సుఖము, దుఃఖము
సాక్షి మూడవ సంపుటం
జాలిగుండెవాఁడు జను లేమియందురొయనుచు భీతిఁజెందు నట్టివాఁడుబిడియమునకు గొంకి వెనుకాడువాడునుధరణిలోన నెపుడు దక్కలేరు
పరుగులిడుచుండం గ్రిందనుబడియుం గెరలిమొండిత్రోపుగ ముందుకుఁ బోవువాఁడుతన్నొకడు గొట్టం బదుగురు దాను మంచిచెట్టఁగాంచ కెవ్వరినైనఁ గొట్టువాఁడునేడ్చుచునె పెండ్లివిం దారగించువాఁడుస్వార్థమే పరమార్ధమై యలరువాఁడుబ్రదుకఁదగినవాఁ డీప్రపంచమందుసౌఖ్యవజ్జీవు లిద్దతే జగతియందుమొండియొకఁడు వేదాంతియొకండుసుమ్మునడిమివారల బ్రదుకు వినాశకరముగడియగడియకు మృతికంటె ఘనతరంబు.
సీ. సత్యసంధులు కష్టచయముల మున్లుటోదొంగ లుప్పొంగుచుఁ ద్రుళ్ళిపడుటొతలగొఱగించు కోదాతకు లేకుంటోకృపణుఁడు లక్ష్మీసమృద్ది గనుబొవిద్వాంసు లుదరముల్ వెన్నంటి యేడ్చుటోమూడులపొట్టలు పొణక లగుటొ
గీ. త్వత్పదారాధకులు ముష్టిదాసరయ్యలగుట్! నాస్తికుల్ వారల మొగములందునుమియుటయొ! యేమి యిది! కన్నులున్నవె! మతియున్నదే యుంటివే చేయుచున్న దిదియె!
పాటవినరా సదానందయోగీ! నీవు విననేర్తువని విన్నవింతు బైరాగీl వినరాllధనము లేకున్న దుఃఖమురా-చాలధనము కల్గినదాని దాఁపదుఃఖమురాll వినరాllఆలు లేకున్న దుఃఖమురా-చాల నాండ్రు గల్గినవారి నడప దుఃఖమురాil వినరాllబిడ్డ లేకున్న దుఃఖమురా-చాల బిడ్డలు గల్గిన పెంచ దుఃఖమురాll వినరాll
గీ. ఉభయదిశల గష్ట ముండు సౌఖ్యమునకునదియె నడుమ జేరి యగును సుఖముబాధ సుఖము నొకటి వస్తతత్త్వముననుగతినిబట్టి భేదకలన కలిగె.
అమిత మనుచు నభావంబు ననుచు రెండుకష్టదశ లెప్డ సుఖము ప్రక్కలనె యుండునడుమను సుఖార్జి యూగక నడవవలయుఁదాటిబద్దపై నేటిని దాటినట్లు.
Comments
Loading comments…