ఒక కథ

సాక్షి మూడవ సంపుటం

క. “పలికెడిది భాగవతమట, పలికించెడివాఁడు రామభద్రుండట నేఁబలికిన భవహర మగునట, పలికెద వేఱొండుగాథ పలుకగ నేలా?

క. 'శ్రీకంఠచాఖండన, పాకారి ప్రముఖవినుతభండన విలసత్కాకుత్స్థంవంశ మండన, రాకేందు యశోవిశాల రామనృపాలా!"

"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం జెందరే?వా రేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపైబేరైనం గలదే శిబిప్రముఖులున్ ప్రీతి న్యశస్కాములైయీరే కోర్కుల వారలన్ మజచిరే యిక్కాలమున్ భార్గవా!"

"మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము! దేహి పుట్టుచుంజచ్చుచునుండఁ జూచెదరు చావకమానెడువారిభంగి నీచచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక దాఁగవచ్చునే?యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణకోటికిన్."

“లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్ఠావుల్లప్పెను మూర్చవచ్చె తనువ్ డస్సెన్ శ్రమంబయ్యెడినీవేతప్ప నితః పరం బెఱుఁగ మన్నింపందగుం దీనునిన్రావే యీశ్వర! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!"

క. కలడందురు దీనులయెడఁగలడందురు పరమయోగి గణములపాలన్గలడందు రన్నిదిశలనుగలడుకలం డనెడివాడు కలఁడో లేడో

క. నీపాదకమల సేవయు, నీపాదార్చకులతోడి నెమ్మి నితాంతశ్రీపాదకమలసేవయు దాసమందార నాకు దయసేయఁగదే.

సీ. వీధి పురాణంపు వేదికపై నీవు,పారాయణపు బీటపైని నీవు,దృశ్యప్రబంధంపుఁ దెరలసందున నీవు,మృతివార్త శ్రుతిఁ బడ్డ యెడను నీవు,గొల్లసుద్దుల లేకు డొల్లలలందున నీవు,యకగానపు జిందులందు నీవు,చండాలుబుజముపై మొండితంబుర నీవు,తొలుబొమ్మలసంత గోల నీవు,

పడుకగదుల గోడల నీవు, భక్తహృదయరసనలను నీవు, యాయావరతను నీవు,సృష్టినీమయయేూ? నీవు సృష్టిమయమొ?యెట్టయిననేమి? రామ! రక్షింపుమయ్య!

Comments

Loading comments…