భవభూతి
సాక్షి మూడవ సంపుటం
సీ. బండిఆయన నెద్దుబండియా పోతులబండియా యనెడు మొద్దుండవచ్చుగుక్కగొడు గనగ గుడ్డదో దాటాకుదోయని యడుగు మొద్దుండవచ్చుదాండ్రబెత్తనం దాటితాండ్రయో, మామిడిదోయని యడుగు మొద్దుండవచ్చుజాముండి యనగ ముసలిముండ యొుబాలరండయొు యడుగు మొద్దుండవచ్చు
తే, నుర్వి నెటువంటి మొద్దయిన నుండుగానియాధునికకవి కవితయం దన్ని దోష ఉములె యటంచుఁ బల్కగలేని మొద్దు లేడుసర్వదేశంబులను సర్వజాతులందు.
సీ. తలను గొట్టుకొని మెదడు జింపుకొని యొక్కగద్యమో పద్యమో కవిత యల్లిజనులకు వినిపింపఁ గనుబొమ చిట్టించునొకఁ డడ్డముగ మొగ మూఁపు నొకఁడు "ఒక్కఁడోష్టము విఱుచు నొకఁడు వంకగ వవ్వునొక్కడు పూర్వగవుల సుబ్బిపొగడుఎట్టున్నదండి యం చేడ్వగ సకిలించిఊ యున్నదని సాగఁదీయు నొకఁడు
ఆ.వె. వ్రాయుచుండ బాధ వ్రాయుపిదప దిట్టు,కడుపుమంటు మిగులు గలుగు కవిగబుట్టుకంటె ఘోరజన్మారుకఠినఫలము లేదుగాదె యకట!
శ్లో. యేనామ కేచిదిహనః ప్రథయంత్యవజ్ఞంజానంతు తే కిమపి తాంప్రతి నైషయత్న:ఉత్పత్స్యతే మమ తు కోపి సమానధర్మఃకాలో హ్యయం నిరవధిర్విపులాచ పృథ్వీ.
Comments
Loading comments…