నలుబదియొకటవకథ
శుకసప్తతి
వంటి మహామహు డుండఁగవింటి మనోభీష్ట మెల్ల వెలయఁగ గంటిన్. 307
గీ. ఎంత సుజ్ఞాననిధివి నీ వెంత ఘనుఁడవెంత నిను మెత్తు నని పల్కు నంతలోనచుఱుకు చుఱుకున నరుణవిస్ఫురణ మెఱయకరకరని తోచె తూర్పున ఖరకరుండు. 308
ఉ. ఆల్ల ప్రభావతీరమణి యంత నిశాంతముఁ జేరి నాఁటిరేయల్లన కుందనంపుజిగియందపు మైఁగయిసేసి నేటి కీహల్లకభల్లతీవ్రనిశితాస్త్రహళాహళి కోర్వజాల రంజిల్లఁగ రాజశేఖరుని జేరి సుఖించెద నంచు నెంచుచున్. 309
గీ. రామచిల్కకు మేలోగిరంబునానవాలుచక్కెరరసదాడిపాలచెఱుకులరఁటిపం డ్లిడి పసపార్చి యక్కు చేర్చిసెల వొసంగుమన్న నాముద్దుచిల్క యనియె. 310
క. రంభవు నీవు విలాసవిజృంభణమున నిన్ను గనిన చిత్తజుఁ డైనన్శుంభద్రతితంత్రకళారంభమునకుఁ దానె కదిసి ప్రార్థించుగదే! 311
సీ. ఇంద్రాదిదిక్పతులైన నీవడిపంచబడి యందలములలోఁ బరివసింపపోటుబంటులు నిజాద్భుతరణప్రాభవంబులు గోరికొనుచు నీ కెలను గొల్వ
సోమయాజులు బహుస్తుతులు చేయుచు ప్రేమబొదలని ముంగిట నొదిగియుండసన్యాసు లతనుజర్జరితసర్వాంగులైయలర నీపాదంబు లాశ్రంయింపగీ. అందఱికి నన్నిరూపంబు లగుచుఁ జెలఁగిభువనమోహనశృంగారభవనమైననీమహిమ నీ వెఱుంగక నేఁటి కిట్టులొక్కనృపమాత్రునకుఁ జిక్కి యుండఁదగునె. 312
క. అని పల్క నద్భుతంబుగవిని సురలోకముననుండి వెస నే నిచటన్జనియింప నేమిగారణమనుడు ప్రభావతికి యల శుకాగ్రణి యనియెన్. 313
క. నలకూబరుండు హాలాహలకంధరు నాజ్ఞ నిచటి కరిగెడునాఁ డోలలనా! నీవు పితామహుకొలువునకుం జత యమర్చికొనియెద వచటన్. 314
గీ. అమ్మహాప్రభుఁ బొడగాంచి "యజ్ఞభవ! పురాణపురుష! సరస్వతీప్రాణనాథ!సకలజంతువినిర్మాణచతురహృదయ!"యనుచు కైవార మొనరించి యాతురంబ. 315
సీ. కాశ ధరించి రంగస్థలంబున నిల్చుచెలువ మాయజుఁడైన తలపఁగలఁడెసభ విస్మయమునొంద యభినయము ఘటించుమెలకువ గురుఁడైన మెచ్చఁగలఁడె
కరలక్షణప్రయోగరమణచాతురియభినుతింపఁగ, శేషుఁడైనఁగలఁడెకలికికన్నులకటాక్షంబు లంభోజాతశరుఁడైన మరలింప చాయఁగలఁడెగీ. ఔరయని చూచువారెల్ల యభినయింపకలికివాల్ జూపులను శిరఃకంపనములయొరపుటెలనవ్వు ముద్దు మైసిరి బెడంగుమించ నటించుటయు న వ్విరించి గాంచి. 316
గీ. మెచ్చితి వరంబు వేఁడు మో మచ్చకంటియనుచు వచియించువేళ నీయనుగుచెలి యొకర్తె నలకూబరుఁడు ధాత్రి గదియువార్తవిన్నవించిన మదిలోనఁ జిన్నఁబోయి. 317
చ. కడు బెగడొంది సోగతెలిగన్నుల గుల్కెడు నీరు గ్రుక్కుచున్, సిడిముడుపాటుతో నలకుశేశయగర్భపదాంబుజద్వయం, బిడి కడతేర నీవిరహభారభరం బిక మద్భుజంగు నెన్నడు గనుగొందు నొక్కొ కరుణామతి నానతి యిమ్ము నావుడున్. 318
ఉ. నీనయమార్గవైఖరికి నే మది మెచ్చితి నీలవేణిరోనీనలకూబరుండు ధరణీస్థలికిన్ శివునాజ్ఞ నేఁగుటన్పూని త్వదీయమోహపరిపూర్ణమతిన్ వెతనొందియున్న నిన్నా నవమోహనాంగు నెనయన్ సమకూర్చెద నమ్ము నెమ్మదిన్. 319
గీ. అల్ల హరునాజ్ఞ దప్పింప నలవిగాదుకాకయుండిన నేమి భూలోకముననె
నీకు నలకూబరునితోడ నిర్జరేంద్రపురి ననుభవించునట్లుగ నెఱి నమర్తు. 320
ఉ. కావున నీమనంబునకుఁ గాక వహించఁగ నేల పొమ్ము ధాత్రీవలయమునం దవతరింపు మటంచు వచించునంత నాఁడీవరవైశ్యవంశమున నేపుదలీిర్ప జనించినావు రంభా వనజాక్షి వీవ మితభాగ్యశుభోన్నతివో ప్రభావతీ. 321
క. అనిపల్క జగచ్ఛక్షుండనువీరనృసింహుఁ డుగ్రుఁడై తిమిరమహాదనుజేంద్రు నేపడంచుటగని కాంత నిజాంతిపురము గదిసె నరేంద్రా! 322
గీ. అలప్రభావతి మఱునాఁ డహఃపయోధినానృపాలుని నవమోహనాంగసంగమైకవాంఛాపదము నొయ్యన తనించిమించి కురుమాపు నెఱసంజ మెఱయునంత. 323
చ. చిలకలకొల్కి మేన గయిసేసి నృపాలునిచెంతఁ జేరగాఁదలచి శుకాధినాథునరుతన్ వెసనిల్చినమాత్రశూన్యదిక్తలమున గౌళి నిల్వబలుకన్ విని సంశయమంది కుందుచోచిలికెడుప్రేమ నిట్టులను చిల్క సుధారసధార లొల్కగన్. 324
గీ. దుష్టశకునము విననయ్యె తోడ నేమియనుభవించంగవలయునో యని తలంచిమిగుల దిగులొంద నేటితో మీననయన!యదియె మంచిదటంచు నీమది గణింపు. 325
Comments
Loading comments…