గీతాంజలి కావ్యం

Translated from English by ఆదిపూడి సోమనాథరావు (Adipudi Somanatha Rao)

గీతాంజలి

పాడు మనునాజ్ఞ నీచేత ♦ బడసినపుడుగర్వభరమున నెద నిచ్చు ♦ కరణి దోచు;నంత నాదృష్టి నీముఖ ♦ మందు బఱుపగనుల నానందపూరముల్ ♦ గ్రమ్మి పాఱుజీవితములోనిద్వంద్వముల్ ♦ చెఱగి కరగియొక్క రమ్యశుభాకృతి ♦ నొంది యొప్పు;బక్షములు విచ్చు బూజ్యభా ♦ వంబు పొదలియబ్ది దాటంగ నెగయు వి ♦ హంగమట్లునదుగానంబు నీకు నా ♦ నంద మంచుదేవ ! నీసన్నిధిని నేను ♦ గేవలంబుగాయకుండ గాని వేఱేమి ♦ గానటంచుదేటముగ మదిలోపల ♦దెలియవచ్చు,అల రెడుమదీయగీతస ♦ క్షాంచలముననందగా గాని నీదుపా ♦ దాబ్ద మంటిగానరస మాని మది చొక్కుం ♦ గాంచియుంటవిభుడ వగునిన్ను సఖు డని ♦ పిలుతు మఱచి

3

ఎట్టిదో నాధ ! నీగాన ♦ మే నెఱుంగ ;నిరత మాలింతు నాశ్చర్య ♦ భరితుడగుచు;

నీదుగానంబు వెలిగించు ♦ నిఖిలజగము;నీదుగానావిలం బాడు ♦ నింగి జెలగ ;నీదుగానాచ్చవాహిని ♦ నిఖిలశైలవస్రముల వ్రచ్చి నఱచు ని ♦ ర్వక్రగతిని.పాడనీతోడ నామది ♦ వలచు గానితగినకంఠస్వరము లేమి ♦ దల్లడిల్లు;గడగి భాషింపగానంబు ♦ గాదు గాన"నతులభవదీయగానజా ♦ లాంతరముననాదుమది జెఱగొంటి వొ ♦ నాధ ?" యంచునఱతు నెల్గెత్తి నేను ని ♦ రాశం జెంది.

4

నాదుప్రాణంబునకును బ్రా ♦ ణంబు నైననీవు సర్వాంగ మంట న ♦ జీవుడంచుదెలిసి, నిర్మలముగ నాదు ♦ దేహముంపజతన మొనరింతు శక్తి వం ♦ చనము లెక.బుద్దిదీపంబు మన్మనం ♦ బున నమర్చునట్టి సత్యస్వరూపి డీ ♦ వంచు నెఱింగితలపులోనుండి యనృతముల్ ♦ తొలగ జేయజతన మొనరించు శక్తివం ♦ చనములేక.హృదయకుహరాంతరంబుస ♦ ర్వేశ ! నీకు

బీఠిక నెఱింగిప్రేమపు ♦ ష్పింప జేసినెఱయు హృద్దోషమ్ల నెల్లం ♦ దఱిమినైనదతివ మొంరింతుశక్తివం ♦ చనము లేక,కార్య మొనరించుటకునయి ♦ కలుగుబలముపొడము నీశక్తిచే నని ♦ బుద్ధి దెలిసిప్రకటపఱుపంగ నిన్ను నా ♦ పనులయందుజతనమొనరింతు శక్తివం ♦ చనము లేక

5

ఒక్కనిముసంబు నీప్రక్క ♦ నుండుచనువుగోరితిని దయఛేయుము ♦ దారమతిని;దిన్నగ నొనర్తు నావల ♦ నున్నపనులసుందరం బగునీమోము ♦ జూడనేనిమదికి శాంతియు విశ్రాంతి ♦ మాయమగును;నాదుశ్రమ మెల్ల నింతయు ♦ మోద మిడకసారమే లేనిబహుకష్ట ♦ వార్ధిలోనితుదిమొద్లు లేనికృషింబోలె ♦ దోచుచుండు.వెచ్చనూర్పుచు గొణుగుచు ♦ వచ్చి నిలిచెజాలకముకడ నేడు వే ♦ సంగిప్రొడ ;రమ్యపుష్పవనాస్థాన ♦ రంగమందుగాన సభలను గొల్చుచు ♦ గ్రాలెనళులు

శాంతితో పొంగు నిట్టివి ♦ శ్రాంతివేళనీముఖాముఖం గూర్చుండి ♦ నిశ్చలముగబ్రాన మంకితంగ నిడు ♦ పాట బాడనెంతయును యోగ్యసమయమై ♦ యొసగు గాదె?

6

ఈసుమము జాగు సేయక ♦ కోసి కొమ్ముఅలసించిన దుమ్ములో ♦ రాలు జుమ్మునెలపు దీనికి నీదండ ♦ గలుగదేనిత్వత్కరస్పర్శబాధచే ♦ సత్కరించికోసి కొ ; మ్మాలసింపక ♦ కోసి మొమ్ము.బాగుగా నాకు మెలకువ ♦ వచ్చులోనబ్రొద్దువోవునొ ముగియునో ♦ పూజవేళయంచు భయపడుచుంటి; నా ♦ కభయ మిచ్చికోసి కొ ; మ్మాలసింపక ♦ కోసి కొమ్ము.అంతగా రంగు లేకున్న ♦ నల్పముగనుబరిమళం బున్న నిప్పువ్వు ♦ ప్రభువతంసస్వీకరింపుము భవదీయ ♦ సేవకొఱకు ;దప్పి పోకుండ దరుణంబు ♦ దయ దలిర్పగోసి కొ ; మ్మాలసింపక ♦ కోసి కొమ్ము.

నాదుగానాంగన దొఱంగె ♦ నగల నెల్ల ;వస్త్రభూషణగర్వ మ ♦ ప్పడతి పడదుభూషలం గల్గునన్యోన్య ♦ మునకు హానినాకు నీ కవి యడ్డమై ♦ నడుమ నిలుచురణితమున ముద్గునీగూఢ ♦ రమ్యవాణి.నీవు తల యెత్తి చూచిన ♦ నిలువలెకనాదుక విదంభము నశించు ♦ నానచేతం ;గవులకెల్లను నాధుడై ♦ క్రాలుదేవ!నీదుపాదాబ్జములకడ ♦ నిలిచినాడ ;నీవు రమ్యస్వరంబుల ♦ నింపి పాడవేణు వగురీతి నాదుజీ ♦ వితము నేనుజల్పుదును గాక సరళమున్ ♦ సాధువుగను.

8

కంఠమున దారహారది ♦ కముల దాల్చియెడలిపై రాజవస్త్రంబు ♦ లొప్పుచుండుబాలు డాటలసౌఖ్యంబు ♦ బడయ గలడె?ఆడ గడగినయపు డెల్ల ♦ నతనియడుపులడ్డముగ వచ్చి యాతని ♦ నాపుచుండు ;

జిన్గునో మాయునో యను ♦ చింతచేతందాను జనులకు దూరమై ♦ తలంగు చుండు;వేడ్క దిరుగాడుటకు గూడ ♦ నెఱచు చుండు,సౌఖ్య మొసగెడుభూమిర ♦ జంబునుండి.జనసమూహము లనుగొప్ప ♦ నంతలోనవేడ్క దిరుగాడుగా గల్గు ♦ స్వేచ్చనుండి,దూరముగనుంచి తళతళ ♦ ద్యుతుల నీనుబాలురకు నీవు పెట్టిన ♦ బంధనములునిష్పలంబులు ; నూతరో ! ♦ నిష్పలములు.

9

ఓరి మూర్కుడ ! నీదుబా ♦ హువులమీదనిన్ను గొంపోవ నీవు య ♦ త్నించినావె?నీదువాకిట బిచ్చంబు ♦ నీవె యెత్తవచ్చినాడవె? భిక్షుకా! ♦ వచ్చినావె?సకలభారంబు వహియింప ♦ జాలినట్టిప్రభుకరమ్ముల బెట్టునీ ♦ భారమెల్ల.దృష్టి నెన్కకు ద్రిప్పి చిం ♦ తిల్ల బోకు,తాను ముట్టినదీపమున్ ♦ దత్కషణముననూది యార్పును; నీయాశ ♦ యుర్విలోనమలిన మది ; దానిచేతుల ♦ వలన నీవు

గొనకు మెనరమైనను ♦ గొనకు కొనకు,శుద్ధప్రేమాస్పదుండైన ♦ శుభుం డొసంగుదానినే స్వీకరింపుము ♦ ధన్యు డగుము.

10

బీద సాదల పతితుల ♦ విడుదులందెనీదుపాదారవిందముల్ ♦ నిలిచి యుండు;గాన నచ్చట నెప్పుడుం ♦గ్రాలుచుండునీదుపదపీఠ మెంతయు ♦ నిశ్చలముగ.బీద సాదల పతితుల ♦ విడుదులందునిలిచి యుండెను నీపాద ♦ నీరజములునీకు మ్రొక్కంగ భక్తి య ♦ త్నించునాకునందరానంతలోతున ♦ నలరు దేవ!బీద సాదల పతితుల ♦ వెంటవెంటగంతబొంతల దాలిచి ♦ కరుణతోడనరుగుచుండెడునట్టి యో ♦ పరమపురుష !గరున మెపుడైన్మ నీకడ ♦ కరుగ గలదె?నఖులు లేనట్టివారికి ♦ సఖుడ నగుచుబీద సాదల పతితుల ♦ వెంటవెంటనుండి ప్రేమాస్వరూపివై ♦ యొప్పునిన్నుజేరగారాద్ నాధ ! నా ♦ చిత్త మెపుడు.

జపతపంబులు గానముల్ ♦ చాలు జాలు;ననితలుపులు మూసి యీ ♦ యాలయమునంజిమ్మచీకటిగొందిలో ♦ జెరి యిట్టులొంటి నెవ్వరిని బూజించు ♦ చుంటి విపుడు?తెఱచి కన్నుల జూడుము ♦ దేవు డెదుటంగానవచ్చునొ లేదొ నీ ♦ కన్నులకును.గట్టియాభూమి దున్నెడు ♦ కాపువాడుకూలికై త్రోవ గంకర ♦ గొట్టువాడుకష్టపడుచోట నాతడు ♦ గలడు; చూడు!దుమ్ము తనవస్త్రములమీద ♦ గ్రమ్ముచుండనెండవానలలో వారి ♦ దండ నుండు;నతనివలె శుభ్రవస్త్రంబు ♦ నవల బెట్టిదుమ్ములోనికి నీవును ♦ రమ్ము! రమ్ము.మోక్షమా? చూడు మద్ది యే ♦ మూల గలదొనాధుడునుగూఛ సృష్టిబం ♦ ధమ్మం దానుబూని యున్నాడు సంతోష ♦ పూర్వకముగ;విడక మ్నలోన బద్దుడై ♦ వెలసినాడు.ధూపదీపాదులను బెట్టి ♦దూరమందువెలుపలికి రమ్ము ధ్యానంబు ♦ వీది నీవు;

నలిగినీవస్త్రములు మాయ ♦ నష్టమేమి?చెమట నుదుటను బట్టంగ ♦ శ్రమ యొనర్చిదర్శనముజేసి యాతని ♦ దండ నిలుము,

12

ఆచరింపగ నే బూని ♦ నట్టియాత్రచాల దూరమ్ము; కాలమ్ము ♦ చాల బట్టు ;దొలివెలుగు దేరిపై నెక్కి ♦ త్రోవ దీసియుడుగ్రామ్ములలో జాడ ♦ లునిచియునిచిచవితి సకలజగంబు లన్ ♦ పనుల బట్టిఇట్లు నిన్ను సమీపింప ♦ నిచ్చుత్రోవయెంతయును దీర్ఘతరమయి ♦ యొసగుచుండు,నాధుతమశాంతజీవన ♦ సాధనంబుదుర్గమంబు దురూహ్యంబు ♦ దుస్సహంబు,యాత్రికుడు తనవాకిటి ♦ కరుగులోనబ్రతిపరకనాటమును దట్ట ♦ వలసి నట్టుబంత రాంతరమందిర ♦ మంతనుందునరుగ వెలిజగములనెల్లం ♦ దిరుగ వలయు,కనుల నే మూసి "ఇదిగో నీ" ♦ ననేడులోననెంతయోదూరముగ నక్షు ♦ లేగి వచ్చె,"హా! యెచట నుంటి వీ" వను ♦ నట్టిప్రశ్న

యశ్రుతటిసీసహస్ర మై ♦ యట్టె కరంగి"ఉంటి నే నిద" యనియడు ♦ నుత్తరంపువరదయై ముంచె జగముల ♦ బ్రళయ మట్లు

12

పాడగ్ఫా వచ్చినట్టినా ♦ పాట నేనునేటివఱకును బాడంగ ♦ నేరనైతి;దంతు లెగదిగద్రిప్పుచు ♦ దంబురకునులలిని శ్రుతి గూర్చుటందె కా ♦ లంబు గడచె;దరుణ మింకను రాలేదు ♦ తధ్య మరయ;బొందికగ శబ్ధములకూర్పు ♦ పొసగ లేదు;ఆశమాత్రము బాధించు ♦ నాత్మయందు;గాలి నిట్టూర్పువిడుచుట ♦ గలిగె గానివేడ్కగా విరిమాత్రము ♦ నిచ్చలెదు;చేరి యతనిముకాబ్జ మీ ♦ క్షింపలేదు;లీల దత్కంకవాద మా ♦ లింపలేదు;గృహమునకు ముందు వీధిలో ♦ నేగునతనికాల్పడినిమాత్ర మెవివ ♦ గంటి జెవిని;అతడు గూర్చుండుటకు దగు ♦ నాసనంబుపఱచుటందె గతించె నా ♦ బ్రతు కిదెల్ల.గృహములో దీప మింక నె ♦ ల్గింపలేదు;

ఎట్లురమ్మంచు బిలుతు బ్రా ♦ ణేశు నిటకు;గాని యాతని నొకనాడు ♦ గలిసికొందుననెడు పేరాసతో నేను ♦ మనుచు నుంటిగలుగ లే దింక నే వాని ♦ గలిసికొనుట.

14

నాదుకోర్కులు వేనవేల్ ♦ నాప్రలాపమెంతయో జాలి గొల్పెడు ♦ నెదని కయిన;గాని కాపాడితిని నన్ను ♦ గఠినమతినిబ్రార్ధనల నెల్ల నీవు ది ♦ రస్కరించియిట్టిప్రబలానుకంపంబు ♦ నెన్నిమార్లొనాదుజీవితమున జూపి ♦ నావు నీవు.అధిప! యత్యాశచే గల్గు ♦ నార్తినుండినన్ను గాపాడి పరమేశ ♦ నాడునాటనడుగకయె నాకు నొసంగిన ♦ యతులసరళవరము లగు మాననమునకు ♦ బ్రాణమునకుదేహమున కాకసమునకు ♦ దేజమునకునెంతయును యోగ్యునిగ జేసి ♦ యెసగుదీవు.నాకు బరమావధిని గాన ♦ నాధ ! నిన్నుగరము మెలకువ్ నొక్క మా ♦ ఱరయుచుందు;మెలకువను దక్కి యొకమాఱు ♦ మొలగుచుందు

గాని నీవేలొకో దాగి ♦ కానరావు.తఱచుగా నాదుకోర్కెల ♦ దలగద్రోసిచపలదుర్బలవాంచచే ♦ సంభవించునాపదలనుండి రక్షించి ♦ యధిప! నన్నుబూర్ణవిశ్వాసపాత్రుగా ♦ బొదలజేసినెమ్మితో నన్ను గరము మ ♦ న్నించినావు.

15

నిన్గుఱించిన గీతముల్ ♦ నేర్చి పాడనిచట నున్నాడ జగముల ♦ నేలుఱేడ!భవ్యతర మగునీదివ్య ♦ భవనమందుమూల నొకచోటు నాకును ♦ బొలుచుచుండు.ఇజ్జగంబున నాకు బ ♦ నేమి లేదు,విఫలమై యుండునాదుజీ ♦ వితము గాననిర్విషయగీతములె పాడ ♦ నేర్చియుండు,మౌనముగ నిన్ను బరమేశ! మధ్యరాత్రియనెడునయ్యంధకారాల ♦ యంబునందుబూజ సల్పుటకయి గంట ♦ మ్రోగునపుడునీయెదుట నిల్చి పాడగా ♦ నెమ్మితోడనాకు నాజ్ఞనొసంగు మ ♦ నాధనాధ!భాసురంబుగ నొప్పుప్ర ♦ భాతమందు

నంసమగుపైడివీణియ ♦ యందు శ్రుతినిహాయిగా గూర్చినప్పుడు ♦ హర్షముననునెదుసన్నిధి నొసగి మ ♦న్నింపుమయ్య!

16

అమలసౌభాగ్య జగదుత్స ♦ వమున కేనుబిలువ్బడితిని బరమసం ♦ ప్రీతితోడ;ధన్య మయ్యెను నాజీవి ♦ తమ్ము నేడు;కనులపండువుగా నెల్ల ♦ గంటి గంటి;విందుగా వీనులకు నెల్ల ♦ వింటి వింటి;నొప్పగా నాదు వాద్యమీ ♦ యుత్సవముననెలమి వాయించుపని నాకు ♦ నీయబడియె;శక్తివంచనలేక నే ♦ సలుపగంటి;నెమ్మితో లోపలికి బోయి ♦ నిన్ను జూచి"నెమ్మదిగ భక్తితో వంద ♦ నమ్ము సలుపుసమయమా" యని యడిగెద ♦ స్వామి నిపుడు

17

కడకు నాతనికరముల ♦బడగ నెంచివేచియున్నడ బూద్యమౌ ♦ ప్రేమకొఱఖూనేన్ జేసిన జాగెల్ల ♦ దానికొఱకె

చేయవలసినపనులను ♦ జేయకుండుతప్పిదము జేసి యుంటయు ♦ దానికొఱకెకట్తుదిట్టములను నన్ను ♦ గట్టివేయవచ్చుచున్నారు వారల ♦ వశముగానువేచియున్నాడ బూజ్యమౌ ♦ ప్రేమకొఱకుగడకు నాతనికరముల ♦ బడగ నెంచి.మందుడా యని నిందింత్రు ♦ మహిని బ్రజలుజనులవాక్యంబు నిజము ని ♦ స్సంశయంబు;సంతబెరము లన్నియు ♦ శాంతమొందెబనులతొందర గలవారి ♦ పనులు ముగిసెనిలిచినన్ బోక నే నున్న ♦ నలిగినారుపిలిచి మరలిన వారలు ♦ ప్రీతి దొఱగి;కడకు నాతనికరముల ♦ బడగ నెంచివేచియున్నాడ బూజ్యమౌ ♦ ప్రేమకొఱకు

18

కమ్ముకొని పయిబయిని మే ♦ ఘములు వచ్చెగడలనెల్లను జిమ్మచీ ♦ కటుల గ్రమ్మెనొంటిగా బైటవాకిట ♦ నుంతువేలయొంటిగా బైట బ్రేమమా ♦ యంతు వేల?బనులతొందర గలపట్ట ♦ పగటియందు

బ్రజలతో గూడి చక్కగా ♦ బాటువడితిగాని యీయొంటిగాఢాంధ ♦ కారవేళయందు నాకున్న దెల్ల నీ ♦ యాశ యొకటె.వదనకమలము జూపి న ♦ మ్ముదము నిడకప్రేమమా నీవు నన్ వెలి ♦ వేసితేనిదీర్ఘమైనట్టి యీవర్ష ♦ దినము నెట్లుగడపగల్గుదునో నాకు ♦ గానరాదు.దూరముగ్ నాకసంబున ♦ దోచుదమమువలదె నాదృష్టి నంతను ♦ బొదుపఱతు;శాంతి మంతయు లేక సం ♦ లత నొందువాతమున బడి సామది ♦ నంత దిరుగు.

19

ఈవు మాట్లాడలేనినా ♦ హృదయమందుమౌనమును జక్కగా నింపి ♦ దాని నోర్తుద్లను నోపిక వంచి చు ♦ క్కలనుగూడిజాగరంబండు రాతిరి ♦ చంద మందియెంతయును నేచియుండుదు ♦ శాంతముగను;వచ్చు దప్పదు నిజముప్ర ♦ భాతవేళచిమ్మచీకటి యంతయు ♦ జెదరిపోవు,ఆకసము జీల్చుకొనుచునీ ♦ యమలవాణి

స్వర్ణతటినీసహస్రంబు ♦ పగిది డిగ్గు;నంత నొక్కొక్కనాగూటి ♦ యందు నీదుకలికిపలుకులు గీతప ♦క్షముల దూల్చు;నీవిమ్లమంజుగీతముల్ ♦ నావనమ్ముబందు బుష్పాకృతుల దాల్చి ♦ యలరజొచ్చు.

20

అంబుజతము వికసించి ♦ నట్టివేళనకట! నామది యెచటికో ♦ యరగియుండెగాన దెలియంగ నైతిని ♦ దాని నేనుపుష్ప మొకటియు లేకుండె ♦ బుట్టయందునైన నప్పువ్వుపై దృష్టి ♦ యరుగదయ్యె;గాని న న్వెత పలుమాఱు ♦ కలపజొచ్చె;నంత మేల్కాంచి కాంచితి ♦ వింతయైనపరిమళముజూడ దక్షిణ ♦ వాతమందు;నాపగాగాని యపరిమి ♦ తాశ గొలిపిమదిని వేధించునస్పరి ♦ నుండుగ్రీష్మఋతువు తమి బుచ్చు నూపిరి ♦ తీరి దోచె;గాని యిది యింతదగ్గఱ ♦ గ్రాలె ననియు,మఱియు నిది నాది యనియును ♦ మన్మనమునం

దద్ధయు గబీరతరమైన ♦ తలమునందుబూర్ణమాధుర్య మిది పూచి ♦ పొలిచె ననియుదెలియలేనైతి నప్పుడు ♦ తెలియనైతి.

21

ఇదగవలయును నేను నా ♦ పడవ నీట;నూరకే యెట్టులుండుట ♦ యొద్దుమీద?గటకటా! యెంతకాలంబు ♦ గడపవలయు?బూచి చిగిరింపగాజెసి ♦ పోయె మధువు:బొత్తిగా నెండిపోయిన ♦ పూలమోచివేచియున్నాడ జూచుచు ♦ వెనుకముందు;నలలఘోషంబు లెంతయు ♦ నదిక మయ్యె;జలధితీరపునీడల ♦ సందునుండియిలను బతపట బండుటా ♦ కులును రాలె.శూన్యమం దేమి చూచెదు ♦ చూడ్కి నిలిపి?అదిగో ! దూరాన నాతీర ♦ మందునుండితేలినచ్చెడుగీతితొ ♦ గాలిలోన;బొచ్చుకొని వచ్చుకమపమున్ ♦జూడలేనె?

22

శ్రావణములోని గాఢన ♦ చ్చాయలందు

రేయినిశ్శబ్ధమై యుండు ♦ రీతినుండియెల్లకావలివారల ♦ నేమఱించియడుగుపై నడుగిడుచు ర ♦ హస్యముగనుసంచరించుచు నుందువు ♦ స్వామి ! నీవు.పూర్వవాయువుతా నెంత ♦ పూన్కి తొడనఱచి పిలుచుచునుండిన ♦ సరకుగొనకనేతివేకువ మోడిచె ♦ నేత్రములను.నీలమున్ మించునిచ్చలు ♦ మేలుగాంచునాకసముమీద దట్టమై ♦ యమరె ముసుగు;గానములనద్దు నణచెను ♦ గాననములు;ప్రతిగృహకవాటమును మూయ ♦బడెన్; గానినిర్జనం బైనవీధిలో ♦ నీ వొకడవెపాంధ ! తిరుగుచునున్నావు ♦ భయములెక,ఓమదీయైకసన్మిత్ర ! ♦ యోమదీయప్రియతమప్రాణనాధ ! నా ♦ గృహమునందుదెఱవబడె నన్నితలుపులు ♦ దేవ ! నీవువచ్చి స్వప్నంబు కైవడి ♦ వలదు చనగ.

23

ఈ మాహావర్షరాత్రిలో ♦ నెలమితోడబ్రేమ జూపెడుయాత్రకై ♦ వెడలినావె?

యాశలెల్లను భంగ మై ♦ నట్టిదానివలెను గగనంబు మూల్గు నో ♦ ప్రాణమిత్ర!నిద్రా వాచ్చుట యెక్కడ! ♦ నేటిరాత్రి;దీసి తలుపులు పలుమాఱు ♦ దీసి తీసిచూచినకొలంది జీకటే ♦ చూడ నయ్యె;గానబడ దేమియును ముందు ♦ గానబడదు.ఎద్ది నీమార్గ మద్భుతం ♦ బెచట నుండు?నల్లని మషీజలమ్ముల ♦ వెల్గునట్లుతనదు నేనీలవాహినీ ♦ తటమునుండితద్దయును గోపభావంబు ♦ త్రమ్మునుండియేమహాగాఢనీలాధ్వ ♦ సీమనుండివచ్చినాడవు? నాకడ ♦ వచ్చినావు.

24

నిద్రచే గప్పి భూమిని ♦ నెమ్మితోడనుండ దూలుచు నుండెడు ♦సారసంపుఱేకులను మూయుచుండు లో ♦ కైకనాధ !పగలు చనెనేమి బక్షులు ♦ పాడవేనిగాలి బడలిక చే గుంది ♦ కదలదేనినాసయినిగూడ గప్పుము ♦ సాధ ! యిపుడు

గ్రాల ముసుగుగ గాఢాంధ ♦ కారపటము,భోజనపదార్ధములు యత్ర ♦ ముగియులోనమిగిసియున్నట్తి పుట్తములు ♦ మిగుల మాసిచిచినిగి యున్నట్టి బడలిక ♦ జెందినట్టియాత్రికునిలజ్జలెముల ♦ నపసయించిత్వర్ధయారూపరాత్రి యన్ ♦ దండ యొసంగిమరల సలరంగ జేయుము ♦ విరినిబోలె

25

బడలుటన్ రాత్రి శ్రమలచే ♦ గడపకుండనాదువిశ్వాసభరము నీ ♦ మీద బెట్టిహాయిగా నిద్ర జెంది న ♦ న్నలరనిమ్మునీకటాక్షంబుచే జగ ♦ దేకనాధ !పూజ్యతర మైనభవదీయ ♦ పూజయందునల్పయత్నముతోడినా ♦ యలసినట్టియాత్మ పురికొల్పకుండ నా ♦ కాజ్ఞ నిడుమునీకటాక్షంబుచే జగ ♦ దేకనాధ !పగలు బలిడలినకనులు ప్ర ♦ భాతవేళదిరిగి సంతోషభరమునం ♦ దేజరిలంగవానిపై రాత్రి యను ♦ మూత వైతు నీవునీకటాక్షంబుచే జగ ♦ దేక నాధ !

అతడు వేంచేసి నాయొద్ద ♦ నలరుచుండె;గాని మూర్ఖత నేను మే ♦ ల్కాంచనయితి.ఇంతపాపిష్టినిద్ర నా ♦ కేల బట్టె;నెంతదౌర్భాగ్యవంతుడ ! ♦ నెంతజెడుండ?స్వామి దయచేసె రాత్రి ని ♦ శ్శబ్ధవేళ;జేతులను వీణ యెంతయు ♦ జెలగు చుండె;పరమనోహరన్మృదు ♦ ధ్వనులచేతబ్రతిరవము లీనజొచ్చెనా ♦ స్వప్నములను.ఏల నశింయించె నారాత్రు ♦ లివ్విధమున?నెవనియూపిరి నానిద్ర ♦ నెలమినంటునతనిదృష్టికి నేనిట్తు ♦ లనవరతముదప్పిపొవుట యేలోకో ♦ చెప్ప జాల.

27

దీపమా ? యేద నున్నది? ♦ దీపమేడ?దానివెలిగించు మందు నా ♦ శానలంబె?జ్వాలయే లేదు దీపంబు ♦ వలన నేమి ?హృదయమా ! నీదుగతియెల్ల ♦ నింతయేనిమృత్యువే దీనికంటెను ♦ మేలు నీకు.

నీతలుపు గష్టదేవత ♦ నిలిచి తట్టె ;స్వామి మేల్కాంచి సంకేత ♦ సదనమునకుజిమ్మచీకటి రాత్రిలో ♦ రమ్మటంచుబుచ్చుసందేశమును నీకు ♦ దెచ్చెనదిగొ !ఆకసంబున మేఘంబు ♦ లట్టె క్రమ్మియెడ తెరపిలేక ధారగా ♦ వృష్టి గురిసె;నేదియో నన్ను బురికొల్పె ♦ నెఱుగ లేను;దీనియర్ధం బదేమియో ♦ దెలియ జాలనిముసమున మించి మెఱపు నా ♦ నేత్రదృష్టిగాఢతమ మైనతమములో ♦ గాడ ద్రోసె.రాత్రి చేసెడిగానమ్ము ♦ రమ్మటంచుబిలుచు; నాదారి నామది ♦ వెదకు చుండెదీపమా? యేడ నున్నది ♦ దీప మేడ ?దానివెలిగించుమండు నా ♦ శావలంబె!ఉఱుముచున్నది; జోరని ♦ యోరుగాలివిసరికొనిపోవు చున్నది ♦ వింటి యందు;రాత్రియున్నది నల్లని ♦ ఱాతిరీతి;గడవకుండును గాక నా ♦ కాలమెల్లగాఢమైనట్టి యీయంధ ♦ కారమందె.ప్రేమ యనుదివ్వె నీదుజీ ♦ తముచేతజాగుచేయక వెల్గించి ♦ బాగుపడుము.

తెగకయున్నవి నలయురుల్ ; ♦ ద్రెంప గడంగనెంతయును నొప్పిగలుగు నా ♦హృదయమునకునేనుఇ వలచినదంతయు ♦ స్వేచ్చయొకటె;కానిసిగ్గగుచున్నది ♦ దానిగోరనాకి దెలియను నీవు ర ♦త్నాంగనివి;నే నెఱుంగుదు నిన్ను న ♦ న్మిత్రమంచు;గాని నాగదిలో నిండి ♦ క్రాలుచుండువట్టియాడంబరంబుల ♦ బారనైనహృదయ మొప్పక యున్నది ♦ యించుకైన;తొడిగె యున్నట్టిపుట్టమ్ము ♦ దుమ్ము వమ్ము.ఎంతయిష్టమ్ము లేకున్న ♦ నెలమితోడవిదువలేకుంద దానినే ♦ తొడుగు చుందు;దప్ప లొప్పులు గల నెన్నొ ♦ చెప్పజాల;దెలూ గూడని వెన్నియో ♦ గలవు చాల;నైన నామంచికై నిన్ను ♦ నడుగ వచ్చియెంతునో విన్నపం లని ♦ యెద జలింతు

29

నే నిడిననాదునామంబు ♦ లోనివాడు

గుందుచున్నాడు చింత ని ♦ గ్గొందిలోన;జుట్టు నీగోడ గట్టగా ♦ జొచ్చినాడ;బెరిగి యిది నాడునాటికి ♦ వింటినంటమన్నిజస్థితి తచ్చాయ ♦ మఱుగు వడియె.గర్వపడుచుందు నీగోడ ♦ గాంచి కాంచి;కన్న మేదియు దీనిలో ♦ గలుగకుండబొందుగా మట్టితో బూత ♦ బూయుచుందు;నింత మెలకువ బనిచేసి ♦ యంతమందుమన్నిజస్థితినే నేను ♦ మఱచిపొదు.

30

నాదుసం కేతమునకు నే ♦ మోద మొప్పనొంటిగా బైలుదేరితి ♦ నొంటిగానె;కాని చీకటిలో నాకు ♦ గాన బడకవెంతనంటెను మెల్లగా ♦ వీడెవండో.తప్పుకునుతకు నటునిటు ♦ దలగు చుందు;గాని తప్పించుకొననైతి ♦ వీనినుండిదుమ్ము రేపును వీడు దం ♦ భమ్ము లాడి;వానికేకను నాప్రతి ♦ వాక్యమందుగూర్చుచుండును దాను సం ♦ కోచపడక;నాధ ! వీ డెవ్వడో కాదు ♦ నాయహమ్ము.

అతడెంతయు సిగ్గు లే ♦ నట్టివాడు,అతనితో గూడి నీద్వార ♦ మందు జేరనాకు సిగ్గగుచుండు న ♦ నాధనాధ !

31

"బద్ధుడా నీకు నెవనిచే ♦ బంధనంబుగలిగెనో నాకు జెప్పంగ ♦ గలవె?" యనిన"బ్రభువుచే" నని బద్ధుండు ♦ పలికెనిట్లు ;"శక్తి సమపదలందు నీ ♦ జగతిలోననందఱిని మించగల నని ♦ యాత్మ నెంచియధిపునకు జెల్లవలసిన ♦ యర్ధమెల్లగూర్చి యుంచితి నాస్వంత ♦ కోశమందు;బ్రభువునకు సిద్దపఱచిన ♦ పాన్పుమీదనిద్రపోయితి బన్నుండి ♦ నిలువలేక ;కానిమేల్కొని మద్ధనా ♦ గారమందెయిట్లు బద్దుండ నైయుంట ♦ నేను గంటి.""ఇట్లు తేగనట్టిసంకిలి ♦ నెవడు నేసెబద్ధుడా! చెప్పవే" యని ప్రశ్న సేయనొసగె నాతడుమరల నీ ♦ యుత్తరంబు"ఎంతయో శ్రధ్దతొడ నీ ♦ శృంఖలంబునేనె కావించుకొంటి నే ♦ ఱెవరు గాదు;

జగము నాగెల్వగూడని ♦ శక్తి కొగ్గు;నేను నిరుపద్రవస్వేచ్చ ♦ నెగడుచుందు;నంచు రాత్రింబగళ్లు నే ♦ నగ్నికడనుగష్టపడి కాచి కఠినంబు ♦ గాగ గొట్టిచేసితిని దీని నెంతయు ♦ సిద్ధముగను;గొలుకులన్నియుదృఢముగా ♦ గూర్చ బడియెగాని చిక్కించుకొని నన్నె ♦ కరము నొక్కె."

32

ఈజగతిలోన బ్రేమించు ♦ హితులు నన్నుబట్టి బంధింతు రెంతయు ♦ భద్రముగను.స్వేచ్చ న న్నుంచునట్టినీ ♦ ప్రేమ మరయనంత కధికంబు వేరు నై ♦ యలరుచుండు.మఱతు వారిని నే నంచు ♦ వెఱచి నన్నునొక్కపుడుగూడ నొంటిగా ♦ నుండనీరు.ఎన్నిదినములు గడచిన ♦ నేమి చెపుదునొక్కమా ఱైన గనపడ ♦ కుందు నీవు.,ఎలమి నాప్రార్ధనల నిన్ను ♦ బిలువ కున్నబ్రీతితో నిన్ను హృదయన ♦ బెట్ట కున్నవేచు నీప్రేమ మెపుడు నా ♦ ప్రేమకొఱకె.

పగలు కొందఱు వచ్చి నా ♦ భవనమునకు"నిచట నొక చిన్నగది యిచ్చి ♦ తేని మేముసాయపడి దేవపూజలో ♦ స్వామి దైనవరప్రసాదంబునందు మా ♦వంతు గొందు"మంచు నొకమూల సాధువు ♦ లట్టులుండిరాత్రి చీకటిలోన బ ♦ విత్రమైనగుడి బ్రవేశించి యల్లరి ♦ గదు నొనర్చిస్వామిసన్నిధిలోనిప్ర ♦ సాద మెల్లపతిమలినఘోరభూరిదు ♦ రాకచేతనాచికొని రేమి చెప్పుదు ♦ నాచరిత్ర ?

34

"నాదుసర్వస్వమా?" యంచు ♦ నాధ ! నిన్ను;బిలువగా గల్గినాలోన ♦ మెలగుచుండునంశమే సర్వదా నిల్చి ♦ యల్రు గాత!అన్నిటను నిన్నె పొందుచు ♦ సన్నికడలనిన్నె చూచుచు నాప్రేమ ♦ నిరత మొసంగికొలుచునాలోనియంశమే ♦ నిలుచుగాత!ప్రభువ ! నిను దాప కెప్పుడు ♦ బ్రకటపఱచి

పొలుచునాలోనియంశమే ♦ నిలుచు గాత !భవద్దారేచ్చలో నను ♦ బద్ధు జేసిజీవితంబున నీకోర్కి ♦ చెల్ల జేసినీదుప్రేమానుబంధమ్ము ♦ నెగడ జేయవెలుంగు మద్బంధనాంశమే ♦ నిలుచు గాత !

35

ఉన్నతశిరంబు నిర్భయ ♦ యుతమనంబునుచితవిద్యాప్రదానమ ♦ హోదయంబుక్షుద్రకుచితగృహచ్చిద్ర ♦ కుడ్యజాతివిభజనవిహీనలోకంబు ♦ శుభకరంబుసత్యగంభీరదేశసం ♦ జనితపూతవాక్యసముదాయశోభిత ♦ వైభవంబుపూర్ణతను బొందగా నెంచి ♦ భుజము లెత్తివృద్ధి గాంచెడువివిధ ప ♦ రిశ్రమంబుసారహీనదురాచార ♦ వార మనెడునూషరక్షెత్రముల బార ♦ కుండునట్టినదమలవివేకపూరవనం ♦ చారణంబుజ్ఞానయత్నంబు లానాడు ♦ నాటి కలరుపగిది నీచేత నడువంగ ♦ బ్దు మనంబుచరుసత్యస్వతంత్రభూ ♦ స్వర్గమరయ;

జనక ! నాదేశజనులు ద ♦ త్స్వర్గమునకుమేలుకొందురు గాక ! నీ ♦ మూలకముగ

36

భావమున బాదుకొన్నట్టి ♦ పాపములనుమూలవిచ్చేదముగ గొట్టి ♦ మొదమిడుము.ప్రభువతంనమ ! యిదియ నా ♦ ప్రార్ధనమ్మ,లీల సుఖదు:ఖముల నోర్వ నా ♦ జాలునట్లుకూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.బీదసాదల నెన్నడు వీడనట్టులోర్చి గర్వాంధునకు నొగ్గ ♦ కుండునట్లుకూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.తుచ్చసంసారవిషయాళి ♦ దూలకుండమనసు ఘనమార్గమున బెట్టి ♦ మనెడునట్లుకూర్మితో దయసేయుము ♦ గొప్పజలము.స్వామి ! సంపూర్ణమైనట్టి ♦ ప్రేమతోడబలము నర్పించి నీయిచ్చ ♦ సలుపునట్లుకూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.

37

శక్తి తుద ముట్టె; నాయాత్ర ♦ సాగ దింక

మూయబడె ద్రోవ; సామగ్రి ♦ ముగిసి పోయె;గొనకు నందేని దల దాచు ♦ కొనగలసె;నంచు మదిలోన నేను ద ♦ లంచు చుంటి;గాని నీయిచ్చ కవధి నా ♦ లోన గలదె?ప్రాంతమటలు నొటిలో ♦ పల నశింపస్వాంతమందుండి నవగీత ♦ చయము వెడలు.ప్రాతపధములు దప్పిన ♦భవ్యముగనుగ్రొత్తదేశంబు వింతల ♦ గూడి తోచు.

38

"నేను వలచిన దంతయు ♦ నిన్నె నిన్నెయనెడుమాటల నాహృద ♦ యంబు నతమునిండుదమితోడ వల్లించు ♦ చుండు గాత !విడక రేయుంబవళ్లును ♦ వెంట నంటినన్ను బెడత్రోవలను బెట్టు ♦ చున్న యాశలెల్ల మిధ్యలె కాని మ ♦ రేమి గావు.రేయి చీకటిలో దాచు ♦ రీతి యందునేనువలచినదంతయు ♦ నిన్నె యనెడుమ్రోత నిస్మృతమతిలోన ♦ మ్రోగుచుండు.శాంతమునుజ్ నెంతగొట్టిన ♦ శాంతమందె

శాంతమును రోయుచందన ♦ ర్షంబులబోలెదేవ! నీప్రేమ కే నెంత ♦ దిరుగ బడిన"నేను వలచిన దంతయు ♦ నిన్నె నిన్నె"యనెడు మాటలె నాలోన ♦ నలరుచుండు.

39

చిత్త మిది గట్టిసారి శు ♦ ష్కించినపుడువరదయావృష్ఠితో గూడి ♦ తరలి రమ్ము.జీవకళ జీవితములోన ♦ జెడినయపుడువిమలగానామృతం బొల్క ♦ వెడలి రమ్ము.బాహ్యశబ్ధంబు చెవిలోన ♦ బడకయుండనెల్లకడలను దుములంబు ♦ లెచ్చినపుడుశాంతివిశ్రాంతులను గూడి ♦సౌమ్యమూర్తి !వడివడిగ నాదుమదిపయి ♦ వ్రాల రమ్ము.తుచ్చహృదయమ్ము దైన్యంబు ♦ తోడ నొక్కమూల దలవంచి కూర్చుండు ♦ కాలమందుదేవదేవేంద్ర ! తలుపులు ♦ దెఱచివైచిరమ్ము రాజ్యూభిషిక్తస ♦ మ్రాట్టుభంగి,మాయతో నాన మదికన్ను ♦ మూయునపుడునిర్మలాతులభూరిని ♦ ర్నిద్రతేజ!మెఱుము లుఱుములతో రమ్ము ♦ మేఘమట్లు.

స్వామి? శుష్కించినట్టి నా ♦ స్వాంతమందునెంతయోకాలము గతించె ♦ సృష్టిలేక.యంబరం బంబరము లేని ♦ యట్టు లుండియతిభాయానహ మైనయా ♦ కృతిని దాల్చె;నంబుదంకుమీదివలిపొర ♦ యైన లేదు.శాంతవృష్టికి నైననూ ♦ చనయె లేదు.శిష్టమోహన ! నీకు న ♦ భీష్టమేనిమృత్యుభీకరచండప్ర ♦ వృష్టి బంపమెఱపుదెబ్బలచేతను ♦ మింటి నెల్లదత్తరిలునట్లు ఛేయుము ♦ తక్షణంబు.దారుణనిరాశతోడిమ ♦ త్స్వాంతమందుదిన్నగా జేరి కాల్చునీ ♦ దీక్ష్ణమైనయుష్ణము మరల్చు మోనాధ ! యోర్వలేను.కోపమును దండ్రి! మదిలోన ♦ గొన్ననాటికంట దడిగొన్న తల్లివోల్ ♦ గ్రాలుచుండుత్వర్ధయాభ్రము బైనుండి ♦ వ్రాలనిమ్ము.

41

ఏడనిల్చితి ? వోప్రియ! ♦ నీడణాగి;

వారివెన్కను గన్నుల ♦ బడకయుండదుమ్ం గ్రమ్మునత్రోవలో ♦ ద్రోసికొనుచుజనుచున్నారు దాటినిన్ ♦ సరకు గొనక;పూజసామగ్రి ముందట ♦ బొందుపఱచివేచి బడలితి నెంతయో ♦ వేళనుండి;వచ్చిపొయెడువారు పు ♦ ష్పములయందునొక్కొటొక్కటె కొనిపోవు ♦ చుండి రిదితో!బుట్ట నట్టిది గానవచ్చె ♦ బూలు ముగిసి;కడచె బూర్వాపరాహ్ణముల్; ♦ పొడమె నంజనిద్ర కనులకు రా జొచ్చె ♦ నీడ నుంట;గృహములకు నేగువార లీ ♦ క్షించి నన్నుజేరి నవ్వుచు ముంచిరి ♦ సిగ్గులోన.బిచ్చ మెత్తెడుకన్నియ ♦ విధం దోపగొంగు మోమున గూరిచి ♦ కూరుచుంటి;"నేమిగొరెదజ్?" నని నన్ను ♦ నెవ రడిగినగన్నులన్ వాల్చి క్రిందికి ♦ మిన్న కుంటె;నీకొఱకు వేచి యున్నాను ♦ నే నటంచువచ్చుటకు మాట నీవు నా ♦ కిచ్చి తంచుజేరి యడిగినవారితో ♦ జెప్ప నగునె?తుచ్చ మగుదీని గాన్కగా ♦ దెచ్చితి ననియెట్లు తెల్పుదు నాకు సి ♦ గ్గేని గాదె?

పొంగుదును దీనికయి యంత ♦ రంగమందెగడ్డిపై గూరుచుండి యా ♦ కసము జూచినీవు దేవ ! తటాలున ♦ నింగినుండిభవ్యతరముగ దెగెడువై ♦ భవము గూర్చికలవరించుచు నుంటి ని ♦ క్కరణి నేను.ఒక్కమారు తళుక్కని ♦ లెక్కలేనిదీపకొటులు వెల్గె దే ♦ దీప్యముగను.నీరధన్వర్ణ కేతన ♦ నిచయ మెల్లనిగనిగల నీని పటపట ♦ నింగి నాడె.దేవ! నను దుమ్ములోనుండి ♦ లేవ నెత్తివేసనిని గాలి దూలుతీ ♦ వియనితానగర్వలజ్ఞాభరంబుల ♦ గడువడంకుచింపిగుడ్డల నిబ్బీద ♦ చిన్నదానిబ్రీతి నీప్రక్క గూర్చుండ ♦ బెట్టుకొనగనీవు పీఠంబు డిగ్గి వేం ♦ చేయజూడనిరుగడల దారిపొడుగున ♦ నెల్లజనులునివ్వెఱను నోరు దెఱచుచు ♦నిల్వ బడిరి.కాని యెంతయొకాలంబు ♦ గడచి పోయె;వింతవఱకును వేచిన ♦ యీ చెవులకునీరధరధాంగనినదంబు ♦ చేరి రాదు.కనుల మిఱుమిట్లు ♦ గొలిపెడి ♦ కాంతితొడి

వైభవమ్ములు కలకల ♦ స్వనము లొప్పనెన్నిమొయుత్సవము లిట్టు ♦ లేగుచుండవీనివెనుకను నీడలో ♦ మౌనముగనునిలిచి యుండెడువాడవు ♦ నీవె కావె?వ్యర్ధ మగునానతో వేచి ♦ నంత గుందియిట్లు కృశియింపవలసిన ♦ దేనె కాదె?

42

నీవు నీవును మాత్రమే ♦ యెక్కి పడవయాత్ర వెడలంగ వలయు; న ♦ య్యాత్రయందుదేశ మేనియ్హు మఱియును ♦ ద్దేశమేనినుండ దనియును జగతిలో ♦ నొక్కనికినిదెలియ గూడనియట్టి యా ♦ దేశమనియునేకునను నొక్క గుసగుస ♦ వినగ వచ్చె.సారమేలెని యమ్మహా ♦ నార్ధియందునాధ ! వడిలేక వినెడునీ ♦ నవ్వుచేతవివిధమధురస్వరములచే ♦ వింతగానుశబ్ధబంధములను వీడి ♦ సరళముగనుదరగ లట్టులు మద్గీత ♦ తతులు పొంగు,తరుణ మింకను రాలెదె ♦ తరలుటకును?నలుపాలసిన కార్యముల్ ♦ గలవె యింక ?

అదిగొ ! తీరంబుపై నంజ ♦ యావహించె;గనువెలుతు రుండగనె యా ♦ కడలిపులుగులెలము దమతముగూడుల ♦ కెగసి వచ్చె.ఎపుడు విత్తురు గొలుసుల? ♦ నెపుడు పడవసంజయందలి కడపటి ♦ చాయ వోలెగానరాకుండ రాత్రిలొ ♦ గలసి పొవు?నెవడు చెప్పంగ గలడిది ♦ యెవని కెఱుక?

43

స్వామి! నే నీకు సంసిద్ధ ♦ పడనినాడుపిలువ బడకుండ నాకును ♦ దెలియకుండనొక్క్సామాన్యుకరణి నా ♦ యుల్లమందునెమ్మదిగ జొచ్చి నాజీవి ♦ తమ్ము లోనిస్థిరముగా మది నిల్వని ♦ చినిచిన్నియెన్నియోయంశములమీద ♦ నెశ ! నీదు,"నిత్తే" మన్ ముద్ర జక్కగా ♦ నొత్తినావు.లీల దీపంబు నేను వె ♦ ల్గింప నేడుకాంతిపడి వానిమీద నీ ♦ సంతకంబుస్పష్టముగ దోచె ననియెల్ల ♦ బాల్యమందుగాంచి మఱచినసుఖముదు:ఖ ♦ గణముతోడజేరి దుమ్మున నటునిటు ♦ జెదరియుండె

శైశవంబున దుమ్ములో ♦ నలిపినట్టిక్రీడలనుగూడ నేవతో ♦ జూడ నీవు.తార లీనెడునిప్ప్రతి ♦ ధ్వనులు గూడనాటకగది నాడు నేవిన్న ♦ యడుగుపడులె.

44

విడువకుండగ వెలుతురు ♦ వెంట నంటితఱుము నీడను దేసంగి ♦ దారి బట్టివచ్చు చుండెడువర్షమున్ ♦ వాంచతోడవీధివెంబడి గూర్చుండి ♦ వేచి యిట్లుగాంచు టెంతయు మోదమ్ము ♦ నించు మదికి.కాంచి యెఱుగనియంతరి ♦ క్షములనుండిదూత లరుదెంచి శుభవార్త ♦ తోడ నాకుస్వాగత మొసంగి తమదారి ♦ జనిరి వేగ.అంతరంగము లోలోన ♦ నలర దొడగె.మధుర మగునూర్పుతో వీంచె ♦ మారుతంబుప్రొద్దు వొడిచినదాదిగా ♦ బ్రొద్దు గ్రుంకుదనుక గూర్చుందు వాకిట ♦ దలగ కుండ;నన్ను దున్నట్లుగా వచ్చు ♦ నెన్నడేనిశుభసమయ మెను దప్పక ♦ చూతు నంచునెమ్మది నెఱింగి యున్నాను ♦ నిశ్చయముగ.

ఇంతలోపల నిచట నే ♦ కాంతమందుబరమసంతొషమున బాట ♦ బాడుచుందు.గాలియునుగూడా నాశాను ♦ గంధ మందిపొలయుచున్నది యెంతయు ♦ ముదము నింఫి.

45

ఆలకించి తె నడిలేని ♦ యతనినడక?వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండుబగలు పగలును రే రేయి ♦ యుగము యుగమునిమిషనిమిషము నాతడు ♦ నిలుపకుండవచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండు.వివిధరీతుల నామనో ♦ వృత్తులందుబాట లెన్నియె నానాట ♦ బాడి యుంటి,వానిపదజాల మంతయు♦ వ్యక్తపఱచువచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చు నంచు.చారుపరిమళముల వెద ♦ జల్లి చల్లినఱలు చైత్రంబులో నన ♦ పధము వట్టివచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండుధాత్రి దమి ముంచునవ్యర్ష ♦ రాత్రులందునఱుము మేఘరధం బెక్కి ♦ తఱలివచ్చువచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండు.

చింత జిక్కినచిత్తమున్ ♦ జేరి యొతద్దియను శాంతి నిడునవి ♦ తత్సదములె.పైడిజిగివంటి సంతొష ♦ భావమునకుదశతఓళల గూర్చునవి కూడ ♦ దత్సదములె.

46

ఎంతకాలంబునుండి న ♦ న్నెలమి జేరనెడ తెగక వచ్చుచున్నావొ ♦ యెఱుగ నేను;రవికి జుక్కులకెనిని ♦ రంతరంబునిన్ను నానుండి దాపగా ♦ నెన్నదేనిశక్తి గలుగంగజాలునే ♦ స్వామి! చెపుమ.చూపు ఱేపును నెన్నియో ♦ మార్లు నాకువినబడియె నీదుకాల్సడి ♦ నినగబడియె;వచ్చి నీదూత నామది ♦ జొచ్చి నన్నుగోప్యముగ బిల్చి పోయెను ♦ గూర్మితోడ.ఏమొకోకాని నేడు నా ♦ కెపుడు లేనియతిశయం బైనయుత్సాహ ♦ మంకురించె;మించి హర్షంబు మదిని గ ♦ లంచి పాఱె;బని ముగించెడుతఱి వచ్చె ♦ ననగ దోచె.నన్నిధిని దెల్పుపరిమళ ♦ సారలవముఘ్రాణపర్వముగా సోకె ♦ గాలి గలసి.

అతనికై వేచి యుంటి ని ♦ రర్ధకముగ;రాత్రి కొనముట్టవచ్చెను ♦ రాడు రాడు;బడలి నిద్రించినపుడు నా ♦ బసకు నతడువచ్చునొ హటాత్తుగాను బ్ర ♦ భాతవేళనంచు నాచిత్త మందు భ ♦ యంబు వొడమె.దారి తెఱవుడు; తెఱువుడు ♦ తలుపు లెల్ల;నతని నాటంకపఱువకు ♦ డాప్తులార!అతనికాల్సడి నను లేవ ♦ దయ్యెనేనిలేవ యత్నింపకుడు మీరు ♦ లేపకుండు.కలకలంకుసేయుపక్షుల ♦ వలన గానిసుప్రభాతోత్సవంబున ♦ జూఱలాడుగాలిచే గాని మేల్కొన ♦ గాదు నాకు.నాధు డొకవేళ నున్నదు ♦ న్నట్లు వచ్చియాలయము జేరెనేనియు ♦ హాయిగానునిద్ర పోనిండు; పోనిండు ♦ నిద్ర నన్ను.అతడు ముట్టిన జాలు నే ♦ నంతరింతుననెడువెలలెనినిద్ర నా ♦ హాయినిద్ర!నిదుర చీకటిలోనుండి ♦ పొదలి వచ్చుస్వప్నగతి నిల్వ నతడు నా ♦ సమ్ముఖమున

నతనిచిఱునవ్వుకాంతిచే ♦ నట్టె నిచ్చుమన్నిమీలితనేత్రాల ♦ కున్నెసాటి?కాంతు లన్నిటిలో దొలి ♦ కాంతివలెనురూపులన్నింటిలో దొలి ♦ రూపునవలెనునతడు దృష్టికిగోచర ♦ మగునుగాత!తెలివి నొందిననాయాత్మ ♦ తొలిసుకంబునతనికడకంటిచూపుచే ♦ నందుగాత !కాంచి నను నేను నాతని ♦ గాంతుగాత!

48

శాంతముగనున్నప్రాభాత ♦ సమయవార్ధిచారురుతములచేత సం ♦ చలన మొందే.త్రోవకడ బాలు వికసించి ♦ తొంగలించె;స్వర్ణసంపద మేఘాల ♦ సందులందుసిరుల జల్లుచు విరివిగా ♦ జెదరి యుండె.దేని లక్ష్యంబుసేయక ♦ ధీరులట్లుతొరతొరగ బొవుచుంటిమి ♦ త్రోవబట్టిపాటలు విలాపముగ మేము ♦ పాడలేదు;ఆటలనుగూడ నెవ్వియు ♦ నాడలేదు;బేరములకయి గ్రామముల్ ♦ చేరలేదు;నోటిలోనుండి యొకటైన ♦ మాట లేదు;

ఎవ్వ డొకసారి యైనను ♦ నవ్వలేదు;నేల జూచుచు నెక్కడ ♦ నిలువలేదు.వేళ గడచినకొలదిని ♦ వేగ మెచ్చనడుచుచుంటిమి మార్గంభు ♦ గడచుచుండె;గగనమణి నింగినడుమను ♦ గ్రాలజొచ్చె;బావురమ్ములు నీడలో ♦ పలను మూల్గె.మట్టమధ్యాహ్నమందలి ♦ మండుగాలినెడుటాకులు సండిగొని ♦ నృత్యమాడె.మఱ్ఱిక్రీనీడ గొల్లడు ♦ గుఱ్ఱవెట్టికలవరించుచు నిద్రించె ♦ గాళ్లు చాపి;నీటియొడ్డున గొర్చుండి ♦ నేనుగూడబడలియుండినయంగనముల్ ♦ పచ్చగడ్దిమీద జాపితి గొంచెము ♦ సేదదీర;దుచ్చముగ జూచి నవ్విరి ♦ తోడివారు;తరలిపోయిరి యెత్తిన ♦ తలలతోడ;దిరిగి చూదక నిలువక ♦ తెన్నువట్టికొనకు దూరాన నీలంపు ♦ మసకలోనగలసిపొయిరి కనులకు ♦ గానరాక;ఎన్నియె బయళ్ల, గుట్టల ♦ నెక్కిదాటిచనుచుండిరి దూరదే ♦ శముల గడచి.అంతమొఱుగనిమార్గమ్ము ♦ నంది చన్న

ధీరవరులార! మాన్యులు ♦ మీరెసుండు.వెక్కిరింతలు చీవాట్లు ♦ పెక్కుమార్లులేపయత్నింప లక్ష్యంబు ♦ లేకయుంటి.హర్షగర్భితగాఢదై ♦ న్యంబునందుమందమోదాంకురచ్చాయ ♦ నెంచుచుంటి.కొనల రవికాంతి ప్రసరించు ♦ క్రొత్తతమములొనివిశ్రాంతి నాహృద ♦ యాన బర్వె;యాత్రవిషయంబె మఱచితి ♦ నాత్మలోన;నీడజోలినమాయలో ♦ నెగడుచుండువింతలకు గానములకు నా ♦ స్వాంత మెల్లబెట్టివైచితి నూరక ♦ పెనగకుండ.కట్టకడపట మేల్కాంచి ♦ కనులు దెఱవనీవు నను జేరి యిట్లు నా ♦ నిద్ర నెల్లస్మేరపూరంబుచే ముంచు ♦ చెలువు గంటి.దీర్ఘమును దుర్గంబు నీ ♦ దివ్యపధము;నిన్ను బొందంగ సాధ్యమై ♦ యున్నెయంచునెంత వెఱచి నేనుబ్రా ♦ ణేశ మదిని!

49

నీదుసింహాస్నము డిగ్గి ♦ నెమ్మితొడ

నాకుటీరమునాకిట ♦ నాధ ! నీవువచ్చి నిలిచితి వేమన ♦ వచ్చు బ్రేమ!చేరి యొకమూల గానంబు ♦ సేయుచుంటి;నొంటిగా నేను బరులకు ♦ గంటబడకయీమధురగీతి చెవిసొక ♦ నెలమితోడనాకుటీరమువాకిట ♦ నాధ ! నీవువచ్చి నిలిచితి వేమన ♦ వచ్చు బ్రేమ!గానమున జాణలెందఱో ♦ గలదు; నీదుభవనమున బాట లెప్పుడు ♦బాడుచుంద్రు.అఱిగి యెఱుగక పాడిన ♦ సరళగీతియెట్లు నీప్రీతిపాత్రమై ♦ యెసగె దేవ?చేతమున జాలినిడుచున్న ♦ గీత మొకటిజగతిలోనిమహాగాన ♦ సమితి గలయ,సుమము నొక్కటి పారితో ♦ షముగ గొంచునాకుటీరములోనికి ♦ నాధ ! నీవువచ్చి నిలిచితి వేమన ♦ వచ్చు బ్రేమ!

50

ఇంట నింటను బిచ్చంబు ♦ నెత్తుటకునుగ్రామమున బోవుచుండ మా ♦ ర్గంబు వట్టిపరమవైభవదీప్తసు ♦ స్వప్న మట్లు

కానబడె దూరమున నీదు ♦ కనకరధము.అహహ ! ఱేఱే డెవండని ♦ యబ్రపడితినితిశయింపగ జొచ్చెనా ♦ యాశ లెల్ల;వదలె నాదుర్దినము లని ♦ మదికి దొచె;సిరులు వెదజల్లబడును బో ♦ క్షితి నటంచుబిచ్చమునకయి దూరాన ♦ వేచియుంటి;వడిగ రధము నాకడ ♦ వచ్చి నిలిచె,దృష్టి నామీద బఱపుచు ♦ దేరు డిగ్గినవ్వుచును వచ్చితివి నీవు ♦ నన్ను జేర;భాగ్యము ఫలించె ననుకొంటి ♦ బ్రభువతంస ?యింతలో జూపి కుడిచెయ్యి ♦ యేమి నాకునియ్యగల వని యడిగితి ♦ నేమి చెపుదు?బిచ్చగానికి జేజూపి ♦ బిచ్చ మడుగునిట్టి నెప్రభుపరిహాస ♦ మెన్న దరమె?చిత్తము చలించె నేనేమి ♦ చెప్ప నగునొనాకే తెలియక యుండెను ♦ నాధ ! యపుడు.నన్నధాన్యంపుగింజ నా ♦ సంచినుండితీసి యిచితి నీకు నో ♦ దేవదేవ!కాని యామాపు సంచిలో ♦ గ్రాలుచుండుధాన్యమును గుప్పవోసిన ♦ దానిలోన

నగపడియె మిన్కులీనుచు ♦ నద్భుతముగ;బరమపూరుష ! యొక చిన్న ♦ పైడిగింజ,అంత నాదెల్ల నీకిచ్చు ♦ నట్టిబుద్దికటకటా ! నాడు నాకేల ♦ కలుగదయ్యెనంచు విలపించితిని జాల ♦ నాత్మలోన.

51

రాత్రి యరుదెంచె నెల్లడ ♦ గ్రమ్మె దమము;పనులు ముగిసెను రాత్రి రా ♦ వలయునారు;వచ్చి రందఱు గడపటి ♦ వాడు వచ్చె;నూరితలుపుల మూసిరి ♦ యుచితరీతి;బ్రభువు రానున్నవా డని ♦ పలికె నొకడు.అందులకు నవ్వి యిట్లు కా ♦ దంటి మేము.తలుపు దట్టినయట్లు శ ♦ బ్ధంబు గలిగె.గాలి యని చెప్పి యచటిదీ ♦ పాల నార్పికూర్కుకై పండి యుండగా ♦ గొంతవడికినదిగొ! వినబడె దూతనప ♦ ల్కనియె నొకడు.అందులకు నవ్వి యది వాయు ♦ వంటి మేము.నట్టనడు రేయి నొకమహా ♦ నాద మొద్వె;గలవరించుచునిద్రలో ♦ పలబరుంటదూరమున గల్గునఱుముగా ♦ దోచె మాకు;

నుర్వి వణ కెను గుడ్యమ్ము ♦ లూగియాడె;దద్ధయును గల్గె భంగమ్ము ♦ నిద్దురకును.అదిగో ! రధచక్రనినదమం ♦ చనియె నొకడు.గొనిగితిమి యఱుమం చని ♦ కూర్కి యుండరాత్రి యుండగ నంధకా ♦ రమ్ము నందెభూరిభేరీవమ్ములు ♦ బొరుకొనియె.లేదు జాలమ్ము లెండను ♦ నద మడరె.ఱొమ్ములను బెట్టుకొని మాక ♦ రమ్ము లపుడువడవడ నడంకుచుంటిమి ♦ భయముచేత.అదిగొ ! ఱేనిధ్వజం బని ♦ యనియె నొకడుఅంత మునిగాళ్ల నిలబడి ♦ యందఱమునునఱచితిమి యాలసింప గా ♦ దనుచు దమిని.రాజు వేంచేసె బూలహా ♦ రంబు లేడ?విభుడు గూర్చుండుటకు సింహ ♦ పీఠ మేడ?భవ్యతరముగ వెల్గుదీ ♦ పంబు లేడ?బ్రత్కు లజ్జాభరం బయ్యె; ♦ బ్రత్క నేల ?నితతభవనంభు లే దలం ♦ కృతులు లేవు.అనుచు మేమున్న గనుగొని ♦ యనియె నొకడు"అఱచి ఫలమేమి స్వాగత ♦ మతని కిమ్ము.వట్టిచేతులతొ మఱి ♦ వట్టివైనగదుల కాతని గొనిపొమ్ము ♦ కదలి రమ్ము."

తెఱవబడుగాక తలుపులు; ♦ దివ్యరవముపొడమ శంఖాళి యొత్తంగ ♦ బడునుగాక !అంధకారమాంబు భ ♦ యంకరంబునైనమనయింటి కరుదెంచె ♦ నధిపు డిపుడునట్టనడు రేయిల్ మనయెడ ♦ నెట్టిదయొ;మేఘముల్ గడునుఱిమెను ♦ మింట గ్రమ్మి;తమము మెఱపులచేతను ♦ దత్తరిల్లె;దెమ్ము నీచింపిచాప నీ ♦ దేవునకును;ముందు ముంగిట బఱువుము ♦ పొందికగను;గాలరాత్రికి నాధుడై ♦ గ్రాలుఱేడుచండవర్షంబులో జెప్ప ♦ కుండ వచ్చె.

52

నీదుగొజ్జంగిపూదండ ♦ నేను గోరదలచితిని గాని ధైర్యంబు ♦ గలుగ దయ్యె.స్వామి! వేకువ వీడునీ ♦ పాన్పుమీదరాలినవి గొన వేచితి ♦ జాల దమిని.అర్ధిమైనడి వేడ్కతో ♦నరయు చుంటిరేపకడ నొక రెండుపూ ♦ ఱేకులకునుఅహహ ! నేనేమి గనుగొంటి ♦ నరసి యరసినాకు నీవిడ్డప్రేమచి ♦ హ్నం బదెద్ది ?

దివ్యసుమములొ? పరిమళ ♦ ద్రవ్యతతులొ?కాక పన్నీరుబుడ్డియా? ♦ కాదు కాదు.జ్వాలవలె నెల్గి పిడుగువొల్ ♦ బరువుగల్గివరలుబలమైననీకర ♦ వాలు దేవ!బాలరవికిరణాళి ప్ర ♦ బాతవేళవచ్చినీసెజ్జ బర్వుగ ♦ వాక్షమునను.వనిత! నీవేమి గంటివే ♦ యనుచు నన్నువేకువను బక్షి గూయుచు ♦ వేడ్క నడుగు.దివ్యసుమములొ? పరిమళ ♦ ద్రవ్యతతులొ?కాక పన్నీరుబుడ్డియా? ♦ కాదుకాదు.నీకరము పట్టు ఖడ్గంబు ♦ భీకరంబు.ఎట్టివర మిది నాకు బ్ర్రా ♦ ణేశయంచువింతతో గూరుచుండి యో ♦ చింతు నెపుడు.ఎచట దాపంగవలయునో ♦ యెఱుగ రాదు.అబల నేగాన దాల్పంగ ♦ నగును సిగ్గు.అక్కునను జేర్ప గాదు గా ♦ యంబు పడును.అయిన నీవు ప్రసారించి ♦ నట్టిదీనిదు:ఖకరమైన భరమైన ♦ దొఱగకుందు.హృదయసీమనె ధరియించి ♦ యెనగుచుందు.ఇది మొదలు లేదు భయము నా ♦ కీజగాననాదుపోకాలముల నెల్ల ♦ నాధ ! జయము

నీకె కల్గును బో యింక ♦ నిక్కముగను.మకుటముగ నిత్తు బ్రాణంబు; ♦ మరణమునకునతనిసాయంబు నీవు నా ♦ కంపియుంట.బంధనమ్ముల నెల్లను ♦ బట్టి నఱుకభవదతులఖడ్గ మున్నది ♦ భయము లేదు.సేయ నిక దుచ్చమైనకై ♦ సేత లెవియువేచి మూలల వలవించు ♦ విధముగానివలపు సిగ్గులు గాని నా ♦ వలన నింకగలుగజాలవు ప్రాణేశ ♦ కలుగలేవుయోగ్యభూషణముగ ఖడ్గ ♦ మొసగినావుబ్నొమ్మసొమ్ముల నెనింక ♦ బూన బూన

53

పలు తెఱంగులరంగుల ♦ బదిఢవిల్లురత్నములచేత నక్షత్ర ♦ రాజ చేతఖచిత మైనట్టినీదుకం ♦ కణము చూడనెంతయు మనోహరంబయి ♦ యెసగు; గానిసంజకొపమ్మువోలు కెం ♦జాయలోనజక్కవిచ్చిన గరుడుని ♦ ఱెక్కలట్లుకాంతివంపుననెల్గు నీ ♦ కత్తి చూడనంతకంటెన్ నందమై ♦ యలరుదేవ !

మిత్తికడపటిదెబ్బచే ♦ హత్తి నట్టిబాధ దుది దత్తరిల్లెడు ♦ ప్రాణమట్లుసంచలించుచు నుండునీ ♦ వించుకత్తిచండకాంతిని మఱసి యు ♦ ద్దండమోహమంతయును భస్మ మొనరించు ♦ సతులశుభ్రతేజమును బ్రోలి క్రాలునీ ♦ తేజువాలు.ఉడుమణులచేత ఖచితమై ♦ యెప్పనీదుకంకణము సుందరం బయి ♦ కడు జెలంగు;గాని చూడంగ దలపంగ ♦ గానియట్టియతులసౌందర్యమహిమచే ♦ నలరుగాదె.నరలునీచేత తరవారి ♦ వజ్రధాది!

54

అడుగ లే దేమియును నిన్ను ♦ నడుగ లేదు.చెవిని బడ నీకు నాపేరు ♦ జెప్ప లేదు.నీ వరుగుచుండ నూరక ♦ నిలిచి యుంటి;గ్రాలు చుండెడువృక్షంపు ♦ వాలునీడనొంటిగా నుంటి నే నూతి ♦ యొడ్డునందునీరు నల్లనికడవల ♦ నిండ నింపికొంచు బోయిరి యిండ్లకు ♦ మించుబోండ్లుఅమ్మ ప్రొద్దెక్కె బోదము ♦ ర మ్మటంచు

బిలిచినం బోక యేమేమొ ♦ తలపులందుమునిగి తోచక నే బ్రొద్దు ♦ బుచ్చు చుంటినాకు నీవచ్చునడి చెవి ♦ సొక లేదు.నను గనెడుచూపె నీవిన్న ♦ దనము జెప్పె."దప్పి గొంటిని బాంధుడ ! ♦ దప్పి గొంటి."ననెడునీకంఠమే తెల్ప ♦ నలసి యుంట;గాన గలవరమును మాని ♦ కడవ వంచినీరుదోయిట బోసితి ♦ నెరములను;గాలిచే మీద నాకులు ♦ గలగలమనె;గనుల బడకుండ గూసె బి ♦ కంబు నీడ.దారికొనవంపులోనుండి ♦ తరలి వచ్చిపొగడపూవుసువాసనల్ ♦బుగులుకొనియె.అడిగితిని పేరు గావున ♦ బొదమి లజ్జమౌనమును దాల్చి నిల్సితి ♦ మాట లుడిగిఇంతకును నేను జేసిన ♦ దేమి గలదునీవు నన్మదిలోపల ♦ నిల్చుటకును?నీకు దహంబు దీర్పంగా ♦ నీర మీయగాంచుటయుఎ హర్షమున నన్ను♦ ముంచుచుండు.స్థిరముగా మన్మనంబున ♦ జేరి నిలిచితెల్లగా దెల్లవా!ఱెను; ♦ మెల్లమెల్లబక్షిజాలమ్ము లటనట ♦ బాడ జొచ్చె.

నింబవృక్షంబుపై బత్త్ర ♦ నిచయములునుగదలి గాలికి జప్పుడు ♦ గలుగ జేసె;జింత సేయుచు గూర్చుంటే ♦ జిత్తమునను.

55

మాంద్య మింకను విడదు నీ ♦ మానసమును;నిద్ర యింకను విడదు నీ ♦ నేత్రములను;బుష్పరాజము ఠీవితొ ♦ ముండ్లనడుమనెంతయును గ్రాలె ననుటను ♦ నీవు వినవె?మేల్కొనుము జాగు సేయక ♦ మేలు కొనుము.ప్రొద్దు వ్యర్ధంబుగా బుచ్చ ♦ బోకు వినుము.మత్సఖుం డీశిలామయ ♦ మార్గమునకునంతమం దుండుకేవలై ♦ కాంతసీమనొంటిగా దాను గూర్చుండి ♦ యున్నవాడు.మోసపుచ్చకు పుచ్చకు ♦ మోసమతని.మేల్కొనుము జాగు సేయక ♦ మేలుకొనుము.మండు మధ్యాహ్మమందలి ♦ యెడవడికిబెదరి దివి గుండె లదరిన ♦ నదరు గాక;తప్తసికతంబు దాహన ♦ స్త్రంబు దానువింతగా దాల్చ విప్పిన ♦ విప్పు గాక;హృదయగంభీరతలమున ♦ ముదము లేదె?

మెట్టినపు డెల్ల ద్రోవ యన్ ♦ మేలివీణెభవ్యరవముల నీనదే ♦ బాధపేర?

56

మిడి నాలోన నీహర్ష ♦ ముండు నిట్లు.ఇత్తెఱంగున నను జేర ♦ వచ్చు వీవు.ఏనె లేకున్న నీప్రేమ ♦ మెచట నుండు?దివిభుల నెల్ల నేలెడు ♦ దేవదేవ !చెన్నుమీఱుచు నుందునీ ♦ సిరుల కెల్లగైకొనితి నీవు నన్ను భా ♦ గస్థు గాగ.నీమహానంద మేవేళ ♦ నృత్యమాడునదనముగ నుండు గాదె నా ♦ హృదయసీమభవదుదారేచ్చ రూపంబు ♦ బదయుచుడు;సతతమును దేవ ! నాదుజీ ♦ విత్రమునందు.నన్ను మోహింపజేయగా ♦ నాధనాధ !భవ్యరూపంబు నీ విట్లు ♦ పడసినావు.దీనికై నీదుప్రేమంబు ♦ లీన మౌనుబేర్మితో నిన్ను బ్రేమించు ♦ ప్రేమలోన;గడకు రెం డిట్లు పూర్తిగ ♦ గలసి పొవనందు గానంగ వత్తు నా ♦ నందముగను.

తేజమా ! నాదుతేజమా ! ♦ దీప్తిచేతజగములను నింపుతేజమా ♦ స్వాంతమందుశాంతమును గూర్చుతేజమా ! ♦ చక్షువులనుముద్దుగొనుతేజమా ! నీకు ♦ నుద్ది యెద్ది?ప్రేమమా ! నాదుజీవన ♦ సీమనడుమనిరతమును దేజ మెంతయు ♦ నృత్యమాడు.ప్రేమమా ! ప్రేమతంతుల ♦ బ్రేమతోడదేజ మొకయింత దాగిన ♦ దేటముగనునింగి నిచ్చును గాలి చె ♦ లంగి వీచు;హర్షపూరము భూమిపై ♦ నట్టె పాఱు;నెలమితోడ సీతాకోక ♦ చిలుక లెపుడుతేజ మనునర్ధిమీదనె ♦ తెరలువిప్పు;జెలగుతేజోబ్ది వీచికా ♦ శీర్షములనెవలసి కల్వలు మల్లెలు ♦ నిచ్చుచుండు.స్వర్ణమును మేఘములమీద ♦ బార జల్లిరత్నరాజిని వెదజల్లు ♦ రాజుగూడ;దేజమే సుమ్ము ప్రేమమా! ♦ తేజె సుమ్ముపర్వు బైబయి పర్వంబు ♦ పత్రములనుహర్ష మంతట బ్రాకును ♦ హద్దుమీఱి

నాక నది ముంప దీర మా ♦ సందరసమువెల్లువగ బాఱి జగముల ♦ నెల్ల నిండె

58

ధరను మితిమీఱుగడ్దిగా ♦ జఱపుచుండు,చావుబ్రదుకుల గనలనీ ♦ జగతిమీదనంచితంబుగ నృత్య మా ♦ డించుచుండు,గాలివానను బ్రాణుల ♦ గదిసి లేసివీకమై వింతగా నవ్వి ♦ వీచుచుండుజాఱ గన్నీరు మిన్నక ♦ కూరుచుండు,దుమ్ములో నున్నదెల్లను ♦ దులిపివైచియించుకయు నెమియైనను ♦ నెఱుగకుండువివిధహర్షప్రవృత్తులు ♦ వేడ్క మీఱగలసి పోవుత నాయంత్య ♦ గానమందు.

59

పత్త్రముల నృత్యమాడెడు ♦ పైడికాంతినింగి మెల్లగ నరిగెడు ♦నీరదములుచల్లగా ఫాల మంటుచు ♦జనెదుగాలియెల్ల నీప్రేమకాని వే ♦ ఱే గాదు.

పరమపూరుష ! ప్రియతమ ! ♦ ప్రాణనాధ!నీవు నామది కనుపుసం ♦ దేశ మగుచువరదగాజొచ్చె గనుల బ్రా ♦ భాతకాంతిమించునీమోముపైనుండి ♦ వంచి తీవు;క్రాలునీకంటిచూపు నా ♦ కనుల వ్రాలె;భక్తితో నామనంబు నీ ♦ పాదమంటె.

60

పారమే లేనిసంసార ♦ నార్ధితీరమందు జేరిరి పిల్ల లా ♦ నందముగను;మీద శాంత మనంతమౌ ♦ మిన్ను పొదలె;జలధి ఘోషిల్లుచుండె వి ♦ శ్రాంతి గనక;సారమేలేని సంసార ♦ వార్ధి తటినివేడ్కనుం ద్రాట పాటల ♦ బిల్ల లెపుడు.ఇసుకచే నిండ్ల గట్టుచు ♦ నెనగుచుంద్రు;నట్టిగుల్లలతో నాడి ♦ వఱలుచుంద్రు;ఎండుటాకుల బడవల ♦ నెలమి నల్లినగుచు విదుతురు తేల సం ♦ ద్రమ్ముమీద;బారమే లెనిసంసార ♦ వార్ధితటినివేడ్కతో నాడుచుందురు ♦ పిల్ల లిట్లు.ఈద నెఱుగరు వలవైచి ♦ యెఱుగ్ రెపుడు;

ముత్తెముల దీయువారలు ♦ ముత్తెములకుమునుగుచుందురు మున్నీట ♦ ముదముతోడ;నరుగుదురు నావ లెక్కి బే ♦ హార్లుగానిపొందుగా గుల్కరాళ్లను ♦ బ్రోగుసేసిచల్లుచుందురు మాటికి ♦ బిల్ల లెలమి;దాగుసిరులను వెదుకంగ ♦ దలప రెపుడు;వలలు వైచుట యెట్టిదో ♦ తెలియకుంద్రు.వార్ధి పకపక నవ్విన ♦ నగిది పొంగు.తీరసుస్మేరమొప్పును ♦ దెల్లగాను.అంత మొదవించుశక్తితో ♦ నలరు నలలుపిల్ల నిది తొట్ల నూపెడు ♦ తల్లివోలెబాడు నర్ధములేపట్టి ♦ పాట లెపుడుహాయిగా బాలు రెంతయు ♦ నాలకింప.తోయనిధి యాదు బిల్లల ♦ తోడ గూడి;తీరసుస్మేర మొప్పును ♦ దెల్లగాను.సారమే లెని సంసార ♦ వార్ధితటినివేడ్కతో గూది యుందురు ♦ పిల్ల లెల్ల;విపధమై పోల్చుచుండెడు ♦ నింటియందుగడగి సంచార మొనరించు ♦ గాలివాన;దుష్పధంబై న వార్దిని ♦ దూలి తూలివిఱుగుచుండును నావలు ♦ విఱుగుచుండు;

మృత్యుదేవత స్వేచ్చద ♦ రింపజొచ్చె:వేడ్కతో నాడుచున్నారు ♦ పిల్ల లెల్ల;సారమేలేని సంసార ♦ వార్ధితటినివేడ్కతో గూడుచున్నారు ♦ పిల్ల లెల్ల

61

శిశువు కన్నుల కదలుచు ♦ జెలగు నిద్రవచ్చు నెటనుండి తెలిసిన ♦ వారు గలరె?ప్రేమ గిన్నరనరులుండు ♦ గ్రామమందుమిణుగురుబురుంగు మిన్కుల ♦ మించుచుండుచారుతరపుణ్యకానన ♦ చ్చాయలందువిమలమోహనమూర్తులై ♦ వ్రేలుచుండునిగ్గుల జలించునారెండు ♦ మొగ్గలందునదివసించెడు నని నను జను ♦ లనుచునుంద్రు.శిశువుకన్నుల మొద్దిడి ♦ చెలలగుకొఱకువచ్చునిద్దుర యటనుండి ♦ వచ్చుచుండు.నిదురపోయెడిసిసువుకెం ♦ బెదవులందుజెన్నుమీఱగ జలియించు ♦ చిన్న నవ్వుపుట్టు నెచ్చట దెలిసిన ♦ పురుషు దున్నె?మంచుగప్పినవేకువ ♦ గాంచుకలనునంతరించు శరన్మేఘ ♦ సంచలమును

నర్ధచంద్రునివెలిమిను ♦ కంటినపుడుమించునీచిన్ని నవ్వు న ♦ న్మించె దొలుతననుచు నుందురు జను లిల ♦ననుచుంద్రు.శిశువు సర్వాంగములయందు ♦ జేరి యలరుమృదుమధురమైనక్రొంనగి ♦ యింతవఱకునెచట దాగెనో యెవడేని ♦ నెఱిగి యున్న ?తల్లి చిఱుకన్నియగ నుండు ♦ తఱిని నిద్దికోమలావ్యక్తగూఢన ♦ త్స్రేమ గూడియామొహృదయాన వ్యాపించి ♦ యణగి యుండె.

62

పలు తెఱంగులరంగుల ♦ గలసి వెలుగుక్రీడవస్తువులను నీకు ♦ బ్రీతి నిడినయపుడు తెలియును నాకు నో ♦ యనుగుబియిన్నిరంగులు మేఘాల ♦ నేలగలవొ?యిన్నిరంగుల నీటిలో ♦ నేలగలవొ?పూలలో నేల రంగులు ♦ పొదుగబడెనొ.ఆడుటకు నిన్ను గొల్ప నే ♦ బాడదొడగునపుడు తెలియును నాకు నో ♦ యనుగుబిడ్ది!యేల నాకులలో గాన ♦ లీల గలదొ?యేల నాలించు భువి హృద ♦ యమ్ము సొక

దరగ లెల్లను దమతమ ♦ ధ్వనుల గూర్చిపల్లవుల జేసి పంపగా ♦ బాతుపడునో,ఆశతో గూడియున్ననీ ♦ హస్తములనుమధుర మైనపదార్ధముల్ ♦ మమత నిడినయపుడు తెలియును నాకు నో ♦ యనుగుబిడ్ద!యేల విరిగిన్నెలో దేనె ♦ గీలుకొనెనొయేల గొప్యమ్ముగా ఫల ♦ జాలమందునేర్పుతో మంచిరసములు ♦ గూర్పబడెనోపూని నవ్వింప నెమోము ♦ ముద్దుగొన్నయపుడు తెలియును నాకు నో ♦ యనుగుబిడ్డ!వేకువను నింగిపైనుండి ♦ వెడలుకాంతియందు బ్రవహించుసంతొష ♦ మనగ నేమువేసవిని గాలి నన్నంట ♦ వీచినప్పుడందు గలిగినయానంద ♦ మనగ నెమొ.

63

తెలిసియుండనిమిత్రుల ♦ దెలియజేసినావి గానట్టిగృహముల ♦ దావు లొసంగిపరిచయము లేనివాని సో ♦ దరుని జేసిదూరమును దగ్గఱగ జేయు ♦ దొరవు నీవు.ఉండి పరిచయమైనట్టి ♦ యునికి నీడ

మదికి నెంతయు నాయాన ♦ మొదవుచుండు;గ్రొత్తలో బ్రాంత యుంటయు ♦ గూర్మితోడనీవును గూడి యుంటయు ♦ నేను మఱతు.పరిచయము లేనివానితో ♦ భవ్యమైనహర్షబంధంక్ము నాయాత్మ ♦ కమర గొల్పినెమ్మి దుద లేనినాజీవి ♦ తమ్మునందునేకమిత్రుడవై యుండి ♦ యెనగునీవెయిచట గాని మఱెచ్చట ♦ నేనిగానిజననమరణాదులందునా ♦ నరన నుండినన్ను నడిపించుచుందు వ ♦ నాధనాధ!నిన్ను నెఱిగిన నిక నున్నె ♦ భిన్నబుద్ది?తెఱనబడు దల్పులన్నియు ♦ దెఱవబడునుపెక్కులీలల నొక్కడై ♦ వెలయనీదుప్రవిమలస్గర్శ కేను దూ ♦ రంబుగాకయుండ గోరెడునాకోర్కె ♦ పండనిమ్ము.

64

చేరి నేనొకనిర్జన ♦ సీమయందునేటవాలుగ బ్రవహించు ♦ నేటియొద్దగడు బొదుగుగాగ బెరిగిన ♦ గడ్దిలోననిలిచి యిట్లంటి నామెతో ♦ నెలమితోడ;

"గొంగునీడను దీపంబు ♦ గూర్చి యిట్టులెచటి కేగెద? కన్నెరో! ♦ యెఱుగ జెపుమ.ఉండె నాయిల్లు చీకటి ♦ నొంటిగాను;ఇమ్మ దీపమ్ముకన్నెరో ! ♦ యిమ్ము నాకు."అన్న నల్లనికన్నుల ♦ నట్టె యెత్తిమసకలోజూచి నామోము ♦ మగువ యపుడుతరణి పడమట గ్రుంకిన ♦ తఱిని నేటదీపమును దేల్ప వచ్చితి ♦ దెలియు మనియె.గడు బొడవుగాగ బెరిగిన ♦ గడ్దిలోననొంటిగా నేను నిలబడి ♦ యుండి యుండికాంచితి జలించుదీపంబు ♦ గంగలోఫ్ననూరకే కొట్టుకొనిపోవు ♦ చుంట; నంతరాత్రి నిశ్శబ్ద మగుడు నా ♦ రమణీతోడ"గన్నెరో! నీదుదీపమ్ము ♦ లన్ని వెలిగెనెచటి కేగెదు దీపమ్ము ♦ నింక గొనుచు?నుండె నాయిల్లు చీకటి ♦ నొంటిగాను.ఇమ్ము దీపమ్ము కన్నెరో! ♦ యిమ్ము నాకు."అన్న నల్లనికన్నుల ♦ నట్టె యెత్తివదన మీక్షించి సంశయ ♦ పడుచు నిలిచి"దివికి నంకితముగ నాదు ♦ దీప మియ్యవచినా" నని కడపట ♦ బలికె నామె.

వృధగ నాకన్నె దీపంబు ♦ వెలుగుచుండనిలిచి చూచితి నేనును ♦ నిలిచి నిలిచి.రజనిపతి లేనియామధ్య ♦ రాత్రియందు"అమ్మ! దీపమ్ము నీహృద ♦ యమ్ముకడనుబెట్టి కన్నెరొ ! నీవేమి ♦ వెదకకె దిపుడు?ఉండె నాయిల్లు చీకటి ♦ నొంటిగానుఇమ్ము దీపమ్ము కన్నెరో? ♦ ఇమ్ము నాకు."అన్న నిలబడి తలపోసి ♦ యాన్యమందుజీకటిం దృష్టి పఱిచి యా ♦ వెలునమిన్న"నెమ్మి దీపంబు దీపోత్స ♦ వమ్మునందుజేర్చ దెచ్చితి" ననుచు దా ♦ జెప్పి పొయెనామె చిన్ననిదివ్వె దీ ♦ పాళిలోనగాలిపోవంగ వ్యర్ధమై ♦ కన్నులారజూచుచుండితి నిలబడి ♦ చూచుచుంటి

65

అభవ ! యీనాదుజీవిత ♦ మనెడునట్టినిండితొల్కాడుగిన్నెలో ♦ నుండి దేవ !యేమధురదివ్యరసమును ♦ బ్రేమతోడగ్రోలుకోరికి యున్నదో ♦ కూర్మి జెపుమ!ఓకవీంద్ర ! మదీయవి ♦ లోకనముల

నీదుదృష్టిని గనుటయు ♦ నాదు చెవులనాకిళుల నిల్చి నీనిత్య ♦ పరమశాంతివినుటయును నీకు వేడ్కలై ♦ వెలసియున్నె ?నీజగము నామనంబున ♦ నేర్పుతోడనల్లుచున్నవి పదముల ♦ నందముగను;నీప్రమొదమ్ము వానికి ♦ నింపు నింపు;నెన్నగాగానిప్రేమతో ♦ నిన్ను నీవెనాకు నొసగుచునాయందె ♦ నాధ నీవుపొందుచుందువు నీపరి ♦ పూర్ణసుఖము.

66

సంజ మిణుకుమిణు క్కను ♦ సమయముననుమద్గభీరతలమ్మును ♦ మాననట్టివేకువనుగూడ ముసుగును ♦ వీడనట్టిదానినుంచి మదీయాంత ♦ గానమందునెలమి దుదికాన్కగా నీకు ♦ నిడెద దేవ!పలుకులు పఠించి మెప్పును ♦ బడయ దయ్యె;హస్తములు చాచె బోధన ♦ వ్యర్ధముగనుబదిలముగ బెట్టి దీని నా ♦ హృదయమందుదేశదేశమ్ము లెల్లను ♦ దిరిగినాను;దీన గడచెను నాదువృ ♦ ద్ధిక్షయములు;

పనుల దలపుల నిద్రల ♦ స్వప్నములనునీమెయే యేలుచుండియు ♦ నేకతముగదొలగియే యుండు నెప్పుడు ♦ దొలంగి యుండు;నెందఱో యీమెకొఱకు నా ♦ యిల్లు సేరియరుగుచుందురు తుదకు ని ♦ రాశ జెంది.ఈమెను ముఖాముఖం జూచి ♦ యెఱుగ రెవరు;నీదుసమ్మతి నొంది తా ♦ నెగడుటకునువేచి యున్నది యొంటిగా ♦ వేచి యుండె

67

నీదుప్రేమయే గూటిలో ♦ నెగడుజీవుజిత్రవర్ణమ్ములను మఱి ♦ చిత్రశబ్దచిత్రగంధమ్ములం గూర్చి ♦ జిత్రరూప !మహికి మకుటోత్సవము నల్ప ♦ మోననియతివిమలసౌందర్యహారంబు ♦ వెట్టి యున్నపైడిబుట్టను గుడిచేత ♦ బట్టి వచ్చుభవ్యతరముగ నతము ప్రా ♦ భాతవనిత.పసులమందలు వీడిన ♦ బయళులందుజాడ లేనట్టిత్రోవల ♦ జల్లగానుశాంతపశ్చిమజంధిప్ర ♦ శాంతజలము

నించి బంగారుకుందలో ♦ నెమ్మి దెచ్చునతము సంధ్యాంగనామణి ♦ సౌరుమీఱ;గాని జీవాత్మ యెగయగా ♦ గ్రాలుచుండునంత మెఱుగనియట్టి య ♦ నంతమందువికలవిశదసితచ్చటల్ ♦వెలుగు గానిరంగు రూపము పగలును ♦ రాత్రులనెడుపలుకులే లేవు చూడనా ♦ స్థలమునందు.

68

నేను గార్చెడుకన్నీట ♦ నేను విడుచువేడినిట్టూర్పులను నేను ♦ బాడునట్టిగానములచేత నైనమే ♦ ఘముల నీదుపాదములకఘ జేర్పగా ♦ నీదుసూర్యకిరణ మీనాదుభూమిపై ♦ గరము జాచినాదు జీవితకాలది ♦ నంబు ముగియవఱకు నావాకిటను నిల్చి ♦ వఱలు దేవ!క్రాలుచుక్కలతోడివ ♦ క్షస్థలమునబలు తెఱంగులముడుతలు ♦ పడెడునట్లువివిధరూపంబులను బొంది ♦ వెలుగునట్లుసారెకును దిద్ది యెప్పుడు ♦ మారుచుండురంగులను రంగువేసి హో ♦ రంగు మీఱ

దాల్చుచుందువు మేఘన ♦ స్త్రంబు దేవ !తేలికయు మెత్తదనము న ♦ స్థిరతబాష్పజలములును నల్లదనమును ♦ జాల నుంటదాని బ్రేమిందుతు గదా యు ♦ దారచరిత!కాన నీకేవలశ్వేత ♦ కాంతిమీదజాలిమై గప్పు దత్తమో ♦ చ్చాయ లెపుడు.

69

నాదునాడులయందు న ♦ నారతంబుబాఱు జీవనపూర మే ♦ పాఱుచుండుసకలజగములయందును ♦ సంతతంబునొక్కతీరున లయ దప్ప ♦ కుండునట్లు.అదియె పొదలుచు దలయెత్తు ♦ నవనినుండిపొలుచుపలు తెఱుగులగడ్డి ♦ పోచ లగుచు;నదియె యుప్పొంగు బుష్పప ♦ త్రాళియగుచు;నదియె వృద్ధిక్షయంబుల ♦ నంది చెలగులొలసంసారసాగర ♦ డోలయందునూపబడుచుండు నెప్పుడు ♦ నూపబడును.ద్చేతనాత్మక మైనవి ♦ ఖ్యాతజగతియంటుమాత్రన వాయువ ♦ యపములెల్ల

ధన్యతను గాంచె నందునే ♦ దలచు చుందు;నెంతయోకాలమునుబట్టి ♦ హృదయ మంటియిపుడు నుచ్చోణితంబున ♦ నృత్యమాడునాయహంభావ మెన్నన ♦ నాతనంబు

70

ఒక్కలయగతి నేగునీ ♦ యుత్సవ్చముననలరుటయు భీతి గొల్పెడు ♦ హర్షమనెడుసుడిని బది తూలి బ్రద్ధలై ♦ మడియుటయునునీకు బాహ్యంబు లౌ నేమొ ♦ నాకు జెపుము.తిరగి చూడక నిలివక ♦ తెన్నువట్టియన్నియును గొట్టుకొనిపొవు ♦ నద్భుతముగవానినాపనిగ శక్తి యె ♦వ్వనికి గలదు?సకలమునుబోవు బొవు గొ ♦ ట్టుకొని పోవు;గనకవిశ్రాంతి పాఱు నీ ♦ గానగతికిదగినరీతిని నడుగుల ♦ ద్వరగ నిడుచువచ్చుచుం బాటలను మఱి ♦ పరిమళములబోయుచుండును సెలయేళ్ల ♦ బోలె నెపుడుక్షణములొ దూలి పొలయుసౌ ♦ ఖ్యములయందు.

నన్ను నే బెద్ద యనుకొని ♦ యన్నికడలరంగునీడల నీప్రభా ♦ రాశిమీదనెలకొలుపుచుందు నీదె గదా ♦ నీదుమాయ.నీవె నీలోనిభాగంబు ♦నెమ్మి దీసిపిలుగు వద్దాని నెన్నియో ♦ పేళ్లచేత;నీవిభారమె నాదునా ♦ కృతిని గాంచె;గగనమంతటనుండి యీ ♦ కఠినగీతిప్రతిరసము లీను జత్రబా ♦ ష్పములయందుహర్షభయములయందును, ♦ నాశలందు;వీచికలు మాటిమాటికి ♦ లేచి పడును;గలలు విరియుచు వెండియు ♦ గలుగుచుండు;నీవు నాయందు నోడుదు ♦ నీకు నీవె.ఈ వొనర్చిన తెరమీద ♦ నెన్నియేనిజిత్రములు వ్రాయబడియె వి ♦ చిత్రముగనుమించురేయంబవళ్లను ♦ కుంచెతొడ.గనగ విసు గగుసరళరే ♦ ఖలను వీడియతివిచిత్రపువంపుల ♦ నల్లబడిననీదుపీఠంబు తెరవెన్క ♦ నెగడుచుందు.నీకు నా కగుబండుగ ♦ నింగి బర్వె;

గాలి నీ నాసమశ్రుతి ♦ గలసి మ్రోగె;బొదలి మన మాడుదాగుడు ♦ మూతలాటకున్న యంతమ్ము కాలమ్ము ♦ లెన్ని చన్న.

72

ఆతినిగూఢంబుగా నన్ను ♦ నంటి యంటిప్రకట మౌనట్లు ననులేపు ♦ ప్రభు వనంగనంతరాంతరమందు ను ♦ న్నట్టియతడె.నాదునేత్రాలపై మంత్ర ♦ మాడుచుండివివిధసుఖదు:ఖమూర్చనల్ ♦నెలయు నట్లునాదుహృత్తంత్రులను మహా ♦ నందముగనునాటముగ మీటుచుండెడు ♦ వాడు నతడె.ఎంతయును జంచలం బయి ♦ యెనగుచుండునీలసితరీదహరితవ ♦ ర్ణాలిచేతమాయ యనుజాలమును సదా ♦ నేయు చుండిదేని నంటిన మఱతునో ♦ నేను నన్నెయట్టిత నచరణాబ్జమ్ము ♦ లందముగనుమాఅముదుతలలొనుండి ♦ మానసాక్షిపధమునకు గోచరము సేయు ♦ వాడు నతడె.ఎంతకాలము వచ్చిన ♦ నెంత చన్ననామముల నెన్నియోరూప ♦ ధామములను

మోదములను మఱెన్నియో ♦ భేదములనునతము నామది గొల్పెడు ♦ స్వామి యతడె.

73

ముక్తి నే గోర నెపుడు వి ♦ రక్తి యందుబ్రమద మొసగెడు నేనవేల్ ♦ బంధనములమోక్షపరిరంభణసుఖంబె ♦ పొడము మదికి.వివిధవర్ణసుగంధముల్ ♦ వెలసి యున్నక్రొత్తద్రాక్షారసమ్మును ♦ గూర్మితోడవంచి తిన్నగ నాదుమృ ♦ త్పాత్రయందునిరతమును బోయుచుందువు ♦ నిండునట్లు.తావకజ్వాలచేత వం ♦ దలకొలందివివిధదీపాల వెలిగించి ♦ వింత గదురదేవ ! నీయాలయంబున ♦ దివ్యపీఠిముందు బెట్టును నాజగ ♦ మందముగను.మూయ నాయింద్రియద్వార ♦ ములను మూయగన్ను జెవియును స్పర్శంబు ♦ గాంచుసుఖమునీసుఖంబును వహియించు ♦ నిక్కువముగ.నాదుమాయావినోద మా ♦ నందతేజమగుచు వెల్గును నాయాశ ♦ లన్నిగూడబక్వమగుప్రేమఫలము లై ♦ పరిణమించు.

74

పగలు ముగిసెను; బూమిపై ♦ బడియె నీడ;సమయ మయ్యెను గడవలో ♦ జలము నింపితేగ నదికడ కే నరు ♦ దెంచుటకును;జాలి యిడునీటిగానము ♦ సంజగాలికెంతయును గొల్పె దమకంబు ♦ వింతగాను.పిలుచు చున్నది మసకలో ♦ పలికి నన్ను;నందు నిశ్చబ్ధముగ నుండె ♦ జనులు లెమి;దెరువరియుగూడ దెన్నన ♦ దిరుగ కుండె;బడలికలు వాపుగాలి నీ ♦ వంగ దొడగె;జిన్నతరగలు నదిలోన ♦ జెలగ జొచ్చె;మరలుదునొ లేనొ యింటికి ♦ గలిసి కొనునొ;రేవుకడ జిన్నపడవలో ♦ బ్రీతితోడనెవ్వడోగాని వీణ వా ♦ యించె నదిగొ !

75

యోగ్యముగ మర్త్యులగుమాప్ర ♦ యోజనములగూర్మి నెరవేర్చిననుగూడ ♦ గొఱత పడకమరల నిను జేర బాఱు న ♦ మందగతిని

నీప్రసాదంబు లెల్ల న ♦ నింద్యచరిత !తనకు గలనిత్యకర్తవ్య ♦ మును నొనొర్పబల్లెలం బొలముల జొచ్చి ♦ పఱచి కూడనెడతగక పాఱు నీ ♦ కడకె మరలుగడకు నీపాదకమలముల్ ♦ గడుగుకొఱకు.విరివిరిచి చక్కగా దన ♦ పరిమళమునుగాలిలోపల గమ్మగా ♦ గ్రమ్మికూడగొనకు దను నీకు నర్పించు ♦ కొనుటె తనకునంత్యకర్తవ్యముగ నెంచు ♦ నమలచరిత !పొందునె కొఱంత జగము నీ ♦ పూజవలన?కవులు పలుకుచునుండువా ♦ క్యముల కవనినెవ్వ రేయర్ధ మొనరించి ♦ రేనిగూడవానిఫలితార్ద మెల్ల నీ ♦ వైపె చూపు.

76

నాడునాటికి నాప్రాణ ♦ నాధ ! నేనునీముఖాముఖి నిలువగా ♦ నేర్తు గాక !చేతులను గట్టుకొప్ని జగ ♦ జ్జ్యోతి వైననీకు నేను ముఖాముఖి ♦ నిలుతు గాక !కడువిశాలంపునీదు నా ♦ కసముక్రిందనేకతంబుగ మౌనంబు ♦ నే ధరించి

వినయ మొప్పెడుమదితోడ ♦ వెలయు చుండినీముఖాముఖ నెప్పుడు ♦ నిలుతు గాక !తమపనుల బోరుజనులసం ♦ దడిని గలిగికూడి వడివడి జనియెడు ♦ గుంపు గలిగిపాటుతో నిండియుండు నీ ♦ వసుధయందునీముఖాముఖ నెప్పుడు ♦ నిలుతు గాక !జగములోపల నాపని ♦ ముగిసి నపుడుమాటలాడక యొంటిగా ♦ మౌననియతినీముఖాముఖి నోప్రభు! ♦ నిలుగు గాక !

77

నాకు దేవుండ నీవని ♦ నాధ ! తిలిసితొలగి నిలుతును గొంచెము ♦ తొలగి నిలుతు.నీవు నాస్వంతమే యను ♦ నెఱుక లేకచేరకుండుదు దగ్గఱ ♦ జేరకుందునాకు దండ్రివి నీవని ♦ నాధ ! తెలిసియేను నీచరణంబుల ♦ కెఱగు చుందు.స్నేహితునివలె నీచేత ♦ జేయి నేనుగలప కుండుదు జేతిని ♦ గలప కుందు.నీవు నాస్వంత మనునట్లు ♦ నిన్నే నాకుమిత్రునిగ నెంచి మది జేర్చి ♦ మించునట్లు

నీవు చనుదెంచుచోట నే ♦ నిలువ లేదు.భ్రాతలందెల్ల భ్రాత వై ♦ వరలు దీవు;కాని వారల నెవరెల ♦ క్ష్యంబుసేయ;నొమహాప్రభు ! నీతోడ ♦ నున్నదెల్లబంచికొనినట్లు గాగ నే ♦ వారితోడబంచుకొనలేదు కొర్చిన ♦ భాగ్యములను.అధిప ! నీకడనిల్చిన ♦ యట్లు గాగజనులసుఖదు:ఖములయందు ♦ సరస జేరినిలువలేదు నిజంబుగ ♦ నిలువ లేదు.ఒసగ బ్రాణంబు వెనుదీయు ♦ చున్నవాడ;గాన జీవనజలధి మ ♦ గ్నంబు గాకయున్నవాడను దీనుడై ♦ యున్నవాడ.

78

సృష్టియంతయు గ్రొత్తగ ♦ జెలగునాడుచుక్కలెల్లను నెంతయు ♦ శుభ్రమైనతొలివెలుగుచేత దళతళ ♦ వెలుగుచుండనింగి నభదీఱి దేవతల్ ♦ నెమ్మి బాడి"గహహ ! పూర్ణస్వరూపమా! యమలమైనయద్భుతానందరూపమా" ♦ యంచు మించి"కాంతిపక్త్కిని నొకవెల్తి ♦ కాన వచ్చె;

జకట ! యొకచుక్క జాఱిన ♦ యట్లు దోచె"నంచు నెల్గెత్తి వారిలో ♦ నఱచె నొకడు."వీణబలంగరుతీగియ ♦ వీది పడియ;రాగతాళంబు లన్నియు ♦ నాగిపోయె.ఓహో ! జాఱినచుక్కన ♦ ర్వోత్తమంబుగగనమునకెల్ల మణియయి ♦క్రాలు చుండె"నంచునాశ్చర్యమున నంద ♦ ఱఱచి రపుడు.నాటినుండియు వారెల్ల ♦ చోటులందువెదకుచుందురు దానికై ♦ విడువకుండ."జగమునకు దానితో నొక్క ♦ నగయె తొలగె"ననెడుమాటయె వారిలో ♦ నల్లుకొనియె;గాని నిశ్శబ్దనిశి దమ ♦ లోన దామెగుసగుస్దలువోయె జుక్కలు ♦ కూడి నగుచువెదకుటెల్లను దానికై ♦ వృధయవృదయదేనిలో నది సంపూర్ణ ♦ మైన దంచు

79

దేవ ! నిన్గాంచుభాగ్యమీ ♦ జీవితముననేను గనజాల నేని యో ♦ దీనరక్ష !"తప్పితిని నీదుదృష్టికి ♦ దప్పితి" ననియెప్పుడును నాదుమదిలోన ♦ నెంచ నిమ్ము.

ఒక్కక్షణమైన మఱవక ♦ యుండ నిమ్ము.స్వప్నజగ్రదవస్థల ♦ స్వామి ! నేనుదారుణం బగునీచింత ♦ దాల్పనిమ్ము.జవ మనెదునట్టియీ గొప్ప ♦ నంతయందుగడపుచుండగ గాలంబు ♦గరములందునే గడించినలాభంబు ♦ నిండి నపుడుచూడ నాయార్దనంబెల్ల ♦ శూన్య మంచునెప్పుడును నాదుమరిలోన ♦ నెంచ నిమ్ము.ఒక్కక్షణమైన మఱవక ♦ యుండ నిమ్ము.స్వప్నజాగ్రదవస్థల ♦ స్వామి ! నేనుదారుణం బగునీచింత ♦ దాల్చ నిమ్ము.బడలి రోజుచు ద్రోవకు ♦ బ్రక్కయందుగూదుచుండినయప్పుడు గూరుకొనంగబఱపుదుమ్మున నేలపై ♦ బఱచు నపుడుపయన మింకను బహుదూర ♦ మయిన దంచు,నెప్పుడును నాదుందిలోన ♦ నెంచ నిమ్ము.ఒక్కక్షణమైన మఱవక ♦ యుండ నిమ్ము.స్వప్నజగ్రదవస్ధల ♦ స్వామి ! నేనుదారుణం బగునీచింత ♦ దాల్ప నిమ్ము.గదులు కైసేతలను గాంచి ♦ క్రాలినపుడువేణుహృద్యనినాదముల్ ♦ వెలసినపుడు

పక్కుమనినవ్వుశబ్దముల్ ♦ పర్వినపుడుపిలివనైతిని నిన్ను నా ♦ నెలవు కంచునెపుడును నాదుమదిలోన ♦ నెంచ నిమ్ము.ఒక్కక్షణమైన మఱవక ♦ యుండ నిమ్ముస్వప్నజాగ్రదవస్ధల ♦ స్వామి ! నేనుదారుణం బగునీచింత ♦ దాల్పనిమ్ము.

80

అంబరమ్మున నెంతయు ♦ వ్యర్ధముగనుసంచరించెడుశరభ్ర ♦ శకల మట్లునాధ ! యున్నాడ నిర్మలానంతతేజ!దేవ ! నేను భవచ్చుభ్ర ♦ తేజమందులీన మైపోవునట్లు నా ♦ లోనియావివంటి నీ వింక గఱగింప ♦ కుంట నీకువెలిగ నే నుండి లెక్కింతు ♦ నెలలు నేండ్లు.ఇదియె నీయాట యిదియె నీ ♦ యిచ్చయేనివట్టిదియు జంచలంబు నై ♦ నట్టినన్నుబలు తెఱంగులరంగుల ♦ నలర జేసిపొలుచు చుండెడుబంగరు ♦ పూత బూసిసోలి యాడెడుగాలిపై ♦ దేల జేసినెఱవు మెన్నియెవింతల ♦ నేర్పుమీఱ.

రాత్రి నీయాట జాలింప ♦ రాద ! నీవుదలచితేనియు గాఢమౌ ♦ ధ్వాంతముననౌఅమలప్రాభాతవిస్మిత ♦ మందు నేనిస్వచ్చతర మై వెలింగెడు ♦ శైత్యముననొకలసిపోవును గనులకు ♦ గాన రాక

81

ఎన్నియోమార్లు తోచక ♦ యున్నవేళవమ్ముగాబుచ్చి నట్టికా ♦ లమ్ము గూర్చియుల్లమున వే గరమ్ము జిం ♦ తిల్లివాడు;గాని నాకాల మూరక ♦ కడవ లేదు.దేవ! నాజీవితమున బ్ర ♦ తిక్షణమునుస్వయముగా నీకరమ్ముల ♦ బట్టినావు.అన్నిటను గల్గి లోలోన ♦ నలరు చుండిపూన్కితో విత్తనమ్ముల ♦ మొలకలుగను!మొగ్గలను సాంపుగుల్కెడు ♦ పువ్వులుగనుబూల ఫలములుగా జేసి ♦ ప్రోతు వీవు.బడలి తొచక పాన్పుపై ♦ బండి యుండియాగె జనులెల్ల ననుకొంటి ♦ హాయి గంటిలేచి వేకువ దోటను ♦ జూచుసరికివింతవింతల విరులచే ♦ వెలసి యుండె.

82

నాధ ! నీచేత గాల మ ♦ నంత మగును.నీక్షణంబుల లెక్కింప ♦ నేర్చు నెవడు?వడిగ రేయింబళ్లును ♦ గడచుచుండు.విరులవలెను యుగంబులు ♦ విచ్చినాడు.దేవ ! నేచుట యన నేమొ ♦ తెలియ నీకె.ప్రధమదశ నుండునన్నిని ♦ వనసుమంబుపూర్ణపరిణామమును బొంది ♦ పొదలుటకునుబైబయిని నెన్నియో శతా ♦ బ్దముల గడచువమ్ముగా బుచ్చ మాకు గా ♦ లమ్ము లేమివృధగ దరుణముబొనీక ♦పెనగవలయుజాల మొనరింప మాకంత ♦ కాలున్నె?వచ్చి మొఱలిడు ప్రతివాని ♦ కిచ్చుచుంటగాల మంతయు వ్యర్ధమై ♦ కడచిపోవు.కొనకి నాకాన్క నీపీఠ ♦ మునకు రాకకాలమెంతయు వ్యర్ధమై ♦ కడచిపోవుఅంత నిలుపకనేను ది ♦ నాంతమందుతలుపు మూయుడు రనుభీతి ♦ ద్వరగవత్తుగాని యింకను గాలంబు ♦ గలిగి యుండు.

83

శోకబాష్పాళిచే మాత ! ♦ నీకు నొక్కకంఠహారంబు నిచ్చెద ♦ గాన్కగాగదమప్రకాశంబుచేతను ♦ దార తెల్లనీదుచరణంబులను గూర్ప ♦ నెమ్మితోడసందెలొనిరించె గాని నీ ♦ యక్కునందువరలి వ్రేలుడు నేనిడు ♦ నరముసుమ్ము.వచ్చు నీనుండి కీర్తియు ♦ భాగ్య మెపుడునిచ్చటయు నీయకుంట నీ ♦యిచ్చ నుండునాదుశోకము మాత్రము ♦ నాదె నాదె.దీని కాన్కగ నీకు నే ♦ దెచ్చినపుడునీకరుణచేత నన్ను మ ♦ న్నింతునీవు.

84

అంతఘను నిండియుండి య ♦ నంతమైనగగనమున బెక్కురూపముల్ ♦ గలుగజెయునదియును వియొగచింతయే ♦ యరసి చూడ.నతము రాత్రులయందు ని ♦ శ్శబ్దముగనుజుక్కలోనుండి చుక్కను ♦ జూచుచుండివర్షరతుల నాకుల ♦ వలన గలుగు

శబ్దముల యక్షగానంబు ♦ సలుపుచుండనదియును వియోగచింతయే ♦ యరసిచూడమాటిమాటికి మనుజుల ♦ మందిరములభేదమోదానురాగవాం ♦ చాదు లగుచుమత్కవిత్వహృదంతర ♦ మార్గముననుబాటగ గరంగి సతతము ♦ బాఱుచుండునదియును వియోగచింతయే ♦ యరసిచూడ.

85

నాధుభవనమునుండి యా ♦ యోధవరులుగదగి యని కయి తొలుదొల్త ♦ వెడలినపుడుతమబలము నెల్ల నెచ్చట ♦ దాచి చనిరి?శస్త్రకవచంబు లెచ్చట ♦ జాఱి పడియె?ప్రభునివాసంభునం దుండి ♦ వచ్చునపుడువారలుండిరి యనదల ♦ పగిదిజూడశరపరంపర వారిపై ♦ గురిసి యుండె.స్వామిభవనము మరి చేర ♦ జనెడునపుడుతమబలములెల్ల నెచ్చట ♦ దాచి చనిరి ?ఖడ్గశరచాపములు వారి ♦ కడను లేవునుదుటిపై శాంతరసము సొం ♦ పొదవి యుండెమరల విభుమందిరము జేర ♦ దరలునపుడు

వదలి యుండిరి జీవిత ♦ ఫలము లెల్ల.

86

చేరి వాకిట మిత్తి నీ ♦ సేవకుండునెఱుగ రానట్టిసంద్రంబు ♦ నెలమి దాటిదేవ ! నీ యాజ్ఞ నిదె నాకు ♦ దెచ్చినాడు;కటికరాతిరి జిమ్ముచీ ♦ కటులుగ్రమ్మె;నాత్మ చలియించె భీతిచే ♦ నైన నేను;దీపమును గొని తలుపుల ♦ దెఱచివైచిస్వాగతం బిచ్చి మ్రొక్కెద ♦ సంతసమునవాకిటను వచ్చి నిలిచిన ♦ నాడుచూడనీవు పంపినదూతయై ♦ నెగడుచుంట;గరములను మోడ్చి కన్నీరు ♦ గ్రమ్ముచుండనతని బూజింతు నెంతయు ♦ వర్ధితోడ;జ్రణములజిత్తకోశంబు ♦ దెఱచిపెట్టియతని బూజింతు నెంతయు ♦ వర్ధితోడదానువచ్చినపని తీర్చి ♦ తరలునతడునాదుప్రాభాతమున నిల్చి ♦ నల్లనీడ.పాడువడినట్టి నాయింట ♦ వదలబడిననేను మాత్రమె నీతుది ♦ కానుక యయునిలిచి యుందు నోనాధ ♦ నిలిచియుందు.

87

కట్టకడపటియాశతో ♦ గదిని జేరియామెకయి మూలమూలల ♦ యందువెదకికాననైతిని నేనామె ♦ గాననైతి.ఇల్లు చిన్నది పోయిన ♦ దెద్దియైనగానబడ దెన్నటికినైన ♦ గాన బడదు;నీదుభవన మనంతమై ♦నెగడు గానస్వామి యామెను వెదుకంగ ♦ వచ్చినాడ;నీదుసంధ్యాంబరంబను ♦ నిగ్గులొల్కుపైడి మేల్కట్టునీడలో ♦ వలను నిల్చినేను దమి నిక్కి చూచెద ♦ నీముఖంబు;నిత్యమను నార్ధితుది జేరి ♦ నిలిచినానుదానిలో నాశ మొద్దాని ♦ కేని లేదు.కంటిలోపల నశ్రువుల్ ♦ గ్రమ్మియుంటనాడ్శ గాని మరెట్టిసౌ ♦ ఖ్యంబు గానియెముఖచ్చాయ గాని నా ♦ కెఱుగరాదు.ఏమియును లేక వట్టిగా ♦ నెనగునన్నునమ్మహావార్ధిలోపల ♦ నద్ది యద్దిపూర్ణమైనట్టి లోతులో ♦ ముంచి విడుమువిశ్వమంతట లోపల ♦ విలయమందు

నాసుఖస్పర్శ నొకతూరి ♦ నందనిమ్ము.

88

శిధిలదేవాలయంబున ♦ జెలగుదేవ!నిన్నుగూర్చినపాటలు ♦ నెమ్మితొడవీణెతంతులు పాడవు ♦ విఱిగియుంట;స్వామి! నీపూజసమయంబు ♦ జాటవింకసంజవేళల గంటలు ♦ చప్పు డుడిగి;గాలి మౌనము ధరియించి ♦ కదలకుండుజీర్ణభవదీయవాసంబు ♦ జేరవచ్చెమధురమధుమానవాతమ ♦ మందగతిని;పూలపరిమళవార్తల ♦ లీలదెచ్చెగాని యాపూల గాన్కగా ♦ గాంచవింక.మున్ను నీపూజ గావించు ♦ చున్నవాడువరము గనకుండ నింకను ♦ దిరుగుచుండుధూమమును నీడలునుబొయి ♦ దుమ్ముగలయసంజవేళను బడలిక ♦ జాలిగలిగిడెంద మెంతయు క్షుద్భాధ ♦ గుందుచుండశిధిలదేవాలయంబును ♦ జేరునతడు.జీర్ణదేవాలయంబున ♦ జెలగుదేవ!నడియె లేకుండ జరుగు ను ♦ త్సవములెల్ల

రేల బూజలుగలుగుదీ ♦ పాలె లేక ;నేర్పరులచేత జక్కగా ♦ దీర్పబడినవేనవేల్క్రొత్త బొమ్మలు ♦ వెలయగలవు;వానివానికి గాలంబు ♦ వచ్చినపుడుశూన్యపావన వాహినిన్ ♦ జొచ్చిపొవు.బొత్తిగా బూన గనకుండ ♦ బొదలువాడుకేవలముజీర్ణనదనంపు ♦ దేవు డొకడె.

89

అఱవకుము కేకవేయకు ♦ మనుచు నన్నుగోరి యున్నాడు నాధుండు ♦ కూర్మితోడనింక గుసగుసమాత్రమె ♦ యొనగగలదు;మనసులోమాట పాటలో ♦ గొనిపోవు;బ్రభునినంతకు జనిరెల్ల ♦ వారునిపుడుఅమ్మువారును గొనువారు ♦ నచట గలరుపనులమధ్యను దినమధ్య ♦ మునకు నాకుసెల వకాలంబులోఫ్పల ♦ గలిగెనిపుడుకాల మిది గాకయున్నను ♦ బూలునాకునిచుగావుత బూదోట ♦ నెలమితోడ;మిట్టమధ్యాహ్న మిప్పుడు ♦ మధుకరములువీడిసొమరితనమును ♦ బాడుగాత !

మేలుకీడులతో జాల ♦ గాల మరిగె.వర్ధదినముల నాతొడ ♦ నాడుకొన్నవాడు నాహృదయంబును ♦ నేడు లాగెపనికిమాలినయట్టి యే ♦ పనికి నన్నునిట్లు తటుకున బిలిచెనో ♦ యెఱుగరాదు.

90

నీదువాకిలి మరణంబు ♦ నిలిచి తట్టనేమి యెసగడు కాన్కగా ♦ నీవు చెపుమ?అట్టులరుదెంచినట్టినా ♦ యతిదిముందుబాత్ర సంపూర్ణజీవిత ♦ పాత్ర నిడుదు;బంప నేనట్టిచేతుల ♦ బంప నతని.నాదుదినములు కడగన్న ♦ నాడు వచ్చినాదువాకిలి నామర ♦ ణంబు దట్టశీతదినముల వేసంగి ♦ రాతురులనుగన్న మధురఫలంబుల ♦ గారవములనెంతయును శ్రమ నేగన్న ♦ యెల్లసిరులబొందుగా గూర్చి యాతని ♦ ముందు నెడుదు.

91

జీవితమునకు ఫలితార్ధ ♦ మై వెలుంగు

మరణమా ! చెవి గునగున ♦ మాట జెప్పరమ్ము; తడవేల మరణమా! ♦ రమ్ము రమ్ము!అర్ధి నీకయి వేచితి ♦ ననుదునమ్ము;నీకొఱకై యుంటి సుఖదు:ఖ ♦ నిచయ మోర్చి;నాయనియు నేను నాయాశ ♦ నాదు ప్రేమమన్నియును నిన్నుగూర్చి గో ♦ ప్యముగ బాఱె;నొక్కసరి దుది నన్ జూడు ♦ మోమరణమ!నీవశంబయి పోవునా ♦ జీవనమ్ము.లీల గూర్పంగంబడినట్టి ♦ పూలదండసిద్ధ మయ్యెను; వరునికై ♦ సిద్ధ మయ్యె.పెండ్లి కాగానె వధువు సం ♦ ప్రీతి రాత్రినేకతమ్ముగ నెవ్వరి ♦ దృష్టి బడకనిలయమును వీడి ప్రభువుతో ♦ గలిసికొనును.

92

సాయు నిబ్భూమి నాదృష్టి ♦ పధమునుండియొక్కనాడని తెలియదు ♦ జక్కగాను.ప్రాణ మాజ్ఞను గైకొని ♦ మౌనముగనుపొవు దుది తెర నాకండ్ల ♦ ముందు బఱపి;కాని చుక్కలు రాత్రుల ♦ గాచు విడకవేకువయు నెప్పటట్టులు ♦ వేగుచుండు

జెలగు నలలట్లు కాలంబు ♦ చేరి చేరిచల్లుచుండును సుఖదు:ఖ ♦ ఛయము నతము.ఇట్టినాయంతమును మది ♦ నెంచినపుడుకాలమందలియవధి నా ♦ కనులు వీడిమరణమనుకాంతై గైమొని ♦ మహిని గాంచులీల జల్లిననీభాగ్య ♦ జాలములను.మరణ మాధిగ నెంచెడు ♦ మనసుకంటెబరమనీచము తుచ్చమ్ము ♦ మరియు గలదె?వ్యర్ధముగ నేను దమి గోరి ♦ నట్టివెల్లనేను గాంచినవెల్లను ♦ వెల్ల నాకుదాని సత్యమ్ముగా దాల్చ ♦ రాని రాని !

93

సెలవు గాంచితి నికను మీ ♦ సెలవు గొందునేన లిడి పరపు డిదెద్ మీకు ♦ శిరము వంచిబయలుదేరుచు నున్నాను ♦ భ్రాతలార!తలుపు తాళము లివె కొండు ♦ దయదలిర్పనింటిపై స్వత్వమెల్ల నే ♦ నెడలినాడ;వినగ మీతుదిశుభవాక్కు ♦ వేచినాడ;జరసితిని బెక్కునాళ్లు మీ ♦ పొరుగునందు

నిడినదానికి మించి నే ♦ బడసినాడ;దెల్ల వాఱెను గదిమూల ♦ దేజరిలినదీపమును నారె నే బైలు ♦ దేరుటకునుసిధ్జ మైతిని రమ్మని ♦ చీటి వచ్చె.

94

మేలు గోరుడు నేవీడు ♦ కాలమందుమిత్రుల్లార ! మదీయన ♦ న్మిత్రులార !ఆకసము తెల్లవాఱెను ♦ నాకు జూడనందముగ గానవచ్చెనా ♦ యాత్రపధము.అటకు గొనిపోవ నేమున్న ♦ దనుచు మీరలడుగుకుండు పైన మయ్యెద ♦ నధిపుకడకునాశతొ నిండి తోల్కాడు ♦ నాత్మతోడదద్దయును రిక్తమైనహ ♦ స్తములతోడ.పెండ్లిహారంబు మెడను సం ♦ ప్రీతి నిడుదుబంధువలె దాల్చ నేగాని ♦ వస్త్రములనుతెన్నులోఫ్న నపాయంబు ♦ లెన్ని యున్నచెదరి చెదరక యుందుదు ♦ మదినినేనుయాత్ర ముగిసెడునంతలో ♦ సంబరమునసాంధ్యనక్షత్ర ముదయించు ♦ సంజలోనజాలిగొలిపెడుగీతముల్ ♦ సర్వభౌము

మందిరద్వారమున జెవి ♦ విందు సేయ.

95

కడగి యాజీవితములోని ♦ గడవనెప్పుడేను దాటితినో నాకు ♦ నెఱక లేదు;అడవి నడురేయి మొగ్గవో ♦ లహహ నన్నువింతలో వింత యగు మహా ♦ విశ్వమందునేమహాక్తి గొలిపెనో ♦ యెఱుగరాదు.వేకువను గాంతి నాకన్ను ♦ సోకగానెనేను లోకమ్ములో గ్రొత్త ♦ గా నటంచుబేరు రూపును లేక య ♦ భేధ్యుడైనప్రభువు నాతల్లిరూ పొంది ♦ పరమకరుణజెతులను దాల్చె నని తొచె ♦ జిత్తమందు.ఇట్లు తెలియంగ గాని యీ ♦ యీశ్వరుండెచిరపరిచితుండువోలె నా ♦ మరణమందుగూడ గనబడు గనబదు ♦ గూర్మితోడ;నిప్పు డీజీవితమ్ము నే ♦ నెలమి జూతుగాన మృతిగూడ బ్రేమతో ♦ గాంతు నపుడు;తల్లికుడిఱొమ్మునం దుండి ♦ తన్ను దీయనుత్తరక్షణమందున ♦ జిత్త మలరనెడమఱొమ్మున శాంతిని ♦ బడయుకొఱకె

పిల్ల యేడ్చుట యెఱుగమె ♦ పృధ్వియందు.

96

ఇజ్జగంబును వదలి నే ♦ నేగునప్పుడనుపమానంబె చూచితి ♦ ననెడుమాటవీడుతఱి జెప్పమాటయై ♦ వలయుగాత!కాంతి నార్ధిని వికసించు ♦ కమలమందునున్నతేనెను నేజవి ♦ గొన్నవాడనహహ ! ధన్యుడ ధన్యుడ ♦ ననెడుమాటవీడుతఱి జెప్పమాటయై ♦ వెలయుగాత !అంతమే లేనిరూపంబు ♦ లమరి యుండునీవిలాసాలయంబున ♦ నెలమి నాడిమించినాడ నరూపుని ♦ గాంచినాడస్వర్శకందనివాడు ప్ర ♦ సన్నమూర్తియంటె గావున నాదుస ♦ ర్వాంగములునుదేహమెల్లను గగురించి ♦ తేజరిల్లెనంత మిట గల్గ గల్గని ♦ యనెడుమాటవీడుతఱి జెప్పుమాటయై ♦ వెలయుగాత !

97

నిన్నుజతగూడి నేనాడు ♦ చున్ననాడు

నిన్ను నెవడని నేను బ్ర ♦ శ్నింపలేదు;సిగ్గు నెఱవుల నెఱుగక ♦ చెలగుచుంటి;జీతివం బెల్ల గజిబిజి ♦ జెంది యుండె;గేవలము స్నేహితునివలె ♦ దేవ ! నీవువేకువను లేపుచుంటివి ♦ వింతగాను.పఱచినడుపుచు నుంటివి ♦ వనపధములఆదినములందు నీచేయు ♦ నందమైనగానములలోనియర్ధంబు ♦ గనుగొనంగనాకు నింతయు లక్ష్యంబు ♦ లేకయుండె.మట్లుమాత్రమె గ్రహియించె ♦ మద్గళంబుఅట నంతయు జాలించి ♦ నప్పుడిప్పుదహహ ! తటుకున గనబడు ♦ నది యిదేమి?సద్ధుసేయనినక్షత్ర ♦ సమితి గూడిజగము కనులను వాల్చి నీ ♦ చరణములనునద్భుతంబుగ నిలబడె ♦ నద్భుతముగ.

98

నాదుభంగమ్ము దాల్చుహా ♦ రాదికములబొంకముగ నేను నెన్ని న ♦ లంకరింతు;బదిభవనమునుండి తప్పుకో ♦ బలము లేదు.

గర్వభంగము నాకగు ♦ గల్లగాదు.బంధములు తెగు నెంతయు ♦ బాధ నొసగివేణుగతినట్టి నామది ♦ విడుచునూర్పుగట్టిఱాయియు గన్నీట ♦ గరగిపోవు.నిచ్చలుల్ శతపత్రము ♦నిచ్చకున్నె ?దానితేనియ తప్పక ♦ తరలి పాఱునీలముగ నింగినుండి తా ♦ నిక్కి చూచికన్నొకటినాకు రమ్మని ♦ సన్నసేయు;మిగుల దేమియు నాదేమి ♦ మిగులకుండు;గందు మరణంబు నీపాద ♦ కమలమందు.

99

నాశిస్త్రాణమును దీసి ♦ నాధ ! యిడినదాని ధరియించుటకు నీకు ♦ దరుణ మగును.కాగ నున్నది యగును ♦ దక్షణమునందెవ్యర్ధ మీనాదుపోరాట ♦ వ్యర్ధ మయ్య !స్రాంతమా ! చేతులను దీసి ♦ చప్పు డుడిగియోటమికి నోర్చి యుంచిన ♦ చోట నీవుపరమశాంతిని నుంట లా ♦ భంబటందునెంచుమా నాదుహృదయమా ♦ యెంచుకొనుమ.అట్టె వీచినగాలికి ♦ నారి యారి

పోవుచుండెడు నాదీప ♦ ములను వెలుగజేయ మాటికి యత్నించు ♦ చేతలందుమఱచుచుండుదు దక్కిన ♦ మాటలెల్ల.కాని యిక దెల్వినొనరింతు ♦ గార్య మేనుజీకతిని నేలబఱచి నా ♦ చిన్నచాపవేచియుందుదు నీకయి ♦ వేచియుందుప్రభువతంనమ ! నీయిచ్చ ♦ వచ్చినపుడురమ్ము కూర్చుండు మిట నీవు ♦ నెమ్మదిగను.

100

రూపమే లేక పూర్ణమై ♦ రూఢిమెఱయుముత్తమును గాంచుకొఱకు నై ♦ మునుగుచుందులోతుగా రూపవారధి ♦ లోన నేను;వాతహతమైనయీనాదు ♦ పడవ నెక్కిరేవు రేవున కేనికి ♦ బోవ బోవ్.అలలపై లేచి పడి యాడు ♦ నాదినములుగడచి నేటికి నెంతయో ♦ కాల మయ్యె.మరణమేలేనిదానిలో ♦ మరణ మందవేడ్కతో నుంటి నుంటి నే ♦ వేడ్కితోడ.నాదుజీవితమనువీణె ♦ మోదముననుగ్రాలుచుండునగాధమా ♦ ర్గమ్మునందు

శబ్దమేలేనితంతుల ♦ చారుగానరసము పొంగుమహాస్థాన ♦ రంగమునకుదీసికొనిపోదు దప్పక ♦ దీని నిపుడు.నిత్యమను పాటలో దీని ♦ నెమ్మిగూర్చు;దీనికడనడియూపిరి ♦ తీఱినపుడుమౌనముగ నుండునీవీణె ♦ మోనికాళ్లకప్పగింతును దప్పక ♦ యప్పగింతు.

101

దేవ ! యెప్పుడు నేను నా ♦ జీవితముననాదుగీతాళిచేతనే ♦ నాధ ! నిన్నువెదకుచుంటిని దప్పక ♦ వెదకుచుంటి.ఇంటి కింటికి నన్నవి ♦ యెలమి జేర్చెవానితో నుండుటను నావ్ర ♦ పంచ మెల్లవెదకి యంటినయట్టులు ♦ మదికి దోచె.నేను నేర్చినపాఠము ♦ లెల్లనాకునవియె నేర్పెను దప్పక ♦ యనియె నేర్పె;నెన్నియోగూఢమార్గమ్మ ♦ లెఱుగజేసె.అంతరాకాశమందున ♦ నలరుచుండునెన్నియోచుక్కలను నాదు ♦ దృష్టిముందునవియె పెట్టను దప్పక ♦ యనియె పెట్టె.

మోదఖేదంబు లొప్పెడు ♦ భూమిలోనివివిధచిత్రమ్ములను జూప ♦ వేడ్కతోడనవియె నడిపెను దప్పక ♦ యనియె నడిపె.తుదకు యాత్రాంతమున సంజ ♦ యెదవినప్పుడేప్రభుద్వారమున నవి ♦ యెలమి జేర్చెనేప్రభుద్వారమున నవి ♦ యెలమి జేర్చె ?

102

కాంచితిని నిన్ను నేనని ♦ గర్వపడితిమనుజులందఱిలోపల ♦ మహిని; గానవారు నాకార్యముల నెల్ల ♦బ్రభువతంన !నీదుచిత్తమ్ములే కాంచి ♦ నెమ్మితోడనాత డెవ డని వచ్చి న ♦ న్నడుగుచుంద్రు.ఏమిచెప్పంగవలయునో ♦ యెఱుగ గాననహహ ! నేజెప్పలే నని ♦ యనిన నన్నుదేవ ! నిందించి నిరసించి ♦ పోవుచుంద్రు;కూరుచుందువు చిఱుంవ్వు ♦ గూడి నీవు.నిన్నుగూర్చిననాకధల్ ♦ నింపుచుందునిత్వేగీతాళిలోపల ♦ నింపుచుందు;నాత్మ దాగక యీరహ ♦ స్యంబు వెలికివెల్లిగొన వారు వచ్చిమా ♦ కెల్ల దీని

యర్ధ మంతయు జెప్పుమం ♦ చడుగుచుంద్రు.ఏమిచెప్పంగవలయునో ♦ యెఱుగ గాననర్ధమెఱిగిన వా రెవ్వ ♦ రనిన నన్నుదేవ ! నవ్వుచు నిరసించి ♦ పోవుచుంద్రుల్;కూరుచుందువు చిఱునవ్వు ♦ గూడి నీవు.

103

నాధ ! యొకవందనమ్ముతో ♦ నాకు నున్నయింద్రియములెల్ల బురివిచ్చి ♦యిజ్జగంబునంటు గావున నీచర ♦ ణాబ్జమందు !నాధ ! యొకవంద్సనమ్ముతో ♦ నామనంబునీరముల నిండి కురియని ♦ నీరదంబునింగిలో శ్రావణమ్మున ♦ వంగినట్లువంగుగావుత నీమహా ♦ ద్వారమందు !నాధ ! యొకవందనమ్ముతొ ♦ నాదువివిధగతుల గీతమ్ములెల్లను ♦ గలసియేకపూరమై శాంతవారధి ♦ జేరుగాత !గూండ్లు కరుగగ మనసులో ♦ గోర్కిపుట్టిపర్వతంబుల నుండెడు ♦ పట్టులకునురేయిపవలును వదలక ♦ పోయిచేరనరుగుచుండెడుబకపాళి ♦ యందమునను

దేవ ! యొకవందనమ్ముతొ ♦ జీవన మిదియయ్యనంతాలయము జేర ♦ నరుగుగాత !

Comments

Loading comments…