వీరశైవులు

సాక్షి మూడవ సంపుటం

వీరవ్రతై కనిష్ణారమణుండు-సారశివాచారపారాయణుండులోకైకపూజ్యఁ డలో కానుసారి-ఏకాంతభక్తి మహిష్టమండనుఁడునఘటితనాద విద్యాపండితుండునఘవినాశనకారణావతారుండువిదితకారుణ్యసముదితానురాగహృదయుఁడు సర్వజీవదయాపరుండు

"శాశ్వతసర్వజ్ఞ-శశ్వద్గుణాంక-విశ్వేశ శ్రీగురవే నమో యనుచుసద్వఃప్రసన్నానవద్య వేదాంత-వేద్యాత్మ శ్రీగురవే నమో యనుచు

దత్తకైవల్యయుదాత్త సద్భక్తవిత్తేశ శ్రీగురవే నమో యనుచునమితపరంజ్యోతి రాకారదివ్యవిమలాంగ శ్రీగురవే నమో యనుచుస్థిరతరసృష్టిస్థితిలయప్రపంచవిరహిత శ్రీగురవే నమో యనుచుసకలనిష్కళచరాచర రూపవిగతవికృతాంగ శ్రీగురవే నమో యనుచునాద్యంతరహిత నిత్యామలతేజవిద్యాత్మ శ్రీగురవే నమో యనుచునధ్వషట్కాతీత యవిపాతకౌఘవిధ్వంస శ్రీగురవే నమో యనుచుమోక్షార్థిరక్షణ దక్షకటాకవీక్షణ శ్రీగురవే నమో యనుచునజ్ఞానతిమిరసంహారార్థదత్తవిజ్ఞాన శ్రీగురవే నమో యనుచుధన్యాత్మశిష్యమస్తకకృపాహస్తవిన్యాస శ్రీగురవే నమో యనుచునఘహరణార్ధ శిష్యజనోపభుక్తవిఘసన శ్రీగురవే నమో యనుచునశ్రాంతభక్తజనాత్మాంబుజాతవిశ్రాంత శ్రీగురవే నమో యనుచుననఘగురు ప్రసాదామృతహృదయవినివాస శ్రీగురవే నమో యనుచు

అప్రమాణవార్త యానోట నానోటనిట్టె యిట్టె ప్రాఁకి యెల్లయెడలవ్యాప్త మగునుగాదె వరుగైన ప్రాఁతతాటాకుటింటిమీఁద యగ్గివలెనె.

గాలి చొరనట్టి చోటులు గలవు కానియతనిచెవిని జేరనిరహస్యములు లేవుఅత్తకోడండ్ర దెప్పలు నాలుమగలగుసగుసలు నాఁడుబిడ్డల రొసరొసలునుతోడికోడండ్ర వెడవెడకోడిగములుమొుదలుగా నన్ని సంచారములను గల్గుఛిద్రతతి యిట్టె యాతని చెవిని జేరు.దాసి గదిలోన గాయకుఁ దన్నె ననుచుగురువుగారింటిలోఁ గల్లుకుండ యనుచుఁజెవికొఱుకువారు తార్పుడు సేయువారుకొంటెకూఁతలవారును గోడెగాండ్రుబానిసలు రాజమెప్పకై పలుకుచుండ్రుమొులకతళుకులు బెళుకులు తులకరించుకలికిపలుకులకులుకుల కవితకంటెనధికముదమున వినుచుందు రవనిపతులు.

సజ్జనశృంగార సత్యగంభీరయిజ్జగధార యీశ్వరాకారమంగళగుణధామ మహిమాభిరామలింగాభిరూప యభంగ ప్రతాపనిర్జితాహంకార నిఖిలోపకారదుర్జనదూర విధూతసంసారకారుణ్యపాత్ర యకల్మషగాత్రవీరవ్రతాచార్య విపరీతశార్యయంచితాగణ్య నిరంతరపుణ్యసంచితసుఖీలీల శరణవిలోలసన్నుతకీర్తి సాక్షాద్రుద్రమూర్తికిన్నర బ్రహ్మయ్య కృప సేయుమయ్య.

Comments

Loading comments…