ప్రథమాశ్వాసము
శుకసప్తతి
శ్రీకమలాక్షియై మెలఁగు సీత తటిద్రుచి నొంద లక్ష్మణశ్రీకరబాహుదండమునఁ జేర్చుధనుర్లత యింద్రచాపశోభాకృతిఁ దాల్ప మేరుశిఖరాశ్రయనీరదలీల సింహపీఠీకమనీయుఁడౌ జయపటిష్ఠుని శ్రీరఘురాము నెన్నెదన్. 1
మ. వరవామాంకమృగేంద్రపీఠి నెలమి న్వర్తించి ప్రాంచత్కృపాకరవీకాంకురచంద్రిక న్సకలలోకశ్రేణి నీడేర్చుచున్
వరసౌభాగ్యధురీణ యౌ జనకరాడ్వంశాబ్ధిజాత స్సువర్ణరుచిస్ఫూర్తిసమేత సీతఁ ద్రిజగన్మాతం బ్రశంసించెదన్. 2
మ. మును శేషత్వముఁ బారతంత్ర్యమహిమంబుం దాల్చి లక్ష్మీప్రియుంగని సేవించి యతండ రాముఁ డయి జోకన్ ధాత్రి నుండంగ నింపున శేషత్వముఁ బారతంత్ర్యమహిమంబుం దాల్చి సేవించి మించిన శ్రీలక్ష్మణదేవు నాత్మఁ దలఁతున్ శ్రీవాక్ప్రభావాప్తికిన్. 3
మ. సిరులొప్పంగ రఘూద్వహుండు సుజనక్షేమంకరోద్వృత్తిమైనరుదార న్మణిభద్రపీఠమునఁ గొల్వైయున్నచో ఛత్రచామరముల్ మ్రోల వహించి చి త్త మలరింపం జాలి భక్తాలి బంధురపాపౌఘభయఘ్నులౌ భరతశత్రుఘ్ను ల్ననుం బ్రోవుతన్. 4
సీ. పరిపక్వసహకారఫలమా సముద్దండమహనీయమార్తాండమండలంబుతూలికాఘటితకందుకమా నభశ్చుంబిదృఢతరద్రోణధాత్రీధరంబుబిసకాండవిసరమా యసమత్రిలోకవిద్రావణాసురమహారాజబలముక్రీడానివాసమా కృతశాంబరీభయంకరనక్రవరగర్భగహ్వరంబుతే. బళిర యీలీల యని సురల్ ప్రస్తుతింపనలరి శ్రీరామచంద్ర పాదారవిందవందనానందరససుథాస్పందహృదయుఁడగుసుధీమంతు హనుమంతు నభినుతింతు. 5
క. వాణి న్వీణాపుస్తకపాణిన్ శుకవాణి విపులభాసురపులినశ్రోణి న్బలభిన్మణిజిద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్. 6
ఉ. ముద్దులుగుల్కు శైలసుతముందఱ శైశవలీల నాడుచోనొద్దికనున్న తండ్రి తలయూఁచ జటామకుటాబ్జరేఖపైనిద్దపునబ్జమోహమున నెమ్మిఁ గరాగ్రము సాఁచు వేలుపుంబెద్ద గణేశుఁ గొల్తు మదభీప్సితకావ్యకళానిరూఢికిన్. 7
మ. కవితాకన్యకల న్సువర్ణసదలంకారప్రయుక్తిన్ యథార్హవరప్రాప్తి నమర్చి కీర్తినిధులై యాచంద్రతారార్కమైభువి వర్ధిల్లఁగఁ జేయుపుణ్యుల మదిం బూజింతు వల్మీకసంభవుల వ్యాసులఁ గాళిదాసముఖుల న్మత్కావ్యసంసిద్దికిన్. 8
తే. ధృతి దురాచారమతి నేకదృష్టివలనబహుపదార్థపరిజ్ఞానపటిమ లేకకర్ణకటువుగ వదరెడు కాకవులనుగాకవు లటంచు నెంచి తృణీకరింతు. 9
వ. ఇవ్విధంబున నిష్టదేవతానమస్కృతియును సకలసుకవిజనపురస్కృతియును గావించి సమంచితసకలరసానుబంధబంధురంబగు నొక్క మహాప్రబంధంబు నకళంకరాకానిశాకరకరనికరానర్గళగళిత సుధారసధారామాధురీధురీణ వాగ్ధోరణీనిబంధనంబుగఁ జెప్పంబూనియున్నసమయంబున నొకనాఁటి శుభావహగరీయం బైనవిభావరీతుర్యయామంబున. 10
సీ. మరకతంబులయొప్పు మైనుప్పతిలనొప్పుగోమువాఁ డెలనవ్యుమోమువాఁడువనజాతములబింక మెనయుకన్గవ పొంకమమరువాఁ డొకవింతమకొమరువాఁడుచిలిక్రొంబగడంపు జిగిగుంపురవణంపుమోవి వాఁ డెనలేనిఠీవివాఁడుమిసిమిబంగరుచేల పసమించుకటిలీలఁజెలఁగువాఁడు శుభాప్తి మెలఁగువాఁడుతే. దివ్యకోదండశరకాండధృతకరాబ్జయుగమువాఁ డెన్నరానిసోయగమువాఁడుజానకీలక్ష్మణులతోడ స్వామి రాముఁడెలమిఁ గలలోన నా చెంత నిలిచె నంత. 11
క. కని విస్మయసమ్మోదములెనయ న్భయభక్తియుక్తహృదయుఁడనగుచున్వినయస్థితి నల్ల జగజ్జనకున కే నతు లొనర్చి సంప్రీతుఁడనై. 12
క. ఉన్న తరి నన్నుఁ జూచి ప్రసన్నాననుఁడై సుధారససదృశమృదువాక్యోన్నతి శుకసప్తతికృతిచెన్నలర మదర్పణంబు సేయుకుమారా!
క. ఈవిధమున మాయనుమతిఁగావించితి వేని సకలకవిబుధజనసంజీవన మై నీవంశముపావన మై వెలయు మత్కృపామహిమాప్తిన్. 13
తే. సారమై శౌరికేళికాసారమైనపాలమున్నీటివలన సంభవము నొందెఁగువలయామోదకారియై కుటిలచక్రహారియై సత్కళాధారి యైనరాజు. 15
క. ఆయమృతాంశుఁడు త్రిజగద్గేయుం డగురౌహిణేయుఁ గిల్పిషహరణో
పాయున్ సంశ్రితనికరవిధేయు న్భుధనామధేయు ధీయుతుఁ గాంచెన్. 16
క. ఆతనికి గల్గెఁ బురూరవుఁడతఁ డాయువుఁ గాంచె నహుషుఁ డా పుణ్యునకున్సుతుఁ డతఁడు కనియెఁ దనయుందతవిభవోన్నతి యయాతిఁ దద్వంశమునన్. 17
మ. భువనాధారవిహారి యైనహరి యాపుణ్యాత్మునామంబుచేభువి భాసిల్లు కులంబునన్ హరిహరాంభోజాసను ల్మెచ్చ సంభవుఁడై ధాత్రి నరాతిజాతి భయకంపంబెల్ల వారించి సంస్తవనీయుం డననొప్పె నాతఁడు యదుక్ష్మాభర్త పొల్చున్ మహిన్. 18
ఉ. ఆమహితావతంసకుల మాత్మసముద్భవహేతుభూతమైధీరతఁ బాలవెల్లి జగతిం దగెఁ దన్మహిమం బపారగంభీరఘనాఘసంభరణభీమబలప్రతిభాప్తిఁ గాంతు నంచారయఁ బాలవేకరికులాఖ్య వహించె సుదంచితోన్నతిన్. 19
ఉ. ఆమహితాన్వవాయవసుధాధిపు లచ్యుతగోత్రపాత్రు లుద్దామభుజాపరాక్రమవిదారితఘోరమదారివీరులైభూమి భరించి రానృపులభూతి మహోన్నతి నేలె భోగసుత్రాముఁడు తాడిగోళ్ళపురధాముఁడు శ్రీపెదయౌబళుం డిలన్. 20
సీ. తనమాట శకయుగంధరలాటనృపవరుల్వినయోక్తిఁ గడు గారవించి మెలఁగఁ
దనకీర్తి దశదిగంతరపూర్తి నేవేళనిండారుపండువెన్నెలలు గాయఁదనథాటి రిపు మహీధవకోటి కద్రిగంహరకుటీరములఁ గాఁపుర మమర్పఁదనదాన మర్థిలోకనిదాన మనఁ గర్ణఖచరామరాగవైఖరులఁ బొసఁగఁతే. దనమహోగ్రప్రతాప ముద్దండచండభానుమండలి నొరయ సౌభాగ్యవిభవరాజ్యలక్ష్మీసహాయుఁడై ప్రబలె రూపభావజనిభుండు పెద్దయౌబళవిభుండు. 21
సీ. రాయదత్తాశ్వవారణరత్ననవరత్నహారాంబరంబు లేయధిపుఁ డందెనళెరామరాజేంద్రబలవద్రిపులఁ ద్రుంచుకలని కేధీరుండు కర్త యయ్యె(?)కదెరాకమునతెర్క మొదలుగల్గుబహురాజ్య మేశౌర్యమహితుఁ డేలెగురుదేవతాపాదసరసీరుహార్చనాపరత నేనిపుణుండు ప్రౌఢి గాంచెతే. నతఁడు వెలయు సమగ్ర హాహవోగ్రసప్తకసహస్రచాపభృత్సైన్యజితమదాహితెంగాగ నుద్రుండు(?) తాడిగోళ్ళజలధిచంద్రుండు పెద్దయౌబళవిభుండు. 22
చ. నరచక్రేశుల నెంచి చూడ హనుమన్నాగారిచిహాఢ్యులైపరబాణాసనచాతురిం గనిరి తత్రాగల్భ్య మెంతంచుఁ దా
నరచక్రేశత రాయదత్త హనుమన్నాగారిచిహ్నాఢ్యుఁడైపరబాణాసనచాతురిం దనరె నోబక్షోణిపాలుం డిలన్. 29
సీ. క్రోడుగ ల్మొదలైన గురుతరగ్రామములహిమఁ జెన్నగు భోగమండపములుసరసగుబాళించు వరధూపవాసనల్వివిధరాజాన్ననివేదనములుకట్టాణిముత్యాలగట్టిచౌకట్లజోడరుదైన నవరత్నహారలతలుకడుదీప్తి మెఱయు నఖండదీపజ్యోతులనుపమసుప్రసూనార్చనములుతే. మొదలుగాఁ గల్గు కైంకర్యముల నమర్చెశ్రీకరుం డైనఖాద్రినృసింహమూర్తికెనయఁ బ్రహ్లాదుఁ డీతఁడో యనఁగ భక్తిగలిగి పెదయౌబళేంద్రుఁడు వెలయ జగతి. 24
క. ఆ పెద్దయోబనృపతికిగోపకనద్భాస్వదంశుకుముదీభవదాఘోపాలసమదవదరిక్ష్మాపాలకుఁడైన నారశౌరి జనించెన్. 25
సీ. సత్కలానిధియైన జైవాతృకుఁడు రాజచక్రపాలకమైత్రి సలుపఁ డనుచుజీవనం బొసఁగి రక్షిఁపఁజాలు ఘనుండుచంచలాత్మకత గద్దించు ననుచుఁ
దాభోగియై యనంతాభిధానుఁడు జగత్ప్రాణాపహారియై పరగు ననుచుహంసాభిదైవతఖ్యాతజగన్మిత్రుఁడురుపుణ్యజనవృద్ధి కోర్వఁ డనుచుతే. జలజరిపు మేఘ శేష సూర్యుల హసించెకాంచె నతచక్రభరణ మార్జించె ధైర్యమవనిఁబాలించె నిర్జించె నరిజనాళినారసద్గుణహారి శ్రీనారశౌరి. 26
చ. నల నిభుఁడైన యోబవిభు నారనృపాలుని యోలగంబునంగలితసుగంధమాల్యవసనంబులతో నెలవైన వక్కలాకులె యొకరాయమన్నెదొరకుం దగ పెండ్లికిఁ జాలునన్నచోఁదెలియగఁ దద్వదాన్యత నుతింప ఫణీంద్రున కైనశక్యమే. 27
సీ. తొలఁగినగతి సూడుదొరల ననాయాసవర్ధితదుఃఖాశ్రువర్షములకుఁగొలిచిన సరిమన్నెగురిపేరు లొనరించువరదానధారాప్రవాహములకునాశ్రయించిన భూసురాగ్రేసరులు సేయఁదొడరిన సవనాగ్ని దూమములకునిడినసత్రముల నభీష్టమృష్టాన్నభోజనజనజయజయశబ్దములకుఁతే. దడిసి వరదలఁ బడియుండి కుడిచి బెగ్గడిలఁగ నేమిటికిం దని తెలిసి దాఁటినేడువార్ధులు గడవెళ్ల నీఁదె నౌర!నారవిభుని యశఃకాంతనడత వింత. 28
క. మేరుగిరిధైర్యనిధియానారనృపాలకుఁడు గనియె నయమార్గగుణోదారుల వరవీరయశోహారులఁ దొమ్మండ్రు సుతుల నతులితమతులన్.
క. ఆరమణీయయశోవిస్తారులలో వినుతిఁ గాంచె సకలధరిత్రీభూరితరభారవహనోద్ధారభుజప్రబలుఁ డోబధరణిపుఁ డవనిన్.
సీ. వరదానవాగ్వైభవముల నీడనవచ్చుఁగర్ణుతో శేషదృక్కర్ణుతోడనంగసౌందర్యశౌర్యముల జోడనవచ్చుమారుతో గిరిజాకుమారుతోడ............................భవునితోఁ గమలసంభవునితోడకలితసాహిత్యకీర్తుల సరి యనవచ్చు.భోజుతో నిర్జితాంభోజుతోడతే. ననుచుఁ దను గీ.......................న్మానదానధర్మగుణముల శోభిల్లు తాడిగోళ్ళనారనరపాలునౌబళనాయకుండు. 31
చ. వననిధి మేటి దానము...........................................లకువాఃపతి మీఱు సముద్రవారివాహనకమఠేంద్రసైంధవుల కబ్జుఁడు మిక్కుట మాపగాధిరాడ్వనధరపాశభృజ్జ.............................. 32
సీ. ఘనములై ముక్తి సాధనములై మౌనిపావనములై పొలుపొందు వనము లలరశ్రుతులై పదార్థసంగతులై విలసదలంకృతులై విరాజిల్లు కృతులు దనరమురువులై మున్నీటిహరువులై చూడనచ్చెరువులై వెలయు బల్చెఱువు లొనరనయములై మణిహేమమయములై యుత్సవాలయములై మనుసురాలయము లమరతే. ధరఁ బ్రతిష్ఠించి వెలసె సంగరధరోగ్రబహుళహళహళనిభగోపగహనదహనభీమరిపుభూమివిభుమనోభీకరుండునారభూవరునౌబళనాయకుండు. 33
క. ఆవసుధాధిపుపట్టపుదేవులలో సకలజలనిధిప్రావృతగోత్రావలయదీనరక్షాప్రావీణ్యకళాప్తిఁ గాంచె బాలమ ధాత్రిన్. 34
సీ. మగనికి సకలసంపదలు గల్గ మెలంగికమలయై నెగడె నీకంబుకంఠిప్రజల సత్పుత్రులపగిదిఁ గల్గొని యన్నపూర్ణయై తనరె నీపువ్వుఁబోఁడియోర్పు గల్గి యొకింతయును గోప మెఱుఁగకధాత్రియై వెలసె నీతరళనయనసుచరిత్రధర్మ మెచ్చోఁ బాయ కలయరుంధతియై రహించె నీనలిననయన
తే. యనుచుఁ దనతోడి సతులెల్ల నభినుతింపఁబరఁగుఁ బరమపతివ్రతాభరణమగుచుఁదాడిగోళ్లౌబళేక్షమాధవునిరాణిభవ్యసద్గుణనికురుంబ బాలమాంబ. 35
క,. ఆరమణీమణివలనన్గారవమున నోబవిభుఁడు గనియెఁ గుమారున్ధీరుని నవమన్మథశృంగారునిఁ గరెమాణికేంద్రుఁ గరుణాసాంద్రున్. 36
మ. కరెమాణిక్యనృపాలుకీర్త్యుదధికిం గంజారితారాసముత్కరము ల్ఫేనము లింద్రదంతి జలనాగం బీశతాలాంకనిర్జరమౌన్యావళి నీరుపాపగమి భాస్వద్రత్నసాన్వాదిభూధరము ల్రత్నము లబ్జజాండములు మత్స్యాండంబు లయ్యెన్ ధరన్. 37
సీ. ఏవదాన్యుఁడు రామదేవరాయలసరిగద్దియ నొడ్డోలగమున నుండెనేమనుజాధీశుఁ డితరనృపాలరాజ్యస్థాపనాచార్యుఁ డై చెలంగెనేపరాక్రమవంతుఁ డెదిరిన శత్రుభూపాలుర నడవులపాలుపఱిచెనేమహామహుఁడు శ్రీరామనామధ్యాననిష్ఠాగరిష్ఠప్రతిష్ఠ గాంచెతే. నతఁడు చతురబ్ధివలయితకుతలభారభరణవిభవప్రచురబాహుబలవిహారి
తాడిగోళ్ళౌబళనృపాలతనయమౌళినీతిగీష్పతి కరియమాణిక్యనృపతి. 38
క. అలకరెమాణిక్యేంద్రునిబలుధాటికి నల్కి యవనపతు లందఱు నవ్వలయాచలపశ్చాస్థలినిలువఁగఁ బాశ్చాత్యు లనెడునియతి ఘటిల్లెన్. 39
సీ. తాళి చౌకళి కుంచె కాళాంజి చామరద్వయము ముతైపుఁదురావాహనము పిరంగిక మొదలౌ రామరాయక్షమావరదత్త బిరుదాంకవార మందికదనభూతలభయంకరకరాగ్రసమగ్రకరవాలహతరిపూత్కరుఁ డనంగఁదాడిగోళ్లన్వయోదధినిశాకాంతుండుకరియమాణిక్యభూకాంతుఁ డలరుతే. నభయదానార్థనతవినుతావనీశపాకభిల్లోచనానందబాష్పకణమరందబంధురపాదారవిందుఁ డగుచుఁజక్రవాళావృతాచలచక్రమునకు.40
క. ఆకరెమాణికరాయక్ష్మాకాంతునికాంత లమితకమనీయశుభశ్రీకాంతలు సంపత్పద్రాకాంతలు నల్గు రెన్నఁ దనరుదు రెలమిన్. 41
తే. అందు లచ్చమ్మ లచ్చమ్మయగు గుణమునవలపు రాచమ్మ రాచమ్మ కలిమి కెలనధృతకురంగమ్మ రంగమ్మ పతిహితముననాసుభద్రమ్మ భద్రమ్మ యాదరమున. 42
శా. శ్రీకృద్ధీకరెమాణికేంద్రుఁ డినధౌరేయుండు తేజోఘనుండాకాంతామణులందుఁ గాంచెను వసంతాధీశు రామాధిపుంబాకారిప్రతిమానవైభవయుతు న్నారప్రభు న్శారదాశ్రీకంఠాభయశోవిశాలుఁ గదురోర్వీపాలులీలాంగజున్. 43
క. అందగ్రజుండు వెలయుఁ బురందరభోగాఢ్యుఁ డమలరమణీయయశఃకందళజితముక్తాహరిచందనమందారుఁ డనవసంతేంద్రుఁ డిలన్. 44
చ. సమరదిలీపుఁ డై తగువసంతనృపాలునికీర్తిశౌర్యముల్సమరసధర్మమార్గణవిశాలవితీర్ణిమనంటి జంటగాఁగమలభవాచ్ఛభానుకరకాంతిత యెంతని పంతగించె నాక్రమకలధౌతభూధరవికస్వరరూపము లేపుమీఱఁగన్. 45
క. ఆధన్యునకును సంభవుఁడై ధాత్రి భరించి భీకరాకృతి రిపురాడ్బూధరసంఘాతేంద్రాణీధవుఁ డన రామమేదినీధవుఁ డలరున్. 46
మ. సమరక్షోణిని రామభూవిభుఁడు భాస్వల్లీల ఖండింపఁ దద్విమతాధీశ్వరకంఠరక్తతటినీవేగాహతిక్షుబ్ధవా
ర్ధిమహారావచరత్తటిద్రుశుకముల్ ద్వీపక్షమాపాలనార్థము గట్టించిన తోరణంబు లనఁగా రంజిల్లు నల్గిక్కులన్. 47
తే. ధాత్రి తనకీర్తి రంజిల్లు తాడిగోళ్లరామభూపతి శ్రీరంగరాయదత్తమత్స్యమకరధ్వజాఢ్యుఁడై మధురధర్మభరణత గ్రహించు రతిమనోహరునికరణి. 48
సీ. తనగుణలతికాకదంబకంబునకు లోకాలోకనగముపఘ్నంబు గాఁగఁదనశౌర్యచండభానుని కరాతిధరాధినాథులు ఘూకసంతతులు గాఁగఁదనదానసంతానమునకు శుభ్రాంశుధామములు భాస్వత్ప్రసూనములు గాఁగఁదనకీర్తిబాలకు వనజజాండకటాహమెల్లప్పటికి బొమ్మరిల్లు గాఁగఁతే. బరఁగు రణరంగరంగదభంగజవతురంగసారంగయోధశతాంగధుతపరాగపరిభూతభీతారిరాజచయుఁడుతాడిగోళ్లాపురీరామధరణివిభుఁడు. 49
మ. ధర రామక్షితిపాలు సెల్వున వసంతత్యాగకాలంబునన్వరమాణిక్యపురాసు లెల్ల భటవిద్వద్యాచకు ల్వచ్చి యందఱు నొక్కుమ్మడిఁ గొల్ల లాడి కొనిపోఁదచ్ఛేషముం దానిజోదరమం దుంచుక రత్నగర్భ యను ప్రోద్యత్సంజ్ఞచే మించదే. 50
క. థామనిధితేజుఁ డగునారామనృపాలకుఁడు శరపరాభూతమహా
భీమరిపుస్తోమవపుఃస్థేముని రఘునాథవిభునిఁ జెల్వుగఁ గాంచెన్. 51
సీ. తనసదాచారంబు తనసదాచారంబుసరణి నానాఘనోత్సవ మొనర్పఁదనశుభాలోకంబు తసశుభాలోక మట్లతిలోకబాంధవోన్నతి ఘటింపుదనకలావిభవంబు తనకలావిభవంబుమాడ్కిని సర్వజ్ఞమౌళి నెనయఁదనసన్నిధానంబు తనసన్నిధానమట్లనవద్యతరనిరంజనత వెలుఁగఁతే. బరఁగు యుద్ధధరిత్రీద్ధపటుపటహవిజృంభణార్భటీదళితదిక్సింధురాళిశుభముక్తౌఘగుంభితకువలయుండురామభూపాలురఘునాథభూమివిభుఁడు. 52
చ. నరసుతమూర్తి యైనరఘునాథనృపాలునికీర్తిసంఘ మాహరిశరజన్మ హంసభవ హారివిలాసము, తత్ప్రదాన మాహరిశరజన్మ హంసభవ హారివిలాసము, తత్ప్రతాప మాహరిశరజన్మ హంసభవ హారివిలాసము, ధాత్రి నెన్నగన్. 53
ఉ. ఆరఘునాథభూమివిభుఁ డంబరభూజసమీభవత్కనద్గౌరవకీర్తియై కొలువఁ గంసహరాంశభవుండు రామధాత్రీరమణుం డనేకజగతీపరిపాలతఁ బూనె సద్గుణావారణలీల సర్వజనవర్ణితదానకళాకలాపుఁడై. 54
క. ఆరామశౌరితమ్ముఁడునారనృపాలకుఁడు వెలసె నక్షత్రశరద్ధారాధరతారావరహారామరతరుహిమాచలాంచద్యశుఁడై. 55
మ. అరిపద్మంబులచే మహోత్పలకళోద్యద్వృద్ధిచిత్తంబులంబరమాహ్లాదముఁ జెందవచ్చు మదిలో భావించి రేఱేఁడు భాస్కరతేజుండగు నారభూవిభుని సచ్ఛత్రాకృతిం దాల్చి తానరిపద్మంబుల మైత్రి గన్గొనియె నాత్మాలోకమాత్రంబునన్. 56
సీ. సురసరిత్పురహరస్థిరశరద్ఘనవయశ్శరనిధిచ్ఛవికనచ్చటులకీర్తిఘనరటత్పటహనిస్వనవినిర్దళితశాత్రవపురప్రకటవప్రనికరుండురణవిఖండితరిపుప్రభుగళస్రవదసృక్తతరసప్రకరపూరితపయోధిసలిలభృజ్జలజభిజ్జలధికల్పకవికర్తనసుతస్తవనీయదానయుతుఁడుతే. మన్నెమాత్రుండె నిజపాదమంజుకటకఘటితపటురత్నపటల విస్ఫుటవిదృశ్యమానమత్తారిరాజన్యమస్తకుండునారభూపాలుఁ డమితసన్నహనబలుఁడు. 57
శా. ఆపృథ్వీపతిసోదరుండు కదురక్ష్మాధీశవర్యుండు యోషాపంచాస్త్రుఁ డనంతభూషణవిశేషస్ఫూర్తియుం బ్రాప్తలక్ష్మీపాలత్వముఁగల్గి సజ్జనగణశ్రేయస్కరోద్యోగుఁడైదీపించున్ శివకేశవాంశజుఁ డనన్ దివ్యప్రభావోన్నతిన్. 58
సీ. పద్మాప్తపద్మాప్తపద్మాప్తతుల్యుఁ డేఘనుఁడు సంపత్కృపాకలితరుచులహరిణాంకహరిణాంకహరిణాంకసముఁ డేరసానాయకుడు బలైశ్వర్యకళలహరిరాజహరిరాజహరిరాజనిభుఁ డేనృపాలుండు శౌర్యోక్తిభక్తిరతులమకరాంకమకరాంకమకరాంకసదృశుఁ డేఘనుఁడు దానాకారగౌరవములతే. నతఁడు గుణథాముఁ డభిరాముఁ డర్కథాముఁడమితజయభీముఁ డుద్దాముఁ డరివిరాముఁడతులవైభవసుత్రాముఁ డనఁగ భద్రనాముఁ డలరారుఁ గదురభూనాయకుండు. 59
క. సంగరజయుఁ డగుకదురనృపుంగవువాక్కీర్తు లలరె భూస్థలిఁ హరజూటాంగనటద్గాంగరటద్భంగాభంగోద్ధనినిదధవళద్యుతులన్. 60
చ. హరనరవాహవహ్నిహరు లాకదురేంద్రుని కీర్తిదానశౌర్యరసకృపావిశేషముల కల్కి కృశించి కురూపియై సదామొరయుచుఁ జాల నల్లనయి భూమిధరంబున మూలచట్ల సాగరమున విశ్రమింప నొదుగం దిరుగంబడియుండఁ జూడరే. 61
క. ఆమహిమాఢ్యునకుఁ బురంధ్రీమణియగు కదురమాంబ దీనావనయైశ్రీమెఱయ మహిని వర్ధిలుతామరపాక్షునకు వార్ధితనయ యనంగన్. 62
సీ. తా రత్నగర్భాభిధాన యయ్యును విభునప్పుల ఱాయి మోయంగఁ జేసెఁదాఁ గల్మి యొసఁగెడు తరుణి యయ్యును నిజప్రాణేశుఁ బసులకాపరిగఁ జేసెఁదా జనకజ యయ్యు ధవునిఁ గారడవిలోజనకవియోగాప్తి నెనయఁ జేసెదా హైమవతి యయ్యుఁ దనమనోనాథునిబునుకపేరులు దాల్చుకొనఁగఁ జేసెతే. నని ధరాదేవి నిందిర నవనికన్యనచలజాతను నిరసించి యాత్మపతికిగీర్తితాభీష్టవైభవస్ఫూర్తు లొసఁగువదనజితపూర్ణశశిబింబ కదురమాంబ. 63
తే. పరమగుణశాలి కదురనృపాలమౌళికదురమాంబికయందు శృంగారనిధులనందనులఁ గాంచెఁ గదురభూనాథు నిన్నువేంకటాగ్రణి నతిదానవిబుధమణిని. 64
చ. ఇననిభ తాడిగోళ్ల కదురేంద్రుని శ్రీకదురావనీశ నీయనుజుని వేంకటక్షితివరాగ్రణి నెన్నఁదరంబె థాత్రిపైననయముఁ దత్ప్రతాపజలజాప్తునిచే వలయాద్రిరాడ్విలంఘనమగు శత్రుభూభుజులు గాంతురు సత్పథసౌఖ్యసంపదల్. 65
సీ. అనిమిషావాససంప్రాప్తిఁ జెందనివారికనిమిషావాససంప్రాప్తి యొసంగెవిషధరస్థలి నుండ వెగటైనవారికివిషధరస్థలి నుండ వెఱఁగుమాన్పె
స్వస్థానవిహరణాసహ్యులౌ వారికిస్వస్థానవిహరణాసహ్య ముడిపెఁదతమహాబిలపదస్థలి లేనివారికిదతమహాబిలపదస్థితి గడించెతే. నౌర తొలుదొల్త డాసి ఱొమ్మదిమి గదిమిచించి చెండాడి గాసిఁ జేసినదియయ్యువిమతతతిపట్ల కదురభూవిభుని వేంకటాగ్రణికరాసి యెంతదయాంబురాశి. 66
చ. సరసతఁ దాడిగోళ్ల పురశాసనుఁడై తగు వేంకటప్రభుండరివిజయప్రయాణసమయానకనాదవిధూతతారకాంబరమున కాత్మఖడ్గహరిమర్దితశాత్రవహ స్తిమస్తకోద్ధరుచికమౌక్తిప్రతతితారల పెక్కు ఘటించు నిచ్చలున్. 67
సీ. నవనవాగతశీతపవనవారమహోగ్రదవలవావళిచేత దర్ప ముడిగితలతలావృతసుకోకిలకులాననగళత్కలకలారభటిచేఁ గడుఁ గలంగిప్రసవసారసితసారసరసాశనమత్తభసలసాధ్వసముచే భంగ మందిస్మరశరాసవసముద్ధురశరాకులమనస్సవసరాగముచేత శయ్య నొరగితే. ధరణి నెఱిఁగింతు రీరీతిఁ దాడిగోళ్లకదురవిభు వేంకటేంద్రుని కదనధాటికలికి దుర్గమకాననస్థలులఁ బడినయాత్మనాథులపైతమి నహితసతులు. 68
ఉ. శ్రీనిధి తాడిగోళ్ల కదిరీపతినాయని వేంకటక్షమాజాని జయప్రయాణపటుసంభ్రమసంభృతభూరిభేరికాధ్వాన మమర్త్యలోకవనితాజనము ల్విని నూతనప్రియానూనసుఖోన్నతు ల్గలుగునో యని యెంతురు సమ్మదంబున్. 69
ఉ. ఆయనుజుం డఖండవిభవాఢ్యుఁ డమందముదం బొనర్ప నారాయణపుణ్యమూర్తి వయి రంజిలి తీవు శుభైకశాశ్వతశ్రీయుత తాడిగోళ్ల కదిరీపతినాయక వేంకటాంబ యత్యాయతకీర్తిపూరితదిగంతర పట్టపుదేవి యై తగన్. 70
చ. అమితయశఃపయోధి కదురాధిపు శ్రీకదుక్షితీంద్ర చిత్రము విను మొక్కవార్త సమరస్థలి దుర్మదవద్విరోధిరాట్సమదభవద్భయంకరభుజప్రవిభాసికరాసిసంహతిన్విమతులకంఠరక్తము స్రవించి ద్రవించు మనంబు రంభకున్. 71
సీ. మేఘంబు లేనిక్రొమెఱుఁగులు కుముదారిలేనియెండలు వార్ధి లేనిబాడబములు సురాద్రి లేనిమణిసానువు లరణ్యము లేనిదావానలములు కొలనులేనికెందమ్ములు మ్రాను లేనిచివుళ్లుగని లేనికెంపులు మనసిజారిలేనికన్మంట లై లీల నిండెను ధరాస్థలి నౌర యుష్మత్ప్రతాపరుచులుతే. దహనసహకారరాజదర్పహరణరణమహాభీమభీమాబ్జరమ్యకీర్తికీర్తితాలోకలోకైకకీర్తనీయఘనగుణకలాప కదురేంద్రు కదురభూప. 72
క. తతరణమున నీవిమతక్షితినాథు లనంతధవముఁ? జెందరె భయకంయుతులై నతులై హతులైగతకల్మష తాడిగోళ్ల కదురనృపాలా. 73
చ. అమృతము శీతభానుగత మన్నది కాదు తృణస్థితం బటంచమలమతి న్వచింతురు మహాత్ములు కాదనిరేని నీరిఫుల్రమణఁ దదాప్తిమాత్రమున రక్షితులై మనుటెట్లు ధాత్రిభూరిమహిత తాడిగోళ్ల కదిరీపతినాయక లోకపాలకా. 74
సీ. తనపేరురంబు ద్రొక్కినవాఁడు సిగ్గుచేసరిగాక తలలెత్త వెఱవలేదొతనతలఁ దన్ని నిల్చినవాఁడు సామ్యంబుజెందలేక కృశత్వ మందలేదొతనవాలుజడలనుండి నది దీటుకు రాకబెట్టుగాఁ బెనుమొఱ్ఱ వెట్టలేదొతనుమోచి తిరుగఁజొచ్చినది తుల్యముగాకఘనభయంబునఁ బూరి గఱవలేదొతే. తాను సరిచనఁదలఁచి నీధవళకీర్తికెనయఁగా లేక సగమయ్యె నీశుఁ డతఁడువసుధ సర్వజ్ఞుఁ డెట్లు సర్వజ్ఞమౌళికంజశరరూప కదురేంద్రు కదురభూసప. 75
క. ధర్మగుణకలితమార్గణులర్మిలి నీచర్య లెంచ నలరితి వౌరాధర్మగుణకలితమార్గణనిర్మథితవిపక్ష కదురనృపహర్యక్షా. 76
సీ. కావ్యనైపుణిశబ్దగౌరవప్రాగల్భ్యమర్థావనాసక్తి యతిశయోక్తినాటకాలంకార నయమార్గసాంగత్యసాహిత్యసాహిత్యసరసముద్రసకలప్రబంధవాసన సువాక్ప్రౌఢిమాన్వితచతుర్విధసత్కవిత్వధాటిలక్ష్యలక్షణగుణశ్లాఘ్యతాపటిమంబునైఘంటికపదానునయనిరూఢితే. గనిననీకు నసాధ్యంబె గణుతి సేయధాత్రి శుకసప్తతి యొనర్పఁ దాడిగోళ్లఘనకులకలాపకదురేంద్రు కదురభూపచెలగి వాక్ప్రౌఢిచే గృతి సేయు మవని. 77
వ. అని విద్వజ్జనంబు లానతిచ్చిన నేను నమందానందరసభరభరితహృదయారవిందుండనై. 78
క. కుంభిన్యాత్మభవాకుచకుంభపరిరంభణాత్తకుంకుమపంకోజృంభితసంకుమదాగురుశుంభధ్వక్షునకు భానుసుతరక్షునకున్. 79
క. బంధుకదశకంధరగర్వేంధనజిద్గంధవాహహితునకుఁ బటుదర్వాంధకహరబంధునకుఁ గబంధాసురనిబిడతిమిరభాస్వంతునకున్. 80
క. చండద్యుతినిభమణిమయకుండలున కజాండభాండకోదండకళామండలపండితదనుజాఖండలఖండనసమర్థఘనకాండునకున్. 81
క. భర్గేష్వాసనదళనానర్గళదృఢబాహువీర్యునకుఁ బూర్వవచోమార్గచరిష్ణుమునీశ్వరవర్గప్రణుతానివార్యవరచర్యునకున్. 82
క. షడ్వదనజనకసుమనోరాడ్వినుతచరిత్రునకును రాజద్గాత్రత్విడ్విజితాదిత్యునకు విరాడ్విగ్రహధామునకును రఘురామునకున్. 83
వ. అభ్యుదయ పరంపరాభివృద్దిగా నాయొనర్పంబూనిన శుకసప్తతి యనుమహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. 84
క. వెలయు నలఘుప్రభావోజ్జ్వలుఁ డింద్రప్రస్థపురి నసామాన్యమహఃకలితదృఢబాహుబలనిర్దళితాహితరాజు ధర్మరాజు ధరిత్రిన్. 85
చ. అతఁ డొకనాఁడు నిండుకొలువై బలవైరిమహోన్నతి న్మరుత్సుతుఁడుఁ గిరీటి మాద్రితనుజు ల్తనదండన యుండి కొల్వ రాజతతికిరీటకోటివిలసన్మణిమంజులదీప్తిపుంజరంజితచరణుండు ధర్మజుఁడు చెంత వసించిన ధౌమ్యు నిట్లనున్. 86
క. తెలివి గలభూసురుండవుకులగురుఁడవు మాకు మౌనికుంజర! వినుమీయలఘుమతి నొక్కకార్యముతెలియ న్వివరింపవే సుధీజనతిలకా! 87
ఉ. భామలచిత్తము ల్దెలియ బ్రహకునైన వశంబుగాదు తత్కామితయత్నము ల్తలఁప ధాత్రి విచిత్రము లండ్రు కావునన్నామది యేతదీయకథనంబు వినం గడఁగె న్మహీసురగ్రామణి! యానతిమ్మనుఁడు రాజబిడౌజునితోడ వేడుకన్. 88
వ. అప్పు డాభౌమ్యమహర్షివర్యుండు నిరవధికకుతూహలధుర్యుం డై యిట్లనియె స్త్రీజనంబుల చిత్తంబులు లోకాతీతదుర్వృత్తంబులు, తదీయకృతసాహసకార్యంబు లనివార్యంబు లగుట నిక్కువం బిందులకు నొక్క యితిహాసంబు గలదు. తొల్లి మహాదేవుండు పార్వతీవరారోహ కతిరహస్యంబున నానతిచ్చినతెఱం గెఱింగించెద సావధానుండవై యాకర్ణింపు మని యి ట్లనియె. 89
సీ. సౌథాగ్రతలకేళిజాగ్రన్మృగేక్షణాస్ఫుటదృశ్యమానేంద్రపురవరంబుజగతీదిదృక్షుభౌజగవర్గనిర్గమద్వారాయితన్వచ్ఛవారిఖేయమబ్జినీకాంతశుద్ధాంతీభవత్ప్రాంతసంతతోదారకాసారవారమిందిరాసుతభవ్యమందురానీకరమ్యామోదకారణారామసీమ
తే. యంద మగు మేరుమందరాహార్యమధ్యతలమహీమండలమున నుద్దామభీమమేదురోద్భటభటసింహనాదచలితదిగ్గజవరంబు పద్మావతీపురంబు. 90
క. ఆనగరి న్విభవప్రతిభానగరిపుఁ డైన చిత్ భానుం డేలున్మానక మృడుకరడమరు సమానకరవ మరుల గిరులయఱుఁతం జేర్పన్. 91
మ. కలలో నైనను బల్కి బొంకఁడు సమగ్రక్రోధయోధారిరాడ్బలముం గన్గొని చీరికిం గొనఁడు దుష్పాండిత్యము ల్నేరఁ డుజ్జ్వలదుజ్జృంభశుభాంగవైఖరుల ఠేవన్నూత్నకందర్పుఁ డైతలఁపం జొప్పడుఁ జిత్రభానుఁ డతఁ డేతన్మాత్రుఁడే చూడఁగన్. 92
సీ. చంద్రమతీనాథుచందాన నలునివైఖరిఁ బురుకుత్సునిగతిఁ బురూరవునిమాడ్కి సగరులాగునఁ గార్తవీర్యునియనువున గయునట్టు లంబరీషుపొలుపున శశిబిందువలె నంగుపోలికఁబృథునిభాతి మరుత్తురీతి భరతుకరణి సుహోత్రునిహరువున రఘులీలరామునిక్రియ భగీరథునిఠేవతే. శిబితెఱంగున మాంధాతచెలువమున యయాతిరీతి దిలీపుమర్యాద రంతిసరణిఁ బాలించి యలరు నాచక్రవాళవసుమతీచక్ర మమ్మహీవల్లభుండు. 93
మ. అకలంకప్రతిభాప్రతాపవిభవుం డా రాజకంఠీరవుండొకనాఁ డంతిపురి న్సువర్ణవలభిప్రోన్మీలమై కెంపుమానికపుంబొమ్మల నొప్పు పెండ్లిచవిక న్నీలంపుఱాగద్దియంబికవాణీనికరంబు గొల్వ సుముఖాప్తి న్నిండుకొ ల్వుండఁగన్. 94
క. ఇఱుకువలిగుబ్బచన్నులయెఱుకుం జవరా లొకర్త యెఱుకో యవ్వాయెఱుకో యని తనచందంబెఱుకపడంగా హజార మెలమిం గదిసెన్. 95
వ. అప్పు డప్పడంతుకతెఱం గమ్మహీంద్రుండు పరిచారికాజనంబులవలన విన నవధరించి సమ్ముఖమునకు రావించిన. 96
సీ. సవరనిపనివన్నెఱవిక పిక్కటిలంగఁగులుకు పాలుబ్బుగుబ్బలు చెలంగముంజేతులను ముఖాంబుజమున నొకవింతపొలుపు దెల్పెడు పచ్చబొట్టు లెసఁగఁగుఱుమాఁపుపయ్యెంటచెఱఁగులో నిడుకొన్నముద్దుఁబల్కులచిన్నిబుడుతఁ డమరఁదరతరంబులనుండి తనయింట వెలయు పుత్తడిపైఁడిబుట్టి మస్తమున వెలుఁగతే. బొమలసందున నామంబుభూతిపూఁతనెన్నొసఁటఁ బుక్కిట విడెంబు కన్నుఁగొనలఁగాటుక రహింప వచ్చి యాక్ష్మాతలేంద్రుచరణముల కోరగా మ్రొక్కి చక్క నిల్చి. 97
క. ఇవి దారికట్టు మొనకట్టిది కాంతావశ్యకరణ మిది నీమది కిం
పొదవించు నోనరేశ్వర!పదిలం బని తెల్పి కొన్ని బదనిక లొసఁగెన్. 98
క. తలఁపున నిది గారడ మనితలఁపకుమా సింగఁ డల్లతఱిగొండ దరిన్దలమోచి తెచ్చినవి యివితలనుంచుము పసిఁడితాయెతల నుంచి నృపా! 99
వ. అని విన్నవించిన యమ్మత్తకాశినీకరాంబురుహదత్తం బగు నయ్యుత్తమదివ్యౌషధత్రయంబు రయంబునం గ్రహించి కరుణావలోకనపరుండై ప్రియవినయగంభీరభాషణంబుల నిట్టు లనియె. 100
శా. ఏయేభూములు చూచినావె కొరవంజీ రూపలావణ్యరేఖాయుక్తిం దగు కొమ్మ లెందుఁ గల రీక్ష్మామండలిన్ హావభావాయత్తైకవిలాసవైఖరుల మేలం దెవ్వరిం జెందు నయ్యాయావార్తలు తెల్పవే మది కమందానందముం జెందఁగన్. 101
వ. అనిన విని యితండు చతుర్విధనాయికానాయకుండును బహువిధశృంగారశేఖరుండును సకలకలాధురంధరుండు నగు నని తనమనంబున వితర్కించుకొని యతని కిట్లనియె. 102
సీ. కల్కిచిల్కలపోల్కిఁ గనుపట్టు శృంగారనటన గుల్కెడుతూర్పునాటి చెలులఁబులుగడిగిన ముత్యములఁ బోలి గరగరికలు వహించిన పాండ్యకమలముఖులఁజిత్ర రేఖలఁ దారసిలుచక్కఁదనములరాణించు కన్నడరాజ్యసతుల
బగడంపు జిగిసొంపు తగుతనుద్యుతి పెంపునలరెడు యవనశీతాంశుముఖులఁతే. గుందనంపుసలాకలయంద మొందునంధ్రకన్యల నిదిగాక యంగవంగకుకురుసౌవీరసౌరాష్ట్రకోకకుచలవింతలన్నియుఁ గనుఁగొంటి విను నరేంద్ర! 103
తే. దేవ నవఖండమండల శ్రీవిజృంభమాణ మగునివ్వసుధఁ గల్గుమానవతులవరుస నందఱఁ గనుఁగొంటి వారిలోనరేఖ గలయొక్కచెలి నేర్పరింతు వినుము. 104
ఉ. ఈనగరీవతంసముననే తగువైశ్యుఁ డొకండు శాశ్వతశ్రీనిధిగేహుఁడై మదనసేనుఁ డనంగలఁ డద్బుతైకశోభానవమోహనాకృతి ప్రభావతి వానిపురంధ్రి యొప్పు నోమానవతీమనోజ! యసమానవయఃపరిపాకవైఖరిన్. 105
మ. దాని ఘనాఘనద్యుతివితానకనద్ఘనకేశపాశముందాని లసద్బిసప్రసవధాళధళీచకితేక్షణంబులుందాని సుగంధగంధిలసుధారసబంధురమందహాసమున్మానవనాథ! మెచ్చుటకు మర్త్యు లమర్త్యలునైన శక్తులే. 106
క. ఆమృదులోరువిలాసంబామోహనముఖవికాస మాదరహాసంబామెడ యానడ యాజడయామేని మెఱుంగురంగు నలవియె పొగడన్. 107
సీ. భుగభుగ వాసింపఁ బొసఁగు పుత్తడిబొమ్మమాటాడనేర్చిన మణిశలాకకలికిచేఁతలనొప్పు కమ్మక్రొవ్విరిబంతితగుజీవకళల చిత్తరువుప్రతిమగమనశృంగారంబు గనుపట్టు లతకూనకలదొలంగని తొలకరిమెఱుంగుకరచరణాంగసంగతి గన్నశశిరేఖహావభావములఁ జెన్నలరు సరసితే. యగునని గణింప బినుతింప నలవిగాదుదానిచరణాబ్దనఖరేఖతోను బోలఁగలరె యీలోకమున నున్న కాంతలెల్లవిను మహీనాథ యేమని విన్నవింతు. 108
క. ఒకపాటి పేదసంసారికిఁ దగ దమ్ముద్దుగుమ్మ రిపురాణ్మణిమస్తకమకుటఘటితనవరత్నకళాచకచకితచరణునకుఁ గాక నృపా! 109
క. అని విన్నవించినంతనెమనమున నుప్పొంగి వైశ్యమహిళానవమోహనరూపరేఖవిభవమువిని విస్మయ మంది మోహవిహ్వలమతి యై. 110
తే. ఎఱుకవగలాఁడి కోరినవెల్ల నొసఁగిప్రియవచోవైభవంబు గాన్పింపఁ బనిచికొలువు చాలించి బోటిక ల్గొలువ నంతిపురి నొకానొక మణిసౌధమున వసించె. 111
ఉ. అంతట నవ్వణిగ్వరుని యంగనపైఁ దమి హెచ్చి యామహీకాంతపురందరుండు రతికాంతధనుర్లతికావిముక్తదుర్దాంతశరాళికి న్మదమరాళికిఁ జండతరాళి కెంతయుంజింతిలి వేదనావశవిశీర్ణమతి న్విరహార్తి నొందుచున్. 112
సీ. చెక్కిటఁ జెయి నేర్చి చింతాకులాత్ముఁడైవనిత నేక్రియఁ దెత్తునని తలంచునిట్టూర్పు నిగిడించు నేఁ డయో శుకపికార్బటి కోర్వలేనంచుఁ బలవరించుఁదనలోన తానేమొ తలయూఁచుకొని మెచ్చుంగలవరించుచు బయ ల్గౌఁగిలించుఁజిత్తరువుననున్న చెలువంపుఁబ్రతిమ నల్లదె ప్రభావతి యంచు మదిఁ దలంచుతే. నించు విలువంచి విరితూపు లేర్పరించిపచ్చవన్నియచిల్కబాబావజీరుఁడుల్ల ముల్లోలముగఁ జేయఁ దల్లడించురాజముఖిమీఁదిబాళి నా రాజమౌళి. 113
ఉ. ఎప్పుడు చూడఁ గల్గునొకొ యిందుముఖీవదనారవింద మేనెప్పుడు విందునో తెలియ దేణవిలోచన కల్కిపల్కు లింకెప్పుడు గౌఁగిలింతు నలయింతి కుచాద్రులురంబు సోఁక నాకప్పుడుగాదె సౌఖ్యపర మందుటలంచు మదిం గణించుచున్. 114
క. ఉల్లము బెగడ ధరిత్రీవల్లభుఁ డి ట్లున్నవేళ వనితామణులందెల్లగుణంబుల కిరవగుపల్లవి యను పేరుగలుగుభామ సుబుద్ధిన్. 115
సీ. వసుమతీశ్వరుఁ డున్న దెసఁ జూచి పావడచెఱఁగున నెమ్మోము చెమట దుడిచిసిగ పొందుగ నమర్చి చిన్నారివిడికెంపుతాయెతు ల్చుట్టి కుళ్ళాయి వెట్టిచెవులయంటులఁ జక్కసవరించి ముక్తావిచిత్రహారంబుల చిక్కుఁ దీర్చికలపం బలంది బంగరుగట్టికమ్ములవలిపెదుప్పటి వలివా టొనర్చితే. కేలుదమ్మికిఁ గపురబాగాలుఁ బండుటాకుమడుపులు నొసఁగి లోకాభిరామవార్త లొకకొన్ని నొడివి యప్పార్థివేంద్రుఁబలుదెఱంగుల నలరించి పలికె నపుడు. 116
క. స్వామి యవధారు మీమదిఁగామించు మనోరథంబుఁ గడతేర్చెద నింకేమిటికిఁ జింత యన వినిభామామకరధ్వజుండు పల్లని కనియెన్. 117
తే. వైశ్యభామిని లావణ్యవైభవంబువిని విరహవార్ధి మునుఁగున న్మనుప నెట్టులంటు చేసెదో యమ్మచ్చెకంటి ననుచునిచ్చక మొనర్చి యుడుగర లిచ్చి పసుప. 118
మ. చని యప్పల్లవి వైశ్యవల్లభుని భాస్వద్దివ్యగేహాంతరంబున వర్తిల్లు ప్రభావతిం గనఁ దదంభోజాక్షి రాజావలంబనసౌభాగ్యము గన్నధన్యవు ననుం బాటించి యేతేఱ నేమి నిమిత్తంబొ యటంచు నిర్మలసుధోర్మీవైఖరిం బల్కినన్. 119
క. నినుఁ జూడఁగోరి వచ్చితిననవుడు సంతోషమయ్యె నని మణిపీఠిందను నిలుప రాజదూతికయనియెఁ బ్రభావతికి సముచితాయత్తమతిన్. 120
తే. ఎల్ల సౌభాగ్యములు గలయింట వెలసిమిగులఁ జక్కనివారిలోఁ దగినదానవగుదు నీ బంధుజనము ని న్నభినుతింపఁగాఁపురము చేసితివి మేలు కమలగంధి. 121
వ. అదియునుం గాక పురాణదంపతు లగునీయత్తమామల సుమతిహరదత్తుల నాదరించు నీవివేకంబునకు మెచ్చితి సాక్షాన్మనోజుం డగు నీమనోహరున కనుగుణం బగునంతరంగంబునకు సంతోషించితి గురుబుధబాంధవదాసదాసీజనంబులం బోషించునీమహత్త్వంబుఁ గొనియాడ శక్యం బగునే యని వెండియు. 122
సీ. గుట్టుతో సంసారి మట్టునఁ జుట్టాలఁదనియింతు వని హరదత్తుతోడఘనురాల చల్లనికడుపుదానవు నీవుసుకృతశాలిని వంచు సుమతితోడమదనసేనుఁ డనంగ మఱి నీకే తగు నెంతచెలువుఁడ వని దానిసెట్టితోడవిశ్వాసమున నింట వెలయుపాటెల్లఁ బూనెద రంచుఁ దగిన బానిసెలతోడతే. నిచ్చక మొనర్చి హితవరియేపు చూపిచొరవ గల్పించుకొని పరిశుద్ధురాలి
వలెనె తాఁ బోనిచో సారెపిలువనంపుమచ్చిక యొనర్చె సమ్ముదిమాయలాడి. 123
క. అంత నొకనాఁడు రజినీకాంతశిలాఘటితవేదికామధ్యమునంగొంతతడ వుండి తగనేకాంతం బగువేళ వైశ్యకామిని కనియెన్. 124
క. ఓమధురవాణి నీమనువేమిటనుం గడమ గాక యెంతయు నొప్పెందామసుఁ డగువాగ్వనితాకాముం డొకకొంత కొదవ గల్పించెఁ గదా! 125
వ. ఆది యె ట్లంటేని. 126
సీ. బింబోష్టి నీచంద్రబింబాననము వానిబెడఁగునోటను ముద్దువెట్టఁదగునెకాంత నీ సిబ్బెంపుగబ్బిగుబ్బలు వానిపరుసు చేతుల నొ త్తిపట్టఁదగునెయబల నీకనకోపమాంగవల్లరి వానికఱకుమే నంటంగ నొఱయఁదగునెరామ నీమధురాధరప్రవాళము వానివికటదంతముల కొప్పింపఁదగునెతే. కొమ్మరో కుందనపుఁ గీలుబొమ్మకరణినొఱపుగలదాన వీవు వానరమువంటిమగనితోఁ గూడి రతికేళిఁ బొగులఁదగునెతగదుగా ధాత యీరీతి తగులు సేయ. 127
తే. తా ననుభవింపనేరక తగిన ఘనునిదండ నుండంగనీక నిధానమునకుబూచి కాచుక యున్నట్లు పువ్వుఁబోఁడియెట్లు సంగత మయ్యె నీ కిట్టిమగఁడు. 128
వ. ఐననుం గొదవ గా దిందుల కొక్క మహోపాయంబు విచారించితి వినుము. 129
చ. వలపులఱేనికి న్సవతువచ్చువిలాసము గల్గి యెల్ల విద్యలఁ గలమేలిమిం దెలిసి యంగనలం గరఁగింప నేర్చి కోర్కులు సమకూర్పఁజాలి కడుఁ గొండొకప్రాయము గల్గువాని నిస్తులతరభోగభాగ్యములు చొప్పడ నీ కొనగూర్తు మానినీ! 130
క. అతని వివరింతు విను నీమతికి న్సమ్మతి యొనర్చు మనరాజు జగద్ధితసుప్రతాపభాస్వత్ప్రతిభాభానుండు చిత్రభానుం డబలా! 131
సీ. భావజ్ఞమౌళి ధాత్రీవరారోహావహస్తలైకైకబాహార్గళుండుచల్లనిరాజు సాక్షాత్కారనవమోహనాంగసౌందర్యలీలాంగభవుఁడుదాక్షిణ్యశాలి యాచార్యధైర్యావార్యసకలసద్గుణగణార్జవపరుండుచేపట్టుఁగుంచ మక్షీణరంగదభంగశృంగారశాస్త్రప్రసంగలోలుఁ
తే. డమ్మహారాజదేవేంద్రుఁ డంతరంగమెల్ల నీసొమ్ముగ నొనర్ప నేమితపముచేసితివొ నాపలు కొకింత చిత్తగించితలఁపు నెఱవేర్చు కొనవమ్మ కలికి కొమ్మ. 132
వ. అనిన విని సంభ్రమభయవిస్తయాక్రాంతం బగునిజస్వాంతంబునం గొంతతడవు విచారించి దరస్మితవ్రీడాభరంబు లీడుజోడాడ వదనారవిందం బొకించుక వాంచి పంచశరశరప్రాయకటాక్షాంచలంబుల నొక్కించుక చాంచల్యం బంకురింప నచ్చంచలాక్షి రాజదూతి కిట్లనియె. 133
క. ఏ నింతనాఁటినుండియుమానవతులలోన మిగుల మానవతిని నైయీనాఁటికిఁ గడచితి నికఁనానోఁచిననోము లే మొనర్పం గలవో. 134
వ. అదియునుం గాక. 135
తే. అత్తయును మామ తలవరులై మెలంగమగఁడు పులివంటివాఁడు నెవ్వగ యొనర్పనమ్మ! యేఁ జెల్ల! యిక్కార్య మమరు టెట్లుచాలుఁ జాలింపు మిఁక నీప్రసంగ మనిన. 136
వ. విని తదీయవచనంబున స్వప్రయోజనావకాశం బయ్యె నని తలంచి తదనుగుణం బగునట్లుగాఁ బల్లవి యిట్లనియె. 137
ఉ. ఎక్కడి యత్తమామలు నిజేశ్వరుఁ డెక్కడ వంశవర్తనంబెక్కడ దొడ్డు కొంచెమను టెక్కడ నోలలితాంగి మోహమున్నెక్కొనఁ జక్కనయ్య నొకనిం బిగికౌఁగిటఁ జేర్చి పెంపుసొంపెక్కని దేటిప్రాయ మిది యెన్నఁటికిం గలుగంగనేర్చునే. 134
సీ. మగని ప్రక్కనె యుండి తగఁ జేరి జోకొట్టిమోసపుచ్చని దేటి ముద్దరాలుపసులగోడలనైన వసుధనిచ్చెన లేకయెక్కనేరని దేటి యెమ్మెలాఁడితలవరు ల్గనుఁగొన్నఁ దప్పు నొప్పు ఘటించిబొంకనేరని దేటి పువ్వుఁబోఁడిదొరలు గద్దింకఁ గల్లరివార్త నిజముగానిర్వహింపని దేటి సీటుకత్తెతే. యత్తమామల గృహకర్త లగుచు మెలఁగునట్టిధూర్తుల నెల్ల నోరదిమి గదిమిపొంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించిచక్కటికి దిద్దుకొనని దేసరసురాలు. 139
తే. ఆఁడుపుట్టునఁ బుట్టి యింతంతయైనదిట్ట గాకున్న నది కడతేఱు టెట్లుబేలతనమున నీవింత గోలవేనిమాను మోబాల యిఁక నిన్నిమాట లేల. 140
వ. అనినఁ బులకానుషంగం బగునిజాంగంబువలన నంగీకృతభావం బెఱింగింప నయ్యంగనారత్నంబునకు సంగనాచియగు రాజదూతిక మఱియు మఱియు బోధించి చంద్రికాసక్తచకోరకంబునుఁబోలె వైశ్యభామ కెదురుచూచుచున్న రాజపుంగవునకుఁ దదీయకథావృత్తాంతం బెఱిఁగింప మరలిచనునెడ నవ్వణిగ్వరునకు దైవయోగంబున నతిదూరప్రయాణంబు సంభవించిన. 141
చ. తనయిలువేల్పులై మెలఁగు తల్లికిఁ దండ్రికి భక్తియుక్తివం
దన మొనరించి ప్రాణసమతం దగుపెంపుడుముద్దుఁజిల్క నెమ్మన మలరించి విద్యుదుపమానశుభాకృతి నా ప్రభావతింగనుఁగొని పోయిరాఁదగిన కార్యముఁ దెల్ప నవీనదైన్యయై. 142
సీ. మలయుచో మధురాతిమధురాధరల వాఁడిచిన్నారిగోరు నీచెక్కుమీఁదనానుచో రంగస్థలాబ్జగంధులగబ్బిమెఱుఁగుఁజందోయి నీయురముమీఁదమించుచోఁ గాంచికాచంచలాక్షుల ముద్దుమొనపంటిగంటు నీమోవిమీఁదఁజేరుచో నెల్లూరు నారీమణుల కెంపుపసమించు నడుగు నీనొసఁటిమీఁదఁతే. నింట నుండిన నీసౌఖ్య మేల కల్గుననుచుఁ గన్నుల నూరార్చి యక్కుఁజేర్చిమోవిచిగురంట నొక్కి తమ్ముల మొసంగిపోయిరమ్మని పనిచె నప్పువ్వుఁబోఁడి. 143
క. ఈరీతి వణిగ్వల్లభుఁడారూఢిగ నోడబేర మరిగినతఱి నవ్వారిజముఖి కంతుశరాసారవినిర్ఘాతజాతసంతాపమతిన్. 144
చ. మునుకొని మేరమీఱు వలపుందనముంగల త్రోవ చూపఁగావెనుక రతీశ్వరుండు పదవే యని యెత్తులు వెట్ట నెమ్మదింబెనఁగొను లజ్జయుం బొడముభీతియుఁ దన్నరికట్ట నంతలోనినుఁ డపరాంబుధి న్మునిఁగె నీవెతలం గనలేని కైవడిన్. 145
తే. చరమదిగ్భామినీమనోహరతరాంగరాగవైఖరి మఱి సాంధ్యరాగ మెసఁగెఁగుసుమితనవీనజాతీనికుంజరీతినుడుగణంబులతోఁగూడ నొప్పె నభము. 146
క. తగనప్పు డజాండంబుననిగిడెం గాఢాంధకారనిబిడమరీచుల్జిగి కుందనంపుబరణిన్మృగమదపంకంబుఁ గలయనించిన కరణిన్. 147
వ. అప్పు డయ్యెప్పులకుప్ప యగుప్రభావతీసతి విలాసవతీరతీశ్వడుం డగు నమ్మహీశ్వరునితో ననంగసంగరవాంఛ తరంగితంబై తురంగలించు తమకంబున. 148
సీ. నానావిధద్రవ్యనవ్యసంభారముల్గలగృహంబులకు బీగము లమర్చిమొదవుల నన్నింటిఁ బిదికిన పాల్గాచియొనరఁ దోడంటుతో సుట్టిఁబెట్టిపనులు దీర్చిన తొత్తుపడుచుల నిష్టాన్నతృప్తినొందఁగఁ జేసి యిండ్ల కనిచియత్తమామలు సుఖాయత్తులై పవళింపమృదుపదంబుల నొత్తి నీదురవుచ్చితే. జలక మొనరించి జిలుఁగుమేల్వలువ గట్టికలప మలఁది మితాహారకలనఁ దేలివీడియం బందుకొని యొక్కయూడిగంపుబుడుత తనవెంట నడువ నప్పువ్వుఁబోఁడి. 149
క. తనకుం బ్రాణపదంబునుదనయనుఁగుంజెలియుఁ దనకు దైవం బగుచుందనరు తనరాజకీరముఁగని యవ్వలఁ జనుట తగిన కార్యం బనుచున్. 150
తే. కనకమణిపంజరశుకాగ్రగణ్యుఁ జేరికోరి యాత్మీయగాథాప్రకార మెల్లమెల్లమెల్లన దరహాస ముల్లసిల్లనంతయును దెల్పఁ జిల్క యత్యాగ్రహమున. 151
క. కటకటఁబడి పక్షద్వయపుటచలన మొనర్చి మిగులఁ బొగులుచు మదిలోనిటు నటు దెలియని చింతాకుటిలస్థితి నింతి కనియెఁ గోప మెలర్పన్. 152
క. ఓహరిణనయన "స్వామిద్రోహ మిదంభార” మనుచుఁ దొలుతనె విబుధవ్యూహంబు పలుక వినమేయాహా యీమాట వినఁగ నర్హమె మాకున్. 153
ఉ. ఓవర వైశ్యవంశకలశోదధికల్పలతాలతాంగి నీపోవని వారిముందఱ నయో మగనిం గడకాళ్లఁ ద్రోచి నేఁడీవసుధేశునిం గలయ నెంచితి వెట్లు? పతివ్రతామణుల్వావులు పుత్తురమ్ము తలవంపులు చేయుదురమ్మ జాతికిన్. 154
సీ. దశకంధరుని మోహదశ విచారించెనేసకలజగన్మాత జనకజాత
నహుషభూపాలు మన్నన కొప్పుకొనియెనేస్త్రీరత్నమైన శచీపురంధ్రియల సింహబలుని మాయలఁ జిక్కి చొక్కెనేవిపులసద్గుణమాన్య ద్రుపదకన్యశబరాధిపునిదురాశలకు లోనయ్యేనేరతినిభాకృతి భీమరాజపుత్రితే. తొల్లిటి మహాపతివ్రతల్ దుర్మదాంధకాపురుషు లంగభవశరాఘాతవికలచిత్తులై తముఁ జేరి యాచించినపుడుసిగ్గు వోనాడుకొనిరఁటే చిగురుఁబోఁడి. 155
ఆ. ప్రాణహాని మానభంగంబు నగు ననకెంతపనికిఁ జొచ్చితే మృగాక్షిజగతి నీమనంబు "తెగువయే దేవేంద్ర,పదవి" యనెడుసుద్దిఁ బొదలఁబోలు. 156
క. పతిభక్తి గలుగుసతికిన్వ్రతములతో గొడవ యేల వఱలు సుకృతముల్పతిభక్తి లేని చెనఁటికివ్రతములు చను వేయి యొక్కవ్యభిచారమునన్. 157
క. వినవమ్మ భామినీమణిమనమున నీ కితరసంగమము ప్రియమైనన్మును గొంతి కమలబాంధవునెనసియుఁ బొన మెఱుఁగునట్లనే వర్తిలుమీ. 159
తే. కాక తలవెఱ్ఱి గొని యలగౌతమాంగనామణి సురేంద్రు నొకనాఁడు నంటుచేసియాపదలఁ జెంది సకలలోకాపవాదమొందు టెఱుఁగవె యట్లు గాకుండవలయు. 160క. నీపట్టు గలుగువాఁడైచేపట్టుంగుంచ మైన చెలువుని నొకనింజేపట్టి రతులఁ దేలకయేపట్టున రాజు నిచ్చయించితి వబలా. 161
సీ. రాజులు కుటిలసర్పమహోగ్రతరమూర్తులధరబింబము పంట నదుము టెట్లుసార్వభౌములు చండశార్దూలసమచిత్తులించువేడుకఁ గౌఁగిలించు టెట్లుకువలయాధీశ్వరు ల్దవహుతాశనకల్పులండనుప్పొంగి పరుండు టెట్లు
నరవరేణ్యులు భద్రకరిమదాంధమనీషులెనసి బంధరతాప్తిఁ బెనఁగు టెట్లుతే. చక్రవర్తులు మాననిర్వక్రవర్తులతులతరగాఢసురతవేళాతివేలతాడనచపేటము లొనర్పఁ దలఁచు టెట్లుతెలిసి కలయిక లొనగూడ మెలఁగవమ్మ. 162
క. వారలగుణానుగుణముగవారక కనుగలిగి నడుచువారల కెలమిన్శ్రీరంజిలు జయ మొదవు నుదారత నీపదు నెఱింగి యలవడు మబలా. 163
వ. ఇత్తెఱంగునఁ దత్తరంబు లేక వర్తిల్లుమని విన్నవించిన. 164
క. అభినవవినీతివార్తావిభవం బభిరామలీల వినుచున్నతఱిన్నభము నభమైనఁ గనుఁగొనియిభగామిని నాఁటి కరిగి యిలు సేరుటయున్. 163
వ. అంత నద్ధరాకాంతుండు తదనంతరకథాక్రమం బెట్టిది యానతిమ్మనుడు. 166
తే. అవధరింపుము సకలరాజాధిరాజసతపదాంభోజుఁ డగు ధర్మనందనునకుసరసవైదికలౌకికాచారవిహితహితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టులనియె. 167
క. ఆగుణవతి మఱునాఁ డనురాగాప్తిన్ రాత్రివేళ రమణీయకళా
భోగశుభాకృతి రతిశుశ్రీగులుక న్రాజసేవ సేయుట కెలమిన్. 168
చ. కలువలు కొప్పున న్నగుమొగంబునఁ గస్తురిబొట్టు పట్టుకుచ్చలయును జంద్రకావిబురుసాపనివల్వయు మై రహింపఁగానలవడు మేల్ముసుంగుపయి నంగరుచిచ్ఛట లొప్ప నప్పు డాకలికి రమాకుమారు తురగంబుకడం దగఁ జేరె నంతటన్. 169
తే. చిలుక ముద్దులు చిలుక రాజీవనయనననునయించి వచించు నోయబల నృపకులేంద్రుఁ గదిసెద నని వచ్చు టేనెఱుఁగుదునుబికి చనఁదగ దితిహాస మొకటి వినుము. 170
క. అనఁగా ననఁగా నొకపురమొనరుం జంద్రవతి యనఁగ నుద్యోతవినూతనఖద్యోతనికేతనఘనకేతనరుచిరకనకకలశం బగుచున్. 171
తే. అన్నగర మేలు రత్నాకరాహ్వయుండువికటమత్తాహితవిఫాలుఁ డొకనృపాలుఁడతని నగరున నోడకాఁ డగుచు నొకఁడువెలయు వసుమంతుఁ డనుగౌర చెలువుమీఱ. 172
వ. వెండియు నయ్యఖండతరసంపత్కుబేరుం డగునతండు. 173
శా. ఏయూరం దనయంగడు ల్నెఱయ నేయేబేరు లెందైన నాత్మాయత్తైకధనంబు సంచిమొదలై యత్యార్జనం బొందఁగాశ్రేయఃకీర్తులు సంఘటిల్లఁ దను సుశ్రీమించఁగా నిల్పె నయ్యాయం బేర్పడఁ గోటికిం బడగ లెన్నైనం బ్రమోదంబునన్. 174
చ. వలసిన బేరము ల్తెలియవచ్చినవారును వాదుగల్గువారలు మఱి గుత్తగొల్లలును రత్నపరీక్షలవారుఁ గార్యముల్గలిగిన యింగిలీసుల ముఖాములుఁ జెంగట నుల్లసిల్లఁగాఁగొలువుననుండుఁ జూపఱలకుం గనుపండువు సంఘటిల్లఁగాన్. 175
క. ఈళయు విళంగయును బంగాళయు మొదలైన పేరుగలదీవులలోమేలైనసరకు లాతనికౌలున దిగు మాట నిజము గలవాఁ డగుటన్. 176
తే. అతనివలన మహీదేవుఁ డచట నొక్కడలఘువిద్యాధురంధరుఁ డగుఘనుండుతగుం గళావంతుఁ డనువాఁడు తలఁప నతనిసరసవాక్ప్రౌఢి దొరలెల్ల సన్నుతింప. 177
సీ. హాళి పుట్టించు సు్దయత్సుధారసధారలుప్పతిల్లఁ గవిత్వ ముగ్గడించిరక్తిఁ గల్పించుఁ గర్ణరసాయనము గాఁగసమధికస్ఫూర్తి గీతములు వాడియింపొనర్చు ధరాతలేశ్వరవరసభాస్థలి సత్ప్రసంగ వార్తలు ఘటించియద్భుతం బొసఁగు శబ్దార్థవైచిత్రినిబంధనకావ్యవైభవము నొడివితే. యింతమాత్రంబె కాదు శ్రీమంతుఁడును నితాంతశుభవంతుఁ డగువసుమంతుఁ డలర
దండ నొకవేళ నీతిసంధానలీలబుద్ధులన్నియుఁ దెల్పు నప్పుడమివేల్పు. 178
క. ఈరీతి సకలధర్మవిచారుం డగునతనిమాట జవదాటక యగ్గౌర మనుచున్నఁ దన్నగరీరత్నం బేలునట్టి నృపవరుఁ డెలమిన్. 179
తే. మంతు కెక్కిన యవ్వసుమంతు ననునయించి ప్రియభాషణంబుల హితవొనర్చిజలధి కవ్వలదీవులఁ గలసమస్తవస్తువులు బొక్కసముఁ జేర్పవలయు ననుడు. 180
ఉ. రా జొనరించు మన్ననకు రంజిలి యవ్వసుమంతుఁ డష్టదిగ్రాజమనోభయంకరపరాక్రముఁ డానృపుతోడ నేన యవ్యాజత దీవి కేగి కలవస్తువు లన్నియుఁ దెత్తుఁ బంపుమోరాజకులేంద్ర యంచు సుకరంబున మున్ను వచించి పిమ్మటన్. 181
క. తననగరుఁ జేరి సమధికధనధాన్యసుపుత్రమిత్రదారాలయమండనమైన కాఁపురం బిదియను వగునే విడిచి చనుట కని చింతిలుచున్. 182
ఉ. కారుమెఱుంగురాచిలుక కస్తురివీణ పదాఱువన్నె బంగారము రస్తుకుప్ప తెలిగంబుర వెన్నెలలోని తేట యొయ్యారపుఁడెంకి యందముల కన్నిటికిం దగుపట్టుగొమ్మ సింగారపుదొంతి యైనకులకాంత నయో యెడఁబాయనేర్తునే. 182
తే. అనుచు మదిలోనఁ దలపోసి యడలునంతఁజెంతనాసీనుఁ డగుకలావంతుఁ డనియెదొరలచెంగట వెనుకముందును దలంపకార్యుఁడు వచింపఁ దగునె యేకార్యమైన. 184
క. మునుకొని తత్ప్రకృతంబునుదనశక్తియు దేశకాలధర్మము నృపునర్తనమును రాణువసంచునుగని మాటాడంగవలయుఁ గద సభలోనన్. 185
వ. ఇత్తెఱంగునం బ్రవర్తింపక దైవయోగంబువలనఁ బ్రమాదంబని తలంపక రాజసన్మానంబునకు నుబ్బి తబ్బిబ్బు గాఁ బచరించిన భవద్వచనం బమోఘంబు గావింపవలయుం గాక నిరర్థకం బొనరించినం గొదవ యగుంగదా సకలజనశ్రేయస్కరంబును స్వకీయజనజీవనాధారంబును బహుప్రసిద్ధియునుం గలుగునట్టుగా రాజోచితకార్యంబు నిర్వహింపుమని విన్నవించిన. 186
తే. సమ్మదంబున వసుమంతుఁ డుమ్మలించికూర్మిబంధుల నందఱఁ గుస్తరించిగోలయుఁ బలివ్రతాధర్మశీల యగుచుఁబ్రాణపదమైన యిల్లాలిపజ్జఁ జేరి. 187
చ. మది వెతఁజెంద బేడిసల మార్కొనుకన్నులు నీరుబుగ్గలైపొదలఁగ ఘర్మబిందుపరిపూర్ణతనూలత కంప మొందఁగామృదుమధురోక్తి తొట్రుగొన మేలుకనంబడ వెచ్చనూర్చునమ్మదవతి నాదరించి వసుమంతుఁడు దా నలనాఁటి వేకువన్. 188
క. పరికరముల మంకెనలునుబరిచారకు లరిదిపనులపట్టుగుడారుల్సరిబేరు లైనగౌరలుదొరయం జనవిఫ్రుఁ డతనితో నిట్లనియెన్. 189
క. చనుము బహుశ్రేయస్థితిఁగని పునరావృత్తి మహిమ గలిగి శుభాప్తిన్మను మింకొక్కటి తెల్పెదవినుము మదీయప్రసంగవివశాత్ముఁడవై. 190
తే. అతిరయంబున నొకకార్య మాచరించునతనియవివేక మఖిలాపదాస్పదంబుతెలిసి సత్కార్యభాగవర్ధిష్ణుఁ డైనప్రాజ్ఞుఁడు కృతప్రలబ్ధసంపదలఁ బొదలు. 191
మ. అని పల్క న్విని యేతదర్థకృతపద్యం బప్డు తాళీదళంబున వ్రాయించి మెఱుంగుకత్తి యొఱలోఁ బొందించి తానత్తఱింజని పొంతం గనియె న్మహానటజటాఝూటస్ఫురన్నిర్గళద్ఘనధారాపతనప్రకంపితమహాక్ష్మాభాగ భాగీరథిన్. 192
వ. కని యప్పు డప్పుణ్యతరంగిణీజలంబులఁ గృతస్నానదానాద్యనుష్ఠానుండై కృతకృత్యుం డగుచు నచ్చోటివాసి యిలావృతహిరణ్మయరమ్యకభారతప్రముఖబహువిధవర్షంబు లవలోకించి తత్తద్విచిత్రంబుల కాశ్చర్యం బంది యవ్వలం గడచి నడచి యనేక దుర్గవర్గకాంతారమార్గంబు లతిక్రమించి చనునప్పు డప్పురో భాగంబున. 193
సీ. స్వరునిష్ఠురాఘాతసంక్షోభమున కళ్కిమైనాకుఁ డెవ్వాని మఱుఁగుఁ జొచ్చెమునికోపనిర్ధూతఘనతరైశ్వర్యంబునగభేది కెవ్వాఁడు మగుడ నొసఁగెసకలజంతువ్రాతసంరక్షణఖ్యాతిజలధరం బెవ్వానివలనఁ జెందెసంపత్కటాక్షలక్షణకన్య నలరించిదనుజారి కెవ్వాడు ధారవోసెతే. నతఁడు ముంగలఁ గననయ్యె నంబుచరకుళీరముఖసత్వచటులసంచారజనితబహువిధాభ్రంకషోర్మికాభయదఘుమఘుమారవశ్రీకరుండు రత్నాకరుండు. 194
క. అచ్చోటఁ గడలిరాయనినచ్చుగ వీక్షించి కౌతుకాయత్తమతిన్మెచ్చుకొని చేరనరిగె వియచ్చరజనవినుతమైన యవ్వలిదీవిన్. 195
తే. అందలి విచిత్రవేషభాషాభిరాములగుపరంగులతోడి నెయ్యమునఁ జిక్కిచొక్కి బహువత్సరంబు లచ్చో వసించిపిదపఁ బ్రభుకార్యభారంబు మదిఁ దలంచి. 196
సీ. నవవిధదివ్యరత్నంబు లేనుంగులుగోపతేజీ ల్పచ్చికుంకుమంబుకస్తూరివీణెలు కట్టజవ్వాది కప్పురము బన్నీరుచెంబులు పటీర
తరులఖండంబు లందలపుఁగొమ్ములు జల్లిసవరము ల్పాదరసంబు జాజిశాయ యింగువ లవంగంబులు నోడపోఁకలు పంచలవణము ల్గంధకంబుతే. కొచ్చివేఁపులు మానిసిక్రోఁతు లాదియైన వన్నియు నోడల కనువుపఱచికడలి దాఁటించి చెల్లెలికట్టఁ గడచియంత నెఱవేఱి తనయూరిచెంతఁ జేరి. 197
తే. పటకుటీరాంగణములలో బహువిధైకవస్తువులు కుప్ప లొనరించి వసుమతీంద్రుచెంత కానుక లిడనెంచు నంతలోననంబుజవనీమనోహరుం డస్తమించె. 198
మ. వసుమంతుం డపు డంతరంగజనితవ్యామోహభారంబునన్వెసం బ్రాణేశ్వరిఁ జూడఁగోరి త్రిజగద్వీరుండు మారుండు తీవ్రసుమాస్త్రప్రహతిన్ హళాహళి యొనర్పం దద్వియోగవ్యథావ్యసనాప్తి న్నిలుపోపలేక విరహవ్యాప్తి న్వగం జెందుచున్. 199
చ. అడలుచుఁ దాళరానివిరహార్తి మెయిం దురిటిల్లు దానికీల్జడపస దాని బేడిసపిసాళికనుంగవ దానియంచరానడుపులు దానిమోవిరుచినాణెము దానిమెఱుంగు దానినున్బెడగును గుబ్బచన్నుఁగవపెంపుఁ దనూలతసొంపుఁ జూడమిన్. 200
వ. వెండియు. 201
మ. ముకురంబుల్ నునుజెక్కు లక్కలికినెమ్మో మామఱింజందమామకు మేలై తగు గుబ్బచన్నులకు ఱొమ్ముం జాల దాకన్ను లావికచాబ్దంబుల నేలు నయ్యబల నివ్వేళ న్విలోకింపకేనకటా యేగతి సైఁచువాఁడ నని మోహాక్రాంతచేతస్కుఁడై. 202
చ. నను నెడబాయలేనియెలనాఁగ వియోగభరార్తి నిప్పుడేయనుపున నున్నదో నిజగృహం బెటులయ్యెనొ యొంటిపాటునంగనఁదగునంచుఁ దీక్షతరఖడ్గధరుండయి గూఢవర్తనంబుస వెసఁ జేరె నంతపురముం దను నన్యు లెఱుంగనట్లుగాన్. 203
ఉ. ఆరసికాగ్రగణ్యుం డపుడయ్యవరోధవిచిత్ర కేళికాగారము సొచ్చి చొక్కటపుఁగంకటిపై నొకమోహనాంగశృంగారునితోడ దీపకళిక ల్వెలుఁగ న్నిదురించుచున్న యన్నీరజగంధిఁ జూచి యెద నెగ్గురనంగడు విస్మితాత్ముఁడై. 204
క. కనుఁగొనల నిప్పు లురులగంగనలుచు శివశివ యిదేమి కారణ మెటులంగనువాఁడ నేరితో నేమనువాఁడం గొఱఁతవచ్చెనని చింతిలుచున్. 205
క. కాంతల నమ్ముదురే ధీమంతు లిసీ సుతనులతలు మాయామృగముల్హంతలు జగజంతలు నిసుమంతయు లోకాపవాద మరయరు మదిలోన్. 206
మ. నిలువెల్లం గనకంబు ముద్దుపలుకు ల్నిర్యత్సుధాబిందువుల్సొలపుంజూపులు చంద్రికారుచు లటంచు న్నమ్మి యున్నట్టు
లిక్కలకంఠుల్భువి సాభిమానలని వక్కాణించితిం గానిదోషలతాదోహదలై ప్రవర్తిలుట యోజం గానలేనైతిగా. 207
వ. అని బహువిధంబుల వితర్కించి. 208
క. రెండొకటిగఁ గంటిఁగదాదండించుట నీతి యాౌఁగదా యని కడునుద్దండతరచండమతియైఖండా యొఱడుస్సివైచి కర మెత్తుటయున్. 209
తే. మును గళావంతుఁ డానతిచ్చినసుభాషితము లిఖించినచీటి దోర్దండచండమండలాగ్రంపుటొఱలోన మాటియుండెగాన నది నేల వ్రాలుటఁ గని యతండు. 210
క. ఇది యేమో యని కేలంగదియించి ప్రదీప్తదీపకళిక వెలుఁగునంజదువుచుఁ బ్రాక్తనవిద్వత్ప్రదనీతిశ్లోక మగుట భావించి వెసన్. 211
తే. “అతిరయంబున నొకకార్య మాచరించునతనియవివేక మఖిలాపదాస్పదంబుతెలిసి సత్కార్యభాగవర్ధిష్ణుఁడైనప్రాజ్ఞుఁడు కృతప్రలబ్ధసంపదలఁ బొదలు.” 212
వ. అని యివ్విధంబునం గననైనఁ దచ్ఛ్లోకం బరసి నిజవధూమణిం దిలకించిన. 213
ఉ. మాసినదీర్ఘవేణి కుఱుమాసిన చేలచెఱం గలం క్రియావాసముగాని మేను వసివాఁడిన ముద్దుమొగంబుఁ గాంచియయ్యో సరసీరుహాక్షి మదయోగభరంబున నిట్లు ఖిన్నయైగాసి వహించియున్నదని కంది వెస న్వసుమంతుఁ డత్తఱిన్. 214
మ. మది నొక్కించుక శాంతి నొంది యొఱలో మాద్యద్విరోధివ్యథాస్పదశౌర్యంబగు వాలు సేర్చి సతిపజ్ఞం జేరి నిద్రించు నీమదనప్రాయుఁడు నన్నుఁ బోలిన జగన్మాన్యైక రేఖాంగసంపదఁ జెన్నొందినవాఁ డిదేమొ యనుచుం భావించి తానాత్మలోన్. 215
క. ఈనాఁ డయ్యెడు కార్యముగానేరదె ఱేపటంచుఁ గడునెమ్మది నమ్మానధురంధరుఁ డతఁ డాస్థానస్థలమునకుఁ జనియె జలజాతముఖీ. 216
ఉ. అంత లతాంతచాపలత యంగభవుం డపు డెక్కుడించెఁ దత్కాంత ప్రభాతమయ్యెనని కాంతనిశాకరకాంతమందిరాభ్యంతరవర్తియై తపనుఁ డస్తగిరీంద్రముపొంతఁ జేరుపర్యంతము వేఁగి వేగ విహగాగ్రణి మ్రోలవసించి వేడుకన్. 217
క. కడమకథ నుడువు మనినంబడఁతికి శుకలోకపట్టభద్రుడు తెలిపెన్వడి నాఘనుఁడు నిశీథినిగడతేఱి ప్రభాత మగుటఁ గని యవ్వేళన్. 218
వ. యథోచితనిత్యకృత్యం బగుసత్కర్మకలాపంబు నిర్వర్తించి తదనంతరంబ. 219
తే. లీల రత్నాకరుండు నిండోలగముననుండి తనుఁ బిల్వఁబంప నమ్మండలేంద్రుజేరి నానావిధద్వీపచిత్రదేశవివిధవార్తాప్రసంగము ల్విన్నవించి. 220
క. తెచ్చిన సమస్తవస్తువులచ్చుపడ స్సమ్ముఖమున నలవడ నిడి తన్మెచ్చి కొలువెల్లఁ బొగడఁగనచ్చో వివరింపఁదొడఁగె నధిపుం డలరన్. 221
రగడ—దేవ యవలోకింపు మిది తెలిదీవిఁ బొడమిన పద్మరాగముపావనం బొనరించుఁ దను వనపాపొయరుచి నల పుష్యరాగముతళుకుఁ దుమ్మెదతాళి కగునని తలఁపుమీ యీళాపునీలమువెలఁదులకుఁ జేర్చుక్కతుద నొదవించు ముడువగు నీప్రవాళముగొప్పలగు చౌకట్లకని చేకొంటి మివె కట్టాణిపూసలుచెప్పఁ జూపంగరావు మక్కాసీమ వీగుజరీతివాసులుఎత్తుకెత్తు మెఱుంగుకుందన మిచ్చి తెచ్చితి మీసిరాజులుహత్తివాయుమనోజవంబుల నలరు నీసామ్రాణితేజులుకురుచలైనను నిచ్చమదమునఁ గొఱలు నీయేనుంగుగున్నలుదొరయ నొకపరిపాటి దొరలకు దొరక వీవిడికెంపుమిన్నలుకలువడంబులఁ గలయ వివి చొక్కంబులగు కస్తూరివీణెలుతెలిసి వేయివరాల విలువలు దీర్చితిమి యీరుద్రవీణలునిలువు నిలివెఁడు సోగవగపెన్నెరుల కివి సమకట్టు జల్లులుపిలుపులను గడుఁబ్రోది సేయఁగఁ బెరిఁగినవి జవ్వాదిపిల్లలుగమ్మురని పన్నీరు తొలకెడుఁ గంటివేయివి గాజుపనఁటులు
చిమ్మి రేఁగెడు కప్పురపురవఁ జెందునీ యేడాకు టనఁటులువహిఁ దొలంగక నీటిపైఁ జనువరుస నీయందలఁపుఁ గొమ్ములుబహువిధమ్ములఁ జదువు నివిగోఁ బంచవర్ణము లగుశుకమ్ములుపంచలోహపుగట్టిపనులను భద్రమైనవి యివె పిరంగులుకంచుమించుగ నడవిమెకముల గదుము నివిగో బలుసివంగులుఅల్లనేరెడువాగుజలములనైన యవి యపరంజిలప్పలుమొల్లముగ రజతాద్రి కెనయై మొనయు నీతెలివెండికుప్పలుపట్టుపిడికెఁడు నెనయు జీనువుపట్టురవలివె జవిడికట్టులుయిట్టలపురతి వేళఁ గవకిన లెసఁగునీ బక దారిపిట్టలుచికిలిపుత్తడి క్రొత్తహరువులఁ జెందు నివిగో సూరెపానులుఒకటఁగస్తురిమెకము లుండుట కొప్పు నీదంతంపుబోనులుఎసఁగ నన్నములోని విసముల నేర్పఱుచు నీసింగిలీకలుఅసమశౌర్యధురీణులకు బిరుదందు రల్లవె హరిచెయీకెలుసొగసు పటికంబుల నమర్చిరి చూడు మీసొగటాలచందముపగడముల నీలముల నిరుగడ బలములవె చదరంగమందముగాలికన్నను వేగఁ జను చులుకనివి యివె కొల్లారుబండులుమేలిమిగ రాహత్తులకు నియమించినవి సింగాణివిండులుత్రొక్కినారు పదేసిమణుఁగులు తొలుత నీకుంకుమపుగోనెలుమిక్కుటపుఁ గస్తూరివలపుల మించు పునుఁ గిడఁదగినపూనెలుమలయగిరికూటమునఁ గల వీ మంచిసిరిగందంపుమ్రాకులుతళుకుఁ దళుకున మించునివె నిద్దంపుమగఱాపిడులబాకులుఆనవాల్గ్రోలుటకుఁ దగు నీయబ్బురఫు నెలఱాలగిన్నెలుపూని యుడిగ మొనర్పనేర్తురు పొంత నీయుడిగంపుఁగన్నెలు
ఠీవి నలఖర్జూరములఁ బురుడించు నల్లవె యోడపోఁకలుశ్రీ వెలయు గేదంగిఱేకులచెలువు గల వీపండుటాకులు. 222
క. అని గౌర పలుదెఱంగులవినిపించి యొసంగు వస్తువితతుల నెల్లంగొని యెంచుకొని నృపాలుఁడుమనమున నుప్పొంగి సబహుమానప్రౌఢిన్. 223
చ. విడిగల కెంపురారవల వింతపనుల్గలతాళి వజ్రపుంగడియములు న్సుపాణులచొకాటపుచౌకళికట్టువర్గముల్గడుఁబ్రియ మొప్పనిచ్చి కుతుకస్థితి నవ్వసుమంతు నప్పు డయ్యొడయఁడు పంప నింద్రవిభవోన్నతుఁడై యతఁ డింటి కేగినన్. 224
తే. అతని పాణిగృహీతి మోహనతరాతిరూపవిఖ్యాతి రతిరీతి నేపుఁజూపివెలయు గుణవతి తన ప్రాణవిభుని రాకకుబ్బి సంతోషరసవార్ధి నోలలాడి. 225
సీ. పసుపు నల్గుఘటించి పైఠాణి సవరించెజిగిమేని కొకవింత సిరి జనింపఁగడల రేఖ లమర్చి కాటుక దీర్చె వాల్గన్నుల కొకవింతకాంతి మెఱయనిలువుటద్దము చూచి తిలకంబు దిద్దె నెమ్మొగమున కొకవింతముద్దు గులుకజవ్వాది పదనిచ్చి కొవ్విరు ల్ముడిచెఁ బెన్నెఱివేణి కొకవింతహరువు లెసఁగ
తే. మఱియు నిలువెల్ల నొకవింతయొఱపు నెఱపనింటఁగలచొక్కటపుసొమ్ము లెల్లఁ దాల్చివినయలజ్జాభయంబులు నెనయఁ బ్రాణనాథునకు మ్రొక్కి నిలిచె నానలిననయన. 226
తే. అంత నతిలోకచారిత్రుఁ డగుసుపుత్రుఁడతివినయభక్తి త్పర్యయుతము గాఁగహితబుథాశ్రితగురుపురోహితులతోడజనకుకడ నిల్చి సాష్టాంగవినతి సేయ. 227
ఉ. ఎత్తి దృఢాంకపాళిఁ గదియించియు నిన్నటి యర్ధరాత్రి నీచిత్తజరూపుఁ డీయబలచెంతఁ దమి న్నిదురించుచున్నవాఁడిత్తఱి నన్నుఁ జేరె భయ మించుక యేనియు లేక వీని దుర్వృత్తిసువృత్తు లే నెఱుఁగు టెట్టులొకో యని సంశయింపఁగన్. 228
క. కులవృద్ధు లప్పు డాతనికళ యెఱిఁగి భవత్ప్రయాణకాలంబున నీకులకాంతాతిలకం బీయళికచ నెలమసలియుండు టది యెఱుఁగవొకో. 229
తే. అంత నీశ్వరుకరుణాప్తి ననుదినప్రవర్ధనంబైన తద్గర్భవనధివలననవతరించె నితండు నీయౌరసుండుకనుఁగొను మటన్న సంతోషకలితుఁ డగుచు. 230
క. సతిపాతివ్రత్యంబునుసుతునిగుణాఢ్యతయుఁ దెలిసి చుట్టపువారల్
మతి సమ్మతించునట్లుగఁజతురుండై మెలఁగె నతఁడు సరసీజాక్షీ. 231
తే. ఇత్తెఱంగున మనసెట్టి యింటిమీఁదిబాళినైనను నినుఁజూచు బాళినైననింతలో వచ్చె నేని నీవింట లేమికేమనుచు బొంకఁగలవు పూర్ణేందువదన. 232
క. ఈకథ వింటివి గద యస్తోకమతివి దెలిసికొమ్ము సూత్రప్రాయంబై కనుఁగొన నయ్యెడు కార్యాకార్యము లని వచింప నటు వేగుటయున్. 233
క. ఱెక్కలు విదిల్చి లావులుముక్కుకొనం దువ్వి మోదమునఁ గంధరముల్మిక్కిలి దిక్కుగనుంగొనఁగోక్కురోకో యనుచుఁ గోళ్లు కూయం దొడఁగెన్. 234
క. ముడిఁగె దొగ లడఁగె ఱిక్కలువిడిగెఁ బయోజమ్ము లుడిగె వెన్నెల లటు గ్రుంకడిగె నెలవడిగెఁ గత్తింగడిగె మరుం డినుఁడు తూర్పుకడఁ బొడమునెడన్. 235
తే. అంత నయ్యింతి యింత యంతనఁగ రానివంతఁ దన యంతిపురిఁ జేరి కంతునిసితకుంతహతిఁ గొంతగుంది సాయంతనాప్తినెంతయు దురంతవిరహసంక్రాంత యగుచు. 236
సీ. మెఱుఁగంచు కమ్మలు నిరసించు మితి లేనివెలనొప్పు మణుల కమ్మలు ధరించిసూలచేకటు లొకమూలవై చి సిరాజిగనుపుల గళ్లచేకటులఁ దాల్చియక్కచె వాదుల యరతుబొట్టట వెట్టిపుత్తడి మెడనూలి బొట్టమర్చిచిఱుతపొప్పళిరోసి సరిగంచుపసరు పొప్పళికుచ్చెల చెఱంగు వలువగట్టితే. సేస కొప్పునఁ గపురంపుచిత్రకంబుగళమునఁ గుచాద్రులను దళ్కుగందవొడియువలపు గులికెడు సింగార మొలుక ముద్దుఁజిలుకకడ నిల్చెఁ గోమటికులుకులాఁడి. 237
తే. చెంతనిటు నిల్చియున్న యక్కాంతఁ జూచిచిలుక యొకవార్త వివరింపఁ దలఁచినపుడెకలికి నన్నపు డారాజతిలకుఁగూర్చిమిగుల నుపకార మొనరింపఁ దగునసుండు. 238
ఉ. కాంతరొ యెట్లు కాఁదగిన కార్యము లట్లగు మున్గళావతీకాంతకు మోహనాంగు నుపకాంతుని నమ్మణిమండనక్షమాకాంతుని నేనె కూర్చి యుపకార మొనర్చితి నే తలంప నొక్కింతయు నంతరాయ మగునే విధి వ్రాసిన వ్రాత కిమ్మహిన్. 239
వ. అది యెట్లం టేని విను మీప్రకారంబునకుం దగిన జగదసాధారణం బగునొక్క గాథ కలదు వివరించెద నిది సావధానంబుగా నాకర్ణింపు మని యిట్లనియె. 240
క. కమలాకరమను నొకపురమమరు సురవ్రజనుతధ్వజానీకమరుద్భ్రమదభ్రచయప్రమదాసుమదామకటాక్షజనితసూనశరంబై. 241
ఉ. ఆపురి రాజ్యలక్ష్మి కిరవై మణిమండనుఁ డేలు రూపరేఖాపరమన్మథుండు చతురబ్ధిపరీతధరాధురంధరారోపభుజార్గళుండు చతురుండు సమస్తమదాభియాతిసంతాపకరప్రతాపుఁ డొకనాఁ డతఁ డెంతయు సంతసంబునన్. 242
క. ఒక చక్కిఁ జక్రసమకుచలొకదండం దండనాథు లొకచో శకచోళకళింగవంగగూర్జరకుకుర నృపు ల్గొలువ నిండుకొలువగు వేళన్. 243
ఉ. కొమ్ములు మ్రోయ మంటితమకు ల్వెస బోరుకలంగఁ బార్శ్వభాగమ్ముల నల్ల నల్ల ప్రజ గ్రమ్ముకొన న్వెస జాగిలంపు మొత్తమ్ములు ముంగలన్నడువ దర్ప మెలర్పఁగఁ జెంచుపాళెగాఁడమ్మనుజేంద్రు కొల్వునకు నచ్చెరువందఁగ వచ్చెఁ జెచ్చెఱన్. 244
తే. కుఱుచవగ కేలుగవమోడ్చి కోరసిగయుఁగూడ ఱొమ్మును మోఁకాళ్లుగూడ వంచికొలువు దొరలించుక హసింపఁ గువలయేంద్రుచరణకంజమ్ములకు మ్రొక్కి చక్కనిలిచి. 245
సీ. నివ్వరిప్రాలు తేనియ పాలపండులుకారెనుములపెర్గు చాఱపప్పు
పునుఁగుఁజట్టంబులు పునుఁగు కఱ్ఱజవాజికమ్మకస్తురి పచ్చకప్పురంబునేకలంబులకోఱ లేనుంగుకొమ్ములుబురుడుజింకలు పెనుపులుల గోళ్లుహరిచ యీకలు నెమ్మిపురి జొంపములు తెల్లసవరము ల్జల్లులు జాగిలములుతే. పిగిలిపిట్టలు డేగలు బెట్టుడుతలుపట్టుజిట్టలు ఫణిఫణాభద్రకుంభికుంభవరదంష్ట్రిదంష్ట్రికాకోటిగళితకలితముక్తాఫలంబులు కాన్క చేసి. 246
తే. సామి నావిన్నపము విని సారి వెడలియొక్కమలచెంత గడెతడ వున్నఁజాలుఁజెండు బెండాడి మెకముల బెండు పఱిచిదేవరకు వేడ్క పుట్టింతు దేవునాన. 247
క. అని విన్నవింప వినియమ్మనుజేంద్రుఁడు సబహుమానమహిమఁ బుళిందుంబనిచి నిజాంతఃపురికింజని యాఖేటకవిధాన సత్వరమతియై. 248
సీ. పసరుపట్టుహిజారు మిసమిసలుఱుతకాల్మెఱుగుటంగికి వింతయొఱపు నింపగాశ్మీరపంకసంకలితాంగదీధితుల్కప్పుదుప్పటికిఁ జెంగావు లీనజాళువాజిగి జిరాసరిపెణల మెఱుంగుచిలుకతాళికి నొక్కసిరి యొసంగ
సిగతాయెతులనిగ్గు జిలుగు తాపిత సన్నసరిగ జంటకుళాయి కొఱపు నెఱపతే. నుదుటఁ గస్తురిరేక వీనులఁ గిరీటిపచ్చరాపోగులుఁ గృపాణి పాణి నలరంబాదముల జీవదంతపుఁ బావలూఁదిరాజకందర్చుఁ డంతఃపురంబువెడలె. 249
తే. సరిదొరలు దండ నొరయ నాస్థానమండపమున నిలుచున్న యంతలోఁ బాదరసముజోక గలతేజి నిండుసంజోకఁ జేసియెదుట నటు దెచ్చి నిల్పె సాహిణి యొకండు. 250
క. మనమలరఁగ నత్తురగముఁగని కనుదమ్ములనె మ్రొక్కి కర్ణఫుటరసాయనసౌవిదల్లసాహోనినదం బెసఁగంగ నెక్కి నృపుఁడు నిపుణుఁడై. 251
సీ. భేరీమృదంగశంఖారావములు మాగధస్తవార్భటుల దిక్తటము లద్రువబిరుదకేతనపరంపరలు శిలోత్తాలతాలవృంతములతో మేలమాడఁదెల్లపావడల దీధితులు ముక్తామణిచ్ఛత్రకరుచులపైఁ జౌకళింపుసాంబ్రాణి పొగలు నిచ్చలపు ధూమ్రంపుఁ దిత్తుల దుమారములతోఁ గలసి మెలఁగఁ
తే. జామరద్వయచలనసంజాతవాతకందళంబులు వదనారవిందఘర్మకణము లడఁపఁగ వెడలె నల్లడలఁ గదియుసేనతో నద్ధారాసునాసీరుఁడంత. 252
వ. ఆఖేటసమయసముచితసముత్సాహసన్నాహబహువిధచమూసమేతుండై చనునప్పుడు.253
సీ. వంకులు గుదియలు వలత్రాళ్లు మ్రోకులుబిసలు మాఱమ్ములు పెద్దవిండ్లుపచ్చకట్టెలగురు ల్బలుతుపాకులు నెద్దులేనుంగులు సివంగు లిఱ్ఱిపోతుపిడుకకుంపటు లాకుతడికెలు ప్రోగుత్రాళ్వాడిగొడ్డండ్లు మవ్వంపుటురులుపాఁదిగువ్వలు మోటుపలకలు పోటుగుంజలు చిక్కములు నురు ర్జాగిలములుతే. జిగురుగండెలు గాలపుఁజివ్వవెదురులాదియగుసాధనంబులు నలవరించుకొని హుటాహుటి నడలతోఁ బినుఁగు లెల్లఁగదిసి నడిచిరి యమ్మహీకాంతునఱుత. 254
వ. అప్పు డప్రతిభాప్రభావుండై. 255
సీ. మంజులద్రుమలతాకుంజంపుజస్థలీఘుటఘుటార్భటిలుఠత్కిటికులంబుబహుమహీధరగుహాగృహవినిర్నిద్రముద్రానిర్యదురుమృగేంద్రవ్రజంబు
గండమండలనినిర్గతగళద్గంధానుచరదళిప్రోల్లసత్కరిఘటంబుసరభసోద్ధతపరస్పరహతాహతభగ్నఖురవిషాణోగ్రకాసరబలంబుతే. చండతరఘోరశార్దూలసంఘచటులచంక్రమక్రమదృగ్మాత్రజాతహరిణధావనం బగు నొక్కమహావనంబుమన మలరఁ గాంచి చొత్తెంచె జనవిభుండు. 256
తే. పొలము చోపుడు వెట్ట నన్నెలవరులకుసెలవొసంగిన నృపమౌళిచిత్త మెఱిఁగిచెంచు లాఖేటకక్రియాచుంచు లగుచునట్టు లొసరింప నప్పు డత్యద్భుతముగ. 257
మ. చకితేభంబు సముద్యమన్మృగమనాశ్వాసవ్యథాకీర్ణగండక మత్యంతహఠాల్గుఠద్గవయమాఢౌకాయమానస్థలావృకమాక్రోశనకృన్మృగేంద్రము రణద్బీభత్సకృత్కోలముత్సుకభిద్భావతరక్షువై గహన మచ్చో ఘూర్ణతం జెందఁగన్. 258
సీ. వడిగాలివడి నిల్వ వసపోక బలితంపుసరిపెణ ల్దునియ వేసరక నిగుడుఁబట్టెడ సడలించుపర్యంతమును దాళకతులరోషాప్తి నిట్టట్టుఁ బెనఁగుబదియు నిర్వదియు ముప్పదియు నల్వది చొచ్చికదుపులు చెదరఁ జీకాకు సేయుఁగటికి నెత్తురులతోఁ గంద లుర్లి పడంగఁజేరి పందులపాలచేర్లు గఱచు
తే. వేలికలు వెంట వెస నంట నేపురేఁగికోపు మీఱి జనోద్వృత్తిఁ గూడఁ బఱచియెందుఁ జొచ్చినఁ జొరనీయ కీడ్చి తెచ్చిసలుగులను గూల్చె నొకకొన్నిజాగిలములు. 259
తే. భటుఁ డొకఁడు వింటఁ జుఱుకంటఁ బంది నేయమిట్టిపడి మించు మెఱసిన ట్టట్లె తూఱియది భయదఘర్ఘరారావ మడర నతనిరెండుతొడలును వెసఁ గత్తిరిలఁగఁ జంపె. 260
క. కొంతాన నొకఁడు బెబ్బులిగొంతానం గ్రుచ్చి మెచ్చుకొని తను దెలుపన్వంతుకుఁ గడువడి నొకండొక్కింతయు బెదరక పిడెమున నెలుఁగుం బొడిచెన్. 261
క. బొఱియవడ వేఁపు లొకకిటిఁగఱచి కఱచి కూల్చె నపుడు కండలు ప్రేవుల్మెఱయఁ దమయేలికలకుంగుఱిమేరయుఁ బాళ్లమర్చుకొనుపొంకమునన్. 262
సీ. వల చంగునను దాఁటి పడి నేను నొకలేటికొంకి కొంకక త్రొక్కి కూల్చె నొకఁడుకలగుండు వడ రొప్పిగవినుండి కుప్పించుపులి గుండె లవియంగఁ బొడిచె నొకఁడుపొదహత్తుకొని సమున్మదవృత్తిఁ జనుహ త్తికొమ్ములంటఁ బెకల్చి కొట్టె నొకఁడు
పేరెండ నొకకొంత నోరెండుకొనియుండుగండభేరుండంబుఁ గదిమె నొకఁడుతే. వెండియు నొకండు నిశితోగ్రమండలాగ్రచండతరధారనుద్దండశరభకాండశశగవయఖడ్గముల నెల్లఁ జక్కు సేయఁగండ లురులఁగఁ గడుదులఁ జెండె నొకఁడు 263
క. ఈరీతి వేఁటకాండ్రనివారణమృగపఙ్క్తి నెల్ల వడిఁ దఱిమెడిచోధీరుఁ డల రాజచంద్రుఁడుకోరుకు లెసకొలుప సుభటకోటులకంటెన్. 234
మ. పులులం ద్రుంచి కడుందులందు నిమిదుప్పు ల్నుగ్గునూచంబులైపొలియం జేసి వరాహసంఘముల రూపుల్మాపి సింగంపుగుంపులనెల్లం దెగటార్చి యేనుఁగులతోఁ బోరాడి భల్లూకమండలి నిట్టట్టొనరించియుండునెడ దండన్విస్మయంబొప్పఁగన్. 265
ఆ. ఒక్క నక్క వల గతుక్కునఁ గొఱకి తానవలఁ జనఁగ వెంటఁ దవిలె బలమువసుధ నక్కఁ గన్న వాఁ డెల్ల టకాఁడనెడువార్త నిక్కమయ్యె ననఁగ. 266
వ. అట్టి యెడ. 267
ఉ. కోఱలు చప్పరించి కనుగొల్కుల నిప్పుకలొల్క నల్కమైబోరున రొప్పి పైఁబడినపోతరపుంగిటి నొక్కకేలునన్మోరట బిగ్గఁ బట్టి దృఢముష్టిహతి న్వడినొంపఁజూచి కేల్జాఱుటఁ బాఱె నమ్మెకము జాగిలము ల్వెస వెంటనంటఁగన్. 268
ఉ. హాళి నృపాలమౌళి చతురంగబలంబుల ప్రాపు గోరకంజాలపరాక్రమించి జవసైంధవము న్వడిఁబోవ నూకి తత్కోలము వెంటనంటిచన ఘోరవని న్వెసమాయమయ్యెఁగాఁబోలు ననంగ సమ్మెకము పోవుటకు న్మదిఁ జింతనొందుచున్. 269
క. మును వెనుక తెలియ కత్తఱివనమండలిఁ దిరుగునతని వరవీరభటుల్ననుఁ జూడుఁడు ననుఁ జూడుండనువారలు వెంట నంట నర్హులు గామిన్. 270
సీ. దుర్గమసమ్మర్ధకర్దమస్థలములఁజనరాక మదసామజముల డించిచటులనికుంజపుంజములఁ గాలాడనికతనఁ గంఖాణసంఘముల నునిచితండోపతండ మై గండోపలము లుండుపథములందుఁ గొలారుబండ్ల నాఁగివంకలౌ నలునంక లంకమలల్దాఁటసమకూడమికి నందలములు డిగ్గితే. దారి తెలియక ఘోరకాంతారభూమిఁజెట్టు కొకఁ డైరి యారాజసింధురంబుపొలుపుఁ గనుఁగొనవలసి యుమ్మలిక వొడమనక్కడక్కడ సామంతు లరసి యరసి. 271
క. కలగుండు వడి పొలంబుననిలువంబడి మ్రాకులట్లనే యున్నతఱిన్జలరుహబాంధవుఁ డస్తాచలశిఖరముఁ జేరె నంత సంజ జనించెన్. 272
సీ. కకుబబ్జముఖులకుఁ గస్తూరిపూఁతలైభూభృదౌఘముల కంబుదము లయ్యెభూరి ఘోరారణ్యములకు గజంబులైయారామములకుఁ బికాళు లయ్యెహర్మపఙ్క్తులకు నిర్యద్ధూమరేఖలైవరనదంబులకు శైవలము లయ్యెభవనంబులకు నీలిపట్టు మేల్కట్టులైకొలఁకుల కెలదేఁటిగుంపు లయ్యెతే. ననఁగ సకలజగద్భీషణాయమానలీల వన్నియలను నొక్క నీలిమ్రింగెననుట నిజమై యశేషవర్ణాంతరములఁగప్పుకొని యొప్పు చిమ్మచీఁకటులు నెఱసె. 273
వ. అంత. 274
చ. పరువడి భేకము ల్మొఱయఁ బ్రాగ్దిశ డి కడంగి తెమ్మెరల్నెరయఁ దళుక్కటంచు నడునింగిఁ గడు మ్మెఱయన్ ఘనౌఘముల్తఱుచుగ దక్షిణం బొరయఁ దత్క్షణలక్షణము ల్గణించి నేఁడరయ మహోగ్రవృష్టి గురియంగల దంచు నృపాలుఁ డెంచఁగన్. 275
సీ. గళదనర్గళగళద్గళదుధ్ధతధ్వనుల్గిలకొట్టి మండూకములు చెలంగధగధగత్ప్రజ్వలత్పటుతటిల్లతికాళిమిసమిస న్మెఱసి యాకసము నిండ
జిటచిటార్భటి సముద్భటనిరాఘాటసంఘటనమై కరక లొక్కటను రాలఘుమఘుమారావసంకులకులాచలగుహాకుహరమై పెనుగాలిగుంపు వీవఁతే. బెళపెళారని బెడిదంపుఁబిడుగు లురలఘనఘనాఘనసంఘము ల్గ్రమ్ముకొనఁగఝల్లుఝల్లునఁ బెనుజల్లు చల్లుచుండబోరుబోరున వర్షంబుధార లురిసె. 276
వ. వెండియు నయ్యఖండతరధారాపరంపర లొండొండ మెండుకొని వసుంధరామండలంబు బెండుపడం గురియుచుండ మహీధరశిఖరశిఖాభ్యంతరంబులం బాఁదు లురిలి పడు బృహచ్ఛిలాతండంబుల షహారావంబునకు గహ్వరీస్థలసింహకిశోరంబులు గర్జించు కహకహారావంబులకు వెఱవక యక్షీణమహానిక్షేపసంరక్షక బ్రహరక్షోగణంబుల దురాక్షేపణంబులకు భీతిలక శాకినీడాకినీప్రముఖ బహువిధభూతబేతాళగణంబుల కోలాహలంబులకు శంకింపక యమ్మహారాజమార్తాండుండు కరాగ్రనిశితకౌక్షేయకంబు నొఱ వెతికి జళిపించినం బొడము ధగధ్ధగాయమానప్రభాపటలంబులకుఁ దోడుసూపు విద్యుల్లతానికాయంబులవలనం జెట్టుగుట్టల సందులం దెరువు కనంబడ లక్కుఱంగట నొక్కపటమహామహీరుహంబుం జేరం జని. 277
ఉ. ఆనృషపుంగవుం డటు మహాతరుమూలము డాసి తేజి నెంతే నికటోర్వి డిగ్గి సముదీర్ణపరిస్ఫుటఖడ్గపాణియై
తానపు డేపున “న్విపది ధైర్య మథాభ్యుదయే క్షమే"తి వార్తానిపుణస్థితిం ధృతిధురంధరుఁడై యొకఁ డుండె నెమ్మదిన్. 278
తే. ఆదిగర్భేశ్వరుండైన యవ్విభునకుమ్రానుపడి మేను బహుతరగ్లాని నొందికన్ను గూర్కెడునంత నగ్గహనభాగమేలు బేతాళుఁ డతిదుర్నిరీక్షుఁ డగుచు. 279
క. అనరప్రచార మమితంబనుపమగాఢాంధకార మతిఘోరతరంబనఁదగు మత్కాంతారముఁగననోపునె నుదుటఁ గన్నుగలవాఁ డైనన్. 280
వ. అని యనేకరోషనలజ్వాలాభీలవికటీకృతభ్రుకుటీలతాకుటిలవదనుం డగుచు నచ్చోటికిం గదసినతనిం గనుంగొని తదీయావయవంబులం గననగు సార్వభౌమముద్రికాముద్రితంబు లైన సాముద్రికంబుల నిరీక్షించి సకలశుభలక్షణలక్షితుం డితం డెవండో యని తనమనంబున వితర్కించుకొని స్వకీయానుచరులతో ని ట్లనియె. 281
ఉ. ఈసుకుమారదేహుఁ డిపు డీవని నుండ నుపేక్ష చేసినందోసము వచ్చు మీ రితనిఁ దోడ్కొనిపోయి చిరత్నరత్నశోభాసమమైన యొక్కనృపహర్మ్యమునం బవళింపఁజేసి సంత్రాసము చెందకుండఁ గొనిరండు ప్రభాతము వచ్చునంతకున్. 282
క. కటక మనఁదగు నొకానొకపుటభేదన మహితహృదయ పుటభేదనమైకటకలితదానధారాస్ఫుటకరకరటీసహస్రములఁ దనరారున్. 284
క. అందు వెలుగొందు నయనానందం బగు రాచనగరు నముచిభిదుపలామందపరిస్పందరుచింగ్రందుకొనినసౌధ మొకటిఁ గని యాలోనన్. 285
చ. చికిలికిరీటిపచ్చల రచించిన చిల్కలకోళ్ల నందమౌసకినెలపట్టెమంచమున శయ్యపయి న్సుఖనిద్రఁ జెంది యించుక తనుఁ దా నెఱుంగకను జొక్కెడు తన్నృపు నల్లుఁడైన పెండ్లికొడుకు నేచి చూచి యవలీల మెయిం గడనుంచి యచ్చటన్. 286
తే. లీల మణిమండనుని బవళింపఁజేసికడకడల నుండునంతఁ దత్కటక మేలుచారుచంద్రమహారాజచంద్రతనయకూర్మి మెఱయఁ గళావతీకోమలాంగి. 287
క. ఆరాత్రి పెండ్లి యగుట నపారమహావిభవ మొప్ప బలవైరినిభుం
జేరుటకు నిజనయస్యాప్రేరితయై మితము లేని శృంగారమునన్. 288
సీ. చలువ దువ్వలువకుచ్చెలయంచు ముత్తెముల్పదనప్రభకు సలాము సేయఱవికకట్టడపు దోరపుఁ నిగ్గుజంటీలుతనులతాద్యుతికిఁ గైదండ యొసఁగసొగసు నిద్దపుఁగమ్మమగఱాలధళధళల్ప్రబలాక్షిరుచికిఁ బరాకు దెల్పఁగమ్మనెత్తావి చొక్కటపుఁ గస్తురిబొట్టుచికురసందీప్తి కిచ్చకము వలుకతే. రవల మట్టెలసద్దు దుర్వారపాదకటకనినదంబు మొలనూలుగంటరొదలునడఁచి కొనలేని నడలతో నధిపుఁ డున్నకేళిసౌధంబు గదిసె నక్కీరవాణి.289
తే. అపుడు తనవెంట వచ్చు వయస్య లెల్లనొక్కొకనెపంబుననె యొక్కరొక్క గరుగవసుమతీంద్రు నిరీక్షించి ముసుఁగుతోడనిదురవోవంగఁ జూచి యన్నీలవేణి. 290
క. ప్రాణేశ్వరుండు కడునిద్రాణత నున్నాఁ డిదేమొ తనకన్నులకున్రాణింపనొ యితనికి మగపోణిమియే లేదొ యనుచుఁ బొక్కుచు మదిలోన్. 291
ఉ. అండజయాన కూర్మివిభునండన యొక్కతివాసుమీఁదఁ గూర్చుండి విపంచి మీటుకొనుచుండెడు నంతట నవ్వసుం
ధరామండలనాథమౌళిమణిమండలుఁ డొయ్యన మేలుకాంచి యుద్దండత దండనుండెడు లతాలలితాంగి నొకింత చూచినన్. 292
ఉ. అగ్గజగామినీమణి ముఖాంబుజ మించుక వాంచి తమ్మిపూమొగ్గల నేలు పూపచనుముక్కులఁ బయ్యెదఁ జక్కఁ జేర్చుచుందిగ్గున లేచి నిల్చి యువతీమకరాంకశుభావతారు సమ్యగ్గుణహారు నానృపకుమారుఁ గనుంగొన నాతఁ డాత్మలోన్. 293
క. ఈ రామామణి యెక్కడనీరత్నవిచిత్రసౌధ మెక్కడ నిట కేఁజేరుట యెక్కడ నని యనివారణను మహాద్భుతప్రవర్తనమతియై. 294
ఉ. ఈమదిరాక్షి నేలు విభుఁ డెవ్వఁడొకో ననుఁ జేరఁ గారణంబేమియొ దైవమా యనిన నెంతని మెచ్చెదఁ దెల్లవాఱనన్మామక భాగ్య మెట్లయిన మంచిది నేఁటికి దీనితో రతిశ్రీమహనీయవైభవముఁ జెందెద నంచు వినిశ్చితాత్ముఁడై. 295
తే. అలజగన్మోహనాంగి నొయార మెసఁగఁజూచి కడుదిట్టయగునట్టి రాచపట్టిచెట్ట వట్టి నిజాంకంబుఁ జేర్పఁ జూచునంతనయ్యింతి విభుతనుశ్రాంతిఁ దెలిసి. 296
క. కుందనపు బిందియలనిరవందిన పన్నీట జలక మారిచి జిలుఁగుల్పొందుగ నమర్చి నృపసంక్రందనునకుఁ గలపమలఁది కడుభక్తిమెయిన్. 297
క. సారతరంబుగ మధురాహారంబుల నానవాల నధికక్షుథార్తిందీఱిచి వేగమె రాజకుమారున కాతరుణి యాకుమడుపు లొసంగెన్. 298
తే. సరసురాలైన యలచారుచంద్రతనయనెలమి కళలంటి యలరించి యలవరించిప్రౌఢతరబాహ్యసురతసంబంధములనుబారవశ్యంబు నొందించి పార్థివుండు. 299
సీ. పూవుగుత్తులవంటి పూపచన్నులు గోళ్లనదిమినఁ గిచకొట్టు నట్టివేళమెఱుఁగనంటులవంటి చిఱుదొడ ల్పుడికిననంగంబు పులకించు నట్టివేళమృదుపల్లవమువంటి రదనాంశుకము పంటనంట నొక్కిన గెంటు నట్టివేళఁబొన్నక్రొవ్విరివంటి పొక్కిలిగిలిగింతలలరింపఁ జిట్టాడు నట్టివేళతే. నదరనీయక యక్కున సదిమి చెక్కుచిదిమి నెమ్మోము మోమునఁ జేర్చి బుజ్జగించి యుపలాలనారతిక్రీడవలనఁమగువ నలరించె నారాజమన్మథుండు. 300
క. అంత నవరసికుఁ డగునక్కాంతుని మన్ననలవలన గడిదేఱి వెసంగాంతామణి తనమదిలోనెంతయుఁ గసివోని వలపు హెచ్చినకతనన్. 301
ఉ. చెక్కిలి నొక్కిన న్మగుడఁ జెక్కిలి నొక్కు రదచ్ఛదాప్తి బల్నొక్క చుటుక్కునఁ న్వెసఁగనుంగొనుఁ గ్రూరకటాక్షదీప్తి బేరక్కునఁ జేర్చి గుబ్బచనులంటఁ గవుంగిట నెత్తునప్పు డాచక్కెరబొమ్మ మార్మలయు చైవులకు న్విభుఁ డుల్లసిల్లుచున్. 302
సీ. కొఱికిన మడుపుటాకులు మోవి కందిచ్చియధరాధరము పంటనంట నొక్కికిచకొట్ట బకదారి కివకివ ల్చెవిఁగుల్కి,కుదురుగుబ్బ లురంబుఁ గదియఁ జేర్చియతులితోత్కంఠఁగంఠాశ్లేష మొనరించిబహుబంధసురతసంభ్రమముఁ జూపిపారవశ్యసుఖానుభవసంపదలఁ దేల్చియుపచారములఁ గొంత యుబుసుపుచ్చితే. వలచి వలపించి జీవితేశ్వరుని కేళిమెచ్చి మెప్పింపఁ జాలి యమ్మీననయనయండఁ బాయనిచో మణిమండనుండువెసం బునారతరతిసౌఖ్యవిభవుఁడైన. 303
చ. పులిపులియయ్యె నంగలత పొక్కె సుధాధరబింబ మింతికిన్నలినలి యయ్యెఁ గౌను జఘనస్థల మెల్ల ను నజ్జునజ్జునైగులగులయయ్యె గబ్బిసునుగుబ్బలు ముద్దుమొగంబు వాఁడె గెందలిరుకటారివాని బెడిదంపు దురంబు విభుం డొనర్పఁగన్. 304
తే. రసికశేఖరుఁ డారాజు రాజవదనకందికుందిన నెమ్మోముకళ లెఱింగి
కడుఁ బ్రియ మెలర్పఁ గౌఁగిట నిడుముకొని సుఖానుభవలీలఁ బవళించె నంబుజాక్షి. 305
ఉ. అత్తఱి నత్తలోదరి రతాంతపరిశ్రమ మొందెఁ గావునంజిత్తజువంటి నాయకుని చెక్కునఁ జెక్కు నురఃస్థలంబునంగుత్తములైన గబ్బిచనుగుబ్బలుఁ గంఠమునం గరాబ్జముల్హత్తుకొనంగఁ జేసి చెలువార వెస న్నిదురించె నంతటన్. 306
క. తెలతెలవాఱుటఁ గని నిస్తులధృతి బేతాళభటులు తొలుతటి మగనింజెలిప్రక్కనునిచి సామ్రాట్కులమణి మణిమండలేంద్రుఁ గొని చని రబలా. 307
క. అని తెల్పునెడఁ బ్రభాతంబెనయుట రవిరథతురంగహేషారవమోయనం బక్షిరవము సెలఁగెన్విని చింతాక్రాంత యగుచు వెస నిలు సేరెన్. 303
క. ఆకాంతామణి కుముదవ్యాకోచం బెసఁగువేళ నలనాఁడు ధరిత్రీకాంతుఁ జేరనరుగుటకేకమతిం జిలుకఁ జేరి యిట్లని పలికెన్. 309
ఉ. ఓమకరందబిందునికరోమరమ్యసుగంధమాధురీశ్రీమృదువాణి కీరకులశేఖర యల్ల కళింగరాజకన్యామణివార్త యే తెఱఁగున న్విననయ్యెను దన్మనోవిభుండేమి యొనర్చెనో యెచటి కేగెనొకో మణిమండనుం డొగిన్. 310
క. అని పల్కఁ జిల్కదొర యిట్లనియెం బళి మేలు జాణ వౌదువటంచున్వనితారత్నంబున కావనితామణిమండనుండు వడి నేగుటయున్. 311
తే. మెల్లనె కళావతీసతి మేలుకాంచిప్రక్క వేఱొక్కమగఁ డున్న బాగుఁ దెలిసియక్క యిది యేమి చోద్యమో యనుచు మిట్టిపడి కకావికయై యొండుకడకుఁ జేరి. 312
క. పువ్వారుఁబోణి మదిలోనెవ్వెఱపడి చూచుచుండ నృపుఁ డుపపడమైజవ్వాడులతికయో యననవ్వెలఁది వడంకఁ జూచి యతఁ డిట్లనియెన్. 313
క. మదనాగయాన మగతుమైదయంటిన కమ్మదమ్మి మెఱుపుగలిగియున్నది నీముఖాంబుజంబిదికొదవగదా కొత్తపెండ్లికూఁతున కనుచున్. 314
సీ. చికిలి చందురుకావి చిగురాకునునుమోవినంటిన మొనపంటి గంటుఁ జూచినెఱకురు ల్చెదరి క్రొవ్విరిసరు ల్వసివాడనొప్పు దప్పిన గొప్ప కొప్పుఁ జూచివలిచన్నుగవ యిక్కువల మిక్కుటంబులైగుదిగొన్న నెలవంకగుంపుఁ జూచితెలివాలుగల డాలుగలసోగకనుదోయినింపుగుల్కెడు నిద్రమంపుఁ జూచి
తే. యిది సదాచారమే రాజసదన మిదియెయిది కులాంగనయే యంచు మది నొకింతసందియము దోఁప నారాచచందమామయాగ్రహోదగ్రవిగ్రహుం డగుచు ననియె. 315
తే. నీజనని పుణ్యజనవర్ణనీయసాధ్వినీజనకుఁ డెన్న నభిమాననియతధనుఁడునీనగరు పోతుటీఁగకు నిలువరానిదయ్యు వెల్లాటకత్తె వీవౌట యరిది. 316
శా. నీజాడ ల్గని యోర్చుకోఁ దగునటే నీలాహివేణీ మహారాజస్త్రీజన మీవగ ల్వినిన నౌరా యంచు ని న్మెత్తురేయేజాతి న్నినువంటి దంట గలదే యిద్ధాత్రిలో నంచు విభ్రాజన్మానధురంధరుండు నృపుఁ డుగ్రవ్యగ్రరోషాత్ముఁడై. 317
క. కుఱుచవగ చిక్కటారింబరికింపక గొంతుచిదుము పనిఁ దలఁచి నరేశ్వరచంద్రుఁ డాతలోదరికురు లొయ్యన నొడిసి పట్టుకొనియె లతాంగీ. 318
తే. అప్పు డాబారి గడతేఱనగు ప్రయత్నమెట్లు చింతీంపవలయు రాకేందువదనయడుగు దప్పినచోఁ దప్పుఁ బిడుగటంచునొడువ మును విందువే కద పుడమిలోన. 319
చ. అన విని మందహాసరుచిరాస్య ప్రభావతి వల్కె నీవగల్గని విని యున్నవారి నడుగందగు నోశుకసార్వభౌమ యే
మనఁగలదాన నీవ కలయర్థముఁ దెల్పు మటన్నఁ గీర మిట్లను నలభూభుజంగవరు సంగన యప్పు డవార్యధైర్యయై. 320
క. విడు విడువుమనుచుఁ గ్రొమ్ముడివిడిపించుక బలిమి నొడిసి విభునికరాసింగుడుసువలిగుబ్బచన్నులనడుమను మొన సేర్చి తెంపునన్వ్రాలుతఱిన్. 321
తే. నృపకులేంద్రుఁడు వెఱఁగంది నెలఁతకేలివాలు కడఁ బాఱవైచి యోవాలుఁగంటిగోల విటువంటితెగువ నీకేల యనుచునెఱకురులు చక్కముడిచి కన్నీరుఁ దుడిచి. 322
ఉ. లాలన మాచరించి నవలానడుగన్నృపుతోడఁ బల్కు బేతాళునిబోలు నొక్క పెనుదయ్యము న న్నగలించి పట్టి యాభీలతనింత చేసి వెఱపించి చనె న్నినుఁ బల్కరింప వోగ్జాలత చాలదయ్యెఁ గలగంటినొ నెవ్వెఱఁ జెంది యుంటినో. 323
క. నీవేమొ కొలయొనర్చితివీవగనది సోఁకుడగుచు నేచఁ దొడంగెన్వేవేగఁ దత్ప్రతిక్రియఁగావింపక యున్న నెట్లు కడచెద ననినన్. 324
తే. అట్టు లగునని తద్దోష మపనయింపనభయకరమంత్రతంత్రము లాచరించిరాజబింబాస్యఁ గూడి యారాజు నేకకంఠత వహించె నోకంబుకంఠి! యనిన. 325
చ. విని వెఱఁగంది క్రొత్తకథ వింటిని నేఁడిది చిత్ర మంచు నెమ్మనమున మెచ్చునంతర విమండల మ య్యుదయాద్రిఁ జెందినంగని కనుదమ్ములన్ నిదురగ్రమ్ముక రా నిలు సేరి ప్రేమ నవ్వనరుహగంధి సంజకడవచ్చి శుకాగ్రణిచెంత నిల్చినన్. 326
క. మదిరాక్షీ యేతత్కథకొదవయగుట తగదు కడమ గూడఁ బలికెదన్ముదమున విని పొమ్మని యమ్మదనునిసామ్రాణి పలికె మధురతరోక్తిన్. 327
క. మణిమండనవిభుని నభోమణిచండనిభు న్విభాసమానైకవనాంగణమున నడి యవ్వీరాగ్రణు లాశుభవార్త యేలికకుఁ దెలుపుటయున్. 328
తే. అతఁ డతని ధైర్యచర్యాసహాయశౌర్యబహువిధగుణంబు లెంతయుఁ బ్రస్తుతించిసంధి యొనరించి యమ్మహాసార్వభౌముననునయించుట తగుకార్యమని తలంచి. 329
సీ. జనభయంకరసరోషజ్వాలికాధగద్ధగదుగ్రరుచుల నెమ్మొగము వెలుఁగసకలపిశాచశిక్షారక్షణాక్షీణకౌక్షేయకము భుజాగ్రమునఁ దనరశాకినీఢాకినీలోకలోకాతీతబలపరంపర కెలంకులను నడువమనుజకోటికరోటిమాలికాభసితచర్మాంబరంబులు మేన డంబు సూపఁ
తే. గోరమీసలు మిడిగ్రుడ్లుఁ గుటిలతరకరాలదంష్ట్రాయుగంబు నుత్తాలబహుజటాలజాలంబు నెరయ బేతాళుఁ డపుడునిలిచె నాభూవిభునిమ్రోల నలఘులీల. 330
ఉ. అంతకుమున్న యన్నరవరాగ్రణి మేల్కని విస్మయోదయస్వాంత మెలర్పఁ గన్నులవెసంబొడసూపుమహాప్రతాపుఁ డీయంతకరూపుఁ డితఁ డెవఁ డంచు మనంబున నెంచునంత నప్పొంత వసించి యమహీవిభు న్వినయోక్తుల నాతఁ డిట్లనున్. 331
క. బేతాళనాయకుఁడ నోభూతలవల్లభ మహాప్రభుత్వము గలనిన్నీతఱిఁ గనుఁగొనుటకుఁ బ్రేమాతిశయత వచ్చినాఁడ ననిన సుముఖుఁడై. 332
వ. యథోచితప్రత్యుత్థానాభిగమనంబు లాచరించి కుశలంబడిగి సుఖం బున్న యనంతరంబ యద్ధరిత్రీపాలునకు బేతాళుం డిట్లనియె. 333
ఉ. ఓచతురాగ్రగణ్య భువి నున్ననరేంద్రులలో భవన్నిభుండీచతురబ్ధివేష్టితమహి న్నహి యంచు జను ల్నుతింప నీయాచరణం బెఱుంగక మహాగహనాంగణభూమి నొంటిమైనేచి చరింప నీతి యగునే తగునే యిటువంటి కృత్యముల్. 334
సీ. అన్యరాజన్యరాజ్య స్థితుం డగువేళసరిదొర ల్సంధింప దొరయువేళఁబౌరులు కనఁ బయల్పచరింపఁ జనువేళనారామములఁ గేళి నలరువేళ
సరగున దుర్గము ల్సాధింపఁ జనువేళవైరిభూభుజు లెత్తివచ్చువేళగుఱు తెఱుంగనిజను ల్గొల్వవచ్చినవేళమృగయావినోదాప్తి మెలఁగువేళతే. మండలేశ్వరుఁ డుద్దండదండనాథచండభటవీరసామంతమండలంబులండనుండక వెస నొంటి నుండెనేనిగొదవ యగునండ్రు నీతికోవిదులు తలఁప. 335
తే. మత్తకరిదండ నెరయైన మావటీఁడుబుద్ధియెఱుఁగని కొమరుని పొంతదాదియతులగర్వాంధుఁ డగురాజునండ నాప్తమంత్రి యొకవేళ నైన నేమఱఁ దరంబె. 336
క. బల మనఁగ నృపునిదేహముబలమునకు న్నృపవరుండు ప్రాణం బగుటంబలమును నృపుఁడును ధాత్రీతలనాయక భేద మనఁగఁ దగునే జగతిన్. 337
చ. అనుపమధైర్యశౌర్యనిధియౌ నృపుఁడైనను జైత్రయాత్రగాజనునెడ దోఃప్రతాపబలసంఘములం ఘను లౌనిజాప్తులంజనువుఘటిల్ల గొల్లముదుసళ్లఁ గులాగతనీతిమార్గవర్తను లగు ద్దల న్నగరిదండఁ బ్రచండత నుంచఁగాఁ దగున్. 338
చ. ఇది మొద లింక నెం దయిన ని ట్లొకరుండవుఁ బోకు పోయినన్మదనమనోహరాంగ మణిమండన నీగురవాన యంచుఁ బ్రేమదొరల విన్నవించి నృపుమన్నన గాంచి యతండు వోవ నయ్యదనునఁ బ్రాగ్వియోగబల మవ్విభునిం గని చేరి మ్రొక్కినన్. 340
క. అందఱఁ గృపార్ద్రవీక్షామందరుచిం గప్పుకొని యమానుషమహిమంజెంది ముదమంది రాజపురందరుఁ డతఁ డూరుసేరె రాజీవముఖీ. 341
తే. అని శుకాధ్యక్షుఁ డీరీతి నద్భుతైకగాథ వివరింప నంతలోఁ గమలబంధుఁడుదయపర్వతశిఖరాప్తిఁ బొదల నంతిపురవరంబున కరిగె నప్పువ్వుఁబోఁడి. 342
చ. అల యలినీలవేణి విరహాతురయై మఱునాఁటి రాత్రి రాచిలుకపటాణి నెక్కెడి వజీరునిఁ బోలిన యా నృపాలునింగలయఁ దలంచి మేన నయగారము గీర్కొనఁ జేసి చేరె నిర్మలగుణశాలియైన శుకమండలమౌళిసమీపభూమికిన్. 343
తే. అప్పుడా రాజకీర మిట్లనుచుఁ బలికెమగువ! మగవాని మేలు నమ్మంగఁ దగదుమది నొకానొకయెడ రోష మొదవె నేనినేర్పుగల దూతి యొకరీతిఁ దేర్పవలయు. 344
క. పతి నేవగించు సతికిన్సతి నొల్లని పతికి బద్ధసఖ్యము గలుగన్మతి నిర్వహించి కూర్చినచతురిక యగు దూతికాప్రసంగము వినుమా. 345
వ. అని యిట్లనియె. 346
తే. అభ్రచుంబితమణిగణాదభ్రవప్రమై విజయభవనమను వీ డవనిఁ గలదుములికినాఁ డను సీమఁ గోమలుల చూపుములికి నాటిన మరుఁడు దా మూర్ఛ నొంద. 347
క. ఆరాజధాని వెలయు నుదారుం డను రాజు ప్రోవఁ దన్నృపుచెంతన్ధీరుఁడు తన ముక్కాకలఁదీఱిన దళవాయి యొకఁ డతిస్థిరబలుఁడై. 348
మ. పతికిం బ్రాణపదంబు జంధులకు నాకల్పప్రకాండం బనల్పితశౌర్యాబ్ధికిఁ గ్రేవ రాహుతులకు న్వెన్నాసయై శత్రుసంతతి నెంతేఁ దెగటార్చి తన్మదమహోద్దండైకవేదండచండతురంగంబుల నెల్ల వస్తువులు దండన్నిల్పు నాభర్తకున్. 349
తే. భీమబలశాలి దృఢవర్మనాముఁడైనఘనుఁ డతండు నిజస్వామి కనువుపఱచురాజపరమేశ్వరాష్టదిగ్రారాజకులమనోభయంకరబిరుదైకవైభవంబు. 350
క. ఇత్తెఱఁగున బహుమహిమోదాత్తపరాక్రమము మెఱయఁ దగునాతనికిన్మత్తరిపుదమనశౌర్యాయత్తుం డొకకొమరుఁ డలరు నతినిపుణుండై. 351
చ. చదువుల మేలు సాముపన చక్కఁదనంబు తెఱంగు సంపదంబొదలెడు మేలి్మి పేర్మిగల భూరిభుజాబలశౌర్యధైర్యముల్సదయతయు న్వివేకసరసస్థితు లాకృతిఁ జెందెనో యనన్మదనమనోహరుఁడు సుకుమారవరుం డతఁ డొప్పు నప్పురిన్. 352
తే. అతని కేలిక యైన యయ్యవనిభర్తకూర్మికొమరున కొనరించుగో మొనర్పదల్లిదండ్రులు లోచనోత్సవము నొందనవ్విభుం డొప్పు జయకేతనాహ్వయమున. 353
వ. వెండియు నమ్మహాప్రభుకుమారుండు. 354
సీ. ఒకవేళ యవనచోళకళింగశకవంగగూర్జరు ల్గొలువంగఁ గొలు వొసంగు
నొకవేళ విగళన్మదోద్ధండవేదండహయపరంపర నెక్కి యాడఁ దివురునొకవేళ దండనాయకచమూనాయకుల్హాళిమై నడువ వాహ్యాళి వెడలునొకవేళ రిపునృపాలకజాలసాలదుర్గమదుర్గహరణైకకార్య మరయుతే. మఱియు నొకవేళ ధీరసామంతమంత్రిపుంగవులతోడ విభునిసమ్ముఖము చేరితెలుపఁదగువార్తలన్నియుఁ దెలియఁజేయుననఘ గుణశీలుఁ డాబాలుఁ డహరహంబు. 355
క. కంతునిభరూపరేఖావంతుఁ డతం డిట్లు మెలఁగ వనితాజనతాస్వాంతమనోహరకరమైయంతట యౌవనముఁ దోఁచె నవ్విభుమేనన్. 356
ఉ. ఔర విలోచనాంబుజము లద్దిర ముద్దుల నెమ్మొగంబు సింగారము బాపురే బవరిగడ్డము మేలు సురఃస్థలోరువిస్తారము చాఁగురే యెగుభుజంబులపొంక మటంచుఁ బ్రేమచెన్నారఁగ నారు లెల్ల ననయంబుఁ గనుంగొని సంతసింపఁగన్. 357
తే. వానిఁ దనివారఁ జూడనివనజగంధిచూచి తలయూఁచి మెచ్చని సురుచిరాంగిమెచ్చి విరహార్తి నొందని మీననయనగలుగ దొకతైన నవ్వీటిచెలులలోన. 358
క. ఈలీల నతఁడు వర్తిలబాళిం దన్నృపతిమౌళి పరిణయకార్యశ్రీలలితుని జేయుట కిదివేళ యితని కగు నటంచు వెసఁ దలఁచుటయున్. 359
తే. అతని జననీజనకు లపు డంతరంగమున మహోత్సాహమునఁ బొంగి యనుపమానమానసంపత్కులాభిజాత్యానుకూలమమరు సరిమన్నె దొరలయిం డ్లరసి యరసి. 360
క. లావణ్య మంగరేఖయుశ్రీవిలసల్లక్షణంబు శృంగారకలాప్రావీణ్యంబును గలకులపావనయగు నొక్కకన్యఁ బరికించుటయున్. 361
చ. అలజయకేతనుండు రుచిరాంగతిరస్కృతమీనకేతనుండెలమి మదిం దలిర్ప దయనేలికయుం దలిదండ్రులయ్యెడందలచిన కార్యభాగ ముచితజ్ఞులచే విని నీతికార్యవర్తులగు నియోగిపుంగవులతోడ రహస్య మొనర్చి యిట్లనున్. 362
ఉ .ఎక్కడిజోలి పెండ్లి యగు టెట్లు సదుఃఖతరాజవంజవంబక్కజ మే సహింపఁగలనా లలనం గలనైనఁ జూడఁ దాదృక్కథ లాలకించి విను టెన్నఁడు లేదిది మీ రెఱుంగరేయక్కట భామినీజనవిహారత మానధురీణుఁ డోర్చునే. 363
సీ. కాలకూటజ్వాల గబళింప నగుఁగానియతివలతోడ మాటాడ నగునె
పులులమీసముల నుయ్యలలూఁగ నగుఁగానివారిజాక్షులచెంతఁ జేర నగునెదంభోళిహతిసముద్ధతి కోర్వ నగుఁగానిలేమలపల్కు లాలింప నగునెబడబాగ్నిఁ బిడికింట నొడియంగ నగుఁగానికుసుమగంధులపొందుఁ గోర నగునెతే. కటకటా మూర్ఖమర్కటకరతలస్థకల్పతరుసూనమాలికాకల్పుఁ డగుచుసరసుఁ డగుమర్త్యుం డంగనాజనమహోగ్రఘోరసంసారవిషధిలోఁ గూలనగునె. 364
క. అని విడనాడఁగ నాతనిఁగనుఁగొని యోనృపకుమారకంఠీరవ యేయనువున నొనరింతుము నీమన మలర నటంచు మంత్రిమణు లవ్వేళన్. 365
సీ. గార్హస్త్య మిందిరాకాంతాకటాక్షవీక్షణలబ్ధికిఁ బ్రధానకారణంబుసంసార మర్థార్థిజనమనస్సంతాపకార్పణ్యము లడంపఁ గల్పశాఖిదాంపత్య మతిశుభ్రతరజగత్పరిపూర్ణవరకీర్తిలతికాలవాలభూమియాజవంజవము దివ్యైకలోకానీకపథము నందించుసోపానరేఖతే. ఘనతరకుటుంబ మఖిలోపకారకంబుగాన సుచరిత్ర యగుకన్యకను వరించి
మానవిఖ్యాతిలాభసంపన్నుఁ డగుటయెంతయిన నొప్పు నట్లు గాదేని హాని. 366
తే. హరిహరహిరణ్యగర్భాదు లగుమహాత్ములెల్ల నెప్పుడు సంసార మిచ్చగించిపుత్రపౌత్రపరంపరాభ్యుదయవంతులగు టెఱుంగవే యేకవీరాగ్రగణ్య. 367
వ. అని యనేకప్రకారంబులం బచరించిన నమ్మనీషివరుల విశేషవచనంబు లంగీకరింపక దురంతచింతాపరతంత్రస్వాంతంబునం గొంతతడవు విచారించి యంతఃపురంబుఁ బ్రవేశించి యౌవనారంభసంరంభంబునం బొడము దురాలోచనంబున విజృంభించి దూరం బరయక యతం డర్ధరాత్రంబున. 368
తే. వేగం జనియెద నిక నొక్కవింతదేశమునకు భామాజనంబుల మోముఁ జూడనోపలేనని తీవ్రసంతాపహృదయమున రయోద్ధతి నయ్యంతిపురము వెడలి. 369
చ. పలుచనిదంతపుం దళుకుపాదుకల న్సడలించి కుంచితాంఘ్రుల వలిపంపుఁజేలమునికొం గొకయించుక యొత్తి చిత్త మింపలరఁగ నొక్క యందలమునందుఁ దగం జనియె న్విభుండు క్రేవలఁ దగ నొంటరీలు గొలువం గరదీపతతు ల్వెలుంగఁగన్. 370
వ. ఇవ్విధంబున. 371
క. జనపాలునకును జననీజనకులకుం జెప్ప కతఁడు చని కనియెను గం
ధనిబంధనేంథనాచలమునకు సమీపంబు పాండ్యభూమండలమున్. 372
తే. కాంచి యచ్చటఁ బాండ్యభూకాంతరత్నపాలితంబై ననవరత్నకీలితైకగోపురం బైనగంధవతీపురంబువెలయు నప్పొంత నొకదేవనిలయ మొలయ. 373
మ. కని యంతం భ్రమరస్ఫురత్కమలినీకాసారతీరంబునంగనువిందై యనువొంది చైత్రరథశృంగారంబు గన్పట్టు దివ్యనవీనద్రుమపుంజరంజితమహోద్యానంబునుం గాంచి సజ్జనమాన్యుం డతఁ డందు నిల్చె నొకద్రాక్షాకాయమానస్థలిన్. 374
తే. అప్పుడయ్యెలదోఁటలో నతనిసరసఁబరిజనంబులు పరిపక్వఫలసుగంధకుసుమరసపల్లవంబులఁ గొల్లలాడియుల్ల ముల్లాసమును బొంద నుండువేళ. 375
క. తుకతుక నపు డలవనపాలిక యగు బాలిక మృగాంకలీలారేఖాప్రకటితోపవిశంకటవికటనటద్భ్రూకుటీసువిభ్రమముఖియై. 376
సీ. నిండారఁ బొడమిన బొండుమల్లియతావిక్రొవ్విరు లెవ్వరో కోసినారుప్రబలంపుగాడ్పుచే రాలిన యెలమావిదోరషం డ్లెవ్వరో యేఱినారు
వాటమౌ దవనంపుఁదోఁటకంపవెలుంగుఁదొలఁగిపో నెవ్వరో త్రోసినారుదట్టమై నులిగొన్న యట్టిపందిరిద్రాక్షతీవ లిం దెవ్వరో త్రెంచినారుతే. కంటి మాయయ్య రావలెఁ గద యి దెవ్వడిందు నేనెత్తు వెలిపువ్వు టెత్తు కేలఁబట్టుకొనె నంచుఁ జిడిముడిపడుచుఁ గాఁపుఁబడుచువగలాఁడి యప్పుడప్పజ్జ గదిసి. 377
క. తనతేజీ లున్నవి యనివనవాటిం గనుఁగొనంగ వచ్చిన లక్ష్మీతనయుఁ డన నొప్పు జయకేతనవిభు నీక్షించి మోహతరలేక్షణయై. 378
క. తనతండ్రి యున్నయెడకుంజని తద్వృత్తాంత మంత చతురతరోక్తింగనినట్లు తెలుప విని యవ్వనపాలకుఁ డద్భుతైకవశమానసుఁడై. 379
ఉ. ఎచ్చట నుండునో మొదల నెవ్వఁడొ యెవ్వరివాఁడొ వీఁడు నేఁడిచ్చటి కేగుదేరఁ గత మెయ్యదియో యని తత్కథాక్రమంబిచ్చజనింపఁ బాండ్యజగతీశ్వరు నీశ్వరసన్నిభు న్సముద్యచ్చతురాస్యుఁ గాంచి వినయంబునఁ దద్విధమెల్లఁ జెప్పినన్. 380
తే. ధన్యుఁ డారాజలోకమూర్ధన్యుఁ డతనిరూపయౌవనవిభవప్రతాపములకు
నాత్మ మెచ్చి తదాలోకనాభిలాషనప్పు డుద్యానవనవాటి కరుగునంత. 381
చ. మితపరివారుఁడై రణసమిద్ధభుజుండు జయధ్వజుండు తత్క్షితిపతిమౌళిసమ్ముఖముఁ జేరి విధేయత మ్రొక్కి నిల్చినన్మతిఁ గుతుకం బెలర్ప నసమానలసత్కుసుమానమన్మహీజతతియేడ న్వసించి సరసస్థితి నాతని కాతఁ డిట్లనున్. 382
క. ఓవత్స నిను మనంబునభావింపఁగ సార్వభౌమపర్యాయశుభశ్రీవిభవము గననయ్యెడునీ వెవ్వరివాఁడవయ్య నృపకులతిలకా. 383
ఉ. నీపరిణద్ధకంధరయు నీదువిశాలవిలోచనంబులున్నీపటుదీర్ఘబాహువులు నీవిపులోరుకవాటవక్షమున్బాపురె సర్వభూవలయపాలనముం గలిగించి మించఁగానోపుచునున్నవేల యిటు లొంటిఁ జరించెద వంచుఁ బల్కినన్. 384
తే. అప్పు డాజయకేతనుం డతనితోడఁదనకులాచారగోత్రసూత్రములు నొడివిప్రేమఁ దనతల్లిదండ్రులు పెండ్లిసేతుమనఁగ విని యొల్ల కేవచ్చి తవనినాథ. 385
చ. అనవిని పాండ్యమండలమహాప్రభుఁ డల్లన నవ్వి యోసుధీజనవర పెండ్లియొల్ల మనుజాడ్యమతు ల్గలరే జగంబునన్విన నిది వింత యిందు కొకవేఱ నిమిత్తము గల్గియున్న నెమ్మనమున సంశయింపక క్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా. 386
వ. అని యడిగిన నప్పాండ్యమహీమండలేశ్వరున కప్పుణ్యచరిత్రుం డి ట్లనియె. 387
తే. విను పరా కింతలేక నా విన్నపంబుపూర్వభవమున నే నొక్కభువనమోహనాద్భుతసరోవరంబులో నధివసించిరాజహంసంబునై యుంటి రాజచంద్ర. 388
క. అప్పుడు మత్కులకామినితప్పనిప్రేమం బతివ్రతారత్నము నన్నెప్పు డెడసనక కంటికిఱెప్పవలెం గాచి తిరుగు రేలుం బవలున్. 389
వ. అదియునుం గాక. 390
సీ. ఆఁకలి గొనునప్పు డబ్జనాళములలోనూటి కొక్కటి తెచ్చి నోటి కొసఁగుగమనించుతఱి మందగమనశృంగారాప్తినంటు వాయక వెంటవెంట నెయిదునుబుసుపోవనివేళ నుల్లోల కల్లోలడోలికామాలికాకేళిఁ దేల్చుబడలియుండినవేళ నొడలితాపము దీఱవలిఱెక్కసురటిగా డ్పలవరించుతే. ముచ్చటలు దెల్పు రతికేళి కెచ్చరించుసన్న దెలిపి విలాసప్రసన్నవదనయగుచు వర్తించు నేను నావగఁ జరింతువరట మదికింపు దొలఁక భావజ్ఞతిలక. 391
తే. ఇట్లు వర్తించుచున్నచో నెలమి నన్నుఁగొలిచి విహరించు రాయంచ బలఁగమెల్ల
గెలన నొకపైఁడి నెత్తమ్మికొలను జూడనొప్పునని తెల్పఁ దద్వీక్షణోత్సుకమున. 392
మ. చని యద్దివ్యసరోవరంబున యథేచ్ఛాలీల వర్తించు హంసనికాయంబులతోడఁ గొంతతడ వంచల్లీల వర్తించి తత్కనకాంభోరుహవిభ్రమదమరఝంకారధ్వనిం దత్తటీవనవాటివిహారద్విచిత్రవిహగవ్యావృత్తి నీక్షించుచున్. 393
తే. మఱియు నచ్చోట విహరించుతఱిని మందమందగంధవహాప్తి మై మఱచియుండునంత నను నెచ్చరింపక యరిగె బంధుతతి మనంబున నిల్లాండ్రఁ దలఁచికొనుచు. 394
ఉ. అంతట నాశకుంతబల మవ్వరటాతతిఁ జేరి మోహసంక్రాంతత నంబుజోత్పలకులాయముల న్విహరింపఁ జూచి విభ్రాంతతనొంది మత్ప్రియుఁడు రానితెఱంగిది యేమొయంచు మత్కాంత ననుం గనుంగొననితాపమున న్విరహాబ్ధిమగ్నయై. 395
తే. అమ్మ నేఁజెల్ల; నెవతెయో యవలనొక్కకొమ్మ నాప్రాణవిభు నేలుకొనియె నేమొకాకయుండిన ననుఁ జేరరాక యున్నెయని ప్రలాపించి కనుమూసె నాక్షణంబ. 396
క. ఈవార్తలు సవసవగానే విని ప్రాణేశ్వరీ యిదే నను నొంటింజోవిడిచి చనుట తగదనీభావించి వియోగవహ్నిపరితప్తుఁడనై. 397
తే. నాఁటి యలహంసజన్మంబు వీటిఁబుచ్చిమగుడ మానుషవేషసంభవుఁడనైననేటికిని దద్వధూటిపై నెనరువాయనైతి నిఁక నేమనందుఁ బాండ్యక్షితీంద్ర. 398
ఉ. కావున నాఁడు నేఁ డితరకాంతల నేరిఁ బరిగ్రహింపనోభూవర యంచుఁ దెల్ప నృపపుంగవుఁ డౌనని మెచ్చి బంధుసంభావితలీల నాఘనుని భావ మలర్చి విశేషవస్తుసంభావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబుఁ జేరినన్. 399
వ. అంత. 400
తే. గరిమఁ దత్పాండ్యరాజన్యకన్యయైనశాలికానామబాల య వ్వేళ నిజపురోపవనభూమి మునివృత్తి నొదిఁగియుండునలజయధ్వజవిభువార్త లాలకించి. 401
చ. నలనిభుఁ డీజయధ్వజుఁడె నావిభుఁ డంచుఁ దలంచునంతలోవలపులఱేఁడు కెంపుజిగివంపుమొగంపుఁబటాణినూకి కన్నులు గలవింట నప్పుడు వినూత్నశరావలు లేసి యార్చె నమ్మెలఁత మెఱుంగుగబ్బిచనుమిట్టల హారలతల్ చలింపఁగన్. 402
క. అంత నలయింతి విరహాక్రాంతమతి న్నిమిష మొక్కకల్పంబుగ నత్యంతతరదురవగాహనచింతం దంతన్యమానచిత్తాంబుజయై. 403
శా. మారుం బేర్కొనిదూఱు గంధవహుఁ బల్మాఱుం దుటారించి వే
జాఱుం గేకి పికాళిసంఘములు వాచావైఖరిం బోరుఁ దన్నారీరత్నము తజ్జయధ్వజసముద్యన్తోహసంక్రాంతయై. 404
తే. అలహరిద్రానిభాంగి సౌధాగ్రసీమనుండ కవనికి డిగియె రేయెండ కళికిప్రాణసఖు లెల్ల నెండకుఁ బశువు దలఁకినట్లు నీ వేల తలఁకెద వనుచుఁ బలుక. 405
క. భావ మెఱిగింప నేరకయావెలఁదుక యున్నఁ జెలువ లవ్విధమెల్లన్భూవల్లభునకుఁ దెలిపిననా వేళ నమాత్యహితకృతాలోచనుఁడై. 406
ఉ. కన్నియ యీజయధ్వజునిఁ గాని వివాహ మొనర్ప నొప్పదేధన్యుఁడు నైనవాఁడు వనితాజనతైకపరాఙ్ముఖుండు సామాన్యమనీషి కీవగ యొనర్చుట కొద్దితెఱంగు తెల్పుఁడోమాన్యచరిత్రులార! యని మంత్రులతో విభుఁ డానతిచ్చినన్. 407
క. పొసఁగ దిది యనుచు మంత్రులుగుసగుసలంబోవ రాజకుంజరుతోడన్వెసమృదులవాణి యనఁదగుబిసరుహముఖ యొకతె విన్నవించెం బ్రీతిన్. 408
ఉ. ఏలవిచార మింతుల నొకింత యెఱుంగని ఋష్యశృంగునింబాలికలండఁ జేరి యొకబాలికఁ బెండ్లి యొనర్చి భామినీ
లోలునిఁ జేయువార్త మహిలో నుడున న్వినరేమొ యట్లనీశాలిక నాసమగ్రగుణశాలికిఁ బెండ్లి యొనర్తు నావుడున్. 409
తే. ఆవిభుండు ప్రమోదసద్భావుఁ డగుచుసెలవొసంగిన నిరుమ్రోలఁ జెలులు గొలువనవ్వరారోహనాందోళికాధిరోహఁజేసి కార్యప్రవర్తనోల్లాస మెసఁగ. 410
సీ. నేల జీరకయుండఁ గేలఁ గుచ్చెలఁ బూనుకొని యూడిగపుసతు ల్గునిసి నడువమడమెత్తు పర్వుతో మంత్రాక్షతము లీయఁబాల్పడి భూసురభార్య లెదురనొక్కకీ లొరఁగుపై నునిచి యేకాంతంబుఁదెలుపుచుఁ గూర్మి నెచ్చెలులు సనఁగజయకేతనునివార్త సారె విచారించివచ్చి ప్రగడకత్తె లెచ్చరింపతే. సొంపుతోఁ బౌరకామిను ల్గుంపుగూడియమ్మ యిదిగాక సౌభాగ్య మనుచు మెచ్చనప్పు డుద్యానవనవాటి కవ్వధూటినెలమిఁ దోతెచ్చి యాచెంత నిలుచునంత. 411
చ. పిలపిల నాజయధ్వజుని బెద్ద లెదుర్కొని రాకురాకుఁడోయళికచలార భీతహరిణాయతనేత్రల మత్ప్రభుండు నావలనను జూడ నోడుననువార్త వచించిన మందహాసకందళవదనం బెలర్పఁగ ముదం బలర న్మృదువాణి యిట్లనున్.
క. మునుమున్న తద్రహస్యమువిని యున్నదిగానఁ బ్రౌఢవృత్తి నలసుధీజనములతో నను గాంతాజనరత్నము మధురరసవచస్ఫుటఫణితిన్. 413
ఉ. ఈయెలదోఁట నుండఁదగ దింకొకచక్కి వసింపనేగుఁడోధీయుతులార! పాండ్యనరదేవతనూభవకేళికాగృహప్రాయత నిందు నెప్డు నిరపాయమున న్విహరించుచుండు నేడాయెలనాఁగ గ్రుమ్మరుటకై యదెవచ్చెఁ దలంగుఁ డిత్తఱిన్. 414
తే. ఇంతమాత్రంబె కాదు పూర్ణేందుముఖులుసమ్ముఖంబునఁ గార్యప్రసంగవశతఁబెండ్లి యనుమాటఁ బేర్కొన్నఁ బెనిమి టనినమిట్టి మీనై యదల్చు నమ్మీననయన. 415
క. ఇది యేమినిమిత్తమొ యనిమది నెంచితిరేనిఁ దత్క్రమంబంతయు నీయదన వివరింతు వినుఁడింపొదవం దొల్లింటిజన్మ మొదవినవేళన్. 416
ఉ. తా నొకహంసియై సరసత న్నిజవల్లభుఁ డుల్లసిల్లఁ జిత్తానుగుణోన్నతి న్మెలఁగు నంతటిలో నొకనాఁడు చెంత నింపైనసరోవరంబుఁ గని యచ్చటి కేగి విభుండు నిర్నిరోధానుపమానసౌఖ్యవిభవాప్తి మెయి న్వెసరాక చిక్కినన్. 417
క. మగఁ డేల రాఁడొ యొండొకమగువం దగులుకొని నన్ను మఱిచెనొకో మనంబగలెడు నని దిగులొందుచుఁదెగువం బ్రాణములు విడిచె దీనాననయై. 418
ఉ. వావరి నప్పతత్రికులవార్ధిసుధాకరరేఖ యీధరిత్రీవరకన్యయై యవతరించి విభుం డొనరించి నయ్యుపేక్షావిధ మెన్నుచున్నదని సారె వచించిన మంత్రు లద్భుతంబై వెలయం జయధ్వజున కత్తెఱఁగెల్ల నెఱుంగఁ జెప్పినన్. 419
క. వినినంతఁ బెన్నిధానముఁగనుఁగొన్న దరిద్రుఁ బోలి ఘనుఁడా జయకేతనుఁ డలతలోదరీమణితనసొమ్మని తలఁచి యతులితత్వరమతియై. 420
తే. సమ్మదాశ్చర్యమోహము ల్సందడింపనుద్దవిడి లేచివచ్చి యమ్ముద్దుగుమ్మయెద్ది యెద్ది యటంచు నయ్యించుఁబోణులలరఁ జని పాండ్యనృషకన్య యండఁగదిసి. 421
చ. నిను నెడఁబాయఁజాల దరుణీ యని నీయనివార్యవిభ్రమంబనిమిషులందునైనఁ గలదా యని దాయనిరూఢి నెంచి నన్మనసిజబా కొర్వదరమా యని మాయనిమోహదాహమేయనువున దీర్చువాఁడ నహహా యని హాయని చేరి మ్రొక్కినన్. 422
క. వనితాలలామ లజ్జావినమన్ముఖ కమలతం బ్రవీణత లేమిన్గని రాజదూతి యనియెంగనికరమున నక్కుమారకందర్పునకున్. 423
చ. పసిరికపామువంటి దని పల్కుదు రీయలివేణివేణి నప్పసమును నిండుఁగుండలయి భాసిలు నీలలితాంగి గుబ్బ లీముసిముసినవ్వులాఁడి కరము న్వెసమూసిన ముత్తియంబు నీకుసుమసుగంధి కేవలము గోలసుమీ యనమీఁదలంచుమీ. 424
చ. అనుటయు దండనాథసుతుఁ డానృపకన్యక నాదరించెఁ దజ్జనకుఁడు సమ్మతించె సరసస్థితిఁ బెండ్లి యొనర్చి వైభవంబెనయఘటించి యొక్క విమలేందుశిలామయసౌధమందుఁ జేర్చిన నెనరొప్పఁగా విడిద చేసుక యంత వసించి వేడుకన్. 425
క. మును నేనొనర్చు నేరముమనమున నెంచంగఁ దగదు మగువా యనుచుంగనకాంగి నూఱడిలఁగానని సెజ్జం గౌరవించి యధికప్రౌఢిన్. 426
సీ. కాశ్మీరపంకసంకలితాంకమై పొంకమగు బాహుమూలంబు లంటియంటివరమృగీమదపత్రవల్లరీరుచి నొప్పునుదుటుసిబ్బెపుగుబ్బ లొత్తియొత్తినానావిధబహుప్రసూనైకగంధంబునివ్వటిల్లెడు కొప్పు దువ్విదువ్వితాంబూలరసరక్తిమంబైన యమృతంపుబింబాధరము ముద్దుపెట్టిపెట్టితే. ఘనజఘనకంబు కంధరకదళికామృదూరువులవాఁడి కొనగోళ్ల నొరసియొరసియెలమి నలయించి మించి యయ్యలరుఁబోఁడినతనుసామ్రాజ్య మేలించె నవ్విభుండు. 427
క. ఈమాడ్కి నమితభోగశ్రీ మెఱయఁగ నొక్కనాఁడు చిత్తమున నిజస్వామియుఁ దలిదండ్రులుఁ దనుగోమించిననడతఁ దెలిసికొని యతఁ డెలమిన్. 423
తే. మామతోఁ దెల్పి కాంతాలలామయైనశాలికాకన్యతోఁగూడ సకలసైన్యమిరుగడలఁ గొల్వఁ దనపురీవరముఁ జేరెనేలికయుఁ దల్లిదండ్రులు నిచ్చ మెచ్చ. 429
క. పతి నేవగించుసతికిన్సతినొల్లనిపతికి బద్ధసఖ్యము గలుగన్మతి నిర్వహించి కూర్పఁగఁజతురిక యగు దూతి వలయు జలజాక్షులకున్. 430
వ. కావున నేతత్ప్రయోజనసంధానకారిణి యగు నీరాజదూతిక తాదృగ్విచక్షణలక్షణోపలక్షిత యగుఁగదా యిత్తెఱం గెఱుంగక యున్నఁ గార్యభంగం బగు ననివచియించు సమయంబున. 431
తే. విమలతరతారహారము ల్వెస నొకింతచల్ల నగుటయు నలశరచ్చంద్రవదనసదనసంచారమున కేగ జలజహితుఁడుచరమగిరిఁ జేరె నంతలో నొరపుమీఱి. 432
చ. కులికెడుగుబ్బచన్పసిఁడికుండలు నిండిన కుంకుమంబు జొబ్బిలవలిపంపు మేల్రవిక పిక్కటిలన్ వెలిపట్టుచీర ముద్దులు వెలయింప వింతవగదుప్పటి పైవలెవా టమర్చి పావలు మునివ్రేళ్ల మెట్టి శుకవర్యునిమ్రోల లతాంగి నిల్చినన్. 433
క. ఆతఱిఁ బుండ్రేక్షురసఖ్యాతరుచిన్ రాజకీరకంఠీరవ మాకాతరనేత్రకుఁ దెల్పె నతీతంబగు నొక్కకథ యతిప్రీతి మెయిన్. 434
క. ఓనీలవేణి మదిలోమానవుఁ డొక్కటి తలంప మఱిదైవము తాఁబూనుఁ బెఱకార్య మొక్కటికానఁ దదీయాజ్ఞవలయుఁ గార్యార్థులకున్. 435
వ. అత్తెఱంగునం బ్రవరిల్లనియట్లయినం దొల్లిటిసమయంబున గుణవల్లభుండను మహీసురవల్లభుండు భల్లూకనఖభల్లహతుండైన యట్ల యగు నది యెట్లనిన వివరింతు నాకర్ణింపు మని యిట్లనియె. 436
సీ. అప్రతిమప్రభుం డగణితైశ్వర్యధుర్యత్వసాక్షాన్మహారాజరాజురూపరేఖామన్మథోపమానాంగుండుధరణీధరోద్దండధైర్యశాలియార్తరక్షణుఁడు సత్కీర్తికల్లోలినీడిండీరితశుధాంసుమండలుండునత్యుద్ధతప్రభావాంకుండు సకలసజ్జనవర్ణనీయశోభనచరిత్రుఁతే. డలరు నొకరాజు కర్ణాటకాంగవంగనృపమకుటఘర్షితాంఘ్రినీరేరుహాగ్రనఖరశిఖరుండు భువిఁ గీర్తిముఖుఁ డనంగఁదనరి యంశుమతీపురాధ్యక్షుఁ డగుచు. 437
తే. అతఁడు కమలాక్షియను ప్రియురాలివలనఁగన్న లీలావతీనామకన్య నెలమిఁ
బ్రోదిసేయంగ నలయించుఁబోణి వెలయుమలయుపరువంపు జవ్వనం బలము కతన. 439
క. చిత్తరువు ప్రతిమయో తెలిముత్తియమో కమ్మపైఁడి బొమ్మయొ యన నమ్మత్తచకోరాక్షి శుభాయత్తమతిన్మోహనాంగియై యుండునెడన్. 439
చ. చెలి నునుగబ్బిగుబ్బలకు సిబ్బెపు తళ్కొకవన్నె వాలుగన్నులకు మిటారిచూ పొకవినోదము గెందలిరాకు మోవికింగలికితనంపున వ్వొకచొకాటము మేని మెఱుంగు తీఁగకుందలఁపు వహింపఁజేయు నెఱతావి యొకానొకవింతయై తగున్. 440
వ. ఆసమయంబున. 441
తే. అన్నగరమందు నెపుడు పురాశ్రితుండుపల్లవాగ్రేసరుఁడు గుణవల్లభుఁడనుపేరు గలవాఁడు గలవాఁడు ధీరజనవిరోహితుం డగు నొక్కపురోహితుండు. 442
వ. వెండియు నతండు. 443
ఉ. శాంతు లొనర్చి గండకలుషంబుల నెల్ల నడంచు శత్రుకాలాంతకరూపమైన జపమాచరణం బొనరించీ యమ్మహీకాంతునకు న్శుభంబు లెసఁగన్ జయమున్ సమకూర్చుసారసిద్ధాంతి యితం డటంచు విబుధప్రకరంబు మదిన్ గణింపఁగన్. 444
క. అలకాలజ్ఞకులాగ్రణియెలమిం దద్రాజకన్య నేలాగుననో
కలఁగన్నయట్టు లొకనాఁడలవోకం జూచి మన్మథాజ్ఞావశుఁ డై. 445
క. అందనిమ్రానిఫలం బిదియందుకొనుట యెట్టులొక్కొ యనుచు మనమునన్దుందుడుకుచే ధరామరకందర్పుం డతఁడు మేలు గలవాఁ డగుటన్. 446
తే. అంత నత్యంతకాముకుం డగునతండుఛాందసుఁడు గానఁ దనమనస్తాప మెల్లఁదెల్లమి యొనర్పఁ దగదంచుఁ దెలియనేరకల్ల నగరింట నొకదాది ననుసరించె. 447
ఉ. ఈనరనాథకన్యపిఱుఁ దించుక ముట్టఁగనిచ్చి మేనునామేనున నంటఁ జేర్చి రుచిమించినమోవి యొసంగెనేని భూదానహిరణ్యదానఫలదానము లిచ్చినయట్ల విప్రుం డెంతైనను దానయోగ్యుఁడుగదాయని నన్బ్రతికించునావుడున్. 448
తే. అది దిగుల్పడి యెట్లు నోరాడె నౌరపలుక నీరీతి నోవెఱ్ఱిబాఁపనయ్యముక్కఱయుఁ గమ్ములును దాల్చి మురియుచున్నఁజూడఁజాలక యిట్లాడినాఁడవేమొ. 449
క. అన విని తత్పదయుగళంబునఁబడి నీధర్మసత్రపుం బ్రాహ్మణునిన్నను మన్నించిన నిఁక నేనొనరించిన ధర్మ మెల్ల నొసఁగెద నీకున్. 450
తే. అనుచుఁ గడతేఱి పోవుచో నజ్జడాత్ముఁడన్యభామారతోత్సాహు డగుటఁ జేసిలీలలీలావతీకన్యకాలలామనెత్తెఱంగునఁ జేకొందు నెట్లుమందు. 451
క. ఇవ్విధమునఁ దలఁచుచు నతడువ్విళ్లూరంగ శుభముహూర్తపుఁదరి నాపువ్వుంబోఁడికి బాల్యముజవ్వాడి తొలంగునంత సమరతపొడమెన్. 452
మ. అపు డాకీర్తిముఖుండుఁ దత్సతియు నత్యానందసంధానతన్నృపకాంతాజనము ల్మహీసురపురంధ్రరత్నము ల్గొల్వఁగారపణం బుప్పతిలం దదంతవిభవారంభంబుఁ గావించి యచ్చపలాక్షామణికి న్వివాహ మొనరించంగార్యమూహించుచున్. 453
తే. రాజమౌళియుఁ దత్సతీరత్న మపుడుతగుకులస్థుఁడు రూపకందర్పుఁ డైనవరుఁ డెవఁడొకో యటంచు భావమున నెంచునంతఁ గపటాత్ముఁడైన సిద్ధాంతి యనియె. 454
క. ఈబిడ సుముహూర్తకళాప్రాబల్యమునం జనించు భాగ్యంబున సుశ్రీబలముఁ జెంది నీగృహమాబలజిద్భోగసమధి కాస్పద మయ్యెన్. 455
వ. తదనంతరంబ.456
తే. బాలదుష్టవేళఁ బ్రథమరజస్వలయయ్యెఁ గాన దీని యవగుణమున
రాజ్యలక్ష్మిఁ బాసి ఱంపిల్లు నీయిల్లుకలిమి పెంపుఁ బాసి పొలియు ననఘ. 457
క. అనవిని గుండియ యదరన్మనుజేశ్వరుఁ డాప్తులైన మంత్రులతో నిట్లను నే నేర్పునఁ దీర్చెదరనవుడు నద్దుష్టమంత్రు లవివేకమునన్. 458
తే. సీత పుట్టి లంక చెఱచినచందానఁబుట్టఁదగనిముద్దుపట్టి యైనబాలికాగ్రగణ్యలీలావతీకన్యయిల్లు చెఱపఁ బొడమె నేమొ యనుచు. 459
చ. మును వెనుకేనియుం గనక మోసమునం గడుకార్యభంగమౌననక సుకీర్తిహాని పద మంచుఁ దలంపక కన్ కామణిన్వనధిపరీతయై పొదలు వాహినిలో నొకమందసంబునందునిచి రయంబున న్వెడల నొత్తుట నీతి యటంచుఁ దెల్పినన్. 460
క. కీర్తిముఖనృపవరుం డపకీర్తి జనించునని మిగుల ఖిన్నతనపు డవ్వార్త వినలేక బహుళతరార్తి న్నిజకామినీసహాయత వనటన్. 461
క. కడుపు చుమ్మలు చుట్టఁగాఁ గన్నకన్నెచిలుక నెడఁబాసి యేరీతి నిలుచువాఁడనెక్కడివివేకమున మంత్రు లెల్లఁ గదిసికువలయేంద్రునితో గువ్వకోలుగొనుచు. 462
మ. మునుగుంతీసతి కూర్మినందను మహాంభోవాహినిం జేర్పదోమనువంశాంబుధిచంద్రుఁ డాదశరథక్ష్మాభర్త శ్రీరామునికిన్
వనవాటి న్విహరింపఁ బంపఁడొ కృపాస్వాంతైకవాత్సల్యవర్తనముల్ చూడఁగ రాజనీతియె నరేంద్రాయంచు బోధించుచున్. 463
తే. మానుమీ మోహమని తెల్పి మానవేంద్రుచిత్త మొగ్గించి యొకమాటఁ జేసి రాచకొమిరె నిదురించుతఱి మందసమున నుంచివీడువెడలించుకొని తెచ్చువేళ నెదుట. 464
సీ. కలశోద్భవానీతకలితపుణ్యసమేతయఖిలజగత్పూత యైనమాతజడధినాయకు నేలుబడి గన్నయిల్లాలునిఖిలపుణ్యపుఁజాలు నిలుచుప్రోలుఆభ్రఘట్టనఖేలనాభీలకల్లోలయఘతూలికాజాల మడఁచు కీలఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీనవినుతసత్యవితానమునకు సోనతే. యధిపతి సమాగమార్థప్రయాణసమయసమధికోత్తుంగభంగసంచారజనితఘనగరుధ్వానపటపటాత్కారసారభూరిసితపక్షభేరి కావేరి వెలయు. 465
ఉ. ఆవరవాహినిం గని దురన్వయు లచ్చటి మంత్రు లెల్లలావతియున్న పెట్టియ నలంఘ్యతరం బగు తజ్జలంబునంబోవిడిపించి భూవిభునిపొంతనె యెప్పటియట్ల యుండి రాహా వివరం బెఱుంగని దురాత్ములకృత్యము లట్టివేకదా. 466
వ. కావున. 467
క. నృపతి యగువాఁడు విద్యానిపుణున్ బహుకార్యభారనిర్వాహకు శాంతపరజనమర్మభేదనకపటమతి న్మంత్రిఁ జేయఁగానగు నబలా. 468
వ. అది యెంతైనం గల దత్తెఱంగునకు నిమిత్తం బేమి యట్లుండనిమ్ము తదనంతరవృత్తాంతంబు వినిపింతు నని యి ట్లనియె. 469
క. జనకుఁ డగువార్ధి రాజుంగనుప్రేమం దల్లియైన కావేరికడంజనుకమలపాణి యననవ్వనజాయతనేత్ర యేఁటివడి నేగుటయున్. 470
చ. తను మునుజూచి మోహపరితాపము గన్న పురోహితుండు గ్రక్కున నిది వేళ యీకుసుమకోమలితో రతికేళివైభవంబనువుగఁ గోర్కి దీర్చుకొన నంచు మనంబున నెంచి తత్తటీవనతలకుంజమంజులనివాసము న న్వెస నొంటి నుండఁగన్. 471
వ. ఆసమయంబున. 472
తే. ఒదిఁగి యలమందసములోన నున్న రాజకన్యకామణి మేల్కాంచి కలవరించిబహువిధంబుల విలపించెఁ బంజరమునఁజిక్కువడియున్న క్రొత్తరాచిలుకవోలె. 473
సీ. జనకు నెమ్మనము వజ్రప్రాయ మాయెఁగామాయగావించి యీమాడ్కిఁ బనుపఁ
దల్లికి వీను లెంతయుఁ జల్లనాయెఁగానాయగాధప్రయాణంబు విన్నదాదియపఖ్యాతిఁ దలఁపలేదాయెఁగాదాయగాఁబోలు నింతయు సహింపనాళీజనశ్రేణి కాత్మ కింపాయెఁగాఁబాయఁగారాని యీబారినొందతే. నకట! నాయీడు రాచకన్నెకల కెల్లఁగడఁగి నన్నాడుకొన నోరు గల్గె నేమనందు నిఁక నెందుఁజొత్తు నాహావిధాతవ్రాఁత యవిలంఘ్యమనియెంచు వడిఁ దపించు. 474
శా. అన్నీలవేణి యివ్వగనున్నంత సమీపభూమి నొక రాజు శుభాభ్యున్నతుఁడు రశికశేఖరుఁడెన్నఁగ హిమథామనాముఁ డేపు దలిర్పన్. 475
తే. అతులితోత్సాహమున వేఁటలాడియాడికడఁగి యచ్చోటనే వీడువిడిసెఁ గానఁగర్ణయుగమునఁ దత్కన్యకాప్రలాపకలకలధ్వను లాలించి జలదరించి. 476
మ. ఇదియేమో మనపాళెమెల్ల వగ న ట్టి ట్టై వెతం జెంద నిన్నదిలోన న్విననయ్యె నాఁడు మొఱ కాంతారత్న మిం దెవ్వతోమది నూహింపఁగరాని దుర్దశ వహింపంబోలు నేఁ డీవిపత్పద మేమో వివరించుఁ డంచుఁ గరుణాపారీణచేతస్కుడై. 477
ఉ. భూరిజలప్రచారులగు బోయలఁ బంపిన వారలాపయఃపూరమున నెలంగు కలముం బలె నుండెడు మందసంబు న
త్తీరము సేర్చి యందు సుదతీమణి యుండు టెఱింగి యద్ధరిత్రీరమణుం గనుంగొని విధేయతఁ దత్క్రమ మెల్లఁ దెల్పినన్. 478
క. విని యప్పు డానృపాలుఁడుకనుకనినమ్మందసమునఁ గలకలవాణిన్మన మలరఁ దోడి తెండనితనదాదులఁ బంపె నోసుధాకరవదనా. 479
ఉ. అంత నతిత్వరైకమతి నజ్జరఠాంగన లేగి యమ్మహీకాంతుననుజ్ఞఁ బెట్టెఁ బిగఁగట్టుల నెల్ల సడల్ప రోహిణీకాంతుని రేఖఁ గ్రొమ్మెయిలు గప్పుటఁ బాసి రహించినట్లు తత్కాంతతనూవిలాసరతికాంత తళుక్కనఁ జెంతనిల్చినన్. 480
క. కని యత్యంతకుతూహలమున నజ్జరఠాంగనాసమూహము వెసనవ్వనితారత్నము కులగోత్రనిరూపణము న్వచింపఁ బ్రార్థించుటయున్. 481
చ. కరతలసక్తగండఫలకస్థలయై చిగురాకువంటి వాతెఱవసివాఁడ ముద్దువగఁ దిన్నని మో మరవాంచి దీనతన్సురసురస్రుక్కి యుస్సురనుచుం దనవర్తన మెల్లఁ దెల్పినన్సరసతఁ గొందఱందు నృపు చక్కటి కుధ్ధతి నేగి వేడుకన్. 482
క. ఓరాజకులశిఖామణియారాజీవాక్షి చెల్వ మతిచిత్రము శృంగారవతి యువతినృపకన్యారత్నము దానిఁబోల నతివలుగలరే. 483
చ. చిఱుదొడలంద మాచికిలిచెక్కుల చొక్కట మామెఱుంగువాతెజసొబ గావినీలమణిదీధితుల న్నునుఁగొప్పుచంద మాగురుతరజాతకుంభమయకుంభకుచంబులగుల్కుబింక మాతెఱువకె యొప్పు నత్తెఱవ దేవరకే తగనొప్పు భూవరా. 484
క. అనీ తెలిపి రాజు చిత్తముకని క్రమ్మఱి రాజకన్యకం దెచ్చుటకైవినయోక్తుల నంతయెలర్చినఁ జింతాజలధిమగ్నచిత్తాంబుజయై. 485
సీ. ముకురద్యుతికపోల మకరికాలతలతోగమ్మకస్తురి చిత్రకమ్ము చెదరవక్త్రగంధానుధావన్మిళిందములతోగప్పుపెన్నెఱికొప్పు కంప మొందఁగర్ణికాకుసుమరింఖనర్మదంబుతోనిడువాలుఁగనుదోయి నీరు చిలుకగళదనర్గళఘర్మకణపరంపరలతోనఱుతముత్తెపుసరు ట్దొరసి యాడఁతే. బీనవక్షోరుహమును లేఁగౌను ఘననితంబ మలరఁ బదంబు లందంద వడఁకనడఁకువదలిర్ప నన్నరేంద్రాగ్రగణ్యుకెలని కేతెంచె నలరాచకలువకంటి. 486
క. వచ్చుటయు రాజు చూచి వియచ్చరవరకన్య యేమొ యని మెచ్చుతఱిన్మచ్చరమున నమ్మదనుఁడుపచ్చని విలుఁబూని పంటఁబగవట్టెఁ జెలీ. 497
తే. ప్రేమ నవ్వేళ నేకాంతసీమ కరిగిసరసుఁ డైనట్టి యమ్మహీశ్వరవరుండులీలదళుకొత్త లీలావతీలతాంగినించువిలుకానిరాజ్య మేలించి మఱియు. 488
క. ఆరామయండఁ బాయకయారాజనరుండు నిజపురాంతఃపురముంజేరి సుఖంబున నుండె నుదారతరోత్సాహుఁడై సుధాకరవదనా. 489
మ. అని రాచిల్కలఱేఁడు పల్కునెడ నుద్యద్ఘోరగాఢాంధకారనివృత్తిన్ జగ మొప్ప నూరుజవధూరత్నంబు వీక్షించి యొయ్యనఁ గేళగృహసీమ కేగి రవియస్తాద్రిప్రవేశంబునందినవేళం దమి రేఁగి భూవిభుని నర్థింజేరఁ జారు క్రియన్. 490
క. శృంగారరస మెసంగన్బంగారపుబొమ్మవంటి బాలిక యపు డయ్యంగజరాజతురంగముచెంగటి కేతెంచి వాగ్విచిత్రప్రౌఢిన్. 491
క. శుకసార్వభౌమ నేఁ డీసకలజ్ఞుండైనగాజు చక్కటికరుగన్సుకరమయి యున్న దీదినమిఁక వేగమ తెల్పు మవలి యితిహాసంబున్. 492
మ. అనుచుం జిల్కలకొల్కివల్క విని యత్యానంద మింపొంద నిట్లనియెం గీరకులప్రభుండు హిమధామాఖ్యుండు తా నూరికింజనుచో నెచ్చెలియున్న మందసములోనం గ్రూర
సక్రోధచండ నిరాతంకము నొక్క భల్లుకము నుండం జేసి గర్వోన్నతిన్. 493
తే. అమ్మహావాహినీజవాభ్యంతరమునవిడిచి చనెఁ గాన నది నీటివెంట నరుగఁదొలుత నమ్మందగమన పై వలపుఁ జెందిపొంచికొనియున్న యవ్విప్రపుంగవుండు. 494
క. కనుఁగొంటి నదె నిధానముగనుఁగొన నొక మాళ్లబిందె గలిగెఁ గదా యేమనవచ్చు దైవయత్నంబని తలఁచుచు మోహవశత నవ్యగ్రమతిన్. 495
మ. తనశిష్యు ల్వెనువెంటరా నడిచి యుద్దండస్థితిం దన్నదీవనమధ్యస్థలినున్న మందసము ఠేవం దెచ్చి తత్తీరమందునవీనద్రులతానికుంజమున మెచ్చు ల్గుల్కుచో నుంచి యత్యనురాగంబునఁ గామినీగమనమోహానూనచేతస్కుఁడై. 496
సీ. వలుదలై మెఱయు పార్వణపుముద్దలవంటివలిచన్ను లెన్నఁడు వ్రచ్చికొందుఁబుణ్యాహపల్లవంబులఁబోలు కెమ్మోవిగడువేడ్క నెన్నఁడు గఱచికొందుఁగొనలు గల్గిన దర్భకోటి నేలెడునెఱుల్గట్టిగా నెన్నఁడు పట్టుకొందుఁబంచామృతముఁ గ్రిందుపఱచు వాక్సుధ చెవుల్తనివంద నెన్నఁడు ద్రావికొందుతే. ననుచు నేఁగోరికొని యుందు నట్టితలఁపులన్నియు ఫలించెఁగా నేఁటికని తలంప
వీని జన్మంబు కిష్కింధలోన నేమొకావలయునంచు శిష్యవర్గము గణింప. 497
క. వేదము చదివినఫలమున్వాదించినఫలము సంధ్య వార్చినఫలముంబైదలి నీకు నొసంగెదఁగాదనినం బ్రహహత్యఁ గట్టుదుఁ జుమ్మీ. 498
తే. అని యనన్వయరీతి నెన్నైన వదరిపదరి యొక్కింతయును నీతి మది గణింపకతనుఁ డనుమృత్యు వెసకొల్ప నల్లమందసమునఁ గల చీలలన్నియు సడలఁజేసి. 499
సీ. అవునషే నను వివాహముగమ్ము విద్వాంసురాల వయ్యెదవు శీతాంశువదనవివరింతు నొక పిన్న విన్నపం బాలింపుమభిమతార్థంబు నీకగు మృగాక్షియలయింపనేటికే యకట నీశిష్యప్రశిష్యుండ నగునన్నుఁ జిగురుఁబోఁడిపంచాస్త్రుఁ డిదె నేఁడు బాధించుచున్నాఁడుబ్రదికింపవే నన్నుఁ బంకజాక్షి
తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపఱచుటెంతయు నధర్మ మని చెంత కేగునంతనుల్ల మగలంగ నయ్యుగ్ర భల్లుకంబుగుటగుట యటంచు రొప్పి యక్కుటిలుఁ గదిసి. 500
క. మెడఁబట్టుకొని తనూలతజడియం గుదియించి నేలఁ జదికిలఁబడి యమ్మడియఁడపు డెంత పొరలినవిడువక మృత్యువు కొనర్చె విందు లతాంగీ. 501
క. అని కీరకులశిఖామణియనుగాథ కృతావధాన యై విని యయ్యంగన యిది విచిత్రతరమౌననుచుం దరహసితవదనయై యుండు తఱిన్. 502
మ. ప్రకటాకాశవిభుం డహర్ప్రభుని మత్ప్రాప్తైకనక్షత్రమాలిక నీ వేటికి దాఁచినా వనుచు హాళిం బల్కుచో నాతఁడత్యకలంకస్థితి నగ్నితప్తచటులం బౌలోహఖండంబు సాత్వికరీతిన్ వెసనెత్తినట్లు రవి ఠీవిం బ్రాగ్దిశం దోఁచినన్. 503
క. అంతటఁ దననగరుకుఁ జనికాంకాతిలకంబు ప్రొద్దుగడువమి నెంతోచింతిలుచు నుండునెడ భాస్వంతుఁడు పశ్చిమపయోధి వడిఁ గ్రుంకుటయున్. 504
క. కలధౌతరత్నరశనాకలితబహుక్షుద్రఘంటికాతతి మెఱయన్వలఱేని భద్రగజమనఁజెలి యా రాచిల్కచెంతఁ జేరినయంతన్. 505
చ. కనుఁగొని యోసఖీజనశిఖామణి నేఁడొక గాథఁ దెల్పెదన్విని చను మన్యనాయకుని వేడ్క మెయి న్రమియింపఁబోవుచోఁబెనిమిటిఁగన్నయంత నొకబింబఫలాధర ధైర్యవర్తనంబసువుపడంగఁ దెల్పు టరయ న్వివరింతు నటంచు నిట్లనున్. 506
క. కనువిందై యొక పురవరమనువందున్భువి మదేభహయభటరథ రంజనమై యఖర్వరిపుభంజనమై పొలుపారుచు న్విశాలం బనఁగన్. 507
క. ఆనగరీవర మేలు మహానటనిటలస్థలీబృహద్భానుమహాశ్రీనిర్జితసమదరిపుక్ష్మానాథుఁడు భీమసేన జనపతి కడఁకన్.509
క. ఆ రాజు రమ్ము పొమ్మనిగారా మొనరించి మనుపఁగా మోహనుఁడన్పేరుగలవాఁడు తగుగుణవారిధియగు నొక్కబచ్చువాఁ డవ్వీటన్. 509
ఉ. మైనపుటంటు పల్వగలమచ్చులచా లొరగల్లు కట్టెలుందూనిక నాలుగేన్బొరలతోఁ దగువట్రములోననున్న నానానగరోద్భవంబులగు నాణెము లుండెడుసంచిఁ గొంచు బేరాసకువచ్చు నన్నయధురంధరుఁ డంగడికిం గణింపఁగన్. 510
తే. అతని కనుకూలవతి రూపవతియునైనభామినీమణి దనరు సౌభాగ్యసీమయాత్మనాయకపాదసేవాభిరామనవ్యగుణవతి శుభవతీ నామ యొకతె. 511
ఉ. ఆలలితాంగి పుష్పవతియై దివసత్రయముం గ్రమించినన్నాలవనాఁడు దాగురుజనంబులు కుంకుము సంకు పొంకముంబోలెడు చల్వయుం బసుపుముద్దయుఁ గైకొని తోడరా మహాకేళిరథాంగయైన నదికిం జని మజ్జనమాడి వేడుకన్. 512
ఉ. అత్త యొసంగ నొక్కకబళాన్నముఁ గైకొని వీటికారుచుల్క్రొత్త మెఱుంగులీను రదకోరకము ల్గబళించి ఱేని పల్లొత్తులు బట్టబైట నిడనోపుచు వాతెఱ నీనె గట్టఁగానత్తరలాక్షి చూపులు నిజాంఘ్రుల నిల్పుచు వీథి నేగఁగన్. 513
వ. ఆసమయంబున. 514
చ. చిటిలిన గంధముం దళుకుచెంపను వ్రేలురుమాలు జాఱుదుప్పటియును నిద్రదేఱుముఖపదము చెక్కిటికాటుమూఁపు చెంగట నులిగొన్న జన్నిదము కన్నులకెంపు లతాంతవీటికాపటిమ రహింపవచ్చె వరభద్రుఁడు నావిటుఁ డొక్కఁ డత్తఱిన్. 515
ఆ. వచ్చి మదికి మెచ్చువచ్చు నచ్చెలి బడాపగలఁ జూచి వింత పదము వాడికేకరించి కొన్నిపోకలఁ బోయి యచ్చేటెచూపు దన్నుఁ జేరకునికి. 516
క. నొగులుచు మరుబరిగోలలఁబొగులుచు నయ్యిందువదన పొందునుగూర్పందగువారు లేరు దీనికినగువారేకాక యని ఘనం బగుచింతన్. 517
సీ. తనమాట యే మెఱుంగనియంగనకు జారమమకార మొనరించు మందు గాఁగఁదనప్రౌఢి సందు గానని సుందరికి గోడచివ్వున దాఁట నిశ్రేణి గాఁగఁదన నేర్పు గురుభీతతతనితంబకు సాహసక్రియ కభయహస్తంబుగాఁగఁ
దనబుద్ధి బొంకనేరని పంకజాక్షికిధవునివాకట్టు మంత్రంబుగాఁగతే. నమరు నవ్వీట నన్నపూర్ణాభిధానమదనమాయామహాస్థానమంత్రసానిదానితో మాటలాడి చూతము విచారమేల యని వేళగని దాని యింటికడకు. 518
చ. చని వరభద్రుఁ డల్ల గుణశాలిని జూచుటఁ దెల్పి దానిమోహనమగు రూపమెంతకొనియాడెద నేడు దురంతకంతుకుంతనిహతిఁజింతవంతఁబడితాంతలతాంతము చంద మొందె నాతను విదె చూడు వేఁడుకొనెదన్ననుఁ గూర్పుము దాని నేర్పునన్. 519
క. నాకనఁగాఁ గనకము భౌమాకనుఁగొనఁ జిల్లపెంకు మాత్రము దానింజేకూర్చిన నాతనునిదెనీకుం గైవస మొనర్తు నీతోడు సుమీ. 520
మ. అని సూచించిన మంచిదంచు విని యయ్యబ్జాక్షినిం గూర్ప నాతనికిం బాసయొసంగి వీడ్కొలిపి తత్కార్యార్థ మూహించి మోహనుగేహంబునకుం బ్రయోజనశతవ్యాపారముల్ దెల్పికొంచు నిరూఢంబగు రాకపోక లొనరించు న్మాయ డాయింపుచున్. 521
క. అంతట నాశుభవతి కదియంతింతనరాని యంతరంగంబున నాద్యంతమధురోక్తచాతురిసంతతము న్వింతసంతసం బెసంగించున్. 522
క. ఆలలనామణి కాగయ్యాళి యొకానొక్కవేళ నక్కఱతో సువ్వాలున్శోభనములు ధవళాలు న్మొదలైన పాటలం దగ నేర్పున్. 523
చ. వనజదళాయతాక్షి మగవాఁడు పరాంగనపొందుఁగోరువాఁడని వినవేమొ యట్టిచవు లంటినచో మఱిచౌక సేయఁడేనిను నటుగానఁ బూని మగనిం బెఱత్రోవలఁ బోవనీకు నేర్పుననని బుద్ధిగాఁగఱపు ముద్దియ సందియమందకుండఁగన్. 524
క. అంతట నొకనాఁ డొక వెలయింతియు మోహనుఁడు నప్పులిచ్చినపనికైమంతనమాడఁగ నమ్ముదిజంతయు వెసఁబోయి వానిసతికిం జెప్పెన్. 525
తే. చూపి యిన్నాళ్ళు నిటువంటి సుద్దిగాదుకాదటందువు గద దానికాళ్ళమీఁదసాగఁబడి మ్రొక్కి యిల్లాలిఁ జక్కఁజూడఁగావుమని బాసలీయఁగాఁ గంటి నేను. 526
ఉ. బిడ్డయొ పాపయో చిదిమి పెట్టిన కైవడినున్న నిన్నుఁ దాసడ్డయొనర్పకవ్వలఁబిశాచమువంటి గరాసుఁగూడె నీయెడ్డెఁడు గుట్టుతోడ నిఁకనేనియు నాపలు కాలకించు నేనొడ్డెద దీనికిం దగినదొక్కయుపాయము తోయజాననా. 527
క. తిట్టిన మెట్టినకైవడిసెట్టింగని పొడిచినట్లు చేకూడమఱిన్నెట్టుకొని నేఁటినుండియుగట్టిగ వేఱొకనిఁ గూడఁగావలె నీవున్. 528
చ. తెలియదుగాక నీకు సుదతీ రతినైపుణిఁ జూపవచ్చునోకలకల నవ్వవచ్చునొ వికాసపుముచ్చటఁ దెల్పవచ్చునోబలువగ పారువాపలుకు పల్కఁగవచ్చునొ కుల్కవచ్చునోచెలువుని చెంగటం బరునిచెంగటఁ బోలెఁ గురంగలోచనా. 529
క. కొసరువగమాట లలుకలుఁగుసిగుంపులు తిట్లు మోరికొట్టులు జారుండసమసుఖంబుగఁ గైకొనుబసవెద్దగు మగఁడు మండిపడుఁ గుసుమాంగీ. 530
తే. నోరెఱుంగనియట్టి జంతువులుసైతమంబుజానన యిచ్ఛావిహార మందుబ్రతుక నేర్చిన తనువొక్కపతి కొసంగిబంగరమువంటి మనసుఁ గెంటంగ నేల. 531
క. అని చెలి పుడకలు విఱిచినఁగనుఁగొని యది క్రొత్తగుమ్మ కావున మనసొగ్గిన నదియును నేనొక్కనిఁగొనివచ్చెద నూరిబైటి గుడికడ కనుచున్. 532
క. చింతాకు ముడుఁగుతఱిఁ దత్కాంతంగొని తెచ్చి మేరుకార్ముకగేహోపాంతమున నిల్పి మఱితానంతన్ వరభద్రుఁ బిలువ నరిగె న్వేగన్. 533
తే. అరిగి యతఁడింట లేకున్న నాత్మఁబొగిలికొదవవచ్చె నటంచు నమ్ముదిపిసాలి
తిరిగి చనుదెంచుచోఁ గాంచెఁ దెరువులోనవానిఁబోలిన నెఱనీటుకాని నొకని. 534
క. కని పొలిపోవనిమగనాలిని గూర్చెద నీకుఁ జాలలేవడిఁ బాల్మాలినయది యనుచుం బిలిచినఁజని యాతఁడు కాంచె నాబిసప్రసవాస్యన్. 535
క. కనుఁగొని తనయిల్లాలనిమనమున నతఁ డెఱిఁగె నంత మగువయు నాథుండని తెలిసెం దత్సమయంబున నాశుభవతి మఱెట్లు బొంకఁగవలయున్. 536
క. తెలిసిన నేగుము తెలియనియలవైనం బోకు కొంచెమా పరపురుషుంగలయుటలు నిలువనాడంగలదానికిఁ జెల్లుఁగాక కరివరగమనా. 537
ప. అని యివ్విధంబునం గీరసునాసీరుండు పలికి యూరకుండిన నవ్వ్వైశ్యాదృశ్యమధ్య యతిధ్యానాధీనయై యలక్ష్యనిక్షిప్తవీక్షణంబున నున్న మితభ్రూలతంబుగాఁ గొంతతడవు విచారించి భూతలాధిపానీతయగు రాజదూతిం గనుంగొని యిందేమైననుం దెలియునె యనియడిగి ముఖవికారంబునం దానియజ్ఞానం బెఱింగి రెండవచంద్రమండలంబునుం బోని తనముఖం బెత్తి చిగురాకుమఱుఁగునం బొడము మొగ్గయుంబోలె మధురాధరంబు చాటునఁ దలసూపుదరహాసకందళంబుతో నచ్చిలుక కిట్లనియె. 538
తే. అరయ నిక్షేప ముంచినయట్టివారెతెలియవలెఁగాక యొకరికిఁ దెలియఁదగునెయింత యేమిటి కిపుడు నీయిడినచిక్కునీవె విడిపింపు మన శుకం బిట్టులనియె. 539
ఉ. అప్పుడు తద్వధూటి చలితాధరయై వరుఁ గుప్పుతెప్పునంజప్పుడుగా నదల్చి పరసారసగంధులఁ బొందనంచు నాకొప్పని బాస నిచ్చితి నహోయిటు లెంతకు నెత్తుకొంటి వింకెప్పని కైన నమ్మఁదగునే ననుఁ జంపఁగఁ జూతు వింతటన్. 540
ఉ. నీమదిఁ జూడఁగోరి తరుణీ జనధర్మము గాక యున్నచోనేమని దీనిచేత నిటకేఁ బిలిపించిన వచ్చి తన్యభామామతి నిప్పుడిట్లు పరమానినియైన రమింపవచ్చి నాతో మదిమోహమగ్నుగతిఁ దోపఁగ నుండుట కిచ్చగించితో. 541
క. చుట్టాలకుఁ దెల్పుదు మదిదొట్టినకినుకం దలార్లతోఁ జెప్పుదుఁ గూపెట్టుదు దొరముందఱ ననుబట్టకు మని పఱవ నతఁడు బరువగుభీతిన్. 542
తే. పాదముల వ్రాలి నే నేమిపాప మెఱుఁగనీమహాదేవునాన పూర్ణేందువదనరవ్వయొనరింపవలదంచు రమణిఁ దోడుకొనుచు గుట్టునఁ దనగృహంబునకుఁ జనియె. 543
క. అని చిలుక పలుకఁ గుతుకంబున నౌరా యెంతబొంకు బొంకెను మృగలోచన యని ప్రభావతీసతియనుపమ మతి మెచ్చుకొనియె నవనీనాథా.544
వ. అనిన నద్ధరాకాంతుండు తదనంతరగాథాప్రకారం బెవ్విధం బని యనుడు. 545
శా. విశ్వామిత్రమనఃప్రియంకరకరావిర్భూతదానక్రియాశశ్వత్తోషితధారిణీసుర సురేశస్తుత్యశౌర్యాతిలబ్ధైశ్వర్యోజ్జ్వలవైభవోన్నతనతాయాసాపహృధ్వీమహోక్షాశ్వాస్త్రాసవిరామ రామబలగర్వారంభనిర్వాపణా. 546
క. ధారాధరవర్ణ సుధాధారాపరిపూర్ణవాక్యధారావిబుధాధారానిజకౌక్షేయకధారాదళితాహితవసుధాధరధారా. 547
మాలిని.—జలధరనిభదేహా సజ్యకోదండబాహాఖలదనుజవిదారీ కంధిదర్పాపహారీకులగిరిసమధైర్యా కుంభినీనాథవర్యాసలలితగుణజాలా జానకీకేళిలోలా. 548
Comments
Loading comments…