ప్రకృతిశక్తులు
సాక్షి మూడవ సంపుటం
గీ. మొద్దువటుఁ డొకసతి లేక మొత్తుకొనఁగ,వృద్దునకు నల్వు రిల్లాండ్రు, వేశ్య కొసరు,నీతిమంతుఁడు గతిలేక నింద నొందబానిసీనికి ద్రోహికి బ్రహ్మరథముఇచ్చువానినె తిట్టుదు రెల్లవారుపిసినివానికె పెద్దపెద్ద బిరుదచయముపాంసులాత్మకు ఫలముపైఁ బ్రబలఫలముఏకపుత్ర మరణము సుశ్లోకునకునుసత్యవాగ్దీ క్షునకుఁ జెరసాల త్రోపుఅనృతవాదికిఁ దూగుటుయ్యాలకైపుమెత్తనగువానికంటికిఁ జిత్తవానమఱి కసాయిమీసాలకు మల్లెనూనెసృష్టిలో నిట్టిమార్మెలి యిట్టివెలితిగలుగ నేలొకొ చెప్పఁగాఁ గలఁ డెవండు?
సీ. చక్రవర్తులు సర్వసంపదలబాసిపరితపించుచు ఘోరవనములందొ?తత్పాదుకలనైనఁ దలమోపఁ దగనట్టియధము లీశులయి రాజ్యంబులందొ?మగనాండ్రహ్పదయముల్ మండిపోనేడ్చుచునసురుల కారాగృహంబులందొ?సుతులం గాటికిఁ బంపి పతులగొంతులఁగోయధూర్తలు బంగారుతొట్టె లందొ?
గీ. శమదమాఢ్యులౌమునులు రాక్షసులనోళులంది? పరమచండాలురౌ నసురహతకులామునులమగువలప్రక్క లందొ? యకట!దైవమా! మంచిచెడ్డలు లేవె నీకు?
సీ. సత్యసంధులు కష్టచయముల మునుఁగుటో?దొంగ లుప్పొంగుచుఁ ద్రుల్టిపడుటో?తలగొరిగించుకో దాతకు లేకుంటా?కృపణుడు లక్ష్మీసమృద్ది గనుబొ?విద్వాంను లుదరముల్ వెన్నంటి యేడ్చుటో?మూడులపొట్టలు పాణక లగుటో?కాసు గల్గినవానిబాస వేదం బౌటా?బువ్వలేనతనివి బూతు లగుటో?
గీ. త్వత్పదారాధకులు ముష్టిదాసరయ్యలగుటో? నాస్తికుల్ వారల మొగములందునుమియుటయొ! యేమి యిది కన్ను లున్నవె? మతియున్నదే? యుంటివే? చేయుచున్న దిదియె?
Comments
Loading comments…