తొమ్మిదవ యుపకథ
శుకసప్తతి
క. ................................. 1
తే. అవధరింపుము సకలరాజాధిరాజనతపదాంభోజుఁ డగు ధర్మనందనునకుసరసవైదికలౌకికాచారవిహితహితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టులనియె. 2
తే. అవధరింపుము విక్రమార్కావనీంద్ర!చిన్ననాఁ డేను మున్ను కాళీపురస్థలావలోకనకాంక్షచే నరిగి యరిగిజంబుకేశ్వర మనుపట్టనంబుఁ జేరి. 3
తే. కంటి పాంథజనాహ్వానకారిమృదులవాతపోతచలత్పటకేతనాంకమై మదీయశ్రమచ్ఛిదాహారి యగుచునలరు నొకవంటకూలి యొయ్యారియిల్లు. 4
సీ. హాళి పుట్టించె సద్యఃకల్పితానల్పరసపూర్ణగాథాదురంతపటిమరక్తి గల్పించె ధారాళవాచాసుథామాధురీధుర్యసంగీతరీతిఁదెలియఁజేసె ననేకదేశసభాంతరారాశికాంతరనికరప్రపంచమస్ఫురం బొసఁగె శబ్దార్థవైచిత్రినిబంధనోజ్జ్వలగద్యపద్యసమితిఁతే. దద్గృహులకన్న కల్పితతారకాయమానసోమసమానీతు లైనపథికకథికగాయకచారుసత్కవులయుదరపూర్యగంతరసల్లాపములు నరేంద్ర. 5
చ. చిటిలిననాభినామ మొకచేఁ దెలనాకులు చాయతోడిపుక్కిటివిడెముం బెడంగుగ బిగించిన పైఁటచెఱంగులోనఁ బిక్కటిలు కుచంబులుం బసిఁడికమ్మతళుక్కను చెక్కుదోయి చొక్కటముగ ముద్దుగుల్కు నొకకల్కి వెసం జను దెంచి యచ్చటన్. 6
సీ. మఱివండిపెట్టుకొమ్మలు లేరె మావెంటఁబడుదు రటంచును బాయఁబలికిపోవఁజూచినఁ దిట్టిపోదు రిదేల వాదాడఁజాల మటంచు నాసగొలిపియటువంటివారమా యాఁకలిదీర్పు మిక్కిలిపుణ్యమన్న నంగీకరించి
కమ్మలు గదలఁ గన్బొమ్మలు నిక్కిడనారజమ్మునఁ గూలి బేరమాడితే. వచ్చు తెరువరులందఱు వంటపనికినన్ను మెత్తురటంచు నందములు సూపిబాళిపుట్టించు దాని కప్పథికులెల్లనొడఁబడికెమీఁదనే మిన్కు లొసఁగి రపుడు. 7
తే. వారితో నేను భుజియించి వనజబంధుఁడస్తగిరిఁ జేరుతఱియైన నపుడు నదికిఁబోవువారలఁ జూచి నేఁ బోక నిలిచిసందెవార్చితి జలము లాసతి యొసంగ. 8
క. ఆసమయంబునం జీఁకటిమాసినతనముదుకచీర మైకలనిగ్గుల్వాసులకుఁ బెనఁగఁగా నొకదాసి యరుగుదెంచి యొకసుధాకరముఖితోన్. 9
క. ఏమో గుసగుసలాడిననామగువ మఱేమి సేతు ననుపగుమగవాఁడీమాటకు నొడఁబడఁ డక్కామినియెడ మాట నిల్పఁగా లేనైతిన్. 10
క. అనుమాటలు సవసవగావిని నేనేమో ప్రమోషవిధమని చేరంజని యది యేమని యడుగంగనుఁగొని యమ్మగువ ముఖవికాస మెసంగన్. 11
తే. హత్తుకోవచ్చు నీవంటియందగానికున్నదొకచోట నొకమంచియొఱపులాఁడి
దాని కిలికించితంబునఁ దవిలినట్టివాఁడు దేవేంద్రునకుఁ జీటి వ్రాయఁగలఁడు. 12
మ. అను నమ్మాటలతోడనే రతిపతిజ్యావల్లికాటీంకృతుల్విని తా మంచిది పోదు నా యనుచు న న్వీక్షించి యయ్యంబుజానన సేబాసు బలార జాణవవు దన్నా యింత తెంపొందకుండినవాఁ డేమగవాఁడు నీతపము పండె న్నిండె సౌఖ్యస్థితుల్. 13
తే. పట్టనని యోగియౌ గుణభద్రుఁ డనెడుభూసురుం డొక్కఁ డియ్యూర వాసిగనియెవానిబంటున కున్నయైశ్వర్యగరిమఁబడసినఁ గుబేరుఁడైనను బ్రదికిపోవు. 14
మ. అలరుందూపులమన్నెవాని మగవాఁ డన్పించుఁ దత్కాంత యయ్యలివేణీమణి జారసంగమసుఖైకాకాంక్షచే దీని నిచ్చలు నాయింటికిఁ బంపు నొక్కని మహాచాతుర్యధైర్యాప్తి మెచ్చులొసంగం దగువానిఁగాఁ బనుపుమంచుం దైన్యపూర్వంబుగన్. 15
క. ఏనును మాలిమిగల మగవానికి నిది యెఱుకసేయ వడవడ వడఁకుంగాని చన వెఱచువాఁ డమ్మానినితోఁ బ్రొద్దు కొంచెమా యొనఁగూడున్. 16
తే. అట్టిచో నెట్లు పోవుదు నంటివేనిదద్గృహముచెంత నొకవటతరువు గలదుదానిపై నెక్కి చీఁకటిగాన నిపుడెయూడవెంటనె దిగు మొనఁగూడు పనులు. 17
తే. కాంతిమతి దాని పేరు తత్కాంతుఁ డధిపుడనుపఁగా దూరభూమికి నరిగినాఁడునడచి యిచ్చటి కతఁడు గాఁ దడవుపట్టువేగఁ జను మిందులకుఁగాను వెఱవవలదు. 18
క. అని నన్నుఁ బలికి దానింగనుఁగొని యమ్మగువ కింత కార్యంబో జవ్వని వే తెల్పుము పొమ్మనియనుపఁగ నది వెడలి చనియె నంతట నేనున్. 19
మ. తరలంబైన మనోంబుజంబు ఘనసంత్రాసంబుతోఁ బోరి శంబరవిధ్వంసి మహాప్రతాపము జయింపం గాంతిమత్యాలయాంతరముం జేరఁగ నిశ్చయింప వట ముద్యత్ప్రౌఢిమ ల్మీఱ నెక్కి రహి న్శాఖల వెంటనే యరిగి తద్గేహంబునం డిగ్గితిన్. 20
ఉ. అంతకుమున్నె యచ్చటి కొయారముమీఱఁగ వచ్చియున్న తత్కాంతిమతీవధూటి ననుఁ గన్గొని మోమరవాంచి నిల్చినంజెంతకుఁ జేరి దాసి యిది సిగ్గుపడ న్సమయంబటే గృహాభ్యంతరసీమఁ జేర్పుద మటంచు ననుం గొనిపోయి రిద్దఱున్. 21
చ. బటువులు తాపి తాపఱుపు పట్టుకలాడముమీఁదఁ జల్వదుప్పటిపయిఁ జప్పరంపుజిగి బంగరు వ్రాఁతకురాళముం గురంగటఁ బడిగంబుఁ గంచుదివగంబము గల్గినపట్టెమంచముత్కటరుచినించ మించు రతిధామముఁ జేరితి నిర్భయంబునన్. 22
తే. అంతట భుజించి నను వినయంబుదోఁపమంచమున నున్చి యక్కాంతిమతిని జూచి
యెనసెఁ గదవమ్మ నీమనోభీష్ట మితనియలరుఁబ్రాయంబు కొల్లాడు మనుచుఁ బలికె. 23
శా. న న్నీక్షించి సమస్తదేశతరుణీనానారహఃక్రీడలంగన్నావందపుజాణ విక్కలికి బొంకన్లేదు సుమ్మా మెయింజిన్నె ల్నించకుమా బయల్పడిన నాచేఁ గాదు సుమ్మా ప్రజంగన్నుల్మూయఁగ నీకుఁ దెల్పవలెనా కార్యంబ కర్తవ్యమున్. 24
క. అని తలుపుమూసికొంచుంజనియం దద్దాసి గడియ చక్కఁగఁ బొంకించి నెలంత యంత తల్పంబున కొయ్యనవచ్చె నగవు మొగమునఁ దోఁపన్. 25
తే. ప్రథమసంగమకేళి యప్పటికి నంతముగ్ధ యనుపించి పిదప నమ్మోహనాంగిజాతివారాంబుజేక్షణల్ సైఁత మింతనేర రనిపించెఁ గలయిక యారజముల. 26
మ. సభలోన న్వివరింపరాదె గద తచ్చాతుర్య మెంతంచు నేనభివర్ణించెద నంశుమత్కరదురాపాంతఃపురావాస యాయిభయానామణి యెందు నేర్చినది హా యీకౌశలం బంచు నేసభయాశ్చర్యతఁ జెందితి న్మహిమ నాసాతర్జనీయోగమున్. 27
ఉ. ఎంతకు నేర రంత తెగియించినవా రది యున్నదేకదాయంతట తెల్లవాఱిన లతాంగి ననుం బడుకింటిమిద్దెపైదంతపుమేలుమంచము సుధాకరకాంతగృహాంతరంబులోనెంతయుఁ జింతలేక వసియింపగఁజేసెను సాహసంబునన్. 28
తే. రాత్రు లెల్లను గేళ్యగారమున నుంచుఁబగలు మేల్మచ్చుపై నుంచుఁ బ్రతిదినంబుబేర్మి రెట్టింప షడ్రసోపేతములుగఁబ్రొద్దుప్రొద్దునఁ భోజనస్ఫురణ లొసఁగు. 29
తే. దానినడకల వగ లెన్నియైనఁ గలవుచెప్పఁ జిత్రంబు లటమీఁదఁ జిత్తగింపుమంత నయ్యింతి గర్భచిహ్నములు దాల్చెవేడుకలు ద్రోచి నామది వెఱపువొడమ. 30
తే. అంత నొకనాఁటి రేయి యేకాంతసదనసీమ నన్నుంచికొని మున్ను చేర్చియున్నగంటమాకులుఁ గొని దివ్వెగంబ మింతయెనయఁగూర్చుండి యాపూర్ణిమేందువదన. 31
సీ. శ్రీమన్మహాగుణస్థిరగుణభద్రపాదములకు దేవరదాసియైనకాంతిమతీదేవి ఘనభక్తినతులు గావించి చేయంగల విన్నపములుమిమ్ము నాపాలిస్వామినిఁగాఁ దలంపుదుమీమహిమంబులు మీకె తెలియుఁగలలోన మీరు సాక్షాత్కరించుటఁ జేసిగర్భంబు నిలిచె నిక్కంబు గాఁగతే. నింటివారెల్ల నామీఁదఁ గంటగించుటెపుడు నెఱుఁగుదురేకద యింకమీఁదనేమి కల్పింపఁజూతురో యెఱుఁగరాదుకరుణ నిల్పుమటం చొకకమ్మ వ్రాసి. 32
క. తనదాసిఁ బనుప నదియుంఘనజవమున నేగి చేరి కమ్మ యొసంగంగనుఁగొని గుణభద్రుఁడు చదివినవాఁడై విస్మయం బవేలముగాఁగన్. 33
క. చింతాక్రాంతుండై యిసుమంతయు మాటాడకున్న నాతనికుపితస్వాంతత్వ మెఱిఁగి దాసి యనంతత్వర మరలివచ్చి యంతయుఁ దెలిపెన్. 34
సీ. ఆడుదియైనచో నడుగఁ గులస్థానపౌరుషములతోడఁ బ్రబలువాఁడఁగొడుకైనఁ గలదులే గుణభద్రునకు మున్నుమున్ను గాని పితౄణమోచనంబుజతగూడ మనపురోహితుని రప్పింపరేపాటించి లగ్న మేర్పఱచుఁగానిబొడ్డుగోయరె యేమి పురుటింటిలోఁ జొచ్చిమనపతివ్రత బిడ్డఁ గనియెనిప్పుతే. డనుచుఁ గేరడముల నింటి యమ్మలక్కలాడికొనఁ జేటికానీత యైనవస్తుకోటిచే నింత యేమియుఁ గొదవలేకకాంతిమతి యంత మగవానిఁ గనియె నధిప. 35
క. కని పెనిచెం దదనంతరమున భూనాథుండు పనుపఁ బోయిన కార్యంబొనగూడుకతనఁ గ్రమ్మఱిచనుదెంచెం దద్విభుండు సదనంబునకున్. 36
తే. నిజసమాగమసంభ్రమోన్నిద్రు లగుచునింటివార లెదుర్కొన నేగుదెంచియాత్మభార్యాచరిత్రంబు లడుగఁ బొక్కిఖిన్నుఁడై యున్నవాని నీక్షించి యపుడు. 37
సీ. బెడఁగుఁజూపెడు నూనెముడిలోనుగా నంటఁగట్టిన వాసెనకట్టుతోడఁగస్తూరిపసుపు చొక్కటపుఁ జల్లనితావివెదచల్లు పుక్కిటివిడెముతోడనిసువుపై పసుపునూనియ జిడ్డులంటినచిటికమ్మికుఱుమాపుచీరతోడనొసటనందంబుఁ జెందు విభూతిరేఖపైబొంకంబుగను చుక్కబొట్టుతోడఁతే. గాన్పుసంతస మందు మొగంబుతోడనడరు మురిపంబుగులుకు నెన్నడలతోడఁగాంతిమతి వీఁడె నీముద్దుగాఱు తనయుఁడనుచుఁ జేతికి నీయఁగా నవ్విభుండు. 38
తే. కన్ను లెఱ్ఱగా నెగాదిగఁ గన్గొనియౌడు గఱచి దీని నాఁటదానిఁజంపరాదుగా విసర్జించితి నటంచుఁబార్శ్వచరులఁ జూచి పలుకుటయును. 39
చ, కలకల నవ్వి యౌనెకద కాదనవచ్చునె నన్నువంటితొయ్యలి విడనాడ నీయెడ నయారె సెబాసురె యింటివారిమందులమహిమంబు గాక నిను దూఱఁగఁ బల్కఁ బనేమి బాపురేకలియుగమా యటంచు నని కాంతిమతీలలితాంగి వెండియున్. 40
మ.కల నిక్కంబగునేయటన్న నిఁక నౌఁగాదంచు మారాడఁగాఁగలనా యింతకు వచ్చినప్పుడును బల్కన్నేర నాకాన్పు రచ్చల కెక్కెం గద యింక మానుదురె యీసాధ్వు ల్ననుం దూఱఁగావెలయం దైవ మెఱుంగుఁ గల్లనిజము ల్వీరాడఁగా నేమగున్. 41
సీ. నలుగు రుండినచోట నిలువఁగాఁ బెట్టి మాటాడఁగాఁ గంటిరా యమ్మలారననువంటియాఁడుబిడ్డను గన్నవా రింతెపలుకరే యేమియుఁ దెలియలేనిసబ్బిణు ల్మీరు మీచాటుమాటలు గదానానాథుమేలిగుణంబుఁ జెఱచెదయ యింతలేక యెంతకు నెత్తుకొంటి రక్కట మిముఁ గన్నదిగాక తల్లితే. సూర్యుఁడా చూచుచున్నావె చోద్యపడకయందఱును జేయుపాపపుణ్యంబు లెవరినడిగితివి ధర్మదేవతా యమ్మ చెల్లవింత నావంటిదానికా యింతమాట. 42
తే. అని గయాళించుకొనుచు హస్తాంబుజములనలరుపాపని దురదుర నరిగి తొట్లలోనఁబడవైచి మొగమునఁ బూను గండుతోడ బొమముడి నిగుడ నత్తోయజాక్షి. 43
క. మును రామునిమాటలకైయనలము వెసఁ జొచ్చి వెడలి యలరిన సీతాం
గనకంటె నేను దక్కువైచని కాళిక చెంత బాససలిపి గెలిచెదన్. 44
మ. అనుచుం గ్రక్కున గేహము న్వెడల దాయాదు ల్మహాసాధ్వివిట్లు నినుం బేర్కొన మింక నీసడియె చాలుం జాలు రమ్మంచు వెంటనె రాఁగా నిది యే మొకో యనుచు నానామానవు ల్గుంపులైకనుఁగొంచుం జనుదేఱఁగా నడిచెం దత్కాళీమహాస్థానికిన్. 45
సీ. తనవారు పిలువఁగా వినక బాసయొనర్పఁజను టేటికో యని యనెడువారునాఁడుఁబుట్టువు చెడ్డదవుఁగదా యిటువంటియపకీర్తివచ్చెనే యనెడువారునపకీర్తివచ్చిన నడఁపక యింటివారగడు చేయుట దోస మనెడువారునగ డేమి చేసి రియ్యతివ తానే వారికారడి గల్పించె ననెడువారుఁతే. జూడవచ్చిన నచ్చుముచ్చో యెఱుంగకాడరా దేల యీపాప మనెడువారుబయలుదేఱిన యపుడె యీపడఁతి జంతయగుఁజుమా యనువారు నైరపుడు జనులు. 46
క. తలతల మని కొందఱు బ్రద్దలవా రెడఁగలుగ జడియ ధరణీధవుఁ డక్కలకంఠిఁ జేరి యనునయముల మరలమి సమ్మతించి ముందుగ నడిచెన్. 48
తే. అంతఁ దొలునాఁటి రాత్రి రహస్యభంగిఁగాంతిమతి తీర్చి నను బందుకట్టి యునికినేను నొకజోగి వాల్కంబుఁ బూని భద్రకాళి సన్నిధి నుంటి గింకరునీరీతి. 49
తే. అచ్చటికి వల్లభుండు ధరాధినాథుఁడాదిగా మూఁక వెంటరా నరుగుదెంచికాంతిమతి చేరి తత్కాళికాపదాబ్జములకు వెస మ్రొక్కి లేచి నిశ్చలత నిలిచి. 50
తే. కదిసి ప్రజలార కంటిమి కాన మనకచూడుఁడని పల్కి ధైర్యవిస్ఫురణ మెఱయజనవరునిఁ జూచి రాజ నాసత్య మిపుడువిశద మగును పరాకని విన్నవించి. 51
క. నినునంటి భద్రకాళీయనయము విభునంటి యీమహాయోగివరేణ్యుని నంటినఁ గాక మఱెవ్వని నంటిన శాస్తి చేయ వలయు న్నాకున్. 52
మ. అని యక్కాంతిమతీవధూటి పలుకం బ్రావిర్భవద్విస్మయంబున సారెం దలయూఁపసాగె గిరిశాంభోజాక్షి తన్మూర్ధకం
పనము న్మెచ్చి యొనర్చెనంచు నెదల న్భావించి పశ్యత్పురీజను లౌరౌర పతివ్రతా యనుచు మెచ్చ న్నింగి ముట్టె న్రొదల్. 53
ఉ. అంత నృపాలుఁ డాలలనయంఘ్రులకుం బ్రణమిల్లి యామినీకాంతముఖీ! యరుంధతివి కానక నీపయిఁ గానిపోని యీవింత ఘటించినట్టి యలివేణులనోరికి శాస్తి సేసి యత్యంతయశంబు నిల్పితి కదా యిఁక నింటికి నేగఁగాఁ దగున్. 54
చ. అనవిని రానిసిగ్గునఁ బటాంచల మించుక వంచినట్టి మోమునకు మఱుంగుఁ జేయు కరము న్మృదుపాదపయోరుహద్వయంబున నెలకొన్నచూపు లొకపొంకము చూపఁగఁ గొంకుమాట లత్యనుపమముగ్ధతాగతి వెలార్ప నడంకువచంద మేర్పడన్. 55
మ. అపవాదంబు పరిత్యజించుటకునై ప్రాణంబు లే నిల్పితిన్నృప! యీభూప్రజ కెల్లఁదండ్రివిగదా నీముందఱం బాసచేసి పరఖ్యాతి వహింపఁ గంటిఁ గద నీచిత్తంబు వచ్చెం గదాయిపు డీపోడిమి చాలుఁ గాఁపురము పొందేలా విసర్జించెదన్. 56
క. అని వెండియుఁ బలుతెఱంగుల్గనఁబడఁగాఁ బల్కి ధరణికాంతునివచనంబున కలికి మీఱఁజాలనియనువున మేకొనియె నది గృహంబున కరుగన్. 57
మ. అపు డత్యుజ్జ్వలభూషణాంబరవిశేషాదు ల్సమర్పించి యాతపనీయాంగిని బల్లకి న్నిలిపి యుద్యత్పంచవాద్యధ్వనుల్విపులాభ్రాంతర మెల్ల నిండ వినయావిర్భూతిఁ దోడ్తెచ్చి యానృపలోకేశ్వరుఁ డింటనిల్పి చనియెం బ్రీతాంతరంగంబుతోన్. 58
క. అంతటఁ గాంతిమతీసతియింతంతనరానిప్రేమ నిటు సనఁగా దేశాంతర నానామనుజుల్సంతసమున నెంచ మిగుల సన్నుతి కెక్కెన్. 59
క. అని యిట్లు పుష్పహాసుఁడుననుపమవైఖరుల విక్రమార్కున కెఱిఁగించె నటంచుఁ జిలుక పలుకన్వనజాప్తుం డెక్కెఁ బూర్వవసుధాధరమున్. 60
వ. అప్పుడు ప్రభావతి మనోజరథవిఫలీకృతమనోరథయై యవరోధంబున కరిగి నిశాసమయం బగుటయు నవ్వసుంధరాపురందరసంగమానందంబు డెందంబునం గల్పించుకొని యనుభవించుచుం జను దెంచు నచ్చంచలాక్షితో ననంతరకథావిధానంబు వినుమని శుకాగ్రగణ్యుం డిట్లనియె. 61
క. అలవిక్రమార్క భూవరుఁడలఘుతరాద్భుతయుతాంతరంగుండై యవ్వలికథ యడుగంగఁ గుతూహలమున నాతనికిఁ బుష్పహాసుం డనియెన్. 62
తే. ఇందులకు నింత విస్మయం బేల విక్రమార్క! యిఁక మీఁదఁ గలకథ యవధరింపుమేను బూర్వక్రమంబున దానియిల్లుజేరి నిల్చితిఁ దద్రతిస్థితులఁ జెలఁగి. 63
తే. బలి యొసంగినఁ బూజలు సలిపి వేఁడుకొనినఁ దత్కాంతిమతిమాయ మనమునందు
హత్తుకొని యున్కిచే మానదయ్యె నధిపకాళికాదేవి నిజశిరఃకంపనంబు. 64
చ. అదిగని పౌరు లెల్లను భయంబునఁ దత్పురనాథుఁ జేరి యాయదన మహాపతివ్రత గుణాంచిత కాంతిమతీలతాంగి నేర్పొదవఁగ నిల్పిన న్నిలుపనోపు మఱెవ్వరి చేతఁ గానియభ్యుదితశివాశిరశ్చలన మోనృప యంచును విన్నవించినన్. 65
మ. ఇదియౌనంచు నరేంద్రుఁ డందఱును దోనేతేరఁగా సర్వసౌఖ్యదమౌ కాంతిమతీగృహంబు దరియంగా వచ్చి ఫాలంబుఁదత్పదము ల్సోకఁగ మ్రొక్కి యెట్లయిన నంబామూర్ధకంపంబు మాన్పి దయం బ్రోవు మటంచు దైన్యగతి గాన్పింపంగఁ బ్రార్థించినన్. 66
ఉ. ఆలలితాంగి కేళినిలయంబు కవాటము మాటుఁ జెంది భూపాలక యింటివా రిడిన బాముల రచ్చల కెక్కినంత యేచాలదె యింకమీఁదను నిజంబుగ రట్టున కోర్చునంతకుందాళునె యీశరీరము వితావిత యెక్కడిజోలి యక్కటా. 67
తే. అరయఁ దోఁబుట్టుపైఁ గల్గు కరుణ నిందువచ్చి యీరీతి దేవరవారె యింతప్రార్థన మొనర్చుపట్లఁ గాదనఁగఁ దగునెయైన నొక చిన్నవిన్నప మవధరింపు. 68
క. భామాజనసామాన్యముగా మది నన్నెంచు జనులు గననేఁడు మొదల్గామహిలోపలఁ గాననినామహిమ మెఱుంగవలయు నరనాథమణీ. 69
తే. ఇలఁ బతివ్రత లగువారు గలిగిరేనికాళి యొనరించు నిజశిరఃకంపనంబుమాన్పు మని చాఁటఁ బనుపుము మానవేంద్రయప్పు డందటి వగ తెలియంగవచ్చు. 70
క. అని యవ్వధూటి పలుకన్మనుజకులేంద్రుండు మాఱుమాటాడఁగఁ గొంకినవాఁడై భువిఁ జాటంబనిచెం దద్వచనరీతిఁ బ్రకటముగాఁగన్. 71
తే. అంత రాజాజ్ఞ మీఱరాదంచు ధరణిఁగలుగుసతు లెల్ల వచ్చి నిక్కమగుభక్తినెంత మ్రొక్కిన నంతంత కెచ్చసాగెధూర్జటివెలందిమూర్ధవిధూననంబు. 72
తే. కాంతిమతిదక్క మనుజలోకమున నిఁకఁబతివ్రతలు లేరటంచు నుదీర్ణవచనముఖరులై జనులాడ నమ్ముదిత లెల్లసిగ్గుపడి యేగి రప్పు డచ్చెరువుఁ జెంది. 73
ఉ. అంతట రాజమౌళి పునరాగతుఁడై ధరణిన్వధూటికాసంతతిలోనఁ జూడ నొకసాధ్వియు లేదని యాత్మలోన సిద్ధాంత మొనర్చితి న్మముఁ గృతార్థులఁ జేయుమటంచు మ్రొక్క నక్కాంతిమతీవధూటి యవుఁగాకని కాళిగృహప్రవేశయై. 74
తే. రాజు మొదలయినవారి దూరమున నునిచిగర్భగృహమున కరిగి వేగమ కవాటబంధన మొనర్చి గ్రక్కున భద్రకాళిడాసి నిలుచుండి ధీరతాడంబరమున. 75
క. నామనసువచ్చు కైవడినే మెలఁగినఁ జూడలేక యెవ్వతెవే యీబూమెలు పన్నఁగ వలదిఁకయీమేర న్నిలువకున్న నిట్టటుఁజేతున్. 76
తే. అనినం దత్కాళి యెంతకైనను దెగించినట్టిదీజంత యేమి సేయంగఁ బూనునోయనెడుభీతిఁ దలయూఁచు టుడిగినిలువఁదరుణి వాకిలి తెఱచి యందఱిని బిలిచె. 77
క. పిలిచిన నరపతి మొదలుగఁగలవారలు వచ్చి భద్రకాళిదేవిందిలకించి శిరఃకంపమునిలుచుటకు న్విస్మయాదినిబిడాశయులై. 78
తే. కాంతిమతి భూతలమున సాతాత్కరించినట్టియయ్యాదిలక్ష్మిగా కరసిచూడమనుజకామినిగాదు సుమ్మనియు మఱియుమఱియు మ్రొక్కిరి వినయసంభ్రమము లెనయ. 79
ఉ. ఆసమయంబున న్నరవరాగ్రణి భృత్యులు తెచ్చినట్టి సింహాసనమందు నవ్వికసితాంబుజలోచన నుంచి వైభవశ్రీసముదీర్ణవృత్తి నభిషేకము చేసి విశేషభూషణోద్భాసితచిత్రచేలము లపారముగాఁ గయికాన్క చేసి నానాసతు లెల్ల మ్రొక్కఁగ నొనర్చి యనేకకృతప్రణాముఁడై. 80
తే. నతు లొనర్చి మహాపతివ్రత యటంచుఁబేరుపెట్టి యలంకృతవారణంబు
పై సమాసీనఁ గావించి పటహముఖ్యభద్రవాద్యరవంబు లంబరము నిండ. 81
వ. ఇవ్విధంబున నక్కాంతిమతి నూరేగించి నిజగృహబహిర్భాగంబున గజావరోహణంబు గావించిన యక్కాంతిమతిచేత సాష్టాంగప్రణామపూర్వకంబుగా ననుజ్ఞాతుండై యానృపాలపురుహూతుం డరుగం దక్కినవారలను బాదపరాగంబు ప్రసాదించి వీడ్కొలుపుచు నమ్మందగమన మందిరాంతరంబునకుం బోయి. 82
తే. వరము లిచ్చు మహాపతివ్రత యటంచునేతు కాశీపురాంతరక్షితిజనంబులచ్చమగు భక్తి గానుక ల్దెచ్చి చూడవేళగానక యుండఁగా వెలసె నధిప. 83
క. అంతయుఁ గనుఁగొని యిఁక నీజంత న్నమ్ముదురె యెపుడు చంపునొ యనుచుంజింతించి యళుకుఁ బాయకయంతం ద్వర వెడలి కాశి కరిగితి నధిపా. 84
శా. గంగాభంగముల మునింగి నిగమగ్రామేశ్వరు న్విశ్వనాథుం గీర్తించుచు మ్రొక్కి డుంఠిగజవక్త్రుం గొల్చి యంతంద్రివేణిం గాయంబుఁ దొలంచి పూర్వకృతనిర్నిద్రాఘము ల్వాసి నీరంగత్పూర్వకృపారసంబునకుఁ బాత్రం బైతి ధాత్రీశ్వరా! 85
క. ఆయద్భుతంబు మదిలోఁబాయ మనఁగ లేకయుంటిఁ బదపడి సభలోనీయాశ్చర్యముఁ గని భూనాయక తద్విగుణ మగుట నవ్వుదయించెన్. 86
క. అని తెలుప విక్రమార్కుండనుపమ విస్మయతఁ బుష్పహాసుని మన్నించి నితాంతవిభవసౌఖ్యంబుననుండె న్వింటె వైశ్యభుజగద్వేణీ. 87
క. అని యిట్లు చిలుక పలుకన్విని మిక్కిలి వెఱఁగుచెంది వెసనంతటిలోఁదనచేతి గరలు కనఁబడఁజనియెఁ బ్రభావతి రహస్యసదనంబునకున్. 88
తే. కోమటిమెఱుంగుసిబ్బెపుగుబ్బలాఁడియంతిపురమున కరిగి సాయంసమయముగాంచి కైచేసికొని మహీకాంతసంగమాభిలాషంబుతోఁ జేర నరుగుదేర. 89
క. కనుగొని గుణసాగరుఁ డోవనితా చనియెదవె ధరణివల్లభుకడకుంజను మిఁక నొకథ వినుమనియనుచుం బలుకం దొడంగె నతివేడుకతోన్. 90
ఉ. అంగవసుంధరాభరణమై యొక పట్టన మంద మొందు మాతంగతురంగసద్భటకదంబశతాంగతతు ల్చెలంగఁగామాంగళికాభిధాన మసమానముగా వహించి యప్పురంబంగదనామధేయవసుధాధిపుఁదేలు నవేలసంపదన్. 91
ఉ. ఆనరపాలమౌళి కపరాంగము కైవడి నొక్క మంత్రి మేథానిధినాముఁడై తగు నతండు నిజాంగన జాయమానశో
Comments
Loading comments…