కథాప్రారంభము
శుకసప్తతి
క. చండద్యుతినిభమణిమయకుండలున కజాండభాండకోదండకళామండలపండితదనుజాఖండలఖండనసమర్థఘనకాండునకున్. 81
క. భర్గేష్వాసనదళనానర్గళదృఢబాహువీర్యునకుఁ బూర్వవచోమార్గచరిష్ణుమునీశ్వరవర్గప్రణుతానివార్యవరచర్యునకున్. 82
క. షడ్వదనజనకసుమనోరాడ్వినుతచరిత్రునకును రాజద్గాత్రత్విడ్విజితాదిత్యునకు విరాడ్విగ్రహధామునకును రఘురామునకున్. 83
వ. అభ్యుదయ పరంపరాభివృద్దిగా నాయొనర్పంబూనిన శుకసప్తతి యనుమహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. 84
క. వెలయు నలఘుప్రభావోజ్జ్వలుఁ డింద్రప్రస్థపురి నసామాన్యమహఃకలితదృఢబాహుబలనిర్దళితాహితరాజు ధర్మరాజు ధరిత్రిన్. 85
చ. అతఁ డొకనాఁడు నిండుకొలువై బలవైరిమహోన్నతి న్మరుత్సుతుఁడుఁ గిరీటి మాద్రితనుజు ల్తనదండన యుండి కొల్వ రాజతతికిరీటకోటివిలసన్మణిమంజులదీప్తిపుంజరంజితచరణుండు ధర్మజుఁడు చెంత వసించిన ధౌమ్యు నిట్లనున్. 86
క. తెలివి గలభూసురుండవుకులగురుఁడవు మాకు మౌనికుంజర! వినుమీయలఘుమతి నొక్కకార్యముతెలియ న్వివరింపవే సుధీజనతిలకా! 87
ఉ. భామలచిత్తము ల్దెలియ బ్రహకునైన వశంబుగాదు తత్కామితయత్నము ల్తలఁప ధాత్రి విచిత్రము లండ్రు కావునన్నామది యేతదీయకథనంబు వినం గడఁగె న్మహీసురగ్రామణి! యానతిమ్మనుఁడు రాజబిడౌజునితోడ వేడుకన్. 88
వ. అప్పు డాభౌమ్యమహర్షివర్యుండు నిరవధికకుతూహలధుర్యుం డై యిట్లనియె స్త్రీజనంబుల చిత్తంబులు లోకాతీతదుర్వృత్తంబులు, తదీయకృతసాహసకార్యంబు లనివార్యంబు లగుట నిక్కువం బిందులకు నొక్క యితిహాసంబు గలదు. తొల్లి మహాదేవుండు పార్వతీవరారోహ కతిరహస్యంబున నానతిచ్చినతెఱం గెఱింగించెద సావధానుండవై యాకర్ణింపు మని యి ట్లనియె. 89
సీ. సౌథాగ్రతలకేళిజాగ్రన్మృగేక్షణాస్ఫుటదృశ్యమానేంద్రపురవరంబుజగతీదిదృక్షుభౌజగవర్గనిర్గమద్వారాయితన్వచ్ఛవారిఖేయమబ్జినీకాంతశుద్ధాంతీభవత్ప్రాంతసంతతోదారకాసారవారమిందిరాసుతభవ్యమందురానీకరమ్యామోదకారణారామసీమ
తే. యంద మగు మేరుమందరాహార్యమధ్యతలమహీమండలమున నుద్దామభీమమేదురోద్భటభటసింహనాదచలితదిగ్గజవరంబు పద్మావతీపురంబు. 90
క. ఆనగరి న్విభవప్రతిభానగరిపుఁ డైన చిత్ భానుం డేలున్మానక మృడుకరడమరు సమానకరవ మరుల గిరులయఱుఁతం జేర్పన్. 91
మ. కలలో నైనను బల్కి బొంకఁడు సమగ్రక్రోధయోధారిరాడ్బలముం గన్గొని చీరికిం గొనఁడు దుష్పాండిత్యము ల్నేరఁ డుజ్జ్వలదుజ్జృంభశుభాంగవైఖరుల ఠేవన్నూత్నకందర్పుఁ డైతలఁపం జొప్పడుఁ జిత్రభానుఁ డతఁ డేతన్మాత్రుఁడే చూడఁగన్. 92
సీ. చంద్రమతీనాథుచందాన నలునివైఖరిఁ బురుకుత్సునిగతిఁ బురూరవునిమాడ్కి సగరులాగునఁ గార్తవీర్యునియనువున గయునట్టు లంబరీషుపొలుపున శశిబిందువలె నంగుపోలికఁబృథునిభాతి మరుత్తురీతి భరతుకరణి సుహోత్రునిహరువున రఘులీలరామునిక్రియ భగీరథునిఠేవతే. శిబితెఱంగున మాంధాతచెలువమున యయాతిరీతి దిలీపుమర్యాద రంతిసరణిఁ బాలించి యలరు నాచక్రవాళవసుమతీచక్ర మమ్మహీవల్లభుండు. 93
మ. అకలంకప్రతిభాప్రతాపవిభవుం డా రాజకంఠీరవుండొకనాఁ డంతిపురి న్సువర్ణవలభిప్రోన్మీలమై కెంపుమానికపుంబొమ్మల నొప్పు పెండ్లిచవిక న్నీలంపుఱాగద్దియంబికవాణీనికరంబు గొల్వ సుముఖాప్తి న్నిండుకొ ల్వుండఁగన్. 94
క. ఇఱుకువలిగుబ్బచన్నులయెఱుకుం జవరా లొకర్త యెఱుకో యవ్వాయెఱుకో యని తనచందంబెఱుకపడంగా హజార మెలమిం గదిసెన్. 95
వ. అప్పు డప్పడంతుకతెఱం గమ్మహీంద్రుండు పరిచారికాజనంబులవలన విన నవధరించి సమ్ముఖమునకు రావించిన. 96
సీ. సవరనిపనివన్నెఱవిక పిక్కటిలంగఁగులుకు పాలుబ్బుగుబ్బలు చెలంగముంజేతులను ముఖాంబుజమున నొకవింతపొలుపు దెల్పెడు పచ్చబొట్టు లెసఁగఁగుఱుమాఁపుపయ్యెంటచెఱఁగులో నిడుకొన్నముద్దుఁబల్కులచిన్నిబుడుతఁ డమరఁదరతరంబులనుండి తనయింట వెలయు పుత్తడిపైఁడిబుట్టి మస్తమున వెలుఁగతే. బొమలసందున నామంబుభూతిపూఁతనెన్నొసఁటఁ బుక్కిట విడెంబు కన్నుఁగొనలఁగాటుక రహింప వచ్చి యాక్ష్మాతలేంద్రుచరణముల కోరగా మ్రొక్కి చక్క నిల్చి. 97
క. ఇవి దారికట్టు మొనకట్టిది కాంతావశ్యకరణ మిది నీమది కిం
పొదవించు నోనరేశ్వర!పదిలం బని తెల్పి కొన్ని బదనిక లొసఁగెన్. 98
క. తలఁపున నిది గారడ మనితలఁపకుమా సింగఁ డల్లతఱిగొండ దరిన్దలమోచి తెచ్చినవి యివితలనుంచుము పసిఁడితాయెతల నుంచి నృపా! 99
వ. అని విన్నవించిన యమ్మత్తకాశినీకరాంబురుహదత్తం బగు నయ్యుత్తమదివ్యౌషధత్రయంబు రయంబునం గ్రహించి కరుణావలోకనపరుండై ప్రియవినయగంభీరభాషణంబుల నిట్టు లనియె. 100
శా. ఏయేభూములు చూచినావె కొరవంజీ రూపలావణ్యరేఖాయుక్తిం దగు కొమ్మ లెందుఁ గల రీక్ష్మామండలిన్ హావభావాయత్తైకవిలాసవైఖరుల మేలం దెవ్వరిం జెందు నయ్యాయావార్తలు తెల్పవే మది కమందానందముం జెందఁగన్. 101
వ. అనిన విని యితండు చతుర్విధనాయికానాయకుండును బహువిధశృంగారశేఖరుండును సకలకలాధురంధరుండు నగు నని తనమనంబున వితర్కించుకొని యతని కిట్లనియె. 102
సీ. కల్కిచిల్కలపోల్కిఁ గనుపట్టు శృంగారనటన గుల్కెడుతూర్పునాటి చెలులఁబులుగడిగిన ముత్యములఁ బోలి గరగరికలు వహించిన పాండ్యకమలముఖులఁజిత్ర రేఖలఁ దారసిలుచక్కఁదనములరాణించు కన్నడరాజ్యసతుల
బగడంపు జిగిసొంపు తగుతనుద్యుతి పెంపునలరెడు యవనశీతాంశుముఖులఁతే. గుందనంపుసలాకలయంద మొందునంధ్రకన్యల నిదిగాక యంగవంగకుకురుసౌవీరసౌరాష్ట్రకోకకుచలవింతలన్నియుఁ గనుఁగొంటి విను నరేంద్ర! 103
తే. దేవ నవఖండమండల శ్రీవిజృంభమాణ మగునివ్వసుధఁ గల్గుమానవతులవరుస నందఱఁ గనుఁగొంటి వారిలోనరేఖ గలయొక్కచెలి నేర్పరింతు వినుము. 104
ఉ. ఈనగరీవతంసముననే తగువైశ్యుఁ డొకండు శాశ్వతశ్రీనిధిగేహుఁడై మదనసేనుఁ డనంగలఁ డద్బుతైకశోభానవమోహనాకృతి ప్రభావతి వానిపురంధ్రి యొప్పు నోమానవతీమనోజ! యసమానవయఃపరిపాకవైఖరిన్. 105
మ. దాని ఘనాఘనద్యుతివితానకనద్ఘనకేశపాశముందాని లసద్బిసప్రసవధాళధళీచకితేక్షణంబులుందాని సుగంధగంధిలసుధారసబంధురమందహాసమున్మానవనాథ! మెచ్చుటకు మర్త్యు లమర్త్యలునైన శక్తులే. 106
క. ఆమృదులోరువిలాసంబామోహనముఖవికాస మాదరహాసంబామెడ యానడ యాజడయామేని మెఱుంగురంగు నలవియె పొగడన్. 107
సీ. భుగభుగ వాసింపఁ బొసఁగు పుత్తడిబొమ్మమాటాడనేర్చిన మణిశలాకకలికిచేఁతలనొప్పు కమ్మక్రొవ్విరిబంతితగుజీవకళల చిత్తరువుప్రతిమగమనశృంగారంబు గనుపట్టు లతకూనకలదొలంగని తొలకరిమెఱుంగుకరచరణాంగసంగతి గన్నశశిరేఖహావభావములఁ జెన్నలరు సరసితే. యగునని గణింప బినుతింప నలవిగాదుదానిచరణాబ్దనఖరేఖతోను బోలఁగలరె యీలోకమున నున్న కాంతలెల్లవిను మహీనాథ యేమని విన్నవింతు. 108
క. ఒకపాటి పేదసంసారికిఁ దగ దమ్ముద్దుగుమ్మ రిపురాణ్మణిమస్తకమకుటఘటితనవరత్నకళాచకచకితచరణునకుఁ గాక నృపా! 109
క. అని విన్నవించినంతనెమనమున నుప్పొంగి వైశ్యమహిళానవమోహనరూపరేఖవిభవమువిని విస్మయ మంది మోహవిహ్వలమతి యై. 110
తే. ఎఱుకవగలాఁడి కోరినవెల్ల నొసఁగిప్రియవచోవైభవంబు గాన్పింపఁ బనిచికొలువు చాలించి బోటిక ల్గొలువ నంతిపురి నొకానొక మణిసౌధమున వసించె. 111
ఉ. అంతట నవ్వణిగ్వరుని యంగనపైఁ దమి హెచ్చి యామహీకాంతపురందరుండు రతికాంతధనుర్లతికావిముక్తదుర్దాంతశరాళికి న్మదమరాళికిఁ జండతరాళి కెంతయుంజింతిలి వేదనావశవిశీర్ణమతి న్విరహార్తి నొందుచున్. 112
సీ. చెక్కిటఁ జెయి నేర్చి చింతాకులాత్ముఁడైవనిత నేక్రియఁ దెత్తునని తలంచునిట్టూర్పు నిగిడించు నేఁ డయో శుకపికార్బటి కోర్వలేనంచుఁ బలవరించుఁదనలోన తానేమొ తలయూఁచుకొని మెచ్చుంగలవరించుచు బయ ల్గౌఁగిలించుఁజిత్తరువుననున్న చెలువంపుఁబ్రతిమ నల్లదె ప్రభావతి యంచు మదిఁ దలంచుతే. నించు విలువంచి విరితూపు లేర్పరించిపచ్చవన్నియచిల్కబాబావజీరుఁడుల్ల ముల్లోలముగఁ జేయఁ దల్లడించురాజముఖిమీఁదిబాళి నా రాజమౌళి. 113
ఉ. ఎప్పుడు చూడఁ గల్గునొకొ యిందుముఖీవదనారవింద మేనెప్పుడు విందునో తెలియ దేణవిలోచన కల్కిపల్కు లింకెప్పుడు గౌఁగిలింతు నలయింతి కుచాద్రులురంబు సోఁక నాకప్పుడుగాదె సౌఖ్యపర మందుటలంచు మదిం గణించుచున్. 114
క. ఉల్లము బెగడ ధరిత్రీవల్లభుఁ డి ట్లున్నవేళ వనితామణులందెల్లగుణంబుల కిరవగుపల్లవి యను పేరుగలుగుభామ సుబుద్ధిన్. 115
సీ. వసుమతీశ్వరుఁ డున్న దెసఁ జూచి పావడచెఱఁగున నెమ్మోము చెమట దుడిచిసిగ పొందుగ నమర్చి చిన్నారివిడికెంపుతాయెతు ల్చుట్టి కుళ్ళాయి వెట్టిచెవులయంటులఁ జక్కసవరించి ముక్తావిచిత్రహారంబుల చిక్కుఁ దీర్చికలపం బలంది బంగరుగట్టికమ్ములవలిపెదుప్పటి వలివా టొనర్చితే. కేలుదమ్మికిఁ గపురబాగాలుఁ బండుటాకుమడుపులు నొసఁగి లోకాభిరామవార్త లొకకొన్ని నొడివి యప్పార్థివేంద్రుఁబలుదెఱంగుల నలరించి పలికె నపుడు. 116
క. స్వామి యవధారు మీమదిఁగామించు మనోరథంబుఁ గడతేర్చెద నింకేమిటికిఁ జింత యన వినిభామామకరధ్వజుండు పల్లని కనియెన్. 117
తే. వైశ్యభామిని లావణ్యవైభవంబువిని విరహవార్ధి మునుఁగున న్మనుప నెట్టులంటు చేసెదో యమ్మచ్చెకంటి ననుచునిచ్చక మొనర్చి యుడుగర లిచ్చి పసుప. 118
మ. చని యప్పల్లవి వైశ్యవల్లభుని భాస్వద్దివ్యగేహాంతరంబున వర్తిల్లు ప్రభావతిం గనఁ దదంభోజాక్షి రాజావలంబనసౌభాగ్యము గన్నధన్యవు ననుం బాటించి యేతేఱ నేమి నిమిత్తంబొ యటంచు నిర్మలసుధోర్మీవైఖరిం బల్కినన్. 119
క. నినుఁ జూడఁగోరి వచ్చితిననవుడు సంతోషమయ్యె నని మణిపీఠిందను నిలుప రాజదూతికయనియెఁ బ్రభావతికి సముచితాయత్తమతిన్. 120
తే. ఎల్ల సౌభాగ్యములు గలయింట వెలసిమిగులఁ జక్కనివారిలోఁ దగినదానవగుదు నీ బంధుజనము ని న్నభినుతింపఁగాఁపురము చేసితివి మేలు కమలగంధి. 121
వ. అదియునుం గాక పురాణదంపతు లగునీయత్తమామల సుమతిహరదత్తుల నాదరించు నీవివేకంబునకు మెచ్చితి సాక్షాన్మనోజుం డగు నీమనోహరున కనుగుణం బగునంతరంగంబునకు సంతోషించితి గురుబుధబాంధవదాసదాసీజనంబులం బోషించునీమహత్త్వంబుఁ గొనియాడ శక్యం బగునే యని వెండియు. 122
సీ. గుట్టుతో సంసారి మట్టునఁ జుట్టాలఁదనియింతు వని హరదత్తుతోడఘనురాల చల్లనికడుపుదానవు నీవుసుకృతశాలిని వంచు సుమతితోడమదనసేనుఁ డనంగ మఱి నీకే తగు నెంతచెలువుఁడ వని దానిసెట్టితోడవిశ్వాసమున నింట వెలయుపాటెల్లఁ బూనెద రంచుఁ దగిన బానిసెలతోడతే. నిచ్చక మొనర్చి హితవరియేపు చూపిచొరవ గల్పించుకొని పరిశుద్ధురాలి
వలెనె తాఁ బోనిచో సారెపిలువనంపుమచ్చిక యొనర్చె సమ్ముదిమాయలాడి. 123
క. అంత నొకనాఁడు రజినీకాంతశిలాఘటితవేదికామధ్యమునంగొంతతడ వుండి తగనేకాంతం బగువేళ వైశ్యకామిని కనియెన్. 124
క. ఓమధురవాణి నీమనువేమిటనుం గడమ గాక యెంతయు నొప్పెందామసుఁ డగువాగ్వనితాకాముం డొకకొంత కొదవ గల్పించెఁ గదా! 125
వ. ఆది యె ట్లంటేని. 126
సీ. బింబోష్టి నీచంద్రబింబాననము వానిబెడఁగునోటను ముద్దువెట్టఁదగునెకాంత నీ సిబ్బెంపుగబ్బిగుబ్బలు వానిపరుసు చేతుల నొ త్తిపట్టఁదగునెయబల నీకనకోపమాంగవల్లరి వానికఱకుమే నంటంగ నొఱయఁదగునెరామ నీమధురాధరప్రవాళము వానివికటదంతముల కొప్పింపఁదగునెతే. కొమ్మరో కుందనపుఁ గీలుబొమ్మకరణినొఱపుగలదాన వీవు వానరమువంటిమగనితోఁ గూడి రతికేళిఁ బొగులఁదగునెతగదుగా ధాత యీరీతి తగులు సేయ. 127
తే. తా ననుభవింపనేరక తగిన ఘనునిదండ నుండంగనీక నిధానమునకుబూచి కాచుక యున్నట్లు పువ్వుఁబోఁడియెట్లు సంగత మయ్యె నీ కిట్టిమగఁడు. 128
వ. ఐననుం గొదవ గా దిందుల కొక్క మహోపాయంబు విచారించితి వినుము. 129
చ. వలపులఱేనికి న్సవతువచ్చువిలాసము గల్గి యెల్ల విద్యలఁ గలమేలిమిం దెలిసి యంగనలం గరఁగింప నేర్చి కోర్కులు సమకూర్పఁజాలి కడుఁ గొండొకప్రాయము గల్గువాని నిస్తులతరభోగభాగ్యములు చొప్పడ నీ కొనగూర్తు మానినీ! 130
క. అతని వివరింతు విను నీమతికి న్సమ్మతి యొనర్చు మనరాజు జగద్ధితసుప్రతాపభాస్వత్ప్రతిభాభానుండు చిత్రభానుం డబలా! 131
సీ. భావజ్ఞమౌళి ధాత్రీవరారోహావహస్తలైకైకబాహార్గళుండుచల్లనిరాజు సాక్షాత్కారనవమోహనాంగసౌందర్యలీలాంగభవుఁడుదాక్షిణ్యశాలి యాచార్యధైర్యావార్యసకలసద్గుణగణార్జవపరుండుచేపట్టుఁగుంచ మక్షీణరంగదభంగశృంగారశాస్త్రప్రసంగలోలుఁ
తే. డమ్మహారాజదేవేంద్రుఁ డంతరంగమెల్ల నీసొమ్ముగ నొనర్ప నేమితపముచేసితివొ నాపలు కొకింత చిత్తగించితలఁపు నెఱవేర్చు కొనవమ్మ కలికి కొమ్మ. 132
వ. అనిన విని సంభ్రమభయవిస్తయాక్రాంతం బగునిజస్వాంతంబునం గొంతతడవు విచారించి దరస్మితవ్రీడాభరంబు లీడుజోడాడ వదనారవిందం బొకించుక వాంచి పంచశరశరప్రాయకటాక్షాంచలంబుల నొక్కించుక చాంచల్యం బంకురింప నచ్చంచలాక్షి రాజదూతి కిట్లనియె. 133
క. ఏ నింతనాఁటినుండియుమానవతులలోన మిగుల మానవతిని నైయీనాఁటికిఁ గడచితి నికఁనానోఁచిననోము లే మొనర్పం గలవో. 134
వ. అదియునుం గాక. 135
తే. అత్తయును మామ తలవరులై మెలంగమగఁడు పులివంటివాఁడు నెవ్వగ యొనర్పనమ్మ! యేఁ జెల్ల! యిక్కార్య మమరు టెట్లుచాలుఁ జాలింపు మిఁక నీప్రసంగ మనిన. 136
వ. విని తదీయవచనంబున స్వప్రయోజనావకాశం బయ్యె నని తలంచి తదనుగుణం బగునట్లుగాఁ బల్లవి యిట్లనియె. 137
ఉ. ఎక్కడి యత్తమామలు నిజేశ్వరుఁ డెక్కడ వంశవర్తనంబెక్కడ దొడ్డు కొంచెమను టెక్కడ నోలలితాంగి మోహమున్నెక్కొనఁ జక్కనయ్య నొకనిం బిగికౌఁగిటఁ జేర్చి పెంపుసొంపెక్కని దేటిప్రాయ మిది యెన్నఁటికిం గలుగంగనేర్చునే. 134
సీ. మగని ప్రక్కనె యుండి తగఁ జేరి జోకొట్టిమోసపుచ్చని దేటి ముద్దరాలుపసులగోడలనైన వసుధనిచ్చెన లేకయెక్కనేరని దేటి యెమ్మెలాఁడితలవరు ల్గనుఁగొన్నఁ దప్పు నొప్పు ఘటించిబొంకనేరని దేటి పువ్వుఁబోఁడిదొరలు గద్దింకఁ గల్లరివార్త నిజముగానిర్వహింపని దేటి సీటుకత్తెతే. యత్తమామల గృహకర్త లగుచు మెలఁగునట్టిధూర్తుల నెల్ల నోరదిమి గదిమిపొంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించిచక్కటికి దిద్దుకొనని దేసరసురాలు. 139
తే. ఆఁడుపుట్టునఁ బుట్టి యింతంతయైనదిట్ట గాకున్న నది కడతేఱు టెట్లుబేలతనమున నీవింత గోలవేనిమాను మోబాల యిఁక నిన్నిమాట లేల. 140
వ. అనినఁ బులకానుషంగం బగునిజాంగంబువలన నంగీకృతభావం బెఱింగింప నయ్యంగనారత్నంబునకు సంగనాచియగు రాజదూతిక మఱియు మఱియు బోధించి చంద్రికాసక్తచకోరకంబునుఁబోలె వైశ్యభామ కెదురుచూచుచున్న రాజపుంగవునకుఁ దదీయకథావృత్తాంతం బెఱిఁగింప మరలిచనునెడ నవ్వణిగ్వరునకు దైవయోగంబున నతిదూరప్రయాణంబు సంభవించిన. 141
చ. తనయిలువేల్పులై మెలఁగు తల్లికిఁ దండ్రికి భక్తియుక్తివం
దన మొనరించి ప్రాణసమతం దగుపెంపుడుముద్దుఁజిల్క నెమ్మన మలరించి విద్యుదుపమానశుభాకృతి నా ప్రభావతింగనుఁగొని పోయిరాఁదగిన కార్యముఁ దెల్ప నవీనదైన్యయై. 142
సీ. మలయుచో మధురాతిమధురాధరల వాఁడిచిన్నారిగోరు నీచెక్కుమీఁదనానుచో రంగస్థలాబ్జగంధులగబ్బిమెఱుఁగుఁజందోయి నీయురముమీఁదమించుచోఁ గాంచికాచంచలాక్షుల ముద్దుమొనపంటిగంటు నీమోవిమీఁదఁజేరుచో నెల్లూరు నారీమణుల కెంపుపసమించు నడుగు నీనొసఁటిమీఁదఁతే. నింట నుండిన నీసౌఖ్య మేల కల్గుననుచుఁ గన్నుల నూరార్చి యక్కుఁజేర్చిమోవిచిగురంట నొక్కి తమ్ముల మొసంగిపోయిరమ్మని పనిచె నప్పువ్వుఁబోఁడి. 143
క. ఈరీతి వణిగ్వల్లభుఁడారూఢిగ నోడబేర మరిగినతఱి నవ్వారిజముఖి కంతుశరాసారవినిర్ఘాతజాతసంతాపమతిన్. 144
చ. మునుకొని మేరమీఱు వలపుందనముంగల త్రోవ చూపఁగావెనుక రతీశ్వరుండు పదవే యని యెత్తులు వెట్ట నెమ్మదింబెనఁగొను లజ్జయుం బొడముభీతియుఁ దన్నరికట్ట నంతలోనినుఁ డపరాంబుధి న్మునిఁగె నీవెతలం గనలేని కైవడిన్. 145
తే. చరమదిగ్భామినీమనోహరతరాంగరాగవైఖరి మఱి సాంధ్యరాగ మెసఁగెఁగుసుమితనవీనజాతీనికుంజరీతినుడుగణంబులతోఁగూడ నొప్పె నభము. 146
క. తగనప్పు డజాండంబుననిగిడెం గాఢాంధకారనిబిడమరీచుల్జిగి కుందనంపుబరణిన్మృగమదపంకంబుఁ గలయనించిన కరణిన్. 147
వ. అప్పు డయ్యెప్పులకుప్ప యగుప్రభావతీసతి విలాసవతీరతీశ్వడుం డగు నమ్మహీశ్వరునితో ననంగసంగరవాంఛ తరంగితంబై తురంగలించు తమకంబున. 148
సీ. నానావిధద్రవ్యనవ్యసంభారముల్గలగృహంబులకు బీగము లమర్చిమొదవుల నన్నింటిఁ బిదికిన పాల్గాచియొనరఁ దోడంటుతో సుట్టిఁబెట్టిపనులు దీర్చిన తొత్తుపడుచుల నిష్టాన్నతృప్తినొందఁగఁ జేసి యిండ్ల కనిచియత్తమామలు సుఖాయత్తులై పవళింపమృదుపదంబుల నొత్తి నీదురవుచ్చితే. జలక మొనరించి జిలుఁగుమేల్వలువ గట్టికలప మలఁది మితాహారకలనఁ దేలివీడియం బందుకొని యొక్కయూడిగంపుబుడుత తనవెంట నడువ నప్పువ్వుఁబోఁడి. 149
క. తనకుం బ్రాణపదంబునుదనయనుఁగుంజెలియుఁ దనకు దైవం బగుచుందనరు తనరాజకీరముఁగని యవ్వలఁ జనుట తగిన కార్యం బనుచున్. 150
తే. కనకమణిపంజరశుకాగ్రగణ్యుఁ జేరికోరి యాత్మీయగాథాప్రకార మెల్లమెల్లమెల్లన దరహాస ముల్లసిల్లనంతయును దెల్పఁ జిల్క యత్యాగ్రహమున. 151
క. కటకటఁబడి పక్షద్వయపుటచలన మొనర్చి మిగులఁ బొగులుచు మదిలోనిటు నటు దెలియని చింతాకుటిలస్థితి నింతి కనియెఁ గోప మెలర్పన్. 152
క. ఓహరిణనయన "స్వామిద్రోహ మిదంభార” మనుచుఁ దొలుతనె విబుధవ్యూహంబు పలుక వినమేయాహా యీమాట వినఁగ నర్హమె మాకున్. 153
ఉ. ఓవర వైశ్యవంశకలశోదధికల్పలతాలతాంగి నీపోవని వారిముందఱ నయో మగనిం గడకాళ్లఁ ద్రోచి నేఁడీవసుధేశునిం గలయ నెంచితి వెట్లు? పతివ్రతామణుల్వావులు పుత్తురమ్ము తలవంపులు చేయుదురమ్మ జాతికిన్. 154
సీ. దశకంధరుని మోహదశ విచారించెనేసకలజగన్మాత జనకజాత
నహుషభూపాలు మన్నన కొప్పుకొనియెనేస్త్రీరత్నమైన శచీపురంధ్రియల సింహబలుని మాయలఁ జిక్కి చొక్కెనేవిపులసద్గుణమాన్య ద్రుపదకన్యశబరాధిపునిదురాశలకు లోనయ్యేనేరతినిభాకృతి భీమరాజపుత్రితే. తొల్లిటి మహాపతివ్రతల్ దుర్మదాంధకాపురుషు లంగభవశరాఘాతవికలచిత్తులై తముఁ జేరి యాచించినపుడుసిగ్గు వోనాడుకొనిరఁటే చిగురుఁబోఁడి. 155
ఆ. ప్రాణహాని మానభంగంబు నగు ననకెంతపనికిఁ జొచ్చితే మృగాక్షిజగతి నీమనంబు "తెగువయే దేవేంద్ర,పదవి" యనెడుసుద్దిఁ బొదలఁబోలు. 156
క. పతిభక్తి గలుగుసతికిన్వ్రతములతో గొడవ యేల వఱలు సుకృతముల్పతిభక్తి లేని చెనఁటికివ్రతములు చను వేయి యొక్కవ్యభిచారమునన్. 157
క. వినవమ్మ భామినీమణిమనమున నీ కితరసంగమము ప్రియమైనన్మును గొంతి కమలబాంధవునెనసియుఁ బొన మెఱుఁగునట్లనే వర్తిలుమీ. 159
తే. కాక తలవెఱ్ఱి గొని యలగౌతమాంగనామణి సురేంద్రు నొకనాఁడు నంటుచేసియాపదలఁ జెంది సకలలోకాపవాదమొందు టెఱుఁగవె యట్లు గాకుండవలయు. 160క. నీపట్టు గలుగువాఁడైచేపట్టుంగుంచ మైన చెలువుని నొకనింజేపట్టి రతులఁ దేలకయేపట్టున రాజు నిచ్చయించితి వబలా. 161
సీ. రాజులు కుటిలసర్పమహోగ్రతరమూర్తులధరబింబము పంట నదుము టెట్లుసార్వభౌములు చండశార్దూలసమచిత్తులించువేడుకఁ గౌఁగిలించు టెట్లుకువలయాధీశ్వరు ల్దవహుతాశనకల్పులండనుప్పొంగి పరుండు టెట్లు
నరవరేణ్యులు భద్రకరిమదాంధమనీషులెనసి బంధరతాప్తిఁ బెనఁగు టెట్లుతే. చక్రవర్తులు మాననిర్వక్రవర్తులతులతరగాఢసురతవేళాతివేలతాడనచపేటము లొనర్పఁ దలఁచు టెట్లుతెలిసి కలయిక లొనగూడ మెలఁగవమ్మ. 162
క. వారలగుణానుగుణముగవారక కనుగలిగి నడుచువారల కెలమిన్శ్రీరంజిలు జయ మొదవు నుదారత నీపదు నెఱింగి యలవడు మబలా. 163
వ. ఇత్తెఱంగునఁ దత్తరంబు లేక వర్తిల్లుమని విన్నవించిన. 164
క. అభినవవినీతివార్తావిభవం బభిరామలీల వినుచున్నతఱిన్నభము నభమైనఁ గనుఁగొనియిభగామిని నాఁటి కరిగి యిలు సేరుటయున్. 163
వ. అంత నద్ధరాకాంతుండు తదనంతరకథాక్రమం బెట్టిది యానతిమ్మనుడు. 166
తే. అవధరింపుము సకలరాజాధిరాజసతపదాంభోజుఁ డగు ధర్మనందనునకుసరసవైదికలౌకికాచారవిహితహితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టులనియె. 167
క. ఆగుణవతి మఱునాఁ డనురాగాప్తిన్ రాత్రివేళ రమణీయకళా
భోగశుభాకృతి రతిశుశ్రీగులుక న్రాజసేవ సేయుట కెలమిన్. 168
చ. కలువలు కొప్పున న్నగుమొగంబునఁ గస్తురిబొట్టు పట్టుకుచ్చలయును జంద్రకావిబురుసాపనివల్వయు మై రహింపఁగానలవడు మేల్ముసుంగుపయి నంగరుచిచ్ఛట లొప్ప నప్పు డాకలికి రమాకుమారు తురగంబుకడం దగఁ జేరె నంతటన్. 169
తే. చిలుక ముద్దులు చిలుక రాజీవనయనననునయించి వచించు నోయబల నృపకులేంద్రుఁ గదిసెద నని వచ్చు టేనెఱుఁగుదునుబికి చనఁదగ దితిహాస మొకటి వినుము. 170
క. అనఁగా ననఁగా నొకపురమొనరుం జంద్రవతి యనఁగ నుద్యోతవినూతనఖద్యోతనికేతనఘనకేతనరుచిరకనకకలశం బగుచున్. 171
తే. అన్నగర మేలు రత్నాకరాహ్వయుండువికటమత్తాహితవిఫాలుఁ డొకనృపాలుఁడతని నగరున నోడకాఁ డగుచు నొకఁడువెలయు వసుమంతుఁ డనుగౌర చెలువుమీఱ. 172
వ. వెండియు నయ్యఖండతరసంపత్కుబేరుం డగునతండు. 173
శా. ఏయూరం దనయంగడు ల్నెఱయ నేయేబేరు లెందైన నాత్మాయత్తైకధనంబు సంచిమొదలై యత్యార్జనం బొందఁగాశ్రేయఃకీర్తులు సంఘటిల్లఁ దను సుశ్రీమించఁగా నిల్పె నయ్యాయం బేర్పడఁ గోటికిం బడగ లెన్నైనం బ్రమోదంబునన్. 174
Comments
Loading comments…