
క. ఇలు దెఱచివచ్చి నిలిచినచెలువునిపై వ్రాలి యేమి చెప్పుదు నీము
ద్దులమోము జూడఁగానకపొలుబాపుచు నుంటి తేలు బుడుకుటకతనన్. 207
ఉ. నాయతిఘోరవేదననినాదములన్ దయవుట్టి వీథిలోబోయెడునట్టి యీపరమపుణ్యుఁడు గ్రక్కున మంత్రశక్తిచేనాయువు నిల్పె నీతని మహాద్భుతసద్గుణ మెంచగాఁ దరంబే యిక నేల బిడ్డఁగని పేరిడఁగావలయున్ మనోహరా! 208
సీ. పడకఁ దెఱువరు లిద్దఱు బాపనయ్యలదిగొ చావడి బవళించి నిదురలేకయన్నియును చూచుచున్నవా రడిగి జూడుయెన్నిపాటులు పడితినో యిటకు మునుపు. 209
మ. అనినం దత్పతి జారునిం బొగడి నాప్రాణంబు రక్షించి తంచును పైపచ్చడ మిచ్చి వీడ్కొలిపె నచ్చోతద్వధూచాతురీజనితాశ్చర్యులు భూసురుల్ నిజనివాసప్రాప్తులై రంచు మెత్తనివాక్యంబుల చిల్క బల్కునెడ ప్రాతర్వేళ గావచ్చినన్. 210
గీ. కోమటి మెఱుంగు సిబ్బెపుగుబ్బలాడియంతిపురమున కరిగి సాయంత నాప్తిగాచి గైచేసికొని మహీకాంతుసంగమాభిలాషంబుతోఁ జేర నరుగదేర. 211
క. కనుగొని గుణసారుం డోవనితా జనియెదవె ధరణీవల్లభుకడకున్జను మిక నొకకథగల దదివిను మనుచుం బలుకఁదొడఁగె వేడుకబొడమన్. 212
శా. కావేరీతటిద్రావిడీనినదశంగాకాళికీకీచకీరావంబై యొకయగ్రహార మురువారం బందు నుద్యల్లస
ద్భావుల్ మిత్రుడు దేవదత్తుఁడును విద్యాశాలియాద్యుండనన్గా విఖ్యాతి వహించి భూదివిజలోకశ్రేష్ఠులై నల్గురర్ధావేళ స్పృహతం జరింతురుగకియ్యత్వంబు శూన్యంబుగాన్. 213
గీ. తద్ద్రవిణమెల్లగిలు బాడఁ దలఁచి ధూర్తవిప్రుఁ డొక్కండు వారల వెంటవెంటఁదిరిగి తన్మైత్రి వడసె విధేయనామధేయుఁ డరివంచనాపరాత్మీయబుద్ధి. 214
ఉ. అంతట పాండ్యమండలమునందు ద్రువాఖ్య నెసంగు మేదినీశాంతుఁడు భూరిదాన మొసగన్ సమకట్టిన విన్నవారలైసంతసమంది నల్గురు ద్విజన్ములు గూడి విధేయుతోడ నత్యంతరయంబుమై నరిగి రాదొరయున్నపురంబు సేరఁగన్. 215
వ. ఇవ్విధంబునఁ జేరి. 216
సీ. మంత్రీంద్రులకు వేదమంత్రపూర్వాశీర్వభాసురోక్తుల నిమ్మపండ్ల నొసఁగియధికారిచెంత వేదాంతభాష్యాదిమాంసాదిసంవాదమహిమఁ జూపిహితపురోహితు లున్నయిండ్లకుఁ బసపుపండ్లును గొనిపోయి బంధుతలు నెఱపివాకిట గొల్లల కేకతంబున ధర్మతత్త్వమార్గమును బోధన మొనర్చిగీ. యుడిగములవారికెల్ల మే మున్నవారమునుచు మంత్రాక్షతల నిచ్చి యనుసరించివారు సముఃఖంబు సేర్ప భూవరునిచేతఁగైకొనిరి నాల్గువేలరొక్కంబువారు. 217
గీ. ఇట్లు గైకొని తమయూరి కేఁగఁదలచిత్రోవ సరిగొట్టి దొంగలు ద్రోచికొనుటవింత మరిగొనిపోవ సువేళగామిహితుఁ డనెడిపేర నొకబచ్చుయింటి కరిగి. 218
క. ఈయెనిమిదిజాలలధనమీయెడ మీయింట నుండనిమ్ము పురంబున్డాయగఁ జని నేగనుగొనిపోయెద మిటు వచ్చి యనుచుఁ బొసగించి వెసన్. 219
గీ. ఇప్పుడు వచ్చిన యేగురు నిందువచ్చియడుగునప్పుడు గాని యీయర్థ మొసఁగవలదనుచు రొక్క మాబచ్చువానిచేతికచ్చి వానిల్లు వెలువడి యవలి కరిగి. 220
గీ. తెఱువుబత్యంబుసకు లేక యరుగఁదరమెయనుచు మిత్రాదులగునల్గు రాత్మఁదలఁచియలవిధేయుని బిలిచి నాల్గైదుమాడలడిగి తెమ్మని యడుగఁగా నతఁడు వోయి. 221
క. హితుఁ జేరి రొక్కమంతయునతిరయమునఁ దెమ్మటంచు ననిపిరి మావారతులితశూరసహాయులుజతగూడిరి పయనమునకుఁ జనియెద మనినన్. 222
గీ. అతఁడు గేహంబు వెడలి యయ్యవనిసురులనందఱిని జూచి యిత్తున యనుచు నడిగివార లిమ్మని పలుక నివాసమునకునరిగి యాతనిచేతికి నర్థ మొసఁగె. 223
ఉ. ఇచ్చుటయున్ విధేయుఁడు సుదీప్సితముల్ ఫలియించె నంచు లోహెచ్చినసంభ్రమం బురల నెప్పటినల్గురిగూడి కొంతదవ్వచ్చెడురీతి వెంటఁజని యంతట వారల కన్మొఱంగి తానిచ్ఛకువచ్చుతావునకు నేఁగె మహాజవ ముప్పతిల్లగన్. 224
ఉ. అంతట వానిగాన కపు డంపిననాలుగువేలరొక్క మాద్యంతము దెచ్చెనో జరిగెనోయని మిత్రముఖుల్ దలంచి యత్యంతరయంబునన్ మఱలి యాహితునింటికిఁ బోయి మాధనంబంతయు నిమ్మటన్న విని యాతఁడు వారలఁ జూచి నవ్వుచున్. 225
సీ. అపుడు మీ రంపఁగా వచ్చినట్టియతనిచేతికే మీఱ లిమ్మని సెలవొసంగధన మొసంగుట యెఱుఁగనిదారి బలుకదగునె యీసుద్దు లెల్లవర్తకులతోడ. 226
గీ. అనిన వారు రొక్కమంతయుఁ దెమ్మనియనుప లే దనంగ నతఁడు మీరలిమనంగ విత్త మిచ్చితినొ లేదొయస్య పెద్దమాట లయ్యె నపుడు. 227
క. మగువా! తిర్యక్కులజుండగుట న్నుతిలేక మించనాడితి నేరంబగు సైరించుట భవదీయగుణంబుగదా శమించి యవ్వలవినుమా! 229
క. ఆపాండ్యనృపతి విప్రాలాపంబులు హితునిమాటలున్ విని నరుగన్ప్రాపితముఖుఁడై కరుణాశ్రీపటిమన్ బచ్చువాని చేరన్ బిలిచెన్. 230
క. పిలిచి చెవులోన నేమోపలికిన నతం డలరుమొగము భాసిల్లగ రాజులదేవ యనుచు ధరణీతలనాయకుఁ బొగడి జనితదరహాసమునన్. 231
గీ. బ్రాహ్మణులఁ బిలచి నాయింటఁ బదిలపరచియున్నయది విత్తమెల్ల నాయొద్ద ననుచునపుడు మీచిన్నగతి నేఁగు రరుగుదెంచియడుగుఁ డిచ్చెద మాఱుమాటాడవలదు. 232
క. అన వారు మొగమొగంబులుకనుగొనుచు న్నిలువ ధరణికాంతుఁడు కరుణా
వననిధిగాఁ గాపునవారలననిచెన్ బహుధన మొసంగి యంభోజముఖీ. 233
క. ఆరాజవరునకుఁ గలనేరుపు నీకబ్బెనేని నృపలోకమణిన్జేరుమని చిలుక యనునెడవారిజహితుఁ డెక్కి పూర్వవసుధాధరమున్. 234
క. అపుడు ప్రభావతి తనయంతిపురమునకు నరిగి తమ్మితెగ నెవ్వగలన్తపియించువేళ వచ్చిననపరిమితానందమానసాంభోరుహయై. 235
శా. పన్నీటం జలకంబులాడి తొగలుం బాలాభిరేఖావళీచిన్నెల్ వ్రాసినచీర గట్టి యపరంజింజిమ్ము నెమ్మేనిపైమిన్నుల్ గ్రమ్మెడి సొమ్ము దాల్చి మహిభృన్మీనాంకజన్యక్రియాసన్నద్ధత్వము నొంది యందము రహించన్ జార నే తెంచినన్. 236
చ. కనుగొని పచ్చరెక్కపసగల్గినఫుల్గులరాయఁ డో కనత్కనకఛటాఛటాచకచకత్తనువల్లిక నేఁడు దెల్ప నీయనుమతిమీఁదగాని కథయంచు దలంకుచు విన్నవింతునాయని తదుదారకౌతుకకటాక్షనిరీక్షలు గాంచి యిట్లనున్. 237
ఉ. అంగవసుంధరాభరణమై యొకపట్టణ మంద మొందు మాతంగతురంగసద్భటకదంబశతాంగతతుల్ సెలంగఁగామాంగళికాభిధాన మసమానముగా వహియించి యప్పురంబంగదనామధేయ వసుధాధిపుఁ డేలును తేలుసంపదన్. 238
ఉ. ఆనరపాలమౌళికి వరాంగముకైవడి నొక్కమంత్రి మేథానిధినాముఁడై తగునతఁడు నిజాంగనజాయమానశో
భానుతశాంతపేరి యొకబాలికె గాంచి దివంబు సెంద సంతానము గోరి లోలయనుత న్వివరించి రమించె నంతటన్. 239
ఉ. ఆలలితాంగికంటికి ప్రియంబగుసొమ్ము ధరించి సేవకశ్రీల మఱంగి జిహ్వకు రుచించుపదార్థము లాహరింప నేవేళ ప్రసూనతల్పమున వేడుకమై బవళింపుగల్గుటన్చాల మదించి జారజనసంగతికై తివురుబ్బిగల్వగాన్. 240
సీ. రేయిదాల్చినవిరుల్ వ్రేలుగొప్పున జాఱనగుమోము జిగిమించ నదికి నరుగుపుక్కిటివీడె మబ్బురపునీటు ఘటింపకులుకు నెన్నడలతో గుడికి నరుగుపయ్యెద వీడ గుబ్బలనిగ్గు గనుపట్టనెమ్మితోఁ జుట్టము లిండ్ల కరుగుపావడపై వ్రాఁతపని జీర రాణింపకొమరుతో వనభోజనముల కరుగుగీ. నరుగుచో మంచిమగవాఁ డెదురనుపడగవనిత తగవాని నటు బిగాబగలఁజూచుసోగకడకంటి నెఱవాఁడి సొలపుఁదళుకుబెళుకుచూపుల నయ్యిందుబింబవదన. 241
గీ. ఇంట నేతెంచుచుట్టంపు టెమ్మకాండ్రతరచుగాఁ బిల్చితేర ద్రస్తరులు బలికితన్మనంబుల రాగకందళము లునిచియతిభయాతతమున వాఁడ నడలుపడతి. 242
సీ. దూతికపట్ల నెంతోమైత్రి పాటించిదానికి మన సిచ్చి తగులు నెఱపి
సఖియెడాటమున నిచ్చకముగా వర్తించిధాత్రియుఁగూడి మంతనములాడిప్రాతివేశిని దనప్రాణంబుగాఁ జూచిలెంకలతోడ మాలిమి యొనర్చిశిల్పినీరుదికి మచ్చికబుట్ట నడపించితనకు దాసాహాయ్యమును భజించిగీ. యత్తికామాతులసుతాదు లైనబంధుగంధసింధురగమనల గారవించియేయుపాయంబులను గోర్కె యెనయనేనితన మహాంతఃపురాధివాసనకుఁ గనలు. 243
సీ. తనివిదీఱఁగ నందతనయుతో రతికేళిఁబెనఁగిన గొల్లగుచ్చెతలమనువుచంద్రునంతటి నిండుజాణ కౌఁగిటఁ జొక్కితమిఁగడఁదేర్చిన తారబ్రతుకునేమగమిని యైనదేవేంద్రు నన్యునిగూడికాంక్షఁజెందు నహల్యకాపురంబుశివుగూడి తనివిఁగాంచినయట్టి దారుకావనమౌనికాంతలవర్తనంబుగీ. మెచ్చుగాక మఱేమి యీమేనియందుయనుభవించనిసౌఖ్య మే లనుచు వనితయింటిలోనుండి చావడి నెవ్వరైనసరసరీతిప్రబంధముల్ చదివిరేని. 244
ఉ. ఏవురతోడఁగూడి రమియించగ భాగ్యముఁ జేసెఁ గావునన్ద్రౌపది మెచ్చవచ్చునని తొయ్యలి సంతసమందునంతలో
నావిభుఁ డామృగాక్షికి నిజాధిపుతోడ సుఖంబుగల్గ దిచ్ఛావిధిఁ జేయు జారజనసంగతిగాకని యెంచు నిచ్చలున్. 245
గీ. ఇవ్విధంబున నప్పూర్ణిమేందువదనయన్యసంభోగసుఖలేశ మబ్బెనేనియాకసంబైన బేధించి యవలబోవునంతకుఁ దెగించియున్న యయ్యవసరమున. 246
క. వారింటిదేవపూజాకారిత్వము బూని వేదఖనియై వినుతాచారుండై సుగుణనిధీచారణుఁడన నొక్కబ్రహ్మచారి చెలంగున్. 247
గీ. గున్నయేనుంగు మదరేఖగూడినట్లుతావియామని కెనసి దారి ధవళశరుఁడు పదియాఱుకళలతోఁ గదియుకరణివాఁడు నానాట నిండుజవ్వనముఁ గాంచె. 248
గీ. అపుడు జారగవేషణాయత్తమైనలోలహృదయంబు వానియుద్వేలకాంతికవయవో లక్ష్యదేహంబు గాంచి నిలిచిత్రిమ్మటలు బట్టు బడలికల్ దీర్చుకొనియె. 249
సీ. మునుపటివలె నుండజనదుగా యికనొక్కచెలి బెండ్లియాడంగవలదె యనుచునితని కిత్తరి బెండ్లి యేటికి యింకభోగముచెల్వ లున్నారుగద యటంచుపఱచులేవారిచిత్తరముభావించి చూడగ క్రొత్తకోడెకాఁ డౌట యనుచు
వెఱవనేటికి నట్టివిద్యలచవియెఱుంగఁడుగాని చొరబారగలఁడటంచుగీ. నొంటిపాటునఁ బలికి యాయువిదయమ్మచెల్ల యీమాట లెవ్వరిచెవులఁ బడెనొయనుచు నాలుగుదిక్కులు నరిసిఁ జేరివాని నెమ్మది నొకవింతవలపు నెఱపు. 250
క. ఈరీతి నవ్వధూమణిచారణు లోఁబఱచి యొకనిశావేళ తమఃపూరితమగు నొకయింటన్చేరిచికొని యిష్టకార్యసిద్ధింగొనియెన్. 251
క. కని యదిమొదలుగఁ దత్యనుపమసౌఖ్యాబ్ధి నోలలాడుచు మరునిందనబంటుగాఁ దలంపుచుఘనతరగర్భమున కన్నుఁగానక మెలఁగెన్. 252
క. అంతట బాలామణియగుశాంతం బోషింప మఱచి చారణనిమగ్నస్వాంతత్వము జెందిన తత్కాంతామణినడక లెల్ల గాంచిన యదియై. 253
గీ. శాంతయును బాలయయ్యునుఁ జతుర యగుటదీనికి భయంబుఁ జూపినగాని తనకుఁబోషణము చేయదిది యని బుద్ధిఁ దలఁచియోర్చికొనియుండి యంతట నొక్కనాఁడు. 254
చ. జనకునిఁ జేరి యాతనికి సంతసమయ్యెడుమాటలాడి, సొంపెనయగ నీవుగాక మరి యింకొకతండ్రి గలఁడు నాకుఁ బొ
మ్మని పలుక న్వినిశ్చలతరాద్భుతుఁడై మదిఁ జెందు సందియంబునఁ దలపోసి యాసచివపుంగవు డెంతయు నాదరింపుచున్. 255
గీ. ఇంక నొకతండ్రిగల దంటి విందువదనయతనిఁ జూపెదవే యన్న నవ్వధూటిమంచి దీరేయి జూపెద నంచు బలికియవలి కరిగిన యమాట లాలకించి. 256
క. ఆలోలాంగన తనదగుశీలం బిది యెఱిఁగి పలికిఁ జెప్పగఁ బూనెన్బోలు నని తలచి మిక్కిలిజాలింబడి కొంతఁ బిలిచి సత్ప్రియరీతిన్. 257
గీ. అనునయించిన నబ్బాల యైననేమినన్ను బోషించెదేని యంతయును మఱపుఁదాల్తునని పల్కె నింక నత్తరుణి జనకభావసంశయ మెట్లు బాపంగవలయు. 258
క. అనిపలికి యూరకుండినకనుఁగొని యౌరవ్యజలజగంధయు ఘనచింతొనరించి తెలియఁజాలకవినుపింపు మటన్న కీరవిభుఁ డిట్లనియెన్. 259
చ. జలకములాడి జీని బురుసాజిగిచీరె ధరించి గుబ్బలన్గలప మలంది కన్నుగవ కాటుకరేఖ యమర్చి కస్తురిన్తిలకము దీర్చి భూషలును దేహమునందు నలంకరింపుచున్కలవలరాజుఁబోలు నరనాథుని జేరగ నేఁగు నత్తరిన్. 261
క. చని నాఁటిరేయి నరపతినెనయన్ దద్గేహసీమ నేఁగెడుదానిన్కనుగొని యనియెన్ గీరంబును దనపల్కులను నమృతముఁ గులుకంగన్. 262
క. కలహవిజృంభణబాహాబలనిర్జితశత్రురాజబలుఁ డతిలోకోజ్జ్వలచిత్రసేనుఁ డప్పురిచెలువొందగ నేలు చిత్రసేనుం డనఁగన్. 263
గీ. అతఁడు నాతనిదేవేరి నతులదివ్యలక్షణాకృతి సయ్యాదిలక్ష్మిఁ బోలివెలయు సుబలాంగనయు సముద్వేలలీలనేకకంఠత నిద్ధాత్రి యేలుటయును. 264
Comments
Loading comments…