ముప్పదితొమ్మిదవకథ
శుకసప్తతి
చ. జలకములాడి జీని బురుసాజిగిచీరె ధరించి గుబ్బలన్గలప మలంది కన్నుగవ కాటుకరేఖ యమర్చి కస్తురిన్తిలకము దీర్చి భూషలును దేహమునందు నలంకరింపుచున్కలవలరాజుఁబోలు నరనాథుని జేరగ నేఁగు నత్తరిన్. 261
క. చని నాఁటిరేయి నరపతినెనయన్ దద్గేహసీమ నేఁగెడుదానిన్కనుగొని యనియెన్ గీరంబును దనపల్కులను నమృతముఁ గులుకంగన్. 262
క. కలహవిజృంభణబాహాబలనిర్జితశత్రురాజబలుఁ డతిలోకోజ్జ్వలచిత్రసేనుఁ డప్పురిచెలువొందగ నేలు చిత్రసేనుం డనఁగన్. 263
గీ. అతఁడు నాతనిదేవేరి నతులదివ్యలక్షణాకృతి సయ్యాదిలక్ష్మిఁ బోలివెలయు సుబలాంగనయు సముద్వేలలీలనేకకంఠత నిద్ధాత్రి యేలుటయును. 264
వ. అప్పు డప్పార్థివపుణ్యదంపతులు పరస్పరపరమస్నేహంబున చందచంద్రికాప్రకారంబున కుసుమసుగంధన్యాయంబున రత్ననిర్యత్ప్రభావంబునం బ్రవర్తిల్లుచు నుండునంత నక్కాంతారత్నంబు వెండియు. 265
చ. అలుక ఘటించ దెంత పనియైన మనంబున, నొవ్వ జల్లుగాఁబలుకదు చేటికాంగనల పట్టునకైన, విభుండు గోరినట్లలవడ సేవ సేయు సమయం బెటువంటిదియైన రాజకాంతలు తనతోడివా రిది గదా కులధర్మ మటంచు నెంచగన్. 266
వ. ఇంతియె కా దాకాంతాతిలకంబు నిరవధికసౌభాగ్యంబు దెలియ నొకనాఁడు నిజాంతఃపురవరారోహాసహస్రంబులు గొలువ నాళీజనంబులతో నిష్టాగోష్ఠి విహారంబులు సలుపుచున్న యెడ. 267
సీ. ఒకబాలచంద్రఖండకళాలయకపోలనీరుమోసిన వింతతీరుఁ జూచియొకచాన సంతతానికదానగజయాన(?)పురుఁడోమఁగ రహించు హరువుఁ జూచియొకకాంత కుందకోరకకాంత(రచయుక్త)బాలింతయైయున్న బాగుఁ జూచియొకభామ వికచచంపకదామతనుధామబిడ్డ నర్మిలిఁ బ్రోచు బెడఁగుఁ జూచిగీ. యతిశయానందకరము పుత్రాప్తి కంటెవేఱె యొక్కటి గలదె భావింప ననుచుననుఁగు నెచ్చెలిపిండుతో నవ్వధూటివేడుక రా లరముచ్చట లాడియాడి. 268
చ. ఇల గలపుణ్యతీర్థముల కేఁగి వ్రతంబు లొనర్పుతీర్థవాసులకు సమస్తవస్తువులు చూర లొసంగ కుటుంబభోజనంబులు ఫలదానముల్ నడపు భూసురకోటికి ప్రాక్తనంబుతాకొలలు హరింప నక్కుసుమకోమలీనాథు ననుజ్ఞ మున్నుగన్. 268
వ. ఇత్తెఱంగున సుపుత్రోదయకారణంబులగు బహువిధశుభవ్రతంబు లాచరింపుచున్నయెడ నొకనిశీథినీసమయంబున. 269
గీ. పతియు దానును సురతానుభవమువలనఅంగమునబుట్టు బడలిక లపనయింపమృదులతరతల్పనమునబొంది నిదురజెందిమేలుకల గాంచి యంతలో మేలుకాంచి. 270
క. తనప్రాణవల్లభునకున్గనకలతాతన్వి గనినకల తనవాలుంగనుఁగొనల సిగ్గుఁ గుల్కుచువినుపించిన యవ్విభుండు విస్మయమతియై. 271
క. ఇక్కల నిక్కను యగుచున్ఱెక్కలుగలజక్కి నెక్కు రేఖావంతున్జిక్కపరచు నవమోహమునొక్కరునిన్ గొమరు గొంచెదో యెలనాఁగా! 272
గీ. అనిన మో మరవాంచి బింబాధరమునగందళించిన చిఱునగ వందగించసేమమునగాను నోచిననోములెల్లపండెనేమోకదా యని యుండునంత. 273
గీ. చిత్రసేనపక్షీంద్రుతో శితమునీంద్రశాపసంప్రాప్తుఁడైన వైశ్వానరుండు
జగతి నిక రాజవంశాఖాచంద్రుఁ డగునటంచు దైవజ్ఞు లెఱుగింప నాక్షణంబ. 274
క. ధీరులు దెలుపఁగ మది చెలువారందగు సుబలతోడ నతులితసదనప్రారంభవేళ నకులున్గోరి ప్రసన్నునిగ జేసికొని వినయోక్తిన్. 275
క. తనయాభిలాష దెల్పుచుమనమలరన్ వేడుకొనినమాత్రనె యతఁడేనెనయ భవద్గర్భంబునంజనియిత్తునటంచు వర మొసగి చనునంతన్. 276
వ. అది గారణంబున. 277
క. కలవాణీమణి సుబలకునెలమసలినపిదప రెండునెలలై మఱియున్నెల యొండుగడచినంతన్చెలువకు నెమ్మేన గర్భచిహ్నోదయమై. 278
చ. వెలవెలనైననెమ్మొగము వృత్తగురుస్తనగోరకాగ్రముల్నలుపువహించె నిమ్నతరనాభి బయల్పడియెన్ వళీతరంగరేఖలనగుముత్యముల్ దొలఁగె కౌ నొకయించుక గాఁగ నాభయాంకలుతరచయ్యె నవ్వికచకంబుదళాయతనేత్ర కెంతయున్. 279
క. ఈరీతి న్నవమాసములారామామణి ధరించి యతులితసుముహూర్తారంభవేళ గనె సుకుమారున్ సుకుమారతనురమాసుకుమారున్. 280
వ. అట్టియెడ. 281
సీ. అనవద్యవాద్యముల నగరచేటికనగరసామంతు లనంగ నడిచెబ్రతికెదమని కోరి మతి నుల్లసిలు విప్రవరులకు బంగారువాన గురిసెపట్టణక్షోణి నాబాలవృద్ధాదులౌప్రజలకుఁ జక్కెఱపంటఁ బండెగడిదుర్గములనుండి కడుచూడఁజూలనియరివీరులకు గుండె లావలించెగీ. నెంచఁదగియున్న వియ్యంపుటింటిరాచకులము మన్నీల కింతైన బలిమి గలిగెకోపనారత్న మగుసుబలాపురంద్రికడుపునను పుత్రతిలకంబుఁ బొడమె నపుడు. 282
గీ. అంత నారాజవరుఁడు శుద్ధాత్ముఁ డగుచువసుధ మెచ్చంగ పుత్రోత్సవం బొనర్చిప్రోడలగుభామినీమణుల్ పురుడు దీర్చజాతకర్మాధికృత్యముల్ సంఘటించి. 283
క. పేరొసంగె చిత్రభానుమహారా జనగురుననుజ్ఞ నలబాలునకున్వేరుకలహంసగమనలవారతరతనాలతొట్లు నలరించె వెసన్. 284.
ఉ. పొన్నపుసన్నపుంబనుల చొక్కటమౌ దగతొట్ల వూఁచి నాయన్నకులాలి నన్ను గని నయ్యకులాలిసిరుల్ దొలంకువాల్
గన్నుల బుచ్చిపాపనికి లాలి మరందము గ్రమ్మరించు విల్గన్నవజీరుగన్నవగకానికి లాలి యటంచు భామినుల్. 285
గీ. ముద మొదవ బాలుఁ డిట్టు లభ్యుదయలీలంబెరిగే నానాఁటివిదియచందురునిబోలివినయగాల భీకర్యవివేకముఖ్యసరసగుణముల నానాఁటఁ బెరుగుచుండ.286
సీ. అభ్యసించె చతుర్విధామ్నాయబహువిధకావ్యబాహాటాది గ్రంథములునుసాధించె ఖురళికాస్థలిని ముప్పదిరెండునాణెంబులైన విన్నాణములనువాయించె వల్లకీవాదనాదసమస్తసంగీతబహురహస్యక్రమములునేర్చె మదోద్ధతానేకపజవతురంగమరథారోహచంక్రమనిరూఢిగీ. తెలిసి సామాద్యుపాయశక్తిత్రయములుకనియె రాజన్యనీతి ప్రకాశనీతిరాజమాత్రుండె యమ్మహోరాజతీవ్రభానుమద్ద్యుతి యాచిత్రభానునృపతి. 287
వ. ఇవ్విధంబున నవ్వసుంధరావరకుమారకంఠీరవుండు నిరవధికభోగభాగ్యోదయుండును, నిరుపమానమహైశ్వర్యధుర్యుండును నిరవద్యసకలవిద్యాప్రవీణుండును నై యుండునంత. 288
క. కుందనమును నెత్తావియు.....................................
యిందుముఖీకందర్పునకందంబుగ యౌవనోదయ మ్మెదిరించెన్. 289
గీ. అంత తలిదండ్రు లత్యంతహర్ష మెసఁగమంచికళ్యాణవేళ సన్మానలీలపంచకళ్యాణ మొనరించి పట్టభద్రుఁజేయ జగతీసురేంద్రుఁడై చెలగుటయును. 290
క. ముయ్యాడుముద్దుగుమ్మలువెయ్యాకులుగల రయారె వీరినగరి నోతొయ్యలి వీరందఱిలోనెయ్యము మదిఁ దొంగలింప నీరై ప్రేమన్. 291
గీ. తొడరి నినువిన్న యదిమొదల్ కడువిరాళినితఁడు మకరాంకశరశతక్షతశరీరుఁడయ్యె నీచేతిదింకనే యంచు బల్కుసెలవుల నొకింత చిఱునవ్వు చెంగలింప. 292
క. తలవాంచి సమ్మతం బగుతలఁపున నుండునెడ నుదయధరణీధరదిక్తలమున రవి యుదయించినమలమల దానగరుఁ జేరి మాపటి వేళన్. 293
క. కనకోపమాంగి చిలుకన్గనుగొని మనరాజమౌళి కథ దెల్పితి వెంతని నిన్ను మెత్తునిక నాపెనిమిటి జననంబు దెలియ ప్రియమగు ననుడున్. 294
Comments
Loading comments…