ముప్పదియాఱవకథ

శుకసప్తతి

యనుచు వర్ణింపఁ గైచేసికొని యొయారమమరవచ్చెఁ బ్రభావతీహంసయాన. 139

మ. అపు డాచక్కెరదిండిపక్కిదొర యక్కా! నేఁటి కిమ్మేనిచొక్కపుశృంగారము వక్ష్యమాణకథజోన్ వింతయయ్యెన్ సుమీకృప దళ్కొత్తఁగఁ జిత్తగింపుమని యంగీకారముం గాంచి నేరుపు మీరం దెలుపందొడంగె పలుమారుం దేనియల్ చిందగన్. 140

క. సుజనాకరమగు నొకపురము జగజ్జేగీయమాన మొదవగ ముదితాగజరథమురుదురురయహయభుజవిజయసనాథసుభటభూయిష్ఠంబై. 141

క. ఆరాజథానియేలు గభీరుం డనునృపతి యతనిప్రియమంత్రి జరత్కారుఁ డన వెలయు నతనికుమారుఁడు గుణశాలి యనఁగ మాన్యతఁ గాంచెన్. 142

గీ. అతఁ దొకనాఁడు హరిశర్మ యనఁగబరఁగునొక్క తైర్థికుం డేతేర నొదవుభక్తినతని కిష్టాన్నసంతుష్టి యాచరించియర్హసంభాషణంబుల నలరఁజేసి. 143

క. అన్నియుఁ దొరగిన యట్టి ప్రసన్నాత్మా కలియుగంబు చటులాఘతదుశ్చిన్ను లగుజనుల కేక్రియనెన్నగ సద్గతులుగలుగు నెఱిగింపఁగదే? 144

వ. అనిన విని యమ్మహీసురుం డిట్లనియె. 145

సీ. అన్నదానంబు దురంతపాపాటవీజాలంబునకు దావకీలగాదె?సురపితృభజనంబు దురితమేదురధరాధరకోటులకు వజ్రధారగాదె?కూపకల్పన మహాఘోరదుష్కృతతమఃకాండంబునకు భానుకరముగాదె?తరుకోటి నిల్పు టుత్కటకల్మషాబ్ధికలమునకు జంఝానిలంబుగాదె?గీ. ధరణి మఱియును భూసురస్థాపనంబుమొదలుగా నెన్నఁగలపుణ్యములు సెలంగునవియు సాలవె వృజినాగ్ని నవలనార్పసద్గతులు గూర్పగ నమాత్యచంద్రతనయ. 146

వ. అనిన విని యమందసందేహకందళితహృదయారవిందుఁడై యమ్మంత్రినందనుండు. 147

గీ. ముక్తి దొరకదు విజ్ఞానముననెగానికర్మమునఁగాని విజ్ఞానగరిమ లేదుజ్ఞానసత్కర్మహీనులె జనులకల్పమతుల కేరీతి గల్లు సద్గతులు చెపుమ? 148

క. అనఘాత్మ యనాయాసంబున కర్మఫలంబు జ్ఞానమున జెంది రయంబున లింగశరీరము వీడ్కొన సద్గతి గాంచు వెరవుగోరెద చెపుమా. 149

చ. అన విని యమ్మహీసురకులాగ్రణి యించుకసేపు కొంతచింతన మొనరించి యంతట పితామహుమాట దలంచి మంత్రినందను గనువిచ్చి చూచి చిఱునవ్వు కెలంకుల చిన్నవెన్నెలల్చినుకగ నిట్లనున్ ప్రమదసింధునిమగ్నమనోంబుజాతుఁడై. 150

గీ. బంధురక్షక! యిది మంచి ప్రశ్న కలియుగమున పాపాత్మజనులకు గతులుగలుగువెరవు దెలిపెద నన్నిట్లు వేఁడ భూతకరుణగలవాఁడ వగు టెఱుగంగనయ్యె. 151

క. మును బ్రహ్మ దెలిపె భూతలమున గాశీక్షేత్రరాజమును శ్రీముష్ణంబు ననాయాసంబున కలిజనులకు సత్పుణ్యగతు లొసంగు నటంచున్. 152

క. కావేర్యుత్తరభువిసంజీవనదికి పడమటను నృశేవధికకృషాశైవనికి దక్షిణంబగుతావున శ్రీముష్ణవిష్ణుధామము వెలయున్. 153

సీ. శ్రీవరాహస్వామి చిత్తాపకల్పితామోదసాగరము శ్రీముష్ణపురముప్రతివారసేవకాగతశతక్రతుశూలిముఖసరోత్కరము శ్రీముష్ణపురముముక్తివధూటిముముక్షుకోటివిధూతమోహనాకరము శ్రీముష్ణపురమునటతపురోమణి ఘటితనూపురరావముఖరితాంబరము శ్రీముష్ణపురము

గీ. స్మరణమాత్రవినిర్ఘతసకలపాపమూలసంతతివరము శ్రీముష్ణపురముదర్శనాలోలహృదయకందళితలసదమోఘసుజ్ఞానధరము శ్రీముష్ణపురము. 154

క. శ్రీముష్ణము శ్రీముష్ణముశ్రీముష్ణం బనుచుఁదలప జీవుఁడు కర్మగ్రామము దహించి గర్భస్తోమప్రాప్తులును నడుచుద్రోవలు మఱుచున్. 155

సీ. పొందుగోరదు నిజభుక్తి కాలాగతాగాధబాధాకరవ్యాధిచయముచేరలు పోదు దురంతచింతాతిసంతాపకృతిమహిన్నిద్రదరిద్రరవముతొంగిచూడదు మనోభంగపారంపరీవిత్రాసజనతతాపత్రయంబుతడవఁబోవదు మహోద్ధామకామక్రోధమాత్సర్యద్రోహాదిమదకులంబుగీ. మించి శ్రీముష్ణ మంచు దలంచువానిమాట లేటికి వానికర్మంబులు వ్రాయుచిత్రగుప్తులు తమలెక్క చెడియె ననుచుకవిలె పడవేయుదురు ధర్మకార్యదుర్య! 156

సీ. శ్రీముష్ణ మని దలంచినఁజాలు ప్రాకర్మకలితపాపౌఘంబువలనఁ బోవుశ్రీముష్ణయాత్ర చేసినజాలు నన్యూనవిజ్ఞాన మది కాళ్ళవ్రేళ్ళఁ బెనఁగు

శ్రీముష్ణపురముఁ జూచినఁజాలు భోక్తవ్యకరమకాండంబు లెక్కడనొ యడఁగుశ్రీముష్ణనగరు డాసినఁజూలు కైవల్యపథమెల్ల కిల్లాకు పంపుసేయుగీ. తగులుచే నైన శ్రీముష్ణధామసీమకాపురం బున్నవానిభాగ్యంబుఁ బొగడనలవియే బ్రహకైన బల్ చిలువకైనతలఁచినంతనె మైగరుపొలిచె జూఁడు! 157

గీ. ఇతరపుణ్యస్థలంబుల నెందుఁజూడదారమును దెల్పి కరుణించువారు లేరుకాశి శ్రీముష్ణమున రమాకాంతునాజ్ఞహరుఁడు గరుడుఁడు నుపనిష్టు లగుదురయ్య! 158

సీ. జనకేళిరతవిరజానదీజలజాతకులసౌరభము గుబుల్ కొనగడంగిపుడుకబెట్టులతేనె దడిసిన నునుఱెక్కసురటిజల్లినగొట్టుసోఁక విసరిహరిపదంబులు దార్ప నర్హమౌ కంటికిదంబుపై నుత్తమాంగంబుఁ జేర్చివైకుంఠపురసురావళి బరాబరి సేయుమృదులహస్తమున నెమ్మేను నిమిరిగీ. ఖగకులేంద్రుండు దక్షిణకర్ణముననుతారకబ్రహ్మపరమమంత్రంబు నొడువుగడగి కడపటిపయనంబుఁ గాంచువానికోమహమహ శ్రీముష్ణగ్రామసీమ. 159

సీ. ఎందుండివచ్చునో యినకోటినిభచక్రమరుదెంచు దకిణహస్తమునకుసమయమౌ టెఱుఁగునో ఘుమఘుమధ్వనిశంఖమపు డొద్దు వాయకరాగ్రసీమయెవ్వరు పనుతురో యలహేమచేలంబుజగనీటుగసు కటీచక్రసీమతరివేచియుండునో తతమణీకోటిరమవతీర్ణమగు నుత్తమాంగమునకుగీ. పతగరాజోక్తతారకబ్రహ్మమంత్రమంత్రములు కొన్ని వీనులవల నటింపతనువుతో బొందు సడలించు ధన్యమతికిభూసురోత్తమ శ్రీముష్ణపురమునందు.

శా. శ్రీముష్ణంబు సమస్తవైష్ణవమహాక్షేత్రాళికిన్ రాజసేవామంత్రంబున పాపలోపకరణవ్యాపారపారీణమైయామోదం బొదవించు నిచ్చు బలదీర్ఘాయుంగళావైభవంబేమో యంచు మదిం దలంచెదవుసుమ్మీ మంత్రిరాణ్నందనా.

మ. మును నీతావకపాదపద్మవినుతిం బూతాత్మతం జెందినాఁడనొ నీసత్కరుణాగుణంబు కొనియాడం శక్యమే నాయశంబునకున్ విస్మృతి దెల్పితే దయవెసం బూర్ణంబుగాఁ దెల్పి దోకొనిపొ మ్మచ్చటి కేను వత్తు నిక నీకున్ శిష్యశిష్యుండనై. 163

సీ.చక్కగాఁ బోనున్న సంయమనీపురంబున కేఁగుత్రోవల ముండ్లుగొట్టి

చలపట్టి దురితావళులె వ్రాయుచిత్రగుప్తులలెక్క హంసపాదులు ఘటించిమున్నుగా నమరించి యున్నదండనదాడియాతనసాధనం బవల ద్రోచిదండనోత్సుకవృత్తి దరిజేసియున్నట్టిపాశకోశము పటాపంచఁజేసిగీ. నన్ను రక్షింప వచ్చి తెంతటిమహామహుండవొగాని యిది యేల నుర్విమీఁదమిమ్మువంటి మహాత్ములు మెలఁగుటెల్లకూర్మి దీనుల రక్షించుకొఱకుగాదె? 164

క. అని చిలుక బలుకుచుండగనినుఁడు పూర్వాద్రిమీఁద నెక్కుట గనుచున్జనియె ప్రభావతి నిద్రాఘనపరవశనిమీలితాక్షికైరవి యగుచున్. 165

గీ. చారుకేళీనిశాంతంబుఁ జేరి నాఁటిరేయి రాజిల్కరౌతు గారించి రాజువలపుతో వచ్చు నాప్రభావతినిఁ జూచి“తేమనోభీష్టమస్త”ని తేనెలొలుకబలికె తక్కటికథ విన జిలుక యపుడు. 166

వ. అని యిట్లు గుణశాలి సన్నుతించి నీవెంట వత్తు ననిన. 167

చ. అనిన నతండు మేకొన కరాబ్జగృహీతతదీయపాణియైజనభయకారిఘోరవనశైవలిని పురవక్కణంబులె

Comments

Loading comments…