ద్వితీయాశ్వాసము
శుకసప్తతి
శ్రీరామాంక ధరాజాతారామవసంతసంతతామితవిభవోదారా మాధుర్యనచోధారా మార్తాండధామ దశరథరామా. 1
తే. అవధరింపుము సకలరాజాధిరాజనతపదాంభోజుఁ డగు ధర్మనందనునకుసకలవైదికలౌకికాచారవిహితహితకథారమ్యుఁ డగు ధౌమ్యుఁ డిట్టులనియె. 2
ఉ. అంతటఁ దెల్లవాఱిన దినాంత మొకానొకరీతిఁ గాంచి తత్కాంత మెఱుంగు గుబ్బకవకస్తురిపూఁతను రంగుచెంద వెన్నంతయు వేణికారుచుల నండగొనం గయిసేసి నీలచేలాంతరదృశ్యయై హరిశిలావృతహేమశలాకఁ బోలుచున్. 3
క. జనవరసురేంద్రుకడకుంజనఁ జూచినఁ జూచి చిలుకజాబిల్లి యనున్మనమున నొకకథఁ దలఁచితివిని పొమ్మా కొమ్మ యింత వేగిర మేలా. 4
తే. అనుచుఁ దెలుపఁ దొడంగె నోయంబుజాక్షిమదన మనుపట్టనం బేలు మదవదరిసమూహములఫాలతలముల మోడ్పుఁగేలుఁబెనఁచ నేర్పిననందనుం డనెడు రాజు. 5
క. ఆరాజశిఖామణి దేవేరి శశిప్రభ యనంగ వెలయు న్మిగులంబౌరందరమణిబృందముదూఱం దరమైన నెఱుల దొరలెడు సిరులన్. 6
సీ. మగువసోయగపు నెమ్మొగ మెంచఁ గొలువున్నవెలిదమ్మివానికిఁ దలము గాదుపడఁతి నితంబబింబము నెంచఁ బుడమిమోపరియైనవానికి దరము గాదుకలికి నెన్నడు మెన్న ఖచరుల కొజ్జయైవఱలెడువానికి వశము గాదునలినాయతాక్షి లేనడ లెంచ నంచవయ్యాళికత్తెకు నైన నలవి గాదుతే. భామినీమణి గబ్బినిబ్బరపుగుబ్బకవనుతింపంగ నల్లబంగారుకొండవింటివానికిఁ గూడ దవ్వెలఁదిమూర్తివర్ణన యొనర్ప నింక నెవ్వారు గలరు. 7
క. ఆపడఁతియు నందనధరణీపతియు న్నిజమనోజనితసంతోష
వ్యాపారాపారసుఖంబేపార న్మెలఁగుచున్న యెడ నప్పురిలోన్. 8
క. దేవాలయంబు కలదు తదావాసమున న్వసించు నంతర్లలితశ్రీవత్సునకు రథోత్సవమావిష్కృతమయ్యెఁ బశ్యదఖిలామరమై. 9
క. చెప్పెడి దేమిఁక నొకచోదెప్పరమగు నుక్కుజీను దిగవైచిన వే
నెప్పుకొని కదలకుండెడుకప్పలి తీరునను దేరు గదలక నిలిచెన్. 11
సీ. ఇఱుకుమ్రాఁకులవైచి యేలెల్ల యనుచుఁ దోపించిన నింతైనఁ బెగలదయ్యెఁజూడవచ్చినవారిఁ బీడించి పెనుమోకుఁబట్టింప నింతైనఁ బాఱదయ్యెఁదమతమభక్తి యెంతయుఁ బురికొల్పఁగాజనులు ప్రార్థించిన సాగదయ్యెనిమ్నోన్నతక్షితిని సమంబుగాఁ జేసిజన్నెలమీఁ దెత్త సడలదయ్యెతే. భాగవతులెల్ల నుపవాసపరత స్రుక్కఁదెరలి చూపఱులెల్లఁ బందిళ్ళు నేరనేగుదెంచిన నృపులెల్ల నిండ్ల కరుగఁజేరి యధికారులెల్లను జిన్నఁబోవ. 12
క. ఆకార్యము విని నందనభూకాంతుం డేను మ్రొక్కఁబోకునికిఁ జుమీయీకొదవ గలిగె నని తనరాకాచంద్రాస్య వెంటరా నరుదెంచెన్. 13
ఉ. అత్తఱి బాటదార్లపరపైన భువిం బడువారి నెత్తకున్మత్తగజంబుఁగన్న గరిమ న్మొలత్రాడని గట్టినట్టివారెత్తిరి త్రాణకొద్ది పరువెక్కడి వేడుకలంచు నంతనుద్యత్తర మయ్యె వీథి ధవళాక్షులచే నవరోధముం బలెన్. 14
తే. వెంటనరుదెంచు తనమచ్చెకంటితీరుసొట్లు శోధించి క్రీఁగంటఁ జూచికొనుచునీటువాటిల్ల నరిగలనీడఁ బెండ్లిసడల నవ్వీథి కరిగె నప్పుడమిఱేఁడు. 15
క. ఆవేళ శశిప్రభ రేఖావిభవముఁ జూచి పౌరకమలేక్షణ లాహా వుట్టిపడినయట్లన్దేవునిఁ గన మఱచి యిట్లనిరి తమలోనన్. 16
తే. ఆఁడుఁదనమెల్ల నొక్కటే యట్టిపట్లనింతి యొప్పులకుప్పయై యెసఁగకున్ననిమ్మహారాజు చేపట్టునేల యిట్టిపడఁతి గల్గుట నీతఁడే భాగ్యశాలి. 17
క. అని పొగడుచుఁ గనుఁగొన నవ్వనితలలో డాఁగి యాధవళలోచనఁ గన్గొనియె నొకవర్తకుని నందనుఁడు ప్రవీణుఁడనువాఁడు తత్సమయమునన్. 18
క. చూచినయంతనె మదనుండాచపలుని నడ్డంగిచె నాతరువాతన్వాచాగోచరదుర్మదవైచిత్రిం బొగడదండ వైచెం బెలుచన్. 19
క. ఈరీతి నతఁడు బహుమోహారూఢిం బొగులునంత నానృపతి నమ
స్కార మొనరించి పోవందేరొకనిమిషంబులోన నెలవున కరిగెన్. 20
క. ఆతరువాతఁ బ్రవీణుఁడుజాతరవాతతమిళిందసమితికి సుమరేఖాతతవారికి నిజకరకాతరవారిజమరీచికల కే దలఁగన్. 21
క. ఆందోళన మొందుచు నయ్యిందుముఖిం బొందకున్న నిందవుగద యీబొందికిఁ బ్రాణము లని యమ్మందుం డొకనేర్పు తనదు మదికిం దోఁపన్. 22
క. ఆరూఢి యశోదయనంబేరుపడిన పేదరాలి పెద్దమగృహముంజేరం జని యాయవ్వయురారమ్మని ప్రియ మెలర్పఁ బ్రముదితుఁ డగుచున్. 23
చ. సడికొడిగట్టలేని కనుచాటుమెలంకువతీఁగబోండ్లకుంగడుపులు దించ నింతులకుఁ గాంతవశీకరణార్థమంత్రముల్నొడువఁగఁ బల్లవాళిగతి లోకపుపూఁతలు మేఁతలీయనేకడమయు లేక నింటఁగడకట్టితి నిన్ గొనియాడశక్యమే. 24
క. నీ కీవఱ కెన్నఁడు వక్కాకున కీలేదు నిర్దయామతి నేలాకోకొమ్మాయని పిడికెఁడురూక లొడింజల్లి యాతురుండై మఱియున్. 25
క. నందననృపాలుసుందరియందముఁ గనుగొంటి మొన్న నదిమొద లెదలోఁగందర్పదర్ప మార్ప మదిం దెఱకువ శరణుసొచ్చితి న్నీ కిచటన్. 26
క. అని దీనాలాపము లాడిన నవ్వుచు నయ్యశోద డెప్పరమగు నీపని యైన నే నృపాంగననినుఁ గూర్చెదఁ జూడు నాదునేర్పని పనిచెన్. 27
క. రాకాశశాంకవదన పరాకా యిఁక నయ్యశోద రాజాంగనతోనేకైవడిఁ గూర్పఁగవలెనాకాముకుఁ దెలిసెనేని యానతియిమ్మా. 28
క. అని చిలుక తేనియలు బోరనియెడు జడివాన వెలిసినటువలెఁ బలుకందనయంతనె తానిల్చినవిని కోమటిచిటుకులాఁడి వెస నిట్లనియెన్. 29
క. ఓరామచిలుక మాకీమారాము ళ్ళెట్లు తేలియు మగవారమె నీదారిఁ బలుపోకలం గడిదేఱం దరువాతిగాథఁ దెలియం జెపుమా. 30చ. అనవుడుఁ జిల్కఱేఁడు విడియంపుదువారపుఁ గెంపుఁగన్న జవ్వని నునుదొండపంటి జిగివాతెఱజాఱన ముక్కునిగ్గు వా
సన నెడసేయఁ గుంకుమవసంతము సల్ల కథావిశేషమిట్లని తెలుపందొడంగె వసుధాధిపుదూతిక చిన్నఁబోవఁగన్. 31
సీ. నడునెత్తి మఱ్ఱిపాలిడి తాలిక లొనర్చికడలుకొల్పిన గొప్పజడలదిండునలికభాగమునఁ జింతాకు వెడల్పుగఁబొసఁగించుకొన్న విభూతిరేఖసందిట నిరువంక నొందుపైఁడి కుసుళ్లనందంబు నొందు రుద్రాక్షపూసకటితటిఁ గాసెపై గట్టిగాఁ బిరుచుట్టుగట్టినకుఱుమాపుఁగావికోకతే. నాగబెత్తంబుఁ దామ్రపునందిముద్రయుంగరము జన్నిదపువాటు యోగపట్టెయమరజంగమురా లయ్యె నఖిలపల్లవావళీకృతసమోద యయ్యశోద. 32
క. ఈలీలం గ్రొత్తజంగమురాలై తనవెంట శిష్యుఁడై యొక్కఁడు రానాలలన యిల్లు వెడలెన్గోలయుఁ బలె నొక్కపెట్టకుక్కం గొనుచున్. 33
చ. వెడలి పురంబునంగలుగు వీథులవీథుల సౌధయూథముల్బడిబడిఁజుట్టి యాశునకభామఁ గనుంగొని యిట్టిపుట్టు వెక్కడను లభించె నీకు మమకారము గానము మే ల్రహింపఁగాదడఁబడ న న్నెఱుంగవుగదా యనుచుం జరియించి యెంతయున్. 34
క. ఆనందనాఖ్యధరణీజానియగారంబు బలుహజారముఁ జేరం
గా నరిగి కృత ప్రత్యుత్థానత బహువిధములందుఁ దను సేవింపన్. 35
తే. వారితోఁ గాశికాకృతావాస ననియునిపుడు రామేశ్వరంబున కేగుచున్నదాన ననియు ఫలాహారమాననీయననియు వసియింప వైరాగ్య మౌర యనుచు. 36
తే. వారు చెట్టునఁ దనదాన యారఁబండినట్టి పరువంపురసదాడియరఁటిపంటిగొలలు చక్కెర నెయ్యి మక్కువ నొసంగనన్నియును సన్నచే శిష్యుఁ డందుకొనియె. 37
క. చూపట్టఁగ గోమయమునంజేప ట్టొనరించి జడలఁ జెక్కినలింగంబాపోకలాఁడి గైకొనివేపికడ న్నిలిపి భక్తివివశయపోలెన్. 38
క. ధూపంబు కడ్డివత్తులుదీపంబు నొసంగి తనకుఁ దెచ్చినఫలముల్చూపి యుపహార మిచ్చి నిశాపతిధరుఁ గుక్కనొక్కసరిగాఁ గొలువన్. 39
చ. గుమిగొని పైలపైలఁబడికొంచు భటావళి చూడఁబోవ వెచ్చము గొనిపోవుదాదులు నిజంబు గనుంగొని యాశశిప్రభారమణికిఁ దెల్ప నాయమ నిరంతర విస్మయమంది చూతమాక్రమమని వారిచేఁ బిలువఁగాఁ బనుషం జని మ్రోల నిల్చినన్. 40
తే. ఆశశిప్రభ జంగమురాల యేమికారణం బిటు కుక్క లింగంబు నొక్కసరిగఁ బూజింప నిది వింతసరణి గాఁగదోఁచుచున్నది తెల్పుమా దాఁచకనిన. 41
క. ఆమాయలాఁడి యపు డాకోమలిమొగము గని గోడుగోడున నేడ్వంగా మఱియు వెరవుదోపఁగనామంజులవాణి యనునయాలాపములన్. 42
క. ఊరార్చి యడుగ సమ్ముదిబేరజమిది విన్న నీకుఁ బెనుదుఃఖంబౌనేరీతినైన మఱి వినఁగోరిన నన్నొంటినడుగు కువలయనయనా. 43
క. అనుమాట విని వయస్యాజనములు కడకరుగ నవ్విశాలేక్షణతోమనకథ యవితధముగ వినుమని యంత న్మాయజోగురా లిట్లనియెన్. 44
చ. మునుపటిపుట్టున న్మనము మువ్వుర మొక్కతె కుద్భవింప నందనఘచరిత్రయైన మన కగ్రజనాథునిఁగాని తన్నుఁ గోరినమగవారలం దననిరీక్షలకుం బ్రియులైనవారలందనివిదొరంగఁ గూడనికతంబున నీగతిఁ బుట్టెఁ గుక్కయై. 45
క. నీ వపుడు వీఁడు వాఁడనిభావింపక గుడిసె వైచి పరులంబొందన్దేవేరి వైతివౌ వసుథావల్లభమణికిఁ గేళితత్పరమతివై. 46
క. ఏ నపుడు కోరివచ్చినవాని న్రమియించుట న్భవానీపతినేవానిరతియు జాతిస్మరతానూనత్వంబుఁ గల్గి హర్షముఁగంటిన్. 47
క. కావున సహోదరీ మైత్రీవిధి నీ వేపితోఁ జరింతున్ శివపూజావేళనైన నని యనఁగా విని యారాజముఖి వికాసోన్ముఖియై. 48
ఉ. గ్రక్కున మ్రొక్కి పూర్వజనికాలసహోదర లైనమిమ్ము నేనక్కఱఁదీఱఁ గంటి నొక యక్కకు నిట్టియవస్థ వచ్చెనేయక్కట నేననన్యరతనై యొకరాజును గూడియుంటి నిట్లెక్కడ వచ్చునొక్కొ యిఁకనెత్తుభవంబున నిట్టిదుర్దశల్. 49
సీ. అక్క నాకిచ్ఛావిహారంబు గూడ దీపట్టున దొరచెట్టఁబట్టియునికినింకొక్కజన్మమం దేనియు జాతీస్మరత్వవిఖ్యాతిచేఁ బ్రబలవలయునప్పటి కన్యవ్రతాభావజనీతమైశునకత్వ మెడలించుకొనఁగవలయునటుగాన ననుఁగోరినట్టి చక్కనిచిన్నవాని దోతెంచి నావాంఛ దీర్పుతే. మాతఁ డవరోధగమన మె ట్లనుచు వెఱచియెడఁబడకయున్న నా ప్రాణ ముత్తరింతుఁదనకుఁ గానని యేనంటి ననుచు ధైర్యమీచ్చి తోడ్కొని ర మ్మిప్పు డేగు మనిన. 50
చ. చని యది యొక్కనాఁ డరిదిజంగమురాలయి శిష్యుఁ గాఁగఁ గైకొనుచుఁ బ్రవీణుఁ దెచ్చి యొనఁగూర్చినఁ బెచ్చుతమి న్శశిప్రభావనరుహపత్రనేత్రయును వాఁడును వేడుకమీఱఁ గేళికింబనుపడి సౌఖ్య మొందిరి ప్రభావతీ వింటె యశోద నైపుణిన్. 51
క. ఈరీతీ నేర్పుగలిగినఁబోరాదో మగనికన్నుఁ బొడిచినరీతిన్రారాదో లోకములోవారికి నీ కనుటగాదు వారిజనేత్రా. 52
మ.అని యూరీకృతమూకభావుఁడయి కీరాధ్యక్షుఁ డుండంగ వైశ్యునియిల్లా లతివిస్మయాంబునిధియం దోలాడుచిత్తంబుతోడ నిజంబౌనె యశోదవంటిది నిరూఢప్రౌఢ చేకూర్చినన్జనితస్వైరవిహారధీరసురతేచ్ఛాకాముకశ్రేణికిన్. 53
క. అని తెల్లవాఱవచ్చుటఁగని నిద్దుకకరిగెఁ గీరకారణజన్ముండును నేఁటికిఁ దక్కెఁ గదాకనకాంగికి మాన మని సుఖస్థితి నుండెన్. 54
ఉ. అంతటఁ జక్రవాకవరహప్రదమౌ సమయంబు వచ్చినంగంతుఁడు రాజదూతి సతికన్నను మున్నుగ హెచ్చరింప సంభ్రాంతమనోబ్జయై యలప్రభావతి యింద్రశిలావిభూషణానంతరుచిచ్ఛటల్ పెనకులై తనచూపులనంటి కొల్వఁగన్. 55
క. కలపంబు నలఁది కస్తురితిలకము పొలుపొంద రత్నదీపము లగుపా
వలు మెట్టి మేలిమిం గురువలు వమరం గట్టి వింతవగ గనుపట్టన్. 56
తే. రాజు తొలునాఁటిరేయి విరాళిగొనుటఁదెలుపుచును వెంటవచ్చుదూతికయుఁ దానుసరస కేతేర నక్కీరసార్వభౌముఁడరిది యపరంజిపనులపంజరము వదలి. 57
క. చనువేళ నిలిచి పొమ్మనియనరా దపశకున మనుట నైన న్నీపైనెనరునఁ దెలిపెద నొకకథకనకాంగీ వినిన నేర్పుగలుగు న్నీకున్. 58
వ. అని పలికి యాభామినీమేదురావలోకనాధారంబునం దదీయాంగీకారంబు నెఱింగి యప్పతంగపుంగవుండు హాసంబుతో నితిహాసం బిట్లని చెప్పం దొడంగె. 59
తే. అమరసౌవీరదేశంబునందు విటతరంగితాభంగమోహాంబురాశి చం,కార్యకృద్వారభామాప్రకాశమానలపనమండల మగువిశాలాపురంబు. 60
క. ఆపురము నరోత్తముఁ డనుభూపాలుం డేలు నతనిప్రోపున వైశ్యుండేపారు నొకఁడు ధర్మవ్యాపారం బలర విమలుఁ డనునామమునన్. 61
ఉ. ఆతనియాలు డీలుపడనట్టిమనోజునిపోలు వాలుకంజాతముచాలు పూలుగలసంపగికొమ్మల గీలుగ్రాలు ముక్తాతతిడాలు మేలుకొనుకల్వలతావలమేలు జాళువాజోతులజాలు జాలుకొనుచూపులఁ జూపఱ నేలుప్రోలునన్. 62
క. దానికి మోహనయను సభిథానము దగు విమలుఁ డాసుథాకరముఖితోనానావిధసౌఖ్యప్రదసూనాయుధకేళి నింపుసొంపు వహింపన్. 63
తే. వానికై చంద్రరేఖ యన్వారవనితమునుపు తొడసోఁక కుండియు మోహమందువానియిల్లాలికై ధనవంతుఁ డనెడివన్నెకాఁ డట్టి మదివట్టి వలపుఁ జెందు. 64
క. అంతట నొకనాఁ డలధనవంతుం డేరీతి వైశ్యవనితామణితోగంతురణకేళిఁ దేలంగాంతుం దైవకృపకలిమిగా కని మదిలోన్. 65
సీ. అవ్వీట నమరుగా హాలావికృతహాసకహకహధ్వనిసంగ గ్రామగంగయాయమ్మపురుషుఁ డభ్యర్థియైనవధూటినబలకార్యార్థిని యైనపురుషుబలివెట్టికొలువ వారలకోరుకు లొసంగునటుగాక నొకవెలయాలి నంపియద్ధేవి కర్పింతు ననియెంచె నాచంద్రరేఖాబ్జముఖియు నారీతిఁ దలఁచె
తే. నిష్ట మొనరించి తమి నెలయించి యొకనిఁగాళికాభుక్తి చేసి నాకాంక్ష దీర్చికొందునని చూచె మఱి యొనఁగూడె దైవఘటన నయ్యిద్దఱకును సంగమసుఖంబు. 66
తే. కల్పితాన్యోన్యవిరహంబు కంతుసమరసముదితాళీకదైన్యవాచావిధంబుసకలధనశాంబరీనిరాశాగుణంబఖండగతి నొప్పుఁ దద్వంచకద్వయంబు. 67
సీ. కల్పిత ప్రణయవిగ్రహకాలవైదగ్ధ్యజనితమాయాతాపసంభ్రమంబుప్రతివాక్యశపథపారంపరీవిజ్ఞాపితాత్మీయకృతకమోహాతిశయముదంభేతరానుబంధనిబంధనిహ్నవజల్పితసూనృతశపథశతముకపటనిద్రాజాతకైతవోత్స్వప్నప్రణామవాచామిథోనామధేయతే. మురుతరచ్ఛద్మసప్రయత్నోపగూహనసకృదతులితకృతవశాంతరదశంబుసౌఖ్యముఖ్యత్వవంచనాసమ్మదంబఖండగతి నుండె నవ్వంచకద్వయంబు. 68
తే. ఇవ్విధంబున నయ్యిద్ద ఱెనసి నట్లయుండి యొకనాఁటిరేయిఁ బ్రచండకుసుమకాండభండనమున సరికట్లఁ బెనఁగిసుప్తిఁ బొందిరి తెమ్మెర ల్చూరనాడ.
క. ఆమీఁదఁ జంద్రరేఖాభామామణి లేచి యులికిపడి భయమున సుశ్రీమించఁగ ధనవంతునితో మాటల దొట్రుపాటు దొలకం బలికెన్. 70
క. ఓరీ నాయాకారముకూరిమిపటమునను వ్రాసికోరా యది నామారుగఁ జూడర నాబంగారయ్యా నీవు చల్లఁగానుండు మిఁకన్. 71
క. అనవిని మది నిది వంచనమని కని ధనవంతుఁ డింతయాగడమే మయ్యెనొకో నామీఁదానేనను జంపితి తెలుపు మనమనం బలరారన్. 72
క. కలగంటి నీవు బొకకలకంిం గూడినట్లు గావున నిఁకఁగాఁగలుగును బ్రాణత్యాగంబెలమిం జేసికొన నిశ్చయించితి మదిలోన్. 73
చ. కనుఁగొనఁజాల వేఱొకతెకౌఁగిట నీవు సుఖింప నిప్పుడేపనివిని వాసనావశత భావిభవంబుననైనఁ జెందెదన్నిను నటుగా దటన్నఁ బరనీరజనేత్రలఁ బొందనంచు నింపునఁ జను దెంచి గంగగుడిముందఱ బాస యొసంగు మిత్తఱిన్. 74
క. అని చంద్రరేఖ పలుకంగనుఁగొని నగవలర నట్ల కానిమ్మని యాననబోఁడి వెంట రాఁగాధనవంతుఁడు గంగగుడి కుదగ్రత నరిగెన్. 75
సీ. కాఁపుగుబ్బెతలు పొంగళ్లు వెట్టినపాలకడవచాఱికలపొక్కళ్ళఱాలుదొరలు దెప్పించి బంతులుగట్టి యర్పించుపొట్టేళ్ళనెత్తురు బురద రొంపికోర్కి చెల్లినభుజంగు లొసంగఁ బెఱికినకుక్కుటపటలంపు ఱెక్కగుంపుమంత్రముల్ ఫలియింప మాంత్రికుల్ పయిజోతివన్నెయుంచిన పంచవన్నెకోళ్లుతే. పరఁగ గుగ్గులగురుధూపపరిమళంబుశాకినీడాకినీభూతసంభ్రమంబుచరదితప్రాణమృత్తికాతురగచయమునలమ నాగంగగుడిఁ జేర నరుగునపుడు. 76
క. తనుదునుమఁ దలఁచు తత్కామినికన్నను మున్నె యతఁడు మిసిమికటారిందునిమి బలియొసంగె సాహసమెనయం దల మొత్తి బాస యిచ్చెద ననుచున్. 77
సీ. బలుకప్పు నెరిగొప్పు పైనొప్పు బుడుతజాబిల్లితో మృదుతనూవల్లి తోడనునుపైఁట తెరచాఁటుగొనునీటుగుబ్బచన్కట్టుతోఁ గపురంపుబొట్టుతోడఁగరుణారస ముదారగతిమీఱఁ జూపట్టుచూపుతో రతిఁగేరు రూపుతోడఁదలిరాకుజిగి జోక వెలినూకఁగల మేలికేలుతో నెల దేఁటి డాలుతోడఁ
తే. గెంపు పపడంపు జిగిసొంపు నింపుముద్దుమోవితో గుమ్మురను నిండుతావితోడసంతసము వింతగా ధనవంతుచెంతశాంతయై రుద్రకాంత సాక్షాత్కరించి. 78
క. మెచ్చితి వరమడుగుమనందచ్చిత్రదయాత్వమున కతం డలరి సముద్యచ్చరితవిమలునాకృతియచ్చొత్తినరీతి నొసఁగు మని వేఁడుటయున్. 79
క. ఇచ్చితిఁ బొమ్మని కాళికవిచ్చేసిన యపుడె యతఁడు విమలునిరూపంబచ్చుపడఁ దాల్చి యందులకచ్చెరుపడి యింటికరిగె నతిగూఢగతిన్. 80
ఉ. అంతట నోడబేరమునకై విమలుండు చనంగ నెమ్మదిన్వంత దొలంగఁ జేసి ధనవంతుఁడు వానిగృహంబుఁ జేరె నత్యంతధనంబుతోడఁ గల మంబుధిలోన మునింగె నయ్యెడన్దంతురవీచిక ల్దరికిఁ దాల్చిన వచ్చితి నంచుఁ బల్కుచున్. 81
క. ఊరిదొరబేరు లెల్లనునూరార్పఁగ నిట్లు వచ్చియుండెడువానింజేరి నిజనాథుఁడని కన్నీరు వడిందొరఁగ మోహినీసతి పలికెన్. 82
ఉ. అక్కట ప్రాణనాథ ధన మంబుధిఁ గూలినఁ గూలనిమ్ము వేఱొక్కతెఱంగునం బడయనోపమె విత్తచయంబు లేనిచోనిక్కడిపేదవారి మన మెవ్వరిఁ బోలుదు మింతే చాలుఁ బోగ్రక్కుననక్కఱ న్మొగమొగంబులు చూచికొనంగఁ గల్గెఁగా. 83
తే. నేఁటి కీపాటి నీవు నాత్రాటిమహిమనింటి కేతేరఁ జల్లగాఁ గంటి నింకనిదియె పదివేలు వైభవం బెల్లనాఁడునల్లపూసలు చెవియాకు నాకుఁ జాలు. 84
క. అని ధైర్యమిచ్చి తగమజ్జనభోజనములను దృప్తి సలిపి దినాంతంబున నాతండును దాఁగేళినిశాంతముఁ జేర సరిగె లీలాపరతన్. 85
క. ఈకైవడి నెచ్చెలి తనయాకాంక్షలు దీర్ప నిర్భరానందముతోనాకోడెకాఁడు చివురుంజేకత్తివజీరు సడ్డసేయక యుండెన్. 86
తే. వచ్చె విమలుండు నిస్తులవస్తుచయముగొనుచు నింటికి వచ్చిన ఘోరకలహమయ్యె ధనవంతునకు వాని కాగృహంబునాదియన నాదియనఁగ నౌఁ గా దనంగ. 87
క. పురజనులు తమ్ముఁ గనుఁగొనియిరువురియాకార మొకటి యేర్చఱుపఁగ నెవ్వరివశ మనుచుం జూడఁగదొరముందఱఁ బడిరి వాదుతోడ న్వారల్. 88
క. ఆదొర యేగతి వారలవాదుడు పన్వలయు వింటివో వినలేదోపైదలి యనినఁ బ్రభావతిమోదము వెలిఁజిలుకఁ జిలుక మొకరికిఁ బలికెన్. 89
తే. వింటి నంతయు మేదినీవిభుఁడు వారికలహ మేరీతి నుడిపెనో తెలియరాదుధర్మసంకట మిదియేల తడవుసేయకవలికథఁ దెల్పుమయ్య కీరాగ్రగణ్య. 90
చ. అన విని చిల్క పల్కు వినవమ్మ ప్రభావతి యన్నరేశ్వరుండనఘత మోహినిం బిలువనంపి భవత్పతి నిన్నుఁ బెండ్లియాడినతటి సుంకు వేమొసఁగె డెందమునం దలపోసి తెల్పు మాకనవుడు నూఱుమాడలనె నావిమలుండును నట్ల పల్కినన్. 91
క. ధనవంతు నట్ల యడుగందన కది తెలియమికి నీళ్లు దా నమలిన నాతని వెడల నడిచి ప్రమదంబున నాదంపతులఁ గూర్చి పొమ్మని యనిచెన్. 92
క. ఇంతటి నేరుపు గలిగినఁగాంతా కడతేఱుఁ జారుఁ గదియుట లేదాకాంతుం డెఱిఁగిన నాతనిపొంతకు నేమొగముతోడఁ బోయెదు చెపుమా. 93
క. అని చిలుక యూరకుండినఁగనుఁగొని యక్కలికి దీపకళికలతోడందనమోము వెలుకపాఱంజనియె న్నిదురింపఁ గేళిసదనంబునకున్. 94
తే. పల్లవియుఁ దెల్లవాఱ నప్పార్థివేంద్రుకడకుఁ జని చిలుక సేయు విఘ్నములఁ దెలిపి
యతఁడు ప్రార్థించి పుత్తేర నరుగుదెంచెఁబొలఁతిచెంతకు నంతకుఁ బ్రొద్దుగ్రుంక. 95
ఉ. గందపుఁబూతఁబోలు ఱవికందగగుబ్బలమీటు హారపుంజందెపువాటుమాటు బురుసాపని పయ్యెదనీటుఁ జాటునేయందగు మేల్ముసుం గమర నల్ల బ్రభావతి వచ్చె మీనుడాల్పొందినరాచవాని యొఱలోనికటారిఁ దుటారమాడుచున్. 96
ఉ. వచ్చినఁ జూచి కీరమురువారముమీఱ ముఖారుణద్యుతుల్బచ్చెనపన్న నానృపతిపాలికిఁ బోయెదవేమొ పొమ్ము నీయిచ్చకు వచ్చినట్లు రమియింపు మొకానొక మాటపుట్టినన్నెచ్చెలి లేదుబంతియను నేర్పున దిద్దుకొనంగఁ జాలినన్. 97
చ. వదినెలపోరు మాన్ప నిజవల్లభు నిద్దురపుచ్చ మామనోరదమఁగ నత్తగారికి భయం బొనరింప మఱందినూరకేగదమఁగఁ దోడికోడలి కొకానొకనింద ఘటింపవచ్చుఁ బోకదిసిన నేర్పుచేత బెళుక న్వెరవొందిన జారకాంతకున్. 98
ఉ. ఇందుల కొక్కగాథ గల దింతటిలోఁ బతి పాఱిపోవఁడోయిందునిభాననా వినుమ యిందిరకుం దిరమైన యిల్లు సంక్రందనరాజధాని కెనగాఁ దగుశూరవరావలోక మారందసమాఖ్యచే నొకపురంబు పరంతపరాజు ప్రోవఁగన్. 99
తే. అచట జనవల్లభుండన నమరు నొక్కఁడంగసౌష్ఠపమున రతి యౌననంగనలరు మెండైన నిండుప్రాయంబుకలిమిరస్తుమీఱుచు నాతని గేస్తురాలు. 100
తే. వీటఁగల కోడెకాండ్రెల్ల వింతరతులజవుల మరగించి భయము లజ్జయును దీర్చజారవిద్యలఁ గడు గడిదేఱి యామిటారి విడివడ్డమరుతేజి దారిమీఱి. 101
క. తిండికతంబునఁ గండలుమెండుగఁ దాఁ బెంచి మగఁడు మెదలఁ డనుచు నుద్దండత నది మిండనికిన్వండిన కుడు మనఁగ దుడ్డువైఖరి మెలఁగున్. 102
చ. పలుమఱు నేటినీటి కని బానిసఁ బిల్చెద నంచు ఱోలురోకలికని కూరగాయ కొనఁగావలె నంచొకలేనికార్యమేపలుకుచుఁ గోడెకొండ్ర కనుపండువుగా నడయాడువీథినవ్వల నిఁక మాట లేల తలవాకిటఁ గాఁపుర మయ్యె దానికిన్. 103
చ. కలయని వింతవాఁ డెదురుగా నడతేరఁగ డాసి యవ్వలంబెళుకుచు నమ్మచెల్ల తరుణీ చెఱఁగించుక సోఁకె దానికిందలఁపున నేమిసేయునొకదా యని నెచ్చెలితోడఁ బల్కి మెచ్చులు దులకింప వాఁడు తనుఁ జూచినఁ బక్కున నవ్వు వీథులన్. 104
తే. తనదుచిన్నెలకై యాసఁ దడవు సేయనడుగవచ్చిన మనసురానట్టివారిరట్టుగావించి మగనాలిఁ బట్టడాసితౌర మొఱ్ఱో యటని దుమ్ము తూరుపెత్తు. 105
క. కంటికి బ్రియమగువానిన్గెంటని తమకమునఁ గామినీభూత మనన్వెంటఁబడి కౌఁగిలింపకనింటికిఁబో దవ్వధూటి కెంతటి తమియో. 106
క. పతిఁ బ్రక్కఁ బండినప్పుడురతి కొంగక నిదురవోదురా యయ్యో నాచతురుఁడ గుఱకలు చాలున్గతి చెప్పు మటుంచు వానిఁ గడు బాధించున్. 107
క. ఇట్టివగనడుచుతనవగఁజుట్టములకుఁ దెలుపు మగని సుద్దులు విని యాదిట్ట చని వారితో మఱియెట్టువిడుం దన్ను నాథుఁ డొల్లఁడటంచున్. 108
తే. మఱియు నమ్మాయలాఁడికోమటినెలంతలందఱును గువ్వకోల్గొని యగడుసేయవారిఁ గూర్చుండఁబెట్టి నావర్తనంబుదెలియదే కద మీకంచుఁ బలుకఁ దొడఁగు. 109
ఉ. అన్నెముపున్నె మే నెఱుఁగనమ్మ మతిం బతి నాదుపాలికింబెన్నిధి గాఁగఁ జూతు మెఱమెచ్చులుగా వొరునెట్టివాని నేగన్నులనైనఁ జూడ నిది కల్లయొ సత్యమొ చూచుచున్నవాఁడన్నలినాప్తుఁ డింకొకటి యారజ ముట్టిపడ న్మెలంగుదున్. 110
తే. అట్లు మెలఁగుట యేమిటి కంటిరేనినింక నెక్కడిసిగ్గు మాయింటియతనికాసపుట్టింప మెలగుదు నట్టులయ్యుబూచివలెఁ జూచుననువానిఁ బొడిచిత్రోయ. 111
చ. కలిగినవాఁడుగా మరునికన్నను వన్నియగల్గువాఁడుగాకులమున మేటిగా సవతిగోరము గానమటంచు నెంచి వేడ్కల కెదురేగుదు న్మగఁడు గల్గియు లేనివిధంబు సేసీ తానెల గలనైన నన్నుఁ గరుణింపఁడు భోగమువారిపొందునన్. 112
క. నాసుద్ది యింతగని మదిదోసమనక తనదుసెట్టి తొత్తులకేమోబాసలఁట బండికండ్లటచేసన్నఁట విన్నవారు చెప్పిరి నాతోన్. 113
తే. పాన్పు కెక్కించి తన ప్రక్కఁ బవ్వళింపగోరి నేఁ జూడ ఱేలు తాఁగుడిచి కట్టియూరకే యిల్లు వెడలు నాయుసుఱు తాఁకిదీపములుసైత మల్లాడుఁ దెఱవలార. 114
సీ. పతిపత్నినని మేనఁ బసుపు పూసికొనంగసొగసులాయని ముంతపొగ ఘటించుఁబెనిమిటి గలదాననని కాటుక ధరింపవేడుకలా యంచు విఱిచికట్టుముత్తైదువనటంచుఁ బత్తి బొట్టు వహింపజిన్నెలాయని కాలఁజేతఁ బొడుచుధవసంగత నటంచుఁ దులదువ్వి ముడిచినమురువులా యని ముడ్డిమూతి నులుచుఁతే. బొలుపు దిగనాడి నే చిన్నఁబోయియున్ననతని కెక్కడ కీడౌనొ యనుచు నాతఁడెంతచేసిన నేమాన కింటఁగలుగుసొమ్ము మెయిఁబూని కాననిచోటుఁ గందు. 115
క. ఇల్లీలనుండ నింటంబల్లియు నను జౌకసేయు పలుకులు వినరేయెల్లెడ లోకములో మగఁడొల్లనియాసతిని మారి యొల్లదనంగన్. 116
ఉ. నాకనరాదుగాక మలినత్వము పోగయి సేయు జోకలన్రేకల నన్నుఁ బోలఁగలరే కలకంఠులు నేరరా యయోపోకలు వారబాలికల పోలిక వారలమాయచేత నన్జౌక యొనర్చునాథుఁ డది చాలక దిట్టును గొట్టు నెప్పుడున్. 117
చ. కటకట నన్ను దూఱెదరుగాక వివేకము లేక మీకు నిచ్చట మగవారు లేరెకద చర్చయొనర్పఁగ నాఁడుదాని కేమిటికని నాథుఁ గూర్చువిధి మీర లెఱుంగరె యిట్టిపోఁడి మేయటమటమైనఁ దాళవశమా నెఱప్రాయపుఁబూవుఁబోడికిన్. 118
క. అని చిత్తిని మగఁడొల్లనితను వేటికిఁ దనకటంచు దయవుట్టఁగ బోరున బాష్పంబులు తెలిగనుఁగొనలం గురియంగ గోడుగోడున నేడ్వన్. 119
తే. వార లెల్లను బంగారువంటి నిన్నుఁబాసి పలుగాకులకుఁ గొంగుపఱచు చెలులనంటివర్తింప వాని కేమాయె ననుచునంతయు నిజంబనుచు నిండ్ల కరుగు నంత. 120
క. జనవల్లభుండు బాంధవజనముల వెసఁగూర్చి భార్యచందము దెలుపన్విని వారంద ఱిదేమనినెనరున గద్దింపఁ జిత్తినీసతి కడకన్. 121
తే. ఇంత యేటికి నీరేయి నితఁడు పడుకటిల్లు వెలువడి యెక్కడి కేగుఁ దలుపుమూసి గడియ బిగించెద మోసపోకతెల్లవాఱిన మీరది తెలిసికొనుఁడు. 122
క. ఏనిల్లు వెడలిపోయినఁదాను గవాటంబె మూయఁదలఁడె యంతన్దానం దెలియదె తనవగనా నేరము సెప్పఁడేటి నగుఁబా టిచటన్. 123
క. అన విని వారిది యగుననిచనుటయు నానాఁటిరేయి శయ్యపయి న్నాథునిప్రక్క నుండి తమి రేఁగినఁ జిత్తిని చనియెఁ దలుపు గిఱు కనకుండన్. 124
తే. అంత నిద్దుర లేచి వైశ్యాగ్రగణ్యుఁడనుఁగుటిల్లాలు లేకుంటఁ గని కవాటబంధన మొనర్చి తానుండెఁ బాన్పుమీఁదఁబంత మీడేఱె ననుచున్న యంతలోన. 125
చ. చనుఁగవజోడుపో టొకభుజంగునకుం బదఘాత మొక్కజారునకుఁ గటాక్షనీలమణిరోచు లొకానొకతేరకానికిన్మనసిజకేళి యొక్కయుపనాథునకు న్గలిగించి వేగుజామునఁ జనుదెంచెఁ జిత్తిని సముజ్జ్వలకేళిగృహంబుఁ జేరఁగన్. 126
తే. వచ్చి యరదనిరోధంబువలనఁ జూచికాంతుచేష్ట యెఱింగి చేగడియ దివియఁగూడ దెత్తఁగరాదింకఁ గోరివచ్చుచెనఁటిచుట్టాలచేత బజీతనగుదు. 127
క. అని యెంచి వరుని వాకిటిఁకనుపం దానిల్లుసొచ్చి యరరముమూయందనతప్పుఁ దప్పఁ జిత్తినివనిజా యేత్రోవ త్రొక్కవలయుం జెపుమా. 123
తే. అనఁ బ్రభావతి రసభంగ మగు నిదేలమాటిమాటికి నడిగి నామన్కిఁ గొనఁగవినఁగఁ జిడిముడి పడియెడువీనుదోయిచిలుక నాతోడ నీవది తెలుపు మనిన. 129
ఉ. కీరము కెంపుసొంపునడఁగించు మెఱుంగులముక్కుటెక్కు చెన్నారఁగఁ బల్కుఁ కల్కి విను మత్తఱిఁ జిత్తిని చిత్తవీథిలోధీరతఁ బూని లేని తెగదెంపు వహించుచుఁ బల్కె నల్కతోనేకము లేనిదానికరణి న్బతి యింపున నాలకింపఁగన్. 130
తే. వెడలిపోయితి నివ్వీథి వెంట నరుగుపెండ్లివారలఁ జూడ నాపిన్నతనముగూల నింతటిలో పట్టి కోపమెత్తితలుపు బిగియించె మగఁడేమి తలఁచినాఁడొ! 131
క. చుట్టాలచెంత నాకున్ఱట్టొనరింపంగఁ దలఁచెనా యందుకు వారెట్టును జాలరెకా సడిగట్టఁగలరె నొసటఁ గన్ను గలవారైనన్. 132
ఉ. ఏనటువంటిదాననే యహీనపతివ్రత నేను గల్గఁగావానలుఁ బంటలుం బుడమి వర్తిలు నింత యెఱుంగలేక తానే నను రవ్వచేసినఁ దృణీకృత మింతె శరీర మొక్కమట్టైన ననూనదుఃఖ మెనయన్ దన కాఁపుర మెత్తిపోవదే. 133
క. కానీ బహుతరతోయానూనంబైనట్టి బావి యున్నది నేనున్నానంచు మిగులఁ జప్పుడుగానపుడే యగ్గయాళి గ్రక్కునఁ జనియెన్. 134
క. చని నూతిలోపల గుభుల్లన నొకగుండెత్తి వైచి యల్లనఁ గనుచాటున నిలువఁబడియె నిజమనిజనవల్లభుఁ డాత్మలో విచారముమీఱన్. 135
క. ఎత్తెదగాకని చనియెన్మత్తచకోరాక్షి కేళిమందిర మపుడుద్వృత్తిఁ జొరబాఱి మూసినముత్తెమువలెఁ దలుపు మూసి మొక్కలమిడియెన్. 136
క. అదిగని నివ్వెరఁగున నెమ్మదిగానక తద్వరుండు మ్రాన్పడియుండెంజదికిలఁబడి యంతట రవియుదయించిన వచ్చి బంధు లొక్కటఁ జూడన్. 137
తే. వారితో నది యోయన్నలార కంటిరా వితవితగ నన్నింత ఱట్టు సేసితానె తొత్తులకాంక్ష మదంబుకతననిల్లుపట్టక తిరిగెడు నివ్విధమున. 138
క. అని పలుక వార లలుకన్జనవల్లభుఁ దిట్టి వానిజాతికి వెలిగానొనరించిపోయి రోచక్కనికొమ్మా యింతనేర్పు గలిగినఁ బొమ్మా. 139
క. అనినఁ బ్రభావతి తనయాత్మనె యౌరా యాఁడువారి తల్లియ యనిచిత్తిఁనిఁ బొగడి తెల్లవాఱుటఁగని చనియెం గేళిలసదగారంబునకున్. 140
వ. చని యథోచితవిధంబునం బ్రవర్తిల్లె దదనంతరంబ క్రమంబున. 141
చ. హరనటనాతివేగగళితాలికలోచనవిస్ఫులింగమైసరసిజబంధుఁ డస్తగిరిచక్కటి వ్రాలఁ దదీయకీచకోత్కరములు గాలు క్రొందగుపొగల్బలెఁ జీకఁటి పిక్కటిల్లె నంబరమునమించుఁదత్తృటితమౌక్తికముల్బలెఁ జుక్క లొప్పఁగన్. 142
చ. అపుడు ప్రభావతీరమణి హారమణీఘృణిధోరణీప్రసూనపటలయు న్వినీలవసనభ్రమరాళియు నై లతాకృతింగపురువహించి వచ్చిన శుకంబు “మనోరథసిద్ధిరస్తు తేచపలవిలోచనే” యని యసహ్యపుదీవన నిచ్చి యిట్లనున్. 143
ఉ. వింటివె యొకవింతకథ వీనుల కింపు ఘటింపఁజాలు నిష్కంటకరాజమౌళి దొరగా విదిశాపురి మించు నందు నేవెంటఁ గొఱంతవోని పృథివీసురుఁ డొక్కఁడు సోమశర్మ పేరింట నెసంగు భార్యయయి రేవతిపేరి వధూటి గొల్వఁగన్. 144
సీ. గాదెలఁ గొలుచు ముక్కారుఁ బండెడు మళ్లునత్తోఁపు నడబావు లండ దొడ్డియాకుఁదోఁటలగుంపు పోఁకమ్రాకులు గుత్తచేలు గొఱ్ఱలకదుపొలమందచెఱకుగానుగ మొద ల్జెడక వర్ధిలు నేర్పుబానిసె ల్బడవాళ్లు బంటుపైదపారిగోడలు గొప్పపడసాల మేల్మచ్చుగారముంగిలి వింతగాని పొరుగు
తే. రాగి నగలు సదాచారరతీయు దేవపూజ నిత్యాన్నదానంబుఁ, బూసబొట్టుచిదురఁ జల్లిన తులసెమ్మచిన్నితిన్నెగలిగి కనుపట్టు నాతనికాఁపురంబు. 145
తే. ఇట్లు వర్తింప నాతని యింతి గర్భకలితయై చిట్టుముల బయకలు మొగమునఁదెలుపుఁ గనిపింపఁ దొమ్మిదినెలలు నిండిపసిఁడిరేకనఁదగు నాఁడుపడుచుఁ గనిన. 146
తే. పురుడు వెడలినవెనుక నాభూమిదేవుఁడాశిశువు జన్మ నక్షత్ర మరసి ఖన్నుఁడై సురార్చన మొనరింప నరుగుదేరకున్నఁ గనుఁగొని రేవతీయువతి చేరి. 147
క. ఇదియేమి మీర లిత్తఱిఁజదివితి రేమేమొ పడుచుజాతకమునకైయది మొదలు చిన్నఁబోయితిరెద నడరెడు భయము నుడువుఁ డేలా దాఁపన్. 148
క. అన విని యిది యేమియు లేదనఘగుణా! మీఁద జార యగు నిది యటుగావునఁ జింతించెదననఁ బతిఁగనుఁగొని యమ్మగువ నగవుగలమొగ మలరన్. 149
క. ఔ లెండ యేటి మాటలుమేలే యిది బ్రతికినట్టిమీఁదటఁగద యాజోలి యెటులైన నైదవరాలై మనపడుచుగాఁగ నమరినఁ జాలున్. 150
క. అని చని యాయమ జననీజనకులకుం దెలుపు సంతసంబున వారల్విని మనుమరాలుగావునననువారము దాని జారయని పిలుచుటయున్. 151
తే. ఊరివారెల్ల రావె యోజార యనఁగనదియె పే రయ్యె నాజార కంబుజాక్షియంత నది యింతయై యంతయై వినూత్నపేశలాకారయై మించి పెండ్లి కెదుగ. 152
తే. అడుగవచ్చిన వార లయ్యబలరూపశీలకులగుణవిఖ్యాతి చాల మెచ్చిజారయనుపేరు విన్నంతఁ జాఱుటయునుబీఁట మీఁదిటిపెండ్లిండ్లు పెక్కు లెడసె. 153
చ. పొలుపుగ మోసులెత్తుచనుపూపలు ఱొమ్మున నిక్క నాఁకటన్మలమలమాడఁగా జెఱఁగుమాసిన దోసము వచ్చునంచు నగ్గలికలతల్లి కూడడఁగఁగట్టె మహీసురజాతిధర్మముల్, దెలుపుచుఁ బెండ్లిపే రకట దేవుఁ డెఱుంగు మెఱుంగుబోఁడికిన్. 154
క. వేఱేపనులకు వచ్చినవారిం గని పడుచు నడుగ వచ్చిరటంచున్గారాబుకూఁతునకు సింగారించుం దల్లియాస్యకమలం బలరన్. 155
క. ధరణీసురమాత్రుఁడు పేరరయక యరు దెంచి పెండ్లి యాడినఁ జాలున్వరదక్షిణతో నిచ్చెదఁదరళేక్షణ ననుచుఁ దండ్రి తలచు న్మదిలోన్. 156
తే. వార లీరీతి నుండిరో వామనయనయంత బుధవంత మనునగ్రహారముననువినయవిఖ్యాతి మించు గోవిందుఁ డనెడుబ్రహచారి చతుర్వేదపారగుండు. 157
తే. ఆతఁ డుపనీతుఁడైన యనంతరంబతల్లిదండ్రులు వోవ సంతాప మెడలియప్పురివరమందె విద్యార్థి యగుచునఖిలవిద్యలుఁ దనకుఁ దా నభ్యసించె. 158
క. అంతట నవ్వటుమణికింగంతుపరబ్రహ్మతావిఖండనచణవేదాంతతిరస్కృతికరణానంతం బైనట్టిజవ్వనం బరుదెంచెన్. 159
తే. మునుపు చదివిన శాస్త్రసమూహమెల్లనూఁచముట్టుగ నొజ్జల గొప్పగించియుద్వహనకేళి చింతింపుచునికిఁ జేసిపలుకు నిద్దురలోఁ బెండ్లికలవరింత. 161
క. ఊరెల్లఁ బిలిచిరేని యపారంబగుచింత మునిఁగి పలుకం డదిగోజేరె వివాహమఁటన్నందోరంబగు కాంక్ష నోరునోరే తెఱచున్. 162
తే. ఇట్లు చింతించి యవ్వటుఁ డేగుదెంచిసోమశర్మగృహాళిందభూమి కొక్కనాఁడు గ్రాసార్థమైరాఁగ వానినామమన్వయంబును నడిగియు నక్కుటుంబి. 163
క. మనయింటఁ గన్నె యున్నదియనఘా యిదియేమి పెండ్లియాడెదవే మీ
కును మాకును బంధుత్వంబనుతరమై బ్రహ్మనుండి యమరినదరయన్. 164
క. అని యనియు ననకమునుపేయనఘా యే బ్రతికితిని మదన్వయ మిది పావనమయ్యె ననుచు నవ్వటుఁడనితరగతిఁ దత్పదద్వయంబున వ్రాలెన్. 165
తే. అతఁడును బొంతనము లెల్ల నరసి లెస్సయున్నవని పల్కి యారేయి యొక్కలగ్నమేర్పఱచి యిరుగుపొరుగు నెఱుఁగకుండఁదనతనూభవ నతనికి ధారపోసె. 166
ఉ. అంతట దాని పేరు విని యల్లుఁడు మెల్లన మామగారి నేకాంతమునందుఁ జేరి వినయంబున నీయభిధాన మెట్టు లీకాంతకుఁ గల్గెఁ దెల్పుమనఁగా విని యాతఁడు దానిపూర్వవృత్తాంతముఁ దెల్పి దీనిఁ జెడుగై పడనీయక కాచికొమ్మనన్. 167
తే. మంచిదని నాగవల్లట మించినపుడెయాలిఁ దోడ్కొని తనయగ్రహారమునకుబోయి తనగృహమధ్యంబు పోతుటీఁగకైన బొలయక యుండంగ నలవరించి. 168
క. తలయంటు నలఁగుఁబెట్టున్జలకములార్చు న్మెఱుంగుచలువలు గట్టుందిలకంబుదీర్చుఁ గలపంబలఁదుం గోవిందుఁ డయ్యొయారికి దినమున్. 169
తే. ఇట్లు పోషింప నాశారదేందువదనకెలమి దళుకొత్తు బెళుకుఁగన్నులును ముద్దులొలుకు నవ్వులు గులుకుగుబ్బలమెఱుంగుఁజిలుకుటెక్కులుఁ దగువయశ్రీ నెసంగె. 170
వ. అంత. 171
సీ. వీథి నేగెడు ప్రౌఢవిటుఁడు పాడెడువింతయేలపదా లట్టె యాలకించుఁబొరుగింటిమగవాని పొలుపైనఁ బెనుగోడయివ్వలఱోటిపై నెక్కి చూచునాయివారములకై డాయువారలతోడజోలి ద్రవ్వుచుఁ బెక్కుసుద్దులాడువరుసతో మాటాడవచ్చువిఫ్రులమ్రోలరాకపోకల నొయారంబు నెఱపుతే. నింటి కేతెంచు నెదురింటి యింతితోడదానిహృదయాధినాథువర్తనము లడుగురతు లెఱుంగకమున్నె యారాజవదనవ్రాఁత తప్పింపఁజేయ నెవ్వరితరంబు. 172
తే. ఆగృహంబున నిచ్ఛావిహారమునకుమనసు పరువులు వాఱ నేమాడ్కి నైనసందు గానక యినుపపంజరములోనిచిలుకపోలికఁ దలఁకు నక్కులుకులాఁడి. 173
శ. ఆలలన జారలీలాలోలితమతి యుడుపుటెట్టులో జాణవు నీ
వాలోచన మెయిఁ దెలుపుముబాలా యనఁ జిలుకతోఁ బ్రభావతి పలుకున్. 174
క. మగువయె విడిచెద ననినన్మగవాఁడా నిలుపువాఁడు మానము నీవేవగఁ జెప్పెదవో విని తగుఁదగ దనియెదఁగాని తెలుపు తత్కథ యెల్లన్. 175
చ. అన విని మంచిదంచు విహగాగ్రణి యిట్లను నట్టిభార్య వర్తనమున కార్తినొందుమతిఁ దద్ధరణీసురమౌళి యొక్కనాఁడనుపమవైభవం బలర నార్తవశాంతి యొనర్చి నిత్యశోభన బహులాభకారి యగు బ్రాహ్మణభోజన మైనపిమ్మటన్. 176
తే. చిఱునగవుతోడ నిజకాంతఁ జేరఁ బిలిచినీకు నేర్పెడువారలు లేక యునికిఁదెలుపవలెఁ గద కేళిమందిరమునొకటతోయజామోద లెల్లను డాయువిధము. 177
క. మొగమున మసిబొట్టులు కరయుగమునఁ గప్పెరయుఁ గత్తియు న్వ్రేలునెఱుల్దిగమ్రింగెద ననుపలుకులుదగఁ జేరఁగవలయుఁ గేళిధామంబునకున్. 178
తే. అనిన నంగీకరించి తానానతిచ్చినట్లె యేతెంచుదానితో నతను కేళిదేలి ప్రతిరాత్రమును నట్టి తెఱుఁగు మీఱఁబడుకయిలు సేరఁగా నేఱుపఱిచె నతఁడు. 179
ఉ. అంతటఁ గొన్నినా ళ్ళరుగ నయ్యురగాయతవేణి యేటికింగాంతుఁడు వోవ వీథిఁబొడకట్టిన కేశవనామభూసురుంజంతతనంబునం దలుపుచాటున నుండి కరారవిందసంభ్రాంతిని సన్న చేసి వలరాయనిబారికి లో నొనర్చినన్. 180
తే. ఆతఁ డదియాదిగాఁగ నయ్యబలమగనిమొఱఁగి చావడిలో నిల్చి మొగముసూపుఁజిన్నలకు లోఁగు కంచంబుచెంత పిల్లికరణి నెదురింటివాకుటఁ గాచియుండు. 181
క. గోవిందుఁడు సవసవగానావిధ మించుక యెఱింగి యాత్మోపాయశ్రీవెలయింపఁగఁ దలఁచి రసావేశమ్మున మెలంగు నంగనతోడన్. 182
క. ఎల్లుండి సమారాధనచిల్లరవెచ్చములు గొనఁగ శీఘ్రమె యిదె యీపల్లియసంతకుఁ జని యేనెల్లిటి కరు దెంతు పదిల మిల్లని పలుకన్. 183
చ. అది మదిఁదోఁచు వేడుక బయల్పడనీయక వేఁడికంటినీరొదవఁగ మోము వాంచనతఁ డోచెడుఁద్రిమ్మరిసమ్మదాశ్రువుల్గద యివి యంచు నాత్మను దలంచుచుఁ జింతలనేల ఱేపె వచ్చెదనని బుజ్జగించి యతిశీఘ్రమునం బురి నిర్గమించినన్. 184
క. అతఁ డూరు వెడలిచను డయ్యతివ పదింబదిగఁ దెలిసి యపు డాయెదుటన్
ధృతినిల్చిన కేశవుతోబతి యరుగుట తెలిపి గూఢభంగి న్మఱియున్. 185
క. ఈరేయి నన్ను నిలువుననీరుగఁ గరఁగింపవలయు నేఁడున్నని నీనేరుపు లన్నియు నని నయగారపువగలాఁడి యనుపఁగా నతఁ డరిగెన్. 186
క. రవి గ్రుంకెఁ బంకజాతచ్ఛవి డొంకెన జక్రవాకచక్రోల్లాసారవ మింకె జారరతమానవి బొంకె న్సాధునీతి నాథునితోడన్. 187
క. అంతట నగ్గోవిందుండెంతయుఁ గనకుండఁ బడుకయిలు సొచ్చి తదభ్యంతరమున వస్తుసమాక్రాంతం బగు నటుకమీఁదఁ గదలక యుండెన్. 188
తే. అంతటను గేశవుం డూరి యలబలంబుమట్టుపడఁ జూచుకొని మాటుమణిగె ననుచుఁగటికి చీఁకటి నెఱనేస్తకాఁడుఁ దానుధృతి యెసంగఁగ దానిమందిరముఁ జేర. 189
చ. ఎదురుగ వచ్చియు న్బడుకటింటికిఁ దెచ్చియు మోవి యిచ్చియుంగుదురు మెఱుంగు గబ్బివలిగుబ్బల గ్రుచ్చియు నాతగానికిన్ముద మొదవించి యమ్ముదిత మున్పటికైవడిఁ గేళిగేహముంగదియఁ దలంచి లేచి చని గ్రక్కున రాకటు తామసించినన్. 190
క. న న్నిచట నుంచి చనియెంగన్ని య మఱి రాక తడసెఁ గపటోపాయంబెన్నె నొకొ యెవ్వఁ డెఱుఁగుఁ బ్రసన్నాంబుజముఖుల యింద్ర జాలము లెల్లన్. 191
తే. అనుచుఁ దద్భూసురుం డెంచునంతలోనసురియ నిప్పులు రాలుకప్పెరయు మొగముమీఁద మసిబొట్లుమించ నమ్మెలఁత రాగఁజూచి దిగులొంది యిదిగోఁ బిశాచి యనుచు. 192
తే. అతఁడు పరువెత్త నిదియేమి యౌర పోకుపోకుమనుపల్కుతోడ నప్పు డది నడచివెంటనే యంట నీదయ వేగఁగాలిపోవనిమ్మంచుఁ దనగేహమునకు నేగ. 193
తే. అంతలో దానిపెనిమిటి యటుక డిగ్గిగూఢముగ నేగి పెరటి బల్గోడ దాఁటివెలుపటికి వచ్చి యెవ్వరే తలుపు తెఱవవేయనుచుఁ బిల్వ నచ్చెల్వ వేషమడఁచి. 194
క. గడియ సడలింప నతఁ డయ్యెడ నవ్వగలాడిఁ దప్పకీక్షించి యిదేమడరెఁ బరపురుష వాసనచెడుగా నొడువుమని కాలఁజేతం దన్నెన్. 195
చ. అది మొద లవ్వధూమణి పరాప్తికి దండము వెట్టె వాసనాభ్యుదయము నాయకు డెఱుఁగురో యని యెంతయుఁ గేశవాఖ్యసం
మది గణియించిరో చెలి సమర్పణమయ్యెనె వానినైపుణుల్. 196
క. అననం బ్రభావతి యిదిగాదనవచ్చునె పురుషులే యుపాయపరుల్ వారిని గెలువఁ దరముగా దనియినుఁ డుదయింపంగఁ బడుకయింటికి నరిగెన్. 197
క. అంతఁ గ్రమంబున నలినీకాంతుం డపరాబ్ధి మునుఁగఁగాఁ బుణ్యజనాత్యంతార్తికరణపాపంబంతయు వెడలె ననఁ దిమిర మడరెం దఱచై. 198
చ. అనుపమలీల నప్పు డసితావరణాంబరదీప్తిగుప్తయైతనులత మబ్బులోని తెరతళ్కులమించు నదల్చుదూలిఁ దోడ్కొని చనుదేరవచ్చునల కోమటికోడలికొమ్మఁ జూచి యిట్లను శుక ముత్పలాశముకుళాంచలచంచలచుంచుచంచువై. 199
చ. పనివడి రాజుఁ జేరఁ జలపట్టినదానవు చేరకుందువేవిను మఱి రాచవారు మదవిహ్వలు లించుక నేరకున్నఁ గోపనియతిచేత మొక్కపఱపం దమకింపుదు రట్టులైన నాథునియెడ బొంకఁగా వెరవు దోఁచినఁ బొమ్ము సరోజలోచనా. 200
తే. అమ్మ దీనికి నొకయితిహాస మలరువినుము ధనపాలుఁ డను రాజు పెనుప వెలయుమేదురోద్భటభటసింహనాదచలితదిగ్గజవరంబు పద్మావతీపురంబు. 201
క. అందు సువేషుండను ధృతిమందరనిభుఁ డొక్కఁ డమరు మరుక్రొవ్విరితూపుందెగడి సుమతియనుపేరందినసతి యందగత్తెయై వర్తింపన్. 202
తే. ఆతఁ డిల్లాలిపై మోహ మతిశయిల్లఁబెల్లుగాఁ జెల్ల విడిచి వర్తిల్లు కతననరయఁ బాటించుకొని గణనాథుఁ డనెడిబంటువానికి మానముఁ బ్రాణమిచ్చు. 203
తే. కూర్మిఁ జూపట్టుఁ జేపట్టుఁగుంచ మగుచువాడు వర్తింప నెఱనీటు పగలుపూననెంచి యించుక యైన నాసించ దొరునిరతుల కాసించ దాచేడె ప్రాణవిభుని. 204
క. తలనొప్పి కడుపుకుట్టుంబలుగురుపుం గాళ్లుతీపు పాటించుచు నచ్చెలి మూల్గుఁ బాన్పుమీఁదంజెలువుఁడు దత్తచ్చికిత్స చేయన్నగుచున్. 205
క. మున్నె కొలువున్నవానికిజన్నె విడిచి యన్నెలంత చక్కనివరు నేమన్నా రావన్నా పోవన్నా యనుఁగాని యోయి యన దెంతైనన్. 206
క. కనుచాటుతిండి నడిపినపనులం గండలును బెరిఁగి బకుతండ్రిహిడిం
బుని కొడుకన గణనాథుఁడుఘనబలమున బిరుదుజెట్టి కైవడి మెలఁగున్ . 207
సీ. చెప్పనిపని నీళ్లు చేఁదెదనని పోవుసంతకుఁ బొమ్మన్నఁ జింతసేయుఁజేఁటఁ గైకొని యాళ్లు చెరిగెదనని పోవుదండు వొమ్మన్న సంతాపమందువలదన్నఁ గందులు గొలిచిచూడఁగఁ బోవునగరికిఁ బొమ్మన్న దిగులుపడునునొనరవేఁపగ నెండుసెనఁగ లెత్తఁగఁ బోవునూరికిఁ బొమ్మన్న నులుకుఁ జెందుతే. నింటిలోపలి పనుల నెన్నైనఁ జేయుఁగడపదాఁటెడు పనియైనఁ గళవళించుఁబెట్టుపోఁతల సొగసాని సెట్టిసానియింటికడనుండి నఱ్ఱాడు బంటువాఁడు. 208
క. యిది యేమి సెట్టి యెఱుఁగఁడెకద పెంచినచనువుబలిమి కడఁబనిముచ్చైయెదురాడుచున్నవాఁ డనిమది నెంచుచుఁ బొడము కినుక మగుడ నడంచున్. 209
తే. అంత నయ్యూరిదొర ముత్తియములఁ జూచితెమ్మని సువేషు దవ్వులదీవి కేగుమనుచుఁ గట్టడసేయఁగా నతఁడు వచ్చిపయన మెఱిగింప సుమతి సంభ్రమము నొంది. 210
సీ. మలయుచో మధురాతిమధురాధరలవాఁడిచిన్నారిగోరు నీచెక్కుమీఁదనానుచో రంగస్థలాబ్జగంధులగుబ్బమెఱుఁగుఁజందోయి నీయురముమీఁదమించుచోఁ గాంచికాచంచలాక్షుల ముద్దుమొనపంటినొక్కు నీమోవిమీఁదఁజేరుచో నెల్లూరు నారీమణుల కెంపుపసమించు టడుగు నీనొసటిమీదతే. నింటనుండిన నీసౌఖ్య మేల కలుగుననుచుఁ గన్నుల నూరార్చి యక్కుఁ జేర్చిమోవిచిగురంట నొక్కి తాంబూల మొసఁగిపోయిరమ్మని పనిచె నప్పూవుఁబోఁడి. 211
తే. అంత బుడిబుడి యేడ్పుతో నడలుదానిబుజ్జగించి సువేషుఁ డప్పుడె ప్రయాణభయసముత్కంపితగ్లాని బంటువానినింటికడ నిల్పి పైనమై యేగుటయును. 212
చ. ఇపుడుగదా తపంబు ఫలియించెనటంచు మహానురక్తిభావపరత రేఁబవళ్లు తలవాకిలి వేసినయట్టులుండ సన్నపువిరిదమ్మితేకువసనస్మరుతూపులఁదుప్పు మించఁగాసపరిమితప్రమోదరసులై రమియించిరి వారలిద్దఱున్. 213
క. ఇంటి మగఁ డయ్యె దానికిబంటుతనం బుడిగి వాఁడు బానిస యయ్యెన్నంటున బోఁటియు వానికినింటన్ మేలువడి సాఁగ నిచ్చం బరఁగున్. 214
క. ఈరీతి మెలఁగువారలదారు ల్విని రాజుకొడుకు ధవళాఖ్యాకుండౌరా గగ్గోలుగనన్నారిపయింబడుదు నని ఘనం బగుప్రేమన్. 215
క. ధనముల జాలెలు రతనపుబనితగు నొకవరుససొమ్ముఁ బనిచిన గణనాథున కీవచ్చుఁగదా యవియని కోమటికొమిరె వాని యప్పనఁగొనుచున్. 216
ఉ. అమ్మకచెల్ల నేను వెలయాలనొ త్రిమ్మరినై పురంబునందిమ్మరఁ జూచెనో తనకుఁ దేటమిటారపునిండుఁబ్రాయపుంగొమ్మలు లేరొ నాముదుకగోకయుఁ గోమటియెడ్డెవీఁకయున్సమ్మతమయ్యెనే యని యసత్యపుఁదక్కులుతక్కి వెండియున్. 217
క. రమ్మను మిచ్చటి కిదికానిమ్మని యనకున్న నగరమేలెడిదొర దానెమ్మదిఁ గనలుచు దండుగఁదెమ్మనిన న్సెట్టి యేడఁ దెచ్చు న్వెఱతున్. 218
క. అని పనిచిన దూతికయుంజని తెలుప న్రాజసుతుఁడు చరమాంబునిధిన్మునుఁగ రవి నెఱయుచీఁకటిగనుఁగొని కేలుట్టిపడఁగఁ గట్టాయితమై. 219
చ. తలవరు లింతనంత వెడదాఁటులతో గగనంబు చించులీలలవిలసిల్లి వెంటఁ బదిలంబుగ రాఁ జని యూడిగంబులన్వెలుపల నిల్పి తానొకడ వేగ నగారము సొచ్చి యోరవాకలియయియున్న తల్లలితకేళినిశాంతముఁ జేరి యచ్చటన్. 220
క. కనియెం బాన్పునఁ గినుకంబెనఁగొని కొట్లాడుపికిలిపిట్టలచందంబున సుమతియు గణనాథుఁడుమనసిజరణకరణకేళిమగ్నత నుండన్. 221
క. కనుఁగొని యిది ననుఁ బిలువంబనిచియు వేఱొకనిఁ గూడఁ బాడియెయని యెఱ్ఱనికనుఁగవతో ముడిచినకనుబొమ్మలతోడఁ జేరఁగాఁ జని వేగన్. 222
క. బెడిదపుటడిదముఁ గైకొనిగడితపుటొఱడుస్సి వాఁడిఖడ్గము చేతందడఁబడ మొదలంటంగాజడఁగోసి యతండు వేగఁ జనియె లతాంగీ. 223
క. అమ్మఱునాఁడె సువేషుఁడుక్రమ్మరి యయ్యూరియేటికడ నుండి ప్రమోదమ్మునఁ దనరా కనుగుంగొమ్మకుఁ దెలుపుమని బంటుకొడుకుం బనిచెన్. 224
ఆ. వాఁడు వచ్చి మగఁడు వచ్చినాఁ డనువార్తదెలిపినపుడె భీతిఁ గలఁగె సుమతినెఱులపోకకింక వరునితో నేమనిబొంకవలయుఁ దెలుపు పువ్వుఁబోఁడి. 225
చ. అనినఁ బ్రభావతీరమణి యడ్డార యయ్యెడ బొంకు టెట్లు నేకనినదిగాదు విన్నదియుఁగా దది తెల్పినఁ దెల్పు లేకయుండిన మఱియూరకుండెదవు నేనిటువంటి వెఱుంగఁజాలు చాల్దినమును రాజుఁ జేరఁజనఁదీరక నీకథ వించునుందునే. 226
మ. అనినం గీరము కోపమేల వినవమ్మా కొమ్మ యమ్మాడ్కిఁదెల్పినబంటుంగని యూరుజాబ్జముఖి మే ల్వేయేండ్లు వర్ధిల్లు చక్కనినానాథుఁడు వచ్చెనంచు మునుగల్గన్వచ్చి యామేలువార్తనిజంబొందఁగఁ దెల్పితంచు మది మేరల్మీఱుధైర్యంబునన్. 227
తే. కాకి కఱ్ఱనెఁ దోడనె గౌళి పలికెఁబొలిచె నట్టింటఁ గుమ్మరిపుర్వు మెలఁగియిన్నియును గల్ల గాకుండ నేగుదెంచెహృదయనాయకుఁ డోయన్న యిదియె చాలు. 228
క. అని పతితో నేనటకుంజనుదెంచినదాక మీరచటనే యుండంబనిగలదనుమని పనిచినఁజనియె న్వాడంత నవ్విశాలేక్షణయున్. 229
క. ఇల్లలికి మ్రుగ్గువెట్టి మహోల్లాసము పల్లవింప నొక్కమెఱుగుంబళ్లెమునఁ గోసివైచినయల్ల జటాఖండ మిడియు నలరులతోడన్. 230
ఉ. ఐదువరాండ్లతోఁగదలి యాత్మమనోవిభుఁ డాయఁబోయి యప్పైదలివేణితోఁ జెలఁగుపళ్లెర మారతిభంగిఁ ద్రిప్పి యామోదముఁజూపె నాతఁడది ముందఱఁ దెల్పుమటంచు వేఁడఁగానాదయితుం గనుంగొని దృగంచలమం దుదయించు సిగ్గునన్. 231
చ. చెడుకల గాంచి దానిఁ జని చెప్పితిఁ బెద్దలతోడ వారలయ్యెడ ననుఁ జూచి నీదుహృదయేశుఁడు వచ్చె నటంచు విన్న నెక్కుడు నెనరొందఁ గీలుజడఁ గోసి నివాళి యొనర్పు మప్పుడేకడమయు లేదటంచనిరి కావున నిత్తఱి నట్ల చేసితిన్. 232
క. నెఱు లనఁగ నెంత ఱేపేపురిగొని తెగబారెఁడేసి పొడమెడు మీరేమురువుగ జడ యల్లెదరీకరణి న్మీ రరుగుదేరఁగాంచుట చాలున్. 233
చ. అన నతఁ డింతభక్తిగలయంగన యింట వసించి నాకు శోభనములు గోరఁగాఁగద యపాయము చెందక క్షేమలాభముల్గని యిలు చేరుటంచును దలంచి వధూమణియుక్తుఁడై నికేతనమున కేగె వింటివి గదా సుమతీస్ఫుటచాతురీస్థితుల్. 234
చ. అనవుడుఁ జిల్కఁజూచి వణిగగ్రణిరాణి సుపాణిముత్తెపున్మినుకులు రాల నవ్వి యొక నీరజలోచన యట్లొనర్చినన్వనితల కెల్ల వచ్చు నపవాదశతం బని పల్కునంతలోనినుఁ డుదయింపఁగాఁ బడుకయింటికి నేగె నసిద్ధయత్నయై. 235
ఉ. అంతఁ గ్రమంబున న్రవి నిజాంతరశౌరిని మామగారిగేహాంతముఁ జేర్చుదారి నపరాంబుధిఁ గ్రుంక నవారితోత్సుకస్వాంత ప్రభావతీవికచవారిజలోచన చేరి నిల్చినంగంతుపఠాణియుం గతలకారితనంబున మీఱి యిట్లనున్. 236
క. చనియెద వక్కఱతో నయ్యినుప్రక్కకుఁ ద్రోవ నొక్క యిక్కట్టైనంగని మొక్కవోక గ్రక్కునజనుదేఱ నుపాయ మెఱుఁగఁజాలుదె బాలా. 237
క. నలినావాసం బనఁగాఁగల దొకపుర మబ్ధికన్యకామణికిం దావలమై మదసారంగోజ్జ్వలఘీంకారవిదళితదిశాభాగంబై. 239
క. ఆనగర మేలు దుర్దమసేనుం డనునృపతి యతనిచెంతను శూరాఖ్యానుఁ డనునొక్కరౌతు మహానతరిపుభీతిహేతు వై వర్తిల్లున్. 240
సీ. గీఱునామము చిన్నికోరమీసలు చెంపబనిమట్టుసిక బొందు పట్టునూలువెనుకకట్టురుమాలు వెడఁదగాయపుఁగాయదారిఁ గాన్పించు గందంబుఁబూఁతకమ్మిపంచెయు గట్టికమ్మిదుప్పటి వల్లెవాటు కెంగేలిలో వంకవంకిపట్టుచేనపరంజిపరుజుతోఁ దగుకత్తిపలుచని బచ్చెనపావుకోళ్లు
తే. చికిలిచౌకట్టు సరిపెణ ల్రక మెసంగునుంగరంబులు నొకవింత యొఱపు నెఱపనేలి నాతనికొలువున కేగుదెంచుఁజూపఱు నుతింప నయ్యాయుధోపజీవి. 241
క. అతనికిఁ గలహప్రియ యనుసతి గల దయ్యతివ నడచుచందము లెల్లన్మతినరయ నతనిపాలిటిప్రతిబంధపుఁ బేరఁటాలు పంకజవదనా. 242
క. ఆరమణినడత యొకటియుఁబేరొకటియుఁగాక యుండఁ బెనుదుఃఖముగాఁబోరాడ విసివి వేసరిశూరుఁడు స్త్రీహత్యఁ జేయఁ జూడనికతనన్. 243
తే. వెడలనడిచినఁ బ్రతిరాజవీర మనెడిపురమునందున్న పితృగేహమునకుఁ బోవఁదలఁచి యయ్యింతి డింభకద్వయముతోడనరిగెఁ బథికులచే మార్గ మరసికొనుచు. 244
తే. చెంతబారెడులో నికుంజాంతరముననొక్కబెబ్బులి యుండి యయ్యువిదఁ జూచికూర్చె నాహార మాఁకలిగొన్ననాకుదైవమని యంతలో వేఱుతలఁపు వొడమ. 246
క. ఇదినాపద మిదినానదమిదినాపొద చేర వెఱతు రెవ్వరు నేఁ డీమదవతికి నెన్నిగుండెలొకదలక నే యున్నయునికి కార్య మెఱుంగన్. 247
ఉ. ఈవన మెల్ల నేలెఁడు మృగేంద్రుఁడుసైతము సాపరాధుఁడైసేవకుఁ డార్తినా మఱుఁగుఁ జెందినచో మదనుజ్ఞమీఁద సంభావితుఁ జేసి వాని బహుమానముతోఁ గొనిపోవుఁగాని తేజోవిభవంబు చూప వెఱుచుం బలవంతుఁడ నేను గావునన్. 248
తే. అట్టి నన్నునుఁ జేరి భయంబు లేనిపొలుపుతోనున్న దీపువుఁబోణి చెంతననుచుఁ గవుకునఁ బట్టరా దరయవలయుయోజన యొనర్చి సేయుట రాజనీతి. 249
క. కార్యాకార్యము లెఱిఁగినయార్యుఁడు నామంత్రి జంబుకాగ్రేసరుఁ డాధైర్యనిధి సుమతినాయకుఁడర్యమపదభక్తుఁ డెచటి కరిగెనొ యెఱుఁగన్. 250
తే. అతని రావించి నావిచారానువృత్తిజెప్పుదునొ దీని నేటి విచార మింకఁగమిచి నా మేనిరక్తమాంసములఁ బీల్పసాఁగె నతిగాఢతరలుఠజ్జాఠరాగ్ని. 251
క. అని తెంపు చేసి కనకనఁగనుఁగొనల న్నిప్పు లురలఁగా వాలము భూమినిఁ దాటించుచుఁ దద్గళమును జూచుచు గుఱక యుఱుకఁ బోనటు లున్నన్. 252
క. అబ్బెబ్బులిఁ గన వచ్చెందబ్బిబ్బు లిఁకేమినేయుదాన ననుచు నబ్బిబ్బోకవతి మనంబుననబ్బురమును భయముఁ ద్రొక్కులాడఁగ నుండెన్. 253
క. ఆకలహప్రియ పులిచేనేకరణిం బ్రదికి యూరి కేగఁగవలయున్రాకేందువదన తెల్పఁగదే కందముగాని నీయతిస్థిరబుద్ధిన్. 254
క. అనినఁ బ్రభావతి యిఁక నేమని తెల్పుదు నాకుఁ జూడ నగపడియెన యావనితపులివాతి; కేగతివినిపించెదొ దాని బ్రదుకువిధ మిఁకమీఁదన్. 255
ఉ. నావుడుఁ జిల్క పల్కు లలనా విను మత్తఱి నవ్వధూటి ప్రజ్ఞావతియౌట నిప్పులి నిజంబుగ నన్గనుఁగొన్నయప్పుడేచేవదలిర్పఁ బైఁబడక చింతయొనర్చుచుఁ బేలుపోయె నేనేవగదాననో యనుచు నీయెడ భీతియుఁ జూపఁగాఁదగున్. 256
క. అనుచుఁ దనూజులనిద్దఱగొనగోటంగిల్లి వారు కోయని యేడ్వంగనుఁగొని యూరార్చువిధంబున నిట్లను విసివినట్టిపూనిక దోఁపన్. 257
తే. ఏల యేడ్చెద రాఁకటి కేమియొల్లకకట పులిమాంసమేకాని యన్నలారమీకొఱకు వ్యాఘ్రములఁ జంపిమీఱుకతనదూఱుమఱివ్యాఘ్రహంతయ నేర్పుఁగంటి. 258
క. ఇలువాసి మీకు గ్రాసపుపొలవాసిం గూర్ప రోసి భువిఘోరమృగావలికిందలఁకక యడవింబులికిం బులినగుచుఁ దిరిగి పులిపులినైతిన్. 259
తే. ఐన నేమయ్యె నిచ్చోట నరయుచున్నదానఁ బులులున్నవో యని కాన నింకరెండుగలిగిన మాయిద్దఱికిని జాలుఁగాక యొకటుండినం జెఱిసగంబు గలదు. 260
క. అని పలుక జళుకు మదిఁ బెనఁగొనఁగా మేనెల్ల ముచ్చికొనుచుం బులి మెల్లనె యవలికిఁ జని వెసఁ జంగున నచ్చటిలతలు ద్రెంచికొనుచుం బాఱెన్. 261
క. అనినఁ బ్రభావతి మదిఁబర్విననివ్వెఱ ముక్కు మీఁద వ్రేలిడి తలయూఁచి నిజంబుగ మగువలెపోఘనసాహస లనుచుఁ బ్రొద్దుఁగని పల్లవితోన్. 262
క. కనుఁగొంటివె యదిచక్కన్మనసిజనృపకీర్తిరుచిసమాజపుమొక్కన్మినుకులకులములయిక్కన్వినుచక్కింజొక్కమైనవేగుంజుక్కన్. 263
తే. అనుచుఁ గేళిగృహంబున కరిగె మఱి గ్రమక్రమంబునఁ దరణిబింబంబు వ్రాలెనపరవారాశిఁ దనుఁజూచి యచటిమీనకోటిపలలం బటంచు ముక్కులను బొడువ. 264
మ. తన మేనం దగఁదోఁచుసొమ్ము లయినం దజ్జ్యోతి లోఁగొంచు నల్లని మేలౌ బురునీసుకప్పడము చాల న్మించ నేతెంచెఁ బచ్చనివిల్కానిజయాస్పదం బగుజిరాసంజోకతేజీవిధంబున నవ్వేళఁ బ్రభావతీసుదతి చూపు ల్వన్నెలంబర్వఁగాన్. 265
క. చనుదేరఁ జిల్క తత్కరమున వ్రాలి మెఱుంగుబోఁడి ముక్కుకొనఁ జుఱుక్కున గీరి కడమకథయున్విని పోయిన లెస్స గాదె విమలేందుముఖీ. 266
వ. అని పలికి రాజసంభోగసమారంభవిజృంభమాణాధీనం బగునమ్మానవతీమానసంబుఁ ద్రిప్పి చెంగటం జెలంగు మెఱుంగుటపరంజిపీఁటపయిం గూర్చుండిన యక్కురంగనయన తరంగితనిజవాంఛాఫలరసవీచికలం బ్రార్థింప నింతింతతరితీపు చూపుచుఁ గీరపుంగవం బిట్లనియె. 267
మ. విను మారీతిఁ బదాభిఘాతపతితోర్వీజాతమై భీతివీడని శీఘ్రంబున దూర మేగి దగదొట్టన్ వ్యాఘ్రమాదండ నున్ననిగండోపల మెక్కి యక్కలికి యందం బందు నల్దిక్కులంగనుపింప న్వెడగుండెకాయ లదరం గాలూఁద లేకున్నెడన్. 268
తే. కనియెఁ దన్మంత్రి యైనసృగాలమౌళిసుమతినామకుఁ డారీతిఁ జూచి యచటకేమిటికి వచ్చెనో వానినేలినాతఁడనుచుఁ జెంగటిపొదఁ జేరి యాత్మలోన. 269
సీ. తనయున్కి యెఱుఁగ కుద్ధతిఁ జెంతఁ జను లేటికొదమపైఁ బెట్టదు క్రూరదృష్టిదగ్గఱ గంతులు తగవేయుచున్నట్టికుందేళ్లఁ బట్టని యందమేమొచెంగటఁ దిరుగుచుఁ జెంగున దాఁటెడుదుప్పులఁ బట్టక తప్పెనేమొ
మొక్కలంబునఁ జేరి సొక్కుచుఁ దిరుగాడుమనుబోతుఁ బట్టంగ మఱచెనేమొతే. యనుచుఁ దనలోన నూహించి యాత్మఁ జెదరిచూచి ధైర్యంబు వదలక చోద్య మందిచెంతఁ జేరఁగ భయమంది చాలఁ గలఁగితఱుచు భ్రమవొంది యంతటఁ దానె తెలిసి. 270
ఉ. నాలుక వ్రేలవైచి వదనంబు వివర్ణవిధంబుఁ జెందఁగామ్రోలఁ జెలంగియాడెడు రురుప్రముఖంబులమీఁద నేమియున్వ్రాలనిచూడ్కి గుండెయదర న్నిలుపోపక యున్న యట్టిశార్దూలకులేంద్రుఁ జూడ భయదోషముఁ జెందినరీతి గన్పడన్. 271
క. నాయంతమంత్రి యుండి యపాయం బగునట్టి వేళ నధినాథుసుఖశ్రీయుతుఁ జేయక యుండుటనాయమె యిదిపోదు పతిమనంబలరింతున్. 272
క. అని తలఁచి సుమతి చేరంజని పులికిం గేలు మొగిచి సవినయముగ నవ్వనినుండి యుబుసుపోకంజనుదెంచితి రేమొ యిచటిజాడలు చూడన్. 273
క. దొరయైనయతఁడు మఱచియుఁబరభూమికిఁ బోవరాదు పనిగట్టినచోనురుతరనిజభటయుతుఁడైయరుగందగు లేకయున్న నాపద లొదవున్. 274
క. అసహాయశూరులరు గనుక సముత్సాహంబు వొడమఁగా వచ్చితిరివ్వసుధయును గంటిరేకదవసతికిఁ బోవుదము తడయవల దిచ్చోటన్. 275
చ. అనఁ బులి యాతఁ డచ్చటిమృగాక్షికఠోరవచోవిశేషముల్వినినది లేదు గాన బహువింతలు తెల్పేద వంచు నెంచి నెమ్మనమునఁ దోచుభీతిని నమందతరస్వర మొప్ప నాతనింగనుఁగొని పల్కు దైన్య మధికంబుగ దిక్కులు పాఱఁజూచుచున్. 276
క. విను తల్లికి నే మరలంజనియించితి నేఁడు నీదుసల్లాపకథావనధిం దేలఁగఁ బుణ్యంబునికిం బ్రదికితిని కీర్తిభూషణమూర్తీ. 277
ఉ. సిగ్గులచేటుసు మ్మది వచించిన నాప్తుఁడ వౌట నీకు నేనిగ్గురుభీతిహేతు విపుడింతయుఁ దెల్పెద నన్యు లెవ్వరీడగ్గఱ లేరుగా మనదిటంబుఁ గనుంగొన నంచు మెల్ల నేయగ్గజయాన పల్కిన మహాకటుభాషలు విన్నవించినన్. 278
క. ఆఁటదిగా దది మృగములవేఁటాడ న్వచ్చుమృత్యువే తప్పదు నోరాట మిదియేల యిచ్చటనేఁటి కెడయొనర్చుకొనుట నీతియు కాదో. 279
క. అని పలుక సుమతి యెంతయువిని యకటా యెవ్వతెయొ వివేకవిహీనుం
డని యితని బేలుపఱిచెంజనదు గదా పిఱికిదొరల సరసం గొలువన్. 280
క. పతికి భయమడరుచో నదియతిశయముగఁ జేసి మాన్యుఁడై బ్రదుకుం గుత్సితమంత్రి యతనిఁ గైకొనునతిదుర్మతి యైన నాథుఁ డాప్తుఁడు గాఁగన్. 281
వ. కావున నేకాచారంబగు నమాత్యపథంబునం బ్రవరిల్ల నాకు నకారణభయభ్రాంతుండైన యతని కనుగుణంబుగా నడుచుట కర్తవ్యంబుగాదు బహుకాలం బేతదర్థంబునఁ బోషితుండనై యుండి యివ్వెరవుఁ దెలుపకుండిన సామాన్యులలో గణ్యుండనగుదు నితండు మదీయవచనంబులు వినియెనేనిమే లట్టు గాక దుర్బుద్ధియై మదీయస్థానహానిపర్యంతంబుఁ దలంచినఁ దలంపనిమ్మని నిశ్చయించి యాసృగాలంబు శార్దూలంబున కిట్లనియె. 282
తే. ఎలుఁగులకు వేరువిత్తు దుప్పులకు గండమేదులకు మిత్తి లేళ్లకు నెదురుచుక్కకాసరంబులపాలిటి కంటినొప్పియసదు గాదుగదా భవదన్వయంబు. 283
చ. అలవి యెఱుంగ కొక్కపులి కల్గినవాఁడయి భీతిఁ జెందయక్కొలపగఁదీర్చుకోఁదలఁచి కోడెవయాళివజీరుఁ డెప్పుడున్మెలఁగెఁడు వ్యాఘ్రచర్మమను మీనెఱడాగు ధరించి శూరతాకలన భవత్కులంబునకుఁ గల్గదు జోడు మృగాన్వయంబునన్. 284
క. భిన్నేతరమగు సకలసమున్నతవిభవాభిజాత్య మున్నదె కద ని
న్నెన్నుతఱిఁ గొంచగాఁడవెయన్నన్న నఖాగ్రనిర్జితారివి గావే. 285
తే. ఇట్టినీ వొక్కభామ యేమేమొ పలికెననుచు వెఱచితి ననుటెల్ల నరయ నాకుబుద్ధి శోధింపఁగాఁ బోలుఁ బొసఁగ దొరలుతలఁప సేవకహృదయభేదకులు గారె. 286
తే. కాక వెఱచినమాట నిక్కంబ యేనినేఁడు నీవంక శార్దూలనికరమునకుఁజెల్లఁబో మాంసకబళంబు బెల్లమయ్యెఁబ్రాఁతపరివారముల నోట బగ్గిపడియె. 287
క. మనుజాంగనయఁట తనయులకనవరతము పులులఁ ద్రుంతు ననెనఁట యిదియేవినినంత శరీరముతోఁజనుదెంచితె యకట నీదుశౌర్యము గూలన్. 288
తే. రమ్ము నా వెంటఁ గొంతదూరముననుండిదంటతనమున నను వెన్నునంటి చూడునీకుఁ గైకాన్కఁ జేసెద నేఁడు దానిఁదత్తనూజులకంఠరక్తంబుఁ గ్రోలు. 289
క. అన విని శార్దూలం బనువిను మిచ్చటఁ బ్రేలవచ్చు వెస దానిఁ గనుంగొననంత మాట వెడలునెనినుఁబోఁటికి నే నెఱుంగనే నీబలమున్. 290
క. తగిలించుకొన్నపిమ్మటనిగిలించుటె కాని కార్య మే మున్నది యా
మగువఁ జననిమ్ము పోవుదమగునె యసాధ్యమున సాహసాదృతి సలుపన్. 291
క. చలమున నది పైఁబడినంజులుకనివాఁడ నని యుఱుకఁజూతువు మఱి మాంసలదేహుఁడ ధావనచేనలసితిఁ బరువెత్తఁజాలనౌ నిటమీఁదన్. 292
క. నావుడు గోమాయు వనున్నీవిటు తప్పించుకొన గణించెదు కాయంబీవగల డాఁచికొని యాహా విను మెన్నేండ్లు బ్రదుకుదయ్య మృగేంద్రా. 293
క. బలవన్మృగమంత్రులయెడఁదలవంపుల కోర్వలేక తఱిమెద మదిలోఁదలఁపకు బహుభీతిని లెమ్మలఘుపరాక్రమ మొనర్ప నందుం గీర్తుల్. 294
క. నను నమ్మవేని యిచ్చటివనితీఁగెలు చుట్టి పెనఁచి నాకున్నీకుంబెనవైచికొమ్ము రమ్మికనిను జూచిన నవ్వధూటి నేలం గూలున్. 295
తే. అనుచు నక్క నిజాధీశు నతులశౌర్యమెనయ బోధించి పెనవై చికొనుచుఁ దెచ్చెఁగురుబలావళిఁ జేర నుత్తరుని ధైర్యశోభితుని జేసి తెచ్చు నర్జునుఁడు వోలె. 296
క. ఈలీల వచ్చు నాశార్దూలసృగాలముల భయముతోఁ గనఁ జేయం
జాలుట గలహప్రియ కింకేలాగునఁ గలుగవలయు నిందునిభాస్యా. 297
తే. అనుచుఁ జిలుక పలుక నాప్రభావతి యిట్టియవగడంబు మాన్ప నది యెఱుంగునిపుడు నీ వెఱుంగు దింతియే కాని యీతెంపువగలు మాకుఁ దెలియ వనిన. 298
శా. కీరం బిట్లను నట్లు ఘోరతరభంగిక వ్యాఘ్రగోమాయువుల్చేరన్రా దిలకించి యవ్వనిత కించిద్భీతియు న్లేక ధైర్యారూఢిన్ మృగధూర్తముం బలుకు నాహా సత్యవాక్యత్వ మీడేఱం దబ్బఱకాఁడ వైతి గద యింకేరీతి సైరింపుదున్. 299
తే. పులుల రెంటిని దెత్తు నీపుత్రయుగళమునకు నని నమ్మిక లొసంగి పోయి యిప్పుడొక్కశార్దూలమును దెచ్చి యొప్పగించెదొల్లఁబో కాననేఁడు నీయుసుఱుఁ గిసురు. 300
మ. అనుచుం దిగ్గునలేచుదానిఁ గని యవ్యాఘ్యేంద్ర మౌరౌర ఛద్మననేసం గద నక్క యెక్కరణి నమన్వచ్చు నంచున్భయంబున దాని న్వెస నీడ్చికొంచుఁ బఱచెన్ భూభాగ మల్లాడఁగాఁదనకంచుం బరువెత్తుచోఁ గలవె కాంతావంచనాసంపదల్. 301
క. అనఁ జిలుక కాప్రభావతిమునుపటి వగకన్న నధికముగ వెఱపించెన్వినుమా కలహప్రియ యింతనిరూఢంబైన నేర్పు దానికె చెల్లున్. 302
వ. అని పలికి విరహిజనమథనంబున మనసిజుండు పట్టించు ధర్మదారోదయంబునుంబోలి మిక్కుటంబగు కుక్కుటారవంబున నరుణోదయం బగుట యెఱింగి యక్కురంగనయన యంతఃపురంబునకుం జనియెఁ దదనంతరంబ. 303
క. వనజరుచిఁ గొనఁగ సమయంబనుచోరుఁడు రోదసీగృహముఁ జొచ్చి భయంబునఁ బఱవ నడఁచుదీపంబునఁ బోల్పంబడుచుఁ బ్రొద్దు పొటుకునఁ గ్రుంకెన్. 304
చ. ప్రవిమలమౌక్తికంబుల తురాయి నిగన్నిగల న్మెఱుంగు చనవ మనుగెంపుదండల దగద్ధగలం బయలొందనీక నీలవసనపున్ముసుంగు పొదలంగఁ బ్రభావతి వచ్చె నత్తఱిన్గవిసెన లోకలం జకచకల్గల దర్పణలక్ష్మి గేరుచున్. 305
క. వచ్చుటయు నిచ్చలంబున్బచ్చలపంజరము వెడలి పడఁతీ యిదె యేనిచ్చట నున్నానని యనుపచ్చనివిలుకానితేజిఁ బరికించి వెసన్. 306
క. నిన్నఁటికథ మఱి యింకనునున్నదియో యుండెనేని యుచితవచస్సంపన్నతఁ దెలిపెదె గ్రక్కుననన్నరపతిపొందు నేఁటికైన న్వలయున్. 307
క. అన శుక మిట్లను గుతుకంబునఁ గథ కొదవ యన నెంత మూఁడేమాటల్
వినిపొమ్ము పోయి యచ్చటజనపతి రతిఁ జొక్కి తామసము చేయకుమీ. 308
మ. అని యాశావశఁ జేసి యాశుకసుధాశాధీశ మీశానశీర్షనదీశోభికుశేశయాంతరరసశ్లాఘావిశేషాపనోదనశీలావిశాలశీతలగుణోదారోక్తిధారానిగుంభనగంభీరము గాఁగ నిట్లనుచుఁ దెల్పంజొచ్చె నచ్చెల్వకున్. 309
క. కాంతా వింటివెకద విభ్రాంతపుఁబులి నక్కఁ గొనుచుఁ బఱచుట మునుపేయంతం గలహప్రియ తత్కాంతారము వెడలి తల్లిదండ్రులఁ జేరెన్. 310
శా. నిర్దాక్షిణ్యమనస్క యవ్వనిత యంటె న్వెంటనే యంచుఁ దచ్ఛార్దూలం బతిభీతిఁ బాఱెను లతాసంబంధమౌట న్మహాదుర్దాంతోగ్రశిలాభిఘాతవిగళద్ఘోరాస్రధారాతిసమ్మర్దాధ్వంబగు నక్క నీడ్చుకొని సంభ్రాంతాన్యజంతుత్వరన్. 311
క. ఈరీతిఁ బఱచి పరచింతారంభము మఱచి ధావనాయాసమునన్నోరెండ నిలిచె నొకకాంతారమునం బిఱికిగుండె తటతట నదరన్. 312
క. నిలిచి దగదీర్చుకొని హెచ్చిలుకోపముతోడ నింతచేసినదీనిందలవ్రచ్చుక మ్రింగెద ననుతలఁపున జంబుకముఁ గ్రూరతరముగఁ జూచెన్. 313
క. అప్పుడు సృగాల మద్దెసఁదప్పించుకొనంగ నేమి తలఁపఁగ వలయుం
జెప్పుము ప్రభానతీ యననప్పులుఁగున కాసుధాకరానన పలికెన్. 314
తే. కాలిసంకెల లతికానికాయబంధమప్పులి యటన్న నాగ్రహవ్యగ్ర మింకజాఱిపోరాదు సాంత్వనసరణిఁ గూడదెట్లు తప్పించుకొను నక్క యిట్టియెడను. 315
వ. కావున సృగాలంబునకు శార్దూలవదనగహ్వరంబె యవశ్యంబు భావ్యంబని తలంచెదఁ గాని తత్ప్రాణగోపాయనంబునకు నుపాయంబు దోపదు మదీయశేముషీవిశేషం బింతియ, యనంతరకథావృత్తాంతంబుఁ దెల్పు మనినఁ గీరం బిట్లనియె. 316
క. ఇది తెలియకున్న బుద్ధికిఁగొదవనుట ల్గాదు జారుఁ గూడఁగఁ జనుతోయదకచ కిట్టి విపద్దశయద నెఱిఁగి యడంపవలయు ననియనుట చుమీ. 317
క. అవ్వలి కథ వినుమా యెలజవ్వని యారీతిఁ జూచుశార్దూలపతిన్నివ్వెఱఁ గనుఁగొని జంబుకమవ్వేళకు నొకనుసాయ మాత్మందోఁపన్. 318
మ. పులికిం గేలు మొగిడ్చి పల్కు విను మంభోరాశిగంభీర నాపలుకు ల్ద్రోహ మొనర్చెరా యనుచు నాపైఁ గోపమే కాని రాఁగలకార్యం బెఱుఁగంగలేవు సముదగ్రక్రోధయై యావధూతిలకం బిచ్చటి కేగుదెంచుఁ దనుజోద్రేకక్షుధల్ మాన్పఁగన్. 319
క. మన మున్నచో టెఱుంగునెయని తలఁప న్వలవ దుపలహతి గళితాస్మత్తనురక్తధార త్రోవంగనుఁగొని యదె యడవిజాడఁగాఁ బఱతెంచున్. 320
క. మున్నొనరించిన నేరంబెన్నకు తత్ఫలముఁ గంటినేకద యిఁకమీఁద న్నీకు శుభ మొనర్చెదన న్నరయకు మింక వంచనాపరుఁగాఁగన్. 321
క. పెనఁ ద్రెంచి యెచటికేనియుఁజనుమా శార్దూలహంత్రి జాడ మెయిం గ్రక్కున వచ్చిన నినుఁ బొరిగొనుననఘా జైవాతృకత్వ మందుము నీవున్. 322
క. అని పలికినపుడె నఖములఁబెన పటుకునఁ ద్రెంచివైచి బెబ్బులి పఱచెంజనియె న్నక్కయు వేఱొకవనమునకున్ దెలియ వింటివా తెలిగంటీ. 323
క. అనినఁ బ్రభావతి నివ్వెరగున మ్రాన్పడి యుండి తెలిసికొని చిలుకా యీయనపాయోపాయస్థితినను నడిగిన నాకుఁ దెలియునా యెంతైనన్. 324
క. అని యంతఁ దెల్లవాఱుటఁగని యంతఃపురము సేరెఁ గాంతామణి యాదినకరబింబము గ్రుంకినదనుకాకీరమణి యొప్పిదంబున నుండెన్. 325
క. అంతటఁ జీఁకటి గని యక్కాంతామణి నృపతిఁ జేరఁగాఁ బోవుతమింజెంతకుఁ జేరినఁ గనుఁగొనికంతునినెఱతేజి ముద్దుగాఱఁగఁ బల్కెన్. 326
తే. ఎంతవేగిర మమ్మ పూర్ణేందువదనమాటుమడిగినఁ జనుమ యమ్మనుజవిభునిధామసీమకు నిపుడు నందాఁక నొక్కయమలతరమైన కథ వినుమనుచుఁ బలికె. 327
క. ధరపై రాజపురంబునఁబరఁగెడు నొకరెడ్డి గలఁడు పరిహితనామస్ఫురితుఁడు కృషికార్యధురంధరుఁ డలరున్ హాళికావతంసుం డగుచున్. 328
క. ఆరెడ్డి కిద్దఱాండ్రు పయోరుహబాణుని శరంబులో యనఁగా శృంగారిణియు సువేషయు ననుపేరుల మెలఁగుదురు సొంపు బెంపెసలారన్. 329
తే. చెలువుఁ డెప్పుడుఁ బగలెల్లఁ జేసి పనులుకోరి మెలఁగుట రేలెల్లం గుంభకర్ణనిద్రఁ బాల్పడి రతికి సంధింపకునికివార లిద్దఱుఁ గడిదేఱి జార లైరి. 330
ఉ. చామనిమేనులు న్ననుపుఁ జల్లెడుమోములలోనఁ గల్గుబల్గోములు మానపుం బొడవులుం బిడికింట నడంగుకౌనులుం
గోమలబాహువు ల్మరులుకొల్పెడుచూపులు ముద్దుమాటలుంగాముని కొక్కచేవ యెసఁగ న్విహరింతురు వార లిద్దఱున్. 321
సీ. గొంటుపూసలు రెండుగుండ్ల ముంగరలు మైజారుచీరలు పెనసన్నగొలుసుపెద్దమట్టెలు మట్టిపిల్లాండ్లు బొబ్బిలికాయ లొత్తులతోడి కడియములునుగప్పుపల్వరుస లుంగరములు తూలెడుగొంగులు బలుచెంపకొప్పు లంచుకమ్మగవ ల్సన్నకాటుకరేకలునాభినామంబులు నానుచుట్లుతే. పసుపుఁబూఁతలు గుబ్బలబాగుదెల్పుబిగువుఱవికెలు చిగురాకుఁ బెదవులంటువీడియపుఁగప్పు లెప్పుడు వెలయ రతులబేరమాడుచుఁ గాఁపుగుబ్బెతలజోడు. 332
క. పనుల కొడ ల్వంగక కామిను లిద్దఱుఁ గూడి గోళ్లుమీటుచు దాదుల్దినదినము మిసిమియిడఁగాఁగనుపింతురు గున్నగచ్చగాయలకరణిన్. 333
చ. దిటమున రెడ్డి పాటుపడి తెచ్చి యిడంగను గూటిప్రొద్దు సంకటితఱివెన్నమజ్జిగలు కంకటిపైఁ బవలింటి నిద్రలున్బెటుకులుఁ జెల్లిరా సొగగు పెట్టుచు మన్మథకేళిమీఁద నెక్కటివడి జారసంగమసుఖంబునకే తమకింతు రిద్దఱున్. 384
చ. పెనిమిటి చేని పాటుపడి పేర్చు శ్రమంబున నింటి కేగుదెంచినతటి దాలితోఁకపయిఁ జేర్చిన కాఁగులనీరు మజ్జనంబున కమరించి దేవతలపుట్ట మొసంగుచు బొడ్డుగిన్నెలోమనుతురు రాగిసంకటి తలోదరు లద్భుతభక్తిఁ జూపుచున్. 335
ఉ. ఒక్కతె రెడ్డిప్రక్క వినయోక్తుల వింతలఁ గౌఁగిలింతలన్జక్కిలిగింతల న్మెఱసి జంతతనంబునఁ బ్రొద్దుపుచ్చుచోనొక్కతె జారుప్రక్క మెలుపొందిన టెక్కులఁజూపుచొక్కులన్మిక్కిలి చొక్కుచు న్మదనునిం జరితార్థునిఁ జేయు రాత్రులన్. 336
చ. చెలువునిముందట న్సవతి చిక్కునఁ బోరు ఘటించి లేని యీసులు ప్రకటించి మోసమునఁ జొచ్చెద రొండొరు మీఁది చాడి మాటల మఱి మాటమాట జగడంబులు చూపి యతండు పోయినంగలకల నవ్వుకొండ్రు తమ కౌశల మాతఁ డెఱుంగలేమికిన్. 337
క. ఈరీతినుండి యొకనాఁడారెడ్డన పసికిఁ దలుగు లమరించుటకైనారలు గావలెనని పొరుగూరికినై పోయి మఱ్ఱియూడలు దేరన్. 338
వ. తదనంతరంబ. 339
చ. చిటిపొటిమబ్బు లాకసపుసీమఁ గనంబడ గొప్పగొప్పలైపటపట మ్రోయుచు న్నలినబాంధవబింబముఁ గప్పికొంచుఁ జీఁకటి ఘటియించి యధ్వగనికాయము బెండగిలం దటిల్లతాకుటిలతఁ గొంచెపాటి చినుకు ల్దొరఁగించె ధరాతలంబునన్. 340
క. అనవధివనధివిహారంబున నధికవ్యధల కార్శ్వమును బొందుతఱి
న్మనసిజుఁ డేయుశరంబులయనువున నవ్వేళఁ జినుకు లడరె న్నదులన్. 341
సీ. గొంగడిముసుఁగుతో గొల్లలు చట్రాతిపైని బందారాకుఁ బఱచికొనఁగనాలమందలు మేఁత కరిగి యేతెంచి యంభారవంబులతోడ మందగొనఁగఁబొదుగుదూటుల మాని యొదిఁగి క్రేపులగుంపుజననీనికాయంబు చాఁటుఁ జేరనొకటి నొక్కటి చూచి యుఱికి మేఁకలు చెట్టునీడలఁ గుమిగూడి నెమరువెట్టఁతే. దనరు నంబుదకాండవేదండయూథగర్జితోర్జితభూరిభూత్కారగళితవమధుశీకరవారదుర్వార మగుచుఁజలువతెమ్మెఱ లేతేర సన్నతూర. 342
తే. అప్పు డాకాపువలిగుబ్బలాండ్రు పథికులుసుఱుమన ముసురుకొన్న యమ్ముసురులోనరాఁడు పతి యంచు నిర్భరరతులఁ దేలమందిరమునకుఁ దెచ్చిరి మాఱుమగల. 343
తే. తెచ్చుకొని యిచ్చలోపల హెచ్చుకోర్కులెన్నిగల వన్నియును దీఱ నెనసి చతురరతుల కఱవునఁ బడినట్టు లతులసౌఖ్యవారినిధి దేలుచుండిరి వారలంత. 344
క. పరహితుఁడు మిన్ను గనుఁగొనిదురుసౌ నిఁకమీఁద వానతూర ల్నిజసుం
దరు లెదురెదురే చూతురుమరుబారికిఁ జిక్కి కాన మగుడన్వలయున్. 345
క. గ్రక్కునఁ జని యక్కఱతోఁజక్కెరవిలుకానికేళిఁ జతురుఁడనై నేఁడక్కాంతలనిద్దఱ నిరుప్రక్కలనునిచికొని మేలువడసెద ననుచున్. 346
క. తలపై నూడలమోపున్మొలఁగత్తియు నింటిమీఁది మోహము మదిలోఁదలకొనఁ జలికిఁ జలింపకబలుబూతమువోలి పెద్దపరువునవచ్చెన్. 347
తే. వచ్చి యాత్మీయమందిరద్వారసీమఁదెప్పునను మోపువైచిన చప్పుడు వినినరకఁ డదె వచ్చెననుచు నొండొరులతోడగుసగుసలువోయి రాతని కూర్మిసతులు. 348
వ. ప్రభావతీ యనిర్గమసావకాశం బగునిజగృహంబునం దల్లడిల్లు నుపవల్లభుల నప్పల్లవాధర లెవ్వడువున వెడలింపవలయు నిది యెఱింగిన యంగనలకుం బరపురుషసంగమంబును బతిప్రమోషంబును సులభంబగునని పలికినం దెలుపనేరక వెలవెలంబాఱు నముద్దియనెమ్మొగంబుఁ గనుంగొని యయ్యనంగతురంగం బవ్విధంబును నేన తెలిపెదనని యిట్లనియె. 349
సీ. ఆరీతిఁ బతి వచ్చెనని వేగ శృంగారిణీవధూటి సువేషతో విచారమేటికి నీవు కవాటంబుఁ దెఱిచి వాడింటికి రాకుండ నేర్పుతోడఁ
గడప కడ్డముగాఁగఁబడి సివమాడుముకొదవకార్యము చూచికొనఁగవచ్చుసని యుపదేశింప నది యట్లసేయ విభ్రాంతుఁడై నిలిచినభర్తఁ జేరితే. మఱ్ఱియూడలనుండి యమ్మగువమీఁదగాలిసోఁకెనొ యనుచు శృంగారిణియననంతలోన సువేషదంభాతిరోషఘోషయై వానిపైఁ బండ్లు గొఱికికొనుచు. 350
శా. ఓరీ నాపదమైనమఱ్ఱి మదరేఖోద్వృత్తి ఖండించి తీవేరా యిప్పుడె పోయి మ్రొక్కుఁబడిగా నీయూడలా చెట్టునన్ధీరోదారతఁ గట్టి రార మదిలో దేవేరిపైఁ గోర్కె నిండారంగల్గిన న న్నెఱుంగవె పిశాచాధీశవిఖ్యాతునిన్. 351
క. అనవిని పరహితుఁ డాత్మన్వనితామణి బ్రదికియుండినం జాలు వటావనిరుహము కడకు నిటపోయిన నేమగుననుచు దాని కెరఁగి వినీతిన్. 352
క. ఇదె మఱ్ఱిమీఁద నిడి వచ్చెద నూడ ల్నేర కేను జేసినసేఁతల్మది నుంచకు వటభూరుహవిదితనివేశా పిశాచవిబుధాధీశా. 353
క. అని యతఁడు మఱ్ఱిపైఁ గ్రక్కున నిడఁజన మారుకేళి కొదవ ల్గీఱంబనిచి రుపనాయకుల నంగన లిఁక నిటువంటి నేర్పు గావలె నీకున్. 354
తే. అనినఁ జిలుకఁ జూచి యాప్రభావతిచెల్లనే నెఱుంగ నయ్య యిట్టి నేర్పులిద్దఱగుట వార లింత చేసిరి గానియొకతె కెట్లుగూడు నో శుకేంద్ర. 355
మ. అని యక్కోమటికొమ్మ దేవనిలయప్రాంచన్మహామర్దలధ్వనిచే వేగు టెఱింగి యత్తఱి నిశాంతం బొంది యాసంజసంజనితానంగశరార్తి వేఁగుచుఁ దమిస్రస్ఫూర్తి వీక్షించి తజ్ఞానపాలాయతనంబుఁ జేరఁజనుచో శౌకేశ్వరం బిట్లనున్. 356
ఉ. అక్క పరాకు నీకుఁ బ్రమదాప్తి ఘటింపఁదలంచి పల్కు దేనొక్కకథోత్తమంబు విను ముజ్జయినీపురి నొక్కజెట్టివాఁడుక్కునఁ దీరినట్లు కఠినోగ్రశరీరముతోడ మీఱు నేదిక్కునమాఱులేక బలదేవుఁ డనం బలుపేరు దాల్చుచున్. 357
సీ. శీర్షవర్తులశిలాస్థిరమైన కేకినాఁజిన్నారిపొన్నారి సిగపొసంగఁదనుమేరుగిరిమీఁది తరుణాతపంబునాఁబలుచని మట్టిదుప్పటి యెసంగఁగమనీయముఖచంద్రుఁ గబళించుచిల్వనాడంబైన బవరిగడ్డము చెలంగబాహుభుజంగమపతినాలుక యనంగఁజేత సాణాకత్తి చెలువుమీఱతే. మ్రోల వీణయు సాధన మురువునడలుబిరుదు టందియ వెంబడి పిల్లజెట్లు
నమర దొరకొల్వు చేసి గేహమున కేగుమత్తరిపు శైలదంభోళి మల్లమౌళి. 358
క. ఘనశ్రీ బొందియు నాతఁడుదినదినమును గొంతకొంత దిరుగుచురాఁగాఁదనవారు శత్రులై రటగనుగొనఁగా వానిలక్ష్మి కడచనిపోవన్. 359
సీ. ధనవారములు చోరతతులపా లయ్యెనుసొమ్ములు కుదువను సొగిసి చనియెగాదెలధాన్య మెల్కలకయ్యె గుత్తకైయెనసిన గ్రామంబు లెల్లనెండెనప్పులిచ్చినచోట నటమటించిరి డాఁచికొనినపత్రంబులు చినిఁగిపోయెవాడకంబులు గొన్నవార లేగిరి తోఁటలెల్లను బరులచేఁ గొల్లవోయెఁతే. గప్పడంబెల్ల గాలిచేఁ గదిలి యురియునింట దొర్లెడు కుండలు నినుపకట్లమానిముంతలు నిలిచె నమ్మల్లపతికివార్ధికన్యాకటాక్ష మవ్వలికిఁ జనిన. 360
వ. ఇవ్విధంబున నక్షుద్రదరిద్రత్వంబు వహించియు నతండు కుటుంబభరణాదరుండై. 361
ఉ. మాసిక వైచికుట్టినరుమాలును జాలనిదట్టిబట్టయున్మాసినయెడ్డెదుప్పటి దనర్పఁగఁ గోమటివారిఁ జేరి శంకాసమవాప్తి నొల్లమనఁగాఁ దనుమర్దనమాచరించుచుంగాసును గీసు దూసికొనుగాని విడం డతఁ డేమి చెప్పుదున్. 362
ఉ. కూలికి నూనె లంటి కలగూరలకై పొలమెల్లఁ జుట్టి పాల్మాలక యాత్మబంధుజనులన్ దరియం జని ప్రాఁతబట్టకైకూళతనంబునం బ్రభులకుం దనుమర్దన మాచరించుచున్వ్రాలుడుప్రొద్దుతోడ గృహవాటికిఁ జేరు నతండు నిత్యమున్. 363
క. ఈరీతి నుండు నాతనిగారాబు మిటారి తలిరుకైదువుల దునేదారి కటారి సులక్షణపేరింటి వధూటి లేమి (బిమ్మిటి) గొనుచున్. 364
తే. కుడువఁ గూడును గట్టుకోఁ గోక లేకయితని కిల్లాలినై యుండనేల యనుచుసొగసు గనిపింప వల్లంబుఁ జూపి నిలుచుజారులకు నయ్యొయారి యాస్పద మొసంగి. 365
ఆ. కలిగినప్పుడెల్లఁ జెలువుని చెంగటనడఁగి మడఁగి యుండు టరిది గాదుచేరి లేమి యప్పు దారీతి నుండెనాయది పతివ్రతాజనాగ్రగణ్య. 366
క. ఈలీల జారరతివాంఛాలాంఛన మొంది పింఛసమకచ వికచల్లోలస్వాంతత సద్గుణశీలుం బ్రేమ గల మగనిఁ జేకొన కలరున్. 367
సీ. చేయప్పు లడికి తెచ్చెదనంచుఁ జని కాంచుఁగోడెమిండని తప్పుకోలు మ్రొక్కుఁజెఱువులో నీళ్ళు తెచ్చెదనంచుఁ జని తెల్పునుపభర్త కాత్మవియోగవహ్నిఁ
జీర చాకింటఁ దెచ్చెదనంచుఁ జనిచేరుఁదరుణపల్లవుఁ డున్నతాపిచోటుఁజిక్కంటె యెరవు దెచ్చెదనంచుఁ జనియిచ్చుగమనాతురున కింపు కౌఁగిలింపుతే. నిట్లు జారోపభుక్తయై యేగుదెంచిమగఁడు వినలేమి చెంగట మందిరంబువెడలి తిరుగాడవలసె నివ్వీట విధినిదూఱవలదా యటంచుఁ గన్నీరునించు. 368
చ. పురమిది చూడనింత చెడిపోయె నయో మఱి యాఁడుతోడఁబుట్టరె ననువంటిసాధ్విని బడాపగలం గనుగొండ్రు జారు లెవ్వరు గనుఁగొన్న లేమిఁ దలవంచి రయంబున వత్తునమ్మ యోపొరుగుపొలంతియంచుఁ బువుఁబోఁడి యను న్విభుఁ డాలకింపఁగన్. 369
క. పడియుండఁ గంటి నని యీయెడల న్మామేనమామ యిచ్చెనటంచున్బడఁతి యుపనాథుఁ డొసఁగినతొడవులు చీరలు ముదంబుతో ధరియించున్. 370
తే. నీవు మఱియింటిలోన గుండ్రించుచున్నగడుపునిండునె దొరఁ జేరి గ్రాసమడుగుపొమ్మనుచుఁ బల్కు నాథు నప్పొలఁతి జారకాంతుఁ బొందుటకై సందు గలుగవలసి. 371
క. ఈగతి మెలంగునంగనలా గాబలదేవుఁ డెఱిఁగి లలనా రావే
బాగాయెంగద చిన్నెలునీగరితతనంబుఁగంటి నే నివ్వేళన్. 372
ఉ. ఓసి గయాళికాన నను నుగ్రు నెఱుంగవె రోసమెత్తినందోస మెఱుంగ వీటఁ గలతొయ్యలులెల్లను గుంపుగూడి సంత్రాసము చెంద నీగళము రాట్నమునం బిగియించి యొంతునోకోసుకతిందునో యనినఁ గోమలి నిశ్చలధైర్యధుర్యయై. 373
ఉ. గొంటుఁదనంబునం గులుకుగుబ్బలపయ్యెద చక్కఁ జేర్చి యేమంటివి నన్ను వంటి సుగుణాకర కాచెడుబుద్ధి లెస్సగాఁగంటివి గాక నాదునడక ల్కలగంటివొ కల్మివోవ వెన్వెంటనెపోవునే మఱి వివేకము లోకములోనివారికిన్. 374
ఉ. లేవడిమీఁద బానిసలు లేనికతంబున నూరకుండినంబోవమి నప్పుసప్పులకుఁ బోవుట వేఱుగఁ దోఁచె నేమొకోకావలె నట్టులైన నవుఁగా దననేటికి నేఁటినుండి నాథా వెలికేగఁ బ్రాణవిభుఁ డల్గినకార్యము సేయవచ్చునే. 375
తే. ప్రతిన వలికెద నేను నీపాదమానయకట మోసంబు లేదు కొండంతపనికినైన బతిమాలి నీవు పొమ్మన్న వెడలిపోవ నూరక యుండు మీపోరుచాలు. 376
క. అన విని ముదితల హృదయముగని యెఱుఁగమి నతఁడు నిజముగా నెంచెం దద్వనితయును మదనవేదనదినశేషము దీర్చె యుగముఁ దీర్చినరీతిన్. 377
చ. లకుచకుచాలలామ శుభలక్షణలక్షితకౌతుకప్రదా
త్మకుఁ దమినించు మ్రొక్కు పగతక్కులు చెక్కులు లేనిమోహమూరక కలహించి మించు పెనురాపులు చూపులు నేచ నెమ్మదిన్. 378
ఉ. ఎప్పుడు పోదుఁ బోయి హృదయేశ్వరుమాటలు వాని కెప్పుడేఁచెప్పుదుఁ జెప్పి వాని మదిఁ జిత్రపుమోహముచేత నెప్పుడేగప్పుదుఁ గప్పి వానియెద గబ్బిచనుంగవచేత నెప్పుడేగుప్పుదుఁ గుప్పి వాని రతికోరుట యెప్పు డటంచు నెంచుచున్. 379
వ. ఇవ్విధంబున నూహించుచు నాచంపకగంధియు నొక్కయుపాయంబు పెంపున.380
ఉ. ముంగిటనిల్చి యో పొరుగుముద్దియ నాపతి నెత్తిమాసి నేసంగడి కేగ లేనిపు డహర్ముఖమౌతఱిఁ దెచ్చి యిచ్చెదంజెంగటిగోడఁ జేరి యొకచిట్టెడునూనె యొసంగలేవె యభ్యంగ మొనర్తునం చడిగి యాకె యొసంగఁగఁ దెచ్చి వేడుకన్. 381
మ. తలమాసెం గద రంగదాప్తకులయూథానాథ నాధన్యతాకలనాధర్మముచే నసంఖ్యముగఁ బ్రేంఖద్వైభవారోగ్యముల్గలుగం గాంతునె యంచుఁ దేనియలు చిల్కంబల్కి యక్కల్కి వెన్నెలలో నాయకు నుంచి నిల్చి తలయంటెం దాళమానంబులన్. 382
తే. ఇట్లు తలయంటి యటకలి యిడి సులక్షణాసరోజాక్షి యిఁక నెట్లు నాథ జలముతెరలియున్నది దొరలింపఁ దెచ్చికొనఁగబాగుగా దూరి యవ్వలిబావినీళ్లు. 383
క. ఏ నరుగరాదు గద నీపై నానలు పెట్టుకొనుటఁ బడుపాటులుగా
కేనాఁటివారికైనంగానీ గేహమున బావి గలుగ న్వలదే. 384
క. అన విని బలదేవుం డోవనితా యానలకు నేమివచ్చెంబో వేకొనితేవే జలములు గ్రక్కున నీచలిచేత నిలువఁగూడ దటన్నన్. 385
క. ఓనాథ సతులగుణములనేనాఁటికిఁ బురుషు లెఱుఁగ రే నెచ్చటికింబోనేల నీకుఁ గోపమురానేల యటంచు నదిపరాకై యున్నన్. 386
క. బలదేవుఁ డబల నాపైజలమా నానేరమెల్ల సైరించి జలములు దెమ్ము వేగఁ బొమ్మనిపలుమఱు వేడుకొనఁ గపటభయ మెనయంగన్. 387
ఉ. మంచిది నీవు పంప ననుమాన మిదేటి కటంచుఁ బల్కి యక్కాంచనగాత్రి రజ్జుఘటకమ్రకరాంబుజయుగ్మయై కటాక్షాంచలచంచలాలత యొయారపుఁగొప్పు మెఱుంగునుబ్బులన్మించఁగ నేగె ముద్దునడ నీటునఁ గూపసమీపభూమికిన్. 388
మ. చని యాచేరువఁ జారుభూరుహలతాసంతానతంతన్యమాననవీనాఖిలసూనసౌరభనిశాంతంబైన పూఁదోఁటలోఁదనమేకోలున వచ్చియున్న యుపనాథప్రౌఢు నాఢౌకమాననిరూఢద్రఢిమానురాగ మిగురొందంగూడి క్రీడింపఁగన్. 389
తే. అలరె వేగుఁజుక్క యది చూచి భయమందఁదనరెఁ బక్షిరుతము దాని వినుచు
దిగులుపడఁగఁ దూర్పు తెలతెల గావచ్చెవారి కిట్లు తెల్లవాఱె నంత. 390
క. విను మో ప్రభావతీ సతితన నేరం బెట్లు తప్పదాట న్వలయున్మనమున దీని కుపాయముగననేరని నారి జార గారాదుసుమీ. 391
క. అని పలుకు చిలుకపలుకుంగనుఁగొని వైశ్యాంగనాశిఖామణి యిచ్చోనను నడుగు టుడుగు బెడఁగుగననఘగుణా నీవె నొడువు మవ్వలికథయున్. 392
ఉ. నావిని కీర మిట్లను ఘనాఘనవేణి సనాతనప్రవీణావలిఁ గేరు నీకుఁ దెలియంబడకున్నదె యైన మద్వచఃశ్రీ వెలయింపఁ గోరి తిఁకఁ జెప్పెద నప్పగిదిం బ్రభాతవేళావిభవంబు మీఱుఁడుఁ గలంగుచు జారుఁడు లేచిపోయినన్. 393
ఉ. అచ్చపలాడి యింటిమగఁ డంపఁగ నిప్పుడె బావినీటికైవచ్చితి వచ్చి జారరతివాంఛల నుండితి నింతలోనఁ దానెచ్చటనుండి వచ్చె రవి యీతని కెక్కడఁ బ్రొద్దువోదు నాయిచ్చ గలంగసాగెనిఁక నేమని యేను గృహంబుఁ జేరుదున్. 394
ఉ. ఒక్కకృషీవలాచలపయోధర నాయకుప్రక్క నిద్రకుంజిక్కి విహంగమధ్వనులచే వెడ మేల్కని తాఱుమాఱుగాఁగ్రక్కునఁ గట్టుకొన్న చిటికమ్ముల చీర తగంగఁ దత్కటీభాక్కుచకుంభ కుంభమునబాగొనరం జనుదెంచె నూతికిన్. 396
తే. వచ్చి జలములు చేఁద నవ్వామనయనయాసనాబ్దంబు వాంచి నిజాధినాథుతోడిపొలయల్కఁ దోయంబుఁ దొలఁగివచ్చువరుణసతివోలు నమ్మల్లతరుణిఁ గనియె. 397
క. కని మొఱపెట్టినఁ జెంగటిజనులొక్కట మూఁగ వారి సందడిపలుకుల్విని యాడువారు సేరంజను దెంచెం జెట్టి దట్టిచల్లడములతోన్. 398
తే. వచ్చి నిజభార్య చేసిన వగలు గాంచిదిగులుపడి మున్నుగా నరుదెంచి యున్నదాని యుపభర్తతోడుగాఁ బూని వెడలఁదిగిచి తోడ్కొనిపోయె నమ్మగువ నతఁడు. 399
క. ఏవంవిధ చాతుర్యమునీ వెఱిఁగితివని మేదినీవరుఁ జేరంబోవచ్చుఁ బోయి క్రమ్మరరావచ్చుఁ బ్రభావతీ పరాకా యనినన్. 400
క. నా కేమి తెలియు నని యక్కాకోదరవేణి కమలగంధాంధమరు
త్పాకము రాకనిశీథినిపోకఁడ గని యంత నంతిపురమున కరిగెన్. 401
క. చని దిన మను వననిధినీఁదినయదియై రాత్రి పేరి దీవిం గని యవ్వనజాక్షి యూఱడిలి నృపునెనయం జనుదేఱఁ జిలుక యిట్లని పలికెన్. 402
శా. కాంతా సంతసమయ్యె నామది వధూకందర్పుఁడౌ నద్ధరాకాంతుం జేరఁగ నుత్సహించియును మద్గాథాసుధాలోలుపస్వాంతత్వంబునఁ జేరవచ్చెదు భవత్సౌలభ్యసాద్గుణ్య మేనెంతంచు న్గొనియాడ నేర్తు మఱి నీవే నీకు జో డిమ్మహిన్. 403
క. క్రమ్మఱ నొకకథఁ దెలిపెదధమ్మిల్లోత్ఫుల్లకుసుమధామంబులపైదుమ్మెదలు చిమ్మిరేఁగంగొమ్మా తలయూఁచి మెచ్చికొమ్మా పిదపన్. 404
చ. అని తెలుపందొడంగె విను మంబుధి మోహపురాణివాసమైతనరెడు కృష్ణతీరమునఁ దామ్రపురం బనుకాఁపుటూరు భూవనరుహగంధి నెమ్మొగము వైఖరిమీఱు విశేషకాంతి వర్తనము వహించి మించు విదితంబుగఁ జూపఱ కిం పొనర్చుచున్. 405
చ. కొలుచు సమగ్రభంగి నొనగూడ దివాణపువారిచేతికాఁకలుహుసివోవఁగాఁ గఱవుకాల మెఱుంగక పూసబొట్టులం
బలికలినీళ్లుఁ జందనపుమానికెఁ గొల్చినమాళ్లు గల్గి శోభిలుదురు రెడ్డిబిడ్డలు కుబేరుని పిల్లలనంగ నచ్చటన్. 406
తే. అచట నొక రెడ్డి వెలయు హలాంకుఁ డనెడిపేరుగలవాఁడు కులములోఁ బెద్దయింటివాఁడు బొంక నెఱుంగనివాఁడు వాఁడుపట్టినదియెల్ల బంగారు పనులపట్ల. 407
సీ. అచ్చమై వాకిట రచ్చఱాయి మెఱుంగుపంచతిన్నెలు గొప్ప పారిగోడకంపతెట్టులును రాకట్టు ముంగిలి మల్లెసాలెదేవరయఱచవికె యొకటికోళ్ల గూండ్లును గొఱ్ఱు కుఱుగాడి యేడికోలులు కాఁడి పలుపులు గలుగు నటుకదూడలు పెనుమూవకోడెలు కుఱుకాఁడిగిత్త లీనినమేటిగిడ్లదొడ్డితే. యిఱుకుమ్రానుపెరంటిలో నెక్కుబావిమునుఁగలును జొప్పపెనువామి జనము రుబ్బుఱోలు పిడకలకుచ్చెల దాలిగుంతదనర నిరతంబు వెలయు నాతనిగృహంబు. 408
తే. అతనికి సుకేశి యనియెడు నాలి వెనుకనబ్బె గుణవతి యనఁగ నిల్లాలొకర్తు
చిత్తసంభవు చేకత్తి చివుకుపోవఁజేవదొరకినమాడ్కి నచ్చెరువు గాఁగ. 409
సీ. సాక్షాత్కరించిన జలదేవత యనంగనీలాటిరేవున నీటుచూపురథముపైఁ గనుపించు రతిదేవి యన జొన్నచేనుఁ గాచుటకు మంచియ వసించుఁగేళికాగళితమౌక్తికము లేఱెడు వనాంబుజపాణినా నిప్పపూవు లేఱుఁగాలచక్రముఁ ద్రిప్పు కమలనాభునిశక్తినా నూలువడుక రాట్నంబుఁ ద్రిప్పుతే. మేఁతగొని వచ్చు తమ్మిరుమ్మీపిరంగిదొరతురంగీవిలాసంబు దొరయఁగొల్చుగంప లింటికిఁ దెచ్చు నాకాపుబిగువుటొగవగల గుబ్బలాఁడి యొక్కొక్క వేళ. 410
సీ. తిరునాళ్లకై పోయి తిరుపతిలోఁ గొన్ననొక్కుపూసలపేరు టెక్కుసూపజిగికుందనముఁ గూర్చి మగఁడు చేయించినమెఱుఁగుకమ్మలు వింతయొఱపు నెఱపదనుఁ జూడవచ్చుచోఁ దల్లి తెచ్చిన యట్టియల్లికనాను సోయగ మెసంగమొదటికోడలి దంచుఁ దుది నత్తయిచ్చినచుట్టుమెట్టెలజోడు సొంపునింపఁ
తే. గడియములు కెంపురవలయుంగరము వెండికుప్పె సౌరంబు కుఱుమాపుకూనలమ్మచీర కుడిపైఁటలోపలి సిస్తుఱవికయెసఁగఁ జరియించు నిట్టు లయ్యెమ్మెలాఁడి. 411
తే. దానివలలకుఁ జిక్కి మోదమునఁ జొక్కియుండెడుహలాంకుఁ డొక్కనాఁ డుదయవేళమితి యెఱుంగక తుంపురు ల్మీఁదఁబడఁగజొన్నకూడును మజ్జిగ జుఱ్ఱి లేచి. 412
సీ. మొలకు సగంబును దలకు సగంబుగాఁగట్టిన యయగారి కరలచీరపైనల్లకముల పచ్చడమును దోలుపావలు చేతిలోఁ బట్టుకఱ్ఱకత్తెఱగడ్డంబు కఱకు జుంజురు మీసములు రోమశంబైన పలకఱొమ్ముమొలయుంగరము వ్రేల వలముగాఁ దీర్చిననాభినామము బీదనరము లమరుతే. గడుసుఁబిక్కలు గలిగిన మడమలమరవెంట నిరువంకఁ బెంపుడువేఁపు లరుగఁగెలనఁ దగు నెడ్లకొట్ట మీక్షించికొనుచునింటివెలుపలి తిన్నియ కేగుదెంచె. 413
చ. దుసికిలజాఱు కోరసిగ దుప్పటినీటు లలాటిపట్టికంబొసఁగు విభూతిపైఁ బసుపుబొట్టును దొట్టిన కల్లు చొక్కు వెక్కసముగ నెఱ్ఱవాఱిన వికారపుఁ జూపులుగాఁ గనంబడన్వెసం జను దెంచె నొక్కబవనీఁడు తదీయసమీపభూమికిన్. 414
తే. పచ్చి జమలిక వాయించి వరుసతోడఁదాతతండ్రుల చౌదరితనము లెల్లనెన్ని కైవార మొనరించి యింపు నెఱపనతనిఁ గూర్చుండనిడుకొని యాదరమున. 415
మ. కలలో దేవర చెప్పె రేయి యెదుటం గన్పించి నెయ్యంబు వాటిల నీపాలికి దేవుఁ డింక బవనీఁడే యంచుఁ దానాఁడగావలె నేబాఁపనమొప్పెలైన సరియే వారెల్ల సాత్కాలు నీవలె గోరించిరె నిన్నె కొల్తు ననుచు న్వర్ణించుచో నంతటన్. 416
తే. ముదుక తలపాగయును బాహుమూలమందుగవిలె చర్మపుటొఱలోని కత్తిగంటమలతి నీర్కావిదోవతు లమరి గ్రామకరణ మేతెంచి రెడ్డిచెంగట వసించె. 417
క. ఈరీతి నెల్లవారలుఁజేర హలాంకుండు రచ్చసేయఁ దదీయాంభోరుహముఖి సరికాఁపుటొయారులఁ గూడుకొని నిజగృహాంతరసీమన్. 418
తే. దివసమంత వితాపోయె నవుర రారెగుంపునంపును లేకుండ గుండుపోగుగాఁ బదాఱింటితరమునుగాఁగ నూలువడకరే యంచు నొండొరు ల్నొడివికొనుచు. 419
క. వడిదారము చెవులుం ద్రొక్కుడుపలకయు దిండు కదురు గుంజలును ద్రొ
క్కుడుబొమ్మయునుం ద్రిప్పుడుపుడకయునుం గలుగు రాట్నములు గైకొనుచున్. 420
తే. ఎడమదెస దొడ్డుగా వైచి యేకులెల్లఁగెలనఁ బలువగ వేఁపుడుగింజ లునిచిచేవపీఁటలమీఁద నాసీనలైనవారలై వావివరుసలు నదరికొనుచు. 421
సీ. గుంపునంపును లేక కొనసాగఁ బ్రోగువెంట మెఱుంగుఁజూపు పేరెములువారఁబ్రాయంపుపడుచులఁ బనిగొంటివే దూదియనెడి పాటలఁ దేనెచినుకు లీననేకుతోఁ జెలఁగు కేలెత్తుచో భుజమూలకాంతులు బయలు బంగారు సేయఁబుడుకఁ ద్రిప్పెడురయంబునఁ బైఁటజూచుచోమినుకుగుబ్బలు తళుక్కని రహింపతే. ముడిచికొన్నట్టి తెలిగంజి మడతచీరలరిదితొడనిగ్గుచే పసు పంటినట్లుపొసఁగఁ జరణాభ త్రొక్కుడుబొమ్మమీఁదబచ్చెన ఘటింప వడికి రప్పద్మముఖులు. 422
సీ. పోలిరెడ్డికి మగపోఁడిమి లేదుగాగాది కేలాగునఁ గడుపునిక్కెవదరకే మగవారు వచ్చెద రదె చక్కఁజెక్కుకో పయ్యెదచెఱుఁగుకొండి
యోసి లేవే మల్లి వేసాలు సేయకుమగవార లెఱుఁగని మర్మ మెద్దినీ కేటి సిబ్బితి నెరరాగవై మించియడఁగఁదొక్కినదాన వత్తగారిఁతే. బెద్ది వినలేదె మనసుబ్బు పెరఁటిగోడదాఁటగా మామ గనెనఁట యేటి సుద్దియెసఁగి మగఁ డొల్లకున్న నదేమిసేయుననుచుఁ గసివోవఁ బలుమాటలాడికొనుచు. 423
తే. ఎన్నికలుపట్టి పుంజంబు లేర్పరించిపంటకఱ్ఱలు మఱితోడుపడగ లూఁచకండె లొనరించి చాలించి కాఁపుటింతులున్న యవ్వేళ నద్భుతం బుట్టిపడగ. 424
సీ. నునుపుగా దువ్వి తీర్చిన కెంపుబాలేందుపసమీఱు నొసటి కెంబసుపుబొట్టుమెడతోలు పావాలు నిడుదగవ్వలదండసన్నంపుఁ జికిలిదర్శనపుఁ బేరునెడమచేఁ బళ్ళిక నిడినబండా రన్యపాణిఁ బట్టిన నాగపడిగకోలకటిఁ గాసెకట్టుగాఁ గట్టిన చెంగావినిద్దంపుగుబ్బల నీలిఱవికెతే. పదయుగంబున గజ్జెలు బాగునెఱపఁబరశురామునిపైఁ బాటఁ బాడికొనుచుసొంపుమీఱంగ నెక్కలో జోగటంచుముంగిటికి వచ్చి నిలిచె మాతంగి యొకతె. 425
తే. దానికై యిల్లుగల రెడ్డిసాని జోగుపెట్టుటకుఁ బోయి పొదిగిలిపట్టి నిలిచిగణకుఁ గని వానిప్రాయంపు కలిమియెల్లఁగొల్లలాడుదునని యెంచికొనియె నంత. 426
సీ. మెలిపెట్టి చుట్టిన తెలిపరంగి ముడాసుపైలవేటాడబ్బు పనులఁ జెలఁగుబంగరువ్రాఁతలపట్టు హిజారు కంబరు చీనినిమతానిపాడునొసలుతనుకాంతి గనుపింపఁ దనరు నంగీజోడువలిపెంపు శాలువ వల్లెవాటుపడుదలలోన డాబాకత్తి వదలుపాపోసులు గోరంటఁబొలుచు గోళ్లుతే. నడుమసీలున్న తోలుడా ల్బెడఁగుసూపనభయముగ వెంట నరుదెంచు సభరువాఁడునమరు ముస్తైదుతేజితో నరుగుదెంచెదారుణాకారుఁడైన యుద్దారుఁ డొకఁడు. 427
తే. వచ్చి యయ్యూరివెలుపలి రచ్చరావిక్రేవ దుర్వారుఁడై ‘తలారికి బులావుధగిడికే’ యనుమాటకుఁ దలఁకి రెడ్డితోడివారలతోఁ జేని త్రోవఁబట్టె. 428
క. అంతటఁ దదీయగేహాభ్యంతరముం జొచ్చెఁ గరణ మతిభయమునఁ దత్కాంత తదాకృతి గొంతకుఁగొంత విలోకించి మించి గుణవతి యాత్మన్. 429
తే. కోరినప్పుడె యీతనిఁ గూర్పవచ్చెనొక్కొ నాపాలి యాదేవుఁ డొకరిపాలిబంటుగా కిట్లు తురకరూపంబు దాల్చియనుచుఁ దలపోసి యేకాంతమగుటఁ దెలిసి. 430
క. అళుకక రమ్మని భయముందెలుపుచుఁ దద్భూమిసురుని దేవర యఱలోపలనుంచి కమ్మలూఁగంగులుకుచుఁ దాఁ గడపమీఁదఁ గూర్చుండె వెసన్. 431
తే. కలికిచూపుల మాటల కందువలనుజేరిక లొనర్చి మేకొనఁ జేసి వానినెనసి యప్పుడె దేవరయిల్లు పడుకయిల్లు గావించె నంతఁ బూర్ణేందువదన. 432
క. అది మొదలుగ నాతనిచేవదలక మఱి తాననంగ వాఁడనఁగా నెమది వేఱులేక తమి నమ్మదవతి మన్మథునిలంకె మానిసి యయ్యెన్. 433
సీ. కలికిమాటలు కిలకిలనవ్వు లోరచూపులు మోవిఱుజుపులు గులుకునడలుబెళుకునందములు గొబ్బిళ్లపాటలు కొప్పుసవరించు నేర్పు చేసన్నవగలుగోటిచిమ్ములు తెచ్చికోలు నివ్వెఱలేనివెఱుపును నెచ్చెలి వెన్నుచఱపుమోముద్రిప్పులు బొమముడి ఱొమ్ముతాటింపురానిజంకెన కావరంపుఁ బొవరు
తే. మొలకసిగ్గులు వట్టి కొంకులును వలపుచాటునిలకడ లలఁతివేసటలుఁ జూపుగడియలో వాని దారునఁ గన్నయపుడెకొమ్మ మారునిజంత్రంపుబొమ్మకరణి. 434
సీ. పొరుగూరి సంతకుఁ బోవువారలచేతఁదెప్పించుఁ బోఁకలు తెల్లనాకుమితిలేని కూలి చాకెత కిచ్చి కైకొనుగడియకొక్కటి గాఁగ మడుపుఁజీరలూరినంబికి మోహ మూరించి తెప్పించిపూను మాపటివేళఁ బూవుటెత్తులగసాలె కేమైన నర్పించి పలుమాఱుమెఱుఁగుపెట్టించుఁ గ్రొమ్మిసీమికమ్మతే. లనుదినంబును దలగడు గవధరించునరిది గందపు నెఱపూఁత లలవరించుఁగమ్మసారాయికై సంచకర మొసంగుచిత్తజాయత్తయై కాఁపుచిన్నెలాఁడి. 435
వ. ఇవ్విధంబున నున్నంత. 436
క. ఆపల్లె నుల్లసిల్లెడుకాపులకుఁ బురోహితత్వగౌరవమునకుంబ్రాపగుచు నొకమహీసురుఁడేప్రొద్దు సుశర్మ యనఁగ నింపెసలారున్. 437
ఉ. అక్కట పొట్టచించిన నొకక్షర మైనను రాదు టెక్కులుండక్కులు గాని య మ్మనిన డ మ్మననేరఁడు వేదమందు సొం
పెక్కిన యన్నివిద్యల నహీనుఁడ నేనని కాపువారిచేమ్రొక్కులు గొంచు నాతఁడు సమున్నతగర్వము హత్తివర్తిలున్. 438
చ. తెరువరు లైనయట్టిపరదేశమహీసురు లర్థవాంఛఁ దత్పురమున కేగుదేర వెడదోస్యములం బచరించి వారి నిర్బరగతినోడఁ గూయుఁ దమబాపఁడె గెల్చెనటంచుఁ గాపులచ్చెరుపడ నాదుకంటికి దిసింతురె వీరని యాతఁ డుబ్బునన్. 439
క. జలముల మొసలియు గుహలోఁబులి గందపుమ్రానిమీఁద భుజగముబలె నాహలిక గ్రామంబున నతండలరుం బరు లెవ్వరైన నడుగిడకుండన్. 440
క. అతని కుటుంబిని పతిదేవతయై వర్తిల్లు శీలవతి యనఁగ నరుంధతికిం బ్రతియై గుణసంతతికిం గతి యగుచుఁ బురజనంబులు మెచ్చన్. 441
తే. అమ్మహీసురుఁ డొక్కనాఁ డాహలాంకుడెలమి వింతటి పండుగ కలిమి వెలయఁజేయునార్తలు వినుచుఁ దాఁ జేనికడకునేగు తత్తఱ మొనగూడ నిల్లువెడలి. 442
సీ. అఱుతఁ గీల్కొన్న ముత్తరములథావళియంసాగ్రమున గోనె యసిమిసంచికట్టినముతకనీర్కావిధోవతియు నాపై బిగించినయది ప్రాఁతబట్టతలచుట్టుకొన్న చింపులబైరవాసంబుచెమటచేఁ గరంగెడు సేసబొట్టు
మారేడుబుఱ్ఱలో మంత్రాక్షతంబులుపదములవిజ్జోడు పాదరక్షతే. లొడిసి పంచాంగ మొకకేలఁ బొడుపువ్రేలవెండియుంగరమును మెడవ్రేలుముఱికిజందెములు నవ్యయాచ్యుతస్మరణమాస్యసీమఁ గనుపింపఁ బఱతెంచెఁ జేనికడకు. 443
ఉ. వచ్చినఁ బెద్దరెడ్డి సుగవాసివి మేలిపుడైన నీడకున్వచ్చితె యంచు బావయనువావిని ద్రస్తరలాడి బాపఁ డాయిచ్చటఁ జల్లువిత్తు ఫలియించునె వేళగుణం బెఱింగి నాయిచ్చకు మెచ్చుగా వదరు మిప్పుడ నన్విని యాతఁ డుబ్బుచున్. 444
ఉ. చెప్పిన నేమి లేదుగద చింపులదోవతిఁ జూడు మేను మీకెప్పుడు మేలుఁగోరి మఱియెక్కలిదేవికి గ్రామగంగకుంజప్పిడిఁ దించు మ్రొక్కుకొనుజాడ లెఱుంగవె యిట్టిపట్ల నేచొప్పున నాశ్రితుం గరుణఁజూడరుగా కదియేల యిత్తఱిన్. 445
ఉ. నిన్నటిరేయి నాయెదుట నిల్చెఁజుమీ కలలోన మీకు మేల్పన్నెడు పేరటా ల్నిలిచి బాపఁడ రెడ్డికిఁ దెల్పరాదె నన్నెన్నఁడు దిన్నె బెట్టి నుతియించుచుఁ గొల్వరటంచుఁ బల్కె నాకన్నుల నీరు దొట్టి పులక ల్గనుపట్టెడుఁ జూడు మిప్పుడున్. 446
క. అన రెడ్డి మనసు గరఁగంగనుఁగవ నీరొదవి జాఱఁగను బాపఁడ నేవినలేను తాళు చెప్పకుమని మునుపటి దానిచిన్నె లాత్మకుఁ దోఁపన్. 447
క. ఆలని యెంచక మనియెడుకాలంబునఁ దల్లిమాట గడవక దానంనేలనిడి కాలరాచితినీలాగున వచ్చుననుచు నెవ్వఁ డెఱుంగున్. 448
తే. అనుచు ధైర్యంబుఁ దాల్చి యాయమ్మసత్యమప్పుడేకంటి నింకఁ దా నడిగినట్లెతీనెఁ బెట్టుక కొలిచెదఁగాని నేఁడుమొదలు నామాటుగా నీవు మ్రొక్కికొనుము. 449
తే. అనియె నీరీతిఁ దానికై యవనిసురుఁడుసివముపుట్టించి యపుడు చేఁజేతఁదీసికొనియెఁ బుట్టెఁడువిత్తులు కొలుచు మంచివేళవ చ్చితి ననుచు భావించుకొనుచు. 450
వ. అయ్యవసరంబున. 451
చ. తలపయిఁ బైఁటచుట్టపయిఁ దాల్చినపుట్టికలోనఁ బొల్చునంబలిగల పంటియుం జిలుమువాయఁగ దోమిన కంచము న్సముజ్జ్వలమగుచూపు డాలు ముఖవారిజవైరికి వెల్లపాపడల్బలెఁ దగరెడ్డికోడలు విలాసముతోడుత నేగుదెంచినన్. 452
తే. అప్పు డవ్విప్రుఁ డలికఘర్మాంబుపటలిజాఱి వీడెంపుచొళ్లుతో సంధి సేయబెరుఁగు నివ్వెరతో నోరు తెఱచికొనుచుఁదప్ప కీక్షించె దానిసౌందర్యమహిమ. 453
తే. చూచినప్పుడే విలుపాఱవై చి సరసతామరసభీమతరగదాదండ మెత్తి
దండహత్తి మనోజుండు దండవెట్టెనమ్మహీదేవు నెమ్మది రిమ్మవొడమ. 454
ఉ. అంతట రెడ్డి పంపఁగ మృగాక్షిగృహంబున కేగ దాని యాద్యంతశరీరసౌష్టవమునందు మెలంగు మనంబులోపలంగంతులుగోరి కోరికలు గంతులు వైవఁ గృషీవలాజ్ఞ గేహాంతర మొంది చెందు విరహజ్జ్వర ముజ్జ్వలమైనఁ గుందుచున్. 455
తే. అద్ధరాదేవుఁ డాహలికాబ్జవదనగన్న కన్నుల కింటిలో గరితరూపమెట్టులుండునొ కాని సహింపఁడయ్యెఁదద్బహుకృతోపచారవిధంబు లెల్ల. 456
సీ. కీలుగం టిదియేల పోలఁగా నునుఁగొప్పుఁగీల్కొల్పు కొమ్మంచుఁ గీజుపోరుఁబసుపుబొ ట్టిదియేల నొసటవిభూతిరేఖ యమర్చికొమ్మంచుఁ గంటగించుఁగాసెక ట్టిదియేల కపురుగా మైజారుచీరఁదాల్చు మటంచుఁ జిమ్మ రేగులక్కాకు లివియేల చొక్కంపుటంచు కమలు ధరించు మటంచు నలుకఁ గాంచుతే. భార్యతో నాయమయు వెఱ్ఱిపట్టె నేమొయనుచు నాలాగె కావింప నతఁడు హలికలికుచకుచవేషమేకాని యకట దానియొరపు లేదని యాత్మలోఁ బరితపించు. 457
తే. గేస్తురా లొక్కపరి రతికేళిమీఁదమనసుపాఱినఁ గంకటి మైలచీరఁబఱచి విడె మొల్లరే యంచుఁ బలుకరింపఁగుక్కకూఁతుర వలదంచు వెక్కిరించు. 458
సీ. ఒడిలోనఁ బంచాంగ ముంచుకొన్నది గానకెటుపోయె ననుచు నూరెల్ల వెదకుఁబనిలేనిపని వీథిఁ జనుచుఁ గ్రమ్మరు నాత్మగృహమంచు నెంచి యిల్లిల్లుఁ దూఱునపుడు భుక్తి యొనర్చి యవునషే సంకటితింటినా యని యింటి తెఱవ నడుగుఁగురుచదోవతి గట్టికొని యెవ్వరో యిట్లుగట్టిపోయి రటంచుఁ గలవరించుతే. గడియలోఁ దెల్లవాఱె భాస్కరుఁడు గ్రుంకెజాగు లేలంచు సందెపై సందెవార్చుఁగంతుమాయల నుమ్మెత్తకాయ దిన్నపొలుపు సారెకుఁ దెల్పు నప్పుడమివేల్పు. 459
వ. ఇవ్విధంబునం బునఃపునఃప్రవర్ధమానమన్మథోన్మాదుండై యమ్మేదినీదేవుం డొక్కనాఁ డహర్ముఖంబున సంధ్యావందనార్థంబు తటాకలితవిటపిచ్ఛటాకం బగుతటాకంబున కరిగి తదీయతోయజామోదమేదురమధువ్రతవ్రాతతీవ్రతతారవంబులు బొలుచుచున్న సమయంబున. 460
క. మేలికడానిసడాకలపోలికగల యిరుగుపొరుగు పొలఁతులతో నా
హాలికబాలిక శశిరేఖాలిక యచ్చటికి నీటికై యరుదెంచెన్. 461
క. వచ్చిన మేనికిఁ బ్రాణమువచ్చిన యట్లైన మెచ్చి వసుథావిబుధుండచ్చపలాక్షీమణికిముచ్చటతోఁ జేతులెత్తి మ్రొక్కినయంతన్. 462
తే. అయ్యవా రెవ్వరికి మ్రొక్కెనంచుఁ బలుకనెవ్వతెకు నేల మ్రొక్కునో యెమ్మెలాఁడినమ్మి యేదేవరకు మ్రొక్కినాఁడొ యనుచునవ్వుచేడెలఁ గూడి యన్నాతి చనియె. 463
క. వాలాయము దినదినమునుబాలామణి వచ్చుననుచుఁ బాఱుఁడు ప్రాతఃకాలమునఁ దత్తటాకముకూలంబున ముక్కు పట్టుకొని కూర్చుండున్. 464
తే. ఉండి నీటికి వచ్చు నయ్యువిదఁ జూచిసన్నగా మ్రొక్కు మ్రొక్కఁ దజ్జలజనయనతనకు మ్రొక్కుటఁ దానాత్మఁ దలఁచితలఁచియేటి యాలోచన యటంచు నింటికరుగు. 465
క. అంతట విను మొకనాఁ డక్కాంతామణి యతని మనసుఁ గనవలె ననుచుంజింతించి జోడుప్రాయపుటింతుల నెడఁబాసి నీటి కేతెంచుటయున్. 466
తే. అతఁడు గనుఁగొని యిది సమయం బటంచుమఱియు మఱియును మ్రొక్క నమ్మందగమన
కడవ యట డించి తెలిసెదఁగాక యనుచుఁజెంతకేతేర నాతఁడు చేర నరిగి. 467
క. ఆశీర్వాదము మేరుధరాశాసిభవత్కుచద్వయంబునకు సుధావేశలహాసాననరాకాశశికిన్ నీకు మేలుగావలె నబలా. 468
క. ఇన్నిదినంబులు సనియెన్మన్నన నీ వెన్నఁడైన మము నమ్మినవాఁడున్నాఁ డీబాఁపండనివెన్నెలచూపులను జూడవే కద నన్నున్. 469
చ. అనవిని నవ్వి యవ్వికసితాంబుజలోచన పైఁటకొంగు కేలున నులివెట్టుచుం దళుకుతళ్కునఁ జూపులఁజూచి రెడ్డి నీఘనత యెఱింగి తా నడవఁగా నదిగాదని యేను జేయఁగల్గినపని యేమియున్న దవులే దయఁబల్కితివేమొ యీగతిన్. 470
క. అది యుండనిమ్ము నే నడిగెద నొక్కటి నీవు దినముఁ గేలెత్తి ముదంబొదవఁగ మ్రొక్కు ఘటింతువుగద యది యెవ్వరికిఁ దెలుపఁగావలె ననినన్. 471
తే. ఆతఁ డిట్లను నోజనజాస్య నీకుఁగాక యింకెవ్వరికి మ్రొక్కఁగాఁ గడంగుసతులధర్మపవిత్రంబులైన నాకరంబులనుమాట లీఁక నేల త్రవ్వవలయు. 472
క. అతిథినయి వచ్చినాఁడన్రతిభిక్ష యొసంగి నన్ను రక్షింపఁగదేసతి నీపితృ దేవతలకుగతి గల్గెడుననిన హలికకామిని కలఁకన్. 473
తే. అమ్మనేఁజెల్ల బాపనయ్యా మఱేమిరజ్జులాడెదు మంచిగురస్తువగుదుచేరిమాటాడినపుడే నాసిగ్గువోయెనౌరయంటివి లెస్సబాగాయెఁ గాదు. 474
తే. ఓడ కిటువలె నీ వింతవాఁడ వేనిమించి తగినట్టి బుద్ధి చెప్పించవచ్చుగ్రామమున కెల్ల మాలిమికాఁడ వగుటబ్రతికిపోతివి పోర బాఁపనగరాస. 475
క. అనుమాటలు చెవినిడ కాయన యిట్లనిపలుకుఁ దన్మృగాక్షీమణితోజనుమనుచుఁ ద్రోయ విస్తరిచినిగెడునన్నట్లు వలపు చెడ్డది సుమ్మీ. 476
సీ. పట్టెవర్ధనము నీపాదాబ్దములు సోఁకమ్రొక్కినఁగాదషే ముద్దుగుమ్మజందెము గుబ్బచన్ను లంటఁగఁ గౌఁగిలించినఁగాదషే మించుఁబోఁడివేల్మి వేల్చినచేత వెస నీకు వక్కాకులిచ్చినఁగాదషే యిందువదనవేదము ల్గడుఁ జదివిననోట నీమోవియానినఁగాదషే యబ్జనయన
తే. యింతకంటెను నన్ను నీ వేమి సేయుదనుచు నొండాడవేని ప్రియంబుఁగంటినీవు తెచ్చినకడవలో నీళ్లు దెమ్ముధారవోసెద నావిప్రధర్మ మెల్ల. 477
క. వేదము చదివినఫలమున్వాదించినఫలము సంధ్య వార్చినఫలముంబైదలి నీకు నొసంగెదఁగాదనినం బ్రహ్మహత్య కట్టెదుసుమ్మీ. 478
తే. అని యతఁడు వల్క నచట నేకాంత మగుటమరుఁడు ప్రక్కలు పొడిచి సమ్మతముఁ జెందుమనుచు నిర్బంధ మొనరింప నతని కనియెఁగలికి నాలుగుదిక్కులుఁ గలయఁజూచి. 479
క. నసగొట్టు బాఁపనయ్యాపిసవెఱ్ఱికిఁ దగులుపడి తపింపఁగనేలాబసవద్దు గదలకుండెడువసతికి రమ్మచటి కేను వచ్చెదఁ బొమ్మీ. 480
తే. అనిన సంభ్రమమంది యయ్యవనిసురుఁడుశీఘ్రమేవ త్వదీయేష్ట సిద్ధిరస్తుస్వస్తిరస్తు తథాస్తు తథాస్తు హలికవనజగంధి యటంచు దీవనలొసంగి. 481
సీ. వలుదలై మెఱయు పార్వణపుముద్దలవంటివలిగుబ్బ లెన్నఁడు వ్రచ్చికొందుబంచపల్లవముల మించినపెదవి యాఁకలిదీర నెన్నఁడు గఱచికొందుఁ
గొనలుగల్గినదర్భకోటినేలిన కురుల్గట్టిగా నెన్నఁడు పట్టుకొందుఁబంచామృతముఁ గ్రిందుపఱచు వాక్సుధచవుల్తనివంద నెన్నఁడు ద్రావికొందుతే. ననుచుఁ గోరుచు నవ్వుచు నాడికొనుచుసారె గేరుచుఁ జూచినవారు వీనిపుట్టు కిష్కంధలోను గాఁబోలుననఁగనాసుశర్మయు నాత్మగేహమున కరిగె. 482
తే. ఇవ్విధంబునఁ దనయింటికేగి హలికకాంత రమ్మనె బసవద్దు గదలకుండుచోటికక్కట యదియెట్టుచోటు తెలియనడుగలేనైతినని ఖిన్నుఁడై కృశింప. 483
ఉ. శీలవతీశిరోమణి విచిత్రతరంబగు భర్తహర్ష మవ్వేళనుదోఁచు తద్వ్యథయు వేమఱుగన్గొని చేరి దీనతాశ్రీలలితంబుగా నతఁడు చెప్పిన నించుక చింతనేసి వాచాలసమానమాధురి విశాలము గాంచి రహించ నిట్లనెన్. 484
క. బసవద్దు గదలకుండెడువసతియు నన్నదిది యన్న వనజారికళాలసమానమౌళిగోవెలమసలక యటు పొండు నేఁటి మాపటి కనినన్. 485
క. పరమామోదత నెంతటివెరవరి విది తెలిసినపుడె విద్వాంసునికూఁతురవగు దని యతఁ డా సుందరి వడ్డింపంగ భోజనము దీర్చి వెసన్. 486
సీ. సోలనీటను నీడఁ జూచుచుఁ బట్టెవర్ధనము నిండఁగ నక్షతలను మెత్తియడుసులోఁబడు వరాహముచంద మొదవంగఁదగ వేఁపచెక్కగందం బలందినరసినసిగలోన నంబివాఁ డిచ్చినగన్నేరుపూవులు కొన్ని తుఱిమితడియాఱి యాఱకుండెడు ప్రాఁతదోవతిబట్ట వేమఱుఁ బింజవెట్టి కట్టితే. కూర్మిసతి పెట్టెలో దాఁచికొన్ననల్లగరలపండుగుచీరఁ బైఁ గప్పుకొనుచునతనుఁ డెసకొల్ప దేవాలయంబుఁ జేరిప్రొద్దుగ్రుంకకమున్నె సొంపులు జనింప. 487
క. ఈదారిఁ జేరి యేచెలిరాదాయె నిదేమి యనుచు బ్రాహ్మణుఁడు బహిర్వేదికి వచ్చుచుఁ గోవెలలోఁ దూఱుచునుండె నంతలోనఁ దలారుల్. 488
తే. అతని తహతహ గనుఁగొని యౌర యీతఁడేవధూమణి రాకకో యిచట నున్నవాఁడు మంచిది యదియును వచ్చినపుడెపట్టుద మటంచుఁ బొంచి రో పద్మనయన. 489
ఉ. హాలికబాలికామణియు నంత నిజాంగముమీఁదనున్న నిద్రాళుమనోధినాథుని కరముల మెల్లనె డించి సాహసశ్రీలసమానయై వెడలి శీఘ్రగతిం జనుదెంచి చొచ్చె దేవాలయము న్మనోరథపరాయణుఁడైన సుశర్మ మెచ్చఁగన్. 490
క. గురికాఁడు రాక మన మీతరుణీభూసురులఁ బట్టఁదగదని చుట్టుంబురిగొనుచుండిరి యాతలవరు లంతట నదియు నతనివాంఛలు దీర్చెన్. 491
క. ఆలోన యామికావళియాలోచన యెఱిఁగి మగని హలికాళికచంజాలిజడకుండఁ గావఁగశీలవతీకాంత కొంతచింత యొనర్చెన్. 492
క. అని మఱియు నా ప్రభావతిఁగనుఁగొని యచ్చిలుక పలికెఁ గలికీ యిఁక నవ్వనితామణి వారలనేయనువునఁ గావవలెఁ దెలియ నడిగెదఁ జెపుమా. 493
క. అని యడిగిన కథ కద్భుతమున మునుఁగుటఁ బలుకలేని ముద్దియమొగమున్గనుగొని యదియుం దెలిపెదవినుమనియెం జిలుక యమృతవిధమధురోక్తిన్. 494
తే. అట్లు తలపోసి యొకయుపాయంబుఁ గాంచిబళ్ళెమునఁ బెద్దజోతి యేర్పఱుచుకొనుచునిల్లు వెలువడి దేవతాగృహము చేరఁదెగువమై వచ్చె శీలవతీలతాంగి. 495
క. ఆనాతిఁ జూచి తలవరులేనెలఁతయొ గండదీప మెత్తఁగ వచ్చెంబోనిమ్మని కనుగొన నమ్మానిని గుడిసొచ్చి కనియె మగని న్మగువన్. 496
క. కని వచ్చితి వెఱవకుఁ డనితనచేలము దాని కిచ్చి దానిపటంబుందనకటి ధరియించి రయంబునఁ బళ్లెర మీవు గొంచుఁ బొమ్మని పనిచెన్. 497
క. పనిచిన మెచ్చుచు హలికాంగన యీశ్వరుమ్రొక్కు చెల్లెఁగద యింక మమున్మునపటివలె మనుపుము దయనని చని పతిప్రక్క ముగ్ధయై పవళించెన్. 498
ఉ. అంతఁ దలారు లాత్మవిభుఁ డచ్చటికిం జనుదేర జారవృత్తాంతము దెల్పఁ బట్టుఁడని యాతఁడనం గుడిసొచ్చి దివ్వటీల్చెంతకుఁ దెచ్చి చూచి యిది శీలవతీసతి యీతఁ డెంచఁ దత్కాంతుఁ డటంచు సిగ్గువడి తప్పెఁ బ్రయోజన మంచుఁ బోయినన్. 499
తే. రమణుఁ దోడ్కొని తనమందిరమున కరిగెశీలవతియంచు వచియించు చిలుకఁ జూచియాప్రభావతి యప్పుడే యదిగొఁ దెల్లవాఱెనని యేగెనంత నగారమునకు. 500
క. చని నాఁటిరేయి నరపతినెనయం దద్గేహసీమ కేగెడుదానింగనుఁగొని యొకకథ వినుమనియనియెం గీరంబు పలుకు లమృతము దొలఁకన్. 501
క. కుముదబిలం బనునొకపురమమరు సురవ్యజనితధ్వజానీకమదభ్రమదప్రమదప్రమదాసుమదామకటాక్షజనితసూనశరంబై. 502
తే. అందుఁ దనరారు వీరాఖ్యుఁడైన యొక్కరౌతు వానికి దోసిటిప్రాలముద్దుగుమ్మ మదవతి యన నొక్కకొమ్మఁ గలదుకమ్మపూవులరెమ్మ బంగారుబొమ్మ. 503
క. ఆలలన నాయకుని యుపలాలనమునఁ దనివిలేక లలితాకారా
వాలములగు జారుల కనుకూలముగా మెలఁగుచుండుఁ గోర్కులుదీరన్. 504
సీ. అత్తగారికిని దీర్ఘాయువిచ్చినయట్టిబ్రహ్మదేవునిమీఁదఁ బండ్లుకొఱుకుభర్తకుఁ బొరుగూరుపయనంబుఁ జెప్పనిధరణీధవునిమీఁదఁ దప్పులెంచుజంద్రసూర్యులప్రకాశము మాయఁ జేయనికటికిచీఁకటిమీఁదఁ మెటికవిఱుచుబసులగోడలునాన్పి వసుధపైఁగూల్పనిముసురువానలమీఁదఁ గసరుఁజూపుతే. పదినెలకు రేలు మఱి పారవశ్యగరిమనెనయఁజేయని నిద్ర నేమేమొ దూఱుఁదవులుకోర్కులచే వెలిచవుల కరుగసందుగానక కుందు నయ్యిందువదన. 505
చ. కడకుఁ దొలంగినం గెలనఁగాఁపుగనుండెడు చేడెతోడ నీవెడపక వింత వానిరతి కేగతి నేగుదు వమ్మచెల్ల యెకుడుభయ మయ్యెడుం దలఁచికొన్ననె యంచని యిట్టిసౌఖ్య మెక్కడఁ గలదంచు విస్తరముగా నది చెప్పినఁ గోరుజారులన్. 506
చ. జననము నందినం బురుషజన్మము కావలెఁ గాక యాఁడుధైనను గుడిముద్ర వైచికొనినం దగు లేక కులాంగనాస్థితిందనలినఁ గామరూపమయిన న్వలదాయని చింతసేయు నవ్వనరుహపత్రనేత్ర తలవ్రాఁతకుఁ దప్పులుగల్గనేర్చునే. 507
క. పెనిమిటియు నత్తవదినెలుకనుఁగలిగి మెలంగ వెడలఁగా నెడ లేమిం
దినదినముఁ దత్తలోదరిమనముననే యిట్టి నేలమాలెలు ద్రవ్వున్. 508
చ. వరునింగన్ను మొఱంగి యిల్వెడలి పోవం బోయి జూరోపభోగరతింజొక్కఁగఁ జొక్కుచోఁ దలవరు ల్గద్దించినం డాఁగ డాఁగి రయోదారత నిల్లు సేరి సతిభంగింగుట్టుతో బంధుమోహరముం జెందఁగ నవ్వధూమణి యుపాయం బెంచు నెల్లప్పుడున్. 509
మ. ఇది జారుం డిలు సేరఁగాఁ దగినతా విచ్చోటఁ దత్సంగమాభ్యుదయార్హం బిది యింటివా రెఱిఁగినం బొమ్మంచు వానిన్రయంబొదవం బంపఁగవచ్చు త్రోవయని తానూహించు గేహంబునన్మదవత్యంబుజలోచనామణి మదోన్మాదం బుదారంబుగన్. 510
క. ఈరీతినుండి యయ్యంభోరుహముఖి మగఁడు మోసపోవనికతనన్జారరతి కొకమహోపాయారంభముఁ బూని దీనయైనది పోలెన్. 511
క. ఒకనాఁటిరాత్రి నిజనాయకుతో గురుభూమిఁ దగుమదంబ జనానందక యెటువలె నున్నదియోయకటా మాయన్న ధవళుఁ డరుదేఁడేమో. 512
తే. తొమ్మిది పదేండ్లు గావచ్చెఁ దోఁడుఁ జూచిగురుతుసైతంబు మఱచితిఁ గోరి యటకుమీరు నన్నంపఁగాఁబోరు వారు నిటకురారుగా చూచుటెట్లు వారలను నేను. 513
క. అని పలుక న్వరుఁ డూరార్చినమాటలు వారితిన్నెఁజేరిన పథికుండనుపమధూర్తుం డొక్కఁడువిని చూతము గాక దీనివిధ మని యంతన్. 514
తే. వేగ మఱునాఁడె యంగటివీధి కేగిపచ్చడము చీకయును బండ్లుఁ బసుపుఁగొనుచువచ్చి వారింటి కేగి బావా యటంచువీరునకు మ్రొక్కి యతని నివ్వెరగుఁ గాంచి. 515
క. తివిరి జనానందక గారవమున నీయనుజఁ జూచి రారా పోరాధవళాయన వచ్చితి నననవహితుఁడై వీరుఁ డద్భతానందమునన్. 516
క. ధవళుఁడ వీవేనా యనికవుగిటఁ గదియించి నెనరుగలబంధుఁడవౌదువు నేఁటికైన వచ్చితివవసర మిపుడైనఁ గలిగెనా యని పలుకన్. 517
తే. వారిమాటలు విని మదవతి మదీయవచన మేజాణయో విని వచ్చి యిట్లుసందుకొన్నాఁడు కార్యంబు చక్కనయ్యెఁగాంక్ష యొనఁగూర్ప ధగళుఁడే కలఁడటంచు. 518
తే. వచ్చి కల్పితసంభ్రమావార్య యగుచుమ్రొక్క దీవించునాతనిమోముఁ జూచియస్న యాశీర్వదించినయంతఫలమునీవు వచ్చినకతమున నేఁడు గలిగె. 519
సీ. మనయమ్మ కడుసుఖమున నున్నదే యయ్యపెద్దవాఁ డయ్యెఁగా పేర్మి నతనిఁబోషింతురే మీరు పొరచూపు లేక నాయరిది చెల్లెలి వచ్చి యత్తవారుతోడ్కొని పోయిరే దూరంబుగాన యేవార్తయు వినము మావదినె వేకటని వింటి నేబిడ్డఁ గనియెను మగవానిఁగనియెనో యది మేలుగాక యాఁడుతే. దాననై పుట్టి మిముఁ జూడఁ గానకిట్టులేను బడుపాటు చాలదా యెన్నఁడైనదలఁతురా నన్ను మీరు డెందంబునందునేల తలఁతురు మఱచిపోయితిరి నన్ను. 520
చ. చెలియలి పెండ్లి చేసితిరి చిల్లరపబ్బము లెన్నియైన శోభిలె నను నెన్నఁ డైనఁ బిలిపించితిరే పిలిపింపకున్న నేమలరెడుకూర్మి నాఁడుఁబడు చాసపడుం గద యంచుఁ బచ్చపోఁగులు గలచీర యంప నొనఁగూడకపోయెనె యేమి చెప్పుదున్. 521
తే. ఇపుడు మీపుణ్యమున నాకు నేమి కొదవయుండె నేను ధరింపఁగా నొకరి కీయఁగలదులే యందులకు నంట గాదు మీదయాతిదాక్షిణ్య మిటువంటి దంటి నింతె. 522
క. అనవలసి యంటి నిన్నుంగనుఁగొనుటే చాలు బడలికలు కనుపించెం
జనుదెమ్ము కంచ మిడినదియనుచుం గను గీఁటి పిలువ నాతఁడు మదిలోన్. 523
తే. కల్లవగజూదకత్తెలఁ గంటిఁగానియింతమాయల జగజంత నెండుఁగాననెట్లు నమ్మెడి దొర యీయింట దీనికడమనడతలు తెలుతముగాక యనుచు. 524
క. చని యది వడ్డింపఁగ భోజనకృత్యముఁ దీర్చి యంతఁ జలజాప్తుఁడు గ్రుంకిన దానికన్ను సన్నంగని కూటములో వసించె గంకటిమీఁదన్. 525
చ. మదవతి యంత నాత్మవిభు మన్మథకేళిని దేల్చి కూటి చొక్కొదవఁగ నిద్రఁజెందు పతి నొయ్యన నారసి లేచి చెంబుతోనుదకముఁ గొంచు ధూర్తమణి యుండెడి చోటికి నేగి మాయపున్నిదురవహించి యున్న యతనిం గరసంజ్ఞల లేపి యిట్లనున్. 526
క. ఏమోయి నిన్న నడిచిననామాటలు పొంచి విని ఘనంబై తగుమత్ప్రేమ యొనఁగూర్పవచ్చినసామివి గద నిన్ను మెచ్చఁ జనదే నాకున్. 527
ఆ. అందగాఁడ వగుదు వప్పుడె కంటి నీదారి మగఁడు నిద్రఁ దేఱి నన్నువెదకు నటకుమున్ను వేగఁ బోవలయు నీజోలి యేల ప్రక్కఁ జో టొసంగు. 528
చ. అన విని వాఁడుపల్కు భవదద్భుతచాతురిలో శతాంశమైనను గలదా మదీయనిపుణత్వము నేర్పరులందు నిన్ను నెన్నినఁ దగు మున్ను నాగుఱుతు నీవు నెఱుంగవు నిన్ను నే నెఱుంగనెకద యిట్టిచో నిజముగా నిలనాడితి గాన మాననీ. 529
క. అది యెంతయైన నున్నదెకద యీయద్భుతము జోక గలుగుట మేలౌముదిత కొఱగానివా విట్లాడవినచో మదనకేళి కొడఁబడఁ దగునే. 530
క. అన విని యది యిట్లను నామనముఁ గనన్వలసి పలుకుమాటలు చాలుమన యిద్దఱి ఘనసాహసమునకు న్ఫల మతనుకేళిమోదము గాదే. 531
క. చక్కనివనితా పురుషులకెక్కడి వావులు మనోజుఁ డెక్కడ నున్నాఁడక్కడఁ దగవులు నడచునెమొక్కలితన మేల మేలములు వల దింకన్. 532
క. అని పలుక మఱియు నాతఁడుమనసీయక యున్నఁ జూచి మంచిది పతిచేనినుఁ దునిమించెద ననుఁ గనుఁగొనరా యని బోఁటి పోటుకూఁతలు వెట్టెన్. 533
క. గడగడ వడంకి యతఁ డోపడఁతీ నీ వానతిచ్చుపనిఁ జేసెద నా
కడ నెగ్గుఁ దలఁపవద్దనియొడఁబడిన న్మంచిదని సముత్సాహమున్. 534
క. మది నాతని రక్షింపఁగనది యెంచెఁ బ్రభావతీ మహామతి వౌదేకద యెట్లు కావవలెఁ బదిపదిగ విచారించి తెలియఁబల్కు మ టన్నన్. 585
క. కోమటిమిటారి చిలుకానామతివిస్తార మేమనన్వచ్చు వచశ్శ్రీ మెఱయ నీవె తెల్పుమునా మంచి దటంచుఁ గీరనాథుం డనియెన్. 536
వ. ఇవ్విధంబున నమ్మదవతీవరారోహ యుపాయపరాయణయై యుండె నంతకమున్న కర్ణనిర్భేదనం బగుతదాక్రోశంబు నిద్రాభంగంబుఁ గావించుటయు నవ్వీరుం డదరిపడి లేచి కృపాణపాణియు వికటీకృతభ్రుకుటినిటలుండును నగుచు వచ్చు నంతకమున్న యయ్యింతి సమంతికప్రవర్తియగు నాధూర్తుని సవికారంబుగాఁ బడియుండు మని బోధించి యగాధవ్యధాబాధితయుం బోలె నిజనాథుని కెదురుగాఁ బఱతెంచి సాక్రందనంబుగా ని ట్లనియె. 537
క. పని గల్గి నీరపాత్రముగొని ముంగిటి కేగుదెంచి కోయనుకూఁతల్విని చేరిన వికృతాకృతిగని యున్నాఁ డన్న యేమి కతమో యెఱుఁగన్. 538
క. ఇన్నాళ్లు రానివాఁడేయెన్నిక లొనఁగూర్ప నిచటి కేతెంచెనొ మా
యన్ననుఁ గనుఁగొన రావేని న్నని వచ్చుట నుపేక్ష నించుట తగునే. 539
క. అన విని వదరకువే యాతని కేమియు లే దటంచు దాని పిఱుందంజని వీరుఁ డతని యాకృతగని త్రోవం గాలి సోఁకె గావలె ననుచున్. 540
తే. వెన్ను చఱచి ధవళ వెఱవకురా యంచుఁబలుక నంత నతఁడు తెలివి నొందివారిఁ జూచి లేచి మీ రేల వచ్చితిరేమి యెఱుఁగనైతి నింతతడవు. 541
చ. అనవుఁడు నవ్వి వీరుఁడు నిజాంబుజలోచనఁ జేరఁబిల్చి మంతనమున నీతఁ డొంటికి మనంబున భీతి వహించెనేమొ నీవినుఁ డుదయించుదాఁక వసియింపు సహాయముగాఁగ నంచుఁ బోయిన నగి ధూర్తుతోడ రమియించె వధూమణి యాస దీఱఁగన్. 542
క. అంతటఁ దెలతెలవాఱెంగాంతాయని పలుక వైశ్యకామిని యిచటన్వింత గదె తెల్లవాఱె శకుంతల యని యంతిపురము గుట్టునఁ జేరెన్. 543
తే. చేరి రేయి మహీకాంతుచెంత కరుగుదానితోఁ బూని తోయజోద్యన్మరందధార లూరఁగఁ గీత మోతరుణి యొక్కకథ విను మటంచు వెస నరికట్టి పలికె. 544
క. ఏలానగరంబున గోపాలుం డొకఁ డమరు విష్ణుభక్తుఁడు ధర్మాలోలమనస్కుఁడు తంత్రీపాలుం డనువాఁడు నిఖిలబంధుప్రియుఁడై. 545
సీ. పులుల వాకట్టుమందులు పాముబదనికల్పొదుగుచేపుఁడుమంత్రములను గోడెదామెనపగ్గము ల్తలత్రాళ్లు నురిత్రాళ్లుచిక్కంబులును జల్దిచిక్కములునుమాఱుమానిసిఁగన్న దూఱువేపులజోళ్లుకొలికిచెప్పులు జమ్ముగూడ లలఁతిపిల్లగ్రోవులు నెక్కువెట్టినవిండ్లు కంబళ్లు దుప్పట్లును వల్లెతాళ్లుతే. మొదలుగాఁగల పరికరంబులం గొఱంతలేక భూమీరుహచ్ఛాయలే గృహాళిగాఁగ వాఁడాలమందలం గాచుబాళినడవిమానిసియై తిరుగాఁడు నెపుడు. 546
చ. పిదికిన యాలపా ల్వెదురుబియ్యము కావడికుండ నించి యయ్యదుపతి కింద్రియంబుగఁ దదాహృతవహ్నిసమిత్పరంపరాభ్యుదయము నొందఁజేసి పయిపొంగలి వెట్టి భుజించు నాతఁ డింపొదవఁగఁ డేకుటాకుల వనోర్విని మందలఁ గాచువేళలన్. 547
సీ. మేర లెంచక సూరివారిండ్ల కేగి పాల్పెరుఁగు వెన్నలు మ్రుచ్చిలించె ననుచునీరాడుతఱి నాఁడువారుకట్టినపాఁతలెత్తుకపోయి చెట్టెక్కె ననుచుఁబ్రతుకుభాగ్యము క్రిందఁబడఁగ బాఁపనయిండ్లకరిగి యాఁకటికిఁ గూ డడిగె ననుచుఁగడపటఁ జుట్టాల గరితలపైఁటలోఁజెయి వేసి యేమేమొ చేసె ననుచుతే. వ్రాసికొన్నారు బాపనబైసిగాండ్రుకొలముస్వామి విచారించుకోక యిట్లుచేయునే యంచుఁ పెద్దలచేత వినెడుకృష్ణకథలందు నిటువంటి వెల్ల వినఁడు. 549
సీ. తులసిపూసలు బోడితలయు నడ్డాదిడ్డిపట్టెనామములు సంభ్రమము నొప్పఁబరువు లెత్తిన యెద్దుపై నొంటి తముకురానములును వేణునాదములు పొసఁగరచియించు తపముద్రలును బైఁపైఁబల్కుగోవిందలును హాస్య మావహింపనతిరసంబులఁబుట్టి యవనతులైన వారలకొసంగెడు దీవనలు సెలంగఁతే. గొలమువా రెంచఁగల గొల్లకొడుకుఁ గనఁగబంటులునువోలెఁ జుట్టము ల్వెంటనంటఁగోరి మ్రొక్కులు చెల్లించుకొఱకుఁగాఁగనాతఁ డేటేఁటఁ దిరుపతి కరిగివచ్చు. 549
క. వానికి మనోహర యనంగా నొకయంగన యెసంగుఁ గంతునితేజీకూనయన వానిగేదగిజీనీజముదాళి యనఁగ నేమ మెసంగన్. 550
క. శోభితముఖదారితశశివైభవ యాలోకన గురుప్రవర్ధితమదనప్రాభవ యెవ్వరితరమయ్యాభీరగభీరనాభి నభినుతి సేయన్. 551
చ. చనుగవయొప్పు నెన్నడుము సన్నదనంబు మెఱుంగులీనుమోమునఁగలతేట నెన్నడలముద్దును మాటలనేర్పు కోపుచూపునఁగల యందముం బిఱుదుపొంకముఁ గల్గినదానిఁ జూడగొబ్బునఁ బదివేలమన్మథులు పుట్టుదు రప్పురిఁ బల్లవాత్మలన్. 552
శా. మైనిగ్గు ల్తెరయెత్తగా నమృతకుంభంబంది యేతెంచు మాయానారాయణిలీలఁ దక్రఘట దీవ్యన్మస్తయై చూపులజ్ఞానమ్రత్వముఁ జెందఁ జల్లఁ గొనరో చల్లంచు నేతెంచుచోదానింజూచిన కంతుఁడైన రతిమీఁదం దప్పు గల్పింపఁడే. 553
క. ఆలీలావతి తంత్రీపాలుఁడు దినదినము మందపాలై తిరుగన్జాలిపడి మనసుఁ బట్టంజాలక పరపురుషభోగసంగతిఁ గోరెన్. 554
సీ. అరిది సిబ్బెపుగుబ్బ లన్యుచేతికి నిచ్చినప్పుడే చనదె శుద్ధాన్వయంబుపవడంపుజిగిమోవి పరుపంటిమొన కిచ్చినప్పుడే చనదె గుణార్జవంబు
మితిలేని మెఱుఁగుమే నితరుకౌఁగిటి కిచ్చినప్పుడే చనదె మహాభిమానమతనిఁ గన్మొఱఁగి యీగతి జారుఁబొందినసుద్దెఱింగిన రాజు బుద్ది చెప్పుతే. నింత యేమిటి కాజారుఁ డేలు టెంతతెవులుగొన నమ్మరాదంచుఁ దెలిసికొనరెయకట తిమిరంపునిండుప్రాయంబు కతననెఱుఁగ రింతియెకాక రాకేందుముఖులు. 555
ఉ. అమ్మహిళలలో లలామ వినుమాగతి జారులఁ గోరి కానికార్యమ్మగునైన మాకొలమురాధకు వచ్చినదూఱు నాకు రానిమ్మని నిశ్చయించి యెదురింటి గుణార్ణవనామధేయునింగ్రమ్మినబాళినంటి యెలప్రాయము చూఱలొసంగె వానికిన్. 556
సీ. ఒక తెల్వి వొడము నయ్యొఱపులాఁడికిఁ గమ్మతమ్మియందము గ్రమ్ము నేమొగముననొకనవ్వు వొడము నయ్యురగవేణికి మిన్నగన్న కెంపులవన్నె చిన్నిమోవినొకతళ్కు వొడము నయ్యువిదమిన్నకు మంచియంచగుంపులసంచు మించునడలనొకనీటు వొడము నయ్యురునితంబకు మేటిరంగుబంగరపుబెడంగు మేనతే. నత్తయానతి మజ్జిగ లమ్మువేళదానిదారున నీక్షించె నేని యింకజాలిమాటలు తలమీఁది చల్లకడవపడుటసైతము నెఱుఁగ దప్పడఁతి యపుడు. 557
సీ. ఆగుణార్ణవునియిల్లాలికి మెఱుమెచ్చుకూర్మితో వండినకూర వెట్టుఁగమ్మనేతులు చల్లకడవలోపల డాఁచిగోనిపోయి పురయామికుల కొసంగునేరంబులోమెడు నియతికానికి గట్టిమీగడ కనుక గాఁగ నిచ్చునాజ్ఞవెట్టఁగఁ గర్తలైనబంధులకు నెయ్యంబున నడుగని యప్పు లిచ్చుతే. దనవిధంబంత మెల్ల నేతప్పతార్చవలసి యీలీల మెలఁగు నవ్వనజగంధిజారవిద్యల కొడిగట్టు సతుల కింతయెచ్చరిక యుండవలయుఁ బూర్ణేందువదన. 558
క. వినుము ప్రభావతి నేమన్ననఁ దెలిపెదఁ జూపి మోపి యనుటయుఁ గాదాయని తలఁపకు మిఁక నీకైనను హెచ్చరి కింతలేక నడువం దగునే. 559
తే. తగనవధరింపు మవలికథావిశేషమమ్మనోహర యిట్లు గుణార్ణవునకుమేలునడియున్న నొక్కనాఁ డేలినాతఁడనుప నాతఁడు పొరుగూరి కరుగుటయును. 560
క. ఆఘోషాంగన మదనజ్యాఘోషం బితరవరసమాక్రమనిష్ఠా
ద్రాఘిష్ఠంబై మించె నిదాఘసమవియోగవహ్ని తనమది ముంచన్. 561
సీ. అదలించి పిదుకని యావులుండఁగ వేగదోహనధేనువుదూడ విడుచుబానలోపలఁ బచ్చిపాలుండ మించిచేమిరియిడ్డ పా ల్పొయిమీఁదఁ బెట్టుఁబేరి పక్వంబైన పెరుఁగుండఁ గవ్వంబుపులిచల్లలో నుంచి చిలుకఁబోవువెసలలో మూనాళ్ల వెన్న లుండఁగ నాఁడుకాఁచి డించిననెయ్యి కరఁగఁబెట్టుతే. దివమునను సంజకడయంచు దివ్వ లెత్తుదద్దరిలినట్లు నడురేయి ప్రొద్దుపొడిచెననెడుమతిఁ బాచిపనులు చేయంగఁబూనువలపువెఱ్ఱికిఁ జిక్కి యవ్వనజగంధి. 562
క. ఈరీతి నుండ మచ్చికదేర న్వలసినవియెల్లఁ దెప్పించుటకైవారసతు ల్బొజుగులతోబోరామి యొనర్పఁ బసులపొంగలి వచ్చెన్. 563
సీ ఇంక నాల్గావంబు లిడనైతిఁగా యంచుఁగుమ్మరి నెమ్మదిఁ గుందికొనఁగఁగుడుమురూకలకెల్లఁ గొననైతిఁగా యంచుబేరి తేరనియారి వేర మొందగొఱియమందల నించుకొననైతిఁగా యంచుగొల్లవాఁ డూరకే క్రుళ్ళుకొనఁగఁ
బెనుపసుపే విత్తు కొననైతిగాయంచుగాఁపు నిద్దురలేక కళవళింపతే. మొనసి వెలచూపిచూపకమునుపె వారిసరకు లమ్ముడువోయె నేజాతివారికేని బాటింపవలసి పేరెక్కినట్టియాదినంబున నంబురుహాయతాక్షి. 564
తే. అపుడు పొంగటికైన బియ్యంబుఁ దెమ్ముశీఘ్రముననంచు నొకరూక చేతికిచ్చియత్త పొమ్మన నమ్మనోహరతరాంగిసాంద్రమైనట్టి చెంగటి సంత కరిగె. 565
క. తండులములు గొని పుట్టికనిండం బెట్టుకొని రాఁడె నేఁ డైనను జారుం డని మదిఁ దలఁచుచు నమ్మిండం డేతేఱఁ దత్సమీహిత మొదవన్. 566
క. కనుచూపుమేర దానంగనుఁగొని యమ్మగువ యగునొ కాదో యనుచుంజను దెంచి గుణార్ణవుఁ డేగినకార్యము చక్కనగుటఁ గెరలిన తమితోన్. 567
క. అంత మనోహరుఁ గనుఁగొనిసంతసమున మనసు నిలుపఁజాలక యపుడేకంతురణకేళికై యువకాంతునితో నచట వల్లికాగృహసీమన్. 568
తే. చేరి పుట్టిక వెలుపలిచెట్టునీడడించి పొదలోని కరిగి యమ్మించుఁబోఁడి
జారుతోఁ గూడి తమ్మినేజావజీరుదురమునను దన్మయావస్థతో రమించె. 569
చ. అదిగని యొక్క ధూర్తవరుఁ డబ్బెర పొంగటి కంచు నెమ్మదింబెదరక మెల్లనే యరిగి బియ్యముఁ గైకొని యెంచరానినేర్పొఁదవఁగ గంపలోన సికతోత్కరము న్వెస నించిపోయినన్మదవతి జారుఁ బొందెడు సుమాళమె కాని యెఱుంగ దేమియున్. 570
తే. అంతఁ బొదరిల్లు వెడలి గుణార్ణవునకుబురముఁ జేరంగఁ బెఱత్రోవఁ బోవఁజెప్పుసందడిని గంపనయెత్తి మస్తంబుమీఁదఁదాల్చి కొనివచ్చె నది యాత్మ ధామమునకు. 571
ఉ. వచ్చిన నత్తగారు తలవాకిటికిం బఱతెంచి యింతసేపెచ్చట నేమి యంచని శిరోగ్రమునం దగుగంప డించి నేమెచ్చితిఁ గోడలా యిసుక మేదినిఁ బుట్టదటంచు నెంచియోతెచ్చితివంచు నాగ్రహమతి న్నెమకె న్వలెత్రాఁడు ముంగిటన్. 572
క. ఆయెడ నాగోపాంగనయేయనువున బొంకనలయు నెఱిఁగింపఁగదేకాయద్యుతినిర్జితశంపాయన నచ్చిలుకతోఁ బ్రభావతి యనియెన్. 573
క. చిలుకా యీచిక్కులు సంధిలుగాథలు నాకుఁ గానె నేర్చితివో కావలసి తలంపునఁ దలఁచితొతెలియదు గద యవలికథయుఁ దెల్పుము వేగన్. 574
వ. అనిన విని యాభామాలలామంబునకుఁ గీరసార్వభౌముం డిట్లనియె. 575
క. ఆదారి నత్త కినిసెనొలేదో యాలోన నుమ్మలించుచు నేనింకేదియుఁ జెప్పిన నిక్కముగాదే కద యనుచు గోపకామిని యేడ్చెన్. 576
క. ఆమాటలు విని యత్త దయామేదురహృదయయై ప్రియంబున నడుగంగోమలి యిట్లను గోకిలకోమలకాకలిని గేలిగొనియెడి పగిదిన్. 577
తే. ఓపలేనన్న వినక కెం పొదవు చూడ్కినంపఁగా నేను మీకు మాఱాడ వెఱచిసంత కేగితిఁ గద యందు సరఁగఁ జెఱఁగుముడి విడువ రూక వెస జాఱి పడియెనమ్మ. 578
క. వెదకితి నచ్చోఁ గానకకద యంతటఁ బ్రొద్దువోవఁగా భయమున నెమ్మది నింటికిఁ జని తూర్పెత్తెద నని యచ్చోటి యిసుము దెచ్చితి గంపన్. 579
చ. వెలుపల వడ్డి కిచ్చినను వీసము వచ్చును నట్టు లాయెనోబలబ వేగ వచ్చు నలబాపని కిచ్చినయట్టు లాయెనోయలయక నాల్గుచట్ల పెరుఁ గమ్మినఁ జేతికి రానిరూక నావలె నలసంతలోనఁ బడవైచిన వారలఁ గాన నెచ్చటన్. 580
క. అని పల్క నత్త కనికరమున రావే యెంత లేదు పోయిన యపుడేమనసొమ్ముగాదు వగవకుమని యూరార్పంగ నది గృహంబున కరిగెన్. 581
క. ఇట్టివగఁ గనినఁ జనుమాగట్టిగ నని చిలుక పలుకఁగాఁ దమితోడన్నిట్టూర్పు నిగుడఁ గోమటిపట్టపుదేవేరి కేళిభవనం బెనసెన్. 582
క. ఆపగలు గడవఁబడుటయుభూపతిభవనంబుఁ జేరఁబోయెడుతఱి నాకోపనఁ గనుఁగొని సుమనశ్చాపుని యెకిరింత సంతసం బుప్పొంగన్. 583
శా. కోగ్రగ్రావభిదాదికీర్తితగుణవ్యూఢోహగాఢత్రినేత్రగ్రావోద్ధరణోగ్రబాహుబలగర్వగ్రంధిలంకాధినాథగ్రీవగ్రసనోజ్జ్వలాద్భుతభుగస్త్రస్థేమవాతూలభుగ్భుగ్రాజత్పటుశౌర్యవైభవహృతాంభోధిప్రభుప్రాభవా. 584
క. భోద్రేక బ్రథ్నవచఃకద్రూభవభూరిభావుకప్రాభవ దైత్యాద్రివరధ్వంస సదక్షుద్ర కృపావీక్ష భానుకులహర్యక్షా! 585
హంసయానవృత్తఖడ్గబంధము—దారితారిభూరిధైర్యధామధామభూరుహాభారతీశవంద్యశౌరి భాస్వదబ్జలోచనా
నారదస్తుతప్రభావనవ్యమేఘసన్నిభాభారతీశశాంకకీర్తిభాసుసూరిరంజనా! 586
గద్య. ఇది శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధార పాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయక ప్రణీతంబైన శుకసప్తతియను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.
Comments
Loading comments…