నలుబదియవకథ
శుకసప్తతి
గీ. చిలుక చిలుకలకొలికితోఁ జెప్పఁదొడఁగెఅమ్మ! వినవమ్మ తారకాచలమునందునొక్కనాఁడు మహాదేవుఁ డుబుసుపోకశ్రీకరోద్యానవనవాటిఁ జేరి యచట. 295
సీ. ప్రమథు లిర్వంకల బలసికొల్వఁగ రుద్రకన్యకామణు లూడిగంబొనర్పభృంగి హాస్యక్రియారీతి నృత్యము సల్పచండీశ్వరుఁడు గుణస్తవ మొనర్పవిఘ్ననాథుఁడు పురోవీథి ముద్దులు చూపశరసంభవుఁడు బరాబరి యమర్పనందివాహనము చెన్నొంది మ్రోల నటింపవీరభద్రుఁడు జయోద్వృత్తిఁ దెలుపగీ. తండులాస్యంబునకుఁ దరుల్ తగఁ జిగుర్చునట్లు గాంధర్వరసపూర్తి నలరుజాయనంబికాదేవితోడ నెయ్యమున నభవుఁడుచితసింహానస్థుఁడై యుండునపుడు. 296
క. అమరేశ్వరాదిదిగధిపులమరవరుల్ జపతపోమహర్షులు దమకున్సముఖంబు లేమి దృఢ భక్తి మరిన్ తమకడకుఁ జేరి ద్రిమ్మరువేళన్. 297
సీ. పసుపంటుజిలుగుదుప్పటి యంచుముత్యముల్వరుసఁ గన్పడు వల్లెవాటు దనర
చెంపనించుకజారు సిగనొప్పు సంపంగిమడుపుటెత్తులతో రుమాలు మెరయఘర్మాంబుబిందు సంగతి నొకింత రంగుబొట్టు కస్తూరితావి బుగులుకొనఁగవెలిదమ్మిఱేఁకులు తెలివిఁగుల్కెడు దీర్ఘనేత్రాంతములఁ గొంత నిదురదెలుకగీ. కరములను నీరు కలవొట్టు కప్పురంపువిడెము పుక్కిట కడుచిక్కుపడినహారలతయుగంబునఁ బొసఁగ నుల్లాస మొసఁగవచ్చె నలకూబరుఁడు దుర్వారుఁ డగుచు. 298
చ. అపుడల పార్వతీరమణుఁ డన్నలకూబరుఁ జూచి జాతికొంచెపువగ నేగుదెంచె నని చాల మనంబున నెంచి యోరి! నీవపరిమితప్రమత్తుఁడ వహంకృతిచిత్తుఁడ విట్టు లంతరంగపు కొలునైనవేళ మముఁ గానఁగ నర్హుఁడవే గణింపఁగన్. 299
క. నీ వధమవర్తకుఁడవుగావున మాసముఖమ్ము గడియం దగునేభూవలయమ్మున మర్త్యుడువై వర్తిలు మనుచు శంభు వానతి యొసఁగెన్. 300
వ. మనమునఁ గడు బెగడొందుచువిని ధనదసుతుండు సభయవిహ్వలమతియైయనియెం బ్రణమిల్లి జగజ్జనకా! యీత ప్పొకింత సైపుమటంచున్. 301
లయ గ్రాహి. శంకర నిశాచర భయంకర శివాహృదయపంకరుహభృంగ లకలంకకుచిమద్వీ
క్షాంకురతటస్థమకరాంక! (వృషభేశ్వర శు)భాంక! మకుటస్ఫుటమృగాంకనవరేఖాలంకరణ! భక్తజనపంకహరణా! భనవిసంకటకళంకహర! కింకరు ననున్ క్షేమంకరుఁడవై మనుపు మంకిలి యొనర్పక నిరంకుశకృపారసవిశంకట! నమస్తే. 279
క. పరమగురుద్రోహి ననుంగరుణించఁ గద యనన్య(గతికుఁడ ననినన్)గిరిజావల్లభుఁ డతనికిఁగరుణామతి నిట్టులనియెఁ గడుప్రియ మెసఁగన్. 280
ఉ. మే మొకమాట దెల్పెదము మించి మదీయవచోవిశేషసంరామహిమం బొకింతయును దప్పదు తప్పక యున్న నేమి లక్ష్మీమహనీయవైభవసమృద్ధియు బుద్ధియు మోహనాంగరేఖామహిమంబు నీకుఁ గలుగం గృప సేసితి నమ్ము నెమ్మదిన్. 281
క. విమలమతుల్ మద్భక్తులుసుమతీహరదత్తు లనఁగ క్షోణిం గల రారమణీరమణులకు మనఃప్రమదముగ జనింపు మమితభాగ్యోన్నతివై. 282
తే. అన విని మహాప్రసాదం బటంచు వచ్చియిందుశేఖరు నానతి నిందుఁ (బొడమె)మదను నాహ్వయమునను నోమగువ! వైశ్యతల్లంజుండైన (నీ) ప్రాణవల్లభుండు. 283
క. వింటివొ యన నల భామినిగెంట తల యూఁచి మెచ్చి కీరపరుని నీ
వంటి మహామహు డుండఁగవింటి మనోభీష్ట మెల్ల వెలయఁగ గంటిన్. 307
గీ. ఎంత సుజ్ఞాననిధివి నీ వెంత ఘనుఁడవెంత నిను మెత్తు నని పల్కు నంతలోనచుఱుకు చుఱుకున నరుణవిస్ఫురణ మెఱయకరకరని తోచె తూర్పున ఖరకరుండు. 308
ఉ. ఆల్ల ప్రభావతీరమణి యంత నిశాంతముఁ జేరి నాఁటిరేయల్లన కుందనంపుజిగియందపు మైఁగయిసేసి నేటి కీహల్లకభల్లతీవ్రనిశితాస్త్రహళాహళి కోర్వజాల రంజిల్లఁగ రాజశేఖరుని జేరి సుఖించెద నంచు నెంచుచున్. 309
గీ. రామచిల్కకు మేలోగిరంబునానవాలుచక్కెరరసదాడిపాలచెఱుకులరఁటిపం డ్లిడి పసపార్చి యక్కు చేర్చిసెల వొసంగుమన్న నాముద్దుచిల్క యనియె. 310
క. రంభవు నీవు విలాసవిజృంభణమున నిన్ను గనిన చిత్తజుఁ డైనన్శుంభద్రతితంత్రకళారంభమునకుఁ దానె కదిసి ప్రార్థించుగదే! 311
సీ. ఇంద్రాదిదిక్పతులైన నీవడిపంచబడి యందలములలోఁ బరివసింపపోటుబంటులు నిజాద్భుతరణప్రాభవంబులు గోరికొనుచు నీ కెలను గొల్వ
Comments
Loading comments…