నలువదిరెండవకథ

శుకసప్తతి

నీకు నలకూబరునితోడ నిర్జరేంద్రపురి ననుభవించునట్లుగ నెఱి నమర్తు. 320

ఉ. కావున నీమనంబునకుఁ గాక వహించఁగ నేల పొమ్ము ధాత్రీవలయమునం దవతరింపు మటంచు వచించునంత నాఁడీవరవైశ్యవంశమున నేపుదలీిర్ప జనించినావు రంభా వనజాక్షి వీవ మితభాగ్యశుభోన్నతివో ప్రభావతీ. 321

క. అనిపల్క జగచ్ఛక్షుండనువీరనృసింహుఁ డుగ్రుఁడై తిమిరమహాదనుజేంద్రు నేపడంచుటగని కాంత నిజాంతిపురము గదిసె నరేంద్రా! 322

గీ. అలప్రభావతి మఱునాఁ డహఃపయోధినానృపాలుని నవమోహనాంగసంగమైకవాంఛాపదము నొయ్యన తనించిమించి కురుమాపు నెఱసంజ మెఱయునంత. 323

చ. చిలకలకొల్కి మేన గయిసేసి నృపాలునిచెంతఁ జేరగాఁదలచి శుకాధినాథునరుతన్ వెసనిల్చినమాత్రశూన్యదిక్తలమున గౌళి నిల్వబలుకన్ విని సంశయమంది కుందుచోచిలికెడుప్రేమ నిట్టులను చిల్క సుధారసధార లొల్కగన్. 324

గీ. దుష్టశకునము విననయ్యె తోడ నేమియనుభవించంగవలయునో యని తలంచిమిగుల దిగులొంద నేటితో మీననయన!యదియె మంచిదటంచు నీమది గణింపు. 325

క. అది యెట్టు లనిన విను నెమ్మది చెలంగ నీవిభుఁడు మమతం మఱిడెబ్బదినాళ్లనాటి కిలుజేరుదు నని వాక్రుచ్చి చను టెఱుంగవె మగువా! 326

వ. కావున. 327

ఉ. నేఁ డతఁ డిల్లు జేరు రమణీ! వెస డెబ్బదినాళ్లు సెల్లె నీపోఁడిమి నీ వెదుర్కొని విభుం గని మ్రొక్కి రహస్యలీల నీవేడుక లుప్పతిల్ల తనువిందొనరించి ప్రియంబునన్ రతిక్రీడల దేలవమ్మ సుచరిత్రలు ని న్ననయంబు మెచ్చఁగన్. 328

వ. అని వచియించుచిలుకం గనుగొని ప్రభావతి యిట్లనియె. 329

గీ. కంటిపడ వేసుకొంటి నోకథలకారిముద్దురాచిల్క నిను నమ్మి మోసబోతినింక నే మనగలదాన నేమి సేతుననుచు దీనానులాపంబు లాడుటయును. 330

క. ప్రాణ మనిత్యము నిత్యముమానంబని కావు ప్రాణమానంబులలోమానమె కాయందగు ననుమానం బిక నేల నిలుపు మానం బనియెన్. 331

వ. ఆసమయంబున. 332

సీ. బహువిధసంభారభారముల్ తోనున్నపెరికిటెద్దులుగుంపు లొనసిగొనఁగస్ఫుటసుగంధజలప్రపూర్ణములైనట్టికంచికావళ్ళశృంగార మెసగ

భాస్కరపండితప్రముఖదేవబ్రాహ్మణాళి యాశీర్వాదనాద మెసఁగభవ్యసాధ్వీహస్తపాదార్పితంబులైవితతవైఖరుల నారతులు బొసగగీ. బహువిధంబుల రాజవైభవము మెఱయబంధు లిరువంక నొరయ సౌభాగ్యలీలతననగరు జేరె శుభముహూర్తమున వేట్కవెల్లివిరియంగ మలయజావల్లభుండు. 333

క. అంతట తత్కాంతామణిపొంతన తనప్రాణవిభు పొడగనియు మహీకాంతునిరతి సమకూడనిచింతన్ వెసకానరాని శృంగారమునన్. 334

గీ. జారి మండికొనినచందాన తనమేనిచెలువ మపుడు పతికి సెలవు చేసిగంటుతోడ మిత్రగణ మెన్న సమధికశ్రీల కాపురంబు చెలఁగుచుండె. 335

వ. తదనంతరంబ. 336

చ. తనతలిదండ్రులం గని యథావిధి భోజన మాచరించి పెంచిన శుకసార్వభౌముని భజించి ప్రియం బొనరించి సౌర్వభౌమున కతిలోకవస్తువులు ముంగలకానుకగా నొనర్చి పేర్చినముద మొప్ప నమ్మదనసేనుఁడు నెమ్మది నుండు నంతటన్. 337

క. చిలుక దను మోసబుచ్చుటయలమిన్ తద్వైశ్యవరుఁ డిలు సేరుటయున్

కలకంఠీమణిదూతియు చనితెలుపన్ విని యన్నరేంద్రతిలకం బలుకన్. 338

ఉ. హల్లకపాణిపొందు మది నర్మిలిగోరుట చందమామ గ్రుక్కిళ్ళయినట్టులయ్యె పవళింపగ నేఁ డిక నేమి సేతు నీపల్లవికార్యసంఘటనభావ మెఱుంగక యింత సేసె నాయుల్లము తల్లడిల్లెడు నయో యని మోహవిషాదవేదనన్. 339

క. ఈరీతి నుండనేమోకారణమున కీరమయ్యె గావలె దీనిన్జేరి యది తెలియదగుననియారూఢి వివేకశాలియై విభువిభుఁ డెలమిన్. 340

గీ. మదనసేనునియెఱుక నమ్మదనుతేజినంతిపురిలోన నపరంజి యరిది పనులవింత నొకమేడనుండి యేకాంతవేళసమ్ముఖంబున రావించి సవినయముగ. 341

క. ఓరాజకీరశేఖర!నీరసికత మది గణించనేర్తునె యని నీవేఋషియంశంబున యవతారము నొందితివొ విబుధధర్మము వెలయన్. 342

చ. అనుటయు సంతసించి వసుధాధిపునిం గని చిల్క పల్కు నోయనుపమశౌర్య! నే శుకమహర్షివరేణ్యుఁడ నీప్రభావతీవనరుహగంధి ప్రాక్తనభవంబున మమ్ము భజించియుండె నానెనరున సంధిలన్ గనుగొనన్ జనుదెంచితి నీశుకాకృతిన్. 343

ఉ. వచ్చి ప్రభావతీవికచవారిజలోచన మమ్ము గొల్వ నేనిచ్చరహించువేళ జగతీశ కులార్ణవపూర్ణచంద్ర! నీ

వచ్చినప్రేమ నన్బిలువనంపుట కెద్ది గతంబు తెల్పవేమచ్చిక నన్న యానృపకుమారుకు డత్యనురాగవైఖరిన్. 344

వ. ఆప్పు డయ్యప్రతిమప్రభావంబుగల లీలాశుకంబునకు సకలవివిధోపచారంబుల సమంచితోపమకుటసబహుమానంబుగా యతని సాక్షాద్దైవమని మనంబున భావించి ప్రదక్షిణప్రణామసంభావనపూర్వకంబుగా మృదుమధురగంభీరభాషణంబుల నిట్లనియె. 345

ఉ. కామకళాశుభాకరశుకప్రవరున్ గనుగొంటి నేడు నాబాములు వీడుకొంటి నను ప్రాఙ్ముఖుఁ జేయదలంచికొంటి నాస్వామియు నీవెకా మఱి కృతార్థుఁడ నీదుసుబుద్ధి వింటె నింకేమి యొనర్తు దెల్పగదవే యన కీరవరేణ్యుఁ డిట్లనున్. 346

క. వామాక్షీజనమోహనకామాంధుం డైనయతనికథ విను మును సుత్రామముఖు లనుభవించినబాముల మది దెలియు మోనృపాలకతిలకా! 347

సీ. కాకుస్థకులుఁడవై కలనృపుల్ నినుగొల్వమఖుఁ డేజగద్ధితమహిమ నొందెపడరాని యిడుముల బడియు బొంకు నెఱుంగకలహరిశ్చంద్రుండు నలసి యలసియల్ల విశ్వామిత్రు డతిబన్నములవెట్టరాజమార్తాండుఁడై గ్రాలెగాదె

సామ్రాజ్యవైభవశాశ్వితుఁ డయ్యునుజనకుఁ డత్యంతసుజ్ఞానదీప్తిగీ. యతులితోత్సాహవిదితమై యలరునట్టిమహిమ వెలయు సద్భక్తసామంతశాలివగుచు వైరాజ్యవంతుఁడవై సమస్తరాజ్య మేలగదయ్య యోరాజవర్య! 348

Comments

Loading comments…