తృతీయాశ్వాసము

శుకసప్తతి

శ్రీజానకీమయూరీరాజన్మేఘాయితాంగ! రతిరాజశతభ్రాజితసౌందర్యసుధారాజతగిరికీర్తిసాంద్ర రామనరేంద్రా! 1

తే. అవధరింపుము సకలరాజాధిరాజనతపదాంభోజుఁ డగుధర్మనందనునకుసరసలౌకికవైదికాచారవిహితహితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టు లనియె. 2

తే. అటులు నిజగృహమున కేగి యబ్జవదనపగలు గడవంగఁబడుటయుఁ బార్థివేంద్రుకేళిగృహమున కరుగునవ్వేళఁ గాంచిమరునియెకిరింత సంతోషభరిత యగుచు. 3

క. ఒకకథ వినియెదె మఱి పొందికతో నటు నిల్చి తర్జనీనాసాయోగకరణధురీణ మిది యనియకలంకసుధావిధోక్తు లలరం బలికెన్. 4

క. ధర శాలివాహనుం డనునరనాయకమౌళి పెనుప నలువై విభవాకరము ప్రతిష్ఠానం బనుపుర మలరు న్వేల్పుఱేనిప్రోలుం బోలన్. 5

క. అప్పురిఁ గుబేరుకలిమికిదప్పులు ఘటియించు సోమదత్తుం డనుపేరొప్పు నొకవైశ్యుఁ డలరుఁ గకుప్పటలిని గీర్తివల్లికోటులు ప్రాకన్! 6

సీ. నవరత్నములు సువర్ణమును వెండియును లోహాంతరములు పటలాంశుకములుగోవజవ్వాది కుంకుమపూవు పచ్చకప్పురముఁ బన్నీరుచెంబులుఁ బటీరతరుఖండపటలి యందలపుఁ గొమ్ములు జల్లిసవరము ల్పాదరసంబు జాజియింగువ లేలాలవంగము లోడపోఁకలును గోరోచనగంధకములుతే. కొచ్చికుక్కలు మానిసిక్రోఁతు లరిదిపంచెవన్నెలచిలుకలు బహువిధములపారువాతిన్నె లిఁకమీఁద బలుక నేలపొదలు వానింటఁ బులిజున్ను మొదలుగాఁగ. 7

క. ఈళయు ముమ్మెంగియు బంగాళము పైగోవ మొదలుగాఁ బొదలెడుద్వీపాళిఁగలసరకు లాతనికౌలున దిగు మాట నిజముగలవాఁ డగుటన్. 8

శా. ఏయూరం దనయాపణంబు మఱియిం కేబేరిపేరైన నాత్మాయత్తం బగువిత్త మేయడవియందైన న్నిజద్రవ్య మీచాయన్సంపద వృద్ధి బొంద ధనదస్పర్ధాళుఁడై నిల్బెఁబోయాయూరవ్యుఁడు గోట్లకుంబడగ లెన్నైనం బ్రమోదంబునన్. 9

చ. వలసిన బేరము ల్దెలియవచ్చినవారలు వాదుగల్గువారలు తెగగుత్తగొల్లలును రత్నపరీక్షలవారు కార్యముల్గలిగిన యింగిలీషులముఖాములు చెంగట నుల్లసిల్లఁగాఁగొలువొసఁగు న్మహీశుగతిఁ గోమటి యాత్మగృహాంగణంబునన్. 10

క. అతఁడు ధూర్తచకోరఖ్యాతంబగు నొక్కచిలుక నతులితగమనాయాతేరితవిజ్ఞానసమాతులశేముషిఁ గృపాళుఁడై పోషించున్. 11

తే. అప్పురంబునఁ గామసేనాభిధానయైన వెలచాన మీఱు జయైకతానమీనకేతననలినప్రసూనశరసమానతానూనవీక్షావితాన యొకతె. 12

ఉ. కారుమెఱుంగురాచిలుక కస్తురివీణె పదాఱువన్నె బంగారము నచ్చుకుప్పె తెలిగంబుర వెన్నెలలోని తేట సింగారపుఠీవి లేనగవు గల్గిన చక్కెరకీలుబొమ్మ యొయ్యారపుజీవగడ్డ యన నచ్చెలి మెచ్చులు గాంచె నెంచఁగన్. 13

సీ. ప్రత్యక్షబాహాటపాంచాలనటనలుగనుపట్టఁగాఁ బుస్తకములు చదువుఁ

గనుఁగొన్న రూపమచ్చున నొత్తినట్టులఁదళుకొత్త భావచిత్రములు వ్రాయునట్టువకాని యందముగాక వింతగాఁగోపులు గల్పించుకొనుచు నాడుఁజేరి తంబుర మీటి సారసుథాసూక్తిదేటలూరఁగ వింతపాటఁ బాడుతే. జాతివార్తలు దొలఁక రసంబు గులుకఁగవిత రచియించుఁ గల్పించి కతలు నుడువుమనసు గరఁగంగఁ దీయనిమాటలాడుజిలుకరౌతుకటారి యవ్వెలమిటారి. 14

సీ. పలుకుముద్దులకుఁ గోవెలజియ్యగాండ్రెల్లంగుంటెనకాండ్ర వెన్వెంటఁబడఁగఁజనుజక్కవలు గన్న సన్న్యాసులైననుదలవరివారితోఁ జెలిమి సేయఁదళుకుఁజూపులకు విద్వాంసులైనను నిజరామలతోడ రారాపొనర్పఁబొలుపున కాచార్యపురుషులైనను దమవేషభాషలమీఁద వెగటు పడఁగఁతే. దెఱపిగని చూచినట్టి పతివ్రతలునునిజకులాచారవృత్తిపై నెటికె విఱువవింతయొయ్యార మెసఁగఁ గోవెలకుఁ బోయిమరలి యింటికి వచ్చు నమ్మచ్చెకంటి. 15

చ. తొలఁకెడుతత్తఱంబువగతోఁ దొడనిగ్గు హిజారుమీఁద మెట్రిలువడినొంటికట్టున ఘటించిన చీరసగంబు మూపుపై

నలవడబోటి దట్టి మొదలైనవి తేఁ దిరుమంజనంపువేఫలు దఱితప్పెనంచు నవలా భయమందుచు నిల్లు వెల్వడన్. 16

క. కొడుమెత్తుకొఱకు గుడికిన్నడుచు న్వెలపడుచు నాభినామమునుం గ్రొమ్ముడిసౌరు న్మడిచారున్వడిజాఱుంబైఁట వింతవగఁ గనుపింపన్. 17

సీ. తానున్న కేళికంతటికి గణాచారిపెక్కుసుద్దులు మ్రోయు పెద్దబేరిపేరుకోఁదగినట్టి యూరలేని యుటంకుపరులబుద్ధులకుఁ జొప్పడనిమంకుకల్లలు పచరించి గద్దించుతాటోటుపూనియొక్కరి కీయలేని జూటుకలహంబె కూడుగా మెలఁగెడుగయ్యాళినిష్ఠురత్వము సూపు నెఱకరాళితే. బేరజపుగట్టిజంత పాడూరిసంతచలము సాధించు దిట్ట రోసాలపుట్టలోకముల కెల్ల సూచి యల్లుండ్రబూచియెంచఁగల యుచ్చమల్లి యయ్యింతితల్లి. 18

తే. దాని నుతియింపఁ దరమౌనె తాటకావధూటితల్లియొ పూతనతోడఁబుట్టొశూర్పనఖమేనగోడలొ చూడ లంకిణీతనూజయొ యనఁగ వన్నియకు నెక్కె. 19

సీ. ఇరుగింటిదయ్యంబు పొరుగింటికినిగూబయెదురింటివారల కెదురుచుక్కవాడకుఁబగ యూరివారలతలనొప్పిపెంపుడుకూఁతుండ్ర పెద్దపిడుగుపరదేశులకుఁ బులి బాఁపలగాలంబుయాచకకోటుల కాసవిఱుపుదాసర్లమిత్తి సన్న్యాసుల తెరబొమ్మజోగిజంగాలకు సొంటికొమ్ముతే. పాఠకులకొట్టు నట్టువపాలియదురుఁగ్రోవి భరతంపుటయగారి గుండెదివులుబట్టువాకట్టు బవనీలపాముకూనయనఁగ విఖ్యాతిఁ గాంచు నాయాఁడుఁగూచి. 20

సీ. గూనివీఁ పనరాదు కోలమూతినిజాఁచుఁగొడిపెమో మనరాదు గొడఁగసాగుబాకిమో మనరాదు పగసాటి బెదరించునొంటిప ల్లనరాదు కంటగించునరవెండ్రు కనరాదు నాఁడెల్ల జగడించువాటుగా లనరాదు చేటుఁదెచ్చుఁజెవు డనఁగారాదు చేట యెత్తుకవచ్చుగ్రుడ్డిక న్ననరాదు గొట్టుసేయుతే. వెఱ్ఱి యనరాదు పైఁబడి వెక్కిరించుగామి డన రాదు మొగమున గంటువెట్టుపెంకి యనరాదు వట్టిగుంపెనలు సేయుముద్ది యనరాదు గ్రుద్దు నయ్యెద్దుమొద్దు. 21

క. గడెతడవు వేసటలచేసుడివడ కటు తనదు ప్రాఁతసుద్దులు విన్నన్వడినిచ్చు నొక్కపుచ్చినయడగొంటుం బడుకక్రిందియాకులు రెండున్. 22

సీ. రమనేలినట్టి గురస్తునందు రదేమొనేలమిన్నులు గొల్వ నేర్చుటరుదెమేనకాంగననంటుకాని మెత్తు రదేమొసృష్టికిఁ బ్రతిసృష్టి సేయుటరుదెకడవఁబుట్టినవానిఁ గడునుతింతు రదేమొపాథోధి పుక్కిటఁ బట్టుటరుదెలంకఁగాల్చినవాని బింక మెంతురదేమొహెచ్చుమందులకొండఁ దెచ్చుటరుదెతే. యనుచు మదితప్పితప్పి నీళ్లానిపూనితోడిముదుసళ్లఁ బెక్కండ్ర గూడఁబెట్టిపట్టి తలనొవ్వ రవ్వగాఁ బవలురేలువట్టిపగ్గెలు ప్రేలు నవ్వారజరఠ. 23

క. అది నెమ్మదివదలని చలమొదవఁగఁ దనసుతకుఁ బైఁడి యొకనిద్దురకుంపదివేలమాడ లీయకకదియఁగ నీదెట్టి విటశిఖామణినైనన్. 24

క. ఆకామసేననవబిబ్బోకము గనుఁగొనుట మదనభూతావేశవ్యాకులితమానసాంబుజుఁడ్రై కుందుచు సోమదత్తుఁ డతివిరహమునన్. 25

క. అక్కలికి కొనఁగవలసినరొక్కము పురహరుఁడు దానరూపము రతిగాఁజక్కెరవిలుతుఁడు వెఱపున్మొక్కలితన మెపుడుఁ దన్ను ముంపఁగ నుండెన్. 26

ఉ. అంతట నొక్కనాఁ డతఁ డొయారము మీఱఁగఁ గామసేన నేకాంతమునందుఁ జేరి మనసారఁగఁ బుక్కిటివీఁడె మిచ్చి గిల్గింత లెసంగు కౌఁగిటి బిగింపుల నింపులనింపు పారువావింతరొద ల్ముదంబు నొదవించునటు ల్కలఁగాంచి వేడుకన్. 27

చ. తనచెలికానితోఁ బసిఁడిదార్చక యేనల కామసేనతోనెనసితి నిన్న నంచు వచియించిన నాతఁడు దానియింటికిన్జని మది నిల్పఁజాలక ప్రసంగవశంబున సోమదత్తుఁడినవచనంబు లెల్లఁ బ్రకటించినచో వెలముద్ది యుగ్రయై. 28

క. ఏ నెఱుఁగకుండ నాసుతతో నెనయుట యెట్టు లిట్టిదుడుకులు గలవేకానీ రొక్కం బీయకపోనో చూచెదము తనప్రభుత్వం బనుచున్. 29

సీ. శ్లేష్మంబు కుత్తుకఁ జిఱ్ఱుబుఱ్ఱున కఱ్ఱుకఱ్ఱును దగ్గు లగ్గలముఁ గాఁగఁజన్నులు తలఁగడ సంచులవలె వెళ్లిపయ్యెదమీఁద జంపాల లూఁగబీదనరాలతోఁ బెరుఁగువాఁగడుపులోబల్ల నల్లడలందుఁ దుళ్ళిపడఁగ

బుగ్గలాహిరియూటఁ బొడము వాసనతోడికంకినోటను జొంగ యంకురింపఁతే. దిరుకొళములోనఁబడిన క్రోఁతియునుబోలెవడకుకొంచును నేచుట నెవ్వారిఁ గన్నగ్రుడ్లు మిడికించుచును గుడ్లగూబరీతివేగఁ దనయిల్లు వెడలె నావృద్ధవేశ్య. 30

తే. అంతలోననె శాలివాహను దివాణమునకు నేగుటకై బంధుజనులు గొలువవచ్చునలసోమదత్తు నవ్వారవనితజనని వీక్షించి సందడి జడియ కరిగి. 31

తే. వెఱ్ఱి నీ రానుకతమున వెడలునట్టిచొక్కుబోఁదట్టి యొకకన్ను వెక్కఁబెట్టిదడిగఱవఁబోవు వేసిచందమునఁ బట్టిపరుసమెచ్చఁగ నూరుజప్రముఖుఁ బలికె. 32

శా. అయ్యా యల్లుఁడ యెంతపెద్దఱికమయ్యా నిల్చిమాటాడనీవియ్యంజాలని సెట్టివా నెనరు లే దీపట్ల నిట్లైన నీవియ్యా లందఱి కేదిదిక్కు మఱి నీ వెన్వెంటనే వచ్చు మాయయ్య ల్చెప్పరె నీకు మాకుఁ దగవీయాదాయమే కంటివో. 33

క. నలుగురిలో ని ట్లాపనిపలుకఁగఁ దగదైన వెఱ్ఱిపట్టినకతనందెలిపెద నీకేరోసముగలిగిన బ్రతికితిమి మంచికార్యం బిదియున్. 33

క. ఇయ్యెడఁ గలగిన రోవెలయియ్యక నా కెఱుక లేక యిటు నే నింటందయ్యమువలె నుండఁగ మాతొయ్యలితో నెట్లు కూడితో నే నెఱుఁగన్. 35

క. పైఁడేమి బ్రాఁతి యిదిగోనేఁ డిచ్చెదు మ్రుచ్చు వగల నెలఁత రమింపంబోఁడిమి చెడదే మఱి బురికాఁడవుఁ దగ కొదవలే జగంబు లెఱుంగున్. 36

తే. నిన్ననే నన్ను మొఱఁగి నాచిన్నదానినక్కటా యోడరేవున నమ్మికొందువేమిటికొ జాఱవిడిచితి వింతెకానియంత దబ్బఱకాఁడ వీవౌదొ కావో. 37

తే. మంచిమణులకు వెలఁ బొసఁగించువేళహెచ్చువెలలకు సొమ్ము చేయించుచోటనగరి జాలెలు నీయింట నిగిడియున్నవింత మాకేల మారొక్క మిచ్చిపొమ్ము. 38

క. అన సోమదత్తుఁ డద్భుతమున నచ్చట నిల్చి వెఱ్ఱిముద్దియ కలలోనెనసితి నీదు తనూభవననుపమరతి నింతెకాని యన్య మెఱుంగన్. 39

తే. అనిన నమ్ముద్ది మంచి దట్టైన నేమినాతనూభవవలన ననంగసౌఖ్యమబ్బెఁగద నీకు నిదియు లేదన్న నందువర్థ మిప్పించి యవ్వల నడుగుపెట్టు. 40

క. అని రట్టుసేయ నచ్చటిజనములు సొమ్మీయకునికి చనదని వగదెంచిన దాని దోడుకొనిపోయె నతం డింటికిని రొక్క మిచ్చెద నంచున్. 41

క. చని ధూర్తచకోరమునకుదనవృత్తాంతంబుఁ దెలుపఁ దత్కీరము నవ్వి నిజంబుగఁ గెలిపించెదనిను వెఱవకు మనియె వైశ్యనీరజగంధీ. 42

క. ఆవైశ్యునిఁ దత్కీరంబేవిధి గెలిపింపవలయు నెఱిఁగింపఁగదేనీవే జాణ వటన్నన్భావించుచుఁ జిలుకతోఁ బ్రభావతి పలికెన్. 43

క. ఏలాగున గెలిపించెనొబాళిమెయిం బ్రహ్మలోకపర్యంతము నేనాలోచన యొనరించితిఁజాలదు నాహృదయ మిది నిజంబుగఁ దెలియన్. 44

క. అంతిపురంబున కరిగి దినాంతమున న్నృపతిఁ జేరి నరిగెడుతమితోఁజెంతకు వచ్చినకోమటియింతింగని చిలుకరాయఁ డిట్లని పలికెన్. 46

క. రమణీ యాధూర్తచకోరముకథ యిఁకఁ గొంత కలదు రాజవియోగభ్రమమడఁచి తెచ్చికోల్నెయ్యము తోడుతనైన వినుమటంచుం బలికెన్. 47

క. ఆగతి నింటికిఁ జని యాబోగము ముసలాపె యాత్మపుత్రికతో నాజాగెల్ల దెలిపి పరిభవయోగంబున మదికి ఖేద మొదవఁగ నంతన్. 48

సీ. పుట్టలమ్మ యటన్నఁబో యెంతలేదనుసందివీరుల టన్న జాము గొణుగునెక్కలమ్మ యటన్న నొక్కటికొదవనుబోతురాజు లటన్న బూతు నుడువుధర్మరాజు లటన్న దబ్బఱలే తిట్టుఁగంబమయ్య యటన్నఁ గ్రాసి యుమియుగ్రామగంగ యటన్నఁ గాదా మరో యనుదేవాదులన్న గద్దించి చూచుతే. నిన్ని దేవళ్లఁ గొలిచి నేనేమి గంటిపోయి పచ్చని పులుగాసిపులుఁగుచేత

మోసపోయితి ననికుందు మొనయుఖేదమారట మొనర్ప విసివి యయ్యారిబసివి. 49

సీ. నట్టింట దేవళ్లుపెట్టెఁ బెట్టినతిన్నెఁగొట్టించి వెసఁ బందిగూడు చేసెమెడనున్న పాదాలు విడిచి యెవ్వరిఁగన్నమొరుగుతలారికి మురువు చేసెబానలో దాఁచిన పట్టుపుట్టము చించిపొదుగుడు కోళ్లకుఁ బొత్తి చేసెదేవాదుల కడెంబు దిగిచి కమ్మతగానిపట్టికానికి మొలకట్టు చేసెఁతే. గాటిఱేనికి మీఁదుగాఁ గట్టి యున్నగట్టివరహాని వరహానిగాఁగఁ జూడఁకాడఁబోఁగూడ కొక్కమాటాడకుండగుండనికి రంగుబంగారు గోరుసేసె. 5

తే. అంతఁ దత్పుత్రి కీరమా యింత చేసెదాని నంజుడు దినకున్న నేను సానికూఁతురనె యంచుఁ దల్లిని గుస్తరించిమఱియు నవ్వార్త యూరెల్ల మఱవనిచ్చి. 51

క. వలసిన సతికే చిన్నెలుగలవో యచ్చిన్నెలెల్లఁ గనుపించుచు నవ్వెలవెలఁది సోమదత్తునివలకు న్లోపఱిచి మేలువానిం జేసెన్. 52

తే. చేసి యొకనాఁడు మీయింటి చిలుక కతలుచెప్పునందురు నామాట చిన్నఁబుచ్చ

కిపుడె తెప్పించరా దాని యెడను గలుగుపొలుపు గనుఁగొని మరల నంపుదము గాని. 53

చ. అనవిని సోమదత్తుడు నిజాప్తులఁ బంచిన వారు దెచ్చినంగనుఁగోని కామసేనయు వికాసపుమాటలుగా వచించి యెందును సరిలేక మించు నలధూర్తచకోరశుకాగ్రగణ్యముందనగృహసీమ మంచుకొని దబ్బఱ నెయ్యము నిబ్బరంబుగన్. 54

తే. కొన్ని దినములు చన రోషకుటిలహృదయవనజయై దీనిమాంసంబు వండుమనుచుఁజిలుక నెవ్వరు గనకుండఁ జేతికొసఁగబోనకత్తియ వెస పాకభూమి కరిగె. 55

మ. అపు డాధూర్తచకోరకీరవర మయ్యాపన్మహాంభోధి యేనిపుణత్వంబున నీఁదఁగావలయు నీ నేర్పెల్ల శోభిల్లఁగాఁజెపుమా చూతమటంచుఁ బల్కి తెలియం జింతంపఁగా నవ్వి వైశ్యపయోజాస్యకుఁ జిల్క తక్కిన కథాంశం బిట్లు తెల్పెం దగన్. 56

క. ఆరీతిఁ బాకగేహముఁజేరిన యావంటలక్క చిలుకం దఱుగంగోరి పచనక్రియాచింతారతితో నీలకత్తి నలుగడ నెమకన్. 57

ఉ. అత్తఱిఁ దాని జూచి శుక మంగన యెంతటిపుణ్యమూర్తివోబత్తిజనింప నాదుచెఱఁ బాపెదుఁ గావున నిన్నువంటి యత్యుత్తమ కేను నేర్పెడు ప్రయోజన మున్నదెయైన నామనంబుత్తలమందె నీకిటుల యో జరయింతటి పాటొనర్చెనే. 58

క. ఏను ద్రికాలం బెఱుఁగుదుమానిని పదినాళ్లలో సమంచితరేఖాసూనవయి నిండుజవ్వనమూనంగా నీకు హేతు వున్నది సుమ్మీ. 59

వ. ఇంత యెఱింగిన నీ కీయపాయంబుఁ దప్పించుకొనరాదే యని యంటివేని యలంఘనీయంబగు విధివిధానం బిట్టి దని నిశ్చయించి యున్నదాన నది యట్లుండె నవయౌవనాపాదకం బగు నొక్కమంత్రంబు నా కభ్యాసం బైయుండు; నది నాతోడనె పోయెడుం గదా యను విచారంబు తీరకునికి నీకు నుపదేశించెద దానివలన నీకుఁ బ్రాయంబు వొడముట కడుగనేల నీవిచ్చినవారికిం గలదు కాలయాపనంబు సేయక యిచ్చోట గోమయంబున నలికి మ్రుగ్గువెట్టు మనుటయు నావృద్ధ సంభ్రమాశ్చర్యానురుద్ధయై యచ్చిలుకఱేని నచ్చట నునిచి తదుక్తప్రయోజనంబులకుం బోయిన. 60

క. ఆధూర్తచకోరము గరుదాదృక్పటపటనినాద మడరం బరదుస్సాధంబై వరమానాబాధత్వర మెఱయఁగా నభంబున కెగిరెన్. 61

తే. ఎగిరి చెంగట నీశానగృహములోనగూళ్లు పెట్టిన చిలుకలఁ గూడుకొనియెదానిఁ గానక భయమంది బోనకత్తెకార్కవాకవపాకపాకం బొనర్చె. 62

క. ఆకామనేన మదిఁ జింతాకలుషత మాని సోమదత్తునితో నే

లేకున్నతఱి బిడాలంబాకీరముఁ బట్టి చంపె ననుచుం బొంకెన్. 63

క. అటుకనుక నేర్పుగలిగినఁగుటిలాలక నేఁడు నీవు కోరినపనికేగుట తగు లేకుండినచోనిటనుండియె మరలు మని శుకేంద్రుడు పలికెన్. 64

తే. అంతలోనన యరుణోదయంబు మించనాప్రభావతి యంతఃపురాంతరమునకరిగి యానాఁటి రేయి భూవరునిఁ జేరనేగుచోఁ జిల్క యక్కల్కి కిట్టు లనియె. 65

తే. అతివ ధూర్తచకోరశుకావతంసమంత చేసిన గామసేనాంబుజాతగంధిఁ జెఱతు నటంచుఁ గంకణము గట్టెనెట్లు చెఱపంగవలయు నీ వెఱుఁగఁ జెపుమ. 66

క. అని పలికి తెలియ నేరనివనితామణిఁ జూచు కీరవల్లభుఁ డది దావినిపింపఁ దొడఁగె ననితరజనితర సంస్తవ్యవచనసంభావ్యముగన్. 67

క. ఆరీతిఁ దలఁచి ధూర్తచకోరము తత్క్రియకు వేళఁ గోరుచు నుండన్మారునిచెలిఁ జెనకెడు నొయ్యారముగల కామసేన యంతటిభక్తిన్. 68

క. ఒకనాఁడు కోవెలకు నేగి కపర్దికి మ్రొక్క గర్భగృహమునఁ దన్మూ

రికి వెనుక డాగికొని యాశుక మిట్లని పలికెఁ దద్వచోగతిగాఁగన్. 69

ఉ. మెచ్చితి నీదు భక్తికి సమిద్ధవిశుద్ధకళాభివృద్ధికిన్దచ్చనగాదు నాపలుకు దప్పదు చొప్పడుఁ గాయసిద్ధి యేనిచ్చెద నీవుఁ దల్లియు మఱెవ్వరితో నెఱిఁగింపఁ బోక యీవచ్చుసరోజశాత్రవుని వారమునాఁ డిటు రండు వేడుకన్. 70

క. తొలునాఁడు బోడలై నిశ్చలభక్తిం జోగులకును జంగాలకు మీయిలు చూఱవిడిచి యిటురావలయున్ వైష్ణవుల కొసఁగవల దేమైనన్. 71

క. వారు శివద్రోహులు గదయీరసమున శైవమతము హెచ్చఁగరా దంచేరీతినైనఁ జెఱతురునారీమణి వారిమాట నమ్మకు మింకన్. 72

క. అని పల్క నాల్గుదిక్కులుగనుఁగొని శంకరునిమాటగా నమ్మి కృపావననిధి హర త్రిభువనపావన ధీరస్వాంత యనుచు వర్ణించి వెసన్. 73

క. గుడివెడలి వైష్ణవులు గనుపడకుండఁగఁ జెలుల నరిగ పట్టుమటంచుంబడఁతి తన యింటికడకున్పడిఁ జని నిజజననిఁ బిలిచి నగుమొగ మలరన్. 74

క. హరుఁ డానతిచ్చినాఁ డెవ్వరితోఁ జెప్పకుము సోమవారమునాఁ డి

ర్వురకు నెలప్రాయ మిచ్చుంజరయు న్మృతి లేదు సంతసం బయ్యఁ గదా. 75

చ. ఆన విని వృద్ధవైశ్య పులకాన్వితయై నవయావనంబు నేనెనసితినేని యీపడుకటిల్లు మదీయము నీవు వేఱె యింటను బవళింపుమన్న జగడాలకు రాకుమె యూర నీవు నేనును గడియింపఁ జొచ్చినఁ దనూభవ గోడలు పైఁడిసేయమే. 76

సీ. ఇప్పుడే తెచ్చి నీ కిచ్చెదఁ గాని యీతళుకుఁగమ్మలు నేనె తాల్చికొందునృపులచేఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీపెద్దముక్కఱ నేనె పెట్టికొందునృపునిచేఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీబొగడలజోడు నేఁ బూన్చికొందునెటులైనఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీమట్టెలు నేఁ గాళ్లఁ బెట్టికొందుతే. నౌర నీవు గడించిన వనుచు నా కొసంగకుండిన మఱి నేను సంతరించుసొమ్ము మీఁదట నీ కీయఁ జూడు నాప్రతాప మని పల్కి యుత్సాహచాపలమున. 77

సీ. కుఱుచనెరు ల్దువ్వికొని కొప్పు సవరించుఁబరువెత్తి కాటుకబరిణ వెదకుసొంపుతో నద్దంబుఁ జూచి పండ్లిగిలించుఁబడఁబోవుచును ముద్దునడలు నడచుగోరంబుగా సారె గుంటకన్నులు ద్రిప్పుఁజూపఱ నగు నోరచూపుఁ జూచు

గరిడి కేగెదనంచుఁ గాసె దాల్పఁగఁ బోవుబాకినో రెగనెత్తి పాటపాడుతే. నింటి కెవ్వారు వచ్చిన నెనయుఁ దనకునదిగొఁ బైఁడీయ వచ్చి రటంచు లేనిబింక మెక్కించుకొని సారె బిగియునపుడెప్రాయ మేతెంచె నంచు నప్పణ్యవృద్ధ. 78

తే. ఇప్పు డెట్లున్న దాన మీ రేల చెప్పరౌర లెస్సాయె నని యొద్దివారిఁ దిట్టుగుంపుగొని చూచువారలఁ గొట్టఁబూనువెరఁగుపడి యింటిబిడ్డల వెక్కిరించు. 79

వ. ఇవ్విధంబున బహుప్రకారదుర్వికారంబులు మీఱఁ గుమారిం జేరి. 80

క. ఏమో తెలుపఁగ వచ్చితిభామా యీలోన మఱపుపాటిల్లెఁ గదేయేమీ మఱవక తనకున్సేమంబును బ్రాయమిచ్చు శివుఁ డుండంగన్. 81

క. గడువీలో మన మేగతినడువన్వలె నేమి చెప్పినాఁడు శివుఁడు నీవడిగితివొ లేదో తెలియంబడుచువుగద నీకుఁ దెలియఁబడ దింతైనన్. 82

తే. పడుచవే గాకయుండినఁ బ్రాయ మిపుడెయిమ్మనఁగరాదె సోమవార మ్మటంచుగడు వొడటియేల యింతలోఁ గాలమేమొదేశమేమొ కదా యంచుఁ దెలియునటవె. 83

క. అనిన విని కామసేనావనజానన విన్నయట్టి వచనము లెల్లన్వినిపించిన నేమేమీయని యమ్ముదిజంత చింత యాకులపఱపన్. 84

క. బ్రదు కెల్లఁ జక్కనగుననిమది నమ్మితిఁ గూఁతురా ప్రమాదము రాదేతుది నిల్లు చూఱవిడిచిననిదియేమో మీఁది కార్య మెవ్వఁ డెఱుంగున్. 85

తే. ఆశపడి బోడనైన నేనగుదుఁగానియింటిసొ మ్మొక్కకాసైన నీయ నొకనికొల్ల నే జవ్వనంబు మొఱ్ఱో యి దెట్లుతగదు నీమాట నే వినుదానఁ గాను. 86

క. అనఁ గామసేన యంతటిపని రారాదమ్మ కుముదబాంధవధరుఁ డాడినమాటకుఁ దప్పటవేయని సమ్మతిపఱిచి నిర్భరాహ్లాదమునన్. 87

క. త్యాగధ్వజ మెత్తించి సమాగతయాచకుల కీశ్వరార్పణ మనుచున్బోగముచెలి ధనమెల్లంబ్రోగులుగా నొసఁగె సకలము న్వినుతింపన్. 88

సీ. పట్టెనామంబుఁ గీడ్పఱిచి నూతనవిభూతిని ద్రిపుండ్రంబులు దీర్పవచ్చుద్వయము పోఁబెట్టి శైవపురాణపద్యపాఠికల వేమాఱుఁ బఠింపవచ్చు

వనమాలికలు పాఱవైచి రుద్రాక్షపూసలపేరు లఱుత నెక్కొలుపవచ్చువిష్ణుసుకీర్తన విడిచి శంకర హరశబ్దము లుచ్చరించంగవచ్చు.తే. గాని భుజములు కాయలు గాచి యున్నతప్తముద్రలు మఱుపెట్టఁదరమె యనుచువైష్ణవు లభావవైరాగ్యవైభవంబుఁబొంద నది శైవుల కొసంగె భూరిధనము. 89

వ. ఇవ్విధంబుగా నిజాంశుకావశిష్టంబుగా గృహప్రముఖంబు లగుధనంబులు సకలభూషణంబులును ద్యాగంబు గావించి యమ్మించుఁబోఁడి జననీయుతంబుగాఁ బ్రతీక్షించుచు నయ్యిందువాసరంబు ప్రసన్నం బగుటయు. 90

చ. తిరుపతి కొప్పు లందముగఁ దీర్చిన బూడిదబొట్లు మంచి వేర్పఱచిన మించునట్టి రుదురక్కలపేరులుఁ గావికోకలున్హరశివశబ్దము ల్దగ మృగాంకకళాధరుగేహసీమ కేగిరి గుడిమేళము ల్పొదలఁ గిన్నరకంఠియుఁ దానితల్లియున్. 91

క. చని భావజారి సేవించి నిజంబగుభక్తి నొంది చెంత వసింపంగనుఁగొన వచ్చిరి బహుయోజనదూరమునందుఁ గల్గు జనసంఘంబుల్. 92

తే. ఇవ్విధంబున భూజను లెల్లఁ జూడఁబ్రొద్దుకైవ్రాలుదాఁక నప్పొలతు లుండియేమొ సర్వేశ్వరుం డిట్లు తామసించెననుచుఁ జింతించుచున్న యయ్యవసరమున. 93

తే. గోపురముమీఁద ధూర్తచకోరకీరమెక్కి ప్రజలార మీకేల తిక్కపట్టెవీరిబగిసికి మఱి గారవించి హరుఁడుకాయసిద్ధి యొసుగునే కల్లగాక. 94

క. అని వారు తన్నుఁ దునుమంబనుచుటయును వారికొంప చెఱచుటకై దేవుని వెనుకనుండి తా నాడినమాటకు వార లచ్చటికి వచ్చుటయున్. 95

క వినిపించిన నింతేనాయని యందఱు నవ్వ లజ్జ నానతముఖులైచని రవ్వేశ్యలు తచ్ఛుకమునకుం గలనేర్పు నీకుఁ బొసఁగ న్వలయున్. 96

క. అనినఁ బ్రభావతి మది మించిన వెఱఁగున నిన్నువంటి చిలుకలనేర్పుల్గననగునె యనుచు వేగుటగనుఁగొని వెసం జనియెఁ గేళికాగృహమునకున్. 97

క. ఆనాఁటిరేయి బాళిన్భూనాయకమౌళిఁ జేరఁబోయెడుతఱి నమ్మీనాయతాక్షి జూచి ప్రసూనాంబకతురగ మతులసూక్తిస్ఫురణన్. 98

క. వేసారక మద్వచనసుధాసారము మెచ్చ నీకె తగుఁగావున నీవీసారి యొక్కకథ వినుమాసారిజయస్తనద్వయా యని పలికెన్. 99

క. కల దభ్రంకషకేతనచలదభ్రంబైన నైమిశం బనుపుర ముజ్జ్వలవిభ్రమపరిపూరితకలశుభ్రకరాననానికాయం బగుచున్. 100

క. రజకుఁ డొకఁ డప్పురంబునబ్రజ మెచ్చఁ దనర్చు వీరబంధు డనఁగానిజవంశోచితధర్మధ్వజమై తగుపాటివైభవం బలరంగన్. 101

మ. బహిరభ్యంచితరాసభోత్కరము భౌభౌరావభాక్కుర్కురంబహరీశోదయకాలధౌతవసనాయాతాచ్యుతాశీర్వచోబహుళం బాయతకుంభకంబు గిరికాబాథార్థమార్జాలమైగృహ మొప్పు వ్రజకాగ్రగణ్యునకు దూరీభూతదారిద్ర్యమై. 102

ఉ. వేళమె కోడికూఁత యగువేళలఁ జల్ది భుజించి బండ్లు గంగాళము కూడునీరుచవుకారముఁదే విడియంపుఁ జొక్కుతోమైలల మోపు వీఁపున నమర్చిన రేవుగుఱాని నెక్కి వయ్యాళిగఁ బోవు వాఁడు విమలాపతటాకసమీపభూమికిన్. 103

క. ఆవీరబంధువునకున్భావజభుజవిజయసాధనం బగునిల్లాలై వెలయు నొక్కకోమలిలావణ్యవరేణ్య యై కళావతి యనఁగన్. 104

చ. మినమిన లీను మేను నెఱమించుల కొంచెపుటంచుఁగమ్మలుంగొనఁబగుముద్దుమోము సమకొన్న మెఱుంగులకట్లదండయుంగనుఁగవఁ గల్గుతేఁటి యొడికంబును సందికడెంబు మించ నవ్వనిత యువాంతరంగమృగవాగురయై మెలఁగుం గృహంబునన్. 105

తే. ఆకళావతి నిజనాయకాల్పరతులనీగి మారవికారంబు హృదయ మన్యపురుషసంభోగవాంఛతోఁ బొందుఁజేయఁదద్వశంవదయై నితాంతంబు మెలఁగు. 106

క. వెలవెట్టి వేఱకైకొనవలదే కద యింట జారవనితలచీరల్గలుగఁగ నందులలోపలవలసిన యటువంటి వింతవన్నెలు చూపున్. 107

మ. వటసమ్మార్జనగీతరాసభచయప్రహ్లానశబ్దంబు లొక్కట నోర న్వెడలం బరున్న సతిసింగారంబు వీక్షించి నీవిటు నిద్రింపు మటంచు లేచి చన నయ్యబ్జాక్షి యవ్వేళ నూరట చేయు న్మదనాస్త్రకోటులకు జారక్రీడలం బ్రోడయై. 108

చ. తన సరిచాకెత ల్తనకు దాపుగ వారలకెల్లఁ దాను గుంటెనలు వహించుకొంచు నెఱటెక్కులు నిండు విడెంపుచొక్కులున్మనసుఁ గరంచు నేర్పువగమాటలు నేరని తప్పుపాటలుంగనఁబడ నవ్వధూటి పతికన్నులు మూసి చరించు నిచ్చలున్. 109

క. సొగసుఁ గని దాని పెనిమిటిమగటిమి యెఱిఁగియును మాటిమాటికి నకటా

సిగవోయినఁ బోనిమ్మనితగులుదు రుపనాథు లాసుధాకరవదనన్. 110

సీ. మిహిరావలోకన మేటికి వీక్షణాయాసదుర్దమదోష మడఁపకున్నమృత్తికాస్నాన మేమిటికిఁ దదీయదేహస్పృష్టికలుషాల నడఁపకున్నఁబమిపంచగవ్య మేపనికిఁ దదీయాధరాస్వాదనైర్మల్య మడఁపకున్నవేలిమి యది యేల వింతఁగా దీనితోభోగించు పాపంబు పోకయున్నఁతే. జటులగాయత్రి యేల తత్సంగమాదినాంతదుష్కృతదోషంబు నడఁపకున్ననిన్నియును నేటికని రజకేందువదనవేదవిప్రులు తలఁతురు విదితముగను. 111

క. ఈరీతి మెలఁగుదాని యొయారముఁ గని యొ శూద్రుఁ డధ్వగుఁడు మహోదారుఁడు చారణుఁ డనియెడుపేరునఁ దగువాఁడు మదనభీతాత్మకుఁడై. 112

క. చోరుని బుద్ధిది యైనన్సారం బింటికడఁ దెలియఁ జని చూచెదఁగాకీరమణి దారి యని యాచారణుఁ డరిగెం దదీయసదనంబునకున్. 113

మ. చని కాంచెం గుసుమాక్షతంబు సదనాంచత్పానపాత్రంబు భాసి నిజాసన్నసమున్నతాసనతదాసీనైకవృద్ధాక మ

ర్థినరాహ్లాదకరాతిసౌరభము మధ్యేకుండవిన్యస్త మగ్రనిచోచత్పరిమాణభాజనము నౌ కాదంబరీకుంభమున్. 114

వ. కనుఁగొని నితాంతోదకంబును నిస్తుములంబు నగుట శాక్తేయమతంబువారును బెద్దలమఱుఁగున మెలుగు కురంగనయన లరుగుదేఱం దగిన మదిరామందిరం బని డెందంబునం దలంచి నిజమనోవంచనాచుంచుచంచలలోచనాగమనంబుఁ గోరుచు నతఁ డందుఁ బ్రచ్ఛన్నవేషంబున నుండె. 115

క. సివసత్తులును దలారులుబవనీలు న్మఱియు నాటపాటలవారుంజవులు నుతించుచు మదిరాసవముం గొని యొక్కఁ డొకఁడె జరగినపిదపన్. 116

సీ. ఇంటివా రెవ్వరో యెందు గాన మటంచునదిగొ కూర్చున్న దాయమ్మ యనుచునమ్మిక తాను గానక వచ్చితి నటంచునిది యెవ్వరుండెడి యిల్లటంచునంగడి కరుగుచో ననుదెంచితి నటంచువచ్చి జామయ్యెఁ బోవలయునంచునరిది బిడ్డలకు మందడుగవచ్చితి నంచునే నందులకు వచ్చినా నటంచుఁతే. జేరి రవ్వేళఁ దమమునిచెఱఁగులందుఁగాసు దుడ్డును బంగారుపూస వెండితునక మొదలింటి చిఱువాఁడు గొనినదెల్లఁగొనుచు మగనాండ్రు తమకెల్ల గుట్టు మెఱియ. 117

తే. అట్టు లరుదెంచి తక్కువ యనుటగానిదోసమాడుదురా యని యాసవంబుమంచి దని యల్లవృద్ధ వర్ణించి లేఖలొసఁగి క్రోలిరి మైరేయ మోపినట్లు. 118

చ. కనుఁగవదోరగల్లుల వికారపుఁజూపుల కోపు లాసుతోడనె దళమెక్కు నాలుక తడంబడుమాటల పచ్చితేఱ మోమునఁ బనిలేనినవ్వుల సముజ్జ్వలచంద్రిక లామతింప నవ్వనరుహలోచన ల్సివము వచ్చినయందముఁ జూపి రందఱున్. 119

తే. ఒకతె వృద్ధకు మధుమూల్య మొసఁగు టరయలేక కొమ్మని మఱియొక్కరూక యొసఁగెనొకతె గ్రోలియు మైరేయ మొల్ల లెక్కమరల నిమ్మని దాని వేమరునుగనలె. 120

సీ. కసినికోఁతలు గోసి గారింతు రని బూతుతెలియఁగా వదినెలఁ దిట్టువారుబురిఁ బాసి వేఱు కాఁపురము సేయుద మన్నవినఁ డని పతి దూఱి వనరువారుఁగడుపార మగనికే గంజిపోయ దటంచునత్త దుర్గుణ మెంచి యలరువారుఁదా నెవ్వతెయొ నన్నుఁ దఱిమి యీడ్వ నటంచుఁదోడికోడలిఁ జెడనాడువారుఁతే. గేరి యొకకొంద ఱాత్మల మీఱినట్టిమాట లెల్లను మధుమదోన్మాదగరిమ

నలుక మెఱయంగ లక్ష్యసంప్రాప్తవీక్షణాబ్జముల హాసవిన్యాస మమర మఱియు. 121

సీ. మగని నిద్దురపుచ్చి మఱివచ్చెద విచారమడఁచి యింటికి నేగు మనియె నొకతెనిను జూడఁగా నిఁకే నిలువలే నొకసారియటుచేరి నిల్వరా యనియె నొకతెయమ్మ నేఁజెల్ల సయ్యాట మెందాఁక నేనరిగెద విడువరా యనియె నొకతెబతిమాలి నేనె పైఁబడు టింతియె కానియాలిపై దయచూడవనియె నొకతెతే. యత్తవాకట్టుమంత్రంబు లడిగె నొకతెవిభుని జోకొట్టుమందులు వేడె నొకతెమధువుచొక్కునఁ దేలి యామగువలందుజారసాన్నిధ్య మపుడు సాక్షాత్కరింప. 122

క. ఈలాగున నాలాగునలీలాలోలలగు నచటి లేమలతోఁ దత్కేళిం దగిలిన రజక విశాలేక్షణ వగలు గాంచి చారణుఁ డాత్మన్. 123

క. ఇది దాట్లమారి యగుననిపదపడి మఱునాఁడె యొంటిపాటున మేకోలొదవింపఁ దాపి యింటందుదగానని ప్రేమ దానితో రమియించెన్. 124

క. వింత లగు లాలనమ్ములసంతస మెసఁగించి మించు చారణరజనీ

కాంతునిసన్నిధి నపుడక్కాంతామణి మనసు చంద్రకాంతం బయ్యెన్. 125

తే. అంత నయ్యింతి తప్పక యతనిఁ జూచియెంతనెఱజాణయో కాన నిట్టివానివీనిఁ బోనీయరా దని మేనుమేనునెనయఁ గూర్చుండి వానితో నిట్టు లనియె. 126

క. మగవాని నమ్మవచ్చునెయగపడి తన కార్య మైనయందాఁక విరాళిగదింతు రంత నెక్కడిజగజోలి యటంచు నెరసి చనఁ జూతురుగా. 127

క. ఆఁటది వలచుట యరుదేనాఁట న్మఱి వలచెనేని నాథుని బెనుపోరాట మొనర్చినఁ గోసినగాటం బగుఁగాని యెడయఁగా లేదు చుమీ. 128

ఉ. అంత యెఱుంగ నేర్చిన విటాగ్రణివౌ దటుగాకయున్న నాయంతటిదానిఁ బూని వెలయాలివలెం బతిమాలఁ జేయదేయింతటిలోనె మీపురికి నేగక యిచ్చటఁ గొన్నినాళ్లు నాచెంతనె యుండి నీవలపు చెల్లుఁబడిం గడతేర్పరా యిఁకన్. 129

క. వెచ్చమునకు లేకుండిననిచ్చెద దిన మొక్కమాడ యిచ్చటి మఱినాముచ్చటలీ వీడేర్చినఁదచ్చనగా దేలమూలధనముం గరమున్. 130

తే. అనుచు మేకోలుగావించి యపుడెపోయితనగృహంబున గూటిలోఁదలుపుమూలఁ

బిడతలో నాయకుఁడు దాఁచిపెట్టినట్టిమాడ లర్పించి వానితోఁ గూడి మెలఁగె. 131

క. ఆవీరబంధుఁ డంతటభూవరు వెనువెంట దండు పోవుటయు నిజేచ్ఛావిధిఁ జారణుఁ గూడి కళావతి బహుభోగలీలలం దేలంగన్. 132

క. త్రోవనిటు వచ్చి వచ్చియునీవెలఁది న్రతులయందు నెనసినవాఁడంబోవలయు నూరి కనుచుఁ గళావతితోఁ జారణుం డలంఘ్యప్రేమన్. 133

తే. వచ్చి బహుకాల మయ్యె మావారిఁ జూడనూరు సేరంగవలయు నీయొద్దవాసిపోవఁ గాళ్ళాడ విఁక నేమి బుద్ధి యానతీయవే యన్న బెగడి యయ్యిందువదన. 134

క. ఏమంటి వూరి కేగెదవా మంచిది పోక నిలువవచ్చునె పొమ్మానామాటకు నౌ ననఁ గాదీమిక్కిలిమాట లేల తెలిపెద వదియున్. 135

క. కాక నామీఁది తమి నీకుఁ గలిగెనేనినీదువెంటనె పెట్టుకపోదు గరితనాత్మఁ గొంకుదువేని నీవరుగు మూరునెనసి నీవు సుఖంబుండు మింతెచాలు. 136

చ. అనుడు నతండు మోదమున కాడెద వింతియకాక నీవె వచ్ఛినఁ గనుసన్న నీపలుకునేయుచునుందు జనంబు మెచ్చఁగా

నిను నఱచేత నుంచుకొని నేఁ బదిమాళ్లకుఁ గొన్నతొత్తు మద్వనిత కలంచెనేని పెడవాడనె వైవనె యింత యేటికిన్. 137

తే. అనిన నంగీకరించి యయ్యంబుజాక్షియపుడె పైనంబు సంజోక లమరఁ జేసిచారణుని వెంట నింటి విచార ముడిగిచనియెఁ దొలికోడికూఁత ప్రొద్దుననె లేచి. 138

వ. ఇవ్విధంబున నవ్వధూమణి యుపనాథాదీనయై యరుగునెడఁ దృతీయదినప్రయాణంబున. 139

సీ. పరికరోత్తరయుక్తపాథేయమును సజంబీరమై యొకనాఁటి బియ్యమున్నయసిమిలోఁ జలువ మాయక యుండ మడఁతవెట్టిన చల్లడము దుప్పటీరుమాలునొరపుగాఁ బొలుపొందు నురగవల్లి దళంబుపూగపూరితమైన పొరలతిత్తివ్రేలఁ బ్రతిక్షణార్ద్రీకృతశంఖచూర్ణంబైన లోహకరండకంబుఁతే. గాళ్ల బిడివాళ్లు నికటమార్గప్రపాన్నరసనము న్మేషజనితమౌ రాగ మమరనృపతిచే నంపకము గాంచి యిల్లు సేరవచ్చె నాదారిఁ దన్మనోవల్లభుండు. 140

క. అపు డారజకాంగన యేనెపమున బొంకంగవలయు నీమదిలోనన్నుపమగని చూచి తెలియఁగజెపుమా చూచెదము నీదు శేముషిబలమున్. 141

క. అనినఁ బ్రభావతి శుకపతిఁగనుఁగొని యపు డెట్లు బొంకఁగావలె నంచున్నను నడిగితి వింతేకదవినిపింపుము తెలియ నట్టివిధమని పలికెన్. 142

క. ఈథ తెలియ నెఱుంగుదునాకొక పెద్దఱిక మిచ్చినం గాదనరాదేకద యైనను వినుమనియాకీరం బనియె ననియతాదరగరిమన్. 143

శా. ఆరీతిం బతి చేరవచ్చుటయు నయ్యబ్జాక్షి వీక్షించి చింతారూపం బగుభీతి దోఁచి దృఢధైర్యస్థైర్య యై వానికిన్నోరాడింప నశక్య మౌకరణిఁ గందోయిం జలం బుబ్బిమున్నీరై పాఱఁగ నేడ్చెఁ గమ్రకలకంఠీనాదభేదంబుగన్. 144

తే. ఏడ్వ నింతటి యపకార్య మేమి యనుచుదిగులుపడి నిల్చుమగని నెమ్మొగముఁ జూచిలెస్సవచ్చితి నినుఁ బాయలేను వేగవచ్చెద నటంచుఁ బల్కినవాఁడవయ్య. 145

క. మఱచితివె సుమ్ము శీఘ్రముపఱతెంచెద ననుట యడుగువాసినచో నక్కఱవాయు ననుట నిజమనియెఱుఁగరుగా పతులనమ్ము నిందునిభాస్యల్. 146

చ. పతి పరభూమి కేగిన సపారమనోవ్యథఁ గుంది ధైర్యవిచ్యుతి దివసంబు లెన్నుకొనుచు న్సతులుందు రెఱుంగలేఁ డెకాయతఁ డొకవన్నెలాడి మొగమంటి కనుంగొనుచు

న్విరాళి చేసతమని నమ్మియుందు రిది సాజమెకా మగవారి కారయన్. 147

తే. మన్న పురుషుని చెడనాడు మగువ మీఁదఁబోయి పులుగాసిపురుపయి పుట్టుననుచుబాఁపనమ్మలు చెప్పినపాట మేలెయనుచు నేనుందు నిను దూఱుకొనఁగ వెఱచి. 148

తే. ఇవ్విధంబున నుండి యింకేమియందుఁగానికలఁ గంటి యటుమొన్నఁ గన్నయపుడెయుగము గ్రుంగినయట్లైన నొల్లఁబోయినిలువఁగూడకయెన్నియెన్నికలొ పొడమె. 149

ఉ. ఆయన యొంటిగాఁడు వెలయాండ్రతగు ల్గలవాఁడు వాఁడిమింబోయినచోట మాట పొఱపొచ్చెము సైఁపని రోసగాఁడు గాయీ యెడ నేమిపుట్టునొ సహింపఁగరాదు విచార మంచు నాథా యిఁక నేమి యేనగరి యైనను బోయెదనంచుఁ గ్రక్కునన్. 150

శా. చూపట్టంగలదాన నొంటిమెయి నిచ్చోఁ బోవరాదంచు నేనీపుణ్యాత్మునితో డమర్చుకొని యిట్లేతేరఁగాఁ ద్రోవనేనాపాలం గలదేవుఁ డీకరణిఁ జెంత న్నిల్పెఁగా నిన్నుఁ బేర్చే పెక్కేండ్లు సుఖమున న్మనుము నాచిత్తంబు రంజిల్లఁగన్. 151

తే. ప్రాణనాయక మదిదోపఁ బాపమునకుమగడ వింతియకాక నామదికిఁ జూడఁదండ్రివైనను నీవీవ తమ్ముఁడయిననింక నెన్నఁటికిని నిన్ను నెడయవెఱతు. 152

మ. అను నిల్లాలిని గౌఁగిటం బొదివి నెయ్యం బార నూరార్చి యవ్వనితం దోడ్కొని వచ్చి యందఱి నెగు ల్వారించితంచుం బ్రియంబున నాచారణు వీడుకొల్పి తనగీముం జేరె నాతండు కామినియుం దానును నిట్టి నేర్పువలెఁ జుమా నీకుఁ గోకస్తనీ. 153

తే. అనుచుఁ గీరంబు వల్కె వైశ్యాంబుజాతగంధి నివ్వెఱపడి యదిగాక జంతయని ప్రమోదించి యరుణోదయంబుఁ గాంచియరిగే శశికాంత బద్ధశుద్ధాంతమునకు. 154

క. ఆమాపు వలపుత్రోపునభామాపుష్పాస్త్రు భూమిపతిఁ జేరుటకారామ యరుదేర శుకము సుధామయమధురోక్తి నద్భుతంబుగఁ బలికెన్. 155

పందొమ్మిదవకథ

క. కనకాంబరి కనకాంబరియనఁగా నొకపురము గలదు హర్మ్యాగ్రవినూతనహరిమణిఘృణితిమిరోజ్జనితరహఃకేళిసౌధజాలం బగుచున్. 156

తే. ఆపురం బేలు నీలవాహనుఁ డనంగరిపుతమోహేళి యగు నొక్కనృపతిమౌళియతని చెంగట ధీరుఁ డనంగ బిరుదునిండు మాస్టీఁడు నెగఁడు మన్నీలు వొగడ. 157

సీ. తలపాగపొరమీఁద జెలఁగెడునాయుథార్చనసల్పినట్టి దాసనపుఁబూవునెడమచే గొలుసును దొడపుఁగత్తియుఁ బూలబిరు దొందు కుడికేలఁ బెద్దకత్తిదట్టితోఁజెక్కు నిద్దాపంకి కుసుమ పూవన్నియ దుప్పటివల్లెవాటుభుజములు విరులచేఁ బూజించు బోడికల్మురువైన ముందరి బిరుదుడవిణతే. దండహంవీరతలగుండు గండ యనుచుబద్యము పఠించు జీతంబు బంట్లుఁ జూడమూఁగికొను పౌరజనులగుంపులుఁ జెలంగనతఁడు దొరకొల్వు చేసి గేహమున కరుగు. 158

క. ఇల్లీల నడచు నాతనియిల్లాలు దనర్చు నొకతె హేమాంగి యనన్వల్లభుని కన్న దీనికిజిల్లరవిద్యలకు బిరుదు చెల్లు ననంగన్. 159

తే. పరభయంకరబిరుదవిస్ఫురితుఁ డైనకాంతు నయ్యిందుముఖి తనకాలిక్రిందికసవుగా నెచు వెడమాయగప్పి జారధవులమాటలు వడఁకి యౌదలధరించు. 160

చ. పతి యతిశౌర్య మెంచి యుపభర్త రతాప్తికిఁ జేరకున్న నచ్చ్యుతమగు ధైర్య మిచ్చుచు నయో మగవాఁడ వటంచు నెట్లు పుట్టితి విఁక నేమి తద్భుజపటిష్ఠతలోన లొటార మింతె నీవతనికిఁ గొంక నేలని భయఃస్థితిమాంచి రమించుఁ దద్రతిన్. 161

క. ధవునకు నుపభర్తకు బాంధవము ఘటియించు జారుదండనె యాత్మీయవివేకవర్తనంబులుచెవికింపులు గాఁగ మగనిచేఁ బొగడించున్. 162

తే. ఇవ్విధంబునఁ దనపోక లెఱుఁగనీకమగని జోకొట్టి నెరివచ్చి సొగసుజెట్టివాడలోఁ గూడు జారులవల్లెత్రాఁడుచెలువున మెలంగు నక్కొమ్మ సొలపుగ్రమ్మ. 163

క. అంతటఁ బెఱరాణువ హనుమంతుం డను పేరఁ బరఁగు మాస్టీని మదాక్రాంతుని గెలిచెద నని నిజకాంతుఁడు చనఁ దొడుసు మాలెఁగద యిపు డనుచున్. 164

తే. అలరి హేమాంగి పతి వచ్చునంతలోనవలచి వలపింప నేర్చు జవ్వనపు వన్నెకానితోఁ గూడి కడలేనికాంక్ష దీర్చికొనియెద నటంచు మది నెంచుకొనుచునుండ. 165

ఉ. ఆపురి నొక్కజెట్టి గలఁ డన్యవధూమధురాధరామృతేచ్ఛాపరతంత్రుఁ డొక్కదివసంబున వీథిఁ జరించువేళ వాఁడాపువుఁబోఁడిఁ జూచి విరహాతురుఁడై తన సర్వశక్తులుంజూపియు దానిగర్వఁపునుచుక్కులు గాంచిరిరంసమించఁగన్. 166

తే. అర్కవాసరమందు నయ్యంబుజాక్షినడచుతఱి వామపద ముంచు పుడమిమీఁది

యిసుము గైకొని తనయింటికేగి ప్రొద్దుగ్రుంకునందాఁక వేగి నెక్కొన్నబాళి. 167

క. తనపడుకటిల్లు గోమయమున నించుక యలికి మీద ముచుదాఁ గొని తెచ్చినయిసుము నించి పయినవ్వనితామణి రూప మొనర వ్రాసినవాఁడై. 168

తే. చుట్టు యంత్రంబు లిఖియించి శుద్ధహృదయపద్ముఁడు దిగంబరుండు దిగ్బంధనిపుణుఁడగుచు నర్చించి ధూపదీపాదు లొసంగికోడి బలియిచ్చి కూర్చుండి గురుని దలఁచి. 169

క. మన మేకాగ్రముగా మోహనమంత్ర జపం బొనర్చి యర్ఘ్యము లొసఁగన్గనఁబడియె నప్పుడే మోహిని నవ్యప్రథమరసవిజృంభణవృత్తిన్. 170

చ. కనఁబడి కొప్పువీడ వలిగబ్బిచనుంగవ పైఁట జాఱ బూసిననెఱతావి గందవొడి చిందఁగ నందెలు మ్రోయ దీర్ఘలోచనరుచితోడ వీరమణి జగ్గన వేఁడుచు ముద్దువెట్టుకోజనుటయు నిర్వికారమతిఁ జాగిలి మ్రొక్కి యతండు నిల్చినన్. 171

క. మెచ్చితి నీకోరిన సతిఁదెచ్చెదఁ దంత్రంబు కడమ దీర్చుము వెస నీవిచ్చట నని మోహిని చనహెచ్చిన మోహమున మల్లుఁ డింపుజనింపన్. 172

క. మకరాంక పంకజాతాంబక యని యంత్రంబుఁ దుడిచి భక్తి మెయిం ద

ల్సికతోత్కరంబు నవఘటశకలంబున నునిచి లేచు సమయము నందున్. 173

మ. ఎనసెం దాప మిదేమొ యంచుఁ బొగులన్ హేమాంగిపై నంత మోహిని యావేశ మొనర్చి తెచ్చి నిలుపన్ హేరాళ మౌబాళి నవ్వనితం జూచి యతండు తద్రతి ననిర్వాచ్యైకసౌఖ్యంబుఁ జెందిన యాపిమ్మట నమ్మిటారి మదినెంతే తెల్విసంధిల్లఁగన్. 174

ఉ. ఎన్నఁడు వీని పొం దెఱుఁగ నేగతి వచ్చితి వచ్చుమాత్రమాకొన్ననవింటివాని యెలగోలు దురం బొనరించి డస్సినట్లున్నది మే నిదేమిగతమో యెటులైన నిఁకేమి వీనిఁ బైఁకొన్న మనంబుఁ ద్రిప్ప నొనఁగూడునె యున్నది చాలు నిత్తఱిన్. 175

క. తను ముంచినది సముద్రంబన వినమే రూపవంతుఁ డైనం గాకుండిన నామదిగరఁచెన్నేర్చిన యప్పుడె యితఁడు నాకుఁ జిత్తజుఁ డరయన్. 176

తే. అని ప్రమోదించి తనహృదయంబుఁ దెలిపివాని డెందంబు దెలిసి యవ్వనితతలఁపులేమి సేకుఱుటకు బాసలిచ్చి వానిమొగము వీక్షించి పలుకు నమ్ముద్దుగుమ్మ. 177

క. ఇచ్చటికే రారా దీవచ్చటి కెపుడైనఁగాని యరుదెంచెదులేవచ్చునపవాద యంతటఁబొచ్చెము లేనట్టి మోహమున కెడఁగలుగున్. 178

తే. కాన సిగ నొక్కచిఱుగంటఁ గట్టుకొన్నవాఁడ వగుచును వాఁకిట వచ్చి నిలిచిగంట మొరయింపు విని యేను గదియవచ్చితలుపుఁ దెఱచెద నీమాటఁ దప్పవలదు. 179

చ. అని సమయం బొనర్చి వికచాంబుజలోచన యింటి కేగ సాయన దినముం దదీయవచనాదృతి నాగతిఁ జేరి తద్రతిందనరుచునుండు నంతనొకనాఁ డినబింబము పశ్చిమాంబుధిన్మునిఁగినఁ జీఁకటు ల్నిజసముద్ధతిఁ జూపెడువేళ వేడుకన్. 180

క. ఆహేమాంగి నిజాలయదేహళి నిలుచున్నచో నలిక్షుద్బాధామోహితుఁ డొక తెఱువరి దృఢబాహుం డనువాఁడు భుక్తిపరతంత్రుండై. 181

తే. మాడ యిచ్చెద నన్నచోఁ గూడు వెట్టరింత పచనస్థలం బైన నీయ రిట్టిమాలకొంపకు వచ్చితి మాఱులేకగంజివోయుదురే యిందుఁ గలుగువారు. 182

క. ఇలు నెత్తిఁగట్టుకొని పోగలుగుదురే దివికిఁ దాము గడపటఁ బొరుగూరులవెంటఁ జనరె యపుడీయలమట వాటిల్లదే దయాస్థితి వలదే. 183

క. మగవారు కఠినహృదయులుమగువలు నాఁకొన్న వారి మాటలకు మనంబు గరంగు నిందు రిచ్చటిజగజంతలు మగలకన్నఁ జట్రాళ్లు సుమీ. 184

తే. మంచి దధికారి నగుచు నమ్మనుజవిభునిగొలిచియైనను గొంపలు గూల్పకున్నసడ్డసేయుదురే యంచుఁ జనెడువానిఁగాంచి హేమాంగి ప్రొద్దుపోకలకుఁ బిలిచి. 185

క. ఏమోయి యేల దూఱెదవీమాడ్కిం బురమువారినెల్లను నీ పేరే మెచ్చట నుండుదు వీగ్రామంబున కరుగుదేఱఁ గారణ మేమో. 186

తే. ఏమి యమరింతు వన్ని నాయింట నిండియున్న విప్పుడ యమరింతు నోపననకవండిపెట్టెదఁ బొమ్మన్న వాఁడు వట్టివేడుక జనింపఁగాఁ బణ్యవీథి కరిగి. 188

ఉ. కూరలు సన్నబియ్యమును గ్రుడ్డులకోళ్లును జింతపండు సంబారము లుప్పు నెయ్యొ లుపుఁబప్పు మొదల్గొని తెచ్చి యన్నియున్వేఱుగ నింటిలో నులుపనించిన కైవడి నుంచె లేఁతనవ్వారఁగ నవ్వధూమణి రయంబునఁ బాక మొనర్చి యంతటన్. 189

క. మామా యిన్నియుఁ దెచ్చితితేమానమీదేల వేగుదీపమువలదాయాముదము దెము పొమ్మననామందవిచారుఁ డప్పు డంగడి కరిగెన్. 190

తే. అరుగ హేమాంగి యిది వీని కారగింపుసేయఁగా నేమిగలదు మా జెట్టి కిడుట

కార్యమని యెంచి బోనంపుఁ గడవనించియంతలోవచ్చు దృఢబాహుచెంత కరిగి. 191

మ. అకటా యీయెడ నీకువండియిడఁ బుణ్యస్త్రీలు లేరైరె యేటికి నాయింటికిఁ దెచ్చితన్నియుఁ జెనంటిం దోషి నేనంచు ని,చుక శంకింపక హస్తము ల్పిసికికొంచు గించిదానమ్రమస్తకయై నిస్తులకైతవంబు పచరింప న్వాఁడు నిర్విణ్ణుఁడై. 192

క. ఇదియేమి బెడదవచ్చెనొగద యని పలుమాఱు వేఁడఁగాఁ గొదుకుచు నమ్మదవతి యే నేమని చెప్పుదు నింతకుమున్ను పొరుగుపొలఁతుక నాతోన్. 193

క. తనమగనికిఁ దనకును నడచిన జగడముఁ జెప్పఁగా విచిత్రంబని యేవినుచుంటి నంత వేఁపులుదినియె న్నీమాఱు వండి దించినదెల్లన్. 194

తే. అనుడు నాతండు తత్సంగమాసఁ జేసియెంతలే దింతెకద దీనికేల వగవనని యవాగుజలంబుల నధికజాఠరాగ్ని వారించి తరల కఱ్ఱాడుటయును. 195

చ. కనుఁగొని వీఁడునిల్చె నిదిగాదని యెంచి యసహ్యరోషకల్పన మొనరించి యవ్వికచపంకజలోచన పాంథ యిందు రమ్మనుటయు నిల్లునేకొనెద వద్దిర మత్పతి వచ్చువేళ నీకినుకలు సాగనిచ్చట జగేయన నాతఁడు భీతచిత్తుఁడై. 196

తే. లెస్స తెఱువాటుగొట్టితి లెమ్మటంచుగ్రుడ్లకొలఁదిగఁ గన్నీరుఁ గ్రుక్కికొనుచుఁ

దగినమాటకు నోరేది దానియిల్లువెడలె రఘురాముతమ్మునిఁ బిలిచికొనుచు. 197

వ. అట్లు వెడలి యతండు.198

సీ. కంబళాక్రామితక్ష్మాభాగసవిధంబుజేరువారలతోడఁ బోరువారునిజదేహబహువర్ణనీయవిచిత్రముల్చెవులొగ్గువారితోఁ జెప్పువారునాగామిదివసగమ్యపురాధ్వపరిమాణమదనెఱింగినవారి నడుగువారుక్షీరవిక్రయపరాభీరనారీకోటితోడ నవ్వులబేర మాడువారుతే. నగ్గి గొనితెచ్చి రథ్యాతృణాళి వైచిశీమతిమిరోద్ధతికిఁ బ్రతిష్ఠించువారునైన నానావససమాయాతపథికులమర గనుపట్టు రచ్చకొట్టమునకరిగె. 199

తే. ఏగి తత్తత్పథికుల నదెవ్వ రనుచుఁదెలిసికొన నేనయా పరదేశి ననుచునచట శయనించి తనమోస మాత్మనెంచియుసురుసు రటంచుఁ బొరలాడుచుండెనంత. 200

తే. తత్సమీపంబుననె ఘోరదారుయంత్రసక్తపదుఁ డొక్కఁ డారసి జార యెన్నికాఁపురంబులు గూల్చితో కద యటంచుఁబలుక నావంటివాఁ డిందుఁ గలిగె ననుచు. 201

ఉ. ఆదృఢబాహుఁ డొయ్యనఁ దదగ్రగతుండయి పిన్నవాఁడ నీకీదెస యేల వచ్చెఁ బురి నెవ్వరివాఁడవు తెల్పుమంచు నత్యాదృతి వీడెమిచ్చిన నతం డిదె చెంగటిశూద్రవీథిలోనైదువయంట యొక్క కులటాంగనయున్నది పాపమూర్తియై. 202

తే. దానితో నొక్కజగజెట్టి తగిలియుండువాని కుడిగంపువాఁడనై యేను గొలిచియుందు నది సైఁపలేక నేఁడొక్కమ్రుచ్చుఁదనము నామీఁద మోపినంతనె తలార్లు. 203

క. వినవచ్చి దొంగగా యనియొనరఁగ నిట బొండకొయ్య నుంచిరి కన్వేగినవెనుకఁ దెలిసికొని యచ్చని ననుబొమ్మందు రింతె యది యట్లుండెన్. 204

తే. అయ్య మీ రెవ్వ రన నాతఁ డాత్మవృత్తమంతయును దెల్పఁ జేఁజేత నప్పళించినవ్వి యాపిల్లబంటు నానలినవదనసుమ్ము నన్నింత చేసె నసూయచేత. 205

క. నీ వేల తగిలితయ్యోబావా యిఁక నేమి యొకయుపాయము వినుమానీ వాంఛదీరు భోజనమావనరుహగంధి రతియు నబ్బెడు నీకున్. 206

చ. ఇది సిగనంటఁ గట్టుకొని యేగి తదీయగృహంబు మ్రోల నీవెదభయ మింతలేక మొరయింపుము జెట్టియు నిట్లు సేయుఁ దత్సుదతియొనర్చు నిచ్చకముఁ జూడు మటం చొకగంట

యిచ్చినంబొదలి తదుక్తరీతి నటపోయి వెసన్ దృఢబాహుఁ డయ్యెడన్. 207

తే. గంట మొరయింప నవ్వాలుగంటి తలుపుతెఱచి తోకొనిపోయి మందిరములోననునిచి నీకిడఁగోరి నేఁడొక్కపథికుమన్నిగొంటి నటంచుఁ బ్రేమంబు నిగుడ. 208

క. అనఁటాకున నన్నము శాకనికాయం బునుపఁ బాపి కట్టడికానాయనుచు భుజియించి దీపంబునుపమిఁ దనతెఱఁగు తెలియకుండఁగ నంతన్. 209

క. రమణీయశయ్యపైఁ దత్కమలేక్షణఁ గూడి మదనకదనక్రీడాత్యమితానందముఁ జెందెందమిదీఱఁగ బంటువానిధర్మం బనుచున్. 210

ఉ. అంతట మల్లవర్యుఁడు లతాంతకృపాణనితాంతమర్దితస్వాంతతవచ్చి నిల్చి తలవాకట ఘంటిక మ్రోయఁజేయ నయ్యింతి యిదేమొ యంచు నొకయించుక చింతవహించి తద్విధంబంతయుఁ గాంచి ని న్నెఱుఁగనా యనుచుం దృఢబాహుతో ననున్. 211

తే. మంచి దెవ్వనిచేతనో మర్మ మెఱిఁగివచ్చి తందుల కేమి నీవాంఛ దీఱెజెట్టి యరుదెంచె వాని జోకొట్టి నిన్నుబనుతు నందాఁక నట్టుకపై వసించు. 212

క. కడలకు మచ్చట పామున్నది యందు రటంచు వాని నట్లుంచి రయంబొదవ న్వాకిలి దెఱఁచినమదియలరం పెట్టి కేళిమందిర మెనసెన్. 213

తే. అంతలో నేమి చెప్పుదు నట్టియపుడెవచ్చె హనుమంతగర్వదుర్వారశౌర్యుఁడైన రణధీరుఁ డేతెంచి యధికహర్షమెనయ వాకిలి దెఱవ నవ్వనితఁ బిలువ. 214

క. గుండె పటుక్కన వచ్చె విభుం డిఁక నెట్లనుచు మల్లపుంగవుఁ బథికుండుండెడునట్టుకపై వాఁరొండొరులం గానకుండ నునిచి వినీతిన్. 215

తే. గడియ సడలించి కన్నీటఁ గాళ్లుకడిగికొమ్మ కౌఁగిటఁ గదియించి కుస్తరించిపడుకయింటికి నరిగి దీపంబుఁ బెట్టుమని నిజోదంత మాద్యంతమును వచించి. 216

చ. తనభుజశక్తి మెచ్చి సముదారత నచ్చటి భూమిభర్త యిచ్చినధన మెల్లఁ జూపి యిది చేరుటఁ జూడఁగ దీనివంకఁ జుమ్మని వివరించి దెల్పుటకు నయ్యొఱడుస్సీ కృపాణిఁ గేలఁగైకొని ఝళిపించినం గడు దిగుల్పడి యాతనిదిక్కుఁ జూచుచున్. 217

క. ఆట్టుకపైఁ దగు తెఱువరిజెట్టియుఁ దముఁ జూచెనేమొ చేతం గరవాల్పట్టెనని తలఁచి తత్తఱముట్టిపడం డిగ్గనుఱికి యురువడిఁ బఱవన్. 218

తే. అపుడు సందియమంది రోషార్తుఁడైనపురుషుతో నది యేలీలఁ బొంక వలయుఁబలుకుమనినఁ బ్రభావతీపంకజాక్షితేటపడ నీవ యిదియును దెలుపుమనిన. 219

తే. చిలుక యిట్లను నప్పు డచ్చెలువ మోసకారిపెనిమిటి యోవన్నెకారిమగడయేల చూపితి విప్పుడ యీధనంబుధనపిశాచంబులివి యథార్థమ్ము సుమ్ము. 220

క. ధనముపిశాచులు ఘంటాధ్వనితోఁ గాచుకొని యుండు ధనమన వినమేకనుగొంటిమి గద గంటలుచను నే బలివెట్ట కర్ణచయ మిలు చేర్పన్. 221

తే. ఇంకనైనను బలి దెచ్చి యీయకున్నఁబొసఁగదని పల్క నతఁడు కాబోలుననుచుఁగాళ్లునొప్పియుఁ జూడక కాఁపుటింటఁగోడిఁ గొనితెచ్చి బలిపెట్టి కోర్కెఁ జెందె. 222

చ. అని తెలుపం బ్రభావతి యయారె కథాస్థితియంచు మెచ్చి యయ్యినుఁడు సురేంద్రదిక్కుధర మెక్కుట కేళినిశాంతసీమకుంజని తమినాఁటిరేయి నృపచంద్రుని జేరఁగఁగోరి యేగుదెంచినఁ గని దానితోఁ బలుకుఁ జిల్క మరందరసంబు చిల్కఁగన్. 223

ముప్పవుఁగదా యనిన నప్పడంతి తప్పక కనుంగొన నప్పతత్రిగోత్రారి యిట్లని చెప్పందొడంగె. 224

ఇరువదియవకథ

ఉ. ఉజ్జయినీపురంబు మెఱయు న్మణిహర్మ్యశిఖావిహారియోషిజ్జన మొక్కచో జలము చేఁదికొనం దలవాంచఁ దన్ముఖోద్యజ్జలజాభియాతికి భయంపడి దేవనదీరథాంగముల్పజ్జ ముడుంగఁ బాఱుఁ బృథుపద్మకుడుంగములం దడంగగన్. 225

ఉ. ఆపుర మేలు పూర్ణకరుణాభరణుం డగువిక్రమార్కుఁడుదీపితమంత్రశక్తి గడిదేఱిన భట్టి యుపాయ మాత్మబాహాపరిపాలితం బటుసమగ్రశుభప్రతిపాదిగా బుధస్థాపకదానలక్ష్మి యను దాది యశోరుచికన్య బ్రోవఁగన్. 226

ఉ. ఆతని కొక్కమంత్రి గలఁ డద్భుతశీలుఁడు పుష్పహాసవిఖ్యాతుఁ డతండు నవ్విన లతాంతపువాన యెసంగు నిస్తులాస్తోతకరాద్భుతక్రియలు చూచినయప్పుడు మానసైకశోకాతిశయంబు బల్మిని దదాస్యము హాస్యము గాన దెన్నఁడున్. 227

తే. అంత నొకనాఁడు విక్రమార్కావనీంద్రుఁడంతిపురమునఁ గదళిక యనేడు పేరఁదనరు మోహపురాణియుఁ దానుఁ గూడిపొత్తుల భుజింపఁగా నొక్కబోనకత్తె. 228

తే. ఒఱపు దనరారఁ జేఁపలయూర్పుఁగూరయిడినఁ గదళిక చే యెగనెత్తి యాస్యమవలగాఁ ద్రిప్పి యిదియేమి యారగింపవనెడు పతిఁజూచి రానిజంకెనలు నిగుడ. 229

ఉ. ఎన్నఁడు నిన్నెఁ గాని పరునెన్నఁడుఁ గన్గొన గండుమీల నిట్లెన్నిక లేక యంటి భుజియింపఁగవచ్చెఁ బతివ్రతాత్వసంపన్నిధినైన నాకనుచుఁ బల్కిన పళ్ళెరమందు ద్రుళ్లియక్కన్నులకల్కిమాటకుఁ బకాపక నవ్వే విపక్వమీనముల్. 230

క. నవ్వినఁ గనుఁగొని పొదివిననివ్వెరచేతులను వార్చి నృపవరుఁ డంతనివ్వటిలు సందియంబునజవ్వాడుమనంబుతో హజారముఁ జేరెన్.231

తే. చేరి మంత్రుల రావించి చిన్నఁబోవుమొగముతోడుత నద్భుతంబును వచింపనేల నవ్వెనొ యుడికినమీలు తెల్పుడనుచు గద్దించి యడుగ నయ్యలఘుమతులు. 232

క. ఇదియేమొ యిపుడు తెలియదుగద తగ వివరించి చూడఁగాఁ దోఁచినచోఁబదపడి చనుదెంచియు వినిచెదమన వారలకు నృపతి సెలవిచ్చుటయున్. 233

క. పనిచినఁ జనువారలలోఘనబుద్ధి యనంగఁ బేరుగలమంత్రి గృహంబున కరిగి హాస్యహేతువుఁగననేరక వగలఁబొగులగా నట్టియెడన్. 234

క. బాలసరస్వతి యతిమతిశాలినియగు మంత్రితనయ చనుదెంచి యిదేమాలోచన యని యడిగి తదాలాపములెల్ల విని మహాద్భుతమతియై. 235

వ. తన్మత్స్యహాసంబునకుం బూర్వంబునం బ్రవర్తిలిన కదళికావిక్రమార్కులవాక్యంబు లామ్రేడితంబుగా విని యంజనముఖంబున నిక్షేపంబునుంబోలె మనీషాబలంబునం దత్కారణం బెఱింగి యయ్యా యీయాశ్చర్యంబు వధూశాంబరీవిడంబనంబునం బొడమినయది పాముజాడ పామునకుంగాని పరులకుం దెలియఁబడని తెఱంగున నంగనలకుంగాని యిత్తెఱంగుఁ గనుంగొన మీకుఁ గొలఁదిగా దీగుట్టు బట్టబయలు గావించినం బాపంబు ప్రాపించుఁ గావున విజనాంతరంబున నుపాయంబున భూనాయకున కేఁ దెలిపెద నని యజ్జనకునివెంట వసనాచ్ఛాదితాందోళికారోహణంబునం దెరమఱుంగునం గూర్చుండి యక్కురంగనయన యనుప్రసంగంబు దిగిచి రాజపుంగవుతో నిట్లనియె. 236

తే. విక్రమార్కేంద్ర సర్వజ్ఞ చక్రనర్తివయ్యు నిక్కార్య మనయుల నడుగఁదగునెయడిగితేని నిజోదంత మవల నొడివియడలు పద్మినిఁ బోల్పఁ బట్టగుదువీవు. 237

క. ఆకథ యేలాగనినఁ బరాకు విశాలం బనాపురం బోకటి తగుంగాకోదరయువసౌథానీకాయతకమలఖేయనిరుపమ మగుచున్. 239

క. అందొక శూద్రుఁడు సుమతి యనం దగుఁ బద్మిని యనం దనర్చిన పరిపూర్ణేందువదన యిల్లాలుగఁబెందెవులుం బోని లేమి పెటపెటఁ బేల్పన్. 240

సీ. చేయప్పు లనుచు నిచ్చినవారు కటువుగానడుగ నుంకించి నోరాడ కరుగనెనరైనజుట్టాలమనుచు వచ్చినవారుబడలిక చేతఁ జెప్పకయె చనఁగనాయవారంబున కనుచుఁ జేరినవారుపరిహసింపక మున్నె తిరిగిపోవనెక్కలె జోగంచు నేతెంచువారు మాటాడి చూడక వేగ మవలికేగతే. శిశువు లెల్లను గలవారి చిన్నవాండ్రుతినెడి చిఱుతిండి గని యది తెమ్మటంచుగీజుపోరుట కెదఁ బెల్లగిల్లఁ బొగిలిపొలఁతి యూరార్ప నతఁడు కాఁపురము సేయు. 241

తే. కొఱుకునకు లేక మూషికకోటి చేరకునికి మార్జాలజాల మాతనినికాయసీమ వీక్షింపఁగా మరుభూమి యయ్యెనౌర దారిద్ర్యమహిమ యేమనఁగవచ్చు. 212

క. ఈజూడ లేమిచేఁ గడుఁదేజము చెడి వంటచెఱకుఁ దెచ్చుచుఁ బరనారీజనుల కమ్మి యాతఁడుగాజు గడపినట్లు దినము గడపుచు నుండెన్. 243

వ. ఇట్లుండి యతం డొక్కనాఁడు. 244

చ. వలనగు పుట్టగోచి బిగువాళ్లును సుంకపుకాసులు న్విభాసిలు కరసానగొడ్డలియుఁ జిక్కమున న్సొరకాయబుఱ్ఱలోఁజలిదియు నుంచి బంధుజనసంతతిదర్శనభీతి లోఁగుచుంగెళవులఁ జూచికొంచు నరిగె న్గహనంబునకై రయంబునన్. 245

మ. అపు డొక్కించుక మబ్బుగానఁబడి యింతై యంతయై మించి విష్ణుపదంబంతయు నాక్రమించి జనసందోహేక్షణాంథత్వకృచ్చపలంబై కడుగర్జితప్రబలమై సంజూతఝంఝామరుద్విపులంబై యొకవానవట్టె వసుధావిర్భూతపంకంబుగన్. 246

తే. అప్పు డాశూద్రుఁ డిదె వర్ష మరుగుదెంచెనింక నెట్లని భీతితో నేగి యొక్కదారుకల్పితహేరంబథామసీమఁగాంచి యందుండె బ్రతికితిగా యటంచు. 247

క. దళమయ్యె వర్ష మంబుధిఁదలక్రిందుగఁ బట్టినట్లు ధారాశ్రేణీ

ఝళఝళలు న్మెఱపుల బల్ధళధళలున్ స్తనితఫెళఫెళ ల్విలసిల్లన్. 248

సీ. పక్షపుటాంతరప్రాపితముఖపాళిశాఖాగ్రవసదండజవ్రజంబుబర్హివిభ్రమజాతభయపూర్ణబిలముఖోగమనాసమర్థాహిసముదయంబుఁగేదారకృతతటాకోదారప్రతిరతాబ్జాలోలసంచరద్ధలికనికరమర్ధముహూర్తసాప్యాయితసికతావశిష్టాంబురాశి యాశీచయంబుతే. గిరిదరీసుప్తగర్జితోత్కరహఠాత్ప్రబుద్ధసంక్రుద్ధశార్దూలభూరినఖశిఖోరునిహతసమీపగండోపలంబువర్ణన మొనర్పఁదగియె నవ్వర్ష మపుడు. 249

ఉ. అంతట నాత్మలో సుమతి యంబుజబాంధవుఁ డస్తమింపఁగానంతలు నింతలుం గల మదాత్మజు లాఁకట నేమియైరొ మక్కాంతవిభుండు తెచ్చుఁ గద గ్రాస మటంచుఁ దలంచుచుండఁగావంత యొనర్చెఁ జల్లనగు వానలు నెండలు ఱిత్త యిత్తఱిన్. 250

క. దినదినము ననక యేవనమున కేగక యున్న నింటఁ బ్రొయి రాఁజదుగాపెనువాన యింతట న్వెలిసిన నేగతిఁ బోదు ఱిత్తచేతులతోడన్. 251

క. నేటి కొకపూఁట కేనియుఁగూటికి లేకున్న ఱేపు గొడ్డలియెత్తంబాటిల్లదు బలిమి నిరాఘాటత్వర నడవి కరుగఁగాఁ దరమగునే. 252

క. అని తలఁచి నాల్గుదిక్కులుగనుఁగొని సముదారదారుకల్పితగణనాథునిఁ జూచి దొరకెఁ గదరాయనుచు న్వెసఁ జేరి యాతఁ డతికుతుకమునన్. 253

తే. చేరి యీచేవమ్రానిపిళ్లారి నఱికిచెక్క లొనరించి యంగడిఁ జేర్చి యమ్మియింటి కేగుట కార్య మింకేటి దేవుఁడేను గూటికి వగవఁగా నేమి కలదు. 254

తే. ఊరివారెల్ల నేఁటేఁట నొప్పగింపఁగడుపు విరియంగఁ దినీ పండ్లు గుడుములెల్లవారికొంపలలోఁ దప్పిదారి యున్నవెల్ల దినుమని తనతేజి కిచ్చు సెలవు. 255

క. కావున మఱి వీఁ డెక్కడిదేవుండొకొ దేవుఁడైన దృఢతరకరుణాశ్రీ వెలయ సిరు లొసంగఁడెయీవేళం దనకటంచుఁ గృతనిశ్చయుఁడై. 256

తే. పొడవుగా నెత్తి గొడ్డలి పూనిపట్టినఱఁకబోయిన నవ్విఘ్ననాయకుండునిలునిలువు మింత యేటికి నేఁటినుండిదినము నూఱేసి మాడలు దెచ్చియిత్తు. 257

వ. అని పలికి యాశ్చర్యమగ్నుం డగు నతని చేతికి నిజమాయాప్రభావసంపన్నం బగు మాడలముడుపు తుండాగ్రంబున నొసంగి ప్రతిదినంబు నంబురుహబంధుబింబోదయంబున నరుగుదె మ్మెవ్వరితో నేనియు నివ్విధంబునుం జెప్పిన నీకు నాకుం బనీలే దని యనుచున్నంతలో నొట్టుపెట్టినగతి వాన దొట్టున వెలిసిన నదియును లంబోదరమహాదరంబుగా నెంచి యింటికిం జని తనవాలుగంటికిం ధనంబొసంగిన నొయ్యన వలయు వస్తువు లస్తోకంబుగాఁ దెచ్చికొని కృతకృత్యయయ్యె నది మొదలుగా నతండునుం బూర్వోక్తసువర్ణప్రదాయకుం డగువినాయకువలనం దినదిన ప్రవర్ధమానమహావైభవుండై యుండె నంత. 258

క. పొరుగింటి యువతి మండోదరి యనునది పద్మినీసుధాకరవదనాగురువిభవముఁ జూచి నిరంతరతాప మసూయకతనఁ దను నలయింపన్. 259

మ. ఒకనాఁ డాయమయింటి కేగి కపటోద్యోగంబున న్లేనిమచ్చికతో ముచ్చటలాడి నీకు సరి యేసీమంతిను ల్లేరు సుమ్మెకసక్కెంబులు గావు లేమిపడుచో నీకైవడి న్వైభవాధీకవై యుండెడువేళ నేకగుణసందీప్తస్థితిం గాంచుటన్. 260

క. ఒకమాటఁ దెలిసికొన వేఁడుకయై యుండు మఱి యెన్నఁడు న్నే రాఁగూడకయుండు పనులబడి నీవకుటిలహృదయాబ్ద వగుట నడిగెదఁ జెపుమా. 261

క. ఏనెఱిఁగిన బ్రతుకే గదయీనడువడి యెట్లు కలిగే నింతటిలోఁ గాంతా నిక్షేపముఁ గంటివొపోనీ యెట్లైన గూఢముగ వర్ధిలుమా. 262

చ. అనవిని పద్మినీసతి ముఖాబ్జమునం జిఱునవ్వుదోఁప నాకును మది సందియంబె యెసఁగుం ధన మేగతిఁ జేరునంచు నేవినినది లేదు మద్విభుని వేఁడెదఁ దెల్పెడివారెకారు చెప్పిన నదియెల్ల నీకు వినిపించెద నీయెడ దాఁచనేర్తునే. 263

తే. అనిన మందోదరీమందయాన పల్కులెన్ని నేర్చితి వమ్మ నీ వెఱుఁగకుండనడఁచుకొన్నాఁడె నీమనోనాథుఁ డకటయిదియె నిజమైన నీమను వేటిమనువు. 264

మ. అకటా నీవిటు చేటుపాటులకు లోనైయున్నయిల్లాల వింతెకదా పుట్టినయిల్లుఁ జేర్చు వగలేదే సొమ్ము నీతోడఁ దెల్పక నెవ్వారికిఁ దెల్పు నాస్త మది దాఁపం బల్కఁగాఁ బోలు నేలిక యెన్నేనియు నేల చాలు పలుకు ల్విన్నంతనే తోఁచెడిన్. 265

క. నామగనివంటివాఁ డీభూమిన్ లేఁడమ్మ యేనె పోరాడుదు గాకేమాట యైన నాతోదామునుపే తెలుపు నవ్విధం బట్లుండెన్. 266

తే. ఇది యెఱుంగక యున్న నా కేమి కొదవనీకుఁ దెలియక యుండుట నీతిగాదుచేరి వరువేఁడు మిమ్మాటఁ జెప్పకున్నజత్తు సరిపోదు ననుము నిస్సంశయముగ. 267

మ. అని మందోదరి యింటి కేగుటయు నయ్యజాక్షి యారేయిఁ జల్లని పూఁబాన్పున వీడె మిచ్చి పతి కుల్లాసంబుఁ గల్పించి యాయనతో మిమ్మిఁక నమ్మరాదు గద నాథా యీసిరు ల్గల్గుటెల్లను నాకు న్వివరింపరైతిరని లీలాకోపముం జూపినన్. 268

క. సుమతి రతికేళి మీఁదందమకము గలవాఁడు గాన దాని నసంబంధమహానునయోక్తుల వక్షమునం గదియించి కూర్మి గడలుకొనంగన్. 269

క. ఇది తెలిపిన నపుడే సంపదవోవుంగాన నెఱుకపలుకక యుంటింగొదవా యిది నావలనన్ముదితా మది తాప మేల మోవియ్యఁగదే. 270

తే. అని యతఁడు వెండియును వేఁడ నవ్వధూటియింతలోఁబోవుసంపద యెన్నినాళ్లునిలుచు నౌలెండ నాతోడఁ దెలుపఁదగదెచాలు విడుమంచుఁ దరితీపు చలము నెఱప. 271

క. ఆసుమతి యపుడు కుసుమశరాసోన్మాదమున నాగణాధిపుకరుణాశ్రీసముపలబ్ధిఁ గంటి మహాసంపద లంచుఁ దెలిపె నాద్యంతంబున్. 272

క. అంతట నది యప్పుడె చనిమంతనమున గోడఁ జేరి మందోదరితోనంతయును దెలిపి క్రమ్మఱికాంతునికడనుండె గుట్టు గలయదివోలెన్. 273

శా. ఆమందోదరి చిఱ్ఱుబు స్సను చసూయాక్రాంతయై పోయి యేమేమో వేఁడెడు బిడ్డలంగదిసి యే నిం కెచ్చటం దెత్తు నయ్యా మీతండ్రి గడింపలేదు గద వెయ్యా ర్లెన్నఁడుం జాలు మీమోము ల్దిందురుగాక యిం కనుచు వీఁపు ల్చిట్లిపో గొట్టుచున్. 274

తే. చట్టితోఁ జట్టి పగులంగఁ గొట్టి తనదుపదరులకు నింటి బలుకుక్క లదరి కూయనడరు భయమున గుక్కుమిక్కనక వెనుకవెనుక కొదిగెడు తనప్రాణవిభునిఁ జేరి. 275

క. మగవాఁడ ననుచు నున్నావగునగునే కడుపు గట్టి యప్పులు మిగులన్దెగిచి యిటు వండిపెట్టినఁబొగులవు కుంభంబుమీఁది పొట్టేలుక్రియన్. 276

క. కిగ్గాడికాండ్రె యెపుడుందగ్గని సంపదలఁ బొదలఁ దామది యకటాబగ్గున మండెడు నీకునుసిగ్గించుక లేదు డొక్క జేనెఁడు గాదే. 277

క. పొరిగింటి పద్మినీసతిగిరుకుచు మట్టియలు గిలుకు గిలుకని నడువన్మెరమెరలు పుట్టవే కాఁపుర మేటికి మగఁడు పొట్టపోయక యున్నన్. 278

క. అని శాంతి దెచ్చుకొని పద్మినిచెప్పిన మాటలెల్లఁ దెలిపిన నతఁడే

నును జని పిళ్లారిని నలుకిన నతఁడే యిచ్చు సిరులు గెలిచితి ననుచున్. 279

తే. అంత నేగిన గణనాయకాలయమునకరిగె నాతండు సుమతియు నపుడె చనియెవారి నిద్దఱిఁ జూచి యవ్వారణాస్యుఁడధికకోపానుతాపదురాపుఁ డగుచు. 280

తే. ఒరుల కేటికిఁ దెలిపితి వోరి యనుచుసుమతిఁ గొట్టించెఁ బ్రమథయూధములచేతనేర నీ వేలవచ్చితీ వోరి యనుచునట్లు సేయించె నాఁడేగినట్టివాని. 281

తే. ఆసుమతి యట్లు నొగిలి గేహంబుఁ జేరియంతయును దెల్పఁ బద్మిని యడరు వగలందూలి మందోదరీకాంత తోడనేలదెలిపితి నటంచు మిగులఁ జింతిలఁదొడంగె. 282

ఉ. కావున విక్రమార్క వెనుకన్మదిలో నిటువంటికార్య మేలా వినిపింపు మంటి నని లాఘవవృత్తికి లోనుగాక నీవే విశదంబుగా నరయు మీ దినమెల్లను దోఁపకున్న నేనీవిధమంచు ఱేపు వచియించెద నేఁడటు పోయివచ్చెదన్. 283

క. అని బాలసరస్వతి యజ్జనపతికిని దెలిపె నని రసస్థితి మిగులన్వనిత కలశుకము దెలుపందినకరుఁ డుదయాద్రికరుగుదేఁ దఱి యయ్యెన్. 284

క. అంతఁ బ్రభావతి కేళినిశాంతమునకు నేగి నాఁటి సంధ్యావేళన్

గంతునిభుఁ డైన ధరణీకాంతునికడ కరుగుచో శుకం బిట్లనియెన్. 235

తే. అమ్మ యమ్మంత్రిసుతప్రభావమ్ము వినుమువిక్రమార్కవసుంధరావిభుఁ డొకింతతెలిసికొనలేక మఱునాఁడు పిలువఁబనుపజనియె నమ్మీననయన యాస్థానమునకు. 286

వ. చని యవనీకాంతసమాసీన యగుటయు నమ్మానవేశ్వరుం డితరప్రసంగంబున కవకాశం బొసంగక యంబుచరహాసంబునకుఁ గారణంబుఁ దెలుపుమనిన నచ్చెలువ కలకల నవ్వి పరుల నడుగందగని కార్యం బడిగెద విట్లయిన ననాచరణీయం బగుప్రయోజనం బొనర్చి యాపిమ్మట వనటకుంబాలైన పాలికయను బాలికతోడి పోలికగలవాఁడ వగుదు వది యెట్లనిన నవధానంబుతో వినుమని యిట్లనియె. 287

రెండవయుపకథ

క. ధరపై రత్నావళి యనుపుర మొక్కటి కలదు గగనపూరితమణిగోపురమై పరమేశ్వర్యాకరమై సరమై కలసదగారోత్కరమై. 288

క. ఆవీట రత్నవిదుఁ డనఁగా వైశ్యాగ్రణి యొకండు కలఁ డాతనికిన్దేవేరి యొకతె మన్మథదైవతమై పాలికాభిదాన తనర్చున్. 239

క. ఆపాలిక శశిరేఖారూపాలిక జారజనశిరోమణి సురతవ్యాపారమునం దన్నవ్యాపారప్రేమఁ జెందు టరయుట కతనన్. 290

సీ. ఓపరిపైన నీ కునికిఁ గావించిరేబజగెడి యని దూఱు బావగారుపొరిగింటిగోడచొప్పున గట్టివైచిరేయవునె నిన్ననిదూఱు నత్తగారువాకటిచెంతఁ గావలియుంచిరే నిన్నుగామిడి యని దూఱు మామగారుపెరటిలోపలఁ బాతిపెట్టిరేమే నిన్నువగలాడి యని దూఱు వదినెగారుతే. తోడికోడలు పగచాటి వీడనాఁడునాగడ మొనర్తు రెపుడు వియ్యములవారునేరముల నెంచఁ దొడఁగు బానిసెలగుంపుపతి పృథక్తల్పశయనుఁడై భయముఁ జూపు. 291

క. ఈరీతి నింటివారలుకారియ యొనరించుకతనఁ గార్కొని యుండన్నీరజలోచన నెమ్మదిజారజనియోగవాయుసఖు కున్మఖయై. 292

తే. అంత నయ్యింతి యారుదూరైనదాననైతినేకద తగువాని హత్తుకొన్న

నింతకన్నను నన్ను వీరేమి సేయనేర్తురని నెమ్మనంబున నిశ్చయించి. 293

తే. తనకు ననుకూలయగు నొక్కదాసితోడమాలిమి యొనర్చుకొని యుంచి మంచివెట్టిదానితో నొక్కనాఁడు మంతనమునందునింటివారలకసినికో లెల్ల నుడివి. 294

చ. పరపురుషాభిలాష మదిఁ బాటిలు టంతయుఁ దెల్పి తత్పురీపరిసరభూమిసున్న చలిపందిరి నొక్కనిఁ దెచ్చి కూర్చినంగరివరగామినీ సురతకాలమునందు నినుందలంతు దుష్కరమని చూడ కింతయుపకార మొనర్పుమటంచు మ్రొక్కినన్. 295

తే. అది దిగుల్పడి నీ వెట్టు లరుగుదెంతువెన్నికౌ నటుమీఁద నీకేమి కాకముక్కఱయుఁ గమలును దాల్చి మురియు నన్నుఁజూడఁజాలక యిమ్మాట లాడె దేమొ. 296

క. అని వీడనాడ దానిన్మనమున జడుపుడుపు తేటమాటలచే నవ్వనిత పొసఁగించి పనుపంజని కమ్మరవచ్చి యది నిశాముఖవేళన్. 297

తే. అమ్మ నీమాట మీఱరా దనుచు నదిగొనిలిపివచ్చితి నొకనిండునీటుకానిఁబురబహిర్నిర్జనప్రపాభూమి నచటికెట్లు పోయెదు పొమ్మని యేగుటయును. 298

తే. అందఱును నిద్రపోయెడు నంతతడవుఁజింతచేసియు సంకేతసీమఁ జేర

వెరవు గానక పాలికాతరళనయనయాత్మలోనన యొకయుపాయంబు నెంచి. 299

క. ఇది సేయరా దటంచున్మది నెఱిఁగియుఁ దహతహన్ రమాతనయు వశంవదయగుటం బానుపు డిగిపదయుగళము సద్దడంచి భయవిరహితయై. 300

తే. చని యధిశ్రయణిని వహ్ని సంగ్రహించియింటి నడికొప్పతగిలించి యెఱుఁగనట్లుముంగిటికిఁబోయి రొదగాఁగ మొఱలువెట్టనదరిపడి లేచి గృహదహ మనుచు బెదరి. 301

ఉ. పాలికనిర్జనాదిభయభావము దూరము చేసి వాసియౌబాళి జనింప నేగి చలిపందిటి ముందట నన్యభీతిచేనాలుగుదిక్కు లారసి ఘనంబగుచీఁకటి కందరంబునుంబోలు తదంతరాళతలము న్వడిఁ జేరి మహారిరంసయై. 303

క. అచ్చట జారుని గానకయ చ్చెలి యుచ్చలితమానసాంభోరుహయైఱిచ్చవడి తెచ్చుకోలగుహెచ్చరిక న్మఱియు వాని నెల్లెడ నెమకన్. 304

తే. వెదకి కానక వాఁడు నాహృదయ మెఱుఁగవేడి దాఁగెనొ యని బహిర్వేదిఁ జూచియెచట లే డెందొ యరిగినాఁ డేమొ యనుచునరిగి పందిటిలో నెల్ల నరసి పొగిలి. 305

శా. ఏరా మారునిబారికారియనున న్నిట్లేతురాతాళఁగాఁలేరా నేరము లేఱి దూఱక దయాలీలం గటాక్షింపరామేరా గారవ మారఁగా రతిసమున్మేషంబు లీకుండుటల్రారా కూరిమిమీఱఁ జేరి కయికోరా జారవీరాగ్రణీ. 306

తే. ఇప్పు డాయిందువచ్చు టిదేమి యనుచుఁగోపమున డాఁగితేమొ మద్గురుజనంబుకనుమొఱంగుట కొకనేర్పుఁ గాంచఁగోరియుంటి నేరంబు సైరించు టుచిత మిపుడు. 307

క. అని బతిమాలియు జారుంగనుఁగొనఁగా లేక దూతికం దిట్టుచు నవ్వనిత నిరాళం బగునెమ్మనము రతికిఁ దఱుమఁగా నమందవ్యథయై. 308

చ. వెలువడి చక్కఁజూడ కవివేకముగాంచితి నేమొ యంచుఁబందిలికయిపోయి యందరసి నిక్కముగా నతఁ డిందువచ్చుటేకలుగ దటంచు నిర్ణయముగాఁ దలపోయుచు నింక నేఁటితోబొలిసితి జారవాంఛ ననిపోయె నిజాలయసీమ డాయఁగన్. 309

క. చని యగ్నిభయముఁ జెందినతనవారిం గదిసి బహువిధంబులఁ దానున్వనరుచు నుండెను వింటివెజనవర యేతత్కథాప్రపంచం బెల్లన్. 310

తే. అవ్వధూమణి యిది యకార్యం బటంచుయెంచ కి ల్లగ్నికై యప్పగించి జారుగలయకడలినయ ట్లగుఁ దెలిసిచూడనడుగరానిది నీవు న న్నడుగుటెల్లఁ. 311

తే. కాన నేఁడెల్లఁ దెలియఁగాఁ గానకున్ననెల్లి తెలిపెద నీ కిది యెల్ల ననుచునరిగే బాలసరస్వతి యనుచుఁ జిలుకపలుక నంతటిలోనఁ బ్రభాతమైన. 312

తే. ఆప్రభావతి యంతఃపురాంతరమునకరిగి యారేయి మేదినీవరునిఁ జేరఁబోవుచోఁ గీర మనియె నంభోజవదన 'వినుము బాలసరస్వతీవిమలమహిమ. 313

క. అంత మఱునాఁడు ధరణీకాంతుఁడు పిలిపింప నజ్జగన్మోహిని యత్యంతవిభాసితమణి ఖచితాంతరపల్యంకికాసమారోహణయై. 314

సీ. నేల జీరక యుండఁ గేలఁ గుచ్చెలఁ బూనుకొని యూడిగపుఁ జెలు ల్గునిసి నడువమడిమెత్తు పరువుతో మంత్రాక్షతము లీయఁబాల్పడి భూసురభామ లెదురనొక్కకే లొఱగుపై నుంచి యేకాంతంబుదెలుపుచుఁ గూరి నెచ్చెలులు సనఁగనెదురుగాఁ బఱతెంచి నృపమౌళి సమయంబుహెగ్గడికత్తియ లెచ్చరింపతే. కోరి పురివారిజాక్షులు గుంపుగూడియమ్మ యిదిగాక యైశ్వర్య మౌర యనుచుఁబలుకఁ గోయిలపరిభాష లలతి నగవుమీఱ నన్నారి యరిగె హజారమునకు. 315

క. అరిగిన ప్రతిసీరాంతరమునఁ గూర్పుండి యద్భుతముగాఁ బాథశ్చరహాస మని ప్రసంగాంకుర మెత్తిన విక్రమార్కకువలయపతితోన్. 316

తే. అవ్వరారోహ పలుకు నన్నడుగ వలవదన్న నడిగెద విట్లేని యధిప మున్నుపలుకవల దన్నఁ బలికి యాపైవిచారమందు నలదందశూళ మట్లగుదు వీవు. 317

వ. తత్పురావృత్తాంతం బవధానాయత్తంబగు చిత్తంబుతో నవధరింపుము. 318

మూఁడవ యుపకథ

సీ. సహ్యశైలానీత జపతపస్సంజాతయఖిలజగత్పూత యైనమాతజడధినాయకు నేలుబడి గన్న యిల్లాలునిఖిలపుణ్యపుఁజాలు నిలుచుప్రోలుఅభ్రఘట్టనఖేలనాభీలకల్లోలయఘతూలికాజాల మడఁచుకీలఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీనవినుతసస్యవితానమునకు వానతే. యధిపతి సమాగమార్థప్రయాణసమయసముచితాంబుజనాళభక్షణవిలోలఘనగరుధ్వానపటపటాత్కారచారుభూరిసితవక్షభేరి కావేరి వెలయు. 319

సీ. జలమానవులు చిమ్ము జముదాళి చాలునామిసిమివాలుగ మీలు మిట్టి పడఁగవరుణుండు వైచు మవ్వపు బిల్లగోలనాఁదరగతూరుపు గట్టుదాఁక నిగుడవళులపరంగుల హరిగోలుగుంపునావనజంబులలఁతిగాడ్పునఁ జలింపసలిలాబ్దపాణి యచ్చపు మేలుముసుఁగునాఫేనపంక్తులుదరినాని యెసఁగ

తే. నలరు మాతృమనీషాసమాగతేందుకేళిదృఢబింబపాళికాకృతికదంబఖేలనాలోలమదమిళచ్చోళబాలికాముఖస్తోమ యయ్యాపగాలలామ. 320

ఉ. ఇవ్వలి రేవులం దుమికి యీఁది తటాలున నీటివాలుగానవ్వలిగట్టుఁ జేరు ద్రవిడాంగన లంబురుహోత్పలంబులన్దవ్వుగఁ ద్రోచు జడతగుఁ దన్నది జందెపువాటు గాఁగ మైమవ్వపు నీలపు న్సరు లమర్చిన టెక్కున నక్కడక్కడన్. 321

క. అసమలసమానబిసరుహవిసరలసద్ధూళి కలితవిభ్రమదావర్తసముదయం బానదిలోఁబొసఁగుం జలనరుల గొడుగుబొమ్మరములనన్. 322

తే. మణిధరనామకుఁ డగు నొకఫణివరుఁ డవగడము కతనఁ బడి యన్నదిలోగణనాతీతభయంబునందృణముం బలె ఝరమువెంటఁ దేలుచువచ్చెన్. 324

తే. వచ్చు నతనిఁ జూచి వఱద వెంబడినట్లుభీతి నరుగు నొక్క భేకవిభుఁడుకాష్ఠబుద్ధిమణివికాసితతత్ఫణాగ్రంబు నెక్కి బ్రదుకఁ గంటి ననుచు. 325

క. ఘనతరతరంగఘట్టనజనితవ్యథనిజఫణాగ్రసక్తుం డగునాతని నెఱుఁగఁ డురగవరుఁడుంజనియెం దరిఁ జేరలేక ఝరవేగమునన్. 326

క. చనువేళఁ దద్విధంబుంగనుఁగొని తత్తీరశాఖి గాలూఁదిన ఖంజనవరుఁ డొకఁ డిది యౌరాయని నవ్వుచు మఱియు నమ్మహాహికి ననియెన్. 327

తే. అకట ఫణిరాజ నీకు నాహారమైనకప్ప తలమీఁద నుండుట గానవేమొతెలియ కేమయ్యె దరిఁజేర నలఁతదీఱిదీని గబళింతునని యుంటివేని వినుము. 328

క. ఇది మంచిబుద్ధి యింకంబదటముచే నించుకేని భాషింపకు పల్కెద వేని నోరు నిలువకవదరిన భూసురుని పగిది వగతువు సుమ్మీ. 329

క. అనుచుఁ బాలసరస్వతిజనవరఖంజనము నపుడు సర్పముతోడన్వినిపించిన యాకథ నేవినిపించెద నేఁటిప్రొద్దు వేగం జనియెన్. 330

తే. కాన నేఁడెల్ల మదిలోనఁ గార్యసరణిఁజూచి యూహించి తలపోసి చూచికొనుముయెల్లి తెలియంగలేకున్న నేనె వచ్చితెలిపెద నటంచుఁ బలికి యక్కలికి యపుడు. 331

క. జననాథుఁ డంప నేగెనుదనయింటి కటంచుఁ బలికి తద్దయుఁ బ్రేమం

బునఁ బల్కె వైశ్యభామినివిని వేగుట గాంచి మదనవేదనమతితోన్. 332

తే. అంతిపురమున కేగి యయ్యబ్జనయననాఁటిరాతిరి భూనాథు నరయఁ దలఁచిదూతికాయుక్త యగుచు నే తెంచినట్టిసెట్టిసానిఁ గనుంగొని చిలుక వలికె. 333

తే. సకలశుభమస్తుతే వైశ్యసారసాక్షియక్కడికి దెల్పి నిల్పితినమ్మ కథయుమది దలఁపువచ్చె నటుల నమ్మంత్రితనయవేగమఱునాఁడె భూమాశు వెఱ్ఱిబుద్ధిమాన్ప మదిలోఁ దలంచి సంభ్రమముతోడ. 334

వ. నవరత్నఖచితచతురంతయానాధిరూఢయై యవ్వరారోహహజారంబుఁ జేరం జని యవనికాభ్యంతరంబునఁ గూర్చుండి మీనహాసకారణాధీనాజ్ఞానపరుండై యున్నయన్నరేంద్రచంద్రుం గని దత్కథాప్రసంగంబు వినుమని యిట్లను నట్లు మహాప్రవాహముఖంబునం బడి తెప్పిరిల శక్తి చాలక మండూకధృతమస్తకంబై పోవు నమ్మహాభుజంగంబుతో నాఖంజనం బిట్లనియె. 335

క. ఆకథ వినుమని తద్గాథాకథనకుతూహలంబు దఱుమఁగ వెంటన్నాకపథంబునఁ బోవుచునాకుండలివిభునితోడ నతఁ డిట్లనియెన్. 336

ఉపకథలో నుపకథ

సీ. తామ్రపర్ణీతీరధరణిపై నొకయగ్రహారంబు కోశాంబి యనఁగఁ బరఁగునచ్చోట విష్ణుశర్మాఖ్యకుం డై యొక్కభూసురుం డలరు నద్భుతచరిత్రుఁడాతండు సుకుమారి యనుభార్యతోఁ గూడియఖిలసౌఖ్యంబుల ననుభవించునంతట నయ్యింతి యాత్మజాతులఁ గొంచికడియంపుఁజే మీఁదు గాఁగ దివముతే. సేరుటయు వార్ధకమ్మున ఘోరతరవిచారగరిమను నతఁ డర్థసంగ్రహమునకిచ్చగింపని యాతనివృత్త మెఱిఁగితల్లియు సహోదరీజను లెల్లఁ గదిసి. 337

తే. భార్య యుండిన వనమైనఁ బట్టనంబుపత్ని లేకున్న గృహమైన బహుళగహనమగుచుఁ గాన్పించు నరులకు నంతయేలనాలు లేకున్న విధినైన నధముఁ డండ్రు. 338

క. యాగముల నయోగ్యుండగుభోగములకు బాహ్యుఁడౌ సుపుత్రోదయలీలాగణ్యయైన భార్యాయోగము లేకుంట నరుల కుచితమె చెపుమా. 339

ఆ. ఎంత దుఃఖమైన ఒంటికి వచ్చి యిల్లాలి మొగముఁ జూచినపుడె తలఁగు

నిది యెఱింగి కాదె ఋషులు వసిష్ఠాదులును సభార్యు లగుచు వినుతిఁ గనిరి. 340

క. ఒడలంటం గాళ్లు పిసుకంగడివెఁడు వేన్నీళ్ల నీయఁ గంచము వెట్టన్బడక యమప్పఁగఁ జేతికివిడెమియఁగ భార్య కాక వేఱొక తగునే. 341

తే. తిథులయందైన మఱి యపత్నీకుఁ డనుచుబ్రాహ్మణార్థంబుఁ జెప్ప రేపాటివారునొకతె రూపసి గాకున్న నోసియన్ననోయనెడు మాత్రమునకైన నుండవలయు. 342

క. కావునఁ బునర్వివాహముగావలయు నటంచుఁ దెలుపఁగా నాతఁడు మేధావిని యను భూసురసుతఁబావనతరవంశజాతఁ బరిణయమయ్యెన్. 343

క. ఇలునించికొనుట మొదలుగఁజలమున మెం డొడ్డి మిగులఁ జండించుచుఁ దత్కలకంఠి గురుజనంబులకులధర్మం బెంచ కేలుకొంచుం దిరుగున్. 344

సీ. తండులమాషముద్గముల గాదెల నించిమీఁద బిళ్ల లమర్చి మెత్తు వెట్టుబక్వశాకం బెల్లఁ బతికంచమున నుంచియొడికంబుగాఁ బట్టి యూర్చివైచునాజ్యతైలఘటంబు లన్నియు వాసెనల్గట్టి యందనిచోట సుట్టె నుంచు

దధిపయోముఖరసద్రవ్యంబు లెల్ల దొంతుల సందు మూలమూలల సడంచుఁతే. జిక్కుఁజిలువాన మొకయింటఁ జేర్చి తలుపుచిలుకు ముద్రించి బీగముచేయిరొండిఁజెక్కికొనుఁ గ్రొత్తవలపులఁ జిమ్మిరేఁగివల్లభుం డెల్లయెడఁ దన్ను జెల్లవిడువ. 345

తే. ఇంట నెవ్వారయిన భిక్షమిడిన ముష్టిపెట్టినఁ గరాళితేజి యొప్పిదము దోఁపనెగిరిపడి యిందులకు మీర లెవ్వరనుచుఁబెద్దపులిఁ బోలె రొప్పు నాబిసరుహాక్షి. 346

క. నాయి ల్లిది నాకాఁపురమీయెడ నాసొమ్ము దినుట కెవ్వరు మీరౌరాయంచు నత్తవదినెలవాయోడక కసరుఁ బోరు వారలతోడన్. 347

తే. ఇవ్విధంబున మెలఁగు నయ్యింతి యొంటితిండికతమున నినుమడి కండపట్టినీరుపోసిన మేనితో నిలుపరానిమనసుచే జారభోగ మేమఱక తిరిగె. 348

సీ. కలికిమాటలు కిలకిల నవ్వు లోరచూపులు మోవివిఱుపులుఁ గులుకు నడలుఁబై ఁటజార్పులును సోబానపాటలు కొప్పుసవరించు నీటు చేసన్న వగలుగోటిచిమ్ములు తెచ్చికోలు నెవ్వగ లేనివెఱుపులు నెచ్చెలి వెన్ను చఱపు

మోముద్రిప్పులు బొమముడి ఱొమ్ముతాటింపురాని జంకెన కావరంపుఁబొగరుతే. మొలకసిగ్గులు వట్టికొంకులును దలుపుచాటునిలుకడ లలతివేసటలు చూపుగడియలో వింతవగకానిఁ గాంచెనేనికొమ్మ మారుని జంత్రంపుబొమ్మకరణి. 349తే. ఇవ్విధంబునఁ జలిదీఱి యింటిపనులునూఱునటు వెట్టి వల్లభునోరుఁ గొట్టియెల్లసొమ్ములు జారుల కెదురువెట్టసాగె నిచ్ఛావిహారనిశ్చలత మీఱ. 350

సీ. పొంకంబుగా నూనె పంకించి సవరంబుకుప్పె గన్పడఁ గొప్ప కొప్పువెట్టునీటికాఁగులలోన నీడ చూచి రువారమిట్టార యనఁ జాదుబొ ట్టమర్చుఁజనుదోయి జిగిమించుకొనఁగఁ బూసినమాడ్కిరహిమించు గుత్తంపుఱవికఁ దొడుగుసురటి విచ్చినరీతిఁ దొరయు కుచ్చెల నేలజీరాడఁగాఁ జల్వచీరఁగట్టుతే. జాఱుపైఁటచెఱంగు బంగారుపూలగాజులబెడంగు జారశృంగారములకుజొక్కుచూపు మెఱుంగు తళుక్కు మనఁగవీథి నేవేళ మెలఁగు నవ్విప్రవనిత. 351

క. అంతట మగనికి నన్నంబింతయిడక వండినట్టి దెల్లను జారో

పాంతములఁ జేర్ప నాతఁ డనంతవ్యథఁ గూటిబీదయై నెవ్వగలన్. 352

క. నీనడకలు గంటి గదేకానీవే నగరఁ జెప్పి కారించెద నిన్నే నంచుఁ గుంటిసుంకరిఫూనిక బెదరించుఁ బొలఁతి బొమముడి వెట్టన్. 353

తే. అంత నయ్యింతి యొక్కింత యళికియాడిప్రేగులోపలితీఁట నీబీదముసలికన్ను లుండంగఁగద నన్ను గదుమసాగెననుచు జింతించి యొకయుపాయంబుఁ గాంచి. 354

తే. గ్రామదేవతయగు నమ్మగారి గుడికిదినదినంబును జని మహాదేవి మగనిగ్రుడ్డి గావింపు మేఁటేఁటఁ గోడిబలియుఁబొంగలి ఘటింతు నని మ్రొక్కి పోవు మగిడి. 355

ఉ. అంతట విష్ణుశర్మ జఠరానల తాపము పర్వ నెంతయుంజింతవహించి యించుకయు శిక్ష యొనర్ప సదక్షుఁ డౌట నీయింతి నిజేచ్ఛమై మెలఁగని మ్మిఁక నన్నముఁ బెట్టెనేని నాకంతియె చాలు దీనికి నుపాయము జూచెదనంచు నెంచుచున్. 356

తే. ఊరి వెలుపలఁ దగు నమ్మవారిగుడికిదినదినము భార్య చనియెడు తెఱఁగుఁ దెలిసియచటి కొకనాఁడు మున్నుగా నరిగి శక్తివెనుకఁ గూర్చుండు నంత నవ్వనిత వచ్చి. 357

క. అమ్మా ప్రతిదినమును నేనిమ్మాడ్కి న్వేఁడుకొనఁగ నెన్నటి కీఁక నీవమ్మగని గ్రుడ్డి చేసెదునమ్మిన నాకోర్కి నీకొనర్చుట గాదే. 358

క. అని మ్రొక్కిన నప్పలుకుల్విని ధరణీదేవుఁ డెలుఁగు వేఱొకభంగిందనరఁగ నద్దేవత పల్కినగతి నిట్లనియె సుమ్మలిక మెల్లఁజనన్. 359

క. నీమగని నంధుఁ జేసెదనామాట ల్విను మతండు నలుగుడుపడరాదోమగువ యతని కన్నముప్రేమంబునఁ గంచ మరసి పెట్టుము దినమున్. 360

మ. అన మేధావిని శాంకరీవచనమే యంచు న్వితర్కించి యంత నిశాంతంబున కేగి వల్లభునకు న్వడ్డింప నన్నంబు శాకనికాయంబును సంఘటించిన నిజాగారంబుఁ జేరంగ వచ్చినవాఁడై యతఁ డూరకుండక మదశ్రీ నిట్లను న్భార్యతోన్. 361

క. తరుణీ యేమో తెలియదుతెరగట్టినయట్టు లున్నదే కన్నులకుందెరువడుగుచు వచ్చితి మందిరమున కిఁక నేమి యనుచుఁ దెలుపుదు నీకున్. 362

క. ఇన్నాళ్లకరణి నేరములెన్నక నీయిచ్చఁ దిరుగు మిదియు మొదలుగా

నన్నము వస్త్రం బిడుచున్నన్నుం బోషించు మింక నలినదళాక్షీ. 368

వ. అను నప్పలుకుల కప్పడతి యతనిం దప్పక కనుంగొని యతండు నిజాగమనసమయమున నింటిలోన లేఁడనియు నింతలోన నిప్పాపి కంధత్వంబు ప్రాప్తించెనే యనియును మదీయభ్రమావిభ్రమం బింతియె కాక లోకంబులో నుపలంబులు పలుకంజాలునే యనియును జల్పపరాయణుండై యితం డద్దేవిమఱుఁగున గూర్చుండి పలికెం గావలయు నని సిద్ధాంతీకరించి వంచనాపరుం డగునితనిం బోషించిన మంచిదాన నగుదునే యని యెంచి కావించినసమంచితాన్నశాకానీకంబులు జారలోకంబున కల్పించిన నవ్విష్ణుశర్మయు నెఱుంగక నిత్తెఱంగున మాటలాడి నోటికూటికిఁ జేటు దెచ్చుకొంటిఁగదా యని డెందంబునం గుంది వినిందితరసనుండై కృశించెం గావున మౌనంబున నుండుమని ఖంజరీటంబు తెల్పిన సానుభవంబున మేను మఱచి యయ్యురగవరుం డేతత్కథావిశేషం బింతయొప్పునే యని యుచ్చైస్వనంబునం బలికిన నులికిపడి యవ్వతికిం జనిన మండూకమండలేశ్వరుం గనుంగొని యిప్పాట నోటికడి పోఁగొట్టుకొంటివే యని ఖంజరీటం బరిగెఁ గావున. 364

ఆ. పరుల నడుగరాని పరమరహస్యంబులడుగఁ దగునె విక్రమార్కభూపనీవె తెలిసికొనుము నేఁడెల్ల లేకున్నఱేపు తెలియ నేర్పఱింతు నీకు. 365

తే. అని యమాత్యతనూజ యయ్యధిపుచేతనంపకము గాంచి యింటికి నరిగె ననుచుజిలుక వచియింప నంతలో జలజబంధుఁడుదయగిరిసౌధవీథిపైఁ బొదలుటయును. 366

చ. కనుఁగొని యాప్రభావతి జగజ్జనరంజనరాజభాషణంబెనయక చిల్క పల్కులకు నేమఱియెన్ హృదయం బటంచు మోహనగృహసీమఁ జేరి మఱి యంబుజము ల్ముకుళించు వేళఁ బూనినపని కేగుచోఁ గలువనేజపురాయనితేజి యింపునన్. 367

తే. కప్పురపుబొట్టు చెమటచేఁ గరఁగి జాఱెఁజక్క దిద్దుము పూర్ణిమాచంద్రవదనయింతలో నొక్కకథ వినిపింతు ననుచుఁబలుకఁదొడఁగెను బులకండ మొలుకుచుండ. 368

క. మఱునాఁడు విక్రమార్కుడరసియుఁ దెలిసికొనలేక యమ్మంత్రిసుతంబరిచారకయువతి పరంపరచే బిలిపించికొని సమాదరణమునన్. 369

తే. తెరమఱుంగున నిలుప నత్తెఱవ పరులనడుగఁగూడని యిక్కార్య మడిగినపుడెప్రబలతరమైన జాతిస్వరంబుఁ జూపియడలు తురగంబుతోడ జోడగుదు వీవు. 370

అయిదవ యుపకథ

ఉ. ఆకథఁ జిత్తగింపుము ధరాధిప సాధువనం బనంగ నస్తోకతరప్రసిద్ధిఁ బొలుచుం బుర మొక్కటి యందు మందరా

ఖ్యాకలితుండు శూద్రుఁడు నయాన్వితుఁడై తగునాతఁ డిందిరాలోకన మేమి లేమి నతిలోకదరిద్రతఁ జెంది కుందుచున్. 371

సీ. కొలుచువారల నోరుగొట్టి లెక్కలు వ్రాసిహరువు మీఱఁగ మణియములు చేసిబ్రమసి యాసాసలరసవాదము లొనర్చిప్రకటించి రాజపట్టికలు దీర్చిప్రతివాసరంబు లేర్పడఁగఁ జేరువగట్టివాటంబుగాఁ దెరువాటు గొట్టివేళ్లమందు లమర్చి విషవైద్యతవహించితఱుఁగుబేరముల నెంతయును మించితే. మ్రుచ్చువగయును గని చూచి మూటమోసిసుంకరులతోడ నొనగూడి జూదమాడియిట్లు వర్తించియును నాతఁ డేమి యందుగళవళముఁ జెందెఁ గూడుఁ గోకయును లేక. 372

తే. అంత నమ్మందఱుం డమందార్తి నుదరపోషణంబునకై యూరిపొంత దోసతోఁటఁ గావించెఁ గావడిపాటుపడుచునదియు నధ్వన్యదృక్పరం బై తనర్చె. 373

ఉ. అంతట నొక్కనక్కదొర యంబుజబాంధవుఁ డస్తపర్వతోపాంతముఁ జేరుదాక బొరియం జఠరానలకీల నెంతయుంజింతిలుచుండి రేలు తన జీతపుబంటులు దాను భీతియొక్కింతయు లేకయే మెసవి యేగుఁ దదీయఫలంబు లన్నియున్. 374

తే. ఆసృగాలాగ్రణికి ఘటకాక్య వెలయునాతఁ డీరీతిఁ గర్కరికాతిపక్వ

ఫలపరంపర నుదరసంభరణవృత్తినడుపుచుండఁగ మందరుం డలుకవొడమి. 375

ఉ. అక్కట దోసతోఁట యిదియైనఁ దదీయఫలంబు లమ్మి యీడొక్కను సాకగోరితిఁ గడు న్నడురేలున వచ్చి యెవ్వరోమక్కువ లేక నాకడుపుమంటయుఁ బుచ్చికొనంగఁ బూని యీచక్కెరవంటి పండ్లు తినసాగి రటంచుఁ గృశించు నెంతయున్. 376

చ. ఒకమృగధూర్తరాజవరుఁ డుజ్జ్వలనీతివిదుండు ధీరనామకుఁ డతిదూరఘోరననమధ్యవిహారుఁడు విద్విషద్విదారకుఁ డొకనాఁడు వేడుక సరాళముగా భటకోటితోడ నోడక యరుదెంచె నచ్చటి కటత్తటిదీక్షణవీక్షితాస్యుఁడై. 377

తే. వచ్చి బడలిక దీర్చు దుర్వారకర్మరీఫలామోదధౌరంధరీవరిష్టపవనములచేత నాహారభాగ్య మిచటనబ్బు నని యెంచి కెలని బిట్టడవి విడిసె. 378

క. తనమంత్రి వరులతో మంతనమున నీదోసతోట తనరెడుచోటన్మనజాతివార లుండరెయని యాలోచన మొనర్పు నాసమయమునన్. 379

మ. ఘటకుండంతట వేగువారు నుడువంగా ధీరుఁ డారీతి వచ్చుట లెల్ల న్విని మంత్రులం బిలిచి యిచ్చోఁ బోయి సంధించి యుత్కటమద్వైభవ మెల్లఁ జూపుటనువో కాదో విచారింపుఁ డేమిటికన్న న్మన కొక్కవేళకగు తన్మిత్రత్వమం చెన్నెదన్. 380

చ. అది యటులుండె నంతటి మహామహుఁ డిచ్చటి కేగుదెంచినందుది మొద లే నెఱింగియు నెదుర్కొని పూజయొనర్పకున్కి యొ

ప్పదు మనమ ట్లొనర్చినను బ్రాభవహానియె గౌరవంబు సొంపుదనర మున్ను మ్రొక్కి గద మ్రొక్కు గొనన్వలయుం జగంబునన్. 381

క. అనిన విని సచివులందఱుననఘా మఱి యాతఁ డింత యధికుం డైనంగొనివచ్చి పూజలిచ్చినమనకుం దప్పేమి యది సమంచిత మనినన్. 382

తే. బుద్ధిసారాఖ్యసచివుండు పూని పలుకుదొరను మంత్రులఁ జూచి సంతోషమయ్యెమొదల నెందైనఁ జన నాకు ముదలయిచ్చిధీరజంబుకవరుని సంధింపఁజనుఁడు. 383

వ. అనినం దదీయసంధానసముత్సాహభంగకారణం బగు నతని ప్రతికారవచనంబులకుఁ జిడిముడిపడి యితం డేమి యెఱుంగు విచ్చేయుం డనుచు సంధానపరకృత్యులైన యమాత్యులం గూర్చుండ నియమించి యామృగధూర్తచక్రవర్తి యిట్లనియె. 384

క. ఒకనికిఁ దెలియు న్వేఱొకనికిఁ దెలియక యుండుఁ గార్యనిర్ణయ మితఁడేటికి నడ్డుగాళ్లు వైచెనొయకటా యది యెల్లఁ దెలియ నడుగన్వలయున్. 385

క. అని బుద్ధిసారు నెమ్మొగమునఁ జూపులు నిలువఁ గేలు మొగిచి యతం డోయనఘాత్మ వీరికన్నంఘనుఁడంగా నైన నొక్కకార్యము వినుమా. 386

చ. మును వినియుందు ధీరుని సమున్నతగర్వవిహారుఁ డంచు నాతని మదికి న్భవద్బలవితానము చీమలచాలుఁ బోలె నైకనఁబడు నీవు పల్కు నుడికారపుమాటల కెల్ల నాతఁ డా.డును విరసంపుఁబల్కులు గడు న్మఱి మోసము వచ్చు నత్తఱిన్. 387

క. మోసము వచ్చుట యరుదేయీసునం దద్గర్వభాష లిచటి సృగాలాగ్రేసరులు సైతురే వినుమాసమయము సుమ్ము దొరల కవగడ మరయన్. 388

ఆ. అతఁడు గర్వయుక్తుఁ డౌటయుఁ గాకున్ననొక నిదర్శనము మహోగ్రశౌర్యప్రభుగుణంబు విడిచి పరభూమి కింత దూరంబు వచ్చునే సరాళ మనుచు. 389

క. కావున గర్వాతురుఁడైకావలెఁ గాదేని యిచటి కర్కరికాళిందావిని తదాశ వచ్చెంగావలె నెట్లైన మనకుఁ గావలెఁ జుమ్మీ. 390

మ. మనకీకర్కరికాఫలాళిగద సామ్రాజ్యంబు గల్పింపఁ జాలినయాహారము దానికై యితఁడు దోర్లీలాసముల్లాసతంజనుదేర న్మనమేగి విందులగతి స్సంధించు టేకార్య మిప్పని నాకు న్సరిపోదు మీకు రుచియింపం బోలు నిప్పట్టునన్. 391

క. తటచలితచలదళచ్యుతతొటతొటరవశాలిఫలమిథోరణకేళీపటుతరజలచరనికరోత్కటమై తనరారు చెఱువు కాలువఁ జేరెన్. 393

తే. చేరి పనిపూని యిటకు నచ్చితి మదుక్తికొదవపడకుండ నెట్లొనఁగూడు నొక్కొ-కార్యమని నాల్గుదిక్కులు గనుచునుండదైవవశమున నత్యద్భుతంబుగాఁగ. 394

సీ. క్రవ్యాగతోగ్రకాకవిధూతమక్షికాపుంజమై తగు వెన్నుపుంటితోడబాలకక్రీడావిపాటితరోమజాలంబైనయట్టి వాలంబు తోడనగ్రిమపాదబంధాతికృధాసముందనములౌ వెడవెడ దాట్లతోడఁగఠిననిజస్వామికరకాష్ఠనిహతజాతంబునై తొరఁగు రక్తంబుతోడఁ

తే. గర్ణకంఠోదరాభారకంబు లగుచునమరు ముయ్యూరుపిడుఁదుతండములతోడనచ్చటికి వచ్చె నొకయశ్వ మల్పహేషజాతి దెల్పఁగ జలపానసంభ్రమమున. 395

ఉ. వచ్చి జలంబు గ్రోల నిలువంబడఁ గల్గొని బుద్ధిసారుఁ డుద్యచ్చతురత్వ మొప్ప వినయంబునఁ జేరి నమస్కరించి యేనిచ్చట నిన్నుఁ జూచి చనియెన్ బహుకాలము నేఁడుగంటినాముచ్చట లెల్లఁ దీఱ మన మున్పటి నెయ్యము లెంచుకొందువే. 396

చ. అది యటు లుండె తను వనంతబలాఢ్యము బక్కచిక్కియున్నది యిది మాఱురూపువడి యద్దిగ యిద్దురవస్థ యేక్రియంగదిసనొ నన్నువంటి చెలికాఁ డొకఁ డుండఁగ నిమ్మనోవ్యథాభ్యుదయము వొందనేటికి నయో నను వింతఁగఁ జూడఁ బాడియే. 397

క. అనిన విని యత్తురంగంబనఘా నిను మఱవనేర్తునా బహుకాలంబునకైన బుద్ధిసారుండనుసుకృతివి గావె నెయ్య మలఁతియె మనకున్. 398

క. మామా యల్లుఁడ వని మనమామాడ్కిన్ వావి యొకటి యమరించి నయశ్రీమించఁ బ్రవరిల్లుటయేమైన న్మఱచువాఁడనే గుణహారా. 399

చ. ప్రకటవిషాదవేదనవరస్పరవృత్తి నినుం గనంగఁ దావకవిహితప్రవృత్తికి నవజ్ఞత యెంచక పల్కరించి నీ

వకుటిలవృత్తివైతి వినయాభరణా మదిఁగోరి యుందు మామకహృదయవ్యథాకథ సమస్తము నీ కెఱిఁగింప నెప్పుడున్. 400

ఉ. ఈపురి నొక్కరెడ్డి వెలయిచ్చి ననుం గొని తెచ్చి పోషణశ్రీపరివర్ధమానునిఁగఁ జేయుట నీవు నెఱుంగుదే కదాయాపయి నాతః డొక్కయెడరైన నను న్వెలకిచ్చె నన్యవిత్తాపహృతిప్రణీతమతిహారికి వేఱొక బేరివానికిన్. 401

క. అతఁ డింక నేమి సెప్పుదుసతతము నూరూరిసంతసంతల కత్యుద్ధతిఁ బెఱిక లెత్తి తఱుమున్మతినరయం డింతయైన మత్తనుబాధన్. 402

తే. పెఱికయేచాలు నానడ్డి విఱుఁగఁ జేయదానిపైఁ దాను నెక్కు నింతయునుగాకయకట వయ్యాళిగాఁగఁ బొమ్మనుచుఁ గొట్టునతనిచేతులలోఁ జెంగలమ్మ గొట్ట. 403

మ. పొరుగూళ్ళం దిరునాళ్లు సాగిసభరంపున్మానిసి న్మోయ నిష్ఠురవృత్తి న్ననుఁ జూపి సుంకము లటంచుం గూలియించు న్వరాలురయం బారఁగ మోచి నన్నుఁ దఱుము న్లోభాప్తిమైఁ దా నిరాదరుఁడై మేఁపఁడు కాళ్ళు గట్టి విడుచుం దత్తత్ప్రదేశంబులన్. 404

తే. గొఱపమా లేదు నీ రార్చుగొడవ యెఱుఁగగడ్డి వేయఁడు కవణంబు గానివానిజంబుకాధీశ చూడు మీచాయ నేనుగుఱ్ఱమై పుట్టి యీగోడు గుడుపవలసె. 405

క. త్రిమ్మరి మాపటికై తనయిమ్మున కేతేర దుక్కి యెనుపోతులు రెండిమ్ములఁ గొమ్ములఁ జిమ్ముంగ్రమ్మిన నిర్దయతఁ బసులగాడింగట్టన్. 406

ఉ. అక్కఠినాత్మకుండు కసవారసి తెమ్మని కూఁతుచేతికింజెక్కుడుఁబాఱ యీయ వడి నెట్టది వెల్వడి చేనిమంచెపైనెక్కినజారుఁగూడి రమియించి దినాంతమునందు వచ్చి బల్తొక్కులు నా మొగంబున విదుర్చును గొన్నితృణాగ్రఖండముల్. 407

క. తొంటిజని వానియు ప్పటుతింటిఁ జుమా యింతపాటుఁ దెచ్చుకొనుటకైకంటికిఁ గూరుకురా దాఁకంటికిఁ దుది లేదు చిక్కకయె యెట్లుందున్. 408

క. ఇటువలె నున్నది నాకథఘటకసృగాలేంద్రుఁ గొలిచికద యుండుదు వప్పటుమతికి సేమమే యిచ్చటి కేటికి వచ్చి తనిన జంబుక మనియెన్. 409

తే. అకట నీయట్టి సుగుణరత్నాకరునకునిట్టిదురవస్థ వచ్చెనే యింకమీఁదనంతయును జక్కనయ్యెడు నస్మదాగమనము వినిపింతు వినుమాసమానమాన. 410

క. ఘటకున కహిభయ మొదవెన్బటుగతి నీకుఁగల పక్షపాత మతనిపైనటియింపఁ జేసి మెలఁగుముదిట మలరం దార్క్ష్యనామధేయుఁడ వగుటన్. 411

వ. అని ధీరాగమనంబు సవిస్తరంబుగాఁ దెలిపి వెండియు. 412

తే. నీవు మాకెల్ల దొరవోలె నేఁడు మొదలుకొన్నినాళ్లుండు భవదీయఘోరమూర్తిఁగాంచి ధీరుం డపూర్వమృగం బటంచుఁదలగు నది మాకు శుభము గంధర్వరాజ. 413

క. ఈరేయి దోసపం డ్లవ్వారిగఁ దిను మర్కు డపరవసుధాధరముంజేరిన పిమ్మట నిలుమీచేరువ నే నపుడు వచ్చి చేర్చెదఁ దోఁటన్. 414

క. అనిపల్కి బుద్ధిసారుఁడుచని యంతయుఁ దెలిపె ఘటకజంబుకకులనాథున కంతటఁ జారులు దెల్పిన నది విని ధీరుఁడొక్క లేనగవలరన్. 415

క. తనమంత్రి సుముఖనామకుఁగనుఁగొనుటయు నతఁడు లేచి కార్యముమీఁదన్ననుఁ జిత్తగింపు మనుచుంజనియెం దత్తురగమున్న చక్కటి కెలమిన్. 416

చ. చని కరము ల్మొగిడ్చి బుధసన్నుత జంబుకజాతివాఁడ నత్యనఘుఁడ నే నతీతము ననాగతము న్మఱివర్తమానముంగని వివరింతు నిప్పు డొకకాఱియచే వెతఁ జెందినాఁడ విద్ధినమున నీకుఁ గల్గువడదేఱఁగ గర్కరికాఫలావళుల్. 417

చ. ఇది నిజమైన ఱేపు వచియించెదఁ దక్కినకార్యమంతయుందుదినొక విన్నపంబు దయతో విను మాఁకటఁ గుందినాఁడ నేఁడదనున దోసపండ్లు తినునత్తఱి నన్నొకసారి పిల్వు

నేఁజెదరని ప్రీతి నివ్వెలుఁగుచెంగట నివ్వలఁ బొంచియుండెదన్. 418

క. అనిపూన్చి ధీరుతో నత్యనుపమగతి సుముఖనాముఁ డవగడమగునట్లొనరించి వేగవచ్చితినని తెలిపె న్రవియుఁ బశ్చిమాంబుధి గ్రుంకెన్. 419

వ. అంత. 420

మ. రవి రాక న్మదిఁగోరు పద్మినులు చక్రస్త్రీలు మోము ల్ముడుంప వియోగవ్యథఁ గుందఁ బాల్పడియెమామాడ్కి న్మముం గోరుకైరవణీలోకము చెంగలించె నది చంద్రప్రేమ మస్మద్విలోకవిసృష్టం బనిజారలాడ నడరెం గాఢాంధకారచ్ఛటల్. 421

శా. ఆవేళ న్నిజకామినీకరగృహీతాభీలదండావనీజావాలీకృతబాహుమూలుఁడు మహీయఃకంబళాచ్ఛాదితుండావిర్భూతకఠోరరోషుఁ డయి యాతాకల్పితోర్వారువన్యావీరుజ్జనితోత్ఫలాననపరుం డమ్మందరుం డుండఁగాన్. 422

చ. ఘటకుఁడు పంపఁగా నరిగి కంపవెలుంగు తలంగఁద్రోచి యుద్భటగతి బుద్ధిసారుఁ డటు తారునఁ గర్కరికాఫలాళిఁ జూ

పుటయుఁ దురంగము న్మెసవెఁబో లతిక ల్తెగిపోవఁ బత్రముల్త్రుటితములై పడం బృథులతుండము భూస్థలి సోఁకునట్లుగన్. 423

తే. అంత సుముఖుని దలఁచి యయ్యశ్వరత్నమలఘుహేషారవంబునఁ బిలుచుటయునునిదియె పండ్లెల్ల దినిపోయె నేమొ యనుచుమందరుఁడు కోలచేఁ బరిమార్చెదాని. 424

క. ఇటువలె నొగిలి తురంగంబటునిటు వడి పాఱిపోయి యస్మధ్వనియేమిటికిం జూపితకట యనిచటులవ్యథఁ గుందె మహిభుజా వింటికదా. 425

క. కావున నేఁడెల్లను నీభావంబున నరయు మెఱుకపడకుండినచోనీవిధ మని జలచరహా౽సావిర్భూతికిని హేతు వమరవచింతున్. 426

తే. అని నియోగితనూజ యయ్యధిపుఁ డనుపనిలయమున కేగె నని చిల్కపలుకఁ గమ్మతమ్మినెత్తావి తెమ్మెర ల్గ్రమ్ముటయునునల ప్రభావతి కేళిగృహంబుఁ జేరు. 427

ఉ. అంతఁ గ్రమక్రమంబున నహస్కరబింబము పూర్వశైలసౌధాంతహిరణ్యకుంభము విహాయసమండలనామఖేటకాభ్యంతరధాతురాగ మపరాద్రివిమానవితానితాతిదురదాంతవిభావిభావ్యముకురంబును నై జలరాశీఁ గ్రుంకినన్. 428

సీ. అద్దంబులోఁ దోఁచు నబ్జరేఖ యనంగమోముపైఁ దెలినాభినామ మమరఁ

దలిరాకుపై మొగ్గు నలరుమొగ్గ యనంగమోవిపై ముక్కఱముత్తె మమరవలమురిపై నంటు జలధిపంక మనంగగళము పైఁ గస్తురి కప్పు మెఱయఁగాలాహిపై మించు కంచుకంబొ యనంగజడమీఁద ముడి పూవుసరము లొరయతే. లతనుదోహదధూమము ల్గప్పుకరణినంగయష్టిక నీలసంవ్యాన మెసఁగఁగదలి యేతెంచె రాజసంగమసుఖైకపరతఁ జెంది ప్రభావతీపద్మగంధి. 429

ఉ. వచ్చినఁ జూచి కీర మనివారితచాతురి మీఱ నారి నీయిచ్చ గణాధినాథు గణియింపు తదాదృతి లేకయున్న నీవచ్చటి కేగుకార్యము రయంబునఁ గూడదు చిత్తగింపుమాతచ్చరితం బటంచు నుచితంబుగ నెచ్చెలి నిల్పి యిట్లనున్. 430

తే. అంత మఱునాఁడు విక్రమార్కావనీశుడలయమాత్యతనూజాతఁ బిలువఁ బనిచిచనపరులు చెంతఁ గొలువ నాస్థానసీమఁజేరి సింగఁపుగద్దె నాసీనుఁ డగుచు. 431

తే. తెరమఱుంగునఁ గూర్చుండి తేనెవానప్రబలఁ గథఁ జెప్ప నేర్చిన బాఁపనమ్మయిప్పుడైనను దెల్పుమా యేలనవ్వెఁబక్వమీనము లనుఁడు నప్పడఁతి పలికె. 432

క. అడుగం గూడని కార్యంబడిగెద వట్లేని మును గజాస్యునితో వా

దుడుగక యొనర్చి పిమ్మటయడలిన వటమునకు సుద్ది యగుదువు సుమ్మా. 433

ఆఱవ యుపకథ

చ. అది యెటులంటివేని వినుమా హురిశాహురినుండిపన్నగాంగదుని నివాసమై యలరు కాశికిఁ బోయెడుత్రోవ నీడపుట్టదు గద నాఁగమించినయెడ న్నొకచో నొకలేఁతమఱ్ఱి యభ్యుదయము నొందసాగెఁ దఱినొందినవానలచేత నంతటన్. 434

తే. అధ్వగులు కోడిగములకై యాకులెల్లద్రెంచి శాఖావితానము ద్రుంచివైవమోడుపడియుండె నది నిల్వనీడపట్టుగొమ్మయును లేమి తనయందుఁ గుదురుకొనఁగ. 435

తే. అంత నొక శైవుఁ డాత్రోవ నరుగువాఁడుకెలని కొలనున నాహ్నికక్రియలు దీర్చిచెంతఁబడియున్నఱాయి యాచెట్టుమొదటఁజేర్చి విఘ్నేశుఁ డనుచుఁ బూజించి చనిన. 436

క. అది మొదలుగఁ దెరువరులింపు దలిర్పఁగఁ దెచ్చి తెచ్చి పుడిసెఁడు నీళ్లుంబదియైదు గఱికిపోచలుగదియించి చనంగ నచట గణపతి నిలిచెన్. 437

సీ. పాల్పొంగి వఱదలై పాఱఁ జెంగటి యూళ్లకాఁపుగుబ్బెతలు పొంగళ్లువెట్టనీళ్లు వెల్లువగట్ట నికటాగ్రహారథరాసురు ల్నారికేరములు గొట్ట

యుండిగల్నిండఁ బొన్నూళ్ల కేగెడు బేరులకలంకభక్తి గానుకలు వైవఁగుప్పగాఁ దెరువాట్లు గొట్టెడు పెనుదొంగబంటు లాదాయంబు పంచి యొసఁగతే. నీడపందిరి చెంత గన్నేరుతోఁటనమ్మి పూజించుఁ గ్రొత్తకాణాచినంబిపొంతనిన్చిన దారువిభూతిపాత్రమమరఁ గనుపట్టె నచట విఘ్నాధినేత. 438

సీ. తను దలంచినవేళ ధరణీధరకుమారిపాలిండ్ల బోరునఁ బాలు గురియఁబొడఁగనవచ్చు వేల్పులఱేని కరిఁ జూచిదాక్షాయణీభర్త తన్నుఁ దలఁపమనసునిల్వమి నెమ్మి మాపుపై వయ్యాళిమన్నీఁడు తనుఁజూచి మరలిపోవమముఁ బిల్వఁ బంపుకొమ్మా యని ప్రమథసంఘమ్ములు తనపేరఁ గమ్మలనుపతే. నతుల కైలాసలీలాగృహాంతరాళకేళికాపాళికలును గపోల మరిచకాయమానమహచ్ఛాయజాయమానమేదురామోదుఁ డయ్యె లంబోదరుండు. 439

క. ఆతనికి వెఱచి పథికవ్రాతము తనుఁ జెనకకునికి వటభూరుహ మత్యాతతశాఖాగ్రవసద్యోతటినీహంసికాసముత్కర మయ్యెన్. 440

వ. ఆసమయంబున. 441

సీ. పాటలావనిజాతపటలదోహదము కాసారార్థజలకుంభజన్మమూర్తిసహకారశుకభారసాధారకరణి వన్యానంగశూలిఫాలాక్షవీక్షశాల్మలీఫలదండసంఘట్టనంబు దక్షిణమరున్మదహస్తిసింహరుతముపథికప్రపాంగణప్రాపణాంకణము మరీచికానిమ్నగాస్వఘటపటిమతే. మహితశైత్యవధూస్తనమార్గదర్శిచటులజంఘాలవాత్యాళిజననవేళతాలవృంతాదిమూల్యప్రదాయకంబుదనరు సంతప్తజనము నిదాఘదినము. 442

మ. తురగాస్యోత్క్రమకృద్దవోద్గతమహాధూమాంబువాహంబు వేచరమాశాగతమైన గాలి కెదురై సారోజ్జ్వలస్యందనంబు రహిం గ్రాలఁ గుమారు గాలిపటముం బోలెందివి న్మెల్లనేతిరుగంగా నిటులయ్యె నాఁగదినము ల్దీర్ఘంబు లయ్యెం గడున్. 443

చ. పడమటిగాలి వెట్ట నొకపారియుఁ గ్రోలమి నీరసంబులైజడిసిన చిల్వగుంపు నొకపారియు మ్రింగమి సొమ్మసిల్లి మ్రాన్పడినగుఱాని నొల్లని ధణాయునికిం దనవాహనంబులంబడిబడియంపెనో యమరభర్త యనందగెదావధూమముల్. 444

మ. జలజాప్తోగ్రమయూఖపుం జెకుముకి న్సప్తాశ్వకాంతోపలమ్ముల సోఁకించి తదుద్గతాగ్నిలవముం బోధించి వాత్యాననా

నిలవేగంబునఁ గాలుకొల్చి పతగానీకంబు పాకంబుగానలరించె న్సమయాఖ్యపాచకుఁడు భూతాహారసంప్రాప్తికిన్. 445

మ. జలమింక న్నయనంబు లాతపభయభ్రాంతంబులై మధ్యసంధ్యలనుం దోఁచని యంబుకేళికయి ప్రాతర్వాసరాపోదయంబులఁ గాన్పించె ననంగఁ దీరనగరాంభోజాతనీరాకరంబులు నీరార్చుటకైన బల్చెలమల న్బొల్పొందె నవ్వేసవిన్. 446

తే. దారుణారుణకిరణసంతాపదిశలననుభవింపఁగఁ జాలక యంబుదములుమెఱుపు లుఱుములు దొరఁగి భూమిపనికాయ్యదేశముల నిల్చె ధూమంపుఁదిత్తు లగుచు. 447

క. ఆవేసవి నిష్కాసితుఁడై వసుథాదేవుఁ డొక్కఁ డాత్మపురీయాశ్రావేశితకుతుకంబుననావట మున్నట్టిత్రోవ నరుదెంచె వెసన్. 448

సీ. గమనవేగంబునం గావిడి వెదురు వెక్కసపు మ్రోఁతలఁ గిఱ్ఱుకఱ్ఱు మనఁగసగళకరోటిపై బిగియఁ జుట్టిన పటాంచల మింత గాలిచే సంచలింపసరకులుంచిన మాత్రసంచిలో నంటగట్టిన యట్టి నేతిలడ్డిగ దనర్పఁగొనలెత్తి కదియఁజెక్కిన కావిధోవతిపైఁ గట్టుకొన్న కంబళీ యెసంగతే. నాతపగ్లానిచే నీడ లరయఁబాఱిగాఢవీక్ష నిరాశచే గ్రమ్మఱంగ

వచ్చివచ్చి యతండు దుర్వారపుణ్యవత్కృతప్రపమైన యవ్వటముఁ జేరె. 449

తే. తత్ప్రపాంతరజనుల సంతాపదశలపాలుపఱుపని తనప్రతాపంబు రోసికొంచెపఱిచెనొ రవినాఁగఁ గోష్ణమయ్యెనతులయామశయానాంతరాతపములు. 451

తే, అప్పుడచ్చటఁ గూడిన యధ్వగాళిచనియె నిర్దిష్టనగరవిశ్రాంతి నొందబ్రొద్దు గ్రుంకినఁ బిళ్లారిపూజ సేయుబ్రాహ్మణుండును జెంగటిపల్లె కరిగె. 452

ఉ. అంతట మేలుకాంచి వసుధామరవర్యుఁ డనార్యనిర్గతధ్వాంతము నధ్వనీనరహితత్వముఁ జూచి దిగు ల్జనింప లోనెంతయుఁ జింతనొంది తెరు వెక్కడనో కనఁగూడ దీడనే

కాంతము గాఁగ నిల్వఁగ భయం బగుచున్న దటంచు ఖిన్నుఁడై. 453

క. అంత విచారించియు మనసంతమసము కతన వెడలి చనరామి నతండంతికతటాకమున సాయంతన విధిఁ దీర్చి వచ్చి యతిభయ మెనయన్. 454

శా. గంగే! డుంఠి గణేశ! భైరవ! మహాగౌరీపతే! పాహి! యంచుం కాశీపురి వేల్పులం దలఁచికొంచు బవ్వళించెం దటోత్తుంగాత్యాతతశాఖి క్రిందఁ దనకుం దోడేమియు న్లేమి నానంగాఁ జోరభయంబు చీమ చిటుకన్నం గావడిం జూచుచున్. 455

తే. ఇట్లు శయనించి నిద్దుర యెనయకునికినమ్మహీజమ్ముఁ జూచి వృక్షాగ్రగణ్య!యల గయావటమైన నీయంత గలదె?నిన్ను మావంటివారు వర్ణింపఁ గలరె? 456

తే. సద్ద్విజాశ్రయములు భవచ్ఛాఖ లెల్లనిబిడవర్ణాత్మకంబులు నీదు జడలుహరిగతిప్రతిపాది నీ యగ్ర మరయనీ మహాగమవిఖ్యాతి నెఱయ మెఱసె. 457

క. నీ నీడఁ జేరు కతన నహీనతరఖ్యాతిఁ జెంది యీ సుమపూజల్బోనములు నడపఁగా నీయేనుఁగు మొగమయ్య వెలసె నిచ్చట ననినన్. 458

చ. అలరి మహీరుహాగ్రణి నిజాగ్రపతత్రిభయంకరంబుగాఁగలకల నవ్వి యోబుధశిఖామణి నీఫణితంబు విన్న వేచెలఁగితి నీదునీడ వెలసెం గణనాయకుఁ డన్నమాటకున్భళిభళి నిశ్చితార్థ మతిభంగికి మెచ్చమి దోష మొందదే. 459

క. అనుమాటకు శైలసుతాతనయుఁడు కోపించి మంచి తగవౌ నేనిందునికి న్నీ విటు ప్రబలితినిను జేరుట వెలసినాఁడనే మహిరుహమా. 460

క. మునుపున్న యునికిఁ దలఁపకననుఁజేరుటకతన వెలసినాఁ డీగణరాజని పలుక న్నో రెటు లాడెను సిగ్గు జనింపదేమొ డెందములోనన్. 461

తే. అనిన జలపాదియై పాదపాగ్రగణ్యుండిట్లనియెఁ దైర్థికుండౌర యిట్టివేళవీరికలహంబుకతమున వెఱపులేకయుండఁగల్గెఁగదా యని యూకొనంగ. 462

మ. జలరాశిం బవళించు శౌరి నుదరాంచల్లోకచాతుర్దశీకలితు న్మున్గకయుండఁ బత్రమున విఖ్యాతంబుగాఁ దాల్చి మ్రాఁకులలో నగ్రగణ్యతం దనరు నాకు న్నీవు ప్రాపన్న సిగ్గులచే టింత యెఱుంగ కాడితివి నీకుం బ్రాపునై యుండఁగన్. 469

క. నానీడ నిలుచుపథికులుకానుకగాఁ గొన్ని యొసఁగ గాదే మఱినీ

కీనడవడి గలిగె న్మదిఁగావున మత్కృతమహోపకారము సుమతీ. 464

మ. అని లంబోదరుతో వటం బతికుతర్కాలంబమై యున్నచోనినబింబంబుదయంబుఁ గాంచుతటి నాపృథ్వీసుపర్వార్యుఁ డాత్మనగర్యాదరధుర్యుఁడై యరిగె నంతం దద్రుమాఖర్వగర్వనిరాసంబున కంబికాసుతుఁడు దుర్వారప్రభావమ్మునన్. 465

మ. హితపూజాపరుఁడైన భూసురునితో నే నిచ్చట న్నిల్వ నేఁడతిసమ్మోదముతో స్థలాంతరసపర్యాలోలతం బోయెదన్మతిఁజింతింపకు మంచుఁ బల్కి తలఁగెం బానీయశాలం బడెంబ్రతివేళాగతపాంథవేధవటముం బ్రాగ్రూప మొందె న్వెసన్. 466

క. ఆవెనుక నేలతొడరితిదేవునితో ననుచు వట మతివ్యథఁ జెందెన్భూవల్లభ వింటివికదయావగ యగుదీవు నన్ను నడిగితివేనిన్. 467

క. అటు గనుక నీవె తెలియుముపటుగతి నేఁ డెల్లఁ గానఁబడకుండిన నిచ్చటి కెల్లి వచ్చి తెలిపెదఘటియింపు మనుజ్ఞ మన్నికాయంబునకున్. 468

తే. అని ప్రధానతనూజ గేహమున కరిగెననుచుఁ గీరంబు వల్క సుధాంశుకాంతనికరములనీరు జాఱక నిలువఁజూచియా ప్రభావతి క్రీడాగృహంబుఁ జేరె. 469

క. క్రమమున భాస్కరుఁ డంతటఁగమలాసీనుఁడయి కమలకరుఁడై కమలారమణీయుఁ డగుచుఁ గ్రుంకినఁబ్రమదాంబుధి దేలి యాప్రభావతి బాళిన్. 470

తే. రాజవిరహప్రభావతిరస్కృతంబుకృతసఖిప్రార్థనాశతాంగీకృతంబునైనభూషణచయము నేమైనదనినఁజేరఁ జనుదేరఁజూచి యక్కీరవరుఁడు. 471

తే. అమ్మ నీనుఁ జూచినపుడెల్ల నయ్యమాత్యతనయ తలఁపునఁ బాఱెఁడు దానినైపుణీవిశేషంబు వినుమంచు నిలువఁబట్టిగట్టిచల ముట్టిపడ సెట్టిపట్టి కనియె. 472

క. తనుమదిగనఁజాలక యత్యనుపమ మగుచింత విక్రమార్కుఁడు పిలువంబనిచిన యమ్మఱునాఁడుంజనియె న్ఘనబుద్ధితనయ సవినయుగరిమన్. 473

వ. అని యథాపూర్వంబుగా నాసీనయై మీనహాసకారణాజ్ఞానాధీనుండైన యమ్మానవాధీశ్వరుఁగుఱించి యాస్థానంబునం గలజనంబులు నిజమధురవచనసుథాసారంబునకుఁ గర్ణాంజలిపుటంబు లొగ్గ నక్కంజనయన యిట్లనియె. 474

తే. పరులు దెలియంగరాని యీపరమగోప్యమైనకార్యంబు నీవు న న్నడిగితేనిస్వపతి జారుల కెడసినచపల యనెడికాంతతో జంట యగుదు వాగాధ వినుము. 475

ఏడవ యుపకథ

క. సౌరాష్ట్రభూమిలో గుణగౌరవుఁ డనునృపతి యేలఁగాఁ దగు విభవాధారంబను పురిఁ గథకాఖ్యారాముం డొక్కభూసురాగ్రణి వెలయున్. 476

సీ. అలికి మ్రుగ్గులు వెట్టినట్టి తిన్నెలు కంచుబోరుతల్పులు పాలువోసి చాలయూర్చవచ్చు ననంగ నొనరు చావడి తాళువారంబు చిన్నగవాక్ష లమరువంటకొట్టము చిలువాన మించిన మిద్దెపట్టెమంచముతోడి పడుక యిల్లుపడసాలముంగిలి పందిరి పసిగాడికాయధాన్యములున్న కణజములునుతే. బెరటిలో నారికేళజంబీరముఖ్యనిఖలఫలవృక్షములు మంచినీళ్లబావినమర నయ్యింట నిత్యకల్యాణములునుబచ్చతోరణములు మించఁ బరఁగు నతఁడు. 477

తే. అతని ప్రియపుత్రి యగుచపలాఖ్య యొకతెపేర్మిఁబోషింప నానాఁటఁ బెండ్లి కెదిగెమరుఁడు మఱచినసాము వేమఱునుజేయఁదలఁచి సాదనగరడిలో దట్టిఁ గట్ట. 478

క. అంతట నక్కన్నియ నొకయంతర్వాణికి నొసంగి యక్కథకుఁడు గే

హాంతమున నిలిపికొని యున్నంతట మోదము జనింప నాదంపతులున్. 479

క. ఆరీతినుండు నంతటనారమణీమణికి యౌవనాగమ మొదవంగూరిచిరి వరునితో ముదమూరఁగఁ దలిదండ్రు లొక మహూర్తమునందున్. 480

క. ఆరేయి చపలమగనింజేరుటయే కాని యేమి చెప్పుదు లోకాచార మెఱుంగని యాతనిగారా మొక్కింతయైనఁ గానక చనియెన్. 481

క. దినదినము నిట్టులూరకచనిచని యామీఁద సిగ్గు చాలించి ముదంబెనయం బైకొని చూచియుఁగనదయ్యె న్వాని సురతకాంక్షాగుణమున్. 482

సీ. తలుపుచెంగటఁ గొంత నిలిచి యాకర్షణశ్రీలేమిఁ దనుదాన చేర నరిగిక్రముకఖండము లీయఁగాఁబోయి సంగ్రహోన్మేష లేమిని శయ్యమీఁద నునిచికదిసి పాదము లొత్తఁగాఁ బూని యంగీకృతిస్ఫూర్తిఁ గనమి భీతిల్లి లేచిప్రేమగన్పడఁ బల్కరించి ప్రత్యుత్తరస్థితి గానఁబడకున్న జిన్నఁబోయితే. శాస్త్రపాఠక్రమానంతజాడ్యుఁడై నధవుని గని యుస్సురంచును దలుపుమూసి

గుబ్బకవమీఁది పయ్యెదకొంగు పఱచినేలఁ బవళించు మగువ కన్నీరు దొరఁగ. 483

సీ. కవగూడి యెడఁబాయఁగా లేని మిథునంబుకాంక్ష వీక్షించి యేకారఁ దొడఁగునన్యోన్యమైత్రి సయ్యాట లాడెడు వధూవరుల వేడుకకు భావమున నుడుకుభాగ్యంబు గల సతీపతుల నిర్భయరహఃక్రీడల కెల్ల గ్రుక్కిళ్ళు మ్రింగుమదనకేళీపరిమ్లానాంగులగు దంపతుల యందమునకుఁ గొందలముఁ జెందునుర్వి నిర్వక్రతరుణవయోమదాంధగంధసింధురగమన లఖండసౌఖ్యమెంత గల్గియు సంభోగహీనమైననెట్లు భరియింపఁగలరు మహి న్మహీంద్ర! 484

క. పగలెల్ల నింటిపనులకునగపడ నొకరీతి మఱచియైనను నుండున్మగువ నిశాముఖమైనన్దిగులుపడు న్మగని వగ గణించుచు మదిలోన్. 485

సీ. పట్టి కాఁపుర మింత రట్టాయెఁగా యంచుఁదల్లి పెల్లగు వంతఁ దల్లడిల్లుజాయాబహుజ్ఞప్తజామాతృజాడ్యుఁడైతండ్రి యందంద డెందమునఁ గుందుఁగ్రోధ మొందిననైనఁ గొడుకు దుర్గుణ మెంచియత్త మాడెత్తు మాటాడ వెఱచుఁ

దాఁజెప్పు చదువు లింతకుఁ దెచ్చెఁగా యంచుమామ యే మన లేక మోమువాంచుతే. మర్మ మెఱుఁగని వార లిమ్మగువ కేమియొచ్చమున్నదొకో మగఁ డొల్లఁ డనుచునాడుకొనఁ జొత్తు రక్కటా యాఁడుఁబుట్టుపుట్టరాదుసుమా లోకమున నరేంద్ర. 486

తే. ఇట్లు వర్తింప నొక్కనాఁ డిరులుగవియువేళఁ గార్యాంతరాపేక్ష వెంటఁబడఁగనింటివారికిఁ జెప్పక నేగెఁ జపలమగఁడు పొరుగూరికై బుద్ధిమంతుఁ డగుట. 487

క. ఆరేయి వానిచెలికాఁడారాధ్యుఁ డనంగఁ బరఁగు నాతండు తదాగారమునఁ బడుకయింట నుదారతదాగమనకాంక్షియై పవళించెన్. 488

తే. అంతఁ జపలావధూటి నేఁడైన మంచిబుద్ధిపుట్టదె మగని కాపూర్ణదైవకరుణ నని కేళిగేహంబు గదిసి యచటవాని నిజనాథుఁ డని మదిలోన నెంచి. 489

శా. చేరంగాఁ జని యక్కటా యధిప మీచిత్తంబు రాకున్న నీవీరీతిం బదసేవసేయు మని మీరే నన్ను శిక్షించి యేనేరం బైన సహింప భాగ్యముగదా నిష్కారణం బిట్లు నాపేరన్న న్మదిఁ గంటగించెదరు పెంపే మీకు నన్నేఁచుటల్. 490

క. అని దైన్యముతోఁ బలికినవిని యాతఁడు మదనవిశిఖవివశుం డగుచున్

మునుదాని తెఱఁ గెఱుంగుటనెనసినతమి సురతకేళి నింపుఘటింపన్. 491

క. ఆవెనుక మగఁడు గాఁడనిభావంబునఁ దెలిసి సిగ్గువడి యంతటిలోదైవాధీనం బిది యనిభావించుచుఁ జపల మృదులభాషల ననియెన్. 492

తే. ఇంత మోసంబుఁ జేసి నాయీలువెల్లనపహరించితి విఁక నేమి యైనకార్యమయ్యెనేకద యీరీతి ననుదినంబునన్ను మన్నింపుకున్నఁ బ్రాణములు విడుతు. 493

క. అని పలికె నదియు మొదలుగవెనుదీయక యజ్జయైన వేళల నెల్లంజనుదెంచు వానిరతి నవ్వనితామణి తనివిలేక వర్తిలఁ దొడఁగెన్. 494

సీ. భర్తకుఁ భ్రాతరౌపాసనాగ్ని యొసంగిదుడుకుఁగా ముంగిటఁ దొంగి చూచునాయకునకు మజ్జనజలంబు ఘటియించితాపియింటికి నేగి తడవుచూచుధవునిచెంగట నిష్టదైవపూజ కమర్చితలవాఁకిటికిఁ బోయి నిలిచిచూచుఁబతికంచమున శాకవితతులు వడ్డించినిలువఁగూడక గోడ నిక్కిచూచుతే. నెంతబాళియొ కాక యయ్యిందుముఖికిగూర్మినారాధ్యురాకలు గోరు టొకటె

కాని ప్రాణేశు పరిచర్య కానివావియయ్యె నేమందునయ్య యయ్యతనుమహిమ. 495

సీ. ఠీవితో నేటినీటికిఁ బోవుచో వెంటవెంటవచ్చితిఁజుమా విద్రుమోష్ఠిపొరుగింటి చెలిఁ గూడి సరసము ల్పలుకుచోజెంత నిల్చితిఁజుమా దంతిగమనముంగిట జననితో ముచ్చటలాడంగనిక్కిచూచితిఁజుమా టెక్కులాఁడిపడుకటింటికిఁ జెలు ల్ప్రార్థించి యనుపుచోఁదలుపుమీటితిఁజుమా తతనితంబతే. యనుచు నారాధ్యుఁ డొంటిపాటైన వేళనవ్వధూమణితోడ మోహంబుఁ దెలుపనప్పడంతియు నవి నీవు చెప్ప నేలవినర నాకన్ను లెందున్న వనుచుఁ బలుకు. 496

క. ఈరీతి నుండు నంతటవారల యందములు సవసవలుగా వినియయ్యూరెల్ల గుజగుజలఁబోజారునితోఁ జపల తెలుపుఁ జాంచల్యముగాన్. 497

క. వచ్చెఁగద బెడఁద మన కిఁకనిచ్చట నడయాడఁ గూడ దెటకేనియు నేవచ్చెద రమ్మటులైనన్విచ్చలవిడి నడువవచ్చు వెఱువకు మదిలోన్. 498

తే. అనిన భయమంది యాతఁ డోయబల యింతసాహసక్రియ చేయంగఁ జనునె మనకు

ననుచు వారింప విన కది యతనిఁ గూడియరిగెఁ దెగియించి నిర్భరసురతవాంఛ. 499

శా. ఆరీతిం బహుదేశము ల్గడచిపో నారాధ్యుఁ డాత్మాంగనంగారాము ల్దలపోసి యొక్కయెడ నిక్కట్టైనచో దానినానారత్నోజ్జ్వలభూష లూడ్చికొని యానందంబుతోడం బురింజేరెం దచ్చపలాక్షియు న్వగవఁజొచ్చెం గార్య మిట్లౌటకున్. 500

తే. వింటివా విక్రమార్క యవ్వెలఁది సేయఁదగనికార్యం బొనర్చి దుర్దశఁ గృశించెగాన నన్యుల నడుగఁగా రానిమీనహాసహేతువు మఱినీవె యరసికొనుము. 501

చ. తెలియఁగ జాలకున్న వచియించెద ఱేపని యింటికేగె నచ్చెలువ యటంచుఁ దేనియలు చిల్కఁగఁ జిల్క వచింప నంతలోబలబల వేగవచ్చినఁ బ్రభావతి కేళిగృహంబుఁ చేరి చంచలమతి నాఁటిరేయి నృపచంద్రుని పొందిక గోరి చేరినన్. 502

తే. చిలుక వీక్షించి కలదు విచిత్రగాథయది యగాధసరోజరాగాధరోష్ఠియనుచు వచియింపఁ దొడఁగె భాష్యార్థమానమాధురీమాధురీణత సాధురీతి. 503

తే. చేరి యెన్నికథలు చెప్పినఁ గనలేకవిక్రమార్కధరణివిభుఁడు పిలువఁబనుపనేగి మంత్రితనుజాత తత్సభాప్రాంగణమునఁ దెరమఱుంగుఁ జెంది. 504

తనదు కథలకుఁ దరళికాతరళనయనయాదిగాఁగల్గు నంతఃపురాబ్జముఖులుపుష్పహాసప్రముఖమంత్రిపుంగవులునువచ్చి యుండుటఁ దెలిసి యవ్వామనయన.

సభవారెల్లను సద్దుమాని వినుఁడీ సర్వంసహామండలప్రభుతోఁ దెల్పెద విక్రమార్కనృపచంద్రా సావధానంబుగాశుభదం బీకథఁ జిత్తగింపవలె నంచుం దెల్పఁ జొచ్చె న్సురర్షభకేళీవనికామరందరసవాచాప్రాచురీచాతురిన్.

గంధవతీ నామకము వసుంధర నొకపురము కరము శోభిలు భాస్వత్సైంధవచయాతిపత్రితబంధురమణిసౌధకేతుపటపటలం బై.

ఆనగరరత్న మేలున్మానధనుం డనఁగఁ బరఁగు మానవపతితత్సూనుం డభిమానధనాఖ్యానవనీయుండు వెలయు నధికప్రజ్ఞన్.

అతఁడు జనకుని వెనుకఁ బట్టాభిషేకమవధరించి నిజామాత్యులాప్తకోటియనుదినంబును విన్నవించిన వివాహమొల్ల నని నిస్పృహుండయి యుండె నంత.

చనవరు లందఱు నొకనాఁడనఘా కల్యాణ మొల్ల ననుకారణమే

మని యడిగిన వారలదెసఁగనుఁగొని యభిమానధనుఁ డకల్మషఫణితిన్.

ఇట్టిది యడుగనె తగదీపట్టున మీ కెఱుక లేక పలుమాటు మొఱల్వెట్టెదరు గానఁ దెలిపెదగట్టిగఁ గామినుల నమ్మఁగారాదు మదిన్.

పురుషజనవంచనార్థముసరసిజసంభవుఁడు తనదుసామర్థ్యముచేనిరుపమముగ నిర్మించెనుదరుణుల మాయోపజీవితాచణగతులన్.

జవ్వనము రాకమునుపె విశ్వప్రపంచమంతయును హృద్గత మొనర్చి యడఁచికొందురేమి యెఱుఁగని కరణి నహీనబాల్యచేష్టఁ బ్రకటింతు రవనీరాజీవముఖులు.

చిన్నారిచన్నుల కన్న మున్నుగఁ దోఁచులోకప్రమోషణలోలచింతకలికి చూపులవాఁడికన్న మున్నుగ మించుగురుజనోజ్జ్వలతృణీకరణపటిమకటితటీచక్రంబు కన్న మున్నుగఁ దీఱుననృతవాక్యస్థాపనాత్మశక్తిచెన్నారు మైమిన్న కన్న మున్నుగఁ బొల్చుజనవిస్మయప్రదసాహసంబు

గాఢచాతుర్యధుర్యతకన్న మున్నపొడముఁ గంభీరజారసంభోగవాంఛ

కమలముఖులకు యౌవనాగమము కన్నమున్ను గాఁగల్గు పాపసమూహమెల్ల.

టెక్కులు గలవాఁడైనంజక్కనివాఁడైన రతులఁ జతురుం డైనందక్కరు మగనికి నిక్కంబక్కట జారునికిఁ దక్కినటువలె యువతుల్.

మగువలు గరగరనై తగుమగవానిం జూచి వీఁడు మగఁడైనఁ గదాతెగుదుఃఖం బనుకొంచుందిగఁగాఱుదు రెపుడు నెమ్మది న్వగమిగులన్.

గజకర్ణముల కింత గల్గినఁ గల్గనీకలికినెమ్మదికి నిల్కడలు లేవుకమలచూపున కింత గల్గినఁ గల్గనీకాంతనెమ్మదికి నిల్కడలు లేవుచలదళంబుల కింత గలిగినఁ గల్గనీలలననెమ్మదికి నిల్కడలు లేవుకారుమించున కింత గల్గినఁ గల్గనీపడఁతినెమ్మదికి నిల్కడలు లేవు

జలదముల కింత గలిగినఁ గలుగనిమ్ముకమలనేత్రలమదికి నిల్కడలు లేవుకావున వధూటికల యిచ్చకంబు లెల్లవిశ్వసించిన మగవాఁడు వెఱ్ఱివాఁడు.

బిసరుహనయనలు మాయాగ్రసరల్ మఱి వారిపొందు గారాదె కదా

యసమానమనీషాఢ్యులువసియింతురె యాఁడుప్రతిమ వ్రాసినయింటన్.

కావున వివాహవిచ్యుతిగావించితి ననుచుఁ బలుకఁగా వార లయోదేవా సర్వజ్ఞుఁడ విటులీవాక్యము లాడవచ్చునే యివ్వేళన్.

ఎంచిచూచిన నూటవెయ్యింట నొకతెగాక సతు లెల్ల జారసంగమసుఖైకపరతఁ జెందిన వాన లేకరణిఁ గురియుఁబంట లేచందమునఁ బండుఁ బార్థివేంద్ర.

ఇలువరుసయు మానుషముంగలరాజుల యిండ్ల గన్నెకలు పుట్టునెడందెలిసిన వరించి మఱివారల నగరికిఁ దెచ్చి పెనుపరాదా చాలన్.

అని నిర్బంధించిన నయ్యభిమానధనుం డియ్యకొని సమన్వయమాన్యు లగు రాజన్యుల కన్యాజనంబులం బ్రతీక్షించుచుం బుట్టినయప్పుడ సూతికాగృహంబులు సొచ్చి బాలికాచతుష్టయంబుం బరిగ్రహించి నిజగేహంబునకుం దెచ్చి వియచ్చరపథావరోధిసాలనికరం బగునంతఃపురంబున వేఱువేఱ గృహంబుల నునిచి క్రమక్రమంబున మదసేనయు మంజువాణియు మణిమంజరియు మకరందయు ననునామంబు లిడి పోషింప నొక్కదాదిం గట్టడి సేసి కొండొకకాలంబునకు జవ్వనంబు నివ్వటిల్లిన నవ్వెలందులకు వరుసక్రమంబున

ననుదినంబునుం గామోపభోగంబులం బ్రమోదం బావహిలంజేయుచు నప్రమత్తుండై యుండె నంత.

ఆకామిను లధిపతిరతినేకట దీఱమి మనోభవేషువితానంబేకత నొందఁగఁ బరసురతాకాంక్షాయత్తచిత్తలై నెవ్వగలన్.

మగవారిఁ జేయక మము నాఁడువారిఁగానీరీతిఁ బుట్టింప నేల యనుచుఁబుట్టించెఁబో సాధుపురుషుతోడుతఁ గూర్పకీక్రూరుతోఁ గూర్ప నేల యనుచుఁగూర్చెఁబో పరిపాటి కొంపలోఁ గూల్పకనీదుర్గమునఁ ద్రోయ నేల యనుచుఁద్రోచెఁబో దయఁజూచి ఖేచరత్వ మొసంగకీమానుషం బీయ నేల యనుచు

వారు రేలుఁ బవళ్లు దుర్వారఘోరకోపమునఁ బల్కెడు దురాపశాపములఁ బయోరుహాసనుఁ డేమిగాకునికి పలుకుటువిద తాటంకకరణముహూర్తమహిమ.

వార లీరీతి నుండ దుర్వారచోరగతులఁ బ్రతిగన్నవాఁ డొక్కకన్నగాఁడుకార్యసాధకుఁ డనుపేరు గలుగువాఁడునాఁడు తత్పురికాళికావసతిఁ జేరి.

ఈ రాజు నగరికలిమి కుబేరునిబొక్కసముకన్న పెట్టినధన మ

వ్వారిగ దొరకు న్మద్గృహదారిద్ర్యం బపుడు గాని తలఁగ దటంచున్.

రే లెవ్వరు గనకుండఁగఁగాళీదేవిం బెకల్చి కడ నుంచి తదాలీలస్థానము మొదలుగఁదాలిమితో నేల మాలెఁ ద్రవ్వఁగఁ దొడఁగెన్.

పగలెల్లఁ గాళిక న్మెచ్చుగ బిలముఖమున నమర్చుచు న్వాఁ డొకనాలుగు దినములలో నరపతినగ రంటఁగఁ ద్రవ్వెఁ దెగువ నాటుకొనంగన్.

ఇదియె ధనమున్న గృహమని యెంచి యచటనిర్గమద్వార మెడలించి నెమ్మి వెడలిదైవవశమున మదనసేనావధూటిపడుకయిల్లౌట నిలిచి విభ్రాంతుఁ డగుచు.

పానుపుమీఁదఁ గెందలిరుబాకువజీరుని బాహువైభవశ్రీనిధియైన యమ్మదనసేనఁ గనుంగొని పొంగి నాకుఁ జేకానుక చేసె నీ నృపతికొమిని నాదగు భాగ్య మెంత సొమ్మైన నదేల దీని బిగువారెడు కౌఁగిటఁ జేరఁ గల్గినన్.

అని తలపోయ వాని పొలు పద్దిరపాటునఁ జూచి విస్మయంబనుపమలీల దొట్టిన భయంబును జిల్లరసేయ వాని నెల్లను గడఁ ద్రోచి యీపురుషలాభము దైవము గూర్చె నంచు మించిన తమి యాన నమ్మదనసేన మనోభవదూయమానయై.

గ్రక్కునఁ గౌఁగిలించి తలఁకన్వల దెవ్వఁడవైన నేమి నాచిక్కని గబ్బిగుబ్బలకుఁ జిక్కితి వెక్కడఁ బోవ వచ్చు నా

యక్కఱ దీర్పవచ్చిన లతాంతకృపాణివి నీవె నీకు నేడక్కితినంచుఁ బ్రేమనిగుడం బువుపాన్పునఁ జేర్చి యచ్చటన్.

అనిరోధచుంబితాధరమనివార్యోపర్యధఃక్రియానిష్కరణంబనితరపూర్ణానందంబనఁదగు రతి నవ్వధూటి యతనిం గలసెన్.

కలసి యిట్టు లలభ్యయోగంబు దొరకెననుచు వెఱగంది యిట కెట్టు లరుగుదెంచితెవ్వఁడవు నీవు నీకుఁ బే రేమి యనుచునడిగి యంతయుఁ దెలిసి నెయ్యమున మఱియు.

తనురాజు చెట్టఁబట్టినయనువుం జిరకాలకాంక్షితాన్యజనాలింగనతయును దెలిపి యది నేఁడొనఁగూడె న్నిన్నువంటి యొఱపఱి కతనన్.

రాజకులవర్యుఁ డాత్మభార్యాచతుష్కనిలయముల వర్సవెంబడి నిద్రసలుపునాతఁ డిటు రానిదినములయందు వచ్చియిచట సంభోగ మొసఁగి న న్నేలుకొనుము.

అని ప్రార్థించినఁ గార్యసాధకుఁ డమందానందముం జెంది చందనగంధీ యనుబంధి నైతిఁగద నీతారుణ్యవిస్ఫూర్తికైన నగమ్యం బిది యిందు రా వెఱతు నుండన్వచ్చుఁ గాళీనికేతనసీమం దిన మీవు మత్కృతబిలద్వారంబున న్వచ్చినన్.

అన విని పొంగి యామృదుతరాంగితరంగితసంభ్రమాప్తి నాయన వెనువెంటఁ దత్కృతబిలాధ్వగతిన్ ఘనసాధ్వసప్రదం

బనఁజను కాళికాగృహగుహాంతరభాగముఁ జేరి చీఁకటుల్పెనఁగొనఁ దూర్పుమూల రతిలీలలఁ జారుని గూడి వేడుకన్.

బిలమార్గంబునఁ గ్రమ్మఱనిలయము సేరంగఁ జని ఘనీకృతమోహాకుల మొరు లెఱుఁగనికైవడినలచోరుని విడక యాలతాంగి మెలంగెన్.

అని యాబాలసరస్వతిజనపతికిం దెలిపె నని రసస్థితి మిగులంగనఁబడఁ గీరము నొడువఁగదినకరునిరథంబు తూర్పుదిక్తటి దోఁచెన్.

అంతఁ బ్రభావతి తనయభ్యంతరమందిరముఁ జెంది యారేయి ధరాకాంతుని జేరుట కాత్మోపాంతమునం గులుకఁ జిలుక యల్లనఁ బలుకున్.

వినవమ్మ విక్రమార్కుండనుపమవిస్మయముఁ జెంది యవ్వలికథ యేయనువున నడ నొ చెపుమాయన సచివునితనయ సవినయంబుగఁ బలికెన్.

మహిప యంతట నయ్యభిమానధనునిరెండవసుపాణి మకునికూరిమి పటాణిమంజువాణి మనోవ్యథ మగకఱవునఁబడినగతినుండఁ దత్పురప్రాంతసీమ.

ఏటిదరి నొక్కసన్న్యాసి యింపునింపుమఠము గావించుకొని శాస్త్రమంత్ర తంత్ర

వేదవేదాంతవిద్బ్రహ్మవేతృగరిమనితని కెన లేదనఁగ వార్త కెక్కి వెలయు.

త్రిషవణస్నానములు నిష్టదేవపూజగ్రంథపారాయణముఁ బరబ్రహ్మచింతభైక్షభుక్తిహరీతకీభక్షణంబునజినశయనంబుఁ గల్గి యయ్యతి వొసంగు.

ఆసమయంబున భృగుఁడనుభూసురుఁ డొకఁ డొక్కకార్యమునకై తమితోనాసన్న్యాసికి నంతేవాసిత్వము మెఱయఁగా ధ్రువంబున మెలఁగున్.

ముదముతో యతికన్న మున్న మేల్కని గోమయంబున మఠ మెల్ల నలికివైచుదపసి యేటికిఁ బోవుతఱి నంటి వెంటనెనడచు నాతనికమండలువుఁ దాల్చిసన్న్యాసి దేవపూజకుఁ బూనుచో నుపకరణము ల్దొలిచి శీఘ్రమున నొసఁగుసంయమీశ్వరుఁడు భిక్షకుఁ బోవునెడ గోచియును నార్ద్రపటఖండ మొనరఁదాల్చుఁ

బారికాంక్షికి నజినంబుఁ బఱచి రాత్రిపరమశుద్ధాంతరంగుఁడై పదము లొత్తునెలమి యమ్మౌనికలలోనఁ బిలిచె నేనిస్వామి పనియేమి యనుచు హస్తములు మొగుచు.

ఈరీతి నుండ నాతనిమేరకు నొకనాఁడు మిగుల మెచ్చి యతీంద్రుం

డోరీ యలరితి నిచ్చెదగారవమున నడుగు మేమి కావలె ననినన్.

ఆతఁడు ప్రణమిల్లి పల్కు సంయమివరేణ్యవిన్నప మొనర్ప వెఱతు నావెఱ్ఱితనముముద్దుగాఁ జూచు కరుణాసముద్రమూర్తివగుటఁ దెల్పెద నాకోర్కి యాదరింపు.

మాపొరుగింటి శూద్రుని కుమారిక పిన్నటనాఁటనుండియున్నాపయిఁ బ్రేమఁగన్నది యనంతర మొక్కఁడు పెండ్లియాడి వాఁడీపురిలోన నిల్వెడలనీక పరుం డటు సేరకుండ సంజ్ఞాపరుఁ డౌచు దాని ననిశంబును నేలెఁడు సంయమీశ్వరా.

ఉదుటుతో నారాక కెదురుచూచుచు ముద్దుగాఱఁగా నది నిల్చుకడపఁ జూచిననుఁ జూడఁగోరి క్రొన్ననతీవనడియాడువిధమున నది కుల్కు వీథిఁ జూచినీటికై వచ్చుట నెపముగ నాతోడఁబలుకుచు నది చెందు బాళిఁ జూచితమవారి మొఱఁగి తత్తరము హత్తగ వచ్చియది నన్ను గలయు పూఁబొదలఁ జూచి

యేను భరియింపలేక మీకృప సమాశ్రయించి యున్నాఁడ నన్ను నీ డేర్పవయ్యయార్తరక్షణ మఖిలపుణ్యముగదయ్యకూర్మి నెటులైన నను దానిఁ గూర్పవయ్య.

అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యతికు లేంద్రుఁడౌర మన్మథు నిజమాయకడ్డ మెవ్వ

రంబుజాసనముఖులలో ననుచు నతనిజేరువకుఁ బిల్చి యొకవేరు చేతికిచ్చి.

ఇది త్రొక్కినఁ జనవచ్చున్మదిఁ దలచినచోటి కభ్రమార్గంబున నమ్మదవతిఁ గలసెదు పోపొమ్మెద సందియ మెడలి రాత్రి కేగు మటన్నన్.

భృగుఁ డారేయిఁ దదౌషధాప్తిమహీతాంఘ్రిద్వంద్వుఁడై పోయి యభ్రగతిం దగ్గృహసీమ డిగ్గి మరు బాబాఁబోలునాబాలతోనగణేయాదృతిఁ గూడి క్రమ్మఱి యతం డాకైవడి న్రేలు తన్మృగనేత్రామణిపొందుఁ బాయక యతిప్రీతాంతరంగంబునన్.

ఆమూలికపై దానివిధ మ్మదివ్రాసినపసిండి దగడుపొదివి ప్రాణమ్మువలె దాఁచికొని మఱియెమ్మెయిఁ గర్జములదాని నేమఱకుండెన్.

అంత నొకనాఁ డతండు పురాంతిక నదిఁ జేర నరిగి యమ్మూలికఁ దత్ప్రాంతమున నుంచి దైవాక్రాంతమతిం డిగ్గి యొడలు కడిగికొనంగన్.

రాజశుద్ధాంతపుషితమరాళ మొకటియరుణపద్మదళభ్రాంతి నచటనున్నమూలిక గ్రహించి యవరోధమునకుఁ జనియెభృగుఁడు తదభావమునకు నెవ్వగలఁబొగిలె.

అంతట నమ్మరాళము విహారమహారతి మంజువాణిగేహాంతరసీమ వైచినఁ దదౌషధముం గొని యవ్వధూటి విభ్రాంతతఁ జెంది దానిపయి బంగరుఱేకున వ్రాసియున్న యత్యంతపరిస్ఫుటాక్షరచయంబుఁ బఠించి ప్రమోదమగ్నయై.

ఇది త్రొక్కినఁ జనవచ్చున్మదిఁ దలఁచినచోటి కభ్రమార్గంబున నంచొదవిన యాలిపియున్నదిగద దేవునికరుణ మెచ్చఁగావలె ననుచున్.

తలంచి బహుకాలాభిలాషితం బగు పరపురుషసంగమం బనుభూతం బైన భంగింబొంగి మనోరథపరంపరాక్రమితదినావసాననిశాసమయంబున రాజకుంజరుండు మణిమంజరీమందిరగతుం డగుట యెఱింగి యక్కురంగనయన తనముంగిట నిల్చి పదాంగుష్ఠంబులన నయ్యౌషధమూలం బవలంబించి కాళికాగృహంబున కరుగవలయునని తలంచి నిరాధారంబగు గగనాంగణంబున కెగిరి దైవవశంబునం గాళీనికేతనద్వారంబున మొగులుతగులు దిగనాడి యరుగుదెంచిన మెఱుంగుతెఱంగున వ్రాలి కేళికాగతుల మెలంగు నవసరంబున.

పరనగరరాజసుతుఁ డొక్కరుఁ డప్పురమునకు నాత్మకార్యంబునకైయరుదెంచి యునికి నిజతామరసేక్షణఁ దలఁచి యతఁడు మన్మథవశుఁడై.

నిదురగానక యొకచోట నిలువలేకవీథిఁ గ్రుమ్మరుచుండి యవ్వేళ నటకు

వచ్చి మరులచ్చివంటి యమ్మచ్చెకంటిమెచ్చి మరు లెచ్చి యంటిన మెలఁతతోడ.

పలుకరించి తదాకారభాషణాదికముల శుద్ధాంతకామినిఁ గాఁగఁ దెలిసియళికి తలఁకిన నాతనితలఁ పెరింగియానృపాంగన వేగ డాయంగనరిగి.

ప్రేమగనంబడం బలుకరించినవాఁడవు పోదువా యయోనామగవాఁడ లెస్స నిను నమ్మితి రమ్మని పిల్చి కాళికాధామమునం బ్రతీచికడఁ దాను నతండుఁ బ్రసూనబాణసంగ్రామవినోదకేళి సరిగాఁగఁ బెనంగి యనంతరంబునన్.

తనచరిత్రంబు నుడివి యాతనివిధంబుఁదెలిసి యిఁకమీఁద రాత్రులు దినదినంబునిచ్చటికి రమ్ము తఱియైన నేను వత్తుననుచు వొడఁబాటు చేసి యవ్వనిత సనియె.

చని నాఁడు మొదలుగాఁ బర్వినతమితో నజ్జయైనవేళల నృపనందనుపొందు నడుపుచుండెన్ఘనతరమునిదత్తమూలికామహిమమునన్.

అని సచివేంద్రనందన ధరాధిపుతో వినిపించెనంచుఁ జెందిన నెఱునేర్పుతోఁ జిలుక తెల్పఁ బ్రభాతముగాఁ బ్రభావతీవనరుహగంధి యంతట నివాసముఁ జేరి దినావసానసంజనితకుతూహలాప్తి నృపచంద్రునిదూతిక వెంటవచ్చినన్.

శుక మిట్లను వినవమ్మాసకియా యలవిక్రమార్క జనవరుఁడు దద

గ్రకథావిధ మడుగ న్మంత్రికుమారి మనంబు గొలుపఁ దెలుపందొఁడగెన్.

దేవ యభిమానధనుని తృతీయభార్యయైనమణిమంజరీహంసయాన తనదుప్రాయమెల్లను గోర్కులపాలు చేసియుపపతిక్రీడ కేకారుచున్న యంత.

ధరపై నిగమావతియనుపురమునఁ గ్రూరుఁడను నామమున నొకశూద్రుండరివరనికరభయంకరకరకరవాలాంకుఁడై జగన్నుతిఁ గాంచున్.

ఆతనికిఁ జపల యనఁగాఁగాతరమృగనయన యొకతె గల దది మదిలోనీతి గణింపక జారవ్రాతములకు హృదయ మిచ్చి వర్తిల్లుటయున్.

ఆతఁ డది యెఱింగి కామినీహత్య కళికియాలిఁ దోడ్కొని పరభూమి కరుగుబుద్ధిగంధవతిచెంత కరుదేరఁ గతిపయప్రయాణముల నంత నచ్చపలాబ్జనయన.

వీఁ డిఁక నెన్నిదేశములవెంబడిఁ ద్రిప్పునొ యేమి చేయనున్నాఁడొకొ కా దటంచు జతనంబునఁ గన్ను మొఱంగిపోయినన్వాఁడిమి వెంటనే వెదకవచ్చుఁగదా యెటులైన నీతనింబోఁడిమి మాన్చికాని మఱిపోదఁగదంచు విచారఖిన్నయై.

పెదవులు తడుపుచుఁ బదములుగుదిగొనఁగా నొక్కచోటఁ గూర్చుండి యయోహృదయేశ యెచటి కీడ్చెదొకద నాకుం దప్పి వశముగా దని పలుకన్.

అతఁడు చోరభయంబున నవ్వధూటిమేనిసొమ్ములు తనయొడిలోన డాఁచినీరపాత్రంబుఁ గైకొని నెమకఁ జనియెహ్రదనదీకూపముఖ్యంబు లంతలోన.

ఒక శూద్రుం డభిరామనాముఁ డొకయుద్యోగంబుపై వచ్చి యమ్ముకురాస్యం గని యొంటినున్న దిది యేమో యంచు మాటాడనించుక శంకించినఁ జేరఁబిల్చి తన యస్తోకవ్యథం దెల్పి యవ్వికచాంభోరుహగంధి వాని మది యువ్విళ్లూరఁగాఁ జేయుచున్.

నీకు నామీఁదఁ గోర్కి జన్మించెనేనికాఁపురమునకు నుండెదఁ గాని యిటకువచ్చు జలములు గొనుచు నావరుఁడు వానిమొఱఁగిపోయిన వెదకుచు నరుగుదెంచు.

కూలికీలారికం బందుఁ గొంటువానిఁజెనకి నిర్జించిపోవ నీచేతఁ గూడదట్టు గావున నిట్లు సేయంగవలయునని యుపాయంబుఁ జెప్పిన యంతలోన.

క్రూరుఁడు నీళ్లుఁ గొంచు నటకుం జనుదెంచినఁ దత్ప్రఫుల్లనీరేరుహనేత్ర దప్పి యొకరీతి నడంచిన యట్లు చేసి యీయూరికిఁ బోయి నేఁ డిచట నుండుదమా యని మువ్వురు న్రయో

దారత నేగి గంధవతిఁ దద్దయు మెచ్చుచు వచ్చుచు న్నెడన్.

ఆరమణియు నభిరాముఁడుగ్రూరుని నిరువంకఁ బెట్టుకొని యయ్యో యీయూరికి దొర లేడా యీచోరుని దండింప ననుచు స్రుక్కక కూయన్.

ఆమాటవిని తలారు లదేమని గద్దింప నామృగేక్షణ రొదగానామగఁ డితఁడని యయ్యభిరాముని వెసఁజూపి నిబ్బరంబునఁ బలికెన్.

ఆలుమగఁడును నియ్యూరి యఱుత నిలిచిచలిది భుజియింప నాసొమ్ము సంగ్రహించెగొట్టుసేయక వీనిఁ జూపట్టుకొనుచునిచ్చటికిఁ దెచ్చితిమి పట్టుఁ డిప్పు డితని.

అనిన విని యన్నగరరక్షకు లాక్షేపపూర్వకంబుగా నతనింబట్టుకొని బాధించి శోధించి యొడిలోని యాభరణములం గనుంగొని దొంగయగు నని నిశ్చయించి యభిమానధనున కెఱింగించి మూఁడుత్తరువులు గైకొని నిజకామినీకుహనసంజనితవిస్మయాదృతప్రత్యుత్తరుం డగు నతని వధియించి యమ్మండనంబు లిచ్చినం జపలాభిరాములు సంపూర్ణకాములై యథేచ్ఛ నరిగి రాక్రూరుండును నన్యాయహతుం డయ్యెం గావునం బిశాచంబై యాచారవంతులం గని తలంగంబాఱుచు మాంత్రికులం గని గడగడ వడంకుచు నాయుధహస్తులం జూచి యేచినభయంబునుం బొందుచు భైర

వాజ్ఞావశుండై యాహారంబుఁ గొనంగానక వెఱచినవారి వెంటంబడి తదీయజనప్రకల్పితరాత్రి కాననంబుల నుద్దండతరజఠరానలంబున శృంగాటకంబులఁ గాఁపుగరిత లగ్గలంబుగా భగ్గునం దరికొన బలియర్పించు పొంగళ్లవలనం గొంతకొంత సంతసించుచు నిడుమలకుం గడగానక యప్పట్టనంబున నెట్టుకొని యున్నవాఁ డగుటం జేసి యతం డొక్కనాఁడు.

నరపతికిం గానుకగావిరిపొట్లము గొనుచు నొకఁడు వీథింజనుచోగురుతర మగు సురుచిరతత్పరిమళముల వెంటనంటి పాయక చనియెన్.

భూపతి యంత నవ్విరులపొట్లముఁ గైకొని కొల్వు దీఱి క్రీడాసరమైన బాళి నిగుడ న్వెస నంతిపురంబుఁ జేరి కొమ్మాపువుఁబోణి యంచు మణిమంజరి కిచ్చి తదీయమన్మథోద్దీపితకేళిఁ దేలి పొడతెంచు రవిం గని లేచిపోయినన్.

ఆకమలనయన పరసురతాకాంతుల్ నిగుడ నెవ్వఁడైనను మగవాఁడీకడకు వచ్చి కోరికనాకొనగూర్చునని నెమ్మనంబునఁ దలఁపన్.

క్రూరుం డప్పుడు తనయాకారముతో నిలిచి యళుకుగాంచినదానింజేరంగ నరిగి వెఱవకుమోరమణీ వినుము మన్మహోదంతంబున్.

అని నిజభార్య చేసిన యపాయమునం దనకట్లు సంభవించిన యశరీరితాస్థితులు చెప్పి యిఁకం జఠరానలంబుచేతను నెరియం దొడంగె వనితా యిపుడన్నము వెట్టితేని నీపనిచిన పంపుఁ జేసెద శుభంబగు నీకని మ్రొక్కి వేఁడినన్.

అమ్మగువ చపలఁ గూరిచియమ్మా భువినాఁటదాన వైన న్నీచేయమ్మహితసాహసము నాకిమ్మా నాకోర్కు లెల్ల నీడేఱుటకున్.

అని మెచ్చి క్రూరునిం గనుఁగొని వాహన మగుచు నన్నుఁ గొని చనఁగలవామనమునఁ దలఁచినచోటికిదినదినము న్నీకు మంచితిండి ఘటింతున్.

అనిన నిను మోచికొనుట భాగ్యంబుగాదెబ్రతికితినటంచు వాఁ డొడఁబడినఁ జూచియబల బోనంబు వాని కాహార మిచ్చితోయజానన యద్దమరేయివేళ.

పతి మకరందాగృహసంగతిఁ గాంచుట దెలిసి గగనగమనక్రూరోద్ధతవాహనయై విజనక్షితి దలఁచుటఁ జనియె కాళిగేహము చేరన్.

చని వాహనంబు డిగి యవ్వనితామణి పథికుఁడైన వైశ్యుని నొకనింగని తనవర్తన మంతయువినిపించి తదీయకథలు విని మోదమునన్.

అతఁడు దానును గాళిగేహంబులోనదక్షిణపుమూల రతికేళిఁ దనివినొందియనుదినము నాతఁ డటువచ్చునట్లు చేసిపోయి యాలీల మెలఁగె సప్పొలఁతి మఱియు.

అని రాజన్యున కయ్యమాత్యసుత నిత్యప్రౌఢవాగ్రూఢిఁ దెల్పెనటంచున్ శుకరాజు పల్కునెడ నాళికాప్తభానుప్రభల్దనర న్వైశ్యవధూటి యంత రనిశాంతం బొంది యారాత్రి యమ్మనుజేంద్రాత్మజుపొందుఁ జెందఁ జనుప్రేమ న్ముంగల న్నిల్చినన్.

కని చిలుక నేఁట మాత్రమెవిను మమ్మంత్రిసుత భూమివిభుతో మును జెప్పినకథ ఱేపటికిఁ గథల్వినిపించిన నరఁటిపండ్ల వేయుము చెలియా.

అనినవ్వించి యాజవ్వనితో నవ్విహంగమపుంగవం బిట్లనియె.

అంత నలవిక్రమార్కు డనంతరకథ యడుగ మంత్రినందన నవవానంతసమయప్రమోదాక్రాంతవికస్వరపికస్వరంబునఁ బలికెన్.

మానవాధీశ యయ్యభిమానధనునినాలుగవకొమ్మ కమ్మకుందనపుబొమ్మయైన మకరంద యిచ్ఛావిహార మందసందు గానక మందచంచలతఁ జెంది.

నిలనీని వంటవార్పుల నత్తమామలపోరును లేని కాఁపురము గలిగె

నెచటనుండిన నింట నేమనువారులేకింపుపొంపు ఘటిల్లు నిల్లుగలిగెరేలువగల్పట్టి పాలార్పకొకవేళతగ వెంచి చనుదెంచు మగఁడు గలిగెవలసినయట్టు లవ్వారిగా సారకస్తూరికాముఖ్యవస్తువులు గలిగె

నెన్ని గలిగిన నేమి నాయిచ్చలోనియాస గడతేఱ జారవిహారసుఖముసంభవించ దటంచుఁ గాంక్షావిశేషపరవశస్వాంత యగుచుఁ బాపంబుఁ జెంద.

ఒకనాఁ డాత్మనిశాంతసౌధలసమానోద్యానవీక్షాసముత్సుకయై పోయి తదంతరంబున మణిస్తోమాతిథామాతిరంజకమై యుప్పరమంటు చప్పరమున న్సౌవర్ణడోలావిలోలకుఁడై నిల్చిన యొక్కసిద్ధుఁ గని చాల న్విస్మయం బందుచున్.

జారవిహారంబునకేకారెడు నాకోర్కిఁ దీర్పఁగా వచ్చిన యమ్మారుఁడె యితఁడని యచ్చెలిచేరం జని చూపువలపు చేఁతలఁ దెలుపన్.

నిలిచిన నతఁడా సతికింగలకోర్కి యెఱింగి మమ్ముఁ గామింపకుమీయిలచూడఁగవచ్చిన సిద్ధుల మతనునితూపు మనసుఁ దూఱదు మాకున్.

ఇందు మనోహరంబయిన యివ్వనవాటిక చూచినప్పుడేడెందము మమ్ము నిల్ప నిట డిగ్గితి మిప్పుడ పోవలెం జిదా

నందవిభూతిగల్గ లలనాజనసంగమసౌఖ్య మేల రమ్మిందునిభాస్య నీమది యభీష్టము సేకుఱునట్లు చేసెదన్.

అని చేరఁబిలిచి కర్ణంబున నొకమంత్రంబు నుడివి పూఁబోఁడి మనంబున నీది జపింపు మింక గగనగమనము గల్గు నీదుకాంక్షలు తీరున్.

అని కరుణించి సిద్ధుఁడు వియత్పథజాంఘికుఁ డైన మెచ్చి యవ్వనిత విభాకరుం డపరవార్ధిఁ బడ న్మణిమంజరీగృహంబునకు నిజేశ్వరుం డరుగుపూఁట యటంచును నిశ్చయించి యమ్మనువు జపించి విష్ణుపదమార్గమునం జనియె న్రయంబునన్.

చని తత్కాళీగేహంబున నొకమగనాలికూటమునకై కనుగూర్కనియొక్కజారుతో నింపునఁ బొదలుచు నుత్తరంపుమూల రమించెన్.

అనుదినము వేళయైనప్పు డవ్వధూటియటకుఁ దా వచ్చునట్లుగా నతఁడు వచ్చునట్లుగాఁ జేసి యట్టుల నతనిపొందువిడువఁజాలక మెలఁగెఁ బూవిలుతునాజ్ఞ.

మనుజకులేంద్ర యంత నభిమానధనుం డొకనాఁటిరేయిఁ గాంచనరుచివారము ల్గలహజారమునం గొలువున్కిఁ జేసి యవ్వనితలు నల్వురు న్మునుపు వచ్చుక్రమంబున వచ్చి కాళికాఘనగృహసీమఁ జేరి రతిఁ గాంచుచునుండిరి నాల్గుమూలలన్.

అంతట నభిమానధనుండాంతరమునఁ గాళికాపదాంబుజసేవా

నంతరతి వొడమ నుడిగపుటింతులతోఁ గొలువు దీరి యేతెంచుటయున్.

వచ్చిన దివ్వటివెలుఁగుననచ్చెలువలు నాథుఁ జూచి రాతఁడుఁ గనియెందచ్చపలాక్షులఁ గనుఁగొనియిచ్చమహాశ్చర్యసమభివృతముగ నిలువన్.

తరుణులు నలువురు నపుడొండొరులచరిత్రంబు లెఱిఁగి యొదవినభయమున్నిరసించి యొకయుపాయముదొరకొన విభుఁ జేరి ధైర్యధుర్యాత్మకలై.

కట్టెదుట నిలువంబడి కాళికాపదాంబుజంబులు భజియింప నింపునం జనుదెంచిన యక్షకమలాక్షుల మిన్నలువురము మదీయనాయకులు నేమును ననుదినంబు నిశాసమయంబున నిచ్చటికి వచ్చి పోవుదుము. మాకు నతీతానాగతవర్తమానంబులు తెలియుట కడుగం బనిలే దింత యేల నీయంతరంగంబున భవదీయభార్యాసౌందర్యవిశేషభాషణాదులు మాయందుఁ దోఁచుటం జేసి సందియంబు కందళించినది కావున నింతయుం దెలుపవలసె నచ్చెలువలు మాయంశంబున జనియించినవారలు కావున మాపోలికలు వారికిం గలిగియుండు నయ్యండజయానలకు శుభంబుఁగోరికదా యేతన్మహాశాంకరీపదపంకజారాధనకు ననురాత్రంబు నరుగుదెంతు మిందు రమ్మని యిందుధరసుందరీసమీపంబునకు దోడ్కొనిపోయి నిర్మాల్యప్రసాదంబుగా విభూతి యొసంగి నీయంగనల సద్ధర్మంబుగా నేలి మామనంబులు

చల్లఁ జేయుమని యనిపిన నజ్జననాథుండును నేమియుం బలుకవెఱచి యూరక వెడలె నప్పుడు.

అచ్చపలాక్షు లతిత్వరవచ్చి నివాసముల నిలువ వసుధేశ్వరుఁడున్ఱిచ్చపడుమనముతో వెసనచ్చటికి న్వచ్చి వారినందఱఁ జూచెన్.

చూచి మనమున మిక్కిలి చోద్యమందివార లొనరించు నతులోపచారసరణిఁదేలి తజ్జాలసంసక్తిఁ దెలియలేకయధికతరమైన ప్రేమతో నాదరించె.

మానవనాథ యిట్టియభిమానధనుం డెఱుఁగంగఁజాలెనేయానలినాయతాక్షులదురాచరణం బది యట్టులే సుమాయేనరుఁడైన నిట్టి వెత లించుక యైన నెఱుంగఁ డింతటన్మానసవీథిఁ జూచుకొనుమా యిఁకఁ దెల్పఁగ నేర మేమియున్.

అనుచు బాలసరస్వతీవనిత విక్రమర్కుతోఁ దెల్పెననుచు శుకాగ్రగణ్యుఁడలప్రభావతి కెఱిఁగించునంతలో శకుంతములు మేఁతలకుఁ దమగూళ్ళు వెడలె.

అంతటఁ బ్రభావతీకమలాయతాక్షియాత్మకేళీగృహంబున కరిగి నాఁటిరేయి నృపుపొందుఁ గోరి చేరిన మనోజుతేజి యిట్లను దియ్యనితేనె లొలుక.

నేఁటికథ చిత్రతర మోబోటీ వినవమ్మ మంత్రిపుంగవసుత యప్పాటిం దెలిపిన నాదొరనాటినచింతాభరంబున న్మన మగలన్.

కొంతతడవుండి యందు నొక్కింతయేనిదెలియ నే యెక్కడిపరాకు పలుకుమనుచుఁగదళికాకాంత పైఁజేతి కమ్మవిరులచెండు వైచినఁ దత్సతీసరసిజాక్షి.

సొమ్మసిలినట్లు వ్రాలినఁ జూచి విక్రమార్కభూపాలవరుఁడు హాహానినాదుఁడగుచు విలపింపఁ జని వయస్యాజనంబుశీతలక్రియ లొనరింప సేదఁడేఱె.

అదిగని పుష్పహాసుఁ డహహా యని నవ్వఁ బ్రసూనవర్షమభ్యుదయము గాఁగ నంతట విభుండు కనుంగొని తీవ్రతోపుఁడైయదయుఁడ వింతెకాక యొకయప్పుడు నవ్వనివాఁడ విప్పుడీమదవతి పుష్పపాతమున మ్రాన్పడిన న్వడి నవ్వ నేటికిన్.

అనవిని యయ్యమాత్యుఁడు ధరాధిప మున్నొకయద్భుతంబు నేఁగనుఁగొనఁగంటిఁగాన బహుకాలము తద్వ్యథం గుంది యున్కి నేపనులకు నవ్వకుండితి సభాస్థలి నే డొకయద్భుతంబుఁ జూచినకత నన్మనంబు వికసించిన నవ్వితిఁ జిత్తగింపుమా.

అధిప యీయమ్మవారు మర్యాదపోవవిడిచి నగరెట్లు వెడలెనో వెడలివచ్చి

తేరుక్రిందటి మరుగుజ్జుఁ జేరి వానిఁగలసి యేతెంచు నిది మీకుఁ గానఁబడదు.

దేవరకొల్వు దేరిన మదీయగృహంబున కేగువాడనైయే వెసఁ బోవుచోఁ గురిసె వృద్ధవరాహకఠోరఘర్ఘరారావమహాశనిధ్వనిపరంపరతో నొకవాన మొన్న రేయావిలమానసాంబుజుఁడనై యొకమండపసీమఁ జేరితిన్.

అచ్చటికి వచ్చె నిమ్మందయాన వచ్చితేరుక్రింది ప్రతీక్షణాధీనుఁ డైనగుజ్జుఁ జేరిన వాఁ డతిక్రుద్ధుఁ డగుచునింతతడ వేల రావైతివే యటంచు.

గుండియలు గ్రుళ్లఁదన్నిన గ్రుక్కుమిక్కురనఁక యాతనికినుక చల్లాఱనిచ్చివిక్రమార్కుడు నిద్రగావించుదనుకవెడలి రారాదటంచును వేడుకొనియె.

అతని పదఘాతముల కోర్చినట్టిదానికివ్విరులబంతివ్రేటున కింతమూర్ఛవచ్చెనే యంచు నవ్వితి వసుమతీశచనవరియటంచు నాతప్పు సైఁపవలయు.

అన విక్రమార్కభూపతివిని వెఱుఁగున ముక్కుమీఁద వ్రేలిడి చింతన్మునుఁగుచు బాలసరస్వతిఁగని తెలిసె న్మీనహాసకారణ మౌలే.

కాకయుండినఁ దైలపక్వంబులైనమత్స్యములు నవ్వునే యంచు మందబుద్ధి

నక్కటా కాననైతి నీహంతలాఁడివగలు నమ్మితిఁ గద పతివ్రత యటంచు.

అని మఱియుఁ బదియుఁ బడియునుగనుఁగొని కదళికకు నాజ్ఞఁ గల్పించె న్శాస్త్రనిరూపితపద్ధతి నజ్జననాథుఁడు వింటివా నిశాకరవదనా.

అని చిలుక పలుకఁ బూర్వావనిధరశృంగాగ్రమున దివాకరుఁ డెసఁగంగనుఁగొని ప్రభావతీసతిచని గృహముననుండి తన్నిశాముఖవేళన్.

పుడమిదొరఁ జేరు వేడుకపొడమగఁ జనుదెంచి కీరపుంగవుతో నీకడుపెల్లఁ గథలు గద నిన్నడుగం బనియేమి పోదునా యని పలుకన్.

పోయిర మ్మిందువదన యపూర్వమగుచునలరు నొకకథ విను విక్రమార్కనృపతియవ్విధంబున నిజసతి కాజ్ఞ వెట్టిపుష్పహాసుని జూచి యింపులు జనింప.

ఈయాశ్చర్యము కంటిమేకద పురాదృష్టాద్భుతం బేమియోయాయాఖ్యానముఁ దెల్పుమన్న నతఁడుద్యత్ప్రేమతో నిట్లనున్సాయంకాలనటన్మహానటజటాఝూటాటవీద్యోధునీస్ఫాయద్భంగఘుమంఘుమోపమితవాచాచాతురీధుర్యుఁడై.

వస్వద్రిప్రతిమానధైర్యవిబుధధ్వంసిప్రభూద్భూతభీనిస్వస్థక్షితిభృద్విరోధిమునిదిఙ్నేత్రాబ్జన్మేణభృ

ద్వస్వాదిత్యముఖార్తబర్హిచయదీవ్యద్వారివాహోదయాభాస్వద్వంశపయోధిశుభ్రకరశుంభత్కుంభకర్ణాంతకా.

ఖరకరకులశరనిధిశశధర ఖరసురవిషుతశమన ధనదసఖధనుర్హరణభయదభుజ భవహరసురవరమునినికరభజిత శుభకరశరణా.

మానితాబ్జేక్షణా మౌనిసంరక్షణాభానుసూనుప్రియంభావుకప్రాభవాదానసంతుష్టగోత్రాసుధాంధస్తుతాజానకీస్వచ్ఛభూసారసేందిందిరా.

Comments

Loading comments…