పీఠిక
కాశీఖండము
శా. శ్రీకాశీనగరాధి రాజ్యపదవీసింహాసనాధ్యాసి లోకైకగ్రామణి విశ్వనాథుఁడు విశాలాక్షీమనోభర్త సుశ్లోకుం దొడ్డయయల్లభూవరతనూజున్ వీరభద్రేశ్వరక్ష్మాకాంతుం జగనొబ్బగండని మహైశ్వర్యాన్వితుం జేయుతన్. 1
సీ. కంఠాగ్రకరిరాజు డుంఠివిఘ్నేశుండువడఁకుగుబ్బలికూఁతుకొడుకుకుఱ్ఱయాకాశమండలం బను నల్లకలువకునకరు వాద్యుండు లోలార్కమూర్తిగోపాలరామలగుబ్బచన్ను లమెచ్చుగీర్వాణవంద్యుండు కేశవుండుకరటి వ్రీడాశూన్యకటి గోపురద్వారపరిరక్షకుఁడు కాలభైరవుండుతే. కాలకంఠునిశిరసుపూ గగనగంగకాశికాక్షేత్రమున కేడుగడయు నైనయిందఱును నిత్తు రెల్లప్పు డీప్సితమ్ములల్లయప్రభు వీరభద్రాధిపునకు. 2
సీ. కబరికాభారంబు గై పెక్కు విరులతోనవటు భాగంబుపై నత్తమిల్ల
నలఁతి లేఁజెమటచే నసలుకొన్న లలాటకుంకుమంబునఁ జిన్నికురులు మునుఁగఁబసిఁడికుండలఁ బోలు పాలిండ్లభరమునసన్నపుఁగౌదీఁగె జలదరింపఁధవళతాటంకరత్నప్రభారింఛోళిగండస్థలంబులఁ గౌగిలింపఁతే. గాశికారామకల్పవృక్షములనీడఁ,గుతపవేళలయందు నాఁకొన్నవారికమృతదివ్యాన్న మిడు విశాలాక్షి గౌరి!శాశ్వతైశ్వర్యములు కృతిస్వామి కొసఁగు. 3
ఉ. పాయక నిర్నిరోధనిరపాయసమగ్రకృపాగుణైకపారాయణవిలాసము తిరంబుగ నంబుజసూతి వీరనారాయణు దానవైభవధురంధరు సంగరసవ్యసాచి దీర్ఘాయురుపేతుఁ జేయుత నృపాగ్రణి నల్లయవీరభద్రునిన్. 4
తే. కంఠపీఠిక నోంకారఘంట మొరయఁజెలఁగుఁ గావుత మన్మనఃక్షేత్రసీమఁగవికుటుంబంబుపాలిటి దివిజసురభిజలజసంభవుబోటి భాషావధూటి. 5
వ. అని సముచితప్రకారంబునఁ బూజ్యపూజాతత్పరుండనై యొక్కనాఁ డాత్మగతంబున నిట్లని వితర్కించితి. 6సీ. చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడురచియించితిని మరుద్రాట్చరిత్రనూనూగుమీసాల నూత్నయౌవనమునశాలివాహనసప్తశతి నొడివితి
సంతరించితి నిండుజవ్వనంబునను శ్రీహర్షనైషధకావ్య మంధ్రభాషఁబ్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొనియాడితి భీమనాయకునిమహిమఁతే. బ్రాయ మెంతయు మిగులఁ గైవ్రాలకుండఁగాశికాఖండమను మహాగ్రంధ మేనుదెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశకటకపద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి. 7
ఉ. స్కందపురాణసంహితకు ఖండము లేఁబది యందులోన నానందవనానుభావకథనంబున శ్రోతకు వక్తకున్ శుభానందపరంపరావహము నైజగుణం బని గాశిఖండ మాకందు వెఱింగి నేను సమకట్టితిఁ గావ్యముగా నొనర్పఁగాన్. 8
వ. ఇమ్మహాప్రబంధప్రారంభంబుఁ గర్ణాకర్ణికావశంబున నాకర్ణించి కర్ణాంతవిశ్రాంతవిశాలనేత్రుండును,బంటవంశకమలమిత్త్రుండును, నశ్రాంతవిశ్రాణనక్రీడాపరాయణుండును, వీరనారాయణుండును,నిత్యసత్యుండును, బల్లవాదిత్యుండును, భూభువనభారభరణదీక్షాదక్షదక్షిణభుజాభుజంగుండును,రాయవేశ్యాభుజంగుండును, గీర్తిగంగాతరంగిణీప్రవాహపవిత్రితస్వర్గమర్త్యపాతాళుండును,జగదగోపాలుండును, విమలధర్మశీలుండును, సంగడిరక్షాపాలుండును నగునల్లయవీరభద్రభూపాలుం డొక్కనాఁడు. 9
సీ. త్రైలోక్యవిజయాభిధం బైన సౌధంబుచంద్రశాలాప్రదేశంబునందు
సచివసైన్యాధీశసామంతనృపవరసీమంతినీజనశ్రేణి గొలువశాస్త్రమీమాంసయు సాహిత్యగోష్ఠియువిద్వత్కవీంద్రులు విస్తరింపఁగర్పూరకస్తూరికాసంకుమదగంధసారసౌరభము దిక్పూరితముగతే. నిజభుజావిక్రమంబున నఖిలదిశలుగెలిచి తను రాజ్యపీఠ మెక్కించినట్టియన్న వేమేశ్వరునిజాంక మాశ్రయించినిండుకొలు వుండెఁ గన్నులపండు వగుచు. 10
వ. అప్పుడు నన్నుం బిలువం బంచి సముచితాసనంబునం గూర్చుండ నియమించి యున్నయవసరంబున. 11
తే. రాయవేశ్యాభుజంగ సంగ్రామసార్థగాయిగోవాడ వేమనక్ష్మాధవుండుగూర్మి యనుజన్ముహృదయంబుకోర్కి యెఱిఁగియర్థి ననుఁ జూచి యిట్లని యానతిచ్చె. 12
సీ. వచియింతు వేములవాడ భీమనభంగినుద్దండలీల నొక్కొక్కమాటుభాషింతు నన్నయభట్టుమార్గంబుననుభయవాక్ప్రౌఢి నొక్కొక్కమాటువాకృత్తు తిక్కయజ్వప్రకారము రసాభ్యుచితబంధముగ నొక్కొక్కమాటుపరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిఠేవసూక్తివైచిత్రి నొక్కొక్కమాటు
తే. నైషధాదిమహాప్రబంధములు పెక్కుచెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘ!యిపుడు చెప్పఁ దొడంగిన యీప్రబంధమంకితము సేయు వీరభద్రయ్యపేర. 13
శా. ఈక్షోణిన్ నినుఁ బోలు సత్కవులు లే రీ నేఁటికాలంబునన్దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీవక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభావంబు నధ్యక్షించున్ గవిసార్వభౌమ! భవదీయప్రౌఢసాహిత్యముల్. 14
వ. అని యనంతరంబ కర్పూరవసంతరాయండు వీరభద్రేశ్వరుండు కర్పూరతాంబూలసహితంబుగా జాంబూనదాంబరాభరణంబు లిచ్చినం బరిగ్రహించి. 15
సీ. ఆంధ్రక్షమామండలాఖండలుండైనవేమభూపతి కృపావీక్షణంబుఘోడెరాయాంక! సద్గురురాజ భీమేశ్వరస్వామి పదసమారాధనంబుకమలాద్రినిలయ మార్కండేయశివమౌళిచంద్రాంశు నవసుధాసారధార;వేదాద్రినరసింహ విపులవక్షస్స్థలీకల్హారమాలికాగంధలహరితే. గారణంబులు నుద్బోధకములు గాఁగ,సంభవించిన సాహిత్యసౌష్ఠవమునవీరభద్రేశ్వరుఁ బ్రబంధవిభునిఁ జేసికాశికాఖండముఁ దెనుంగుఁగా నొనర్తు. 16
తే. కలిగెఁ బదియాఱువన్నె బంగారమునకుఁబద్మరాగంబుతోడి సంపర్కలభ్ధికాశికాఖండమను మహాగ్రంథమునకునాయకుఁడు వీరభద్ర భూనాథుఁ డగుట! 17
వ. అని తన్మహాప్రబంధకల్పనాకుతూహలాయయత్తచిత్తుండ నై. 18
సీ. బాదరాయణుపాదపద్మంబులకు మ్రొక్కిప్రాచేతసుని మనఃపదవి నిలిపిభట్టబాణమయూరభవభూతిశివభద్రకాళిదాసుల మహాకవులఁ గొలిచిరాజశేఖరుని భారవి మాఘుఁ గీర్తించిప్రవరసేనుని దండి భాసుఁ దలఁచిహర్షు బిల్హణుని మల్హణుఁ జోరుఁ గొనియాడిక్షేమేంద్రు వేడుకఁ జిత్తగించితే. శబ్దశాసను నన్నపాచార్యుఁ దలఁచిసత్కవిశ్రేష్ఠుఁ దిక్కయజ్వను భజించిసత్ప్రబంధమహేశ్వరు శంభుదాసునధికసద్భక్తి సంయుక్తి నాదరించి. 19
తే. మత్పితామహుఁ గవిపితామహునిఁ దలఁతుఁగలితకావ్యకళాలాభుఁ గమలనాభుఁజంద్రచందనమందారసదృశకీర్తిసరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి. 20
వ. అని యనంతరంబు కృతీశ్వరు వంశం బభివర్ణించెద. 21
సీ. కలశాబ్ధికన్యకాకరపల్లవద్వయీసంవాహనక్రియాసముచితంబునిఖిలవేదాంతవాఙ్నిధివధూధమ్మిల్లబహుళపుష్పామోదభాసితంబుప్రణతనానాసుపర్వకిరీటసంఘాతరత్నాంశురాజినీరాజితంబుసనకాదిసన్మునీశ్వరమనోమందిరాభ్యంతరరత్నదీపాంకురంబుతే. పతగకేతను శ్రీపాదపంకజంబుగారణంబుగ జన్మించె భూరిమహిమగంగసైదోడు రిపుకోటిగళము త్రాడునాలుగవజాతి సమధికోన్నతవిభూతి. 22
శా. ఆవర్ణంబున నుద్భవించి గుణరత్నార్ణోనిధానంబు శ్రీదూవూరం బెరుమాళ్ళురెడ్డి యభివృద్ధు ల్గాంచె మృత్యుజయగ్రీవాక్ష్వేళకలంకపంకహరణక్రీడాకళాగర్వితద్యావాపృథ్వ్యవకాశపేశలయశోధారానభస్సింధువై. 23
తే. అతనియర్ధాంగలక్ష్మి శ్రీయన్నమాంబగాంచెఁ దనయుల నర్థార్థికల్పకములనల్లయాధీశ పెదకోట యాన్నప్రోలదొడ్డయేశుల పినకోటరెడ్డివిభుల. 24
సీ. అవనిభారధురీణతాధరీకృతమహాక్రోడప్రధానుఁ డల్లాడనృపతి
ధాటీసమాటీకనాటోపవిధ్వస్తకుటిలాహితుఁడు పెదకోటశౌరిపంటాన్వయక్షీరపాథోధిసంపూర్ణపూర్ణిమావిధుఁడు తా ప్రోలవిభుఁడుప్రోద్దామదోఃప్రతాపోదయవ్యతికరచ్ఛాయాధిపుండు దొడ్డాయనృపతితే. హాటకాచలధైర్యుండు మేటిబిరుదుపాటి కలవాఁడు కరహాటలాటబోటగౌళకర్ణాటదేకరాట్కటకసుకవికోటినుతకీర్తి శ్రీపిన్నకోటరెడ్డి. 25
తే. పంటకులరాజు దొడ్డభూపాలునకునుబరమకల్యాణి యన్నమాంబకును సుతులుప్రోలభూపతియును గోటభూపతియునుభువననుతకీర్తి యల్లాడభూపతియును. 26
వ. అందు. 27
సీ. కుటిలారిరాట్కంఠకుహరాంతములఁ గానిక్రీడింపనీఁడు కౌక్షేయకాహిహరిదంతసౌధశృంగాగ్రవీథులఁ గానితిలకింపనీఁడు కీర్తిధ్వజంబునాశ్రితబంధుమిత్త్రారామములఁ గానిసాగనీఁడు కృపావసంతలక్ష్మిహరిణభృన్మూర్థన్యచరణాబ్జములఁ గానిమరుగనీఁడు నిజాత్మమధులిహంబుఁ
తే. బ్రళయసంరంభశుంభదారభటిపటిమభయదఫాలాక్షభావసంభవదభంగదహనమహనీయదివ్యప్రతాపవిసరదతులజయహారి దొడ్డయయల్లశౌరి. 28
మ. జయధాటీవిజయంబులన్ విలయజంఝామారుతాడంబరస్మయహారిప్రతిజృంభమాణఘననిస్సాణోగ్రభేరీస్వనంబయి యొడ్డాడి భయంకరోడ్డమరశౌర్యం బైన శ్రీరెడ్డి దొడ్డయ యల్లాడనృపాలరాహునకు బిట్టల్లాడు దిక్చక్రముల్. 29
మ. లలితాహంకృతి దొడ్డభూవిభుని యల్లాడక్షమానాథు నాజుల మార్కొన్న విరోధిరాజు లమరస్తుత్యప్రతాపప్రభాకలితశ్రీయుతులై సుఖింతు రెలమి గల్యాణశైలంబుపైఁగలధాతామలహర్మ్యరేఖల మరుత్కాంతాకుచాగ్రంబులన్. 30
మ. అనవేమక్షితిపాలుపౌత్రియగు వేమాంబామహాదేవికిన్ఘనుఁ డయ్యల్లడభూమిపాలునకు సంగ్రామస్థలీగాండివుల్తనయు ల్వేమవిభుండు వీరవసుధాధ్యక్షుండు దొడ్డప్రభుండును నన్నయ్యయు బాహువిక్రమకళాటోపప్రతాపోద్ధతుల్. 31
వ. అం దగ్రజుండు. 32
మ. కొనియెం గంచుకముల్ సముద్భటనటద్ఘోటీభటప్రౌఢిఁ గైకొనియె న్వేడుకఁ జీడికాడ యహితక్షోణీశు లల్లాడఁ జేకొనియ న్మాకవరంబు వీఁక మదవద్ఘోరారిసంహారియైఘనుఁ డల్లాడమహీశువేమన నిరాఘాటైకధాటీగతిన్. 33
సీ. సప్తమాడియరాయచంద్రబింబాననాచికురవల్లరులపైఁ జిన్నిపువ్వుఝాడెజంతుర్నాటిజననాథశుద్ధాంత
కుచకుంభములమీఁది కుంకుమంబుబారహదొంతిభూపాలలీలావతీగండస్థలంబులఁ గలికినవ్వుకలువపల్ల్యొడ్డాదికటకాధిపతవధూసీమంతవీథులఁ జేరుచుక్కతే. యల్లడాధీశువేమక్షమాధినాథుభూరినిష్ఠురధాటీవిహారచటులసైన్యనాసీరతుక్ఖారశఫపుటోత్థవింధ్యపార్శ్వవసుంధరావిపులధూళి. 34
సీ. పండువాసురధాని పావడం బంపినభద్రేభములు వీటఁ బాళె ముండునొడ్డెధాత్రీనాథుఁ డుపదఁ బుత్తెంచినబింబాధరోష్ఠి సంబెళ వహించుఁగర్ణాటభూపతి కానుక యనిపినముక్తాతపత్త్రంబు మ్రోల మెఱయుయవనాధిపతి యుపాయనముగా నొసఁగినపాగాహయంబులు వాగె వచ్చుతే. దూర మంతంత బారుహదొంతిమన్నెసప్తమాడియ రాజన్యసమితి మ్రొక్కురాయవేశ్యాభుజంగసంగ్రామపార్థగాయిగోవాడవేమనక్ష్మాధవునకు. 35
క. చటులత నల్లయవేమనపటుధాటీవిజయభేరిభాంకృతి మొరయున్
లటహమదనృహరిసమధికకటుకంఠగభీరకుహరకహకహరవమై. 36
సీ. ధరియింప నేర్చిరి దర్భవెట్టిన వ్రేళ్ళలీల మాణిక్యాంగుళీయకములు;కల్పింప నేర్చిరి గంగమట్టియమీఁదఁగస్తూరికాపుండ్రకంబు నొసల;సవరింప నేర్చరి జన్నిదంబుల మ్రోలఁదారహారములు ముత్యాలసరులు;చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుములఁగమ్మనిక్రొత్తచెంగల్వవిరులు;తే. ధామముల వెండి పసిడియుఁ దడఁబడంగబ్రాహ్మణోత్తము లగ్రహారములయందువేమభూపాలు ననుజన్ము వీరభద్రుధాత్రి వాలింప గౌతమీతటములందు. 37
తే. ప్రకటశాఖోపశాఖలఁ బంటవంశముద్ధరించినవేమేంద్రుఁ డుదయవేళశివు విశాఖుని బూజించు భక్తిలలితబిల్వత్రిశాఖపలాశసమితి. 38
సీ. త్ర్యంబకాచలకన్యకాంబుపూరంబుననఘమర్షణస్నాన మాచరించినిద్దమైన మడుంగునీర్కావిధోవతికనకమేఖలతోడఁ గటి ఘటించిమూలమంత్రాక్షరంబుల భూతి మంత్రించిపుండ్రకం బొగి ఫాలమున ధరించి
క్రొత్తముత్తెములతో రుద్రాక్షమాలికలష్టోత్తరశతంబు లఱుతఁ దాల్చితే. పుండరీకాజినమునఁ గూర్చుండి శంభునర్చనముఁ జేయునపుడు మహాప్రమథుఁడుచాల నొప్పారు రెండవశంభునట్లువీరనారాయణుం డల్ల వేమవిభుఁడు. 39
శా. చంచల్లీలకహస్తకంకణమణిచ్ఛాయల్ ప్రకాశింపఁ బూజించు న్వేమమహీవిభుండు నవరాజీవంబులం గల్వలన్బ్రాంచత్కాంచనపుష్పకేసరములం బ్రాసాదపంచాక్షరిన్మంచుంగొండయనుంగుఁబెండ్లికొడుకున్ మధ్యాహ్నకాలంబునన్. 40
వ. తదనుసంభవుండు. 41
ఉ. రాజశశాంకశేఖరుఁడు రాజకిరీటవతంస మష్టదిగ్రాజమనోభయంకరుఁడు రాజులదేవర రాజరాజు శ్రీరాజమహేంద్రభూభువనరాజ్యరమారమణీమనోహరుండాజిఁ గిరీటి కీర్తినిధి యల్లయవీరనరేంద్రుఁ డున్నతిన్. 42
మ. మనుతుల్యుం డగుకోటభూవిభుని వేమక్ష్మాతలాధీశునందనఁబాణిగ్రహణంబు చేసెఁ బ్రియ మొందన్ వీరభద్రేశ్వరుండనితల్లి న్వనితామతల్లి నుదయాస్తాద్రీంద్రసీమావనీఘటసామ్రాజ్యసమర్థన ప్రతిమసాక్షాదిందిరాదేవతన్. 43
తే. అట్టియనితల్లి పుణ్యగుణాభిరామదనకుఁ బట్టంపుదేవిగా ధన్యలీలవసుధయెల్ల నేకాతపవారణముగనేలు నల్లయవీరభద్రేశ్వరుండు. 44
సీ. మకరకుండలదివ్యమాణిక్యదీప్తులుచెక్కుటద్దములపై జీరువాఱడాకాలికండపెండారంబుదాపునబొమ్మలై వైరిభూభుజులు వ్రేలఁగమియంగ నలఁదినకస్తూరినెత్తావియష్టదిక్కులయందు నవఘళింపమొగము చూచినమాత్ర మూర్ధాభిషిక్తులుమోడ్పుఁజేతులు మస్తముల ధరింపతే. మెఱుఁగుఁదీఁగెలఁ బోలుభామినులు గొలువనిండుకొలువుండెఁ గన్నులపండు వగుచురాయవేశ్యాభుజంగవీరప్రతాపవిభవుఁ డల్లాడభూపతి వీరవిభుఁడు. 45
స్రగ్ధర. జంభారాతీభశోభాచకచకనిభముల్ శాంభవీయాట్టహాసారంభావష్టంభరేఖారభటలటహముల్ రాజరాజాద్రితేజస్సంభారభ్రాంతిదంబుల్ సకలభువనవీక్షాకరంభంబులయ్యున్జృంభించున్ వీరభద్రక్షితిరమణయశశ్శ్రీవధూవిభ్రమంబుల్. 46
క. వేరీ ధరణిపు లల్లయవీరక్ష్మాపతికి సాటి వితరణగరిమన్ధారాధరధారాధవధారాధరవాహదానధారానిధికిన్. 47
సీ. గోదావరీపావనోదకంబుల హేమకలశీశతంబుల జలక మార్చుఁగర్పూరకస్తూరికాకుంకుమంబులగలపంబుఁ గూర్చి శ్రీగంధ మలఁదు
సప్తగోదావరస్వర్ణపుష్కరహేమసౌగంధికముల నర్చనము సేయుగలధౌతపాత్రలఁ గాలాగురుచ్ఛేదబహులధూపంబుల బరిఢవించుతే. వేనవేలు నివాళులు విస్తరించునమృతదివ్యాన్నముల నుపహార మిచ్చుసంఘటించు నశేషోపచారములనుబ్రమథనాయకునకు వీరభద్రనృపతి. 48
చ. విలసితకీర్తిశాలి యగు వీరమహేశ్వరు*గేహరంబు శ్రీనిలయమునం ద్రిసంధ్యమును నిర్మలసౌధసువర్ణజాలకంబుల వెడలున్ గిరీశగళమూలహలాహలకాంతిఁ బోలి గుగ్గులు మహిసాక్షివాసనలఁ గ్రొవ్వినమంగళధూపధూమముల్. 49
ఉ. ఈశ్వరుఁ డింటివేల్పు జగదేకగురుం డగుఘోడెరాయభీమేశ్వరుఁ డాత్మవంశగురుఁ డిగులు నిత్యవినోదకృత్యముల్శాశ్వతధర్మకీర్తులు దలంపఁగ నమ్మినసొమ్ము లాదిగర్భేశ్వరుఁ డౌట నైజ మెనయే నృపు లల్లయవీరశౌరికిన్. 50
సీ. తెంచు నెవ్వనిహేతి దృప్తారినరవరగ్రైవేయపరిలసత్కంధరములముంచు నెవ్వనికీర్తి ముగ్ధేందుధరకంఠకాకోలవిషమషీకాళిమంబుఁబెంచు నెవ్వనిబుద్ధి పంచాస్త్రపరిపంథిపాదపాథోధితాత్పర్యచర్యమించు నెవ్వనిమూర్తి మీనచిహ్నజయంతనల నలకూబరాదుల జయించి
తే. యతఁడు వొగడొందు రాయవేశ్యాభుజంగుడవధిమహిధరచరమగాఢాంధకారధట్టఘట్టనలటహప్రతాపతపనుఁడల్లనరనాథుదొడ్డభూవల్లభుండు. 51
శా. ఔరా! యల్లయరెడ్డి దొడ్డవసుధాధ్యక్షుండు ధాటీచమూభేరీభాంకృతిఘోరఘోషమున నిర్భేదించె నొడ్డాది శృంగారంకోటయు లోఁతుగడ్డ(ద్ద)యును నుద్ఘాటించె నత్యుద్ధతిన్క్షీరాంభోధితటంబున న్నిలిపె దిక్సీమాజయస్తంభముల్. 52
మ. హరి దాఁటించెఁ బురోపకంఠమున వాహ్యాళిప్రదేశంబునందరరే యల్లయరెడ్డినందనుఁడు దొడ్డయ్యక్షమాధీశ్వరుండిరువైనాలుగుమూళ్ళమేర యనుగో సెక్కింపఁగా నేలయద్ధరణీనాథునికీర్తి దాఁటెఁ గడు నుద్దండించి బ్రహ్మాండముల్. 53
మ. సరి వే రీజలరాశివేష్టితమహీచక్రంబున న్విక్రమాపరగాండీవికిఁ జక్రవాళమహిభృతపర్యంతవిశ్వంభరోద్ధరణప్రౌఢభుజాభుజంగమునకున్ ధాత్రీశు లల్లాడభూవరునన్నయ్య కకుంఠవాఙ్మయకళావైకుంఠరాట్శయ్యకున్. 54
సీ. జిష్ణువైభవరేఖఁ జెలువొందుటయుఁ గాకపావకవిస్ఫూర్తిఁ బరఁగు టెట్లుధర్మరాజవిభూతి దర్పించుటయుఁ గాకపుణ్యజనోపాఖ్యఁ బూను టెట్లుమహినిఁ బ్రాచేతసమహిమఁ దాల్చుటయుకాదగ జగత్ప్రాణాఖ్యఁ దాల్చు టెట్లుధనదత్వవిఖ్యాత ఘనత నొండుటఁ గాకశంకరసుషమచే జరగు టెట్లు
తే. తెలిసి దిక్పాలకాంశావతీర్ణుఁ డగుటభోగమున శుద్ధసూనృతమున జయముననాజ్ఞ బలమున ధనమున నధికకరుణనల్లభూపాలనందనుఁ డన్నవిభుఁడు. 55
ఉ. వల్లకిచక్కికాహళము వంశము డక్కహుఁడుక్కఝర్ఝరుల్ఝల్లరి యాదిగాఁ గలుగుశబ్దపరంపర తాళబద్ధమైయుల్లసితప్రబంధముల కొప్పుగ నాడుదు రగ్రవేదిపైఁబల్లవపాణు లీశ్వరునిఁ బంటమహీశులు పూజసేయగన్. 56
శా. మార్కండేయ మహేశ్వరుం డఖిలసామ్రాజ్యంబు బాలింపఁగానర్కేందుల్గలయంతకాలము తదీయాంఘ్రిద్వయీభక్తిసంపర్కోదంచితభాగ్యసంపదలనాక్ష్మామండలీవల్లభుల్కోర్కు ల్నిండఁగ సేవకత్వమునఁ గైకొం డ్రాయురైశ్వర్యముల్. 57
సీ. ఉండు నేవీట మార్కండేయమునినాథసజ్జలింగ మనంగశాసనుండుప్రవహించు నేవీటిపశ్చిమప్రాకారమొరసి గంగమ్మ సాగరముకొమ్మయావిర్భవించినాఁ డేవీటికోటలోబలభేది మదనగోపాలమూర్తిపాలించు నేవీటిప్రాగుదక్కోణంబుసుమబోటి శ్రీముల్లగూరిశక్తితే. ప్రబలధారాసురత్రాణభద్రజాతికరిఘటాసైన్యదుస్సాధకనకలోహగోపురద్వారకవాటప్రదీపిత మదిసాంద్రవిభవంబు రాజమహేంద్రపురము. 58
మ. కలపుంస్కోకిలకంఠకోమలకుహూకారస్పురత్పంచమస్ఖలవద్వశ్యములైన కాలముల మార్కండేయనాథేశ్వరున్లలితోరస్కుఁడు వీరభూపతి వసంతం బాడు నీవీటివీథులఁ గర్పూరహిమాంబుసంకుమదకస్తూరీపటీఠంబులన్. 59
ఉ. ప్రాకటవిక్రమస్ఫురణ రాజమహేంద్రము రాజధానిగానేకసితాతపత్త్రమున నేలెను వీరనృపాలుఁ డుత్తమశ్లోకుఁడు వేమశౌరియనుజుండు సమున్నతవైభవాఢ్యుఁడైచీఁకటియున్ గళింగయును జిల్కసముద్రము సింహశైలమున్. 60
క ఈదృశగుణగణనిధికినివేదార్థకవిత్వతత్త్వవిధివత్పతికిన్క్ష్మాదివిజకవిజనాశీర్వాదప్రవితీర్యమాణవైభవనిధికిన్. 61
క. క్షురికాకరబేతాళునకరిభయదభుజాపరాక్రమాభీలునకున్శరణాగతకురుకేరళకురుభూపాలునకు జగదగోపాలునకున్. 62
క. అంభోధివలయితావనిసంభరణప్రౌఢనిజభుజాయుగయుగళీసంభావితకిటికచ్ఛపకుంభీనససార్వభౌమకులకుధరునకున్. 63
క. వేమాధిపానుజునకునురామామదనునకు ఘోడెరాయగురు శ్రీ
భీమేశ్వరశిష్యునకున్వేమాంబాగర్భసలిలనిధిచంద్రునకున్. 64
క. త్రైలోక్యవిజయసౌధవిశాలమహాచంద్రచంద్రశాలాసతతవ్యాలోకితగౌతమకన్యాలహరీవిరహతాండవాటోపునకున్. 65
క. అనితల్లివల్లభునకున్గనకాద్రివినిద్రకల్పకద్రుమలీలావనభవనకిన్నరస్త్రీజనతాజేగీయమానచారిత్రునకున్. 66
క. నిర్ఘృణనిర్ఘాతస్ఫుటనిర్ఘోషకఠోరధాటినిస్సాణమహాదీర్ఘతరధణధణాంకృతిదూర్ఘట్టననిర్దళితచతుర్దిక్కునకున్. 67
క. హాటకకుభృద్ధనుర్ధరజూటీకోటీకుటీరసుమనస్తటినీవ్యాటీకోర్మీసంఘోద్ఘాటవచోవైఖరీజితద్రుహిణునకున్. 68
క. గజదళవిభాళబిరుదునకజగవధరభక్తిభావితాత్మునకు సమిద్విజయునకు రాయవేశ్యాభుజగునకును వీరభద్రభూపాలునకున్. 69
వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కాశీఖండంబు. 70
Comments
Loading comments…